25, అక్టోబర్ 2011, మంగళవారం

నిర్హేతుక నిరర్థక నిష్ఫల సమ్మె

ప్రభుత్వ ఉద్యోగులు 40 రోజుల పైగా చేసిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు. తెలంగాణ కోసం చేస్తున్నామని మొదలుపెట్టి, ముగింపు ఒప్పందంలో దాన్ని పెద్దగా పట్టించుకోకుండానే సమ్మెను ముగించేసారు. ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు చేసుకు పోయారో, ఎందుకు విరమించారో చూస్తే, ఇదంతా ఒక అయోమయ వ్యవహారంగా కనబడుతుంది.

ముగింపు ఒప్పందంలోని పది అంశాల్లోనూ తెలంగాణ ఏర్పాటు గురించి ఒకేఒక్క అంశం ఉంది.. "తెలంగాణ సమస్యను ముఖ్యమంత్రి ఇటీవల కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు" అని. ’తీసుకెళ్తారు’ అని కాదు, ’తీసుకెళ్ళారు’ అని రాసారు. చెయ్యాల్సింది ఈపాటికే చేసేసాం అని చెప్పిందన్నమాట, ప్రభుత్వం!  అంటే ఏంటి.. ఈ విషయంపై ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏమీ లేదనే! ఈ ముక్కను ఉద్యోగులు లిఖిత పూర్వకంగా ఒప్పేసుకున్నారు. ఒప్పందంలో ఉన్న మిగతా పాయింట్లన్నీ కూడా తమ ఉద్యోగ వ్యవహారాలకు సంబంధించినవే. 

సమ్మె చేస్తున్నన్ని రోజులూ నాయకుడు, స్వామి గౌడ్ ది ఒకటే గోల -’మేం మాత్రమే బరిలో దిగాం. నాయకులకు ఇదేమీ పట్టడం లేదు. మమ్మల్ని రంగంలోకి దించి, ఇప్పుడు మద్దతు ఇస్తామని పైపై మాటలు చెబుతున్నారు’ అని! ’మీరూ రంగంలోకి దిగండి’ అంటూ నాయకులను తిట్టాడు, విసుక్కున్నాడు, దేబిరించాడు. అయినా పనేం జరగలా! ఆయన చెప్పినదంతా నిజమే.. వీళ్లను ముందుకు తోసి, నాయకులు చోద్యం చూసారు. నాయకులు చెప్పారు గదాని వీళ్ళు ఎగేసుకుంటూ రంగంలోకి దిగారు. అసలుసంగతి వెంటనే అర్థమైపోయిన తరవాత కూడా, సమ్మెను ఎందుకు కొనసాగించాడు? ప్రజలను ఎందుకు హింసించాడు? -సమాధానాల్లేవు.

సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంలో మేం విజయం సాధించాం అని పైకి చెప్పుకుంటున్నారు. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడమే వీళ్ళ ఉద్దేశమైతే, అసలు సమ్మె చెయ్యడమెందుకు? కేసీయారు వెంట ఢిల్లీ పోయి అందరినీ కలిసి వచ్చారు కదా.. సమ్మె చెయ్యకుండానే వెళ్ళి అలా కలిసొస్తే పోయేది! పోనీ, సమ్మె చేస్తేనే ప్రభుత్వం దారికి వచ్చింది అని అనుకుంటే, ఢిల్లీ యాత్ర తరవాత వెంటనే సమ్మె ఎందుకు ముగించలేదు? ఆ తరవాత కూడా ఇరవై రోజుల పాటు ఎందుకు కొనసాగించారు? ఈ ఇరవై రోజుల్లో అదనంగా వీళ్ళు సాధించిందేంటి? ఏం లేదు. ఏమీ లేదు!

ఇవన్నీ చూస్తే ఈ సమ్మె ఉద్యోగుల స్వలాభం కోసం చేసినదే తప్ప,  తెలంగాణ సాధన కోసమో, ప్రజల కోసమో చేసింది కాదని స్పష్టమౌతోంది. లేకపోతే..  ముగింపు ఒప్పందంలో 610 జీవో గురించిన పాయింటు ఎందుకుంది? తెలంగాణ వచ్చే పక్షంలో అసలీ జీవో గురించి ఎందుకు ప్రస్తావించాలి? దాని కోసం ఎవరో ఒక జడ్జిని వెయ్యండి బాబయ్యా అని ఎందుకు కోరాల్సి వచ్చింది? ఇదే కాదు, ఒప్పందంలోని మిగతా అంశాలు చూడండి.. తమ జీతాలు, తమ అడ్వాన్సులు, తమ కేసులు, తమ సమ్మె కాలపు సర్వీసు, తమపై ఎక్కుపెట్టిన ఎస్మా, తమ కోసం తెచ్చిన జీవో రద్దు చెయ్యడం, ..  ఇలా ’తమ’ గొడవలే తప్ప తెలంగాణ గొడవే లేదు. పైకి మాత్రం తెలంగాణ కోసం సమ్మె చేసామని, లక్ష్యాన్ని సాధించామనీ పోసుకోలు కబుర్లు.

కాబట్టి సమ్మె చేసింది, ముగించిందీ తమ కోరికలు నెరవేర్చుకోడానికి తప్ప, తెలంగాణ కోసం కాదు. తెలంగాణ సమస్యకు సంబంధించినంత వరకూ ఇది నిర్హేతుక, నిరర్థక, నిష్ఫల సమ్మెయే!

6 కామెంట్‌లు:

 1. ultimate quote:

  సమ్మె చేసింది, ముగించిందీ తమ కోరికలు నెరవేర్చుకోడానికి తప్ప, తెలంగాణ కోసం కాదు. తెలంగాణ సమస్యకు సంబంధించినంత వరకూ ఇది నిర్హేతుక, నిరర్థక, నిష్ఫల సమ్మెయే

  kya bath hi!

  రిప్లయితొలగించండి
 2. క్లుప్తంగా చెప్పారు.

  సమ్మె ఇంకా ఓ 6నెల్లు అన్నీ బంద్ చేసి, ఆమరణ రిలే నిరాహార దీచ్చలు, కొత్త టెక్నికుల ఫ్లూయిడ్ దీచ్చలు, ఒంటిప్పొట దీచ్చలు, ఓన్లీ లిక్విడ్ దీచ్చలు ( గుడంబా దీచ్చలు), వంట-పెంటా, ఆట-పాట, పట్టాలపై వనభోజనాలు ... ఇలా సాగిస్తారనుకున్నా, తడిసిన టపాకాయ లా తుస్సుమనిపించారు. ఎదంవ ఉజ్జమం, ఎదవ నాయకులు, నిరుత్సాహ పరిచారు. కోదండు పాఠాలు ఎపుడు మొదలెడతాడో మరి.

  రిప్లయితొలగించండి
 3. రక్తచరిత్ర....నీవు వేయి చెప్పు, లచ్చ చెప్పు. మా చదువుకున్నమావో, కమ్యునిస్ట్ వేర్పాటు గాడిదల సంఘానికి పోలవరం వసూళ్ళ అవినీతి పరులు పిచ్చ పిచ్చగా నచ్చుతారు. మేం ఓటేసి, వాడి సంపద పెంచుతామని ప్రతిజ్ఞ చేస్తున్నం.
  :- ఇట్లు మావో ముక్కన్న వేర్పాటు వెర్రి గోర్రేలం..
  http://www.youtube.com/watch?v=7_iTOajYRuY

  రిప్లయితొలగించండి
 4. మీలాంటి వేర్పాటు యదవలకి నచ్చుతోంది కాబట్టే వాళ్ళు వేర్పాటు ముసుగులో పోలవరం లాంటి ప్రాజెక్ట్స్ ముడుపులుగా సాధించి అవినీతి చేస్తున్నా మంటున్నారు. మీలాంటోళ్ళను సూడాన్ దేశానికి పంపి ఆటవికులతో గంగాళంలో నిల్చోబెట్టి సూప్ చేయించి, కుక్కలకూ నక్కలకూ విందు చేయాలి..

  రిప్లయితొలగించండి
 5. సీమాంధ్ర వలస పాలకుల పాలనలో తెలంగాణా ఆర్థికంగా వెనుకబడింది కాబట్టి మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అనే వాదనతో మొదలుపెట్టి మాకు స్వయంపాలన కావాలి అనే వాదనకు రూపంతరం చెందినదీ ఊసరవెల్లి ఉద్యమం.26 అక్టోబర్ ఆంధ్రజ్యోతి లో ప్రచురించిన వ్యాసంలో , తెలంగాణా కుహనామేధావుల్లో ఒకరైన ప్రొ.హరగోపాల్ మేము స్వయం పాలన చేసుకుంటామంటే ఈ సీమాంధ్ర ప్రజలెందుకు అడ్డం పడుతున్నారో తెలియడం లేదంటూ చాలా హాశ్చర్య పోయాడు.విద్యార్ధులు, రైతులు,బడుగుబలహీనవర్గాలు (అంటే షుమారు 80% మంది) ఉద్యమం లో పాలుపంచుకోకపోవడం మూలానే అనుకున్నది సాధించలేక పోతున్నామని ఒప్పేసుకున్నాడు.ప్రజాస్వామ్యమంటే నే స్వయంపాలన అనే ప్రాధమిక సూత్రం కూడా తెలియని మూర్ఘులా వీళ్ళంతా!

  1947 నాటి పరిస్థితుల్ని పునరావలోకనం చేస్తే ,స్వయంపాలన కావాలని ఐక్యరాజ్యసమితికి,బ్రిటిష్ సర్కారుకు నిజాం నవాబు మొరపెట్టుకుంటే,ప్రజలంతా స్వతంత్ర భారతావనిలో కలవాలనే బలమైన ఆకాంక్ష వ్యక్తపరిచారు.తె` వాద నాయకులు ఆధునిక నిజాం లైతే అత్యధిక శాతం ప్రజలు ఆంధ్రప్రదేష్ లో కొనసాగాలని కోరుకుంటున్నట్లే ఉంది.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు