24, అక్టోబర్ 2011, సోమవారం

విద్రోహ దినం కాదు, ద్రోహుల దినం చెయ్యాలి

రాష్ట్రావతరణ దినోత్సవాన్ని - నవంబరు ఒకటిని - విద్రోహ దినంగా జరుపుకోవాలని కోదండరామ్ పిలుపునిచ్చాడు. ఉద్యమం పేరిట ప్రజల జీవితాలతో చెలగాటాలాడుకుంటూ, కాలక్షేపం చేస్తున్న ఈయన, ఇపుడో కొత్త కార్యక్రమానికి తెర లేపబోతున్నాడు. విద్రోహ దినంతో పాటు, మూడురోజుల పాటు దీక్ష కూడా జరుపుకోవాలని ఫత్వా జారీ చేసాడు. దీక్ష చేసేందుకు అర్హతలేమిటో కూడా జారీ చేసారు సారు!

కానీ, ఇప్పుడు జరుపుకోవాల్సింది విద్రోహదినం కాదు, ద్రోహుల దినం. ఇది విద్రోహ దినం ఎందుక్కాదంటే..

ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక, బాగా అభివృద్ధి చెందింది తెలంగాణ ప్రాంతమే. ఈ విషయమై బ్లాగుల్లో గణాంకాలతో సహా ఎన్నో వ్యాసాలొచ్చాయి. శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణ వెనకబడి లేదని శషభిషలు లేకుండా తేల్చి చెప్పింది. ప్రజల సగటు జీవన పరిస్థితులు బాగా మెరుగుపడ్డాయి. స్వయంగా తెవాదులే ఈ సంగతిని ఒప్పుకున్నారు. మొదట్లో వెనకబాటుతనమే వేర్పాటుకు కారణమని చెప్పిన తెవాదులు, ఆ తరవాత మాట మార్చి సెంటిమెంటు మీదుగా ప్రయాణించి ’మాది మాగ్గావాల్సిందే’ అనే తొండిలోకి దిగారు.

’కోస్తా, సీమలకు చెందిన ఉద్యోగులు మేమూ ఎంతో సఖ్యతతో ఉంటాం, చక్కగా కలిసిమెలిసి పనిచేసుకుంటూంటాం’ అని సమ్మె చేస్తున్న తెలంగాణ ఉద్యోగుల నాయకులు స్పష్టంగా చెప్పారు. తెలంగాణ వ్యాపారస్తులు, కోస్తా సీమల వ్యాపారస్తులూ కలిసి వ్యాపారాలు బాగానే చేసుకుంటన్నారు. ఇందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఇట్టీవలి ఉదాహరణ స్వయానా కేసీయారుదే!  కేసీఆర్ -> నమస్తే తెలంగాణ పత్రిక -> లక్ష్మీరాజం -> కాంటినెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ->  స్యూ -> కోనేరు -> పోలవరం..  ఈ ’నమస్తే తెలంగాణ - స్యూ’ సంబంధాలు,  ’నమస్తే తెలంగాణ - పోలవరం’ కాంట్రాక్టు వ్యవహారమూ వగైరాలను  చూస్తూంటే, తెలంగాణ గుండెచప్పుడు వినబడ్డానికి కారణం కోస్తా సీమల నుండి సరఫరా అవుతున్న రక్తమేనని తెలవడంలా..!

సమైక్య రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధిలోకి వస్తే, ప్రజలు కలిసి మెలిసి ఉద్యోగాలు వ్యాపారాలూ చేసుకుంటూ, ఇంత చక్కటి రక్త సంబంధాలను నెరపుతూ ఉంటే, ఇక విద్రోహమెక్కడుంది?

కానీ, ద్రోహులు మాత్రం ఉన్నారు. వీళ్ల నిర్వాకం చూద్దాం..

అర్భాటంగా సకల జనుల సమ్మె మొదలు పెట్టారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే దానికి కారణం ప్రభుత్వం మీదకు నెట్టేసారు.  తామే కారణమని తెలిసి కూడా సమ్మెను కొనసాగించారు. ఎవరూ పిలవా పెట్టా కుండా ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ఏమేం చేసారో గానీ.., ఇన్నాళ్ళుగా మొండిగా సమ్మె చేసి, ఏం సాధించామనుకున్నారో మరి, విరమింపజేసారు. ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు.

గజ్జెల కాంతం తన జనాన్ని వేసుకుని కోదండరామ్ ఇంటిని ఎందుకు చుట్టుముట్టాడు? కోదండరామ్ అతణ్ణి సీమాంధ్రులతో కలిసి కుట్ర చేస్తున్నాడని ఎందుకు తిట్టించాడు? గజ్జెల కాంతం కోదండరామ్ ను సీమాంధ్రుల తొత్తని ఎందుకన్నాడు? జైపాల్ రెడ్డితో కలిసి కుట్ర చేసాడని కోదండరామ్ పై ఎందుకు ఆరోపణ చేసాడు?

ఈ ప్రశ్నలకు ఎవడూ సమాధానం ఇవ్వకపోవచ్చు. కానీ ద్రోహులెవరో, ద్రోహం చేస్తున్నదెవరో అర్థం కావడానికి ప్రత్యేకించి ఎవడూ సమాధానం చెప్పనక్కర్లేదు. తమ వ్యాపారాలు తాము చేసుకుంటూ, తమ ఉద్యోగాలు తాము చేసుకుంటూ జనాల జీవితాలతో ఆడుకుంటూ, ప్రజల మధ్య తంపులు పెట్టి వినోదిస్తున్న ద్రోహులెవరో ఎవరూ చూపించనక్కర్లేదు. ఈ తెవాదులు, ఈ ద్రోహులు.. విద్రోహ దినం చేసుకుందామని ప్రజలకు పిలుపునిస్తూ తాము చేస్తున్న ద్రోహాలను, మోసాలను కప్పి పుచ్చుతున్నారు. అబద్ధాలు చెప్పి, ప్రజలను రెచ్చగొట్టి, తమ పబ్బం గడుపుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మోసం చెయ్యబోతున్నారు.

ప్రజలు వీళ్ళ ద్రోహాలను, మోసాలనూ ఎదుర్కోవాలి. ఇప్పుడు చెయ్యాల్సింది విద్రోహ దినం కాదు, ద్రోహుల దినం!

4 కామెంట్‌లు:

  1. నవంబెర్ 1న మల్లి సకల వసూళ్ళ కోతి జంతువులు రోడ్ల మీద పడి దొర్లుతై..

    రిప్లయితొలగించండి
  2. బాగా వ్రాశారు. నేను మనసులో అనుకునీ కూడా వ్యక్తం చేయలేకపోయిన భావాల్ని మీరు అక్షరబద్ధం కావించారు. నెనర్లు.

    మీకు సలహా ఇచ్చేంతవాణ్ణి కాను గానీ ఇలాంటి వ్యాసాల్ని తెలుగుజాతి అనే వర్గం కింద పెట్టడం సమంజసమని నాకు అనిపిస్తున్నది. ప్రాంతాల పేర్లు మెన్షన్ చేసి వాటికెందుకు మనం ఒక ఆధికారిక గుర్తింపునివ్వాలి ?

    రిప్లయితొలగించండి
  3. సకలజనుల సమ్మె విరమించిన విధంబెట్టిదనిన:
    "మా తెలంగాణా మాగ్గావాలె. తెలంగాణా కోసం ప్రాణాలయినా అర్పిస్తాము"
    - మా జీతాలు మాకివ్వండి చాలు సారూ.. తెలంగాణా సంగతి మాకెందుకు?
    "మా తెలంగాణా మాగ్గావాలె. తెలంగాణా కోసం ప్రాణాలయినా అర్పిస్తాము"
    - బాంచెన్ కాల్మొక్తా, మేము చేసిన దురాగతాల పైన కేసులు పెట్టొద్దు
    "మా తెలంగాణా మాగ్గావాలె. తెలంగాణా కోసం ప్రాణాలయినా అర్పిస్తాము"
    - మా లీవులు క్యాన్సిల్జెయ్యకు సారు.. తెలంగాణా కంటే మా లీవులు ముఖ్యం
    "మా తెలంగాణా మాగ్గావాలె. తెలంగాణా కోసం ప్రాణాలయినా అర్పిస్తాము"
    - జరంత పండగ అడ్వాన్సులియ్యి సర్కారు.. మందుకు పైసా లేదు


    .
    .
    .
    .


    సమ్మె ముందు బీరాలు పలికి తర్వాత కాళ్ళబేరానికొచ్చిన వీళ్ళా తెలంగాణా సాధించేది? హ్హ హ్హా హ్హా హ్హా

    రిప్లయితొలగించండి
  4. ఆఁ ... రక్తంలో జర్ర మూసీనీళ్ళు కల్తీ అయ్యినట్టున్నాయి, అందుకే గుండెచప్పుడు 'మాగ్గావాలే, 'టెండర్లన్నీ మాగ్గావాలే అని కొట్టుకుంటోంది. ఎంత ఏడిస్తే అన్ని టెండర్లు ఇస్తారని ఏడుపులు కొనసాగించడానికే నిశ్చయించారేమో.

    "రోదనం, ప్రతిదినం
    ఇతి తెలబానః "

    అన్నారు అందుకే. :)) :P

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు