3, అక్టోబర్ 2011, సోమవారం

ప్రజలపై తెవాదుల రాళ్లదాడులు

28 కామెంట్‌లు
సకల జనుల సమ్మె పేరుతో మొదలైన సమ్మె ఇవ్వాళ రాళ్ళదాడికి చేరింది. విజయవాడ నుంచి హై. కు వస్తున్న బస్సులపై తెవాద మూకలు రాళ్ళేసి కొట్టాయి.పదికి పైగా బస్సుల అద్దాలు పగిలాయి. ప్రయాణీకులకు కూడా రాళ్ళ దెబ్బలు తగిలాయి. తెల్లారేటప్పటికి హై. చేరుకోవాల్సిన ప్రజలు మధ్యాహ్నం తరవాత చేరుకున్నారు. ఉద్యమాన్ని "మిలిటెంటు అహింస" వైపు  నడవమని తమ నాయకుడు కోదండరామ్ చెప్పాడు గదా.. ఇట్టాగే ఉంటాయి వాళ్ళ చేతలు!

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

నా తెలంగాణకే ఎందుకిలా జరుగుతోంది..

33 కామెంట్‌లు
తెలంగాణ ఎందుకు ఇవ్వరు అని తల్లడిల్లిపోతున్న ఒక కరుడుగట్టిన తీవ్ర తెవాది మనోగతం! 
  • తెలంగాణ కావాలని మేం అడుగుతూంటే ఎవడూ పట్టించుకోడేంటి? ఎంతో ప్రజాస్వామికమైన మా డిమాండును ప్రపంచమంతా ఎందుకు వ్యతిరేకిస్తోంది? మా డిమాండు లోని సహేతుకత మాకు ఇంత స్పష్టంగా కనబడుతూంటే లోకంలో ఎవ్వడికీ కనబడదేంటి?

28, సెప్టెంబర్ 2011, బుధవారం

కోదండరామ్ గారి మిలిటెంటు అహింస!

10 కామెంట్‌లు
ప్రపంచం మొత్తానికి నలుపంటే నలుపే, తెలుపంటే తెలుపే. కానీ తెవాదనాయకులు అబద్ధాల జీవులు కాబట్టి, వాళ్ళు తెలుపంటే నలుపనీ, నలుపంటే మరోటనీ మనం అర్థం చెప్పుకోవాలి. కోస్తా సీమల ప్రజలను బూతులు తిట్టి, తరవాత "అబ్బే అది తిట్టడం కాదు. మా బాసే అంత. మేం గట్టనే మాట్టాడుకుంటం" అని చెప్పేవాళ్ళు. ఈ బాపతు భాష్యాలను ఇప్పుడు ఉద్యమంలో చాలా ప్రభావశీలంగా ఆచరణలో పెడుతున్నారు కోదండరామ్ సారు.

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

సకల నాయకుల దొమ్మీ

8 కామెంట్‌లు
తెలంగాణ - ఒక అసంభవ చిత్రం / Telangana - an impossible picture

తెలంగాణ నాటకంలో యుద్ధాంకం జరుగుతోంది. నాయకులు బ్యాచ్చీలు బ్యాచ్చీలుగా విడిపోయి ఘోరంగా యుద్ధం చేసేసుకుంటన్నారు. తెలంగాణ పేరిట ఒక దొమ్మీ జరుగుతోంది. దొమ్మీలో ఎవడితో పోరాడుతున్నామో పట్టించుకోడెవడూ.. కలబడి కొఠేసుకోడమే!  తెలంగాణ నాయకుల దొమ్మీలోనూ అదే జరుగుతోంది.

5, సెప్టెంబర్ 2011, సోమవారం

గాలిని అరెస్టు చేస్తే నాకేంటయా సంబంధం..?

9 కామెంట్‌లు
ఎట్టకేలకు గాలి జనార్దనరెడ్డిని అరెస్టు చేసారు సీబీఐ వాళ్ళు. గాలి అరెస్టుపై మీ అభిప్రాయం ఏంటీ అని జగన్నడిగారు విలేఖరులు. ఎంతో చిరాకుపడ్డాడు వాళ్ళ మీద. గాలి అరెస్టైతే జగనుకెందుకంత అసహనం..?

31, ఆగస్టు 2011, బుధవారం

తెలుగులో తేదీని ఎలా రాయాలి? (Date format in Telugu)

2 కామెంట్‌లు
తెలుగులో తేదీ ఆకృతి - తేదీ ఫార్మాట్ (Date format) - ఎలా ఉండాలి?

’ఎలా ఏముంది.. 08/31/11 అని ,అంతేగా’ అంటారు నేటి ఐటీ ఘనపాఠీలు. నాకు తెలిసిన ఐటీ కుర్రాడొకడు కిస్మీసు సెలవలకి అమెరికా నుంచి వాళ్ళూరు వచ్చాడు. వాళ్ళ తాతకు ఏదో కాగితం రాసిపెడుతూ తేదీని 12/13/06 అని రాసాడంట. అదిచూసి, ఆ పెద్దాయన, ’సదవేత్తే ఉండమతి పోయిందిరా నీకు’ అని అన్నాడంట. తేదీని తిరగరాసి, ’ఎమెరికన్స్ డేట్ ని అట్లాగే రాస్తారు తాతా’, అని అసలు సంగతి చెప్పాడంట, మనవడు. అమెరికా వోళ్ళకు తిక్కగానీ ఉందేంట్రా.. రోడ్డుకు కుడేపున పోతారంటగా? అని అడిగాడంట ఆయన.  ఔను తాతా. అంతేకాదు, లోకమంతా లీటర్లు, కిలోమీటర్లూ అంటూ ఉంటే వాళ్ళు ఔన్సులు, అడుగులూ, మైళ్ళూ అంటారు. వాళ్ళక్కొంచెం తిక్కలే! అని చెప్పాడంట.

సంబంధిత టపాలు