12, అక్టోబర్ 2011, బుధవారం

కాలుష్య కారకుడు, కేసీఆర్

తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కెసిఅర్ కో ప్రత్యేకత ఉంది.. అనేక విషపు మాటలు మాట్టాడి ప్రజల మనసులను కలుషితం చేస్తూ ఉద్యమాన్ని ఎగదోస్తూంటాడు. పైగా తాను సరిగ్గా మాట్టాడుతున్నట్టూ, అవతలి వాళ్ళు తప్పుగా మాట్టాడినట్టూ ప్రచారం చేస్తూంటాడు. ఇది అతడికి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడానికి దాన్ని చాలా బాగా వాడాడు.

ఈ మధ్య కాలంలో అతడేమన్నాడో చూడండి:

ప్రభుత్వం రాష్ట్రంలోని రెండు ప్రాంతాల ప్రజలను శాశ్వతంగా శత్రువుల్లాగా మార్చాలని ప్రయత్నిస్తోందని విమర్శించాడు. నిజానికి రెండు ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టింది ఇతడే. తగువులమారి లాగా మాట్టాడి ప్రజల మనసులను విషపూరితం చేసింది ఇతడు. వలసవాదులని, దోపిడి దారులని, జాగో భాగో అనీ, నదుల్లో గోడలు కడతాననీ, హైవేల మీద గోడలు కడతాననీ, ఆ ప్రాంతపు జనం రాక్షసుల వారసులనీ.. అనేక అవాకులు చవాకులు పేలింది ఈ కేసీయాసురుడే.ప్రజల మధ్య శత్రుత్వాన్ని నాటి, పెంచి పోషించింది ఇతడే. ప్రస్తుత పరిస్థితికి అతడే మొదటి ముద్దాయి. ఈ పరిస్థితి ఇంకా క్షీణించినా అందుకు అతడే కారకుడౌతాడు.

మొన్నొక రోజున అనంతపురం, కర్నూలులను తెలంగాణతో కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చెయ్యాలని తనతో ఎవరో చెప్పినట్టుగా గాలిమాటలు చెప్పాడు. ’మనం అస్సలు ఒప్పుకోం. ఒకవేళ ఎవడైనా సన్నాసి ఒప్పుకున్నా, మనం మాత్రం ప్రతిఘటించి తీరతాం’ అని తర్జని చూపిస్తూ చెప్పాడు. ఎవడో అన్నట్టుగా చెప్పిన మాటలు, అతడు తప్ప మరెవరూ అనలేదు. నిజానికి ఆ సన్నాసి వేరెవరో కాదు, అతడే! అవన్నీ అతడి ఆలోచనలే! తన పుర్రెకు పుట్టిన బుద్ధినే ఎవడికో ఆపాదించి, గాల్లోకి తిట్లు వదుల్తాడతడు. అది అతడి నైజం, అతడి ప్రకృతి.

విడిపోవడానికి ఏకాభిప్రాయమెందుకు? అని మళ్ళీ అడుగుతున్నాడతడు. నిజమే.. హై.ని వదిలిపెట్టేసి తన రాష్ట్రాన్ని తాను ఏర్పాటు చేసుకుంటానంటే ఎవరి అభిప్రాయమూ అక్కర్లేదు. ఎవరూ అభ్యంతరపెట్టరు కూడా. హై. కూడా కావాల్సిందేనంటే మాత్రం అన్ని ప్రాంతాల అభిప్రాయాలూ తీసుకోవాల్సిందే! హై. ఏ ఒక్కరి సొత్తూ కాదు, ఇన్నాళ్ళూ అది అందరి రాజధానీనూ. వేగంగా అభివృద్ధి చేసే ప్రయత్నంలో  హై. అనే ఇంజన్ను జిల్లాలనే పెట్టెలనుంచి విడదీసి ఉసీగా నడుపుకుంటూ పోయినై గత ప్రభుత్వాలు. ఇప్పుడొచ్చి, ఆ ఇంజను మాదే, మీ పెట్టెలను తగిలించొద్దు, మా పెట్టెలను మాత్రమే తగిలించుకుని మేం నడుపుకుంటాం అని తొండి చేస్తున్నాడు కేసీఆర్. పైగా ఎవరి అభిప్రాయమూ అక్కర్లేదంట!  ఎంత దురాశో..!

మా ఉద్యమం అహింసాయుత ఉద్యమం అని చెప్పుకుంటూంటాడు గానీ, నిజానికి తన మాటల ద్వారా కేసీఆర్ చేసినంత హింస బహుశా మరే ఉద్యమ నాయకుడూ చేసి ఉండడు. ఇంతటి ధ్వని కాలుష్యం సృష్టించిన మనిషి మరొకడుండడు బహుశా. ఉదాహరణకు.. తెలంగాణ, కోస్తా/సీమలకు చెందిన పూజారులు, పురోహితుల మధ్య చిచ్చు పెట్టా డా మధ్య. వాళ్ళు ఒకళ్లనొకళ్ళు తీవ్రంగా విమర్శించుకునే పరిస్థితి కల్పించాడు. చివరికి వాళ్ళు తమ సమావేశాలను తామే భగ్నం చేసుకునే దాకా వెళ్ళారు. అంతటి విషపూరిత శక్తి ఉంది కేసీఆర్ నాలుకకు.

వివిధ వర్గాల, ప్రాంతాల ప్రజలతో, నాయకులతో మాట్టాడి రాష్ట్రవిభజనకు సానుకూల వాతావరణం ఏర్పరచడం ఇలాంటి చవకబారు నాయకుల వల్ల కాదు. అందుకు స్టేట్స్ మెన్ అవసరం. మర్యాద, మన్ననలు తెలిసిన వాళ్ళు కావాలి. అంత స్థాయి ఈ కేసీఆర్ కు లేదు. తనకు ఆ సత్తా లేదని అతడికీ తెలుసు. (అంతటి తెలివితేటలున్న మనిషి అసలీ ఉద్యమ నాయకుల్లోనే ఉన్నట్టు లేరు. అందరూ ఎంతో కొంత స్థాయిలో కేసీఆర్ లాంటివాళ్ళే). అందుకే విడిపోడానికి ఏకాభిప్రాయమెందుకు అని అడ్డగోలు వాదన చేస్తున్నాడు.

మొత్తమ్మీద, కేసీఆర్ బారిన పడి, రాష్ట్ర ప్రజలు తల్లడిల్లి పోతున్నారు. అతడొక రాచపుండులా దాపురించాడు.

48 కామెంట్‌లు:

  1. ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోయి తెలంగాణాను అడ్డుకునే వారిని హత్య చేయండి అనే పొన్నం ప్రభాకర్ ని వాళ్ళు పట్టించుకోరు.

    ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత రెడ్డి వాళ్ళని వరుసబెట్టి వందల తిట్లు తిట్టినా పట్టించుకోరు.

    కేశవరావు ఇంగ్లీషో, తెలుగో అర్థం కాకుండా తిట్టినా పట్టించుకోరు.

    కాని KCR అనంగనే అగ్గిమీద గుగ్గిలమైతరు.

    ఎందుకంటే...

    ఆయన చెన్నారెడ్డిలా సమైక్యవాదులకు అమ్ముడుపోయి తెలంగాణావాదాన్ని సోనియాకి తాకట్టు పెట్టలేదు.

    దేవేందర్ గౌడ్ లా జావగారి పోయే రకంగాదు.

    ఎర్రబెల్లిలా సమైక్యవాదుల కాళ్ళు మొక్కుతూ కుక్కలా పడుండే రకంగాదు.

    ఎందుకంటే సమైక్యవాదుల హేళనలకు, దూషణలకు అంతకు రెండింతలు జవాబిస్తడు, మంచో చెడో.

    ఎందుకంటే ఎప్పటికప్పుడు సమైక్యవాదుల ఎత్తులకు పై ఎత్తులేస్తుంటడు. అట్లనే కాంగ్రెస్ ను 2004 ల కమిట్ చేసిండు. చంద్రబాబును 2009 ల కమిట్ చేసిండు. ఇప్పుడు అందరు కలిసి రాజీనామాలు చేసేటట్టు కమిట్ చేసిండు. ఇది వారికి అస్సలు మింగుడుపడని విషయం.

    ఎందుకంటే ఓడిపోతే కుంగిపోడు. కిందపడ్డ బంతిలెక్క అంతకు రెండింతలు పైకి లేస్తడు.

    మాటలు తూటాల్లెక్క పేలుస్తడు. జనాన్ని అద్భుతంగ ఆకర్షిస్తడు. రెండు మూడు గంటలు అనర్ఘళంగ మాట్లాడగలడు. ఇప్పుడు రాష్ట్రంల ఆవిధంగా మాట్లాడే దమ్మున్న లీడరు ఒక్కడు గూడ లేడు. ఇది సీమాంధ్రులు కూడా ఒప్పుకునే విషయం.

    ఇవ్వన్ని ఉన్నాయి కాబట్టి ఆయన తెలంగాణా ఎప్పటికైనా తెస్తడేమోననే బెంగ వారికి, అందుకే పడదు.

    Update: కేసీయార్ తిడతాడని చెప్పే వారంతా తిట్లలో ఆయన్నే మించిపోవడం ఈమధ్య చూస్తున్న సంగతి!

    well said

    source: http://telangaanaa.blogspot.com/2011/07/kcr_26.html

    రిప్లయితొలగించండి
  2. Raama Chiluka said
    కెసిఆర్ తెలివి తేటలగురించి అనే కన్నా అతని 'జ్ఞానం' గురించి అని ప్రస్తావించుకుంటే ఉత్తమం, ఇతను తెలంగాణా గురించి ఏమాత్రం అవగాహన లేని అజ్ఞాని,తెలుగుదేశం నుంచి బయటకు వచ్చాక, ఏమి చెయ్యాలో తోచని సమయంలో ఎవరో చెబితే 'ఇదేదో బాగుందే, కొంత కాలం అలా కాలం గడప వచ్చు " అని తెరాస ను ఆలె.నరేంద్ర సహాయంతో (ఇతనికి స్వతహాగా దమ్ము లేక) స్తాపించాడు,ఇతని అవగాహనా రాహిత్యం వల్ల ఆలె నరేంద్ర ఉద్యమాన్ని కొంత ముందుకు తీసుకుని వెళ్తూ ఆదిపత్యాన్ని చూపించగా, తట్టుకోలేని కెసిఆర్ నరేంద్ర ను బయటకు పంపాడు, తరువాత నక్సల్స్ ఇతని పంచన చేరి కొంత అవగాన ఇవ్వసాగారు, అది ఇతను దండుకోటానికి పనికి వచ్చింది, అసలు తెలంగాణా ఉద్యమం అనేది దొరలమీద, రాజాకరులమీద, కానీ ఈ కెసిఆర్ ఆ ఉద్యమ రూపురేకలను మారేచేసి తెలివిగా 'సీమ ఆంధ్ర' అంటూ రంగు అద్దాడు ఈ విషయంలో విజం సాధించాడు,చరిత్ర మీద అవగాహన లేదు ఇతనికి కాని 'చదువులేక,నక్ష్సల్ , చేతబడులు లాంటి మూడనమ్మకాల మత్తు'లో మునిగి ఉన్న బలహీన మైన తెలంగాణా ప్రజలను ఎవరైనా బుట్టలోవేయ్యగలరు, కాబట్టి కెసిఆర్ కు తెలంగాణా ప్రజలను అబద్దాలతో నమ్మించటం సులువైంది. కన్నడ హీరో రాజ కుమార్ సహజ మరణం కారణంగా చనిపోయినప్పుడు , బెంగుళూరు రావనకష్టగా మారిపోయింది ఎన్నో భవనాలు , బస్సులు, కార్లు ద్వంసం అయ్యాయి , అందుకు కారణం సామాన్యుడు సిటీ లో ఉండలేని విధంగా జీవన శైలి ప్రవాసితుల కారణంగా మారటమే.ఇది జీర్ణించుకోలేని లోకల్ ప్రజలు 'మేము, బెంగలూరు మాది' అనే ఫీలింగును ఆ దాడులతో చూపించారు, అదే కసి హైదరాబాదు లో ఉండటం కెసిఆర్ కు కలసి వచ్చింది,అదే సమయంలోనే కెసిఆర్ 'జాగో-భాగో' అంటూ నినాదం తెచ్చాడు, అది బలంగా లోకల్ వాళ్ళలో నాటుకుంది. కెసిఆర్ టైం కలసి వచ్చిందే కాని ఇతని జ్ఞానం మాత్రం కాదు, ఇతను ఓ థర్డ్ క్లాసు అజ్ఞాని, మాటల తో ఎలా అడుకోవాలో జనాన్ని పనికిమాలిన సామెతలతో రెచ్చ గోట్టటమే తెలుసు,విజ్ఞత లేని వ్యక్తీ, ఇలాంటి వారు అధికారంలోకి వస్తే, ప్రజలను దేవుడు కూడా రక్షించలేడు ."రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరగటమే తెలంగాణా ప్రజల్లో ద్వేషానికి అస్సలు కారణం", బెంగుళూరు లో మాదిరిగా ఇక్కడా 'మా ప్రాంతం లో మేము నిలవలేని విధంగా జీవన శైలి మారింది అనే కోపం మాత్రమె ఈ ఉద్యమం ఉదృతం కావటానికి కారణం' ....మొత్తం మీద 'దొరలమీద ద్వేషంతో ఉన్న ('ఒసే.. రాములమ్మ' లాంటి సినిమా లే ఉదాహరణ) తెలంగాణా ప్రజల మనసులను 'సీమ, కోస్తా' ప్రజలమీడకు నెట్టేసి సంతోషంగా ఉన్నాడు.. అజ్ఞానులు రాజకీయాల్లో ఉంటె ఎలా ఉంటుందో ఈ 'కెసిఆర్' ఏ ఉదాహరణ....

    రిప్లయితొలగించండి
  3. అబ్బో ఈయన పెతిభ హేమిటో ఈ లింకు జూడు(http://youtu.be/jKQYZb5twkA)మస్తుగా అర్ధం అవుతది. అవును ఆయన చక్కగా 2-3 గంటలు పసందుగా అనర్ఘళంగా మాట్లాడుతడు. ఎవరి ముందు. యెర్రి మొర్రి జనం ముందు.తను "కాడిలాక్"కారులో(http://youtu.be/NSebXhAWIjo) తిరుగుతూ ఉంటే తనను నమ్మి ఉద్యమం చేస్తున్న వాల్లు పోలీస్ జీబుల్లో తిరుగుతున్నరు. తన మనవల్లు "ఆంధ్రా వాల్ల - ఓక్రిడ్జ్" స్కూలులో చదువుతున్న, అదేమని అడగడం కూడా రాని వెర్రి మొర్రి జనం ముందు. ఉద్యమం పేరు చెప్పి తను కోట్లు పోగేసుకుని "టి న్యూస్" చానెల్."నమస్తే తెలంగాణా" పేపరు పెట్టుకున్న అదేమిటని అడగటం రాని వెర్రి,మొర్రి జనం ముందు. తెలంగాణా భవణం కట్టినదాంట్లొ పది కోట్ల రూపాయలు "కచరా" మింగేసాడని సాటి నాయకుడు ఆలె నరేంద్ర అరోపించిన, ఒక్క సారి కూడా సమాదానం చెప్పకున్న, ఇప్పటికీ నమ్మె వెర్రి,మొర్రి జనం ముందు.తన కొడుకు "కెటీఆర్" లగడపాటి గ్రూప్తో కలసి వ్యాపారం చేస్తూ పైకి మాత్రం శత్రుత్వం నటిస్తూ ఉన్న అర్థం కాని యెర్రి మొర్రి జనం ముందు.మొత్తం పార్టీని కుటుంబం అభివృద్ది కోసం వాడుకుంటున్నా ఏమీ అర్థం కాని యెర్రి,మొర్రి జనం ముందు. కేవలం తెలంగాణా ఉద్యమం కోసం తీసిన,తీస్తున్న సినిమాలలో "ఆంధ్రా హీరో"లని పెట్టి తీసిన యేమీ అర్థం కాని యెర్రి,మొర్రి జనం ముందు. సిగ్గు లేకుండా పొద్దలస్తమానమూ ఆంధ్రా వల్లని తిడుతూ,వారి వ్యాపార ప్రకటనలు మాత్రం తీసుకునే టి న్యూస్ చానెల్,నమస్తే తెలంగాణా పేపరు చూస్తున్న,చదువుతున్న వెర్రి,మొర్రి జనం ముందు.చచ్చిపోయిన వారిని అడ్డం పెట్టుకుని "శవోద్యమాలు"నడుపుతున్నా అర్థం కాని యెర్రి,మొర్రి జనం ముందు.
    నేను చేన్నైలో ఉన్నపుడు టి.నగర్‌లో ఒక పిచ్చోడు, మురికిగా ఉంటూ కనిపించినవాడినల్ల తెగ తిడుతూ ఉంటే అందరూ తెగ భయమూ,కంగారూతో దూరం జరిగి పారిపోయేవాల్లు. ఇది వాడికి సరదాగాను,తనంటే అందరూ భయపడి పోతున్నారనుకుని మరింత రెచ్చిపోయేవాడు. వాడి కర్మగాలి ఒకరోజు సివిల్ డ్రస్సు్‌లో ఉన్న ఒకపోలీసు అఫీసర్ ఫామిలీతో వెలుతుంటే అంతకు ముందు లాగే వెర్రి మాటలు మాట్లాడి బెదరగొట్టాడు, ఫలితం అరగంటలో పోలీసోళ్ళు వచ్చి మక్కెలిరదన్ని ఎక్కడికో తీసికెల్లారు. ఇప్పటి వరకు కనపడలా. మరల నాకు అలాంటి పిచ్చోడే హైదెరాబాదులో కనిపించి అందరినీ బెదరగొడుతున్నాడు. బహుశా ఆ పిచ్హొడి లాగే కనిపించకుండా పోయేరోజులు దగ్గరకొచ్చినట్లు ఉన్నాయి. పాపం పండాలి,సమయం రావాలి.

    రిప్లయితొలగించండి
  4. బాగా రాసారండి ! నిజం చెప్పారు !

    రిప్లయితొలగించండి
  5. కేసీ ఆర్ అది జేస్తడు, ఇది జేస్తడు, అట్ల మాట్లాడుతడు, సోనియాకు కొమ్ముకాయడు, బంతిలా లేస్తడు, తుఫానై కదులుతడు.....కానీ ...

    ఒక్క జేపీ లాగా రెండు లక్షల ఎకరాలు ఇరిగేషన్ చేసి సమర్థవంతంగా ప్లానును అమలు పర్చలేడు.
    ఒక్క హజారే లాగా చిన్న గ్రామాన్ని స్వయం సమృద్ధం చేయలేడు.
    తన తెలంగాణాలో ఒక్క పరిశ్రమ స్థాపించి నలుగురికి అన్నం పెట్టలేడు.
    నీటికోసమో, పంటకోసమో, ఒక్క ఫీజిబుల్ ప్లానును ప్రభుత్వానికి సమర్పించి, ఆ ప్లానును సమర్థంగా అమలు జరపడానికి నలుగురిని కూడగట్టలేడు.
    అంతెందుకు, సరిగ్గా ఒక పది రోజులు (ఇడ్లీలు, మందు లేకుండా) నిరాహారదీక్ష చేయలేడు.

    రిప్లయితొలగించండి
  6. @వట్టికూటి: మీకు నిజం గా నచ్చిందేమిటి ఈ వ్యాసంలో ?

    @చదువరి: ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం నాకైతే అర్థం కాలేదు.. కాలుష్య కారో, కాకర కాయో కానీ.. ఎదురు లేకుండా పోతున్నాడు.. ఏమీ చేయలేక పోతున్నం .. అన్న పాయింట్ తప్ప నాకింకేం కనిపిస్తలేదు.. ఆయనకు నిజం గా ద్వేషం ఎక్కువైతే మీకు ప్రేమ ఎక్కువని చూపలేరా ? .. లేక అలా చూప గలిగే/చూపేలా చేయ గలిగే నాయకులు ఆంధ్రా లో లేరా ? "పాటి" ల ప్రయత్నాలు... పైపైవేనా ?..

    .. తెలంగాణా ఉద్యమాన్ని ఎదుర్కొవడం లో ఆంధ్రా వారు ఎందులో వెనకబడ్డారు అనేది కూడా వ్యాసిస్తే బాగుంటుంది..

    రిప్లయితొలగించండి
  7. @కాయ ఎవరైనా ఒక బ్లాగరు రాసిన విషయం నాకు నచ్చింది అని చెప్పటానికి మీ అప్ప్రొవల్ అవసరం అని నా ఇంత వరకు తెలియదండి :)

    సరే నాకు ఈ వ్యాసం లో నచ్చిన విషయం

    కెసిఆర్ చేసే తిక్క పనులు ధైర్యం గా ఎత్తి చూపటం . అదీ మెయిన్ మీడియా లోని వ్యక్తులు కూడా చేయలేనప్పుడు .

    నాలాగానే ఇవాళ రాష్ట్రము లో జరుతున్న "అరాచకాలకు " భాధ్యుడు గా ఈ వాస్యకర్త కూడా అభిప్రాయపడటం .

    నేను కూడా కెసిఆర్ ఈ రాష్టానికి రాచపుండు గా తయారయ్యాడు అని భావించటం .

    Hope this clears the air !

    రిప్లయితొలగించండి
  8. 1. "ఏమీ చేయలేక పోతున్నం .. అన్న పాయింట్ తప్ప నాకింకేం కనిపిస్తలేదు" - అబద్ధాలు చెప్పి, అడ్డగోలు బూతులు తిట్టి, ప్రాంతాల మధ్య ద్వేషాన్ని పెంచాడు. పైగా మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్టు ఇతరులను విమర్శిస్తున్నాడు అన్న సంగతి మాత్రమే చెప్పాను, రాష్ట్ర ప్రజలు తల్లడిల్లి పోడానికి అతడు కారణమని చెప్పాను, కేసీఆర్ ఎదురు లేని వాడా, ఎనక లేని వాడా అన్నది కాదు. శ్రావ్య గారు ఇంతకంటే బాగా తన రెండో వ్యాఖ్యలో చెప్పారు. మీరు దేని కోసమో ఎతుక్కున్నట్టున్నారు. అది కనబడకపోతే, నేనేం చెయ్యగలను?
    2. "..మీకు ప్రేమ ఎక్కువని చూపలేరా ?" - నన్ను బూతులు తిట్టేవాణ్ణి నేను ప్రేమించడమేంటసలు.. నాన్సెన్స్!
    3. ""పాటి" ల ప్రయత్నాలు... పైపైవేనా ?" - బూటకపు దీక్ష టక్కుటమారం ఎలా బైటకొచ్చింది? ఇహ పోతే, తిట్ల సంగతి.. ఎంత తిట్టినా కేసీయారు ’పాటి’ చెయ్యగలరా వాళ్ళు? అసంభవం!
    4. ’తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా వారు ఎదుర్కోవా’ల్సిన అవసరమేంటసలు? అందుకు తెవాదులు లేరూ..! ఆ అవకాశాన్ని ఇంకోడికెందుకిస్తారు?

    "ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం నాకైతే అర్థం కాలేదు." - ఇప్పు డర్థమైందనుకుంటాను.

    రిప్లయితొలగించండి
  9. A Kalidasu: "ఇవ్వన్ని ఉన్నాయి కాబట్టి ఆయన తెలంగాణా ఎప్పటికైనా తెస్తడేమోననే బెంగ వారికి, అందుకే పడదు." - మీరు చెప్పిన మిగతావన్నీ నిజమో కాదో గానీ.., ఈ ముక్క మాత్రం పచ్చి అబద్ధం. తన స్వార్థం కోసం జనాన్ని నట్టేట ముంచడంలో పది చెన్నారెడ్ల పెట్టతడు అని ’వారు’ నమ్మెదరు. ఖచ్చితంగా ఈ కారణానే అతడంటే పడుతుంది ’వారికి’.
    "కేసీయార్ తిడతాడని చెప్పే వారంతా తిట్లలో ఆయన్నే మించిపోవడం ఈమధ్య చూస్తున్న సంగతి!" - ఇది పెద్ద అబద్ధం! ’వారంతా’ కలిసి కూడా కేసీఆర్ నోటి దురదలో వందోవంతుకు చాలరు.

    రక్తచరిత్ర, సూటిగా, రవి గార్లు చెప్పింది చదవండి, కేసీఅర్ గొప్పదనం తెలియండి.

    రిప్లయితొలగించండి
  10. Whoever assumes that this is all KCR's greatness is not thinking properly. KCR has no standing of his own. He has no strength of his own. He is a shadow of Congress, created as a leader by Congress, promoted by Congress, patronized by Congress. advertized by Congress, strengthened by Congress. Whether he calls for bandhs or strikes or rokos, it is all with the tacit support or silent nod of the Congress high command. His occasional lashing out at Congress leaders is just a big drama prior-scripted jointly.

    There is a reason why Congress is doing this and using KCR as a proxy. They are still under a mistaken impression that KCR was really useful for dislodging Naidu in 2004. Ever since, he has a become a mental fixation for that party. They are afraid of losing that man. So they gave him freehand in certain matters. So he looks invincible and to be growing stronger day by day. But once Congress loses power in both the State and Centre, KCR will be down and out, with his separatist movement to be consigned to the dustbin of history. Congress thinks that driving a permanent wedge between different regions of AP is the sole guarantee for their political upper hand in the State. Once upon time they used these tactics for keeping Naidu out of power and now they are at the same game to keep Jagan out of power. Anyway, we, the Telugu people are the ultimate losers.

    But, Congress is again mistaken. This is no 2004.

    రిప్లయితొలగించండి
  11. ఇప్పుడు ఈ ఉద్యమం కేసీఆర్ చేతిలో లేదు అని తెలిసి కూడా ఆయనే ఎదో చేస్తున్నాడంటున్నారు మీరు. కేసీఆర్ రాజకీయ నాయకుడు. రాజకీయ ఆదిపత్యం కోసం తెలంగాన ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకున్నాడనే విమర్శలు కూడా వున్నాయి.

    అధికారం కోసం కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్న 2004 కాంగ్రెస్, 2009 చంద్రబాబులు మంచివాళ్ళనా మీ వుద్దేశం ?

    ఇప్పుడు ఒకడిని పాయింట్ అవుట్ చేయడం తప్పు. ఏమి జరుగుతుందో వెయిట్ చేయడం బెటర్.

    ఒకప్పుడు ప్రత్యేక తెలంగానకు అంగీకరించి ఇప్పుడు ప్లేటు ఫిరాయించిన ప్రతి ఒక్కరూ నేటి రాష్ట్ర పరిస్థితులకు, ఇబ్బందులకు కారకులే.

    రిప్లయితొలగించండి
  12. @వట్టికుటి: ఇవన్నీ ఇంతకు ముందు వేలాదిగా విన్న మాటలే.. కొత్త ఉద్దేశ్యం కనిపించడంలేదు.. బ్లాగుల్లో వ్రాసేవాటికి మేన్ మీడియా దాకా ఎందుకు లెండి.. ఏమో.. వ్యాసకర్త కేవలం తనకు తోచింది, తెలిసింది చెప్పడానికి "మాత్రమే" ఈ బ్లాగుని ఉద్దేశించారేమో లెండి..

    @చదువరి: అంటే ప్రేమించమని నేననేది ప్రజలని గురించి.. ప్రేమ చూపించటంలో నాన్సెన్స్ ఏముంటుంది.. ఇక అర్థమవడానికొస్తే మీ పర్పస్ ఇంతకంటే ఎక్కువగా ఉంటుంది అని అనుకున్నా..

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. కాయ: నాకు తోచింది నాకు తెలిసింది "మాత్రమే" చెబుతాన్నేను. ఏం.. మీరు ఇతరులకు తోచిందీ, ఇతరులకు తెలిసిందీ చెబుతారా?

    "ప్రేమించమని నేననేది ప్రజలని గురించి" - మళ్ళీ చెబుతున్నా.. నేను రాసింది ప్రజల గురించి కాదు, కేసీయార్ గురించి, కేసీయార్ గురించి! అతడి మీద ప్రేమ చూపించడమంటే నాన్సెన్సే మరి!

    a2zdreams: "ఈ ఉద్యమం కేసీఆర్ చేతిలో లేదు అని తెలిసి కూడా ఆయనే ఎదో చేస్తున్నాడంటున్నారు మీరు" - అతడేదో ’చేస్తున్నాడని’ నేనెక్కడన్నానూ..? కారుకూతలు ’కూస్తున్నాడని’ అన్నానండి. మరోసారి చదవండి.
    "అధికారం కోసం కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్న 2004 కాంగ్రెస్, 2009 చంద్రబాబులు మంచివాళ్ళనా మీ వుద్దేశం ? " - ఇది రాసే ముందు రాజు గారి పెద్ద పెళ్ళాం, చిన్న పెళ్ళాం సామెత గుర్తుకు తెచ్చుకోవాల్సింది మీరు.

    రిప్లయితొలగించండి
  15. ఒకసారి,ఒక తెలంగాణావాది(ఎవరో మీకు తెలుసు.ఇక్కడ వ్యక్తిగత ప్రస్తావన ముఖ్యం కాదు) ఒక T.V.ఇంటర్వూ లో ఇలా అన్నాడు."1956 నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు"అని.

    నిజానికి 1956 నవంబర్ 1 కి ముందు తెలంగాణా రాష్ట్ర మనేది ఏదీ లేదు.నిజాం పాలన లో "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం" 1948 సెప్టెంబర్ 17 పోలీస్ చర్య తరువాత ఇండియన్ యూనియన్ లో విలీనమైంది.అప్పటి నుండి 1956 నవంబర్ 1 న భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేవరకు హైదరాబాద్ ఒక రాష్ట్రంగా కొనసాగింది. అప్పటి "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం"లో "8 జిల్లాలు గల తెలంగాణా ప్రాంతం(తరువాత 1978 లో రంగారెడ్డి,హైదరాబాద్ 9,10 వ జిల్లాలుగా ఏర్పడ్డాయి)" ఒక భాగం మాత్రమే.విలీనం తరువాత 1950 వరకు జనరల్ J.N.Chowdary సైనిక పాలన కొనసాగింది.తరువాత హైదరాబాద్ రాష్ట్ర తాత్కాలిక Civil Administrator గా M.K.Vellodi 1950 జనవరి 26 న భారత ప్రభుత్వం చే నియమింపబడ్డారు.1952 లో తొలి సారత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు గల హైదరాబాద్ రాష్ట్రం లో 93 సీట్లు గెల్చుకొన్న కాంగ్రెస్ పార్టీ,బూర్గుల రామకృష్ణా రావు CM గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.1955 లో 1st State Reorganisation Commission హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి కన్నడం మాట్లాడే 3 జిల్లాలని కర్ణాటక లో,మరాఠా మాట్లాడే 5 జిల్లాలని మహరాష్ట్ర లో కలిపి మిగిలిన "8 జిల్లాలు గా గల తెలంగాణా ప్రాంతాన్ని" ప్రత్యేక రాష్ట్రంగా గాని లేక అప్పటికే ఒక రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో గాని కలపవచ్చు అని సిఫార్సు చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోసం కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణం లో తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం పక్కనే తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రం చేయడంలో అర్థం లేదు.అలాగని అప్రజాస్వామికంగా కలుపలేరు కాబట్టి 1955 డిసెంబర్ లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం పెట్టగా హాజరైన 147 మందిలో 103 మంది తెలంగాణాను ఆంధ్ర రాష్ట్రం లో కలుపమని, 29 మంది వద్దని వాదించారు. 15 మంది తటస్థంగా ఉన్నారు.ఆ తరువాత కూడా తెలంగాణావాసుల అపోహలు తీరుస్తూ 1956 ఫిబ్రవరి 20 న పెద్దమనుషుల ఒప్పందం(Gentlemen's Agreement ) చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా కు ప్రత్యేక హక్కులు,రాయితీలు కల్పిస్తామని ఆంధ్రనాయకులు హామీ ఇచ్చారు.దాంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఆ "8 జిల్లాల తెలంగాణా ",ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడానికి మార్గం సుగమమైంది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసారు.
    ఔరంగాబాద్,బీడ్,నాందేడ్, పర్భాని ,ఉస్మానాబాద్ అనే 5 జిల్లాలను మహరాష్ట్ర లో(అప్పటికి దాన్ని బోంబే రాష్ట్రం అనేవారు) కలిపారు.
    బీదర్,గుల్బర్గా,రాయచూర్ అనే 3 జిల్లాలను కర్ణాటక లో కలిపారు.
    "మిగిలిన 8 జిల్లాల తెలంగాణా"ను అప్పటి ఆంధ్రరాష్ట్రంతో కలిపి 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసారు.పై మార్పులన్నీఒకేసారి చేసారు.కాబట్టి తెలంగాణాను హైదరాబాద్ రాష్ట్రం నుండి వేరు చేయడం, ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం రెండూ ఒకేసారి జరిగాయి.అంటే కనీసం ఒక్క రోజు కూడా తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గాని,కనీసం ప్రత్యేక పరిపాలనా విభాగం గా గాని చరిత్ర లో ఎప్పుడూ లేదు.మరి ఇప్పుడు తెలంగాణావాదులు అన్నట్టు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం"ఒక్క ఇంచ్ కూడా" కోల్పోకుండా కావాలంటే మహరాష్ట్ర ని, కర్ణాటక ని కూడా అడగాలి.అడిగితే బాగుండేది వాళ్ళని "ఒక్క ఇంచ్ కోల్పోకుండా కావాలని ".అప్పుడు ఒక్క పంచ్ కూడా వేస్ట్ అవకుండా కుమ్మేస్తారు వాళ్ళు.అసలే ఆ రాజ్ ధాకరే మంచోడు కాదు

    రిప్లయితొలగించండి
  16. ఆ.... అదే మాగ్గావలసింది... 1955 తరువాత, 1956 ముందర వున్న తెలంగాణా ప్రాంతమే మాగ్గావలసింది. మర్యాదగా మాది మాకిచ్చి బయలుదేరండి. ఏందీ ముచ్చట, చర్చలు, విశ్లేషణలు... చెబుతుంటే అర్ధంఅయితలేదా?
    యింతెందుకువయా.. హైదరాబాద్ మాగ్గావాలె.. మిగతాయిస్తే తీసుకుంటం.. లేకుంటే గా మిగతా జిల్లాలు మీరే దీస్కుని పండగ జేస్కోండి. యించ్ గూడ వదలం అంటే తెలంగాణాలో అనుకున్నరా... మరదే నామాటలు మీ సీమాంధ్రోళ్ళు వక్రీకరిస్తున్నరని మొదటినుండి మొత్తుకుంటనే వున్న.
    ఇట్లు మీ,
    కచరా
    కతరా

    రిప్లయితొలగించండి
  17. @కాయ వేలసార్లు విన్నారు అంటే ఆ మాటలు నిజమే అయ్యే ఛాన్స్ ఉండొచ్చేమోనండి మరి , అలాగే అదే బాధలు జనాలు ఇంకా పడుతున్నారు కాబట్టి అదే మాటలు చెబుతున్నారేమో . అలాగే ఎవరు రాసినా వారికి తోచింది చెప్పటానికే కదా బ్లాగులు వాడుతున్నాం , వాళ్లకి తోచింది మనకు నచ్చితే పోగుడుతాము లేదా తెగుడుతాము అని అనుకుంటున్నాను నేను .

    ఇంకా మెయిన్ స్ట్రీం మీడియా ఎందుకు వద్దండి , ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటూ , బాధ్యత మర్చిపోయి స్వంత ఆస్తుల రక్షణ కో , స్వలాభానికో అసలు నిజాలు రాయకపోతే మాట్లాడాల్సిందే కదా .

    రిప్లయితొలగించండి
  18. చదువరిగారూ...మీ బ్లాగులో ఏమి రాయాలో అది మీ ఇస్టం. ఏ 'సత్రకాయ' మాటలో మీరు పట్టింకోనవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  19. కచరా ఎంత మాటల మాంత్రికుడంటే, 'ప్రత్యేక ఆంధ్రా ఉద్యమాన్ని 'ప్రత్యేక తెలంగాణా' ఉద్యమంగా ప్రచారం చేస్తున్నాడు. దానిని దేశ ప్రజలు, మేధావులు, మీడియా అందరూ నమ్ముతున్నారు. ఒక్కసారి కచరా డిమాండ్లను మరియు జై ఆంధ్ర డిమాండ్లను పరిశీలంచండి. మీకే అర్థమవుతుంది.

    విచిత్రం ఏమిటంటే, ఈ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాన్ని తెలంగాణా వాసులు చేస్తున్నారు. ఆంధ్రా వాసులు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈ సమస్యకు ఇప్పట్లొ పరిష్కారం లేదు. కావున అందరూ తమ తమ పనులు చేసుకోండి. సమైఖ్యాంధ్ర వాదులు ఆఫీసులకు, తెలంగాణా వాదులు సకల జనుల సమ్మెకు ...

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  21. మల్లెలు కాదు .. పల్లేర్లు.. అంటే నీళ్ళు లేని చోట మొలిచే పళ్ళేరు చెట్లు అని..
    "పల్లె పల్లె నా పల్లేర్లు మొలిచె తెలంగాణా లోనా"

    తోచింది మాత్రమే వ్రాశారా ? అన్న ప్రశ్నకి..
    కేసీఆర్ ఏం చేస్తున్నాడో చెప్పారు రచయిత.. మరి ఎలా ఎదుర్కోవాలో కూడా వ్రాయాల్సింది అని నా ఉద్దేశ్యం ..

    రిప్లయితొలగించండి
  22. శ్రీ చెంబు గారి కి ఇంత చెప్పినా అర్థమైతలె.ఏది కరక్టో ఏది కాదో నీకు నాకు చరిత్ర తెల్సు.తెలియక పోయినా విషయం కాదు. కాని ఉద్యమం నడిపే పెద్ద ఒకరు ఆ మాట అన్నారని నా article మెదట్లనే చెప్పిన. 1956 కి ముందు తెలంగాణా చరిత్ర ఏమిటో తెలీక పోయనా ఆయన ఒక తెలంగాణా ఉద్యమంలో అగ్రనేత గా చలామణి అవుతున్నారు....సరే అసలు ఆ అగ్రనేత ఏ సందర్భంలో అన్నారో కూడా చెప్తా..dec 9 తరువాత కొందరు, తెలంగాణా వచ్చినా భద్రాచలం మాత్రం ఆంథ్ర దే అని ఒక వాదం లేవనెత్తారు..దాని గురించి ఆ అగ్రనేత ని అభిప్ర్రాయం అడగ్గా, ... ఆయన్నేమన్నాడో ఆయన మాటల్లోనే "గీ భద్రాచలం ముచ్చట నాకు ముందే దెల్సు. మా జయశంకర్ గారి ని ఇది వరకే అడిగిన... సార్, ఏంది గీ భద్రాచలం ముచ్చట ..దీని కత ఏందీ..కార్ఖానా ఏందీ అని....దానికి ఆయన....అంటే ..ప్చ్..అది..ఆయన ...ప్రొపెసరు కదా.. యెంటనే ..చాలా చక్కగా...గిట్లన్నడు....1956 కి ముందు రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్..two independent states గీ రెండూ.. గీ తెలంగాణా అప్పుడు ఒక ప్రత్యేక రాష్ట్రం..మాగ్గావల్సింది గా ప్రత్యేక రాష్ట్రమే..గదే రాష్ట్రం గట్లనే గావాలే ఇప్పుడు... అంతకు మించి ఒక్క ఇంచ్ మాకక్కరలేదు ఆంధ్రోళ్ళ నుండి..మేము కూడా అప్పటి మా రాష్ట్రం లో ఇంచ్ కూడా వదులుకోం..ఇక ఆ రాష్ట్రంల గీ భద్రాచలం ఉంటద, ఊడుతద..గిదంత మాకు దెల్వది."..

    అలాగే హైదరాబాద్ అనేదే అక్కడ లేకపోతే తెలంగాణా ఉద్యమమే లేదనేది జగమెరిగిన సత్యం.ఇది హైదరాబాద్ అనే ఒక అంతర్జాతీయ సిటీ యొక్క అభివృద్ది(ఇన్నాళ్ళు ఎవడో అభివృద్ది చేసాడు. అది మాకనవసరం.పండు పక్వానికి వచ్చింది కాబట్టి ఇకనుండి ఆ రసాలు మాకే..ఇన్నాళ్ళు నువ్వు నీరు పోస్తే నాకేంది..ఎరువులేస్తే నాకేంది) కేవలం మాకే చెందాలె అనే భావానికి ఉద్యమ ముసుగు. అసలు కావాల్సింది హైదరాబాద్ అయినప్పుడు.."పల్లె పల్లె నా పల్లేర్లు మొలిచెను తెలంగాణా లోనా" అని పాడుకోడమెందుకో..."పల్లె పల్లె నా పల్లేర్లు మొలిచెను హైదరాబాద్ లోనా"...అంటే కరక్ట్ గా ఉంటది కదా

    రిప్లయితొలగించండి
  23. శ్రీ కాయ గారి కి కృతజ్ఞత లు..నన్ను కరెక్ట్ చేసినందుకు..నేను కరీంనగర్ లో ఒక year ఉన్నా.అప్పుడు విన్న పాట అది."పల్లె పల్లె నా పల్లేర్లు"

    రిప్లయితొలగించండి
  24. 2005-06 సంవత్సరానికిగాను తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లా అని తె.వాదులు చెప్పే నల్లగొండలో వరి ఉత్పత్తి 9,39,000 టన్నులు. కృష్ణానీళ్ళని రాయలసీమకి దోచిపెట్టగా కర్నూలు మినహాయించి వరి ఉత్పత్తి ఇంచుమించు 5 లక్షల టన్నులు! మరి తెలంగాణ పల్లెపల్లెల్లో పల్లేర్లెక్కడి నుంచి వచ్చాయో!

    రిప్లయితొలగించండి
  25. @ చదువరి గారు :
    విడిపోవడానికి ఏకాభిప్రాయమెందుకు? అని మళ్ళీ అడుగుతున్నాడతడు. నిజమే.. హై.ని వదిలిపెట్టేసి తన రాష్ట్రాన్ని తాను ఏర్పాటు చేసుకుంటానంటే ఎవరి అభిప్రాయమూ అక్కర్లేదు. మీ సమైఖ్యాంధ్ర పదానికే అర్ధం హైదరాబాద్ అన్నమాట.. మీరు ఎప్పుడు కెసిఆర్ మీద పడీ ఏడుస్తుంటారు..కెసిఆర్ ఇలా అన్నాడు అల్లా అన్నాడు అని. ముందు మీ ఆంధ్ర నాయకులని పట్టుకుని అడగందే 2004 లో 2009 లో తెలంగాణా కీ ఎందుకు అనుకూలంగా మాట్లాడారు అని..మీ నాయకులూ మాత్రం ఆడిన మాట తప్పవ్వచు కెసిఆర్ మాత్రం ఆంధ్ర నాయకులని ఏమీ అనకూడదు... అసలు విడిపోవడానికి ఏకాభిప్రాయమెందుకు? మీరు మద్రాస్ నుండే విడిపోవడానికి మద్రాస్ ప్రజల అబిప్రాయం తీసుకున్నార? ఏమిన అంత్యే అప్పుడు బాష పరంగా వేదిపోయం దానికీ మద్రాస్ ప్రజల అబిప్రాయం అవసరం లేదు అంటారు, ఇప్పుడు మేము కూడా అది అంటునం అసలు మా బాష మీకు అర్ధం కాదు మీ బాష మాకు అర్ధం కాదు...అసలు సమైఖ్యాంధ్ర కీ పొట్టి శ్రీ రాములు గారికీ సంబంధం ఏంటి ? సమైఖ్యాంధ్ర జెండా లో పొట్టి శ్రీ రాములు గారి ఫోటో పెట్టుకుని తెరుగుతుంటారు.. హైదరాబాద్ నీ అబివ్రుది చేసాము అంటునారు.. అసలు ఈ రోజు ఇండియా అంత అబివ్రుది చెందదానికీ పీ.వీ నరసింహారావు గారు కారణం అతను చేసిన పనులవల్ల ఇండియా లో హైదరాబాద్ కానీ మరి ఏ ఇతర ప్రాంతం కానీ అబివ్రుది చెందయీ..

    రిప్లయితొలగించండి
  26. చదువరి గారూ, మీరు చెప్పినదంతా నిజమే కానీ, మా తెలంగానా మాగ్గావాలె - మా హైదరాబాదు కూడా మాకే కావాలె ... ఆంధ్రవాలే భాగో. మీరు కొండలు గుట్టల్లో వచ్చి పెట్టుబడులు పెట్టినందుకు అనుభవించండి.... ఇంకో రాజధాని కట్టుకోండి..... ఈ కొండలు, గుట్టలతో పాటు, ఇక్కడ పెట్టిన డబ్బులన్నీ మావే. సీమాంధ్ర ముఖ్యమంత్రులు హైదరాబాదు ను ప్రమోట్ చేయడం వాళ్ళు చేసిన తప్పు. ఏ విజయవాడ నో, విశాఖపట్నాన్నో అభివృధ్ది చేయాల్సింది - మేము వద్దన్నమా? మా హైదరాబాద్ గురించి మాట్లడనికె మీరెవ్వరు? మీ రాజధాని అని మిమ్మల్ని ఎవ్వడు అనుకోమన్నడు? మా హైద్రబాదు మాకివ్వకుంటె గీ తొక్కలో తెలంగాన మేమేంజేసుకోవాలె? మాకా అభివృధ్ది జేసుడు రాదు - అందుకే మీరు అభివృధ్ధి జేసినంక పొమ్మంటున్నం. మాకు గింత అన్యాయం జరుగుతుందని మా కచరా జెప్పేదాక మాకు తెల్వదు. మేము వెనకబడి పోయినమని చెప్తె, కాదని అన్ని లెక్కలు జూపించి, మా అబధ్ధాలు అందరికీ తెలిసెటట్లు జేశిన్రు, ఇగ అందుకే ఆత్మ గౌరవం అన్న మాట నెత్తికెత్తుకున్నం. మేము పట్టిన కుందేలుకు మూడే కాల్లు. కాదంటే తలలు నరుకుతం, నాలుకలు తెగ్గోస్తం, బందులు జేస్తం, బొందలు వెడ్తం.

    ఇదే గదండీ మీ గుండె గోస శ్రీకాంతాచారిగారూ?

    రిప్లయితొలగించండి
  27. విరజాజి గారూ బాగా చెప్పారు. అసలు మా నిజాం పాలన ఇంకా కొనసాగించి ఉంటే మా హైదరాబాద్ ఎంత బాగుపడేది? మా బ్రతుకులు నాశనమయితే అవచ్చుగాక మా హైదరాబాద్ మాత్రం అబివృద్ధి చేసేవాడు. ఈ భారత ప్రభుత్వం సీమాంధ్ర పక్షపాతి అందుకే సైనిక చర్య జరిపి నిజాం పాలన కు మొకాలడ్డింది. మా నిజాం మాకోసం ఎంత చేసాడో మీకేం తెలుసు? మేము అంధకారం లో మునుగుతుంటే మాకోసం తన ప్యాలస్ లకి కరెంట్ పెట్టించుకున్నాడు, మాకోసం తన ఉంపుడుగత్తెల కోసం పెద్ద పెద్ద భవనాలు కట్టించాడు, మాలో పోరాట స్ఫూర్తిని రగిలించడానికి రజాకార్లని పంపించాడు వాళ్ళు మా ఆడోల్లతో నగ్నంగా బతుకమ్మ ఆడించి మా సంస్కృతి, మాలో క్రీడా స్ఫూర్తి పెంచారు. మాకోసం తన విదేశీ ప్రయాణాలకి ఎయిర్ పోర్ట్ కట్టించుకున్నాడు. ఇన్ని చేసిన మా నిజాం మాకు దేవుడు. మీ ఆంధ్రోల్లు దయ్యాలు.

    రిప్లయితొలగించండి
  28. Telangana: ఫక్తు తెవాదాన్ని వినిపించేస్తున్నారు. చూడండి.. లైను లైనుకూ తెవాదం ఎలా కంపు కొడుతోందో..

    "మీరు ఎప్పుడు కెసిఆర్ మీద పడీ ఏడుస్తుంటారు.. కెసిఆర్ ఇలా అన్నాడు అల్లా అన్నాడు అని." - అవతలోడి మీదబడి ఏడవడమనే సంస్కృతి మాది కాదు. నేనేడవను. ప్రతీదానికీ నామీద పడి ఏడ్చిపోయే తెవాదులను ఛీ...దరించుకుంటూంటాను. ఈ ముక్క మీకు అర్థమైనా కానట్టు నటిస్తూంటారు.

    "ముందు మీ ఆంధ్ర నాయకులని పట్టుకుని అడగందే 2004 లో 2009 లో తెలంగాణా కీ ఎందుకు అనుకూలంగా మాట్లాడారు అని.." - అడగాల్సిన ఖర్మ నాకేంటి? ఎప్పుడేం చెయ్యాలో వాళ్లకు తెలుసు. చెయ్యకపోతే మేమేం చేస్తామో కూడా వాళ్లకు తెలుసు. వాళ్ళు సన్నాసులయ్యుండొచ్చు గానీ, మీ నాయకులంత సన్నాసులు కాదు. వాళ్ళు మోసగాళ్ళయ్యుండొచ్చేమోగానీ, మీ నాయకులంత మోసగాళ్ళు కారు. వాళ్ళు చవటలైతే కావచ్చేమోగానీ,,మీ నాయకులంత చేతకాని చవటలూ, దద్దమ్మలూ కారు. పైగా మేం అవతలోడి మీద పడి ఏడ్చే టైపు కాకపోవడం చేత వాళ్ళు మమ్మల్ని మోసం చెయ్యలేరు.

    "మీ ఆ మీ నాయకులూ మాత్రం ఆడిన మాట తప్పవ్వచు కెసిఆర్ మాత్రం ఆంధ్ర నాయకులని ఏమీ అనకూడదు..." - మీకు ఒకమాటు చెబితే అర్థం కాదు. వాళ్ళు తెలంగాణ ఇస్తామన్నారా, లేదా అనేది మేం పట్టించుకోలా. దాన్ని బట్టి మేం ఓట్లెయ్యలా? కానీ ’రాష్ట్రాన్ని చీల్చడమనేది తెలంగాణపోళ్లకు మాత్రమే సంబంధించిన సంగతి, మాకు ఏ సంబంధమూ లేద’ని చిదంబరం అనుకున్నాడు చూడండీ.. అప్పుడు మాత్రమే మేం పట్టించుకున్నాం. ’అప్పుడు ఏం ఆడారో మాకు అనవసరం, ఇప్పుడు మేం చెప్పినట్టు ఆడండి’ అని అన్నాం. ’తిత్తి తీస్తాం రొరేయ్’ అని కళ్ళెర్ర జేసాం. ఎప్పుడు కోపగించాలో అప్పుడు మాత్రమే కోపగించేవాడికి వచ్చే కోపం ఎదటోణ్ణి భయపెడతది. అందుకే.. డిసెంబరు 9 తరవాత డిసెంబరు 23 వచ్చింది. ఎప్పుడూ కోపగించుకుంటూ ఉండేవాడి కోపం చిరాకు పుట్టిస్తది. అందుకే డిసెంబరు 31 తరవాత చాలా మామూలుగా, గవర్నరు చెప్పినట్టు, జనవరి 1 వచ్చేసింది. పోయేసింది కూడా.

    "అసలు విడిపోవడానికి ఏకాభిప్రాయమెందుకు? మీరు మద్రాస్ నుండే విడిపోవడానికి మద్రాస్ ప్రజల అబిప్రాయం తీసుకున్నార? ఏమిన అంత్యే అప్పుడు బాష పరంగా వేదిపోయం దానికీ మద్రాస్ ప్రజల అబిప్రాయం అవసరం లేదు అంటారు" - మద్రాసు వదులుకున్నాకే మా రాష్ట్రం ఏర్పడింది. వదలుకోకపోతే ఏర్పడేదే కాదు. అది చరిత్ర. చదువుకునేడవగలరు.

    "ఇప్పుడు మేము కూడా అది అంటునం" - ఏంది మీరనేది? నిన్నన్న మాట నేడనరు. నేడన్న మాట రేపనరు. మీ నాయకులైతే ఇపుడౌనని కాసేపయ్యాక దాన్నే కాదంటారు.

    "అసలు మా బాష మీకు అర్ధం కాదు మీ బాష మాకు అర్ధం కాదు..." - బాస అని ఏకవచనం చెప్పకండి. అది బహువచనం, ’మా బాసలు’ అనాలి.మీకున్నవి ఒక్క బాస కాదు. అనేక బాసలు. అయినా.. మీ బాసేలేమైనా పైశాచిక బాసలా ఏంది అర్థం కాకపోడానికి? తెలుగులో విభిన్న యాసలే అవి, అంతకు మించి వేరే ఏమీ కాదు. బాస అని అంటున్నావ్.. నువ్వు మాట్టాడేది ఏ యాస గురించి? మహబూబ్ నగరమా, ఆదిలాబాదమా, ఖమ్మమా లేక నల్లగొండమా? ఖచ్చితంగా చెప్పు. ఎంచేతంటే నాకు కొన్ని యాసలు తేలిగ్గా అర్థమౌతాయ్, కొన్ని కావు. అంతెందుకు.. ఖమ్మం జిల్లాలో ముప్పాతిక శాతం జనానికి ఆదిలాబాధ అర్థం కాదు. అంచేత ఖమ్మపోణ్ణి విడిపొమ్మందామా? నీకు, నాకూ శ్రీకాకుళం, చిత్తూరు, కడప యాసలు గబుక్కున అర్థం కావు. అంత మాత్రాన వాళ్ళూ విడిపోవాలా? ఇట్టా విడగొట్టుకుపోతే నల్లగొండ జిల్లాను నాలుగు ముక్కలు చెయ్యాల, తెలంగాణను నలభై చెయ్యాల. చేద్దామా?
    (ఇంకా ఉంది..)

    రిప్లయితొలగించండి
  29. (గత వ్యాఖ్యకు కొనసాగింపు)
    Telangana:

    "హైదరాబాద్ నీ అబివ్రుది చేసాము అంటునారు.. అసలు ఈ రోజు ఇండియా అంత అబివ్రుది చెందదానికీ పీ.వీ నరసింహారావు గారు కారణం అతను చేసిన పనులవల్ల ఇండియా లో హైదరాబాద్ కానీ మరి ఏ ఇతర ప్రాంతం కానీ అబివ్రుది చెందయీ.." - హై. అభివృద్ధి గురించి మేం చెప్పేది ఏంటంటే, రాష్ట్రం లోని మిగతా ప్రాంతాల, జిల్లాల అభివృద్ధిని పక్కనబెట్టి, హై.ని అభివృద్ధి చేసారు. ఇప్పుడు, ’బాగా అభివృద్ధి చెందిన హై. మాదే, ఇక మీరు పోయి మీ రాజధాన్ని ఏర్పాటు చేసుకోండి పొండ’ని మీరు అతితెలివితేటలు చూపిస్తే నడవదని చెబుతున్నాం. మీరు అర్థం చేసుకోరు, చేసుకునే పరిస్థితిలో మీరు లేరు. ఎందుకంటే మిమ్మల్ని తెవాద అబద్ధాలకోరులు మాయ జేసారు, హిప్నటైజు చేసారు. ’ఆడండి’ అని వాళ్ళు అరవగానే మీరు లేచి గెంతులేస్తున్నారు. ఎవరో చెబితే తైతక్కలాడేవాళ్ళకు విచక్షణ ఉంటదా, వివేచన ఉంటదా?

    ఇక పీవీ గురించి.. నిజమే. మన పీవీ మనకు గర్వకారణం. రెండో ఆలోచన లేదు. దక్షిణ భారతం నుంచి మొట్టమొదటి ప్రధానిగా, దేశాన్ని చుట్టుముట్టిన తీవ్ర ఆర్థిక చీకట్ల నుంచి వేకువవైపు నడిపించిన దిగ్దర్శిగా, ఐదేళ్ళు సంపూర్ణంగా, జయప్రదంగా ప్రధాని పదవిని నిర్వహించిన మొట్టమొదటి నెహ్రూ కుటుంబేతర ప్రధానిగా, అపర చాణక్యుడిగా, మనవాడిగా గర్వించని తెలుగువాడుండడు.

    "అసలు సమైఖ్యాంధ్ర కీ పొట్టి శ్రీ రాములు గారికీ సంబంధం ఏంటి ? సమైఖ్యాంధ్ర జెండా లో పొట్టి శ్రీ రాములు గారి ఫోటో పెట్టుకుని తెరుగుతుంటారు.." - నిజమే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలర్పించిన దధీచి అతడు. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తించాలి.. ఆధునిక యుగంలో తెలుగువాడికి తనదంటూ ఒక ప్రత్యేక రాజ్యాన్ని మొట్టమొదటగా ఏర్పరచిన నిర్మాత అతడు. ఆధునిక యుగ విద్యారణ్యస్వామి అతడు. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీయుడు. అతడి ఫొటోను సమైక్య వాదులు జెండాలో పెట్టుకుంటే మాత్రం వాళ్ళు అభినందనీయులే. రేపు తెలంగాణ ఏర్పడినా - ఒకవేళ ఏర్పడితే - ఆ రాష్ట్రంలో కూడా పొట్టి శ్రీరాములు ప్రాతఃస్మరణీయుడే! పెద్దలకు మనం చేసుకునే సత్కారం మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. వాళ్ళ గొప్పదనానికి మనం వన్నె తేలేం, తగ్గించనూ లేం.

    మీ సంస్కారం చూడండి.. పీవీ మనందరి వాడన్నారు. పొట్టి శ్రీరాములుకూ సమైక్య రాష్ట్రానికీ సంబంధమేంటని అదే నోటితో అనగలిగారు. తాలిబన్ల వారసులు తెలుగువెలుగుల విగ్రహాలను కూలగొడితే తప్పేంటని నిర్లజ్జగా అడిగారు.

    మేం చూడండి.. పీవీ మనవాడేని సగర్వంగా అన్నాం. అంటాం కూడా. పొట్టి శ్రీరాములూ మనవాడేనని అంతే గర్వంగా చెప్పుకున్నాం. చెప్పుకుంటాం కూడా. మీరెంత విషం చిమ్మినా మేం వివేకం కోల్పోం.
    (అయిపోయింది)

    రిప్లయితొలగించండి
  30. నిజాం మెడలు వంచిదీ తెలంగాణావాదులే..నిజాం పాలన కొనాసాగుంటేనే బాగుండేదీ అనేదీ వాళ్ళే..మరి నడిమిట్ల భారత సైన్యం ఎందుకో పెద్ద పని ఉన్నట్టు 1948 sep 13 న అంత హైరానా పడిపోయింది.తెలంగాణావాదులే నిజాం మెడలు వంచిన్రు కాదె. వాళ్ళకెందుకు అంత కష్టం..అప్పటి కేంద్రం బుర్ర లేని పని..నిజమే కదా ఎన్ని సార్లు నిజాం కోట ని వాళ్ళు ముట్టడించలే..

    రిప్లయితొలగించండి
  31. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  32. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  34. ఎందుకురా బాబు ఈ గోల...వదలరురా బాబు ఈ ఆంధ్రోళ్ళు ,హైదరాబాద్ ని వదలరు..ఆళ్ళకిష్టం లేకుండా వదిలించనూలేరు..ఇన్నేళ్ళసంది ఎన్ని కతలు చేసినా వదిల్నరా..వదిలించగల్గీర్రా...పొరపాటున సోనియమ్మ dec9 న ,ఏదో ఆమె దేశానికి మహరాణి అయినట్టు.. ఈ రాష్ట్రం ఏదో తన జాగీరు అయినట్టు (చిదంబరం ద్వారా )నోరు జారితే ఈ ఆంధ్రోళ్ళు ఒక డోస్ ఇచ్చీరు. (dec 10 na ఒకే ఒక్క రోజు).. సప్పుడేక మూసుక్కూచుంది...తెవాదులు ముళ్ళ కంచె మీద పొర్లుతామన్నా హైదరాబాద్ వదలరు గీ ఆంధ్రోళ్ళు......తెలంగాణ వస్తదో రాదో ఎవడికీ దెల్వది..హైదరాబాద్ మాత్రం ఆంద్ర నుండి వేరు పడే సమస్యే లేదు...మహా అయితే ఉమ్మడి రాజధాని గాని...కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ ఉమ్మడి రాజధాని గాని(చంఢీఘడ్ తీరున).. గప్పుడే తెలంగాణ ను గల్పి తప్పు జేసీర్రు.ఎప్పటికీ ఆంద్రోళ్ళు ఇగ వదలరు .ఇంత డవలప్మెంట్ చేసుకొన్నంక లాక్కొంటమంటే ఆంద్రోళ్ళే కాదు ఆళ్ళ పొజిషన్ లో ఎవడున్నా వదలడు ..తెవాదుల అన్యాయమైన కోర్కె ఎలాంటిదంటే "కలిసి పెంచిన చెట్టు" కాయలు ఇచ్చే టైమ్ కి "ఈ చెట్టు మా ఇంటికి దగ్గర కాబట్టి అది నాది" అని లాక్కుంటామంటూర్రు..ఏంది నీ ముచ్చట ఏంది, కత ఏంది?..మూసుగ్గూసోడానికి లంగ గాళ్ళనుకొన్నావ్ ఆంద్రోళ్ళని ....పోనీ ఆంధ్రోళ్ళు చేవ లేనోళ్ళైతే తెవాదులు దౌర్జన్యం గా నైనా లాక్కునేటోళ్ళు....ఉద్యమాలు ఆంధ్రోళ్ళుకూ తెలుసు..ఆంద్రనాయకులకు స్వాతంత్ర్యం పూర్వం నుండి డిల్లీ లెవెల్లొ ఆ మాత్రం లాబీయింగ్ కెపాసిటీ కూడా ఉంది.అసలు ఇంకోటి తెల్సా, nda govt వచ్చితెలంగాణ ఇచ్చేస్తమన్నగాని,అప్పుడు రాష్ట్రంల ఎవరు అధికారంల ఉన్నగాని,సమైక్యాంధ్ర కోసం లాబీయింగ్ చేయగల్గే సత్తా ఆంధ్రోళ్ళకున్నది..లేదా మరీ గట్టిగ పట్టుబడితే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని,లేక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటూ ఉమ్మడి రాజధాని..గదే ఇగ చివరి బేరం(లాబీయింగ్ politicians మాత్రమే చేయనక్కర్లే).అది గాక 5.5 కోట్ల జనబలం ఉంది..చేవ ఉంది..dec 10 na రాజీనామాలు తప్ప ఇప్పటి వరకు ఈ అస్త్రాలేవీ బయటకు తీసే అవసరం రాలె ఆళ్ళకి..

    ఎందుకు అలా బుర్ర బద్దలు కొట్టుకొని,జుట్టు పీక్కొని, షర్ట్ చింపుకొంటే మీ తెవాదులకే తలనొప్పి తప్ప..ఎంత గింజుకొన్నా,కావలంటే తెలంగాణ మెత్తం ఆత్మార్పణ చేసుకొంటమన్న,తెలంగాణ వచ్చే వరకు 4 కోట్లమంది తల నేలకేసి రక్తాలొచ్చేలా బాదుకొంటమన్నా హైదరాబాద్ మాత్రం ఆంధ్రోళ్ళు వదల్రు...("ఎన్నో లక్షల ఉద్యోగాలు" వచ్చేస్తాయి అనే కచరా ఎర ఉంది కదా..అలా తల బాదుకొనే ఉన్మాదం రావడంలో తప్పు లేదులే.ఆడదాని గా పుట్టాక పెళ్ళి యాతన..మగాడి గా పుట్టాక ఉద్యోగం యాతన...)!.వదల్రన్నా!..అది డబ్బు తో ముడి పడింది.ఈ కాలం డబ్బంటే ప్ర్రాణం తో సమానం.దానికి ఉద్యమం,ఆత్మగౌరవాలు ఇవేవీ తెలీవు.హైదరాబాద్ వదులుకొంటే ప్రస్తుతం రెగ్యులర్ గా వచ్చే రెవెన్యూ డైరెక్ట్ గా లాస్.(hyd revenue ఎంతో అందరికీ తెల్సు.)...మరోవైపు ఆంధ్ర కు కొత్త రాజధాని ని తెస్తే అది హైదరాబాద్ తో ఎప్పటికీ పోటీపడేంత ఎదగలేదు..పెట్టుబడులు రావు.so ఇండైరక్ట్ గా ఫ్యూచర్ రెవన్యూ లాస్.ఇక ఎప్పటికీ అదే పరిస్థితి..ఎవడొదులుకొంటడు..?
    చాలా!..ఇంకా అర్థం కాలేదా!.
    అన్యాయం కదన్నా!...(ఇంటిపై సమాన హక్కు ఇద్దరికీ ఉన్నా) మర్యాదగా ఇంటి నుండి బయటకు నడు లేదా ఆత్మహత్య చేసుకొంటానని తమ్ముడు బ్లాక్ మెయిల్ చేసినంత మాత్రాన అన్నయ్య ఇల్లు ఇచ్చేస్తాడా.సమంగా పంచుకొందామంటాడు..నచ్చజెప్తాడు...పెద్దలతో చెప్పిస్తాడు..ఇంకా వినకపోతే వదిలేస్తాడు.....ఏంది? ...........ఇల్లు కాదు.....వాడి ఖర్మానికి వాడ్ని వదిలేస్తాడు..అంతే గాని ఇల్లు వదులుకోడు.

    ఇన్నేళ్ళ హైదరాబాద్ అభివృద్ది లో ఆంధ్రోళ్ళ పాత్ర్ర ఏందో ప్రపంచానికి తెల్సు..అంత చేసినోడికి హక్కు రాదా..రాదా అని అడగనక్కరలేదు కూడా...వస్తది..దానికి ఎవరైనా భంగం కల్గిసే..చేయాల్సింది చేస్తరు.అలాగని ఆళ్ళ రోజువారీ పనులు ఏమీ ఆపరు..ఎటొచ్చీతెవాదులకి ఏ పనీ లేక ఉద్యమ కేకలే మిగుల్తయి...ఎవడొదులుకొంటడు..?ఆస్తి మీద హక్కులని(వాడెంత అమాయకుడైనా ఆస్తి విషయాల్లో తెలివితేటలు ఆటోమాటిక్ గా వచ్చేస్తయి.ఇది వరకే చెప్పిన కదా.డబ్బు అంటే ప్ర్రాణమని..ప్రాణం కాపాడుకొమ్మని ఏ జీవికీ నేర్పక్కర్లే .అమాయకు జీవులు కూడా ప్రాణం నిలుపుకోడానికి ఆటోమేటిక్ గానే స్పందిస్తయి)..

    రిప్లయితొలగించండి
  35. @ చదువరి :"మీ సంస్కారం చూడండి.. పీవీ మనందరి వాడన్నారు"

    అసలు ఈ రోజు ఇండియా అంత అబివ్రుది చెందదానికీ పీ.వీ నరసింహారావు గారు కారణం అతను చేసిన పనులవల్ల ఇండియా లో హైదరాబాద్ కానీ మరి ఏ ఇతర ప్రాంతం కానీ అబివ్రుది చెందయీ..

    గమనిక : నేను ఎక్కడ పీవీ మనందరివాడు అని అనలేదు... తమరు గమనించాలీ..

    రిప్లయితొలగించండి
  36. Telanagana: ఓహో.. మీ మాటలను బట్టి మీ సంస్కారం గురించి నేను ఎక్కువగా ఊహించుకున్నట్టున్నాను. సర్లెండి, మీరెట్టా మాట్టాడినా మేం మాత్రం పీవీ అందరివాడేనని అంటాం.

    రిప్లయితొలగించండి
  37. @Telangana

    /గమనిక : నేను ఎక్కడ పీవీ మనందరివాడు అని అనలేదు... తమరు గమనించాలీ../

    PV ఎవరివాడో, కసబ్ ఎవరి(ఏ జాతి)వాడో అందరికీ తెలుసు.

    నీ పర్మిషన్ ఎవడికీ అక్కర్లేదు.

    రిప్లయితొలగించండి
  38. @ చదువరి " ఫక్తు తెవాదాన్ని వినిపించేస్తున్నారు. చూడండి.. లైను లైనుకూ తెవాదం ఎలా కంపుకొడుతోందో.."

    మీ ఆంధ్ర కాలుష్యం తో మా బ్రతుకులు కంప్పు పట్టిపోయాయీ, మరి అంత కంపు బరించడం ఎందుకు ? మల్లి కలిసున్ధం అని అనడం ఎందుకు ?

    రిప్లయితొలగించండి
  39. @ jhon "నీ పర్మిషన్ ఎవడికీ అక్కర్లేదు"

    రాష్త్రం వీడీపోవదానికీ "నీ (ఆంధ్ర) పర్మిషన్ ఎవడికీ అక్కర్లేదు"

    రిప్లయితొలగించండి
  40. /రాష్త్రం వీడీపోవదానికీ "నీ (ఆంధ్ర) పర్మిషన్ ఎవడికీ అక్కర్లేదు" /


    LOLOLOLOLOLOLOLOL -


    Ignorance is BLISS.


    LOLOLOLOL

    రిప్లయితొలగించండి
  41. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  42. బ్లాగు ల్లో సౌలభ్యం ఇదే..ఎవరికి ఏమీ తెలియక పోయినా ఎడాపెడా రాసెయ్యొచ్చు..శ్రీ telangana గారిని చూడండి.బొత్తిగా తెలంగాణ అంశం గూర్చి తెల్వక పోయినా ఏమో అంటార్రు..."రాష్త్రం వీడీపోవదానికీ నీ (ఆంధ్ర) పర్మిషన్ ఎవడికీ అక్కర్లేదు" అంట...ఆయనకింకా తెల్వనట్టుంది..dec 9 న వచ్చిన తెలంగాణ ఆంధ్రోళ్ళ పర్మిషన్ లేక వెనక్కు పోయిందని..నిజమే dec 9న తెలంగాణ వచ్చింది ఎవరూ ఊహించని విధంగా.( ఆఖరుకు గా కచరా కూడా ఊహించలే).ఇదేందని గీ ఆంధ్రోళ్ళు వెంటనే రాజీనామా హడావుడి జేసి ముందు మర్యాదగా ఎనక్కి దీస్కో అని పెద్దమనిషి లెక్క చెప్పిర్రు.గిదేంది పొద్దు లేసిన సంది నా జపం చేసే నా పార్టీ నాయకులకింత ధైర్యం యాడికెల్లంచ్చింది అని సోనియమ్మ డంగైంది.
    గప్పుడు గా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జెప్పిర్రు."అది కాదమ్మా నీ పుట్టినరోజు కానుక లెక్క "ఇచ్చిన తీస్కపో" అని ఇవ్వనీకి నీ బర్తుడే కేకు గాదిది.గా తెవాదం యన్క హైదరాబాద్ మెలిక ఉన్నది.....నీ అధికారంకైనా ఒక హద్దు ఉంటది... గంతెందుకు తల్లి గా నీ అధికారహద్దుల్లో ఉండకపోతే నీ రాహుల్ బాబు,నీ ప్రియమ్మ అయినా నీ మీద తిరగబడ్తరు గదా...అనవసర అధికారం జూపించి దేశం లోనీ రాష్ట్రాలెల్ల నా జాగీర్లనుకొని నీ చిత్తంవచ్చిన నిర్ణయాలు దీస్కొంటే నడవది..గివాల జై అన్నోడే రేపు జావో ఇటలీ అంటడు..ఇంకా నయం.నింద నీమీదకి మరీ అంత రాలె..గా ప్రకటన చేయించనవు చూడు..గా చిదంబరం చేత,ఇప్పుడు అందరూ ఆడ్ని ఆడిపోసుకుంటుర్రు..వాడేదో సొంత ప్రకటన చేసినట్టు(ఆంధ్రని ముక్కలు చేసి తమిళనాడు అభివృద్ధి చేయాలని).కాబట్టి ఇప్పటికైనా గా ప్రకటన వెనక్కి తీస్కోకపోతే మరింత బద్నాం అవుతవు..నీ చేతికి మట్టి అంటకుండా ఫూచర్ల ఎలాంటి ప్రకటనలు చేయాల్నో మాకొదిలేయ్ మేము చూస్కొంటం.నువ్వింక ఈ విషయం లో వేళ్ళెట్టక" అని నచ్చజెప్పిర్రు...
    తరవాత ఆంధ్రనాయకులు పోస్ట్ మార్టం చేయగా "కోర్ కమిటీ కి కూడా చెప్పకుండా ఆమెకామె నిర్ణయం దీస్కొంది.కచరా దీక్ష ఆపించడాని ఏదో ప్రకటన చేయాలని మేము ఇంకా అనుకొంటుండగానే ఏ మాత్రం చర్చ లేకుండా ఎవరికీ చెప్పను కూడా చెప్పకుండా(అందరూ ఆ బర్త్ డే హడావుడి ఉన్నర్లెండి..లేకపోతే చెప్పేదే) చిదంబరం చే గా గిలాంటి ఏకపక్ష ప్రకటన చేయించింది" అని కాంగ్రెస్ పెద్దలు చెప్పిన్రట.
    గిప్పటికైనా శ్రీ telangana గారికి అర్థమవక పోతే ఏమీ జెయ్యలేం..అరె ఒక్క మాటబై..రాష్త్రం వీడీపోవదానికీ "ఆంధ్ర పర్మిషన్ అక్కరలేక పోతే, (40 ఏళ్ళ ఉద్యమం ముచ్చట గటుంచు),..,గా dec 9 తరవాత దాదాపు రెండేళ్ళు కావస్తోంది అయినా తెలంగాణ ఎందుకు రాలె?....అర్థమైతలె..?ఆంధ్రోళ్ళు పర్మిషన్ ఈయలేదుబై..ఆపిర్రు..ఉమ్మడి రాజధాని అయితేనే పర్మిషన్ ఇస్తరు..లేకపోతే ఉద్యమాలె మిగుల్తయు..గాళ్ళు పర్మిషన్ ఇవ్వరు..గీ తెలంగాణ రాదు..మద్యల జనాలు నలిగిపోతరు ముఖ్యంగా తెలంగాణ జనం..ఇక గీ అజాద్ మీటింగ్ లు,చిదంబర అఖిలపక్షాలంటవే ,గవి నడుస్తనే వుంటై..stunt కోసం

    రిప్లయితొలగించండి
  43. @ Telangana - "మీ ఆంధ్ర కాలుష్యం తో మా బ్రతుకులు కంప్పు పట్టిపోయాయీ, మరి అంత కంపు బరించడం ఎందుకు ? మల్లి కలిసున్ధం అని అనడం ఎందుకు ? "

    మీరనుకుంటున్నట్టు ఎవరూ ఓ తెగ లవ్వుతో కలిసుందాం అనడం లేదు. ఎన్నో దశాబ్దాలుగా అందరూ కష్టపడి అభివృద్ది చేసుకున్న హైదరాబాదు నుండి వస్తున్న డబ్బును కొందరు అప్పనంగా తిని తొంగోవడానికి ప్రయత్నిస్తుంటే ఎవరూ ఊరుకోరు. మీకు నిజంగా తెలంగాణా పైన ప్రేమ ఉంటే "హైదరాబాదు తక్క మిగిలిన జిల్లాలతో తెలంగాణా ఇవ్వండి" అని చెప్పండి చూద్దాం. హైదరాబాదును సీమాంధ్రకే ఇస్తాము అంటే సీమాంధ్రులు "ఆ కంపు" తప్పించుకోవడానికి ఈ క్షణమే సిద్దం.

    రిప్లయితొలగించండి
  44. @జీడిపప్పు
    -"హైదరాబాదు తక్క మిగిలిన జిల్లాలతో తెలంగాణా ఇవ్వండి" అని వాళ్ళు అనక్కరలేదు లెండి.
    చూసి చూసి కేంద్రమే హైదరాబాద్ ని కే.ప్రా.పా చేస్తాది.అప్పుడు మూసుకొంటారు సప్పుడేక..ఉద్యమం లేదు..ఏదీ లేదు...ఎవడు పని ఆడు చేస్కొంటాడు..

    రిప్లయితొలగించండి
  45. సమైఖ్యవాదులకు విజ్ఞప్తి కేసీర్ భవిష్యత్తుతో ఆడుకోకండి...వాడి బ్రతుకు తెరువు కోసం ఒక పార్టీ ...దాన్ని బ్రతికించుకోవడానికి ఒక ఉద్యమం....దానికి ఎప్పుడొ జరిగిన కధకు...ఇప్పుడు ప్రాణం పోసి...రియాలిటీ షో నడుపుతున్నాడు...కేటీర్...కవితా...ఈ పుడుంగులు పెద్ద హీరోలూ...హరీష్ అనబడే బ్లాక్ మార్కెట్లో టికెట్ లమ్ముకునే స్టాండర్డ్ వాడు...పెద్ద నాయకుడు...థూ నా తెలుగు ప్రజలరా...ఈ దేశంలో...ఇంతకంటే వెధవలు ఎవరూ దొరకలేదా??మీ నాయకులుగా..??

    రిప్లయితొలగించండి
  46. KCR oka ABHINAVA GANDHI.. DOCHKOVADANIKI VACHHINA BRITISH VADIKI VADIKI GANDHI KUDA DAYYAM LA KANIPINCHADU..ALAGE ANDHRA VALLAKI KCR DEVUDULA KANIPNCHATLEDHU...INKA EMI DOCUKOVALANI PANNAGALALU PANNUTHUNNARU E KAPATI ANDHRA DONGALU

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు