గూగుల్ వాడు అనేక సేవలను తామర తంపర గా జనాల్లోకి దింపేస్తూంటాడు. మన జీమెయిల్లో పైన ఎడం చేతి పక్క నుండి వాడి సేవల జాబితా మొదలౌతుంది. జాబితా చివర ’మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే మరో సేవలజాబితా కిందకి జారుతుంది. దాని చివర ’ఈవెన్ మోర్’ అనే లింకుంటుంది. అది నొక్కితే ఒక సేవల పేజీకి వెళ్తాం. ఇదివరకు ఆ పేజీనిండా బోలెడు సేవల జాబితా ఉండేది. వాటిలో ల్యాబ్స్ అని ఒకటుండేది.. అది నొక్కితే ఇంకా ప్రయోగ దశలో ఉన్న సేవల జాబితా ఇంకోటి ఉండేది. మొత్తం ఒక యాభైకి పైగానే ఉండేవి. ఇప్పుడు ఆ సేవల జాబితా బాగా చిక్కిపోయింది. అవన్నీ ఏమయ్యాయో తెలవదు.
31, అక్టోబర్ 2011, సోమవారం
30, అక్టోబర్ 2011, ఆదివారం
బ్లాగుల / సంకలినుల ద్వారా డబ్బు సంపాదించుకోవడం ఎలా?
మొన్న నేను బ్లాగరులో ఒక చిన్న పొరపాటు పని చేసాను. వేద్దామనుకున్న టపాతో పాటుగా, చిత్తుప్రతుల్లో ఉన్న మరో టపాను - ఇప్పుడప్పుడే వెయ్యదలచుకోనిది- కూడా ప్రచురించేసాను. అనుకోకుండా జరిగింది. అడెడె.. అనుకుని వెనువెంటనే, దాదాపు అరనిముషం లోపే, దాన్ని ’అ’ప్రచురించేసాను, తిరిగి చిత్తుప్రతుల్లోకి పంపేసాను. ఎందుకైనా మంచిదని హారానికి వెళ్ళి చూసాను. అక్కడ చూపించలేదు. మాలిక లోనూ చూసాను, అక్కడా లేదు. కూడలిలోను, జల్లెడలోనూ రాలేదు.
28, అక్టోబర్ 2011, శుక్రవారం
ఇభరాముడు, మల్కిభరాము
నమస్తే తెలంగాణ పత్రికలో ప్రాణహిత అనే శీర్షికలో అల్లం నారాయణ గారు ఇలా రాసారు:
"ఇబురాముడు’ ఎవరో? తెలుసా? పోనీ ఇబ్రహీమ్ కుతుబ్ షా తెలుసా? తెలియదు. నాకూ
తెలియదు. కెప్టెన్ పాండురంగాడ్డి చిన్న పుస్తకం చూసేదాకా ‘ఇబు రాముడు’ అని
తెలంగాణవూపజలు ఇబ్రహీమ్ కుతుబ్షాను పిలుచుకునే వారని కూడా తెలియదు. తెలంగాణలో ఆయన తెలుగు భాషను ప్రోత్సహించినారన్న విషయమూ తెలియదు. సురవరం
ప్రతాప్డ్డి అన్నట్టు ‘మనమూ చరివూతకు ఎక్కదగినవారమే’ అనీ తెలియదు.
ఎందువల్ల. మనం చరివూతకు ఎక్కలేదు కను క."
25, అక్టోబర్ 2011, మంగళవారం
నిర్హేతుక నిరర్థక నిష్ఫల సమ్మె
ప్రభుత్వ ఉద్యోగులు 40 రోజుల పైగా చేసిన సమ్మెను
ఎట్టకేలకు విరమించారు. తెలంగాణ కోసం చేస్తున్నామని మొదలుపెట్టి, ముగింపు ఒప్పందంలో దాన్ని పెద్దగా పట్టించుకోకుండానే సమ్మెను ముగించేసారు. ఎందుకు మొదలుపెట్టారో, ఎందుకు చేసుకు పోయారో, ఎందుకు
విరమించారో చూస్తే, ఇదంతా ఒక అయోమయ వ్యవహారంగా కనబడుతుంది.
24, అక్టోబర్ 2011, సోమవారం
విద్రోహ దినం కాదు, ద్రోహుల దినం చెయ్యాలి
రాష్ట్రావతరణ దినోత్సవాన్ని - నవంబరు ఒకటిని - విద్రోహ దినంగా జరుపుకోవాలని కోదండరామ్ పిలుపునిచ్చాడు. ఉద్యమం పేరిట ప్రజల జీవితాలతో చెలగాటాలాడుకుంటూ, కాలక్షేపం చేస్తున్న ఈయన, ఇపుడో కొత్త కార్యక్రమానికి తెర లేపబోతున్నాడు. విద్రోహ దినంతో పాటు, మూడురోజుల పాటు దీక్ష కూడా జరుపుకోవాలని ఫత్వా జారీ చేసాడు. దీక్ష చేసేందుకు అర్హతలేమిటో కూడా జారీ చేసారు సారు!
కానీ, ఇప్పుడు జరుపుకోవాల్సింది విద్రోహదినం కాదు, ద్రోహుల దినం. ఇది విద్రోహ దినం ఎందుక్కాదంటే..
కానీ, ఇప్పుడు జరుపుకోవాల్సింది విద్రోహదినం కాదు, ద్రోహుల దినం. ఇది విద్రోహ దినం ఎందుక్కాదంటే..
21, అక్టోబర్ 2011, శుక్రవారం
గెలిచినవాడు నీచ మానవుడు
బాన్సువాడ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస అభ్యర్థి గెలిచాడు. కానీ అనుకున్నంత మెజారిటీ రాలేదు. కాంగ్రెసుకు చాలానే వోట్లొచ్చాయి, స్వయంగా వాళ్ళు కూడా ఊహించనన్ని వోట్లొచ్చాయి. అందుకు గాను తెరాస తరపున గెలిచిన అభ్యర్థి ఏమన్నాడో చూసారా..? తమకు వోటెయ్యని వాళ్ళు ద్రోహులంట. ఏగడ్డ మీద బతుకుతున్నారో ఆ గడ్డకు ద్రోహం చేసేవాళ్ళంట. ఇతడి ధోరణి వాళ్ళను భయపెట్టేవిధంగా కూడా ఉంది.
15, అక్టోబర్ 2011, శనివారం
సకల జనుల సమ్మె లో తొలి విరమణ
తెలంగాణ ఉద్యమంలో 2011 అక్టోబరు 15 ఒక గుర్తుంచుకోదగ్గ రోజు. అనేక సంఘటనలు కలగలిసి ఈ రోజుకు ప్రాముఖ్యత తీసుకొచ్చాయి. ముఖ్యంగా రెండు సంఘటనల గురించి చెప్పుకోవాలి:
12, అక్టోబర్ 2011, బుధవారం
కాలుష్య కారకుడు, కేసీఆర్
తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కెసిఅర్ కో ప్రత్యేకత ఉంది.. అనేక విషపు మాటలు మాట్టాడి ప్రజల మనసులను కలుషితం చేస్తూ ఉద్యమాన్ని ఎగదోస్తూంటాడు. పైగా తాను సరిగ్గా మాట్టాడుతున్నట్టూ, అవతలి వాళ్ళు తప్పుగా మాట్టాడినట్టూ ప్రచారం చేస్తూంటాడు. ఇది అతడికి వెన్నతో పెట్టిన విద్య. తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడానికి దాన్ని చాలా బాగా వాడాడు.
ఈ మధ్య కాలంలో అతడేమన్నాడో చూడండి:
ఈ మధ్య కాలంలో అతడేమన్నాడో చూడండి:
3, అక్టోబర్ 2011, సోమవారం
ప్రజలపై తెవాదుల రాళ్లదాడులు
సకల జనుల సమ్మె పేరుతో మొదలైన సమ్మె ఇవ్వాళ రాళ్ళదాడికి చేరింది. విజయవాడ నుంచి హై. కు వస్తున్న బస్సులపై తెవాద మూకలు రాళ్ళేసి కొట్టాయి.పదికి పైగా బస్సుల అద్దాలు పగిలాయి. ప్రయాణీకులకు కూడా రాళ్ళ దెబ్బలు తగిలాయి. తెల్లారేటప్పటికి హై. చేరుకోవాల్సిన ప్రజలు మధ్యాహ్నం తరవాత చేరుకున్నారు. ఉద్యమాన్ని "మిలిటెంటు అహింస" వైపు నడవమని తమ నాయకుడు కోదండరామ్ చెప్పాడు గదా.. ఇట్టాగే ఉంటాయి వాళ్ళ చేతలు!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..