3, జులై 2011, ఆదివారం

ప్రొఫెసరు చక్రపాణి గారూ, మీకు సిగ్గుందా?

ఏకంగా ఒక ప్రొఫెసరును పట్టుకుని ఇలా అనెయ్యొచ్చా అని అనబాకండి నన్ను. ఆయనే చెప్పాడు అలా అనొచ్చని. ఎప్పుడంటే..

రాజీనామాలు చేసెయ్యాలన్న నిర్ణయం తరవాత కేకే విలేఖరులతో మాట్టాడుతూ ముఖ్యమంత్రికి సిగ్గుందా అనే వ్యాఖ్య చేసాడంట. ఆ విషయమ్మీద టీవీ5 లో చర్చ జరిగింది. ముఖ్యమంత్రిని అలా అనడం తప్పు అని మల్లాది విష్ణు అన్నాడు. కేకే అలా అనలేదని పొన్నం ప్రభాకరు చెప్పబోయాడు. ఈలోగా ప్రఖ్యాత తెవాద విశ్లేషకుడు గంట చక్రపాణి చర్చలో కలగజేసుకున్నాడు. ’అందులో తప్పేమీ లేదు. ఎవరైనా సిగ్గు లేకుండా ప్రవర్తిస్తుంటే చూసినవాళ్ళు సిగ్గు తెచ్చుకొమ్మని చెప్పడంలో తప్పేమీ లేదు. అది అన్ పార్లమెంటరీ పదమేమీ కాదు’ అని చెప్పాడు.

ప్రొఫెసరు గారు అలా వివరించాక, అలా అడగడంలో తప్పేమీ లేదని తెలుసుకున్నాక, ఆయన చూపిన బాటలోనే నడిచి ఆయనకు సిగ్గుందో లేదో నాకు అడగాలని అనిపించింది. ఎందుకంటే..

గతంలో ఈ ప్రొఫెసరు టీవీ కెమెరాల ముందు కూచ్చుని, హైదరాబాదులో మతకలహాలు 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకే , కోస్తా సీమల ప్రజలు వచ్చాకే మొదలయ్యాయి, అంతకు ముందు హిందూ ముస్లిములు ఎంతో సమైక్యంగా ఉండేవారని చెప్పాడు. కానీ ఇది అవాస్తవం. హైదరాబాదు నగరంలో 1938లోనే మతకలహాలు జరిగాయి. అయినా ఈ ప్రొఫెసరు అబద్ధం చెప్పాడు. 
ఈయన అంబేద్కరు సార్వత్రిక విశ్వవిద్యాలయంలో సామాజిక శాస్త్రంలోనో ఎందులోనో ప్రొఫెసరు. పిల్లలకు పాఠాలు చెప్పేవాడు విషయాలు తెలుసుకుని మాట్టాడాలి. పైగా తన సబ్జెక్టుకు సంబంధించిన విషయం గురించి తప్పులు అసలే చెప్పకూడదు. కదా? మరి నాబోటి సామాన్యుడికి కూడా తెలిసిన సంగతి ప్రొఫెసరుద్యోగం చేస్తున్న తనకు తెలీనందుకు సిగ్గు పడతన్నాడా లేదా అనే సంగతి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎలాగంటే..

ప్రొఫెసరు గారూ!
ప్రొఫెసరయ్యుండీ.. తెలియని విషయం గురించి తెలిసినట్టుగా మాట్టాడి (లేక తెలిసీ అబద్ధం చెప్పారా?) కోస్తా సీమల ప్రజలందరినీ అవమానించడానికి సిగ్గుగా లేదా?  ’అబ్బే ఇలాంటి అబద్ధాలు చెప్పడం తెవాదుల జన్మహక్కు, ఇలాంటివెన్నో చెప్పాం, అంచేత అదేమంత సిగ్గుపడాల్సిన సంగతేమీ కాదు’అని అంటారా.. అయితే ఒప్పేసుకుంటాను! కానీ బళ్ళో పిల్లలకు రోజూ ఎన్నేసి తప్పులు/అబద్ధాలు చెవుతున్నారోనని బెంగొచ్చేత్తోందండీ బాబూ!

37 కామెంట్‌లు:

  1. ప్రొ| చక్రపాణి చెప్పింది కరక్టు, వారి వారి సంస్కృతి, సాంప్రదాయాలు బట్టి అలాంటి పదాలు వాడటం జరుగుతుంది. కచరా కూడా తమ సంస్కృతి ప్రతిబింబించేలా వ్యాఖ్యానించడం తప్పు కాదన్నారు. మచ్చుకు - దద్దమ్మ, చవట, సన్నాసి, బొంద పెడతా, ఓ అబ్బకు పుట్టింటే, ఇలా అన్నా మాట. సిగ్గులేకపోవడం, ఒక అబ్బకు పుట్టకపోవడం గురించి తరచూ ఆలోచనలతో సతమతమవ్వడం, పరస్పరం స్నేహపూర్వకంగా బొందలు పెట్టుకుని అగరొత్తులు వెలిగించుకోవడం లాంటి ఆటవిక తెగల సంస్కృతి ఇంకా అక్కడ కొనసాగుతోందని మనకు తెలుస్తోంది.
    మీరు వాళ్ళ సంస్కృతిని ప్రశ్నించడం అన్యాయం, అక్రమం. నేను నిర్ద్వందంగా, పార్టీలకతీతంగా, ప్రాంతాలకతీతంగా దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ ఖండిస్తున్నాను. అద్వానీతో క్షమాపణ చెప్పించాల్సిందే, అధమం బండారు దత్తాత్రేయతోనైనా క్షమాపణ చెప్పించాల్సిందనిగా విజ్ఞప్తి చేస్తున్నా.

    రిప్లయితొలగించండి
  2. "సిగ్గుందా" అని అడగడం సీమాంధ్ర పదం కాబట్టి తప్పనుకుంటానండి. "బేషరమ్" అంటే సరిపోద్దేమో.

    రిప్లయితొలగించండి
  3. అసలు ఈ చక్రపాణి విశ్లేషకుడు ఎలా అవుతాడండీ. విశ్లేషకుడు అంటే తటస్థంగా(Objectively) విషయాన్ని విశ్లేషించగలిగినవాడు కదా. ఇతను కరుడుగట్టిన తెలంగాణావాది. మరి ఇతను విశ్లేషకుడు ఎలా అవుతాడు? ఇతనికి ఎలా పడిందోగానీ మేధావి ముద్రపడి టీవీఛానల్స్ లో చర్చాకార్యక్రమాలలో విశ్లేషకుడుగా పాల్గొంటున్నాడు. కానీ ఇతనికి అంతసీనులేదు. ఇతనే కాదు. టీవీఛానల్స్ లో చర్చాకార్యక్రమాలలో పొల్గొనే చాలామంది విశ్లేషకులది ఇదేస్థాయి. సి.నరసింహారావు అని ఒకతను ఉన్నాడు. ఇతను కరుడుగట్టిన 'టీడీపీ'వాది. ఎన్టీఆర్ ను పొగుడుతూ పుస్తకంకూడా రాశాడు. కొన్నాళ్ళు మోహన్ బాబు సలహాదారుగా పనిచేశాడు. ఇతను కూడా ఇప్పడు విశ్లేషకుడిగా ఛానల్స్ లో చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాడు. టీడీపీయేతర పార్టీలన్నిటిమీద ఒంటికాలుమీద లేస్తూ, దుమ్మెత్తిపోస్తుంటాడు. మరి ఇతను విశ్లేషకుడు ఎలా అవుతాడో తెలియడంలేదు. అసలు ఇలాంటివాళ్ళను కూర్చోబెట్టే ఛానల్స్ వాళ్ళకి బుద్ధిలేదు.

    రిప్లయితొలగించండి
  4. తటస్థంగా ఉండే విశ్లేషకులా? గుడ్ జోక్. అలాంటివాళ్ళు ఎక్కడున్నారండీ????

    రిప్లయితొలగించండి
  5. అసహ్యమైన మాటలూ, అమ్మనా బూతులూ తిట్టేది. ఆ తరువాత నాలిక్కఱచుకొని "ఇది మా తెలంగాణ నుడికారం. తెలంగాణ జాతీయం. మీరే పొఱపడుతున్నారు. ఇలా మాట్లాడితే మా భాషలో పొగిడినట్లు" అని మనకే తెలుగు నేర్పించబోతారు వీళ్ళు. చిన్నాపెద్దా లేకుండా అందరినీ మీదపడి కొట్టేది. ఆ తరువాత " అలా కొడితే మా తెలంగాణ గుండెచప్పుడు వినిపిస్తున్నట్లు లెక్క" అని బుకాయించేది.

    అన్నట్లు చెప్పడం మర్చిపోయాను. ఈ రోజు నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధంలో జేపీగారిని కొట్టిన డ్రైవరు-గూండాని ఆకాశానికెతేస్తూ ఒక ఫుల్‌పేజి కలర్‍ఫోటోల వ్యాసం ప్రచురించాడు అల్లం నారాయణ. ఆసక్తి గలవారు చదివి తరించండి. నాకైతే అది చదివి డోకొచ్చింది.

    రిప్లయితొలగించండి
  6. ఇలా ఒక గూండాగాణ్ణీ, మహాకవి కాళోజీని ఒకే సంచికలో పక్కపక్కపుటల్లో పొగడగలరు వీళ్ళు, అన్నం తింటున్న చేత్తోనే ఇంకేదో చేసినట్లు !

    రిప్లయితొలగించండి
  7. మళ్ళీ రాజీనామా డ్రామా షురూ అయ్యిండు, తెలంగాణ రింబోల సైయ్యా? సై సై.
    MLAలు సైయ్యా?
    MPలు సైయ్యా?
    మంత్రులు సయ్యా?
    ముక్కోడు సైయ్యా?
    రింబోలా రింబోల రింబోలా :))

    రిప్లయితొలగించండి
  8. తాడేపల్లి గారూ,పొద్దునే నేనూ ఆ ముక్క చదివాను. అంతకంటే దిగజారుడు వ్యాసం ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. నిన్న అదే పేపర్లో టాంక్ బండ్ విగ్రహాల కూల్చివేతను సమర్థిస్తూ ఏదో రాశారు. న్యూటన్ సూత్రం ప్రకారం - ఏక్షన్ కు రియాక్షన్ ఉంటుందిట.

    రిప్లయితొలగించండి
  9. మమ్మల్ని ఇన్ని రకాలుగా తిడుతారు, అపహాస్యం చేస్తారు... అట్లాంటప్పుడు మా మానాన మమ్మల్ని వదిలేయవచ్చు గదా !
    అయినా మళ్ళీ మాతోనే కలిసుంటామనే సిగ్గు లేని జన్మలు మీవి !

    రిప్లయితొలగించండి
  10. జేపీపై చెయ్యి చేసుకున్నవ్యక్తిని ఉద్యమకారుడిగా కీర్తిస్తూ ‘నమస్తే తెలంగాణ’ ఆదివారం అనుబంధంలో కీర్తనలా! ఎంతటి దుర్గతి?

    దౌర్జన్యకారులికీ, విధ్వంసకారులకీ, బెదిరించేవాళ్ళకీ ఉద్యమకారుల ముద్ర వేయటం, వాళ్ళను ఆకాశానికెత్తుతూ రాయటం తెలంగాణా ఉద్యమానికి ఎలా ఉపయోగపడుతుందో! ఇలాంటి అపసవ్య ధోరణులను విచక్షణతో గట్టిగా మందలించకుండా ఏమీ పట్టనితనంతో కనిపిస్తున్నారు తెలంగాణా మేధావులు!

    రిప్లయితొలగించండి
  11. అయ్యా ! అజ్ఞాత, 3 జూలై 2011 10:41:00 సా GMT+05:30 గారూ !

    తప్పుచేసినవాడు సిగ్గుపడాలి. సమైక్యవాదులు ఏం తప్పుచేశారని సిగ్గుపడాలి ? ఈ పనికిమాలిన వెధవలంతా తెలంగాణకి అసలైన bonafide ప్రతినిధులా ?

    రిప్లయితొలగించండి
  12. సిగ్గులేని బ్రతుకులు కాబట్టే 'సిగ్గు వుందా!?" అని తెలబాన్లు ఆశ్చర్యంగా పరామర్శించుకోవడం పరిపాటి. ముక్కుటేశ్వరరావుకే సిగ్గుంటే ఫ్లూయిడ్స్ పెట్టుకుని అడ్డంగా పట్టుపడ్డాక కూడా త్యాగాలు చేస్తండం అంటాడా! ఎట్లాగూ సిగ్గులేని జనాలు నమ్ముతారని ఆయన నమ్మకం కాబోలు.

    రిప్లయితొలగించండి
  13. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  14. నా పోస్టును తొలగించడమంటే ఉమ్మితే తుడుచుకొని పోవడమన్నట్టే. సత్యాన్ని దాచి దొంగ నాటకాలాడడమే.

    రిప్లయితొలగించండి
  15. ఆహా! ముక్కుటేశ్వర రావ్ చెంచాలకి తుడుచుకునిపోయేది అలవాటెగా! ఎళ్ళెళ్ళహే, నీ యెంకమ్మా,రోడ్డుమీద వండుకుని తినే వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళే.
    ఆడు ఖతర్నాక్ కాబట్టే బకరాలని ఎలా రప్పించాలో తెలుసు. రోడ్డు మీద ఇంత ఎంగిలి ముద్ద పడేస్తా అనగానే పొలోమని మూగిపోయారు. అదే ఏ రోడ్లు వూడ్చి నిరసన అని ప్రకటించి వుంటే ఒక్కడు వచ్చేవారు కాదు, అక్కడికక్కడే తేలిపోయేది.

    రిప్లయితొలగించండి
  16. అదేరా .. మేం ఉమ్మేది మీతో తెగతెంపులు చేసుకొనేందుకు. మీరు ఉమ్మేది ఆ ఉమ్మిలోనే పొర్లి, దొర్లి, కలిసుందామనే సిగ్గు లేని వ్యాపార ధోరణి. లాభముంటే చాలు.. మానాభిమానాలను వదులుకొనే సిగ్గు లేని పుట్టుకలు మీవి.

    రిప్లయితొలగించండి
  17. కలిసుందాం రా! వేరే దారి లేదు. నకరాల్జేస్తే సోనెమ్మ ఎమర్జెన్సీ పెట్టి కిడ్నీలు తీయించి ఇటలీలో అమ్ముకుంటాది. కామోష్!

    రిప్లయితొలగించండి
  18. డొంక తిరుగుడు మాటలెందుకురా? మేం కాండ్రించి ఉమ్మినా మాతో కలిసుంటామనే సిగ్గు లేని బతుకులు మీవి. అది ఒప్పుకో.

    రిప్లయితొలగించండి
  19. పిచ్చి కుక్కలా ఎక్కువగా మొరిగితే MCH వాళ్ళని పిలిచి బండెక్కిస్తా. కలిసివుండు లేదా మీ గ్రాండ్ ఫాదర్ కాసిం రజ్వి ఆడించినట్టు బత్కమ్మ ఆడించి, కిడ్నీలు తీసి అమ్మేసుకుని, నిన్ను పాకిస్థాన్ పార్సిల్ చేస్తా. :))

    రిప్లయితొలగించండి
  20. మీ ఏడుపులు చూస్తే గుండె తరుక్కుపోతోంది. ఏ కామ్ కర్. నీవు, విశ్వకురూప్, చీమిడిముక్కు ఆచారి, డేర్2క్వెచ్చను, కలిసి బతుకమ్మ ఆడి, విడియో తీసి గుండెగోస బ్లాగులో వెయ్. నీకు తెలంగాణే కాదు, రాయలసీమ, ఆంధ్రా హోల్ మొత్తం రాసిస్తా, చేతనైతే ఏలుకుందురుగాని. వూ జల్దీ, మళ్ళ నా మనసు మారిపోతుంది, అపుడు నే నియ్య. ప్యార్ పుడుతుంది, మళ్ళీ కలిసుందాం రా గంతనే. :))

    రిప్లయితొలగించండి
  21. నేను ఒకే పాయింట్ మీద మాట్లాడుతున్నది నా స్వేఛ్ఛాప్రియత్వాన్ని తెలియజేయడానికి. నీవు బయట పెట్టుకొంటున్నది నీ నిరంకుశ ధోరణిని. ఇప్పుడర్థమయిందా? నిక్కచ్చిగా మాట్లాడేసరికి ఎవరెక్కువ అసభ్యంగా మాట్లాడుతున్నది. ఇకనైనా ప్రజాస్వామ్య హక్కును అర్థం చేసుకొని వాదించు బ్రదర్! గుడ్ బై!

    రిప్లయితొలగించండి
  22. అసలీ వుమ్మిలేసె సంస్క్రుతి ఎంటిరా బాబూ..విదేశాల్లో ఇదే పని చేస్తే fine వేస్తారు. And you people talk a lot of this barbarian habit as your greatest achievement. wah..what culture.

    రిప్లయితొలగించండి
  23. అజ్ఞాత06:40
    అజ్ఞాత06:53
    అజ్ఞాత10:08

    బాగా అడిగారు అగ్నాత గారు. అసలు వీళ్ళకి ఆ కచరా తోక పట్టుకుని నడవడమేగాని, నిబద్ధతలేదండి, లేదు. వీళ్ళకు బతుకమ్మ ఆడాటం రాదు కాని అందరినీ మీకొచ్చా? మీకొచ్చా? అని అడుగుతుంటారు.బతుకమ్మ ఆటా ఆడమని ఆ అగ్నాత అడగ్గానే ఎలా జారుకున్నాడో చూడండి. వుమ్మేసే స్వేచ్చ, రోడ్లమ్మట తినే స్వేచ్చ, విధ్వంశం చేసే స్వేచ్చ, ఫ్రీగా మంది మీద పడి తినే స్వేచ్చ - ఇది వీళ్ళ స్వేచ్చకు అర్థం. సోమరులండి, వుత్త సోమరులు.

    రిప్లయితొలగించండి
  24. ప్రొఫెసర్ అజ్ఞాతా (అజ్ఞాత, 4 జూలై 2011 7:05:00 సా)!
    "ఇప్పుడర్థమయిందా?" అని భలే ప్రశ్నించావు. ఇప్పుడేంటి, ఎప్పుడో అర్థమైంది.
    -నువ్వు మాట్టాడినట్టే అవతలోడు మాట్టాడితే అది వాడి నిరంకుశత్వం. నీది మాత్రం స్వేచ్ఛాప్రియత్వం. ఇదీ తెవాదమంటే.
    -నువు జేస్తే అది ప్రజా ఉద్యమం, నే జేస్తే అది నాటకం. నువు జేసేది విశ్వ కల్యాణం నే జేసేది స్వార్థ రాజకీయం. ఇదీ తెవాదమంటే!
    -నీ మనోభావాలకు అనుగుణంగా నీ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యకపోతే వాళ్ళు సీమాంధ్రుల తొత్తులు. నా ప్రతినిధులు నా మనోభావాలకు అనుగుణంగా రాజీనామా చేస్తే అది వాళ్ళ వ్యాపార ప్రయోజనం. నాకెందుకు తెలీదూ.. తెవాదమంటే ఇదేగా!

    మాటల్లో విషం గక్కి, ప్రజల మధ్య వైషమ్యాలు రగిలించడాన్ని తెవాదం సైద్ధాంతీకరించింది. తెవాదులు అందులో పీహెచ్‍డీలు చేసి డాక్టర్లయ్యారు, ప్రొఫెసర్లయ్యారు, టీవీ వ్యాఖ్యాతలయ్యారు, విశ్లేషకులయ్యారు.

    రిప్లయితొలగించండి
  25. రాజకీయ నేతలందర్ని రాజీనామాలు చేయుండ్రి, రాజీనామాలు చేయుండ్రి అని వీధి కుక్కలాగా బజారు, బజార్న మొరిగే కోదండరాం ఒకటో తారీఖు రాగానే యెళ్ళి జీతం తెచ్చుకుంటాడు. ఇదీ వీళ్ళ బతుకు. తన కొడుకు అమెరికా లో సుఖంగా చదువుకోవాలి. ఇక్కడ పిల్లల బతుకేమో నాశనం చెయ్యాలి. బెబ్బెబ్బె అని మాట్లాడుతాడు, వీడెట్టా ప్రతినిధి అయ్యాడో అర్ధం కాదు.

    రిప్లయితొలగించండి
  26. ఇందులో సిగ్గూ, లజ్జా లాంటి పదాలెందుకో నాకర్థం కాదు.

    కులానికీ, కులానికీ మధ్య ఎన్నో ఉంటాయి. జిల్లాకీ, జిల్లాకీ మధ్య ఎన్నో ఉంటాయి. అలాగే ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య కూడా ఎన్నో ఉంటాయి. You can't choose your neighbours. Similarly you can't choose your fellow Telugus as well. అన్నిటికీ విడిపోవడమే పరిష్కారం కాదు. ఎవఱినైతే దూరం చేసుకోవాలనుకుంటామో వాళ్ళతోనే మనకు భవిష్యత్తులో ఎక్కువ అవసరం ఉంటుంది. ఎన్నున్నా ఒకఱినొకఱు సహించి కలిసుండడమే అన్నిటికీ పరిష్కారం. ఒదే చరిత్ర బోధిస్తున్న గుణపాఠం,

    మనుషులు అజ్ఞానం వల్లా, అవగాహనారాహిత్యం వల్లా పొఱపాట్లు చేస్తారు. ఈ అజ్ఞానం గట్రా ఇతర వ్యక్తుల గుఱించి అయినప్పుడు, వారితో కలిసుండి వారిని సరిగా అర్థం చేసుకోవడమే అది పోయే మార్గం. అది చేయకుండా విడిపోతే అది అసలు సమస్య నుంచి దూరంగా పారిపోవడమే అవుతుంది. అవగాహనకి అడ్డుకట్ట వేయడమే అవుతుంది. ఇండియా-పాకిస్తాన్ ల విషయంలో ఇప్పుడు ఏం జఱుగుతోందో అదే జఱుగుతుంది.

    Telangana is classic case of fear turning into hatred. For some reason I don't know, Telanganites are always afraid of Andhra people from the very beginning, i.e. since 1952. Local politicians have never let go of the opportunity to utilize this fear psychosis to their own advantage.

    I wish to tell them, "Even if you are able to form a separate State, you can not live with this constant fear of Andhras, because, with separate State goes the name Andhra Pradesh. But the Andhra people will be very much there in every sphere of Telangana life as usual."

    రిప్లయితొలగించండి
  27. విడిపోవడం వ్యూహాత్మకంగానూ, సాంస్కృతికంగానూ ఉభయప్రాంతాలకూ చేటు తెస్తుంది. ఈ విషయం విడిపోయాకనే అర్థమవుతుంది. మన మధ్య తేడాలకు అసలు కారణం - మనమ్ కొన్నిదశాబ్దాల పాటు ఒకే ప్రభుత్వపు ఏల్బడిలో లేకపోవడం అని అందఱికీ తెలుసు. తెలిసీ, మళ్ళీ వేఱేవేఱు ఏలబడుల్ని ఎంచుకుంటే మనం ఇంకా ఇంకా దూరమవుతాం తప్ప దగ్గఱ కాలేం. ఇప్పుడు ఒకే ప్రభుత్వం కింద ఉండటం చేత మన చదువుల్లోనూ, చట్టాల్లోనూ, సంస్కృతిలోనూ ఏకరూపత (uniformity) ఏర్పడుతోంది. కాబట్టి మంచికైనా, చెడుకైనా ఇద్దఱమూ ఒకే స్థాయిలో ఉన్నాం. విడిపోతే వీటిల్లో ఏదో ఒక ప్రాంతం కనీసం ఏవో కొన్ని విషయాల్లో వెనకబడి పోతుంది. ఉదాహరణకు - ఒక ప్రాంతంలో తెలుగుని అధికారభాషగా పూర్తిస్థాయిలో అమలుజఱుపుతూ రెండో ప్రాంతంలో అలా జఱక్కపోతే ఇద్దఱికీ ఇబ్బందే ఎదురవుతుంది. అప్పుడు ఆ రెండో ప్రాంతాన్ని మొదటి ప్రాంతంలో సమానం చేయడానికి కృత్రిమమైన ఉద్యమాలు లేవదీయాల్సి వస్తుంది. ఇదంతా అవసరమా ? ఇదంతా రెట్టింపు రిస్కు, రెట్టింపు శ్రమ.

    ఇప్పుడు ఏ కష్టమొచ్చినా రాష్ట్రానికంతటికీ వచ్చినట్లు భావిస్తున్నాం. కనుక ఆ కష్తనష్టాలు కలిగించే వర్గాలు కాస్తో కూస్తో మనల్ని చూసి ధైర్య్తంగా అడుగు ముందుకేయడానికి భయపడుతున్నాయి. ఱేపు విడిపోతే పక్కప్రాంతంలో ఒక ప్రత్యేక పాలసీ వల్ల జనం కష్టపడుతున్నారనీ తెలియదు. అది ఱేపు తమక్కూడా చుట్టుకోవచ్చుననీ తెలియదు.

    ఎన్ని అభిప్రాయాభేదాలున్నప్పటికీ, ఒకఱిలో ఒకఱికి కొన్ని నచ్చనప్పటికీ ఈ కాలంలో మనం కలిసే ఉండాలి. వేఱేవేఱు రాష్ట్రాలుగా ఉన్న ప్రాంతాలు వేఱువేఱు విజాతీయ శక్తుల ప్రభావానికి లోనవుతాయి. వాళ్ళు మన తెలుగుజాతితో యథేచ్ఛగా రాజకీయాలాడుకోవడానికి మనం ఉపయోగపడతాం. వేఱువేరు విదేశీశక్తులకు రణరంగంగా, ప్రయోగశాలగా ఈ గడ్డ ఉపయోగపడుతుంది.

    ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఈ అంశాలు ఆంధ్రా ఏరియా జనానికి ఇప్పటికే తెలుసు. కానీ దురదృష్టవశాత్తూ తెలంగాణలో అంతగా తెలియదు.

    రిప్లయితొలగించండి
  28. తాడేపల్లి గారు,

    మీ రె౦డు వ్యాఖ్యలు వ్యాఖ్యలు బావున్నాయి.పాకిస్తాన్ ఉదాహరణ చక్కగా ఉ౦ది. ఇప్పుడు పోట్లాడుకోని విడిపోయి ఇ౦డియా పాకిస్తాన్ లా ఉ౦డాల్సిన పరిస్థితి రాకు౦డా చూడాల్సిన బాధ్యత ఇద్దరి పైనా ఉ౦ది.

    @For some reason I don't know, Telanganites are always afraid of Andhra people from the very beginning, i.e. since 1952.

    నిజానికి ఇద్దరిదీ తప్పులేదు కాని వారి భయ౦ లో అర్ధ౦ ఉ౦ది. వారిని కలుపుకు పోవాల్సిన అవసర౦ సీమా౦ధ్రులకు రాలేదు. మీరేమ౦టారు?

    రిప్లయితొలగించండి
  29. చదువరి గారూ బాగా చెప్పారు.
    మీలాగే నాక్కూడా .. అడ్డమైన డ్రామాలూ ఆడి, ఒక్కొక్కరితో ఒక్కో రాజకీయం నడిపి, అవన్నీ బయటపడిపోయినా సిగ్గులేకుండా బ్లాగులమీదపడి ఎవడూ సరిగ్గా రిసీవ్‌ చేసుకోకపోయినా .. అన్నీ తెలిసి, అన్ని సమస్యలనీ పరిష్కరించే మెధావిలాగా అడ్డమైన కామెంట్లు రాసే మనుషులని చూసి --- "సిగ్గుందా" ------ అని అడగాలనుంది

    రిప్లయితొలగించండి
  30. చదువరిగారికి మనవి.

    ఆర్యా ! తమ పేరూ, గుర్తింపూ తెలియకుండా జాగ్రత్తపడుతూ ఇతరులపై మాత్రం దూషణలనూ, కసినీ వెళ్ళగ్రక్కుతూ వ్యాఖ్యలు వ్రాసే ముసుగువీరులు మిగతా వ్యాఖ్యాతల మీద ఒక అన్యాయమైన అడ్వాంటేజిలో ఉంటారు. అటువంటి మానసిక రోగులకు ఆ అడ్వాంటేజి, అవకాశం ఇవ్వకుండా మీ బ్లాగులో అజ్ఞాతవ్యాఖ్యల సౌకర్యాన్ని తీసేస్తే బావుంటుందేమో దయచేసి ఒకమారు ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  31. తెలంగాణవాళ్ళని ఆంధ్రావాళ్ళు కలుపుకు పోలేదు అంటే అది ఉన్న అపోహలకు ఇంకో కొత్త అపోహని అదనంగా జతచేయడం అవుతుందేమో చూడండి. కోస్తావారికి రాయలసీమవారి మీద ఫిర్యాదులు లేవు. రాయలసీమవారికి కోస్తావారి మీద ఫిర్యాదులు లేవు. ఈ ఇద్దఱికీ తెలంగాణవారి మీద ఫిర్యాదులు లేవు. కానీ తెలంగాణవారికి అందఱి మీదా ఫిర్యాదులున్నాయి. అంటే దీనర్థం ఏంటి ? పొఱపాటు ఎవఱి దగ్గఱుందో ఆలోచించండి.

    ప్రజాస్వామ్యంలో ఒకణ్ణి ఇంకొకడు బాగుచెయ్యడు. ఎవణ్ణి వాడు బాగు చేసుకోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఒకణ్ణి ఇంకొకడు అణగద్రొక్కడు. అణిగిపోయే పరిస్థితిని ఎవడికి వాడు తెచ్చుకుంటాడు. అంటే ఇక్కడ ఆత్మహత్యలే తప్ప హత్యలుండవు. అలా చూడండి తెలంగాణ వెనకబాటుతనాన్ని !

    రిప్లయితొలగించండి
  32. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం: "అటువంటి మానసిక రోగులకు ఆ అడ్వాంటేజి, అవకాశం ఇవ్వకుండా మీ బ్లాగులో అజ్ఞాతవ్యాఖ్యల సౌకర్యాన్ని తీసేస్తే.." -అసలు ఎప్పుడో చేసి ఉండాల్సింది. ఇప్పుడు చేసాన్సార్.

    రిప్లయితొలగించండి
  33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  34. తాడేపల్లి గారు,

    //తెలంగాణవాళ్ళని ఆంధ్రావాళ్ళు కలుపుకు పోలేదు అంటే అది ఉన్న అపోహలకు ఇంకో కొత్త అపోహని అదనంగా జతచేయడం అవుతుందేమో చూడండి. కోస్తావారికి రాయలసీమవారి మీద ఫిర్యాదులు లేవు. రాయలసీమవారికి కోస్తావారి మీద ఫిర్యాదులు లేవు. ఈ ఇద్దఱికీ తెలంగాణవారి మీద ఫిర్యాదులు లేవు. కానీ తెలంగాణవారికి అందఱి మీదా ఫిర్యాదులున్నాయి. అంటే దీనర్థం ఏంటి ? పొఱపాటు ఎవఱి దగ్గఱుందో ఆలోచించండి.//

    ఆర్యా ఇద్దరిదీ తప్పులేదు అని చెబుతూనే నా అభిప్రాయాన్ని తెలియపరిచాను. ఈ సమయ౦లో సమైక్య౦ కోస౦ వాది౦చే ప్రయత్న౦ ఫలి౦చాల౦టే, సమస్యమూలాలను తెలిసికోడ౦ కూడా అవసరమే కదా.

    దళితులకే అ౦దరిమీదా ఫిర్యాదులున్నాయి మరి. కారణ౦ వారి వెనకబడ్డ పరిస్తితులు. అలాగే ఒకప్రా౦త ప్రజలపై నా అభిప్రాయమూ.

    రిప్లయితొలగించండి
  35. క్షమించాలి. మీకందిన సమాచారం వాస్తవం కాదేమో మౌళిగారూ ! రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ లోకల్ కోటా, నాన్-లోకల్ కోటా రెండూ ఉన్నాయి. లోకల్ కి 85 శాతం, నాన్-లోకల్ కి 15 శాతం రిజర్వేషన్ ఉంది.

    రిప్లయితొలగించండి
  36. @LBS తాడేపల్లి గారు ,నా మొదటివ్యాఖ్య ని రిమూవ్ చేసి మరల వ్రాసాను.కాని డిలీట్ అవ్వలేదు అనుకు౦టాను.

    రిప్లయితొలగించండి
  37. ఒకసారి,తెలంగాణావాది(ఎవరో మీకు తెలుసు.ఇక్కడ వ్యక్తిగత ప్రస్తావన ముఖ్యం కాదు) ఒక T.V.ఇంటర్వూ లో ఇలా అన్నాడు."1956 నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు"అని.

    నిజానికి 1956 నవంబర్ 1 కి ముందు తెలంగాణా రాష్ట్ర మనేది ఏదీ లేదు.నిజాం పాలన లో "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం" 1948 సెప్టెంబర్ 17 పోలీస్ చర్య తరువాత ఇండియన్ యూనియన్ లో విలీనమైంది.అప్పటి నుండి 1956 నవంబర్ 1 న భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేవరకు హైదరాబాద్ ఒక రాష్ట్రంగా కొనసాగింది. అప్పటి "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం"లో "8 జిల్లాలు గల తెలంగాణా ప్రాంతం(తరువాత 1978 లో రంగారెడ్డి,హైదరాబాద్ 9,10 వ జిల్లాలుగా ఏర్పడ్డాయి)" ఒక భాగం మాత్రమే.విలీనం తరువాత 1950 వరకు జనరల్ J.N.Chowdary సైనిక పాలన కొనసాగింది.తరువాత హైదరాబాద్ రాష్ట్ర తాత్కాలిక Civil Administrator గా M.K.Vellodi 1950 జనవరి 26 న భారత ప్రభుత్వం చే నియమింపబడ్డారు.1952 లో తొలి సారత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు గల హైదరాబాద్ రాష్ట్రం లో 93 సీట్లు గెల్చుకొన్న కాంగ్రెస్ పార్టీ,బూర్గుల రామకృష్ణా రావు CM గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.1955 లో 1st State Reorganisation Commission హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి కన్నడం మాట్లాడే 3 జిల్లాలని కర్ణాటక లో,మరాఠా మాట్లాడే 5 జిల్లాలని మహరాష్ట్ర లో కలిపి మిగిలిన "8 జిల్లాలు గా గల తెలంగాణా ప్రాంతాన్ని" ప్రత్యేక రాష్ట్రంగా గాని లేక అప్పటికే ఒక రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో గాని కలపవచ్చు అని సిఫార్సు చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోసం కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణం లో తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం పక్కనే తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రం చేయడంలో అర్థం లేదు.అలాగని అప్రజాస్వామికంగా కలుపలేరు కాబట్టి 1955 డిసెంబర్ లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం పెట్టగా హాజరైన 147 మందిలో 103 మంది తెలంగాణాను ఆంధ్ర రాష్ట్రం లో కలుపమని, 29 మంది వద్దని వాదించారు. 15 మంది తటస్థంగా ఉన్నారు.ఆ తరువాత కూడా తెలంగాణావాసుల అపోహలు తీరుస్తూ 1956 ఫిబ్రవరి 20 న పెద్దమనుషుల ఒప్పందం(Gentlemen's Agreement ) చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా కు ప్రత్యేక హక్కులు,రాయితీలు కల్పిస్తామని ఆంధ్రనాయకులు హామీ ఇచ్చారు.దాంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఆ "8 జిల్లాల తెలంగాణా ",ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడానికి మార్గం సుగమమైంది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసారు.
    ఔరంగాబాద్,బీడ్,నాందేడ్, పర్భాని ,ఉస్మానాబాద్ అనే 5 జిల్లాలను మహరాష్ట్ర లో(అప్పటికి దాన్ని బోంబే రాష్ట్రం అనేవారు) కలిపారు.
    బీదర్,గుల్బర్గా,రాయచూర్ అనే 3 జిల్లాలను కర్ణాటక లో కలిపారు.
    "మిగిలిన 8 జిల్లాల తెలంగాణా"ను అప్పటి ఆంధ్రరాష్ట్రంతో కలిపి 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసారు.పై మార్పులన్నీఒకేసారి చేసారు.కాబట్టి తెలంగాణాను హైదరాబాద్ రాష్ట్రం నుండి వేరు చేయడం, ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం రెండూ ఒకేసారి జరిగాయి.అంటే కనీసం ఒక్క రోజు కూడా తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గాని,కనీసం ప్రత్యేక పరిపాలనా విభాగం గా గాని చరిత్ర లో ఎప్పుడూ లేదు.మరి ఇప్పుడు తెలంగాణావాదులు అన్నట్టు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం"ఒక్క ఇంచ్ కూడా" కోల్పోకుండా కావాలంటే మహరాష్ట్ర ని, కర్ణాటక ని కూడా అడగాలి.అడిగితే బాగుండేది వాళ్ళని "ఒక్క ఇంచ్ కోల్పోకుండా కావాలని ".అప్పుడు ఒక్క పంచ్ కూడా వేస్ట్ అవకుండా కుమ్మేస్తారు వాళ్ళు.అసలే ఆ రాజ్ ధాకరే మంచోడు కాదు

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు