2, జులై 2011, శనివారం

ఉద్యమ నాటకంలో మరో అంకం

తెవాదు లాడుతున్న తెలంగాణ ఉద్యమ నాటకంలో మరో అంకానికి తెరలేచింది. ఈసారి ప్రధాన నటులు తెవాద కాంగీయులు. సహ నటులు తెవాద తెలుగుదేశీయులు. జూలై నాలుగున ఎంపీలు, శాసనసభ్యులు, మంత్రులూ - అందరం  రాజీనామాలు చేసిపారేస్తామని కాంగీయులు ప్రకటించారు. తెవాద తెదేపా నాయకులు తందాన అని గంతులేసారు. తెరాస నాయకులు గుడ్ గుడ్ మంచిగ నటించిన్రు అని మెచ్చుకున్నారు.

రాజీనామాల సంగతిని ఎంతో గొప్పగా ప్రకటించిన గంటల్లోనే గులామ్ నబీ ఆజాదు వీళ్ల గాలి తీసేసాడు.. తెలంగాణ సమస్య దేశంలోని ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉంది. రాష్ట్రం లోని మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో తొందర పనికిరాదు, రాజీనామాలు చెయ్యడం సరైన పద్ధతి కాదు అని అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏడిశార్లే నాటకాలాపండి అని చెప్పకనే చెప్పినట్టు. అసలు ఆజాదు హై.కి రావడం ఈ ముక్క చెప్పడం కోసమే లాగుంది. దళిత క్రైస్తవుల సభ అనేది వంక అనుకుంటాను.

ఆజాదు చెప్పాడంటే అది కాంగ్రెసు హైకమాండు చెప్పినట్టే.  హైకమాండు ఇప్పుడీ మాట చెప్పిందీ అంటే ఇంతకు ముందు రాష్ట్ర నాయకులు ఢిల్లీ వెళ్ళినపుడు కూడా అదే మాట చెప్పి ఉండాలి. మరి రాజీనామాలు చేసేందుకు ఇన్నాళ్ళు ఎందుకు పట్టినట్టు? నిజానికి ఆజాదు చెప్పిన ముక్క విన్నాక ఈ నాయకులంతా తమ పదవులకే కాదు, కాంగ్రెసు పార్టీకే రాజీనామా చేసెయ్యాలి, వాళ్ళకు నిబద్ధత ఉంటే.

ఇంతకీ రాజీనామాలు ఎలా చేస్తారంటా..? ’తెలంగాణ ఇవ్వండి లేదా రాజీనామాను అంగీకరించండి అని రాస్తాం’ అని పొన్నం ప్రభాకరు చెప్పాడు. అంటే గతంలోని వివిధ రాజీనామాల నాటకాల్లో జరిగినట్టు  ఈసారి కూడా రాజీనామాలు ఆమోదం పొందకుండా జాగర్త పడుతున్నారు బహుశా.

జూపల్లి పాదయాత్ర నాటకం అర్ధంతరంగా ముగిసింది. మూడో తేదీన నాగం దీక్ష నాటకం. (ఈ రాజీనామాలతో పాపం ఈ నాటకం రెండో పేజీకి పోయింది). నాలుగో తేదీన కాంగీయుల రాజీనామా నాటకం. ఇందులో తెదేపా వాళ్ళు కూడా పాల్గొంటారట. పదో తేదీన మళ్ళీ వీధివంటల నాటకం చేస్తారని నిన్నో ఇవ్వాళో విన్నాను. ప్రస్తుత సీజన్లో నాటకాల టైమ్ టేబులిదీ.ఈ నాటకాలన్నీ ఒక పెద్ద ఉద్యమ నాటకంలో అంకాలుగా కూడా చెప్పుకోవచ్చు.

అసలీ నాటకాలు ఈ నాటివేమీ కావు. గత పదేళ్ళుగా తెరాస ఆడుతున్న నాటకాలతో పోలిస్తే ఇవేమంత గొప్పవీ కావు! ఓ పక్కన ఈ నాటకాలు ఇలా ఆడుతూ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూనే, మరోపక్క సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల ఉద్యమం కాదు డబ్బులిచ్చి చేయించిన ఉద్యమం అని చెబుతుంటా రీ గురివిందగింజలు. అబద్ధాలు చెప్పీ, ’ఆంద్రోళ్ల’ను తిట్టీ, తెలంగాణ ప్రజలను ఎంత సులువుగా రెచ్చగొట్టారో, నాటకాలాడి అంతే అవలీలగా వాళ్ళను వంచిస్తున్నా రీ తెవాదులు.

11 కామెంట్‌లు:

  1. యాహూ తెలుగ్‌ చదివినట్టున్నారు చదువరి గారు కానీ ..తప్పు పొరపాటు పడుతున్నారు.
    ఈ నాటకంలో పాత్రధారులు కాంగీయులు, తెరాసీయులు. తెలుగుదేశానికి ఏ పాత్రా లేదు. తెలుగుదేశాన్ని ఉద్యమంలో కలుపుకుపోవడం లేదు మీరు జాగ్రత్తగా గమనిస్తే.
    మళ్ళీ డిసెంబరు సీను రిపీట్‌ ఔతోంది. డిసెంబరు 24 న ఇలాగే ముక్కొడు జానారెడ్డి ఇంటికిపోయి మంతనాలాడొచ్చాడు. ఆతర్వాత జరిగిన విధ్వంసం 24 బస్సులు తగలబడ్డాయి ఒక్కరోజులో. 2 సంవత్సరాల తర్వాత మొన్న తెలంగాణ బాపూజీ ప్రొఫెసరు జయసనకర సారు (అమరుడు) పోయినప్పుడు హరీష్‌ రావు ఇచ్చిన స్టేట్‌ మెంటుకి మనకి మొత్తం అర్ధమైంది. డిశెంబరు సంక్షోభాన్ని కాంగ్రెసు, తెరాస కలిపే సృష్టించాయని.
    మళ్ళీ అదే సీను రిపీటు, అదే అదే .. వీళ్ళు ఎంత బెట్టుచేస్తే అంత వాల్యూ పెరిగిద్ది జనాల్లో, మన చంద్రబాబు వెంగళప్ప అవుతాడు. అదే ప్లాను .. ఏదో కుట్ర తప్పకుండా ఉంది.. ఒక వారం రోజుల్లో క్లారిటీ వస్తుంది

    రిప్లయితొలగించండి
  2. లేదండి, నేను యాహూ చూళ్ళేదు. ఆజాదు చెప్పింది చూసి రాసాను.

    తెదేపాను వీళ్ళు కలుపుకుపోతున్నారని నేను అనలేదు. మీరు రాజీనామా చేస్తే మేమూ చేస్తాం అని తెదేపా వాళ్ళే ప్రకటించారు - దాని గురించి రాసాను.

    రిప్లయితొలగించండి
  3. miikenduko anta vuluku.
    miiru maatram emiti teda.
    asalu samaikyatha ante emito okka post kudaa veyaru. Raajakiyanayakulu emaina maatladina ventane vastaru.

    రిప్లయితొలగించండి
  4. తెలంగాణ జాతిపిత మండేలా బాపూజీ సిద్దాంతకర్త మంచి విద్యావేత్త విఙ్ఞుడూ సహాయశీలీ మంచిగడుసరీ సరస సంభాషణా చతురుడు అయిన మన రిటైర్డ్‌ ప్రొఫెసర్‌, జయ సంకరు సారు (అమరుడు)

    రిప్లయితొలగించండి
  5. "Raajakiyanayakulu emaina maatladina ventane vastaru."

    "miikenduko anta vuluku"

    ------
    మరి ఈ బ్లాగరు టపా వేయగానే మీకెందు ఉలుకు :)

    టపా వేయగానే తమరు వచ్చి కామెంట్ పెట్టగా లేనిది, తెలంగాణా గుండెచప్పుడు వినిపించి, దానిని ఉద్దరించే మఖానుభావులు, తెలంగాణా లీడర్లు, (కామెడీ) యాకటర్లు మీద బ్లాగరు టపా వెస్తే తప్పా!!!


    ఇంతకీ వంటా వార్పూ కు పాత్రలు రెడీ చేసుకొంటున్నారా?
    దొర గారి హుకుం లు , ఫత్వాలు అమలు చేయటం లో బిజీ గా ఉండక ఎదో తన దృష్టిలో జరుగుతున్న కామేడీ సీరియల్ మీద టపా వేసిన వాళ్ల మీద ఈ అక్కసు వెళ్లగక్కటం ఎందుకు బాసూ?

    రిప్లయితొలగించండి
  6. ఏనాడో 1969 లోనే ముగిసిపోయిన ప్రత్యేక తెలంగాణ గొడవలు ఇలా ఇన్ని దశాబ్దాల తరువాత విజృంభించడం చూస్తూంటే నాకొక కథ జ్ఞాపకం వస్తోంది.

    వెనకటికి నలుగుఱు పనిలేని మంత్రగాళ్ళు అడవిలో వెళుతూ అక్కడ చచ్చిపడున్న సింహపు అస్థిపంజరం చూసి "దీన్ని మన మంత్రబలంతో బతికిస్తే ఎలా ఉంటుంది ?" అని ఆలోచించుకున్నారట. వాళ్ళల్లో ఒకడు దానికి రక్తమాంసాలిచ్చాడట. ఇంకొకడు చర్మమూ, జూలూ సమకూర్చాడట. మఱొకడు ప్రాణం పోశాడట. వీడు ప్రాణం పోస్తూండగా నాలుగోవాడికి అనుమానం వేసింది "ఇదేదో చాలా ప్రమాదకరమైన పనిలా ఉందిరా బాబో!" అని ! అంతటితో వాడు ఏమీ చెయ్యకుండా పారిపోయి చెట్టెక్కేశాడు, ఆ సింహం ప్రాణం పోసుకుని లేచి, జూలు విదుల్చుకుని, గర్జించి ఆ ముగ్గుఱినీ మీద పడి, చంపి, తినేసి తన దారిన తాను చక్కా పోయింది. ఆ తరువాత ఆ అడవిలో ఇంకా ఎన్నో జీవాల్ని యథాప్రకారం చంపడం మొదలుపెట్టింది.

    మన కథలో ఈ పనిలేని (బుద్ధిలేని) మంత్రగాళ్ళు నలుగుఱు. ఒకడు కేసీయారు. రెండోది బి.జె.పి. మూడోది - సి.పి.ఐ. నాలుగోది కాంగ్రెస్సు. చచ్చిపోయిన సింహాన్ని బతికించాక దాన్ని చూసి కాళ్ళల్లో వణుకు పుట్టింది ఈ నాలుగోవాడికే ! ఒకసారి బ్రతికించాక దాని బారి నుంచి ఎలా తప్పించుకోవాలో వాళ్ళకు అర్థం కాక కొట్టుమిట్టాడుతున్నారు. పక్షాంతరంగా అది ఏదో ఒకరోజున తమకు గంగిగోవులా మచ్చికవుతుందని లోలోపల తెగ ఆశపడుతున్నారు - అది సహజంగా క్రూరమృగం అని మర్చిపోయి ! ఆ సింహం దెబ్బకి ఇప్పటికే వందలాదిమంది చనిపోయారు. మలిదశలో ఈ ఉద్యమం ఈ పై ముగ్గుఱినీ వచ్చే సంవత్సరం మ్రింగబోతోంది. నాలుగోవాడు మాత్రం జగన్ అనే చెట్టునెక్కి ఎలాగో బయటపడే అవకాశం ఉంది.

    వీళ్ళని చూస్తే ఇంకో ఎన్నో గుర్తొస్తాయి.

    ఒకడు ఒకచోట భూస్థాపితం చేసిన డబ్బాని త్రవ్వి తీసి తెఱిచాడట. అందులోంచి ఒక రాక్షసుడు బయటికొచ్చాడు. "నాకేదైనా పనిచెప్పు. ఒక్క క్షణ ఖాళీగా ఉంచినా నిన్ను చంపి తినేస్తా"నన్నాడట. వాణ్ణుంచి కాపాడుకోవడం కోసం వీడు ఏదో ఒక పని చెబుతూనే ఉన్నాడు. చిత్రంగా ఆ రాక్షసుడు ఎంత కష్టసాధ్యమైన పనిచ్చినా క్షణాల్లో ముగించిపారేసి మళ్ళీ వచ్చి "పని చెప్పు" అని ముందుకొచ్చి నిలబడుతున్నాడు. ఈ ఉద్యమమే ఆ రాక్షసుడు. వీళ్ళు ఎప్పటికప్పుడు ఇలా ప్రజల మధ్య వ్యర్థమైన ప్రాంతీయద్వేషాల్ని రగుల్కొల్పుతూనే ఉండాలి. లేకపోతే ఈ ఉద్యమం వాళ్ళని చంపి కసాపిసా కోసి కఱకఱా వేపుకుని తింటుంది.

    రిప్లయితొలగించండి
  7. ప్రతీ దౌర్భాగ్యుడూ తెలంగాణ గుండెచప్పుడుని అవమానిస్తూ కాకమ్మ కధలు చెప్పేవాడే.

    రిప్లయితొలగించండి
  8. తాడేపల్లి గారి కథ అచ్చంగా ఈ ఉద్యమాన్ని చూసే పుట్టినట్టు ఎంచక్కా ఉంది!

    రిప్లయితొలగించండి
  9. తాడేపల్లి గారూ, మీరు చెప్పిన కథలు తెవాదులకు చక్కగా సరిపోతాయి. మరీ ముఖ్యంగా ఆ రెండో కథ ఉందే అది అతికినట్టుగా సరిపోతుంది.

    "అజ్ఞాత, 2 జూలై 2011 11:49:00 ఉ GMT+05:30: తెలంగాణ గుండెచప్పుడు సంగతేంటోగానీ నీది మాత్రం తెవాదుల ట్రేడ్ మార్కు దుర్భాష.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు