19, మే 2011, గురువారం

సానుభూతి గెలిచింది

జగను గెలిచాడు. సానుభూతి గెలిపించింది. తండ్రి చనిపోయాడన్న సానుభూతిని ఆధారం చేసుకుని జగను గెలిచాడు. సానుభూతితో పాటు ఈ గెలుపుకు తోడ్పడిన కారణాలు ఇంకా కొన్నున్నాయి. అవి:

ఎక్కువ ప్రజాభిమానం కొనుక్కోవడం చేత: అందరూ వోట్లను కొనజూసినవారే. కానీ జగను పద్ధతి వేరు.. తనవాళ్లనే కాదు, తనకు ఖచ్చితంగా వోటెయ్యరు అని అనుకున్నవాళ్ళకు కూడా డబ్బులిచ్చాడంట, మనసు మారితే వేస్తారేమోనని. తండ్రి చాటున రాష్ట్రాన్ని దోపిడీ చేసి పోగు చేసుకున్న డబ్బుల్లో ఆఫ్టరాల్ ఈ ఖర్చొక లెక్ఖా!
అవతలోళ్ళు పెద్ద చవటలవడం చేత:  ప్రచారం చేసిన ప్రత్యర్థులెవరూ కూడా ప్రభావశీలంగా పనిచెయ్యలేదు. తమ సాంప్రదాయిక వోటు బ్యాంకును కూడా పొందలేక చతికిల బడ్డారంటే అర్థమౌతుంది వాళ్ళెంత చవటలో! కనీసం - ’నా ప్రత్యర్థులంతా కలిసిపోయి, నాపై కుట్ర చేసి, మ్యాచి ఫిక్సింగుకు పాల్పడ్డారం’ టూ జగను చేసిన ఆరోపణలను సమర్ధంగా తిప్పి కొట్టడం కూడా చెయ్యలేకపోయారు. 
అవతలోళ్ళు ఎక్కువ తిట్టడం చేత: మిగతా వాళ్ళ ప్రచారం ఎక్కువగా జగనుపై విమర్శలే ప్రధానంగా జరిగింది. ముందే సానుభూతి గాలి వీస్తూండడంతో ఈ విమర్శలు జగనుపై సానుభూతిని మరింత పెంచాయి.
జగను ప్రజలను తనకనుకూలంగా రెచ్చగొట్టడం చేత: చూసారా.. నన్ను, మా అమ్మనూ ఇలా అవమానించారు, నాన్నను మర్చిపోయారు, మా కుటుంబాన్ని చీల్చారు, కడపంటే లెక్ఖలేదు, ఇక్కడికొచ్చి మనమీద మీసాలు దువ్వి, తొడకొడుతున్నారు అంటూ జనాన్ని తనకనుకూలంగా రెచ్చగొట్టాడు.
అవతలోళ్ళు కూడా జగనుకే అనుకూలంగా ప్రజలను రెచ్చగొట్టడం చేత: అక్కడ తొడగొట్టిందీ, మీసాలు మెలేసిందీ, మీ సంగతి చూస్తా అన్నదీ జగన్ను కాదు తమనే అని జనం అనుకున్నట్టున్నారు. జగను ఆత్మగౌరవం కాస్తా కడప ఆత్మగౌరవంగా మార్చడంలో తమవంతు కృషి చేసారు వీళ్లంతా కలిసి.
అవినీతిని ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడం చేత: జగను అవినీతి గురించి జనం పట్టించుకోలేదు. ఎవడు తక్కువలే అనే ఉదాసీనత ఉండి ఉండవచ్చు. లేదా సానుభూతి అవినీతిని మింగేసి ఉండొచ్చు.
మిగతావాళ్ళ కంటే ఎక్కువ సామాజిక వర్గాలు జగను వెంట ఉండడం చేత:  అది అన్నిటికంటే ముఖ్యమైనది. వివిధ కులాల, మతాల జనం జగను వెంట మూకుమ్మడిగా నడచినట్టు అనిపిస్తోంది. ఉదాహరణకు, జగనుకే వోటెయ్యాలంటూ క్రైస్తవ సంఘాలు ఎన్నికలకు రెండు రోజుల ముందు ప్రదర్శన చేసాయి. వాళ్ళు ఇంత బహిరంగంగా ఏదైనా పార్టీకి ప్రచారం చెయ్యడం గతంలో ఎప్పుడు చూసాం?

కర్ణుడి చావుకున్నట్టుగా ఇలా అనేక కారణాలుండడం చేత జగను ఇంత బాగా గెలిచాడు. అయితే..

సానుభూతి అనేది ఎక్కువ సార్లు ఉపయోగపడేది కాదు. సాధారణంగా అది ఒక్కసారికే పనికొస్తుంది. ఈ ఎన్నికల్లో తండ్రి మరణం పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతిని ఖర్చుపెట్టేసుకున్నాడు, జగను. భవిష్యత్తు ఎన్నికల్లో గెలవాలంటే ఇక అది అంతగా పనిచెయ్యక పోవచ్చు. సానుభూతి లాగా దోచుకున్న డబ్బు తరిగిపోయేది కాదు కాబట్టి జగనుకు దిగుల్లేదు; ఇకముందు అచ్చం డబ్బుమీదే ఆధారపడొచ్చు.
--------------------------
ఈ ఎన్నికల తరవాత ఒక్కో నాయకుడి ఆలోచనలెలా ఉండి ఉండొచ్చూ..
జగను: డబ్బుతో వోట్లు కొనేసానంటూ నామీద ఆరోపణలు చేసేస్తున్నారు. చాటుమాటుగా కొన్నాననే గదా ఈ ఆరోపణలు.. వీళ్ళ నోళ్ళు శాశ్వతంగా మూయించేస్తాను. ఈసారి ఎన్నికల నాటికి ఒక దిట్టమైన మనీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను ఏర్పాటు చేస్తాను. సందూర్ ఎలక్షన్ వెంచర్స్ అనే కంపెనీ ఒకదాన్ని పెడతాను. అందులో వోటర్లందరికీ వాటా ఇచ్చి, ఎన్నికల ముందు ఒక్కో వాటాదారుడికీ రెండు వేల రూపాయల డివిడెండు పడేస్తాను. ఎవడేం పీకుతాడో చూస్తాను.
చంద్రబాబునాయుడు: రాశేరె లేడు, ఇక కడపలో ధైర్యంగా పోటీ చెయ్యొచ్చనుకుంటే ఇప్పుడు జగను తయారయ్యాడు నా ప్రాణానికి. అటు చూస్తే తెలంగాణ, ఇటు చూస్తే జగను -ఏం చెయ్యాలి చెప్మా!!?
డీయెస్సు: చిరంజీవేదో పొడిచేస్తాడనుకుని అతణ్ణి ముందు పెట్టుకోని యుద్ధం చేద్దామని అన్నాను. తీరా చూస్తే డిపాజిట్టు రాలేదు సరిగదా.. ఆ కోడిగుడ్ల సొన కడుక్కోడానికి సబ్బు, షాంపూలంటూ అతడు పెట్టిన బిల్లు తడిసి మోపెడైంది. లక్కీగా ప్రచారం సమయానికి నాకు కళ్ళ కలక వచ్చింది కాబట్టి అటేపు పోకుండా బైట పడ్డాను. రేపు ఢిల్లీకి పోయి అమ్మగారిని కలిసేరోజుకి చెముడొస్తే బాగుణ్ణు - మీరు అంటున్న వేమీ వినబడ్డం లే దమ్మగారూ అని చెప్పెయ్యొచ్చు.
కిరణ్ కుమార్ రెడ్డి: మంత్రులందర్నీ కడప పంపిస్తే అక్కడ రెండు వారాల పాటు ఎంజాయి చేసొచ్చి, అలిసిపోయాం అంటూ వారం రోజులు లీవులు తీసుకున్నారు. తీరా చూస్తే డిపాజిట్టు కూడా రాలేదు. ఏమన్నా అందామంటే రాజీనామా నా మొహాన కొట్టేట్టున్నారు. నాక్కూడా ఏ కళ్ళకలకో వస్తే బావుండేది, ఆ కారణంగానే ఓడిపోయామని చెప్పేసేవాణ్ణి.
మేడమ్మ: చిరంజీవి తోకను పట్టుకుని కడపను ఈదుదామనుకుంటే ఇట్టా మునిగామేంటబ్బా? ఇక ఆ చిరంజీవి ఏడ్చి మొత్తుకున్నా సరే, విలీన సభకు చస్తే పోను! ఇంతకీ, అసలా డీయెస్సేడీ?ఎవరక్కడ.., డియెస్సును రమ్మనమని కబురు పెట్టండి.
      ఎవరక్కడ (కబురెట్టినవాడు): మేడమ్, డీయెస్సుకు ఢిల్లీ వాతావరణం అంటే అలర్జీ వచ్చేసిందంట, ఢిల్లీ పోనే పోవద్దని డాక్టరు చెప్పాడంట. అంచేత రాడంట.
చిరంజీవి: ఏంటో ఖర్మ! అన్నేసి గుడ్లూ చెప్పులూ విసిరారే... వాటిల్లో సగం వోట్లు విసిరి ఉన్నా డీయెల్ కు డిపాజిట్టు దక్కేది గదా, ప్చ్!  ఇంతకీ ఇపుడు నా గతేమిటి, నా విలీనం సంగతేమిటి చెప్మా?
కాంగ్రెసులో ఉంటూ కాంగ్రెసు’తో’టే ఉన్న నాయకులు: ’పార్టీని ముందుకు నడిపించే నాయకుడు ఇక లేనట్టే. జగనుతోటి కలిసిపోవాల్సిన ఖర్మ మనకూ తప్పదా!?’
కాంగ్రెసులో ఉంటూ కాంగ్రెసు’తో’ ఉన్నట్టు నటిస్తూ మనసును జగనుకు తాకట్టు పెట్టిన నాయకులు: ’మంచిగైంది, మంచిగైంది, మనమే గెలిచాం, మనమే గెలిచాం’
==========================

..అరయంగా కర్ణుడీల్గె నార్వురి చేతన్ - ఈ పద్యాన్ని అనుకరిస్తూ ఒక పద్యం

చిరు నెక్కిన సోనియచే,
బరువెక్కిన ప్రజల హృదయ స్పందన చేతన్
చురుకెక్కని చంద్రునిచే
సిరినెక్కిన  జగను గెలిచె సీమ సమరమున్

16 కామెంట్‌లు:

  1. సానుభూతి ఖర్చైపోయింది. ఇక డబ్బు మీదే ఆధారపడాలి. ఇది నిజం!

    రిప్లయితొలగించండి
  2. {చిరంజీవి తోకను పట్టుకుని కడపను ఈదుదామనుకుంటే} --> You are at your best when you write about Chiranjeevi.

    రిప్లయితొలగించండి
  3. అసలు విషయమేమిటంటే
    కిరస్తానీ నెట్ వర్క చాలాబలంగా పనిచేస్తున్నది.
    అదే జగన్ కాకుండా వేరొకరుగనకైతే సోనియమ్మ ఈసరికి వాడ్ని మూడుచెరువులనీళ్ళుతాగించేది. ఉదాహరనకు గాలి బ్రదర్స్ పరిస్థితి చూడండి
    ఇక్కడ కిరస్తానీముఠాల లోపాయకారీ ఒప్ప్ందాలవల్ల జగన్ పై చర్య చర్య అంటూ కాలంగడుపుతూ నటిస్తున్నారు.
    ఇక తమమతమే వద్దనుకున్న వానికి ఆమతమిచ్చిన కులం ఎందుకో అడగలేని హిందూ రెడ్లు ఈమాయ గ్రహించలేక తాటలేచిందాకా గీక్కుంటున్నారు

    రిప్లయితొలగించండి
  4. మీ రాజకీయ విశ్లేషణ
    వ్యంగ్య ధోరణి లో ఉండడం చేత ఎక్కువ మందిని చదివించే శక్తి దానికి ఉంది....ఇట్లా రాయగలిగే వారు తెలుగులో మరీ ఎక్కువేం లేరు.
    మీ పొలిటికల్ థాట్ (మీ బ్లాగ్ లో నేను చదివిన కొన్ని విశ్లేషణ వ్యాసాల ఆధారంగా)తో నాకు విభేదం ఉంది. కానీ ఆ విభేదం మీ విశ్లేషణల లోని మంచిని గ్రహించడానికి ఎపుడూ అవరోధం కాలేదు.

    రిప్లయితొలగించండి
  5. సరే సానుభూతి అయిపోయిందనే అనుకుందాం... జగన్ మీకేమీ చెయ్యలేడు, మమ్మల్ని గెలిపించండి, మేం చించేస్తాం అని చెప్పేదానికి ఎవరున్నరని? వున్నోళ్ళు చెప్పినా నమ్మేవాళ్ళెవరున్నరని?

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. చిరంజివి ఎంత తొందరగా రాజకీయాను విరమించి ఇంట్లో కూచుంటే అంత విలువ మిగులుతుంది. లేకపోతే ఆయన పని శివాజీ గణేషన్ కన్నా ఘొరం గా తయారౌతుంది. తెలుగు వారికి ఇంత వ్యక్తిత్వం లేని, సరిఐన నిర్ణయాలు తీసుకోలేని అతనిని ఇన్నళ్ళు మేగా స్టార్ అని ఎలా నెత్తికెత్తుకున్నాం అని బాధ పడవలసి వస్తుంది.

    రిప్లయితొలగించండి
  8. చిరంజివి must follow his 2nd daughter's example.

    She walked away from relationship with her husband. Similarly చిరంజివి must walk way from his political ambitions.


    There is a truth in the following

    -----------
    అజ్ఞాత, 19 మే 2011 4:53:00 సా GMT+05:30

    అసలు విషయమేమిటంటే
    కిరస్తానీ నెట్ వర్క చాలాబలంగా పనిచేస్తున్నది.
    అదే జగన్ కాకుండా వేరొకరుగనకైతే సోనియమ్మ ఈసరికి వాడ్ని మూడుచెరువులనీళ్ళుతాగించేది. ఉదాహరనకు గాలి బ్రదర్స్ పరిస్థితి చూడండి
    ఇక్కడ కిరస్తానీముఠాల లోపాయకారీ ఒప్ప్ందాలవల్ల జగన్ పై చర్య చర్య అంటూ కాలంగడుపుతూ నటిస్తున్నారు.
    ఇక తమమతమే వద్దనుకున్న వానికి ఆమతమిచ్చిన కులం ఎందుకో అడగలేని హిందూ రెడ్లు ఈమాయ గ్రహించలేక తాటలేచిందాకా గీక్కుంటున్నారు
    ---------------

    అజ్ఞాత, 19 మే 2011 4:53:00 సా GMT+05:30, please write more. You are thinking correctly. Shame on Hindu Reddlu for supporting kirat Jagan (and YSR).

    By supporting kirat Jagan and Sonia, they (Hindu Reddlu) are allowing foreign rule over India. And the same apply to other Caste Hindus.

    రిప్లయితొలగించండి
  9. పద్యం చాలా బాగుంది.

    కాముధ

    రిప్లయితొలగించండి
  10. చిరంజివి ఎంత తొందరగా రాజకీయాను విరమించి ఇంట్లో కూచుంటే అంత విలువ మిగులుతుంది._____________ఆయనకి ఇప్పుడు "విలువ" బాగానే మిగిలిందటండీ! విలువ అంటే గౌరవం అని మీ అర్థమైతే.....అది ఆయన చెవికెక్కదులెండి! :-)

    రిప్లయితొలగించండి
  11. Really glad to know people of India,Particularly of Andhra Pradesh are that much kind enough towards opponent.

    రిప్లయితొలగించండి
  12. అందరికీ నెనరులు.
    మన్మధన్ చెంబు: "..మేం చించేస్తాం అని చెప్పేదానికి ఎవరున్నరని?" - అది జగనుకున్న ప్లస్సుల్లో ఒకటి.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు