20, జనవరి 2011, గురువారం

లై బోలో తెలంగాణ

మనకు శంకరనే ఒక దర్శకుడున్నాడంట. దర్శకుడు శంకరంటే 'జంటిల్మెన్' శంకరనే అనుకుంటూండేవాణ్ణి నేను. కానీ ఇతడు ఆ తమిళ శంకరు కాదనీ.. తెలుగు శంకరేనని తరవాత తెలిసింది. అయితే అతడు తనను తెలంగాణ శంకరని పిలుచుకుంటన్నాడు. ఇదివరకు పెద్దగా కనబడేవాడు కాదుగానీ, ఈమధ్య మాత్రం హఠాత్తుగా ఎక్కడబడితే అక్కడ తెగ కనబడిపోతున్నాడు, వినబడిపోతున్నాడు.ఔను మరి ఇది తెలంగాణ సీజను కదా!

తాను తెలంగాణ శంకరని చెప్పుకుంటన్నాడు కాబట్టి బాగా వార్తల్లో పడ్డాడు. ఈమధ్య తెలంగాణ ఉద్యమాన్ని తన సినిమా కోసం బాగానే వాడుకున్నాడు. సినిమా వాళ్ళు ఒకపక్క సమ్మె చేసుకుంటూ ఉంటే, ఈయన తన సినిమాను (దాని పేరు జై బోలో తెలంగాణ) ఈ సమ్మె నుంచి మినహాయింపించుకున్నాడు. తెలంగాణ సినిమా జాక్ అనేది కూడా ఒకటుందంట కూడా -ఈయనే పెట్టేసుంటాడు. జాకా మజాకా!

రెండ్రోల కిందట  టీవీ9లో ఒక ఫోనాఫోనీలో పాల్గొన్నాడీయన. అమెరికా యూరప్పుల నుంచి మనవాళ్ళు ఫోను చేసి ప్రశ్నలేస్తే ఈయన సమాధానాలిస్తాడన్నమాట. వెంకట్ అనే ఒకాయన అడిగిన ప్రశ్న.. "ఉస్మానియాలో ఉద్యమం పేరుతో డబ్బులు ఎలా వసూలు చేసారో మీ సినిమాలో చూపిస్తున్నారా" అని. దానికి ఈయనిచ్చిన సమాధాన మేంటంటే.. ఉద్యమం అన్నాక, కొన్ని లంపెన్ ఎలిమెంట్లు ఎక్కడైనా ఉంటాయండీ. వాటికి అంత ప్రాధాన్యత నివ్వకూడదు. ఉద్యమం పూర్తి స్వభావాన్ని చూడాలి కానీ ఇలాంటి చిన్నచిన్న విషయాలను పట్టించుకోకూడదు. పైగా మీరే అంటున్నారు అది పుకారని. దానికి విలువ ఎలా ఇస్తామండీ? నిరూపణ కానిదాన్ని చూపించడంట. అద్భుతమైన విలువలు కదా! మరి ఈయన గారి మిగతా విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం.. (సినిమావాడికి విలువలేంటయా అంటారా.. నిజమేననుకోండి!)

 ఆ సినిమాలో కేసీయారు రాసిన ఒక పాటను టీవీలో చూపించా రీ మధ్య. అందులో సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం అని వర్ణించారు. కేసీయారు ఇన్నాళ్ళుగా చేస్తున్న ఆరోపణే అది; ఎక్కడా రుజువు లేని, నిరాధారమైన ఆరోపణ. దాన్ని పాటలో పెట్టెయ్యడం ఈ దర్శకుడికి అనుచితమనిపించలేదు మరి. ఆంధ్రుల మీద వచ్చే పుకార్లను ఎడాపెడా నమ్మేసి సినిమాలో యథేచ్ఛగా పెట్టేస్తాడా?  తెలంగాణ ఉద్యమం గురించి వచ్చిన పుకార్లను సినిమాలో పెట్టడం మాత్రం అనుచితమా? ఇంతోటి సన్నాసితనానికి ఉద్యమం, దాని స్వభావం అంటూ పోసుకోలు కబుర్లు చెప్పడం ఎందుకూ? ఏదో తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టేసుకుని, ఒక సినిమా తీసేసుకుని, కాసిని డబ్బులు చేసేసుకుందామని అనుకుంటన్నాను అని చెబితే పట్టించుకోకపోదుం గదా!

కాబట్టి నీతి ఏంటన్నమాటా.. ఉద్యమాన్ని ఎట్టాగూ అబద్ధాలతోనే గదా నిర్మించారు, ఇక దాన్ని వాడుకుని తీసే సినిమా దానికి భిన్నంగా ఉంటదని అనుకోకూడదు. ఉద్యమం లాగే ఈ సినిమా కూడా .. జై బోలో  కాదు,  లై బోలో తెలంగాణ!  లై బోలో  తెవాదీ అంటే మరింత బాగుంటాది.

(ప్రశ్న అడిగిన వెంకట్ గారికి అభినందనలతో)

70 కామెంట్‌లు:

  1. "అందులో సమైక్యాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమం అని వర్ణించారు. కేసీయారు ఇన్నాళ్ళుగా చేస్తున్న ఆరోపణే అది; ఎక్కడా రుజువు లేని, నిరాధారమైన ఆరోపణ."

    ఎలాంటి రుజువులు ఆశిస్తున్నారు?

    రిప్లయితొలగించండి
  2. ఎలాంటి రుజువులు ఉన్నాయంటారు?

    రిప్లయితొలగించండి
  3. సత్యాన్వేషి,
    ఎలాంటి రుజువులైనా పర్వాలేదు. ఏవోకొన్ని చూపించండి ముందు, మళ్ళీ మాట్లాడదాం.మా ఉద్యమం మొదలయ్యాక మొదలెట్టారు, అంతకుముందెందుకు లేదు అనే ఒక్ఖముక్క తప్ప.
    అంతా కలిసున్నప్పుడు కలిసుండాలని ఉద్యామలెందుకు చేస్తారో ఒక కమిటీ వేసి గాని కనిపెట్టలేం కదా.

    రిప్లయితొలగించండి
  4. "ఆంధ్రుల మీద వచ్చే పుకార్లను ఎడాపెడా నమ్మేసి సినిమాలో యథేచ్ఛగా పెట్టేస్తాడా? "

    కనీసం సినిమా రిలీజ్ కూడా కాలేదు.. నీకు ఈ అబద్ధం ఎలా వ్రాయబుద్దైంది ?

    రిప్లయితొలగించండి
  5. http://edisatyam.blogspot.com/2011/01/blog-post_19.html

    మన్మధన్ చెంబు--మీకు సమాధానం.

    రిప్లయితొలగించండి
  6. EE blog tone telustundi telangaana vaalla pai entha anyam jarugutundo, Vaadevado Tamil shankar telusanta, kaani Mana N shankar teleedanta time unte okka saari atanu direct chesina cinemaalu choodu entha saamajika spruha kaliginchevo telustundi

    రిప్లయితొలగించండి
  7. Films Directed by N Shankar:
    *************************
    Encounter - 1997
    Sri Ramulaiah - 1998
    Yamajaathakudu - 1999
    Jayam Manade Raa - 2000
    Bhadrachalam -2002
    Aayudham -2003
    Nammanna (Kannada) -2005
    Raam -2006
    Jai Bolo Telangana -2010
    ***********************
    Asalu meerenduku raaa TN nunchi vidi poyaaru, vaallatne undochu gaaa sambar taaguthu

    రిప్లయితొలగించండి
  8. @సత్యాన్వేషి,
    మీరిచ్చిన లింక్ లో ఏముంది? మీ ఆరోపణలున్నాయి, మీ వాదాలున్నాయి. రుజువులెక్కడున్నాయి?
    కానీ మీరు పెట్టిన బొమ్మ మాత్రం సూపర్ సార్.. మీ ఉద్యమానికి సరిగ్గ సరిపోద్ది.

    రిప్లయితొలగించండి
  9. తెలంగాణ ఉద్యమానికి కౌంటర్ గానే సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టిందనే నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సమైక్యాంధ్ర ఉద్యమం లేదు అనేది నిజం.

    అసత్య సమైక్య వాదులంతా హైదరాబాద్ వదులుకునే సమస్య లేదని టి.జి. వెంకటేష్ టైపు వాదిస్తే మంచిది.

    రిప్లయితొలగించండి
  10. హ హా... బాగా చెప్పారు డ్రీంస్ గారు... మాటకి మత్తు కలిపి ప్రేమ నటిస్తున్నారు.. ఆ అడిగేదేదో హైదరాబాద్ గురించి సూటిగా అడిగితే సరిపోతుంది కదా... లేని సమైక్యతా రాగాలు ఎందుకు..

    రిప్లయితొలగించండి
  11. @a2zdreams,
    తెలంగాణ ఉద్యమానికి కౌంటర్ గా సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టిందనుకుంటే, మరి యిప్పుడు తెలంగాణ ఉద్యమం ఎలా పుట్టింది? ఒక పచ్చి స్వార్ధపరుడి బుర్రలో పుట్టింది కాదా?
    50 ఏళ్ళనుండి వుంది అని మీరంటే, సమైక్య ఉద్యమం కూడా 50+ సంవత్సరాలనుండి వుంది అని నేనంటాను. రాష్ట్రం ఏర్పడగానే సమైక్య ఉద్యమం పుట్టింది అని నేనంటాను. మీరు కాదంటారా?
    అసలు ఉద్యమం అంటే ఏంటో యిప్పుడు వివరణ కావాలి కదా? నలుగురు కలిసి కేకలేస్తే ఉద్యమమా? మనది ఆంధ్రప్రదేశ్ అని గర్వంగా అనుకున్నోళ్ళందరిదీ ఉద్యమం కాదా? ఈ 50+ సంవత్సరాలనుండీ ఎవ్వరూ అలా అనుకోలేదా?
    మరి reaction అంటారా..యిద్దరు వ్యక్తులు ఎంతసేపైనా వాదులాడుకోవచ్చు.... ఎప్పుడైతే ఒకడు చెయ్యెత్తడానికి చూస్తాడో, అప్పుడే యింకోడు కర్రెత్తుతాడు. అదీ మా సమైక్య ఉద్యమం.

    రిప్లయితొలగించండి
  12. చెంబు,

    సరే యాభై ఏళ్ళు కాదు ... పదేళ్ళే అనుకుందాం ... ఒక వేళ ప్రజల మనస్సులలో లేకుంటే పది ఏళ్ళుగా ఈ ఉద్యమాన్ని నడిపించగలడా నువ్వంటున్న ఆ స్వార్థపరుడు ? మరి సమైక్య ఉద్యమం ఏది.. ఎక్కడ నడుస్తుందో అడ్రస్ చెప్పగలవా ? లేని దాని గురించి ఎందుకు వాదన... ఉన్న దాన్ని అంగీకరించు .. మరి 50 ఏళ్ళుగా శ్రమ ని పంచుకున్నం... సరిగా వాటాలు వేసుకుందాం అను..బాగుంటది... పస లేని వాదనలు వద్దు ...

    మొన్నటి మహా ఘర్జన లోని లక్షలాది జనాలని చూసి కూడా... అభిప్రాయం మార్చుకోలేక పోతే సమైక్య రాగం చేసే వారిది పక్కా స్వార్థ పూరిత ఆలోచనే. కాదంటారా ?..

    రిప్లయితొలగించండి
  13. >>ఎప్పుడైతే ఒకడు చెయ్యెత్తడానికి చూస్తాడో, అప్పుడే యింకోడు కర్రెత్తుతాడు. అదీ మా సమైక్య ఉద్యమం.<<

    no. thats not true. తెలంగానకు వ్యతిరేకం కాదు అని చెప్పి, కేంద్రం ఇస్తాననగానే పుట్టుకొచ్చింది ఈ సమైక్య ఉద్యమం.

    (నేను నిజంగా కలిసుందాం అనుకునే వాళ్లకు వ్యతిరేకం కాదు)

    రిప్లయితొలగించండి
  14. @కిరణ్,
    తెలంగాణ ఉద్యమం అడ్రెస్స్ చెప్పి మమ్మల్ని అడగాలి కదా?
    ప్రతి ఒక్కరి గుండెలో గొంతులో వుందా?
    సేమ్ టు సేమ్ యిక్కడ కూడా
    ఉస్మానియా గేటు దగ్గరుందా
    ఆంధ్రా యూనివర్సిటీ కాంపస్ లో వుంది
    వరంగల్లో వుందా
    గుంటూరులో వుంది
    నిజామాబాద్ లో వుందా
    కర్నూలులో వుంది

    యించ్ కూడా పోనియ్యమన్నంతవరకు వుంటూనే వుంది. న్యాయంగా వాటాలు వేయనంతవరకు వుంటుంది. మీరు కూడా న్యాయంగా వాటాలేసుకుందామంటే, సమైక్య ఉద్యమాన్ని అలాగే వుంచి న్యాయాన్యాలేంటొ మాట్లాడదాం. సరేనా?

    రిప్లయితొలగించండి
  15. దీనిలో దాచడానికేం లేదు, అట్లే అతితెలివితో శోధించి కనుక్కోవాల్సిందీ లేదు. విడిపోదామని TGవాల్లు అనేదీ, కలిసుందామని సీమాంధ్రావారు అనేదీ, హైదరాబాదూ దాని చుట్టూ కేంద్రీకృతమై ఉన్న అభివృద్ధి కోసమే. ఇన్నాల్లూ రాష్ట్రాన్ని పాలించిన సీమాంధ్రా CM లందరూ Hydని ఇంతగా డెవలప్ చేస్తే, ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వెల్లిపోవాలట, వీల్లొచ్చి మజా చేసుకుంటారట. అదేమంటే Hyderabadని మా నిజాం ఆల్రెడీ చాలా గొప్పగా డెవలప్ చేశాడంటారు. అదే నిజమైతే,పాపం అంత గొప్ప నిజాం మీద వీరందరూ ఎందుకు తిరుగుబాటు చేశారో. వీరి వాదన ఎలా ఉంటుందంటే, హైదరాబాద్ కి జరిగిన మంచి అంతా నిజాం వల్లే జరిగింది, ఏదైనా చెడు జరిగితే మాత్రం అది సీమాంధ్రా వారివల్లనే, అన్నట్లుగా ఉంటుంది. ఆధారాల గురించి మాత్రం మమ్మల్ని అడగవద్దంటారు.
    BTW, శంకర్ గారి కళాఖండాల లిస్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. వీటిలో జనం మెచ్చిన సినిమాలు(కనీసం తెలంగాణా జనం) ఏవో కూడా తెలియజేస్తే మరీ బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
  16. Hear " JAI BOLO TELANGANA " Film Songs Here:

    http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=A0002694

    AND

    Artificial one and only SAMAIKYAANDHRA song here:

    http://www.youtube.com/watch?v=AV8HaFFy_p0

    రిప్లయితొలగించండి
  17. " జై బోలో తెలంగాణా " సినిమా పాటల ను ఈ కింది రాగా లింకు లో వినండి :
    http://www.raaga.com/channels/telugu/moviedetail.asp?mid=A0002694

    ఒకే ఒక కృత్రిమ సమైక్యాంద్ర కమర్షియల్ పాట ను ఈ కింది యూ ట్యూబ్ లింకులో కనండి :
    http://www.youtube.com/watch?v=AV8HaFFy_p0

    రిప్లయితొలగించండి
  18. Amar: సామాజిక స్పృహా.. హహ్హహ్హా, భలే! మన సినిమాల మార్కు సామాజిక స్పృహను తాగీ తాగీ పాపం మీరిలా అయిపోయినట్టున్నారు! ఈ పిచ్చికి తోడు ఇప్పుడు ఆ ’లై బోలో..’ కూడా చూసారంటే మీరు ఎక్కడికి చేరతారో నాకు అర్థం కావడం లేదు. కాస్త ఆ బాపతు సినిమాలు చూట్టం తగ్గించండి. మీ జాబితాలోని వాటిలో భద్రాచలం ఒక్కటే చూసాను, టీవీలో. ఇక మిగతా ముష్టి సినిమాలు చూడక్కర్లేదని అర్థమౌతోంది.

    a2zdreams: మీకు మన్మధన్ చెంబు గారిచ్చినంత బాగా నేను సమాధానం ఇవ్వలేను గానీ నా వెర్షనిది: "తెలంగాణ ఉద్యమానికి కౌంటర్ గానే సమైక్యాంధ్ర ఉద్యమం పుట్టిందనే నిజాన్ని దాచే ప్రయత్నం చేస్తున్నారు." - ఎవరు దాస్తున్నారు? నేనైతే దాచడం లేదు. అందుకే వచ్చిందా ఉద్యమం. తెవాద వ్యతిరేకమే సమైక్యాంధ్ర ఉద్యమం. ఏడాది పొడుగూతా పనీపాటా మానేసి, డప్పులు కొట్టుకుంటూ తిరిగే ఉద్యమం కాదిది, ఎప్పుడవసరమో అప్పుడే తలెత్తుతుంది. లక్ష్యం సాధించాక, కనబడదు.

    "ఎప్పుడైతే ఒకడు చెయ్యెత్తడానికి చూస్తాడో, అప్పుడే యింకోడు కర్రెత్తుతాడు. అదీ మా సమైక్య ఉద్యమం." అని మన్మధన్ చెంబు అంటే మీరు "no. thats not true. తెలంగానకు వ్యతిరేకం కాదు అని చెప్పి, కేంద్రం ఇస్తాననగానే పుట్టుకొచ్చింది ఈ సమైక్య ఉద్యమం." అని అన్నారు. ఆయన చెబుతున్నదీ అదే కదా?

    కిరణ్: "మాటకి మత్తు కలిపి ప్రేమ నటిస్తున్నారు" - ప్రేమా గాడిదగుడ్డా? అమ్మ నా బూతులు తిట్టే తెవాదుల మీద ప్రేమ నటించాల్సిన అవసరం మాత్రం ఏంటసలు? యాభైయేళ్ళుగా కలిసి సంపాదించుకున్న ఆస్తుల్ని మీరు అప్పనంగా కొట్టేద్దామని చూస్తుంటే, అడ్డం పడ్డామంతే!
    అజ్ఞాత: "ఇప్పుడు ఇవన్నీ వదిలేసి వెల్లిపోవాలట, వీల్లొచ్చి మజా చేసుకుంటారట." - సరైన మాట.

    రిప్లయితొలగించండి
  19. మా తెలంగాణోళ్ళ ఆత్మగౌరవం, సెంటిమెంటు, తెలంగాణ తల్లి, తల్లి తెలంగాణ అన్నీ హైద్రాబాద్లోనే వున్నాయి, తక్కిన జిల్లాల్లో ఏమీ లేదు. 54ఏళ్ళనుంచి (తోచనపుడల్లా జనాలమీద పడి) ఇన్స్టాల్మెంట్ల మీద ఉద్యమాలు జేస్తన్నం.

    రిప్లయితొలగించండి
  20. ఈ సినిమాలో ఒక్క పాట తప్పించి అన్నీ 'ఆంధ్రోల్ల ' భాషలోనే ఉన్నట్టున్నాయి! This should give a hint to the common folk of Telangana, భాషలోని ఒక మాండలీకాన్ని అధారంగా పెట్టి, 'దోపిడీ ' అంటూ అభూత కల్పనలు సృష్టించి అమాయక ప్రజలను రెచ్చగొట్టి 'ఉద్యమం' నడుపుతున్న అవకాశవాద రాబందుల గురించి.

    రిప్లయితొలగించండి
  21. ఎప్పుడైతే ఒకడు చెయ్యెత్తడానికి చూస్తాడో, అప్పుడే యింకోడు కర్రెత్తుతాడు. అదీ మా సమైక్య ఉద్యమం

    బాగుంది మీ వివరణ. అయితే దానికి సమైఖ్య అనే పేరు సరిపోదు..మోకాలడ్డే కార్యక్రమం అని పెట్టుకుంటే బాగుండేది. ఇక ఈ కార్యక్రమం ప్రకటన వెలువడిన నిముషాలలోనే, ప్రజలంతా నిద్రిస్తుండగానే ఎలా మొదలయింది? నిముషాల్లోణే ప్రజా ఉద్యమం మొదలయిందా, లేక ఇది నాయకుల ఉద్యమమా?

    రిప్లయితొలగించండి
  22. >>>>>
    అసత్య సమైక్య వాదులంతా హైదరాబాద్ వదులుకునే సమస్య లేదని టి.జి. వెంకటేష్ టైపు వాదిస్తే మంచిది.
    >>>>>
    టిజి వెంకటేశ్ నిజం మాట్లాడకపోతే అతనికి నష్టం. రాయలసీమ తెలంగాణా కంటే వెనుకబడిన ప్రాంతం. సమైక్య రాష్ట్రంలో ఉంటే రాయలసీమకి ఏమిటి లాభం అని ప్రత్యేక రాయలసీమవాదులు వెంకటేశ్‌ని అడుగుతారు. అప్పుడు జస్టిఫికేషన్ కోసం హైదరాబాద్ తప్ప వేరే కారణం దొరకదు. అందుకే వెంకటేశ్ డైరెక్ట్‌గా నిజం చెప్పాడు.

    రిప్లయితొలగించండి
  23. సత్యాన్వేషి,
    సమైఖ్యాంధ్రా ఉద్యమం అంటే ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం మాకు సమ్మతం కాదు సమైఖ్యంగానే ఉంచమని కేంద్రానికి ఇచ్చిన వార్నింగ్. అంతేగాని విడిపోతామనే వాళ్ళని కలిసుందామని చేసే బలవంతం కాదు. మీ మీద చేసే ఉద్యమం అంతకన్నా కాదు. ఇన్ని రోజులు మీ సమ్మతితోనే కలిసి ఉండి మా ఆస్తులమ్ముకుని రాజధానికొస్తే మీకిప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి పొమ్మనగానే సర్దుకుపోవటం కుదరదు.

    కేంద్రం దగ్గర మీరు చెప్పుకునేది మీరు చెప్పుకున్నారు. మీరు ప్రొపోస్ చేసే "మీరు తెచ్చి పెట్టినవి మేము ఉంచుకుంటాం, మీరు ఉత్త చేతుల్తో పోండి" కాన్సెప్ట్ మాకు సమ్మతం కాదని, ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని మా స్టైల్లో మేము చెప్పాం కేంద్రానికి. మేమిచ్చిన వార్నింగ్ కేంద్రం పరిగణలోకి తీసుకుంది కాబట్టే చల్లబడ్డాం. తీసుకోకపోతే మళ్ళీ రిపీట్ అవుతుంది.

    "ఇక ఈ కార్యక్రమం ప్రకటన వెలువడిన నిముషాలలోనే, ప్రజలంతా నిద్రిస్తుండగానే ఎలా మొదలయింది? నిముషాల్లోణే ప్రజా ఉద్యమం మొదలయిందా, లేక ఇది నాయకుల ఉద్యమమా?" - ఇదో తెలివితక్కువ ప్రశ్న. తమ ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ విషయం మీదైనా ఉద్యమాలు మొదలెట్టాల్సింది నాయకులే. అదే జనం వారికిచ్చిన జాబ్. మీరు మబ్బుగాళ్ళు కాబట్టే మీ నాయకులు ఇన్ని సంవత్సరాలు ఇష్టం వచ్చినట్టు ఆడి అది కప్పిపుచ్చుకోటానికి ఇప్పుడు రోడ్డెక్కారు. మా నాయకులకు బాగా తెలుసు తేడా వస్తే మేము తోలుతీస్తామని. అందుకే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు.

    రిప్లయితొలగించండి
  24. చదువరీ నీకు పిచ్చి పట్టినట్టువుంది సినిమా ఇంకా రేలిసే అవ్వలేదు నీ పితురిలు స్టార్ట్ చేసావా?

    రిప్లయితొలగించండి
  25. ఆహాహా! ఏం చెప్పారండీ చదువరి గారు!

    మాది కృత్రిమ ఉద్యమం కాదు, నిఖార్సయిన ఉద్యమం.

    ఆ! కాదు కాదు, ఇది వార్నింగ్ మాత్రమే. రాష్ట్రాన్ని విడదీయొద్దని వార్నింగ్ ఇచ్చామన్న మాట!

    అది కూడా కాదు, ఉత్త చేతులతో వెళ్ళమంటే కుదరదని...

    అసలు మీరు మాట్లాడే మాటల్లో ఒకదానికొకటి పొంతన కుదురుతుందా?

    రాష్ట్రాలు విడిపోవాలన్నారు కాని ఉత్త చేతులతో వెళ్ళమని ఎవరైనా చెప్పారా? విడిపోక తప్పదనే విషయం ముందు గుర్తిస్తే మిగతావన్నీ చర్చకు వస్తాయి. ఎంత మభ్యపెట్టడంలో సిధ్ధ హస్తులైతే మాత్రం ఇంతగానా?

    హేవిటీ? మీరూ, మీ నాయకులూ సుద్ద పూసలా?

    రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుతిన్న దొంగనాయాల్లంతా మీప్రాంతం వారే కదండీ! కాదంటారా? నన్నే పేర్లు చెప్పమంటారా?

    మీ నాయకులు అంత గొప్ప వారైతే ఉత్తరాంధ్ర ఎందుకలా వుంది? రాయలసీమ ఎందుకలా ఏడ్చింది? రాజకీయాన్ని, వ్యాపారాన్ని కలగలిపి అడ్డంగా దోచుకోవడం తప్ప ఇంకేమి తెలుసు మీ నాయకులకు? మీరు అంత గొప్ప ఉధ్ధండులైతే వారిని కట్టడి చేయడానికి ఏమి చేశారు? 2009 ఎన్నికల్లో మళ్ళీ గెలిపించడం తప్ప!

    రిప్లయితొలగించండి
  26. "రాష్ట్రాలు విడిపోవాలన్నారు కాని ఉత్త చేతులతో వెళ్ళమని ఎవరైనా చెప్పారా?" - ఇన్ని రోజులు మీ తెలబాన్లు చెప్పిన మాట అదేగా. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా చెప్పారా అని నంగిగా అడుగుతున్నావు. మేము మొదట్నుంచి మొత్తుకుంటున్నది అదే. శ్రీకృష్ణ కమిటీ అడిగినప్పుడు అదే చెప్పాం. వాళ్ళూ హైదరాబాద్లో పెట్టిన పెట్టుబడులే అసలు గొడవ అని కుండబద్దలు కొట్టారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కానట్టు నటిస్తూ అవే ప్రశ్నలు మళ్ళీ అదే వాగుడు.

    "హేవిటీ? మీరూ, మీ నాయకులూ సుద్ద పూసలా?" - చెప్పింది సరిగ్గ అర్థం చేసుకునే తెలివితేటలు మీ తెలబాన్లకు ఎప్పుడొస్తాయో మరి. మా నాయకులు సుద్ద పూసలని, గొప్పవాళ్ళని నేను చెప్పలా. మా ప్రాంతాల్లో ప్రజలకి రాజకీయ చైతన్యం ఎక్కువని, కాబట్టి మా నాయకులు భయపడి త్వరగా కదిలారని చెప్పింది.

    ఎప్పుడు కట్టడి చెయ్యాలో, ఎప్పుడు గెలిపించాలో మాకు తెలుసు. మాకు మంచి జరిగితే గెలిపిస్తాం, మా ప్రజా ప్రయోజనాలకు భంగం కలిగితే కట్టడి చేస్తాం. ఇన్ని రోజులు ఎదవల్ని గెలిపించి, వారిని నిలదీయటం చేతకాక మా మీద పడి ఏడుస్తుంది మీరు కానీ, మేమెప్పుడు మా పరిస్థితులకు వేరే వాళ్ళను భాధ్యుల్ని చెయ్యలా. రాయలసీమైనా, ఉత్తరాంధ్రా అయినా వాళ్ళ నాయకుల్నే నిలదీస్తున్నారు కానీ మిమ్మల్ని కాదుగా.

    రిప్లయితొలగించండి
  27. @hari,
    lite teesuko. pai agnata chepinattu ma nayakulato memu nashtapote, adi ma failure anukuntam, mila paka vaalla meeda padi yedavam

    రిప్లయితొలగించండి
  28. మీ నాయకులే డిసెంబరు 9కు ముందు సోనియా ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని చెప్పారు, అఖిల పక్షంలో బిల్లు పెడితే సమర్ధిస్తామని కూడా చెప్పారు. అప్పుడేమయింది వారి బుద్ది, మీ రాజకీయ చైతన్యం? ఎంత రాజకీయ చైతన్యం ఉంటే ఇలాంటి లక్షల కోట్లు మేసే అవినీతి పరులను ఎన్నుకుంటారు మీరు?

    రిప్లయితొలగించండి
  29. అదేదో చేయలేక మంగళవార మన్నాడట వెనకటికొకడు.
    తెలంగాణా నాయకులు సీమాంధ్రా నాయకుల మీద, తెలంగాణా ప్రజలు సీమాంధ్రా ప్రజల మీద పడి ఏడవడటం ఇలాగే ఉంది.
    ప్రస్తుత రాజకీయాల్లో నాయకుడనే వాడు ఎవరైనా సాధ్యమైనంత దోచుకోవాలనే చూస్తారు. ఏ పార్టీ వాడైనా, ఏ ప్రాంతం వాడైనా.
    అట్లే ప్రజలు కూడా కష్టపడి చదువుకొనో, ఉన్న ఊరు వదిలేసి, ఇంకో చోటుకి వెల్లి, రిస్క్ తీసుకొని వ్యాపారాలు చేసొ డబ్బులు సంపాదించుకోవాలని చూస్తారు. అది సరిగా చేసే కెపాసిటీ లేనోల్లు వేరే వారిమీద పడి ఏడుస్తుంటారు.

    రిప్లయితొలగించండి
  30. అది మాకు రాజకీయ చైతన్యం ఎక్కువ అని చెప్పుకున్న అగ్నాతకు. అది నువ్వో కాదో తెలుయదు. సమైఖ్య ఉద్యమాన్ని సమర్ధించడం జనాలకు సిగ్గుచేటుగా ఉన్నట్లుంది, సొంత ఐడీ వాడక అగ్నాతల్లాగా వాదిస్తున్నారు. సిగ్గులేని ఉద్యమం కదా, అలాగే ఉంటుంది. అగ్నాతలతో డిబేట్ చెయ్యను. బై!!

    రిప్లయితొలగించండి
  31. హరి: "రాజకీయాన్ని, వ్యాపారాన్ని కలగలిపి అడ్డంగా దోచుకోవడం తప్ప ఇంకేమి తెలుసు మీ నాయకులకు?" - అక్కడి నాయకులు పత్తిత్తులనీ, దేవదూతలనీ చెప్పడం లేదండి. అందరు నాయకుల్లాగే సంపాయించుకుంటారు, అవినీతి పనులు చేస్తారు, జనం సొమ్మును దోచుకుంటారు. ఏంచేస్తాం.. అదంతా మన ఖర్మ, అంతే! కానీ..

    వాళ్ళు చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా, చేతులు ముడుచుకుని కూచ్చున్నపుడు ఇదేంట్రా అని నిలదీస్తే.. ’మేం పని చెయ్యకపోవడానికి కారణం అదుగో ఆ తెలంగాణ వాళ్ళే కారణం, పోండి మీరు వెళ్ళి వాళ్ళని బూతులు తిట్టండి’ అని చెప్పరు అక్కడి నాయకులు. ఖచ్చితంగా చెప్పరు. ఒకవేళ అలాంటి కూతలు కూస్తే, తప్పు నువ్వు చేసి వాళ్ళను అంటావేంట్రా అని నం నిలదీస్తారు, ఇక్కడ అజ్ఞాత చెప్పినట్టు.. ’వాళ్ళ తోలుతీస్తారు’. అంతేగానీ వాళ్ళ ఖర్మకి, వాళ్ళ నాయకుల చేతకానితనానికి పక్కవాణ్ణి తిట్టరు, కీ ఇచ్చిన బొమ్మల్లా ఆడరు. సమస్య అంటూ ఏదైనా వస్తే, వాళ్ళే పరిష్కరించుకుంటారు
    తప్ప వాళ్ళు బాగుపడిపోతున్నారు బాబో..య్ అంటూ అవతలోడి మీద పడి ఏడవరు. ఆనక, మనమంతా అన్నదమ్ములమేనంటూ సన్నాయి నొక్కులు నొక్కరు.

    రిప్లయితొలగించండి
  32. @సత్యాన్వేషి,
    మీకీపేరు మీ తల్లితండ్రులు పెట్టారా? ఏదో ఒక పేరు, సత్యాన్వేషి/అజ్ఞాత/ఆవకాయ్/కొబ్బరికాయ్ ఏంటి తేడా? మహా అయితే ఆ పేరుమీద మీరు వ్రాసే బ్లాగులో మీ అభిప్రాయాలుంటాయి. కామెంటులో వుండేవీ అభిప్రాయాలే కదా!

    రిప్లయితొలగించండి
  33. వాళ్ళు చెయ్యాల్సిన పనులు చెయ్యకుండా, చేతులు ముడుచుకుని కూచ్చున్నపుడు ఇదేంట్రా అని నిలదీస్తే.. ’మేం పని చెయ్యకపోవడానికి కారణం అదుగో ఆ తెలంగాణ వాళ్ళే కారణం, పోండి మీరు వెళ్ళి వాళ్ళని బూతులు తిట్టండి’ అని చెప్పరు అక్కడి నాయకులు. ఖచ్చితంగా చెప్పరు

    చెప్పడానికి కాస్తయినా నమ్మే విధంగా ఉండాలి కదా.

    నాటి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో విస్తీర్ణంలోను ఆంధ్ర ప్రాంతమే హెచ్చుగా ఉన్నప్ప్పటికీ, పరిపాలనలోను, ఆర్ధిక వ్యవస్థ లోను తమిళుల ఆధిపత్యం సాగేది. సహజంగానే, ఆంధ్రులలో అభద్రతా భావం కలిగింది. తమకంటూ ప్రత్యేక రాష్ట్రం ఉంటేనే, రాజకీయంగాను, ఆర్ధికంగాను గుర్తింపు లభిస్తుందని వారు ఆశించారు

    దీని భావమేమి ధీవరేణ్య!

    ’వాళ్ళ తోలుతీస్తారు’

    తోలు తీస్తారో వెంటబడి ఊరేగుతారో, ఇదివరలో వైయెస్సార్, ఇప్పుడు జగన్‌ని చూస్తే తెలియడం లేదా!

    రిప్లయితొలగించండి
  34. పిచ్చి ఆంధ్ర కొడుకులు, తమిళనాడు నుంచి మీరు బలిసి విదేపోయరా ? అప్పుడు మీ చెత్త గల్లకీ, ఈ విషయాలు గుర్తుకురాలేదా? పక్కవాడి సొమ్ము మీద ఆశ పడి నాశన్మిపోతారు

    రిప్లయితొలగించండి
  35. అప్పుడు 'మా పల్లెలుదోస్తివి కొడుకో నైజాము సర్కరోడా' అన్నారు, ఇప్పుడు నిజాం అంత గొప్ప ప్రభువని తెలబాన్లు కీర్తిస్తున్నారు, ఇదీ అదే. అప్పుడలా చేశాం, ఇప్పుడు ఇలా చేస్తాం, ఐతే ఏం? ఎప్పుడూ అలానే చేయాలా? మీ ఏడుపుగొట్టు పిల్లి శాపాలకు వుట్లు తెగవు. :)

    రిప్లయితొలగించండి
  36. ----పిచ్చి ఆంధ్ర కొడుకులు, తమిళనాడు నుంచి మీరు బలిసి విదేపోయరా ? అప్పుడు మీ చెత్త గల్లకీ, ఈ విషయాలు గుర్తుకురాలేదా? పక్కవాడి సొమ్ము మీద ఆశ పడి నాశన్మిపోతారు.---
    మేము చెన్న పట్నం వాళ్ళకు వదిలి వచ్చాం ఆత్మగౌరవంకోసం. మీరూ హైదరాబాదు వదిలి వెళ్ళండి. ఎవరూ వద్దనటంలేదు.
    అయినా తమిళనాడు నుండి వచ్చి మాదోవన మేము కర్నూలు లో ఉంటే కలుపుకొంది మీరు. బాగా పైసలు కనిపిస్తుండగానే పొమ్మంటున్నది మీరు. ఎవరు పక్కవాళ్ళ సొమ్ముకు ఆశపడుతున్నారనేది వేరే రాష్ట్రంవాళ్ళెవరైనా మీకు ప్రెండ్స్ ఉంటే అడగండి చెప్తారు.

    రిప్లయితొలగించండి
  37. "మేము చెన్న పట్నం వాళ్ళకు వదిలి వచ్చాం ఆత్మగౌరవంకోసం. మీరూ హైదరాబాదు వదిలి వెళ్ళండి. ఎవరూ వద్దనటంలేదు"


    మై డియర్ . అజ్ఞాత.
    నీకు బుర్ర వుందా, చదువుకున్నవ ? న్యూస్ చూడవ ? పేపర్ చదవ ? ఆంధ్ర వచ్చి తెలంగాణాలో కలుస్తం అని నేత్హి నోరు మోతుకుంట్ మీరు వచ్చి మా పక్కలో బల్లెం లాగా అయ్యారు. మీరు చెన్నయ్ నుంచి వేల్ల్గోట బడ్డారు, ఇంకా మేము ఆ పని స్టార్ట్ చేయలేదు సంతోషించు, హైదరాబాద్ అసలు ఎలా మీకు దక్కుతుంది, బోగోలికంగా హైదరాబాద్ తెలంగాణా లో బాగం, మీరు హైదరాబాద్ కి రావడం కోసం, తెలంగాణా జిల్లలోనుంచి సుమారు 150 నుంచి 250 kL. ప్రయాణం చేయాలి, అంత దమ్ము మీకు వుందా ? ఆంధ్ర సరిహద్దు లో వున్నా చెన్నయ్ ని మీరు సాదించలేదు, ఆంధ్ర రాయల సీమ, సరిహద్దులకి ఎటువంటి సంబంధం లేని హైదరాబాద్ ని ఎలా సాదిస్తారు ? హైదరాబాద్ మా జాగిరి.

    రిప్లయితొలగించండి
  38. అయ్యా చ్హదువరి గారు....శన్కర్ ఒక సామజిక స్రుహ కల వాడు మీరు ఒప్పుకున్న లెక పొయిన ....రాయలసిమ మీద సినిమా లు తిసినప్పుదు పొగిదిన news papers oka sari chudandi....ayina inka movie release avvakundane enti e chettha rathalu

    రిప్లయితొలగించండి
  39. ఈ చడువారి తానో పెద్ద మేదావిననే ఫీలింగ్.

    రిప్లయితొలగించండి
  40. అన్నట్టు నాదో డవుటు...తెలంగాణా యాసను సినిమాల్లో కామెడీకి వాడుతున్నారని నిప్పులు చెరిగిన సోకాల్డ్ తెలంగాణా వాదులు "జయం మనదేరా" లో ఒక కామెడీ పాత్ర పోషించిన భరణి చేత అచ్చమైన తెలంగాణా యాస మాట్లాడించినట్టు గుర్తు. ఆ సినిమా డైరెక్టర్ శంకర్ తెలంగాణా వాడేగా?

    రిప్లయితొలగించండి
  41. ఆ సినిమాలో కోస్తా ఆంధ్రవాళ్లని కించపరిచే సన్నివేశాలు ఏమీ లేవు కానీ ఆ సినిమాలో తెలంగాణా కాంగ్రెస్ నాయకులని కూడా విలన్లుగా చూపించారు. దానం నాగేందర్‌ని పేరు మార్చేసి చూపించారని ఆ సినిమా చూసినవాళ్లు ఎవరికైనా అర్థమైపోతుంది. సెన్సార్ బోర్డ్‌లో ఎక్కువగా రాజకీయ నాయకులు, అది కూడా అధికార పార్టీవాళ్లు ఉంటారు. అందుకే ఆ సినిమాకి సెన్సార్ సర్టిఫికేట్ నిరాకరించారు. నేనేమీ సమైక్యవాది కాదు కానీ ఆ సినిమా నాకు నచ్చలేదు. డైలాగుల్లోనూ, పలు సన్నివేశాలలోనూ పాత చింతకాయ పచ్చడి స్టైల్‌నే అనుసరించారు. కాలం మారిపోయి భర్త చనిపోయిన స్త్రీలు పసుపుకుంకుమలు పెట్టుకుంటోంటే ఇంకా సౌభాగ్యవతి\విధవ లాంటి పాత కాలపు సెంటిమెంట్లు పెట్టారు. నేను ఉండేది కోస్తా ఆంధ్రలో. నిన్న రాత్రి మా పట్టణంలో సెకండ్ షోలో ఆ సినిమా చూడడానికి వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది మిడిల్ క్లాస్‌వాళ్లు. చుట్టుపక్కల పల్లెటూర్ల నుంచి వచ్చేవాళ్లు అంతగా రాలేదు. రాజకీయాలు తమకి అర్థం కావనుకుని రాకపోయి ఉండొచ్చు.

    రిప్లయితొలగించండి
  42. ఇంకో విషయం. రాత్రి థియేటర్‌లో నాకు మహిళలెవరూ కనిపించలేదు. వచ్చినవాళ్లు ఫామిలీస్‌తో కాకుండా సింగిల్‌గా వచ్చారు. మహిళలు రాజకీయాల మీద ఆసక్తి చూపించకపోవడం వల్ల కావచ్చు. థియేటర్‌కి వచ్చినవాళ్లు ఆసక్తిగా సినిమా చూశారు. వాళ్లు రాజకీయ పార్టీల కార్యకర్తలు కాదు. సినిమాలో కోస్తా ఆంధ్ర ప్రజలకి వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయో లేదో చూసి ఆ సినిమాని కాంట్రోవర్సీ చెయ్యాలనుకున్న సమైక్యాంధ్ర JAC సభ్యులు కూడా రాలేదు. కేవలం వ్యక్తిగత ఆసక్తితో ఆ సినిమా చూశారు.

    రిప్లయితొలగించండి
  43. @చదువరి మొ. సమైఖ్యాంధ్ర వాదులారా..... రాష్ట్రాలు విడిపోతే ఆస్తులు లాగేసుకుంటారు. మనుషుల్ని వెళ్ళగొడతారు లాంటి అబద్దపు ప్రచారాలు ఆపండి. దేశంలో ఇదొక్కటే రాష్ట్రం విడిపోవడం లేదు. గతంలో చాలా రాష్ట్రాలు విడిపోయాయి. దేశంలో అత్యంత ధనవంత రాజకీయ నాయకులు మీ సీమాంధ్రలోనే ఉన్నారన్న నిజం గుర్తుంచుకోండి. మీరు అనుకొనే సమైఖ్యాంధ్ర లో తెలంగాణా కూడా భాగమే కదా...మరి అలాంటప్పుడు తెలంగాణా వారంటే ద్వేషం చూపెట్టడం మీ కుంచితత్త్వమే కదా...మీ నాయకులంటారు మాకు భాష రాదని, సంస్కృతి లేదని...మరి మమ్మల్నెందుకు పట్టుకొని వేళాడుతున్నారు గబ్బిలాల్లా....విడిచిపెట్టండి ఇకనైనా...మా బతుకు మేం బతుకుతాం..మీ బతుకు మీరు బతకండి...హైదరాబాద్ ను సీమాంధ్రులు ఎంత అభివృద్ధి (?) చేశారో అందరికి తెలుసు. మీరన్నట్టుగా హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశంలో అది ఏ 2 లేక 3వ స్థానంలో ఉండాలి కానీ లేదే...మీరు కలిసే నాకు దేశంలో ఏ స్థితిలో ఉందో నేడు కూడా ఆస్థితిలో ఉంది....కొంచెం తెలివితో ఆలోచించండి మూర్ఖత్వంతో కాదు... పాలి కొట్లాట కాదు ఉద్యమం అంటే...నిజంగా తెలంగాణపై అభిమానం లేకపోతే ఇన్ని వందల మంది తమ ప్రాణాలర్పిస్తారా...??? కొంచెం బుద్ధితో ఆలోచించండి....

    రిప్లయితొలగించండి
  44. @చదువరి, సత్యాన్వేషి: ఎలక్షన్లలో కాంగ్రెస్, టిడిపి వాళ్ళు తమ మ్యానిఫెస్టోలో తెలంగాణ పదం పెట్టినప్పుడే తమ బోటి సమైఖ్యాంధ్ర వాదులు ఉద్యమం ప్రారంభించాలి కానీ, తెలంగాణ అన్న ప్రతిసారీ సమైఖ్యాంధ్ర ఉద్యమం (ఛీ దీన్ని ఉద్యమం అనాలంటే...) ప్రారంభమవుతోంది. మొదలు మీ రాచకీయ నాయకుల్ని అడగండి తెలంగాణ ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకున్నారో? ...అప్పుడే మీ బోటి మహానుభావులు వారి తోలు ఎందుకు తీయలేకపోయారో...???

    రిప్లయితొలగించండి
  45. @చదువరీ ఈయనెవరో ఏడుస్తున్నారు, ఇంత ఎంగిలి ముద్దవేసి పంపేయండి. పనిచేయరు, అడుక్కునేది లాభసాటి వృత్తిగా మారింది.

    రిప్లయితొలగించండి
  46. అజ్ఞాత, 26 ఫిబ్రవరి 2011 1:58:00 ఉ GMT+05:30 : మీ వ్యాఖ్య సత్యాన్వేషికి కూడానా? :)

    "దేశంలో ఇదొక్కటే రాష్ట్రం విడిపోవడం లేదు. గతంలో చాలా రాష్ట్రాలు విడిపోయాయి." - ఔనౌను, చాలా రాష్ట్రాలు విడిపోయి, తమ దారిన తాము పోయి, తమ రాజధానిని తాము ఏర్పాటు చేసుకుని తమ బతుకేదో తాము బతుకుతున్నారు. ’మీరు అభివృద్ధి చెందిపోయారం’టూ అవతలోడి మీద పడి యాడవలేదు. ’మేం పోతాం, మేం పోతాం’ అని అన్నారేగానీ, ’మీరు పోండి, మీరు పోండి’ అంటూ ఉద్యమాలు చెయ్యలేదు. ద్రోహులు, దోపిడీదార్లంటూ తిడుతూ ఛీత్కరించలేదు.

    "దేశంలో అత్యంత ధనవంత రాజకీయ నాయకులు మీ సీమాంధ్రలోనే ఉన్నారన్న నిజం గుర్తుంచుకోండి." - ఉంటే ఏంటంట? వాళ్ళు జనాన్ని దోచుకునే ఎదగారు, కాదన్ను. ఇంతకీ మీ బాధేంది? మీ రాజకీయ నాయకులు అలా సంపాయించుకోలేదనా? ’రండి, మీరు మమ్మల్ని ఇంకా బాగా దోచుకోండి’ అంటూ వాళ్ళని ఆహ్వానించండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవడు కాదన్నాడు?

    "మీరు అనుకొనే సమైఖ్యాంధ్ర లో తెలంగాణా కూడా భాగమే కదా...మరి అలాంటప్పుడు తెలంగాణా వారంటే ద్వేషం చూపెట్టడం మీ కుంచితత్త్వమే కదా" - ద్వేషం చూపెడుతున్నది మేం కాదు, తెవాదులు. చూపెట్టడమే కాదు, అబద్ధాలు తెగ చెప్పి ప్రజల మనసులనూ విరిచారు. కోస్తా సీమల ప్రజలను ద్రోహులంటూ నోటికొచ్చిందల్లా వాగారు.

    "మీ నాయకులంటారు మాకు భాష రాదని, సంస్కృతి లేదని..."- ఆపండిక ఈ తెరాస మార్కు ప్రచారాలు.

    "మరి మమ్మల్నెందుకు పట్టుకొని వేళాడుతున్నారు గబ్బిలాల్లా...."- ఇదిగో ఇట్టా తిక్కగా మాట్టాడే ఇక్కడిదాకా తెచ్చుకున్నారు మీరు. ఈ తెవాద నాయకులు మీకు నేర్పించిందిదే! ’ఇదిగో ఇంకాస్త ద్వేషం తాగు, ఇంకో గుక్క విషం మింగు’ అంటూ వాళ్ళు పోస్తూంటే, ’ఇంకాస్త పొయ్యండి, ఇంకాస్త పొయ్యండి’ అంటూ దోసిళ్ళతో తాగారు. తాగి ఇలా వాగుతున్నారు, తూగుతున్నారు.

    "హైదరాబాద్ ను సీమాంధ్రులు ఎంత అభివృద్ధి (?) చేశారో అందరికి తెలుసు. మీరన్నట్టుగా హైదరాబాద్ అభివృద్ధి చెందితే దేశంలో అది ఏ 2 లేక 3వ స్థానంలో ఉండాలి కానీ లేదే...మీరు కలిసే నాకు దేశంలో ఏ స్థితిలో ఉందో నేడు కూడా ఆస్థితిలో ఉంది...."- ముందిలాంటి తెరాస మార్కు ఆలోచనలు మానెయ్యండి. అప్పుడు మాటలు కూడా తేటపడతై.

    "కొంచెం తెలివితో ఆలోచించండి మూర్ఖత్వంతో కాదు..." - మీరు మాత్రం అణుమాత్రపు తెలివిని కూడా వాడబాకండి, ఉన్న ఆ రవ్వంత తెలివి కాస్తా అరిగిపోద్ది. మూర్ఖత్వాన్ని మాత్రం వాడుతూనే ఉండండి, లేకపోతే అది పొంగి పొర్లి పోగల్దు. ఇప్పుటికే అది పొరలు పొరలుగా పేరుకుపోయి, అట్టలు కట్టి దిబ్బలేసుకుపోయింది.

    "పాలి కొట్లాట కాదు ఉద్యమం అంటే...నిజంగా తెలంగాణపై అభిమానం లేకపోతే ఇన్ని వందల మంది తమ ప్రాణాలర్పిస్తారా...???"- మీ కోసం ప్రాణాలర్పించిన వాళ్ళ మీద సానుభూతి చూపిద్దాం, చూపించాలి. కానీ ఆ ఆత్మహత్యలను వాడుకుని, జనాన్ని బ్లాక్ మెయిలు చేసి, ఆ అమాయకుల ప్రాణాలను సొమ్ము చేసుకుందామనుకునే వాళ్ళతో మాత్రం జాగర్తగుండాలి. ఈ ఆత్మహత్యలు ఆ నాయకుల చేతిలోని ఆయుధాలు. ఎన్ని ఆయుధాలుంటే అంత ఎక్కువగా బ్లాక్ మెయిలు చెయ్యొచ్చు. కానివ్వండి. మాస్ హిస్టీరియా సృష్టించండి, కుర్రాళ్ళని ఇంకా ఇంకా రెచ్చగొట్టండి. మరిన్ని ఆత్మహత్యలు.. మరిన్ని ఆయుధాలు.. మరింత బ్లాక్ మెయిలు.

    రిప్లయితొలగించండి
  47. చదువులో ఎనకబడినం అంటారు, మరి తెలివిలో ఎవక బడలేదా? ఆంద్రోళ్ళను తెలివిలేదు ప్రతి బేవకూఫ్ తెలబాన్ గాడు అనేటోడే. అసదుద్దీన్ ఒవైసీ, అమానుల్లా ఖాన్లవి చేతనైతే ఎళ్ళి పీకండి, పీకి తెలంగాణలో హైద్రాబాద్ కలుస్తుందని ఓ స్టేట్మెంట్ ఇప్పించండి. మీక్కావలసినంత టైం ఇస్తున్నాం. బేకార్ గాళ్ళు వూకే బ్లాగులన్నీ ఖరాబ్ చేస్తున్నరు. పొయ్యి ఆడ ఉర్దూ బ్లాగుల్లో పడి సాయండి. ఇంకో విషయం చేతకాదు, తెలీదు ఈ బేకార్ గాళ్ళకి. ఇంకో బఫూన్‌గాడైతే ఏదో తేలిపోయిందంట అంటూ, ఏకంగా అస్యూరెన్స్లు ఇచ్చేస్తున్నాడు ఏదో పోలీస్ కమీషనర్ ఖాన్ అయినట్టు, తీస్కో నా వాస్కోడిగామా అంటూ. ఇంకో పెద్దమనిషి సెలవ్ పెట్టి ఆంధ్రోళ్ళిచ్చే జీతం తింటూ రాజకీయాల్లో దూరేందుకు చూస్తున్నడు. గీడ బ్లాగుల్లో అరిస్తే ఫాయిదా లేదు, ఎళ్ళి కెటీర్ కాళ్ళు పట్టుకో, బస్సులమీద రాళ్ళేయ్, షర్ట్‌లిప్పి నడుముకట్టుకోని కూలోళ్ళ పోజులియ్యి, వృద్ధిలోకొస్తావ్.

    రిప్లయితొలగించండి
  48. చదువరి గారు

    >>>ఔనౌను, చాలా రాష్ట్రాలు విడిపోయి, తమ దారిన తాము పోయి, తమ రాజధానిని తాము ఏర్పాటు చేసుకుని తమ బతుకేదో తాము బతుకుతున్నారు

    మద్రాసుతో కూడిన ప్రత్యేకాంధ్రను కోరి పొట్టిశ్రీరాములును గూడా బలిపెట్టారుగా? అప్పుడే మరిచి పోయారా?

    ఖర్మకాలి మద్రాసు మీకొచ్చుంటే రాజధానితో కూడిన రాష్ట్రమే వచ్చేదిగా?

    మీకు తెలియదేమో, మూంబాయి రాజధానిగా ఉన్న మహారాష్ట్రీయులు కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు.

    రిప్లయితొలగించండి
  49. గట్లనా! మన్షిగ చెప్పినవ్. గాని అది పాత మాట, ఇది కొత్త మాట. నిజాం ఆడమంటే బట్టలిప్పి బతుకమ్మ ఆడిండ్రంట, గిప్పుడు ఆడతవ? రాళ్ళేస్తరు. గిదీ ఇంతే. సమజయ్యిందా, సమ్మయ్యా? చల్ హఠ్. నెగ్స్ట్ ఎవలో రండ్రా భయ్. నేనే బేకార్ అనుకుంటే నాకన్నా బేకార్లు ఉస్ మేనియాలో తయారవుతున్నరు. గిది ఇనుకో జర
    http://www.youtube.com/watch?v=5DrHFxZ40v4

    రిప్లయితొలగించండి
  50. /ఖర్మకాలి మద్రాసు మీకొచ్చుంటే రాజధానితో కూడిన రాష్ట్రమే వచ్చేదిగా?/

    అదృష్టం బాగుండి, నిజాం-రజాకార్లు ప్రయత్నించినట్టు మీరు పాకిస్థాన్లో వుండివుంటే గింటే, ఐతే గియ్తే, మా సీమాంధ్రకూ భాష ఒకటని కలిసి వుండే ఖర్మే పట్టివుండేది కాదు కదా? పాకిస్థాన్‌తో వార్ వచ్చినపుడల్లా మిమ్మల్ని పిచ్చకొట్టుడు కొట్టి మీతో పితుహు పితుహు అని ఘనతవహించిన నిజాం నవాబ్‌ను తలుచుకునేలా చేసేవాళ్ళం కదా. నిజమే, చానా నష్టపోయాం.
    ఐతేగియ్తే అంటూ 50ఏళ్ళక్రితం జరిగిన వాటిపై ఇప్పుడు గాలిమేడలు వూహించుకుని ఆనందించడం మూర్ఖత్వం, అని మీ తెలబాన్లు ఎప్పుడు గ్రహిస్తారో కదా. :)
    ---------
    అజ్ఞాత, 26 ఫిబ్రవరి 2011 7:31:00 సా GMT+05:30

    You Tube లింక్ బాగుంది, తృప్తిగా నవ్వుకున్నా.
    జై తెలంగాణ ;) :)).

    రిప్లయితొలగించండి
  51. అసలు ఈ విభవన వాదమే మంచిది కాదు. దేశంలో ఇన్ని రాష్టాలు ఉండటం వల్లనే మనలో మనకు కలహాలు. మొత్తం దేశమంతా ఒకటే తెలుగు జాతీ, ఒకటే తెలుగు భాష ఉండేటట్టు మనందరం కలిసి ఉద్యమం చేస్తే అప్పుడు దోచుకొనేవాడు, దోచుకోబడేవాడు మన తెలుగువాళ్ళే కాబట్టి ఎవరైనా //మమ్మల్ని దోచుకుంటున్నారు//...అంటే మీ మొహం వాళ్ళు కూడా మన తోటి తెలుగు వాళ్ళేరా..పాపం దోచుకోనివ్వు. నీకు కావాలంటే తెలుగు భాష మాట్లాడు దాహం తీరుతుంది. పొలాలు పండుతాయి, నీ కడుపునిండుతుంది. ఇంకా కావాలంటే కమ్మని తెలుగులో కాస్త కవిత్సం రాయి పుణ్యం కూడా వస్తుంది అని చెప్పొచ్చు. అంతేకాదు మనల్ని విడదీయడానికి ఏ తమిళుడు (చిదంబరం) ప్రయత్నించడు. ఏ విదేశీయురాలూ ప్రయత్నించదు. ఇకమీదట దేశమంతా ఒకటే భాష మాట్లాడాలని రూల్ తెద్దాం. కలిసి ఉంటే కలదుసుఖం...అని పాటలు పాడుకుందాం...అందరం ఉద్యమిద్దాం...

    ఏమంటారు సమైఖ్యాంధ సోదరులారా....!!!
    (అన్నట్టు నేనూ పిల్లలకు తెలుగు బోధిస్తుంటాను)

    రిప్లయితొలగించండి
  52. bharathadesham badulu Telugudesham ani maaruddam mana country peruni.

    రిప్లయితొలగించండి
  53. గణేశ్: బాగా చెప్పారు మాస్టారూ! మన్యసీమ అడిగే గిరిజనుల నోరునొక్కింది ఈ ముక్కలు బోధించేనా సమై’ఖ్య’ తెలంగాణ సోదరా? నొఖ్ఖండి, నొఖ్ఖండి. ఒఖవేళ వాళ్ళు నోరెత్తితే, ఏం చెప్పాలో సమై’ఖ్య’ తెలగాణ్యులకు ఇప్పుడు తెలిసిపోయిందోచ్ఛ్.. ’దోచుకొనేవాడు, దోచుకోబడేవాడు మన తెలంగాణవాళ్ళే కాబట్టి, ఎవరైనా //మమ్మల్ని దోచుకుంటున్నారు//...అంటే.. మీ మొహం వాళ్ళు కూడా మన తోటి తెలంగాణవాళ్ళేరా, పాపం దోచుకోనివ్వు. నీకు కావాలంటే ఝై తెలంగాణ అను, కడుపు నిండుతుంది, ఝై బోలో తెంగాణ సినిమా చూడు దాహం తీరుతుంది. ఇంకా కావాలంటే ఝఝ్ఝనక ఝఝ్ఝనక అంటూ చిందెయ్యి, పుణ్యం కూడా వస్తుంది అని చెప్పొచ్చు.’

    అజ్ఞాత: పోనీ తెలంగాణస్థాన్ అనో, నైజాం అనో, నిజాముస్థాన్ అనో పెట్టేసుకుందాం లెండి. ఒప్పుకోలేదనుకోండి.. అసెంబ్లీలను, పార్లమెంటును అడ్డుకుందాం, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, మంత్రులను, శాసనసభ్యులనూ రాజీనామా చెయ్యాల్సిందేనని ఘెరావు చేద్దాం. ఢిల్లీ వస్తే కాళ్ళిరగ్గొడతామని తేల్చిచెప్పేద్దాం. మనకనుకూలంగా మాట్టాడనివాడెవడైనా సరే.. జేపీని కొట్టినట్టు కొఠేద్దాం. మనకడ్డేంటి?

    రిప్లయితొలగించండి
  54. చెప్పేందుకు సమాధానం లేక బాగా తిప్పి తిప్పి చెప్పారు @చదువరి గారూ.

    రిప్లయితొలగించండి
  55. అజ్ఞాత: తిప్పితిప్పి చెప్పానా? సూటిగానే ఎక్కిరించాననుకున్నానే! ఏంటో.. ఎటకారానికి సమాధానంగా మీ అంత బాగా ఎక్కిరించడం కూడా చెయ్యలేకపోతున్నాను, నేర్చుకోవాలన్నమాట! మీబోటి ఘనపాఠిలు వ్యాఖ్యానిస్తూ ఉంటే నేర్చేసుకోడం ఎంతసేపులెండి!

    రిప్లయితొలగించండి
  56. ఇన్నాళ్ళుగా తెలంగాణా ఉద్యమం చూస్తున్నా నాకు అర్ధం కాని విషయం ఒక్కటే. సరే తెలంగాణాకి శానా అన్యాయాలు జరిగినయ్ అనుకుందం బై. అన్యాయాలు, అవమానాలు జరిగితే ఎదిరించాలి, నిరసన వ్యక్తం చేయాలి, అదిలించో, బెదిరించో ఆ అన్యాయాలను రూపుమాపాలి. ఆ లోపాలు సవరింపబడేంత వరకు ఉద్యమాలు చేయాలి, దీక్షలు చేయాలి, రాస్తారోకోలు అలా అలా ఎన్నో అహింసా మార్గాలలో ప్రయత్నించాలి. అయినప్పటికీ ఆ అన్యాయాలు దూరం కాకపోతే హింసా మార్గం కూడా ఓకే అనుకుందాము ప్రస్తుతానిక. సమాన హక్కులు, స్థాయి, ఆదాయం సాధించుకోవడానికి బలిదానాలూ, ఆత్మార్పణలు కూడా వోకే అనుకుందాము.

    విడిపోవడం కోసం చేస్తున్న ఈ చేష్టలన్నీ మీకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి ఉపయోగించవచ్చు కదా. వాటికి విడిపోవడమే పరిష్కారం అని ఎందుకు భావిస్తున్నారు?

    ఇదే నిరాహార దీక్షలు, ఆందోళనలు, ఆత్మార్పణలు ఆ ఆన్యాయాలని ఎదిరించడానికి చేస్తే అందరి సానుభూతి, సహకారం వుండటమే కాకుండా ప్రభుత్వం కూడా దిగివస్తుంది కదా.

    తెలంగాణా వాదులూ, దయచేసి నా సందేహాన్ని క్లుప్తంగా తీర్చగలరు. చర్విత చరణంగా చెప్పిన చరిత్ర, సమాచారం లప్పెడంత నా ముందు పడెయ్యొద్దు ప్లీజ్. నాకు అది జీర్ణం కాదు. ఎటువంటి వంకరటింకరలు లేకుండా ఈ సందేహానికి సూటిగా, క్లుప్తంగా వివరిస్తారని ఆశిస్తున్నాను.

    నా మీది గౌరవం తగ్గినవారూ, కూడా వెల్కం :

    రిప్లయితొలగించండి
  57. తెలంగాణ బిడ్డ5 మార్చి, 2011 2:17:00 AM ISTకి

    బాబూ రక్తచరిత్ర గారూ. మీరు ఇన్నాళ్ళుగా తెలంగాణా ఉద్యమం చూస్తున్నా ఎందుకు చేస్తున్నామో అర్థం కాలేదంటే అది మీ ఖర్మో, మా ఖర్మో అర్థం కావడం లేదు. మా చరిత్ర చెప్పొద్దన్నారూ సరే కనీసం మీకు తెలిసిన చరిత్ర అయినా చదువుకోండి. 1969 నుండి మేం మోసపోతున్నాం మొర్రో అని ఆందోళనలు చేస్తుంటే పాపం అవి మీరు చూడలేదేమో. ఇవ్వాలే యోగనిద్ర నుండి వచ్చారా రక్తచరిత్ర గారూ. మీరు చెప్పినట్టుగా మాకు అన్యాయం జరిగిన ప్రతిసారీ కొట్లాడుతూనే ఉన్నాం. మేం కొట్లాడిన ప్రతిసారీ కొన్ని సాకుూ, బేకులూ, ఒప్పందాలతో (42శాతం వాటా, 610 జి.ఒ, పెద్మోద మనుషుల ఒప్సందం) మోసం చేస్తునే ఉన్నారు. ఇప్పటికీ ఏ ఒక్క ఒప్పందం సరిగ్గ అమలు కాలేదు ఈ సమైఖ్య రాష్ట్రంలో అమలు కాదు కూడా. ఎందుకంటే ఎవడి రాజకీయ ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు వాడివి. ఈ రాష్టంలో కలిసే వరకు నిజాం వల్ల కష్టాలు పడ్డం, ఇప్పడు ఈ సీమాంధ నాయకుల వల్ల కష్టాలు పడుతున్నాం. అందుకే మా రాష్ట్రం కోసం మేం ఉద్యమం చేస్తున్నాం కానీ మీ ఆస్తని రాసిమ్మని అడగలేదు కదా...

    రిప్లయితొలగించండి
  58. @చదువరి గారూ...ఈ బ్లాగ్ పోస్ట్ చూడండి. మీరు చాలా తెలివైన వారూ, చదువుకున్న వారూ, గొప్ప విజ్ఞులు అని విన్నాను. ఇతి తెరాస కరపత్రంగా భావించకుండా కాస్త సమాచార హక్కు చట్టం ద్వారా ఇందులో చెప్పిన వాటిలో ఏ ఒక్కటైనా నిజం కాదని నిరూపించరూ ప్లీజ్...ఒకవేళ ఇవన్నీ అబద్దాలైతే నేను కూడా మీతో గొంతుకలిపి కెసీయార్, హరీశ్రావులతో కూడా జై సమైఖ్యాంధ్ర అనిపిస్తా...ప్లీజ్ కాస్త సాయం చేయండి
    http://laahiri.blogspot.com/2011/02/108.html

    రిప్లయితొలగించండి
  59. అయ్యో @చదువరి గారూ.. పైన చెప్పిన విషయాల మీదే శ్రీకృష్ణ కమిటీ నివేదక ఇచ్చింది కదా అంటారేమో. ఆ నివేదిక ఎవరు రాయించారో చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఆ నివేదిక మీద మన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఇటీవలి కామెంట్లు గుర్తుకుతెచ్చుకొండి. అంతేకాదూ అందులో విద్యుత్ శాఖమీద ఇచ్చిన నివేదిక నిజమని నిరూపిస్తే తెలంగాణ ట్రాన్సకో వారు కోటి రూపాయల బంపర్ బహుమతి ప్రకటించారు. ప్రయత్నించండి కోటీశ్వరులైపోతారు. ఈ విషయాన్ని నాకేం పనిలేదా అని తేలిగ్గా తీసిపారేయకండి. మీరు చేసే ప్రయత్నం వల్ల తెలంగాణా ఉద్యమం పూర్తిగా సమసిపోయి మనందరం హాయిగా సమైఖ్యాంధ్ర రాష్ట్రంలోనే వుండొచ్చు. (అన్నట్టు మీరు తెలంగాణా వారిని భలే వెక్కిరిస్తారండి)....

    రిప్లయితొలగించండి
  60. ఆ బేవకూఫ్ పనేదో ఇప్పుడున్న బేవకూఫ్ పనిలోపనిగా మీరే చేయవచ్చు కదా హరి గారు. బేవకూఫ్‌ల పిల్లలకూ ఇదే తప్పుడు మాటలు, అడుక్కుతిని బ్రతకడం, ఇంకోకళ్ళ మీద పడి ఏడ్వటం నేర్పుతారు. థూ మీ సిగ్గులేని, ముష్టి బ్రతుకులు. మీలాంటి లఫంగా గాళ్ళ తలాతోకలేని ప్రశ్నలకు సమాధానం లాఠీతోనే చెపాలి. సీమాంధ్రులు తెలంగాణా వదలి పోరు, పనిగట్టుకుని వలసలు వస్తాం. ఏం పీక్కుంటారో పీక్కోండి.

    రిప్లయితొలగించండి
  61. అజ్ఞాత: "మీరు చాలా తెలివైన వారూ, ..." - అబ్బే.. నేను మీ అంత తెలివైన వాణ్ణి కాదండీ. అయినా, ఆ అబద్ధాలను అబద్ధాలేనని నిరూపించడానికి తెలివైనవాడు కావాలంటారా, నాబోటిగాడు చాలడూ? అదేమైనా శ్వేతపత్రమా.. జోకులపుట్టైతేనూ!

    "..ఇందులో చెప్పిన వాటిలో ఏ ఒక్కటైనా నిజం కాదని నిరూపించరూ ప్లీజ్.." - ఆ కాపీ పేస్టు అబద్ధాల గురించి 2009 లోనే రాసాను, అంకెలతో సహా! మీరు చదివినట్టు లేరు. కింది లింకులు చూడండి.
    1. http://chaduvari.blogspot.com/2009/12/blog-post_27.html
    2. http://chaduvari.blogspot.com/2010/01/blog-post_11.html
    3. http://chaduvari.blogspot.com/2009/12/blog-post_14.html
    4. http://chaduvari.blogspot.com/2010/04/blog-post_26.html

    (ఆ నూటెనిమిది అబద్ధాలు/సగం అబద్ధాలు/పావు అబద్ధాల గురించి బ్లాగరుల్లో తెలీనివాళ్ళు లేరు. అసలా నూటెనిమిదింటిలో కొన్ని రిపీటు. అంటే ఒకే అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పారన్నమాట. ఉదాహరణకి 25, 88 అబద్ధాలు చూడండి- రెండూ ఒకటే.
    ఆ జాబితాలో ఉన్నవన్నీ అబద్ధాలే అని నేను అనడం లేదు సుమండీ.. వాటిలో కొన్ని జోకులూ ఉన్నై. జోకుల్ని జోకులుగానే తీసుకోవాలి కాబట్టి నేను వాటిని పట్టించుకోలేదు.)

    "అన్నట్టు మీరు తెలంగాణా వారిని భలే వెక్కిరిస్తారండి" - మీరు తెలివైనవారే కాదు, అతితెలివైనవారు సుమండీ! నేను ఎక్కిరించినది నన్ను ఎక్కిరించినవాణ్ణే. అంతేగానీ తెలంగాణవాళ్ళను కాదు, గమనించండి సార్.

    రిప్లయితొలగించండి
  62. లాతోంసే జానే భూత్ బాతోంసే నై మాన్‌తా. ఎంత చదువుకున్నా గాడిద గాడిదే,తెలబాన్ తెలబానేఅని వూరికే అన్నారా. ఆ చీకోలం తింగరోడు మద్దతిచ్చాడంటేనే వీళ్ళ కేసు ఏపాటిదో తెలిసిపోయింది.

    రిప్లయితొలగించండి
  63. @చదువరి గారూ..నమస్కారం. 1973 జై ఆంధ్రా ఉద్యమం ఎందుకు వచ్చిందంటారు? పి.వి.నరసింహారావును ముఖ్యమంత్రి పదవి నుండి ఎందుకు తొలగించవలసి వచ్చింది. దీనిలో ఆంధ్రావారి పాత్ర ఎంతమేరకు? ముల్కీ రూల్సు రాజ్యాంగబద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పు అమలయ్యిందా? ఎవరు అడ్డుకున్నారు? హైదరాబాద్ ఫ్రీ జోన్ అనడం సమంజసమేనా? 610 జి.వో అమలుకు నేటికీ ఉన్న అడ్డంకులు ఏమిటీ? వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు సమంజసమేనా?
    దయచేసి సమాధానలివ్వండి...

    రిప్లయితొలగించండి
  64. తెలంగాణ బిడ్డ6 మార్చి, 2011 3:15:00 AM ISTకి

    @చదువరి //"అన్నట్టు మీరు తెలంగాణా వారిని భలే వెక్కిరిస్తారండి" - మీరు తెలివైనవారే కాదు, అతితెలివైనవారు సుమండీ! నేను ఎక్కిరించినది నన్ను ఎక్కిరించినవాణ్ణే. అంతేగానీ తెలంగాణవాళ్ళను కాదు, గమనించండి సార్.//
    బాగుంది... తెలంగాణా వాళ్ళు కూడా జాగో బాగో అన్నది ఆంధ్రా ప్రజలని కాదు కేవలం పెట్టుబడి పేరుతో దోచుకొనే వాళ్ళని...అంతేకాదు వ్యతిరేకించేది కూడా సీమాంధ్ర ప్రజలని కాదు..అక్కడి దుష్ట రాచకీయ (వ్యాపార) నాయకులని మాత్రమే...
    మీరూ గమనించండి సార్....ఏదో సందర్భంలో కె.సి.ఆర్ గారూ జాగో బాగో అంటేనే ఆయన చెప్పిన మొత్తం విషయాన్ని పక్కన పెట్టి కేవలం రెండు మాటలనే పట్టుకొని మొత్తం సీమాంధ్ర వారి మనసుల్ని కలుషితం చేయడం కూడా మంచిది కాదు...గమనించండి)))

    రిప్లయితొలగించండి
  65. సూటిగా, మంచిగ అడిగారు. తెలబాన్లలో మీరు అతి మేధావుల్లా వున్నారు. ఉద్యమం ఆపి, ఇంటర్ పరీఖలు సజావుగా జరిగానివ్వండి. మీకు ఎలా పనీపాట లేదుగా, ఆ తరువాత మనం తీరిగ్గా టెరేస్ మీద బిర్యాని తింటూ, బీరు తాగుతూ చర్చించు కుందాము. ఇవన్నీ ముందే చర్చించకుండా, తెలియకుండానే ఎదవ ఉద్యమం చేస్తున్నారా? మీ ఉద్యమ స్పూర్తి మెచ్చుకోవాల్సిందే.

    రిప్లయితొలగించండి
  66. తెలంగాణ బిడ్డ/అజ్ఞాతలు/గణేశ్: మాట తప్పించొద్దు, విషయానికి రండి. మీవాళ్ళు చెబుతున్న అబద్ధాల సంగతేంటో చెప్పండి. నేను ఇచ్చిన లింకులు చదివారా? మీ నూటెనిమిది అబద్ధాల గురించి ఏమనుకుంటన్నారు? జై సమైక్యాంధ్ర అంటూ మీ కరీంనగర్లో ఎప్పుడు నినదిస్తున్నారు?

    రిప్లయితొలగించండి
  67. ఆ మద్యన ఒక దిక్కుమాలిన వార్తా చానెల్లో ఒక గొప్ప మేధావి తెలంగాణా వారిని ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో ఏకరువు పెడుతూ, ఆఖరికి సినిమాలలో కూడా తెలంగాణా వారికి మంచి పాత్రలు ఇవ్వరు కేవలం తన్నులు తినే కామెడీ పాత్రలు వేణుమాధవ్ లాంటి వాళ్లకు ఇస్తారు అని చెప్పిన పెద్దమనిషి(?) మరి తెలంగాణా ముద్దు బిడ్డ బహుగోప్ప సృజనశీలి అయిన శంకర్ మరి :జై బోలో తెలంగాణా" సినిమాలో కథానాయకుడికి అగ్రకులానికి చెందినా ఆంధ్ర హీరో "జగపతి బాబు"ని ఎందుకు ఎన్నుకున్నారు.హీరో "నితిన్",ఈ మధ్యన కొత్త హీరో ఇంకో తెలంగాణా వ్యక్తీ(పేరు తెలీదు)ని ఎందుకు తీసుకోలేదు.తెలంగాణా భవనాన్నికట్టడానికి ప్రకాశం జిల్లా కాంట్రాక్టర్ కావాలి(మరి తెలంగాణా వాళ్ళ ఉద్యోగాలు కొల్లగోడుతున్నవాళ్ళు ఎవరు ???).తెలంగాణా టివి చానేలుకు టివి౫ (ఆంధ్ర వాళ్ళది) సాంకేతిక సహకారం అందించి నప్పుడు ఆత్మగౌరవాలు గుర్తుకు రావా? చివరికి తెలంగాణా రావాలని గోదావరి జిల్లా సిద్ధాంతితో యజ్ఞం చేయిన్చుకున్నపుడు (నిజంగా నాకు నవ్వు వస్తుంది :) ఆత్మగౌరవాలు గుర్తుకు రావా? కొడుకుని గుంటూర్ కాలేజిలో చదివిన్చినపుడు ఆత్మగౌరవాలు గుర్తుకు రావా? మనవళ్ళని ఆంధ్ర వాళ్ళ ఖరీదయిన కార్పోరేట్ స్కూల్ ఒక్రిద్జ్ లో చదివిన్చేతపుడు ఆత్మగౌరవాలు గుర్తుకు రావా? కే.టి రామారావు ఆంధ్ర వాళ్ళతో కలిసి వ్యాపారం చేసేటప్పుడు ఆత్మగౌరవాలు గుర్తుకు రావా? ధర్నాలు చేస్తూ ఎవరూ చూడకుండా ఆంధ్రా వాళ్ళ హోటలులో దూరినప్పుడు ఆత్మగౌరవాలు గుర్తుకు రావా? ఇపుడు ఏ రామోజీ రావో,రామానాయుడో పిలిచి సినిమా ఇస్తే శంకర్ దర్శకత్వం చేయడా? ఇతను పచ్చి అవకాశవాది కాదా! నక్సలైట్ల సహకారముతో ఇతను చేసే వ్యవహారాలూ బయటి వారికి తెలియవేమో కాని పరిశ్రమలో చాల మందికి తెలుసు.ఇతనికి మరి దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చింది "ఆంధ్ర" రామోజి రావు కాదా.ఒక్క వెధవ అయినా మరి ఈ విషయం ఎందుకు గుర్తుకు చేసుకోరు. మేధా ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ "చిరంజీవి"విశాఖపట్నంలో విజయవంతంగా (ఈయన తెలంగాణా బిడ్డ) నడుపుతుంటే ఏ ఆంధ్రా వారుఅయినా ఇబ్బంది పెట్టారా???వరంగల్లు వ్యక్తీ, దర్శకుడు సురేంద్ర విజయవంతంగా ఎవరితో సినిమాలు చేసారు, ఎక్కడ ఆడుతున్నాయి. సిగ్గు వుంటే సమాధానం ఇవ్వాలి తెలంగాణా మేధావులు(??). మొకాలుతో ఆలోచించడం మాని, హృదయముతో స్పందించి నోటితో మాట్లాడడం చేయండి.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు