28, జనవరి 2011, శుక్రవారం

కలియుగంలో శూర్పణఖ

[ఈ టపా రాయడానికి ప్రేరణ ఇది: http://www.youtube.com/watch?v=JlMUlgWsd7w&feature=player_embedded]

 త్రేతాయుగం! ముక్కూ చెవులూ కోయించుకున్నాక, శూర్పణఖ నెత్తురోడుతూ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకుని ఏడవడం, సీతాపహరణం, రావణవధ, శ్రీరామ పట్టాభిషేకం.. ఇవన్నీ మనందరికీ తెలిసినవే!. అయితే ముక్కుచెవులూ కోయించుకున్న శూర్పణఖ గతి ఆ తరవాత ఏమైందో మనం పట్టించుకోలేదు. ఏమైందో చూద్దాం..

శూర్పణఖ రావణాసురుడి దగ్గరికి వెళ్ళి, ’సీతను తీసుకురావడం సరే.., ఇప్పుడు నా గతి ఏంటి? నా ముక్కు చెవుల సంగతి ఏంటి’ అని ఏడ్చి మొత్తుకుంది. అసలే వికారంగా ఉండే శూర్పణఖ, ముక్కూ చెవులూ లేకపోయేసరికి మరీ వికృతంగా తయారైంది. ఆ వికృతాకారం రోజూ తన దగ్గరికి వచ్చి నా ముక్కో నా చెవులో అంటూ గోలెడుతుంటే చిరాకుతో పాటు రోత కూడా కలుగుతోంది రావణుడికి. అయితే ఆమెకు ముక్కూ చెవులను యాడనుండి తేవాలో రావణుడికి అర్థం కాలేదు. ఏదో ఒకటి చేస్తాలే అంటూ కాలం గడుపుతున్నాడుగానీ ఏమీ చెయ్యడం లేదు.

చివరికో రోజు, "ఈ జన్మలో నీకు ఏమీ చెయ్యలేనుగానీ, పై జన్మలో ఈ లోటును పూరించేలా వరమిస్తాను, సరేనా?" అని అడిగాడు.
"ఎలా పూరిస్తావ్?" అని అడిగింది శూర్పణఖ.
"ఏముందీ, నువ్వు ఏనుగులాగా పుట్టగలిగే వరమిస్తాను, ఎంచక్కా పెదపేద్ద చెవులుంటై, పొడుగాటి ముక్కుంటది " అన్నాడు.
"నన్ను ఏనుగు, ఆవూ లాంటి శాకాహారిగా పుట్టిస్తే ఊరుకోను. ఇంచక్కా మనుషులను తినే అవకాశముండాలి" అని మారాం చేసింది, శూర్పణఖ.
"సరే, కలియుగంలో నువ్వు మనిషిగా పుట్టే వరమిస్తున్నాను, ఇక సంతోషించు" అన్నాడు.
"మనిషి లాగానా? వాడు మరీ సాధుజీవి, పైగా మనిషిమాంసం తినే వీలుండదు, నాకొద్దు ఆ వరం" అని గోలచేసింది.
"కాదు కాదమ్మా, నువ్వు మామూలు మనిషిగా పుట్టవ్. ఒక ప్రత్యేక మనిషిగా పుడతావ్. పేద్ద ముక్కుతో ఉంటావ్. ఏదో ఒక ఉద్యమమనో, అదనో ఇదనో చెప్పి, మనుషులను పీక్కుతింటావ్. అలా పీక్కుతినడంలో నీవాళ్ళు, పరాయివాళ్ళు అనే తేడా చూపించవ్.   అవాకులూ చెవాకులూ పేల్తూంటావ్. ప్రజల మధ్య గొడవలు పెట్టి వినోదం చూస్తావ్. నువ్వు ఆ జన్మలో భలే ఎంజాయ్ చేస్తావ్. నేను చెబుతున్నానుగదా, వినమ్మా!" అని రావణుడు చెల్లెల్ని బుజ్జగించి పంపించాడు.
............
ఇక త్రేతాయుగం నుండి, ప్రస్తుతానికొస్తే, రావణాసురుడు స్వర్గం నుంచి చెల్లెలు ఎలా ఉందో చూద్దామనుకుంటూ ఇటుకల్లే వచ్చాడు. చెల్లెలు ఇప్పుడు ఎవరిగా పుట్టిందో, దాని పేరేంటో కూడా తెలుసు కాబట్టి, నేరుగా హై. వచ్చాడు రావణుడు. తన చెల్లెలు ఇప్పుడు పెద్ద ఉద్యమ నాయకుడని తెలుసుగానీ ఎప్పుడూ చూళ్ళేదు. అటుగా పోతూంటే ఒక చోట జనం గుమిగూడి ఉన్నారు. ఒకతడు మైకు పట్టుకోని మాట్టడుతూ బూతులు తిట్టేస్తున్నాడు. ఆ ముక్కు చూడగానే గుర్తు పట్టేసాడు, అతడే తన చెల్లెలని. సరే అతడేం చెబుతున్నాడో విందామని దగ్గరగా వెళ్ళాడు. (రావణుడు మామూలు మనుషులకి కనబడడని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదని నాకు తెలుసు.)

తలకాయ ఊపుతూ, ముక్కును ముందుకు పొడుస్తూ ఉంటే.. నా మాటలతో చావకపోతే ముక్కుతో పొడిచైనా సరే ఆ ఎదట నిల్చున్నవాళ్ళను చంపేస్తానంటున్నట్టు ఉం దాతడి వాలకం. ఇంతలో అతడు, రావణాసురుడు ఫలానా అంటూ మొదలుపెట్టి రావణుణ్ణి కూడా తిట్టడం మొదలుపెట్టాడు. అది విన్న రావణుడు హతాశుడయ్యాడు. ’ఇదేంటి అన్నను, నన్ను కూడా తిడుతున్నాడు, వీడికసలు బుద్ధి ఉందా’ అని మనసులోనే కోపగించుకున్నాడు. ఇంతలోనే, "పాపం మనిషి గదా.. జన్మాంతర జ్ఞానం ఉండదు లెమ్మ"నుకుని, అక్కడే ఉంటే, ఇంకా ఎన్నెన్ని మాటలు వినాల్సి వస్తుందోనని మెల్లగా జారుకున్నాడు.

రావణుడు వెళ్ళిపోవడం గమనించిన అ ముక్కుమనిషి నవ్వుకుంటూ,
"అన్..నా, నువ్వొచ్చినవని నాకు ఎర్క లేదనుకున్నావె? నేను మనిషిననుకున్నావె? ఆ జన్మలో నా రాక్షస కోరికలు తీరకనే గదా గిప్పు డిట్ట పుట్టిన, ఇక  రాక్షసాంశ ఏడికి పోతదిరా భయ్? అంద్కనే గాదుర, నిన్ను కూడ చూడగలిగిన! పో,పో ఈడనె ఉంటే నీ బొంద బెట్టిస్త, ఏందనుకుంటన్నవొ!"అని అనుకున్నాడు. ఇంకా..

"ఏదేమైనా, మంచి జనమ నిచ్చినావుర అన్నా, సక్కగ నా జనాన్నే నిలబెట్టి పీక్క దినొచ్చు. మంచిగుందిర అన్న! నాకీ జనమనిచ్చి నీ పని నువు జేసినవ్. ఇగ దీన్ని ఒదుల్తనా? రాష్ట్రాన్ని రానివ్వ, గిట్ల ఉద్యమం జేస్తనే ఉంట, జనాన్ని పీక్కు తింటనే ఉంట!" అని తన ఆంద్రోళ్ళను తిట్టుడు, తనోళ్ళను తినుడూ కార్యక్రమాన్ని కొనసాగించాడు.

23 కామెంట్‌లు:

  1. అయ్యబాబోయ్ నవ్వ లేక చస్తున్నా . Really this is the one of your best sir !
    ఇంతకీ కామెంట్ మోడరేషన్ పెట్టారా లేదా ? లేకపోతే ఆ డైలాగులు ఇక్కడ చదవాల్సి వస్తుంది .

    రిప్లయితొలగించండి
  2. చదువరీ,
    సూపర్. ఆడికెవడన్న యింత పచ్చిగడ్డి తెచ్చిపెట్టాండ్రా బాబో.

    రిప్లయితొలగించండి
  3. బాగా లేదు. చదువుకున్న వారు ఒకరి physical appearance మీద ఎప్పుడు jokes వెయ్యకూడదు అని తెలియదా. మీలో కూడా ఏదో ఒక లోపం ఉండే ఉంటుంది. లేకపోతే మీకు ఇష్టమైన వాళ్ళలోనో ఇంకా మీ దగ్గరి వాళ్ళలోనో. మీరు కూడా ఇలాంటి కామెంట్ విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. నేనేమి KCR అభిమానిని కాదు.

    రిప్లయితొలగించండి
  4. డియర్
    అజ్ఞాత, ఇదే మాటను కేసీఆర్ కు తెలుపగలరు ఆంధ్రులంటే రాక్షసులుకారని
    ఇక ఆంధ్రులపై పౌరాణికంగా చారిత్రకంగా ఈ వ్యాఖ్యలు చేసేవారికి ఋజువు చెప్తాను. ఋగ్వేద కాలంనుండీ వేదాలు ఘోషిస్తున్న భూమి మన ఆంధ్ర భూమి.
    శంకరులవారు దర్శించి తరించిన ఆలయాలు మన రాష్ట్రంలోనే అత్యధికం.
    ఆంధ్రులు నేటికీ వేదపారాయణాల్లో దిట్టలే.
    మన సోకాల్డ్ వెస్టర్న్ కల్చర్ కు తారసపడకుండా ఈ నాటికీ త్రికాలసంధ్యలు ఆచరిస్తూ, వేదపారాయణాన్ని ఒక నిత్యనియమంగా పాటించేవారు మీకు ఈ నేల మీదే దొరుకుతారు. చాణక్యుడి నుండీ సమర్థరామదాసు(శివాజీ కి గురువు) ఆంధ్రులే.
    ఇక ఆంధ్ర పదం రాక్షసులకు ఎలా అన్వయించుకుందంటే (ఇది నే వినగా అంటే స్మృతి ద్వారా పెద్దలవద్ద తెలుసుకున్నది)
    కంసుడు భారతదేశాన్ని తన రాక్షసగణమైన కేశాది నీచులతో హింసించాడు.
    వారిలో మల్లయుద్ధ ప్రవీణులైన చాణూరముష్టికాసురులు గలరు. వీరిద్దరు ప్రస్తుతం ఆంధ్రఉన్న ప్రాంతాన్ని ఆ రోజుల్లోనే ఆక్రమించి ఇక్కడి ప్రజలను హింసించేవారు.
    వారిని శ్రీకృష్ణుడు మథురకు వచ్చిన సందర్భంగా చంపి, ఆంధ్రులను అంటే మనల్ని ఆనాడే ముక్తిగావించాడు. అయితే మళ్ళీ జరాసంధుడి సమయానికి రాక్షస పాలనకు మన రాజ్యం చేరిందట. అంతకు మించి నాకు గుర్తు లేదు, కానీ మన బుద్ధి ఏం గడ్డి కాస్తోంది?
    మనకు మన ఔన్నత్యం తెలీదా?
    మన భాషందం, మన పనితనం అంతకన్నా భేష్.
    మనం పండించే పంటలు మరెవ్వరి వద్దా పండవు. మనం దేశానికే ధాన్యాగారం వంటి వారము, మనలో మనం కొట్టుకోవడం ఎందుకు, నిజంగా ఆ కేశి, చాణూర ముష్టికుల జాతి వారే ఈ నాడు ఇలా కేసీఆర్ లా బయటకు వస్తున్నారు. మీరు గమనించాల్సిన మరో విషయం కేసీఆర్ మొత్తం ఫ్యామిలీ రాక్షసగణమే అనుకుంటా!!! :)

    రిప్లయితొలగించండి
  5. పైన అజ్ఞాత, మా బా చెప్పారు, మరి దొరగారు మాట్లాడుతున్న మాటలకు,వాటికి తలకాయాలు వూపుతున్న తాలిబానుల గురించా మీరు బాధపడుతున్నది. మీరు చెప్పే నాగరిక నీతులు (అతి)కొందరి దగ్గర పనికిరావని చదువుకొన్నవాళ్లు మీకు తెలియదా?

    p.s. మీ లాగా నేనూ kcr అభిమానిని కాదు, ఓ తెలంగాణాలో పుట్టినవాడుగా, వాడిని చూస్తే వళ్లంతా కంపరం పుడుతుంది. అలాంటి రాక్ష (అంతకంటే ఇంకేమయినా దరిద్రపు గొట్టు పదం ఉంటే ఇంకా బాగుండు) వాడి గురించా మీ బాధ? వరదలు రెండు ప్రాంతాలలో వచ్చి ఊళ్లు ఊళ్లు నాశనమయితే తెలబాన్ దొర గారు ఏమన్నారో మీకు గుర్తుందా? పోనీ పైన వీడియో అయినా చూసారా చదువుకొన్న నాగరీకులూ? ఓహ్ మరిచేపొయాను, సుద్దులేమీ దొరకు, వారి అభిమానులకు చెప్పలేము కదూ :)

    రిప్లయితొలగించండి
  6. అది ఎవరైనా సరే నేను ఖండించే వాడిని. వాడు అలా అంటే తప్పు లేదు కాని నేను అంటే తప్ప అంటే నా దగ్గర సమదానం లేదు . మా ప్రాంతం లో ఇలా మాములుగా ఇలా అడుగుతారు . వాడు పెండ(పేడ) తింటే నువ్వు తింటవా అని ? సమైక్య ఆంధ్ర కోరుకునేవాళ్ళు ఒక్కసారి గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పండి. Hyderabad గురించే కదా కలిసు ఉందాం అంటున్నారు. ఒక వేల హైదరాబాద్ ఆంధ్రా లో ఉన్న ఈ మాట అనేవాళ్ళ ?? PS: మరొక్క సారి నేను కెసిఆర్ అభిమానిని అసలే కాదు.

    రిప్లయితొలగించండి
  7. @ above annon, good, true colors are coming out finally :)

    వాడు పెండ(పేడ) తింటే నువ్వు తింటవా అని ? అలాగే మనిషికో మాట, తెలబానులకు పచ్చి గడ్డి అని కూడా అని మీరు వినలేదా, LOL.

    "Hyderabad గురించే కదా కలిసు ఉందాం అంటున్నారు. ఒక వేల హైదరాబాద్ ఆంధ్రా లో ఉన్న ఈ మాట అనేవాళ్ళ ?"
    good question, Did it ever occur to you to ask same question in different angle? హైదరాబాద్ లేకపోతే విడిపోదామనే వాళ్లా? I am sure it never occur to you right?

    చివరగా, అసలు హైదరాబాదోళ్లు విడిపోవలనుకొంటున్నరా, కలసివుండాలనుకొంటున్నారా, వేరు కుంపటి కావలనుకొంటున్నారా, దొర గారి బాంచెన్లు లాగా అని ఏమాత్రమయినా బుఱ్ఱ (సారీ అది ఎప్పుడో దొరకు ఇచ్చారు కదా!!) పెట్టి ఆలోచించారా?

    finally let us get back to current topic though

    రిప్లయితొలగించండి
  8. కరీం నగర్ దొర, ఆయన అనుచర తెలబానులకు ఎలా నోటికివచ్చినట్లు మాట్లాడే హక్కు ఉందో, ఎలా గొంతెమ్మ కోరెకలు కోరే హక్కు ఉందో, మజ్లిస్ దొరలకు, అపర గాంధీలు (దొరతో పోలిస్తే) ముఖేష్, దానం, తలసాని లకూ వారి ప్రాతినిద్యం వహించే హైదరాబాద్ వాసులకూ వారి కోరెకలు ఉంటాయి అని జనాలకు ఎప్పుడు తెలుస్తుందో :(

    రిప్లయితొలగించండి
  9. అన్ని కోట్ల మందిని అతనుతిడుతూ వుంటే, తిరిగి తిట్టాల్నా, చెప్పుతీసుకు కొట్టాల్నా? మళ్ళీ యిందులో సభ్యతాసంస్కారాల చర్చలేంటి? ఇన్నిరోజులు వాడు, వాని కుటుంబం ముప్పూటలా తింటున్నది, తినకూడదనే... వూర్కే వుంటే, చేతగానోళ్ళనుకుంటాండాడు. అంతమొగోళ్లైతే, హైదరాబాద్ గురించేగా మీగోల, మాకొద్దు. మిగతాదితీసుకుపోతామని ఒక్కమాటనమను చూద్దాం. బోరింగుపంపు దగ్గర రోజూ పొద్దునెళ్ళి నేర్చుకునొచ్చి ప్రెస్ మీట్లు పెట్టే గొట్టాంగాడు.

    రిప్లయితొలగించండి
  10. ముక్కోడు ఓ అందమైన రాక్షస స్త్రీ శూర్ఫణక అవ్వడమేమిటి? నేను ఒప్పుకోను. రోజూ మీటింగ్ పెడుతున్నాడంటే... కేంద్రమత్రివర్గ విస్తరణ మీద ఆశలు పెట్టుకున్నాడు మరి. తనతో ప్రత్యేకంగా చర్చలు జరపాలని అన్నాడు, అంటే .. మరో చెన్నారెడ్డి రెడీ అన్నమాట! గవర్నర్ ఇచ్చేదాక ఇలా రోజూ మొరుగుడు మీటింగులు తప్పవు. వాడిని గవర్నర్ని చేసి ఏ త్రిపుర కో, నాగాలాండ్ కో పంపేస్తే, తెలబాన్ల లత్కోరు ఉద్యమ ఆశయాలు నెరవేరినట్టే. మొరగ నివ్వండి, పాపం.

    రిప్లయితొలగించండి
  11. /వాడు పెండ(పేడ) తింటే నువ్వు తింటవా అని ?/
    మీవాళ్ళతో కలిసి ఆ తినేదేదో తింటూ ఆ తెలబాన్లకి ఇంత పెట్టండి. హైద్రాబాద్లో వీళ్ళొదిలిపోతే ఆ పెండ తిందామని చిల్లరగా రోడ్ షోలిస్తున్నాడు.
    /సమైక్య ఆంధ్ర కోరుకునేవాళ్ళు ఒక్కసారి గుండెల పై చెయ్యి వేసుకుని చెప్పండి. Hyderabad గురించే కదా కలిసు ఉందాం అంటున్నారు. ఒక వేల హైదరాబాద్ ఆంధ్రా లో ఉన్న ఈ మాట అనేవాళ్ళ ?? /

    నీ నెత్తి మీద చేయి వేసి చెప్తా.. అనం, అనం, అనం.
    వాడి ఖర్మ చెడితే, పొమ్మంటామేమో. కాని విభజన ద్వారా ఓ మావో స్టేట్ మా సరిహద్దుల్లో తయారవుతుందంటే .. సామ, .. దండోపాయంతో నైనా నోరుమూయిస్తాము. అర్థమయ్యిందా? ఇట్లాంటి ఎదవాలోచనలు చేయక, ఏదో మీవాళ్ళు చెప్పారని పెండ తినడం మంచిది కాదు, ఆపేయ్. అవి తినే జీవాలు వేరే వున్నయి, వాటి కడుపుకొట్టకు.

    రిప్లయితొలగించండి
  12. ఇంతమంది చదువుకున్న తెలంగాణావాదులున్నారు, ఒక్కడన్నా ఏందివయా ఈమాటలు, గిట్లనేనా తెలంగాణా తెచ్చుడు అని ఖండించారా?
    మల్ల నీతులు చెప్పనీకి బయలుదేరిన్రు. వీధుల్లోతిరిగే కుక్కలు మేలు, ఏదో ఒక తిండి దొరికితే, మొరగడం ఆపేస్తాయి. ఈనికి గత పదేళ్ళుగా ఎన్ని దొరికినా మొరుగుతూనే వుంటడు.

    రిప్లయితొలగించండి
  13. రెచ్చగొట్టుడు వల్ల, వుద్యమం సమసి పోయి గాయాలు మాత్రమే మిగులుతాయి - అదే కెసిఆర్ ప్రస్తుత లక్ష్యం. ఇన్నాళ్ళు పులి మీద స్వారి చేశాడు, ఇపుడు దిగితే పులి మిగేస్తుంది, తెలబాన్ పులి 'గాయా పడి అలసేంత వరకూ ఈ చెన్నారెడ్డి-2 వేచివుండక తప్పదు, అప్పుడప్పుడూ ఇలాంటి 'పామర జనరంజిత భాష, వ్యంగ్యం' వాడికి తప్పవు.

    రిప్లయితొలగించండి
  14. శూర్పణఖ - వెడల్పైన గోళ్ళు కలిగింది, కలిగిన వాడు అని అర్థం అనుకుంటాను. ముక్కుకొకటే కాదు దూల, గోళ్ళకు కూడా. అందుకనే వాడి తాత గంటన్నట్టు సమైక్యాంధ్రను చీల్చడానికి చూస్తున్నాడు.

    రిప్లయితొలగించండి
  15. పిట్టల 'దొరా ఈ పిట్టకతలన్నీ ఎందుకు చెబుతున్నాడు?నిరాశ,నిస్పృహలతోనే గదా.కాంగ్రెస్ తయారుజేసిన భింద్రన్ వాలే ఇప్పుడు 'చెయ్యీ దాటి పోయాడు.ఇప్పటికిప్పుడు తెలంగాణా ఇస్తే అందరికంటే నష్టపోయేది దొరే.ఫర్ సపోస్ (ఇవ్వడం అసాధ్యం అనుకోండి) తెలంగాణా ఇస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది,ఈయన షాపు బంద్ అవుతుంది.అందుకే రోజూ తెలంగాణా కాంగ్రెస్ వాళ్ళను డెమ్మ,డెక్క,డాలి బూతులు తిడుతూ,మధ్య మధ్యలో ఆంధ్రావాళ్ళను కెలుకుతుంటాడు.సింపుల్ లాజిక్, అర్ధం చేసుకోరు!

    రిప్లయితొలగించండి
  16. ఈ మధ్య కాలంలో ఇంత గట్టిగా వాయిస్ వినిపించడం నాకు ఆనందం కల్గిస్తుంది

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు