ఒకరి సీ...టు గోవిందా! ఓ పక్క శవాన్ని పెట్టుకోని, అంత బాధనూ దిగమింగుతూ కూడా జగను బ్యాచ్చీ అంత రాజకీయం చేసారే! అంతటి కష్టంలోనూ రాజకీయం చెయ్యక తప్పని వాళ్ళ పరిస్థితిని అధిష్ఠానదేవత ఇసుమంతైనా పట్టించుకుందా? మరీ సెంటిమెంట్లు లేనట్టుగా వ్యవహరించింది.
మా జగను కుర్రాడు-రోశయ్యేమో ముసలాడు, యువతను ప్రోత్సహించాల్సిన తరుణమిది, జగన్ను కుర్చీ ఎక్కించాల్సిన సమయమిదే అంటూ ఊదరగొట్టేసిందే జగను బ్యాచ్చీ! టీవీ కెమెరాలకు మొహాలనతికించేసుకోని వాళ్ళరుస్తూంటే, టీవీలకు కళ్ళతికించుకోని మనం చూసామే. సినిమాలు కట్టేసాం, డిస్కవరీలు, న్యాట్‌జియోలను మూసేసామే. రాజకీయ నాటకాలు చూస్తూ ఉషారు చేసుకున్నామే! జగను ముఖ్యమంత్రి కాకపోతే ఏ విప్లవమో వస్తది, మిన్ను విరిగి మీద పడుద్ది, ఇక మనకు సందడే సందడి అని అనుకున్నామే! తీరా జరిగిందేంటి?
రెణ్ణెల్ల తరవాత అధిష్ఠానం పిల్చింది. నీసంగతి నువ్వు మర్చిపో, నేజూసుకుంటాగా అని చెప్పిందని చెబుతున్నాడు, కథానాయకుడు. చెబుతూ చెబుతూ.. పాపం, ఎట్టాగోట్టా మొహమ్మీద నవ్వు పుట్టించగలిగాడు. రెణ్ణెల్లపాటు అనుచరుల చేత టీవీ కెమెరాల ముందు నాటకాలాడించి, ఇవ్వాళేమో నేనేనాడైనా పదవి కావాలని అడిగానా అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఎట్టైనా సరే రాహుల్ గాంధీని ప్రధాని చెయ్యాలనేది తన ఆశయమంట -కొండంత రాగం తీసి, పిచ్చికుంట్ల పాట పాడినట్టుంది ఈ వ్యవహారమంతా. ఇక మామూలు కాంగ్రెసు నాయకుల్లాగే ఇతడు కూడా చాటుమాటుగా అసమ్మతి పనులు చేసుకుంటూ ఉండాల్సిందే! మా నాన్న చెప్పిన -రోజుకు 9 గంటల కరెంటు ఇవ్వడం లేదు, 2 రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం లేదు అంటూ మొదలెట్టాడప్పుడే!
జగను బ్యాచ్చీ ఈ పనికిమాలిన దొంగచాటు అసమ్మతి పనులు చెయ్యడం మానేసి వెరైటీ కోసం మరోలా చెయ్యొచ్చు.. ఇక నుండి రోశయ్యకు రోజుకో సవాలు విసురుతూండాలి. రోశయ్య చెయ్యలేనివి, జగను చెయ్యగలిగినవీ జాగర్తగా ఎంచుకోని దమ్ముంటే రమ్మని తొడగొట్టాలి. ఉదాహరణకు, మాల్దీవుల మంత్రివర్గ సమావేశం సముద్రంలో పెట్టినట్టు, మన మంత్రివర్గ సమావేశాన్ని హుస్సేను సాగర్లో పెట్టగల సత్తా ఎవరికి ఉందో వాళ్ళకే ముఖ్యమంత్రి పదవి అని రోశయ్యకు ఒక సవాలు విసరొచ్చు..(అయితే, ముందు జగనుకు ఈతొచ్చో రాదో కనుక్కోవాల్సిన అవసరం ఉంది.)
అలాగే.. ఇంకో పోటీ పెట్టొచ్చు - దివంగత మహానేతైనటువంటి (ఈ ముక్క నేనన్నది కాదు సుమండీ..సాక్షి టీవీలో చెబుతూంటే అటుగా పోతూ విన్నాను. సాక్షిని ఆనుకునే ఉన్న ఇంకో దిక్కుమాలిన చానెలుకు పోతూ, తప్పనిసరై సాక్షిలో ఈ ముక్క వినాల్సి వచ్చింది. ఎందుకలా అన్నారో తెలుసుకునేంత ఓపిక లేక చూళ్ళేదు) మానాన్న పోలికలు ఎవరికి ఎక్కువుంటే వాళ్ళకే ముఖ్యమంత్రి అని జగను రోశయ్యకు సవాలు విసరొచ్చు. ఈ పోటీలో ఖచ్చితంగా జగనుదే గెలుపు.ఇలాంటి ఆటలు ఇంకెన్నైనా పుట్టించొచ్చు.
------------------------------
సరే, ఇక తరవాతేంటి?
ముందుగా రాజీనామాలు: అవును రాజీనామాలే! మా జగన్ను ముఖ్యమంత్రి చెయ్యకపోతే రాజీనామా చేసి పారేస్తామన్న మంత్రులు మంత్రిణులూ పదవులకు రాజీనామాలు చేసి ఇక అవతలికి పోవడమే. నియోజకవర్గంలో తిరగలేకపోతున్నాం అని చెప్పిన, జగన్ను ముఖ్యమంత్రి చేసాకే రండి, అప్పటిదాకా రావద్దు అని ప్రజల చేత అనిపించుకున్న శాసనసభ్యులంతా ఇక రాజీనామాలు చేసేస్తే వేరేవాళ్ళను ఎన్నుకుంటాం. ఎంచేతంటే జగను ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి వీళ్ళెలాగూ ఇక నియోజకవర్గాల్లో తిరగలేరు. తిరగగలిగిన వాళ్ళనే ఎన్నుకోవాలి మరి.
రోశయ్య ఇక మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించడమే! మంత్రివర్గ సమావేశాలను ఎగ్గొట్టినవాళ్ళను, సమీక్షా సమావేశాలకు రానివాళ్ళను, రాజీనామా చేసి పారేస్తామని చెప్పి పారెయ్యనివాళ్ళనూ.. పారేసి, కొత్త మంత్రులను చేర్చుకోవాలి.
రోశయ్య ఇక బేల పలుకులు పలకడం, బీద అరుపులు అరవడం మానెయ్యాలి. ముఖ్యమంత్రికి అవి శోభించవు. అంతేకాక, సుశిక్షితుడైన సైనికుణ్ణి అనేమాట మాట్టాడ్డం కొన్నాళ్ళపాటు మానెయ్యాలి. వినీవినీ చిరాకొచ్చేసింది.
-----------------------
ఆనక.. మనమిక టీవీల్లో పొద్దుటిపూట కొమ్మినేని శ్రీనివాసరావు వంటి వారు నడిపే పరగడుపున రచ్చ రచ్చ, పొద్దుగాల పెద్దగోల వంటి కార్యక్రమాలను చూట్టం ఆపొచ్చు.
>> "సుశిక్షితుడైన సైనికుణ్ణి .."
రిప్లయితొలగించండిఅదేమోగానీ రోశయ్యని చూస్తే నాకో 'one of a kind Knight' గుర్తొస్తాడు. ఎవరో తట్టలేదా? అదేనండీ, డ్రీమ్‌వర్క్స్ వారి విశ్వవిఖ్యాత కథానాయకుడు ష్రెక్. ఇద్దరికీ ఎంత కొట్టొచ్చిన పోలికలుంటాయో గమనించారా? రూపురేఖలే కాదు, రోశయ్యలాగే ష్రెక్‌కీ అందలమెక్కటం ఇష్టముండదు (atleast, మూడో భాగం దాకా). ఇప్పుడు రోశయ్యగారి ప్రేరణతో ష్రెక్‌ని రాజును చేసి నాలుగో భాగం తీస్తారేమో చూడాలి.
Good one.
రిప్లయితొలగించండిరాజ శెఖర్ రెడ్డి నిత్య అసమ్మత వాదిగా 20 సం. పనిచెసాక ముఖ్యమంత్రి పదవొచ్చింది.. జగన్ కి ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుద్దని కె. వి. పి. సలహ ఇచ్చి వుంటాడు..
రిప్లయితొలగించండిఎదొ మన వెర్రి గానీ.. ఈ మంత్రియినా రాజినామా చెస్తాడా.. దేవతకి ఎదురు చెబుతాడా.. వాటికన్ బస్మం చేసెయ్యదూ..
జగన్ను ముఖ్యమంత్రి చేసాకే రండి, అప్పటిదాకా రావద్దు
రిప్లయితొలగించండిముఖానికి గుడ్డ కట్టుకొని వస్తాం.అంతేగానీ రాజీనామా చేస్తామా.రాజీనామా చేస్తే పెజాసేవ ఎవరు జేయాలా?
"నేనే పదవీ అడగలేదు"....ఈ ఏడుపేదో నెలా రెణ్ణెల్ల కింద ఏడిసుంటే(అసలే ఏడుపు మొహమనుకోండి) కాస్త జనంలో అయినా సాఫ్ట్ కార్నరుండేది. ఇప్పుడు అదీ పాయ, ఇదీ పాయె!
రిప్లయితొలగించండిపండంటి పదవికి పన్నెండు సూత్రాల్లాగా (పన్నెండు కాకపోయినా కొన్ని) జగన్ చేయవలసిన కార్యక్రమాలు బాగా చెప్పారు.
రిప్లయితొలగించండినాకు ఈ మధ్య రోశయ్యను చూస్తుంటే - "సైనికుడూ...పోపోపో అదిగో..అదిగో బ్లాక్ ౩ అదిగో.." అన్న పాట, జగన్ ను చూస్తే, "జగమంత కుటుంబం నాదీ, ఏకాకి జీవితం నాది.." అనే పాట బాక్ డ్రాపు లో వినిపిస్తున్నాయి. డాక్టర్ దగ్గరకు చెకింగ్ కు వెళ్ళాలి.
>>>>ఎట్టాగోట్టా మొహమ్మీద నవ్వు పుట్టించగలిగాడు..
రిప్లయితొలగించండిఏమోనండీ నేనైతే ఇప్పటికీ కనిపెట్టలేకపోతున్నాను ఆయన నవ్వుతున్నాడో లేక ఏడుస్తున్నాడో లేక అది నవ్వుతో కూడిన ఆనందం వల్ల వచ్చిన ఏడుపో అర్ధం కావట్లేదు...
>>>రోశయ్య ఇక బేల పలుకులు పలకడం, బీద అరుపులు అరవడం మానెయ్యాలి...
బాగా చెప్పారు.
>>>రెణ్ణెల్ల తరవాత అధిష్ఠానం పిల్చింది. నీసంగతి నువ్వు మర్చిపో, నేజూసుకుంటాగా అని చెప్పిందని చెబుతున్నాడు,
ఏంది చూసుకొనేది ఇడుపులపాయలోని ఏస్టేట్ నా??
ఇలా కామెంట్లలో అసందర్భంగా దూరినందుకు ముందుగా క్షమించండి. దయచేసి ఒక్కసారి http://jeevani2009.blogspot.com/2009/10/blog-post_25.html ను సందర్శించండి పేరును సూచించండి ధన్యవాదాలతో, మీ జీవని.
రిప్లయితొలగించండి