2, నవంబర్ 2009, సోమవారం

సాయంకాలమైంది!

అప్పుడే సాయంకాలమైంది. సూర్యాస్తమయం చేరువైంది.  సంవత్సరం కిందట ఉజ్వలంగా ఉదయించిన ప్రజారాజ్యం సూర్యుడు, కాంగ్రెసు తుప్పల్లో కుంకబోతున్నాడు.

పాపం చిరంజీవి! హీరో కావాలనుకున్నవాడు మొన్నటి ఎన్నికల్లో జీరో అయ్యాడు. ఇప్పుడు కాంగ్రెసు పంచన చేరి, నిదానంగా వంత పాత్రలు వేసి, ఎప్పుడోకప్పుడు హీరో కాకపోతానా అని చూస్తున్నట్టున్నాడు. కాంగ్రెసుతో పెట్టుకుంటున్న ఈ పొత్తు కారణంగా ఒక్కటి మాత్రం స్పష్టం.. ఒకవేళ ఈ పొత్తే గనక 2014 ఎన్నికలలోనూ కొనసాగినా, లేక ఈలోగా ప్రజారాజ్యం కాంగ్రెసులో మునిగిపోయినా.. కాంగ్రెసు చేస్తే తప్ప ఇక అతడు హీరో కాలేడు. పాపం చిరంజీవి!


నిరుడు ఆగస్టులో బంతిలా పైకెగసింది ప్రజారాజ్యం. పార్టీ స్థాపనే దానికి ఉచ్ఛస్థితి! -ఎంత దుస్థితి! అక్కడి నుండి పతనం మొదలై గురుత్వ త్వరణంతో వేగం పుంజుకుని, ఇప్పుడు వినాశకర వేగానికి (టర్మినల్ వెలాసిటీ) చేరుకుంది. - ..పెక్కు భంగులు వివేకభ్రష్ట సంపాతముల్!

అయితే, 2012 డిసెంబరు 21 నాడు ప్రపంచం అంతమైపోద్దని చెబుతున్నారు కాబట్టి, చిరంజీవి కొంచెం తొందరపడి, పార్టీని వెంటనే కాంగ్రెసులో కలిపేసి, సోనియాను బతిమాలుకుని ముఖ్యమంత్రి అయితే మంచిది. యుగాంతంలోగా బులపాటం తీరుతుంది. లేకపోతే.., వ్రతమెలాగూ చెడింది, ఫలం కూడా దక్కకుండా పోతుంది.

---------------------

కానీ కాంగ్రెసు చెయ్యందుకోవడం తప్ప చిరంజీవికి వేరే మార్గం కూడా ఏమీ లేనట్టుంది. నానాటికి తీసికట్టు అయిపోతున్న పార్టీ పరిస్థితిని కాస్త బాగు చేసుకోడానికి కాంగ్రెసు ఆసరా అవసరమే ప్రస్తుతం. తన డజనున్నర శాసనసభ్యులను కాంగ్రెసు నుండి రక్షించుకున్నట్టే. ఇక వాళ్ళకు కాపలా కాయనక్కరలేదు.

పొత్తు కారణంగా గ్రేటరు ఎన్నికల్లో ప్రజారాజ్యానికి ఎంత ఉయోగముంటుందో గానీ, కాంగ్రెసుకు మాత్రం ఎంతో లాభం. గ్రేటరు ఎన్నికల్లో గెలిపించగల మొనగాడెవడో చూస్తామన్న అసమ్మతి వర్గానికి ఇప్పుడు మంచి సమాధానమే చెప్పింది. ఇప్పటికే దిక్కుతోచని స్థితిలో ఉన్న జగన్ను కట్టుగొయ్యకు కట్టేసింది. కాంగ్రెసు గొప్ప ఎత్తే వేసింది.

రోశయ్య సామాన్యుడు కాడు సుమండీ!

7 కామెంట్‌లు:

  1. ఇంత బ్రతుకు బ్రతికి చివరకు ఇంటెనెకాల చచ్చినట్లు..
    యాడ దాగున్నాడొ బావా....

    రిప్లయితొలగించండి
  2. he is a disgrace to politics

    He holds the record for leading shortest lived
    political party in Indian history.

    రిప్లయితొలగించండి
  3. ప్రజా రాజ్యం రైలు కు కాంగ్రెసు ఇంజిను ఇకమీదట. చెయ్యూపితే తప్ప కదలదది. సినిమాజీవితంలో మెగాస్టారుడు, రాజకీయ జీవితంలో మాత్రం సైడ్ హీరో అవడమే ఇక మిగిలింది.

    రిప్లయితొలగించండి
  4. ఈ పొత్తుగోల పుణ్యమా అని ఇప్పుడే టీవీలో ఒక రసవత్తరమైన వీధినాటకం చూసి వస్తున్నా...

    పేరు: వీధి కుక్కలు
    తారాగణం: శ్రీమతి&శ్రీ మరణితా గోలశేఖర్
    దర్శకత్వం: క్విక్ గన్ మగన్
    వ్యాఖ్యాత: మాన్యశ్రీ రజనీకాంత్

    ఇంకా వస్తోంది, టీబీ9 లో.. తప్పక చూడండి!!

    రిప్లయితొలగించండి
  5. మొత్తానికి కుక్కగొడుగుల్లా మొలిచిన పార్టీలలో ఒకటి... పెద్ద కుక్కగొడుగు క్రిందికి చేరబోతోందన్నమాట. దాని నీడలో ఇక అది బ్రతికినట్టే!

    సినీమాలలో చిరంజీవి కాస్తా రాజకీయాలలోకి వచ్చేసరికి కనీసం ఉదయ్‌కిరణ్ కూడా కాలేకపోయాడు!

    రిప్లయితొలగించండి
  6. ప్రజారాజ్యం కల్సిపోతే మంచిదేకదా! మళ్ళీ ఎలక్షన్ లొ ఓటరుకి సులువుగా ఉంటుంది. ఇక్క దెబ్బకి రెండు పిట్టల్ని కొట్టచ్చు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు