ఈ బొమ్మ నా కంప్యూటరులో ఇలా వచ్చిందిగానీ మీ కంప్యూటరులో అచ్చు ఇలాగే ఉండకపోవచ్చు. బొమ్మ ఎలాగన్నా ఉండనీండి.. లోపం మాత్రం..బొమ్మలో కుడి, పై మూలన ఉన్నట్టుగా
DNS error - cannot find server అనే ఉంటుంది. మీక్కూడా ఈ బాపతు లోపం వచ్చిందా? ఏం చెయ్యాలో తెలీలేదు కదూ? బీయెస్సెన్నెల్లు వాడికి ఫోను చేస్తే, 'కొన్ని సైట్లు పనిచేసి, కొన్ని పని చెయ్యడం లేదంటే దానర్థం ఆ సైట్లలో లోపం ఉందిగానీ, మా సర్వర్లలో ఇబ్బందేమీ లేద'ని ఫోను పెట్టేసాడా? ఇప్పుడేంచెయ్యాలిరా బాబూ అని దిగులు పడుతున్నారా? నేనూ ఈ పనులన్నీ చేసాను. బీయెసెన్నెలును, దాని చుట్టాల్నీ బూతులు తిట్టుకున్నా పనికాకపోయేసరికి ఇహ జాలంలో వెతకటం మొదలుపెట్టాను. చిన్న కిటుకుతో పనయ్యింది. ఏంలేదు.. ఓపెన్ డీయెన్నెస్ సర్వర్లను వాడాలి,అంతే! ఎలా చెయ్యాలో వివరించేదే ఈ నసాంకేతిక టపా. మీరూ ఈ DNS సర్వరు లోపంతో బాధపడుతున్నట్టైతే (చేలకు జింకు లోపం లాగా) ఈ మందు పనిచెయ్యవచ్చనే ఉద్దేశంతో రాస్తున్నాను. ముందుగా నేను చెప్పుకోవాల్సిన సంగతులు కొన్నున్నాయి, వాటిని చదివి, ముందుకు పోండి.
- నా కంప్యూటరులోని నిర్వాహక వ్యవస్థ (నివ్య): Windows XP Professional Version 2002 Service pack 2
- మీ కంప్యూటరులోని విండోలు, తెరలు ఇక్కడ నేను చూపించిన బొమ్మల్లాగా ఉండకపోవచ్చు. ఒక్కో నిర్వాహక వ్యవస్థలో ఒక్కో రకమైన విండోలుండే అవకాశముంది.
- నేను ఇక్కడ రాసినది నా బీయెస్సెన్నెల్ బ్రాడ్‌బ్యాండు కనెక్షనుకు సంబంధించిన వ్యవహారం.
- నేను హైదరాబాదులో ఉంటాను.
- నాకు ఇది పని చేసింది కాబట్టి మీకు పనిచేస్తుందని నేను ఖచ్చితంగా చెప్పలేను. కానీ మీ నివ్య, బ్రాడ్‌బ్యాండు సర్వీసు ప్రొవైడరు పైన నేను చెప్పినవే అయితే ఈ పరిష్కార మార్గం మీకూ పనిచేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మాత్రం చెప్పగలను.
(బీయెస్సెన్నెల్లు వాణ్ణి బతిమాలడం, బూతులు తిట్టడం కంటే దీన్ని ప్రయత్నించి చూడటం మెరుగైన పనని మాత్రం చెప్పగలను. :) )
మీ కంప్యూటరులో కుడివైపు అడుగున ట్రే అని ఒకటుందిగదా.. అందులో రెండు మానిటర్లు ఒకదాని వెనక ఒకటి ఉన్న బొమ్మ ఉంది చూసారా? అంతర్జాలంలో విహరిస్తున్నపుడు ఆ రెండు మానిటర్లు వెలిగి ఆరిపోతుంటాయి. గుర్తు పట్టారా? పై బొమ్మలో వృత్తం చుట్టి ఉంది చూడండి.. అదే. దాన్ని జమిలి నొక్కు నొక్కండి. అప్పుడు కింది బొమ్మలో లాగా ఒక విండో తెరుచుకుంటుంది.
పై విండోలో Properties అనే బొత్తాన్ని నొక్కండి. ఇంకో విండో, ఇలాంటిదే తెరుచుకుంటుంది.
అందులో Internet Protocol (TCP/IP) అని కనిపిస్తోంది చూసారూ దాన్ని జమిలినొక్కు నొక్కండి. అప్పుడు కింది విండో తెరుచుకుంటుంది. ఏంటో, విండోల్లోంచి విండోల్లోంచి విండోల్లోకి విండోల్లోకి పోతున్నాం, మళ్ళీ వెనక్కి తిరిగి పోగలమా అని బెంగ పడకండి. నే తీసుకెళతాగా! ఇంతా జేసి, ఇన్ని విండోలూ దాటెళ్ళాక చేసే పని మహా గొప్పదా అంటే.. ఎలక్కోసం కొండను తవ్వటంలాంటిదది. (పైగా ఈ తెరపట్లూ అవీ పెట్టేసి, నేను కాస్త ఎక్కువజేస్తున్నాను.)
పై బొమ్మ చూసారుగా అక్కడి డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి. కింద ఉన్న రెండు డబ్బాల్లో ఏవైనా అంకెలు ఉంటే వాటిని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు మనం చేస్తున్న పని వల్ల ప్రయోజనం కలక్కపోతే తిరిగి వీటిని పెట్టెయ్యొచ్చు. ఇక ఆ డబ్బాల్లో కింద నేను రాసిన సంఖ్యలను వేసెయ్యండి.
208.67.222.222
208.67.220.220
ఒకటి గమనించండి.. ఆ డబ్బాల్లో ప్రతీ మూడంకెల తరువాత చుక్క ఉంటుంది. మీరు మూడో అంకె వెయ్యగానే కర్సరు దానంతటదే చుక్క దాటి అవతలకు పోతుంది. ఒకవేళ మీరు వెయ్యాల్సింది మూడు కాక రెండే అంకెలనుకోండి. ఉదాహరణకు పైన నేనిచ్చిన అంకెల్లో 67 లో రెండే అంకెలున్నాయి. 7 వేసాక అది చుక్కను దాటిపోదు, మూడో అంకె కోసం చూస్తుంది.
అంచేత మీరే దాన్ని చుక్కను దాటించాలి. అంకెలు వేసాక కింది బొమ్మలో లాగా కనిపిస్తుంది. అయిందా? హమ్మయ్య పనైపోయినట్టే. ఇహ వెనక్కి పోవడమే తరువాయి. ముందు, ఈ విండోలోని OK నొక్కండి. తరవాత ఇంతకు ముందరి విండోలోని OK నొక్కండి. ఆపైన దానిముందరి విండోలోని Close నొక్కండి. ఇహ మీ సమస్య పరిష్కారమైనట్టే!
ఈ ఓపెన్ DNS విషయమ్మీద మరింత సమాచారం కావాలంటే http://www.opendns.com/ కు వెళ్ళండి.
నాకు ఇంటిలో రెండు కనెక్షన్లు ఉన్నాయి. ఒకటి BSNL బ్రాడ్ బ్యాండ్, ఇంకొకటి టాటాఇండికామ్ వైర్ లెస్ ఫోన్. 2006లో బిజినెస్ పర్పోస్ కోసం వైర్ లెస్ ఫోన్ కొనుక్కున్నాను. ఇప్పుడు ఇంటిలో BSNL కనెక్షన్ లో ఓపెన్ అవ్వని వెబ్ సైట్ లని టాటా వైర్ లెస్ ఫోన్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. టాటా వైర్ లెస్ ఫోన్ కనెక్షన్ సాయింత్రం పూట స్లో అవుతుంది. దాని కంటే BSNL నయం.
రిప్లయితొలగించండిPraveen Sarma: ఈ సమస్య మీకూ ఉందా?
రిప్లయితొలగించండినా రూటర్ విశాఖపట్నం గేట్ వే కి కనెక్ట్ అవుతుంది. విశాఖపట్నం గేట్ వే ద్వారా ఓపెన్ అయిన వెబ్ సైట్లు గుంటూరు గేట్ వే ద్వారా ఓపెన్ అవ్వకపోవచ్చు. గమనించండి. నేను లినక్స్ నెట్వర్క్ టూల్స్ ద్వారా ట్రేస్ రూట్ చేస్తుంటాను. హైదరాబాద్ కి చెందిన విశ్వశక్తి కంపెనీ వారి ఐ.పి. అడ్రెస్ లని ట్రేస్ చెయ్యడానికి ప్రయత్నిస్తే మొదటి రూట్ విశాఖపట్నంకి చెందిన ఐ.పి. అడ్రెస్ చూపింది. ఆ ఐ.పి. BSNL వారిది. దారిలో నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్, ఎక్సెల్ మీడియా కమ్యూనికేషన్స్ వారి ఐ.పి.లు చూపి, చివరికి విశ్వశక్తి కంపెనీ ఐ.పి. చూపింది.
రిప్లయితొలగించండిhttp://teluguwebmedia.net/nw_images/trace_route.png
రిప్లయితొలగించండినేను ఈ బొమ్మలో మార్క్ చేసినది BSNL వారి వైజాగ్ గేట్ వే అడ్రెస్. ఆ అడ్రెస్ కలిగి ఉన్న సర్వర్ లో ప్రోబ్లం ఉంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో BSNL కనెక్షన్ సరిగా పని చెయ్యదు. మొన్న నా కంప్యూటర్ లో కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ అవ్వకపోతే ఆ వెబ్ సైట్లు పని చేస్తున్నాయో లేదో ట్రేస్ రూట్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నించాను. కొన్ని సార్లు వెబ్ సైట్లు ట్రేస్ రూట్ ద్వారా కూడా యాక్సెస్ అవ్వడం లేదు.
@ Praveen Sarma
రిప్లయితొలగించండిYou ROCK man.. keep going :)
@ చదువరి,
LOL,
మీరు Praveen Sarma గురించి తక్కువ అంచనా వేస్తున్నారు. ఇదే నా పందెం. మీరు ఆయనతోటి ఒక్క సమాధానం సూటిగా చెప్పించండి. చూద్దాం :)
జుట్టు పీక్కునే లాంటి టెక్నికల్ విషయాన్ని యెంత సరదాగా చెప్పేశారండీ.. ప్రస్తుతం నాకేమీ సమస్య లేదు కానీ.. భవిష్యత్ అవసరాల కోసం మీ టపాని దాచుకుంటా...
రిప్లయితొలగించండినాకు మాత్రం ఇవి జుత్తు పీక్కునేంత టెక్నికల్ క్వెషెన్స్ కావు. BSNL, టాటా కనెక్షన్ లలో ఇండియాలో హోస్ట్ చెయ్యబడిన వెబ్ సైట్స్ అన్నీ తొందరగా ఓపెన్ అయిపోతాయి. వెబ్ సైట్లు లేని స్టాటిక్ ఐ.పి.లు కూడా ట్రేస్ రూట్ లో తొందరగా ట్రేస్ అవుతాయి. చైనాలో హోస్ట్ చెయ్యబడిన వెబ్ సైట్లు కూడా ఇక్కడ తొందరగా ఓపెన్ అవుతాయి. అమెరికాలో హోస్ట్ చెయ్యబడిన వెబ్ సైట్లు మాత్రం ఇక్కడ స్లోగా ఓపెన్ అవుతాయి. కొన్ని సార్లు అవి ఓపెన్ అవ్వవు. ఈ రోజు ఉదయం టాటా కనెక్షన్ లో కూడా కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ అవ్వలేదు. మొదట BSNLలో ఓపెన్ అవ్వలేదని టాటా కనెక్ట్ చేస్తే టాటా కనెక్షన్ లో కూడా ఓపెన్ అవ్వలేదు.
రిప్లయితొలగించండిమాకేమీ అంత సమస్య లేదండి.
రిప్లయితొలగించండినాక్కూడా ఈ సమస్య వచ్చింది కాని బిఎస్‌ఎన్‌ఎల్ వారు ఈ సమస్యని బాగానే పరిష్కరించారు. కొన్ని రోజులు నా సిస్టంలోనే సమస్య ఉందేమో అనుకున్నాను, ఎందుకంటే కొన్ని పేజీలు తెరుచుకుంటున్నాయి కొన్ని రావట్లేదు. ఇంక నా వల్ల కాదని 1504 కి ఫోన్ చేస్తే ఓ రెండు నిమిషాల్లో పరిష్కరించాడు (లీనక్స్ అయినా సరే).
రిప్లయితొలగించండినాకు బిఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ తో ఎప్పుడూ సమస్యలేదు :-)
~
నాకు ఇలాగే సమస్య వస్తే మీరు చెప్పినట్టే ఒపన్ DNS వాడుతున్నాను. ఇదా బి ఎస్.ఎన్.ఎల్ వాడికి కంప్లెయింట్ చేసేటప్పుడు మాత్రం చెప్పను. ఏమో ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అయితే అని నా భయం.. ఐనా గవర్నమెంటోళ్లు ఎప్పుడు సరిగ్గా పనిచేయాలి. కాని నెట్ కనెక్షన్లలో ఉన్నవాటికంటే ఇదే కాస్త గుడ్డిలోమెల్ల..
రిప్లయితొలగించండిఏదో ఒకటి చాలా రోజుల తరువాత మీ నుంచి ఒక టపా వచ్చింది. దానివరకు చాలా సంతొషం.
రిప్లయితొలగించండిమీనుంచి మీ శైలి టపాలకై ఎదురు చూస్తుంటాం.
కాముధ
దీనికి ముందే టపాకాయ పేల్చేసారా,
రిప్లయితొలగించండిగత 10 రోజులగా బద్జెట్ వ్యవహారాల్లో మునిగి పోవడం వలన కూడల్లో తిరగలేదు. నిన్న రాత్రి కూడల్లోకి రాగానే మీటపా కనిపించగానే కామెంటేసాను.
ఆ టపాకాయ చాలాబాగా పేలింది
కాముధ
ThankQ. Very good information. I used to have problems when using Xp. But now I have Mandriva distro of GNU/LINUX. Here the problems are different. :-D
రిప్లయితొలగించండి@Praveen,
U stone man (Already rock is used, and Chaduvari garu may sue me. Hehehe).
@Sreenu,
RighttO!
How are the Wireless Broadband services in Hyderabad, like Photon of Tata's, NetConnect of Reliance and BSNL wireless (I mean the USB stick ones)?
రిప్లయితొలగించండినేను virus అనుకున్నా కదా
రిప్లయితొలగించండిthanq wewhen..:-)
రిప్లయితొలగించండి