26, ఆగస్టు 2009, బుధవారం

కులమార్పిడి బిల్లు తెండి

హిందూమతం నుండి ఇతర మతాల్లోకి వెళ్ళినవాళ్ళకు కూడా కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తారట. హిందూమతం కాదనుకుని పోయినవాడికి హిందూమత సౌకర్యాలు ఎలా ఇస్తారు? తక్కువ కులమనే పేరుతో గతంలో వివక్ష చూపించారు, అణచివేసారు.. అంచేతే కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తున్నారు. బానే ఉంది. ఇతర మతాల్లో వివక్ష ఉండదు, అందరూ సమానమే. అసలు కులమనే ప్రసక్తే లేని మతాలు అవి. ఇక్కడ వివక్ష ఉందిగదాని మతం మార్చుకుని, అద్భుతమైన సర్వసమానత కలిగిన ఆ మతాల్లోకి పోతున్నపుడు.. -మరి వీళ్ళకి కులరిజర్వేషను ఎందుకు? అసలు కులమనేదే లేని చోట కుల రిజర్వేషన్లా?


ఇది అధికారపార్టీ ద్రోహబుద్ధితో చేసిన కుట్ర తప్ప మరోటి కాదు. ఈ ముఖ్యమంత్రిలోని హిందూ ద్వేషం పడగనెత్తుతోంది. భాజపా, లోక్‌సత్తా మాత్రమే దీన్ని వ్యతిరేకించాయి. మిగతా పార్టీలన్నీ కూడా ఈ పనికి కొమ్ముకాసాయి. కులమనేదే లేనివాడికి కుల రిజర్వేషన్లిస్తున్నారు. సభల్లో ప్రశ్నలడగడానికి లంచాలు తిన్న ముష్టి సన్నాసుల్ని చూసాం గతంలో. ఆ రకంగానే వీళ్ళుగానీ ఈ బిల్లు మీద సంతకాలు పెట్టేందుకు ఎవడో విదిల్చిన కాసిని కూసిని డాలర్లకు, సెంట్లకూ కక్కుర్తి పడలేదుగదా? లేక వీళ్ళు కూడా మనకు తెలీకుండా మతం మార్చేసుకుని, బైటికి చెప్పకుండా దొంగ హిందువులుగా చెలామణీ అవుతున్నారా? ఛి.. చ్ఛీ, అకశేరుకాలు!


కొందరి వోట్ల కోసం కక్కుర్తి పడి హిందూమతానికి చేటు తెచ్చే ఈ పని చేసారు. అవున్లే, మతమంటే అభిమానం లేని జనాలకి, మానాభిమానాలే లేని జనాలకి, మనం వోట్లివ్వలా? మన ఖర్మ ఇంతే! చేసిన తప్పుకు ఫలితం అనుభవించాల్సిందే! కానీ వీళ్ళూ అనుభవించాలి.. వీళ్ళు చేసిన ఈ ద్రోహానికి గాను మళ్ళీ జీవితంలో ఏ ఎన్నికలోనూ గెలవకుందురుగాక! ఏ డాలర్ల కోసమైతే కక్కుర్తి పడి బహుశా వీళ్ళీ బిల్లుకు వోట్లేసారో ఆ చిల్లర వీళ్ళకు అందకుండుగాక! ఒకవేళ అందినా.., చిల్లరను ఏరుకోవడానికి వీళ్ళు ఏ నడుమునైతే వొంచుతారో ఆ నడుం అలాగే పడిపోవుగాక! వీళ్ళ పెళ్ళాం బిడ్డలు వీళ్ళను ఛీ.. దరించుకుందుగాక! అమ్మలారా అయ్యలారా.. మీకు తెలిసినవాళ్ళెవరైనా ఈ బిల్లుకు వోటేసిన _ _ _ ల్లో ఉంటే వాళ్ళకు చెప్పండి.. వాళ్ళెదురైతే హిందువులు మొహం మీదే..

~~~~~~~~~~~


ఇతర మతాల్లోని జనాలకి రిజర్వేషనులిస్తే రిజర్వేషను శాతం పెరిగిపోద్దేమోననేది నా బాధ కాదు. అందువలన కలిగే నష్టం కొంతే -హిందువుల పిల్లలకు ఉద్యోగం రావడం మరింత కష్టమౌతుంది. కానీ హిందూమతం కాదనుకుని వెళ్ళినవాడికి కూడా హిందూమతంలో ఉండే అన్ని సౌకర్యాలనూ కల్పిస్తున్నారు చూసారూ.. ఇది హిందూమతాన్ని అణచివేసే తీవ్రమైన చర్య.

ఎదురుగా చిల్లర డబ్బులు కనబడితే వంగకుండా, మోకాళ్ళమీద కూచ్చోకుండా, సాగిలపడకుండా ఉండలేరనుకుంటా మనమెన్నుకున్నవాళ్ళలో కొందరు -అకశేరుకాలు కదా! అంచేత మనం కూడా తలా పావలానో ముప్పావలానో చందాలేసుకుని ఈళ్ళ మొహాన కొడదాం.. కులమార్పిడి బిల్లు కూడా తెచ్చిపెట్టండి, హిందువన్నవాడు మతాన్ని మార్చుకునే అవకాశమున్నట్టే కులాన్ని కూడా మార్చుకునే బిల్లు తెండి. ఇదిగో ఈ చిల్లర తీసుకోండి అని వాళ్ళమొహాన కొడదాం. ఏనుగులు మింగోటోడికి ఈ పలహారం ఆనదేమో అని అంటున్నారా.. చేస్తార్లెండి, సిల్లరెదవకి ఏ చిల్లరైనా ఒకటే!

42 కామెంట్‌లు:

  1. కులం ఒక మతం సమస్య స్థాయిదాటి విస్తృత సామాజిక-ఆర్థిక-రాజకీయ సమస్యగా ఎప్పుడో మారింది. కాబట్టి, ఈ సమస్యకు సమాధానాలు అన్ని పార్శ్వాలనూ పరిగణలోకి తీసుకుని జరగాలి.

    ఆ దిశగా జరిగే ప్రయత్నాలకు మతం రంగుపులిమినా పెద్ద ప్రయోజనం లేదు.మతానికి ఈ విస్తృత సమస్యను "తీర్చే" శక్తి లేదు. ఒకవేళ మతపరంగానే ఈ సమస్య పరిష్కరించాలనుకుంటే చాలా పెద్దస్థాయి (విప్లవస్థాయి)సంస్కరణలు హిందూమతంలో జరగాలి.వాటి దిశగా పాటుపడటానికి ఎంత శాతం హిందువులు,హిందూసంస్థలు తయారుగా ఉన్నాయి?

    రిప్లయితొలగించండి
  2. మహేషూ, నువ్వు నాస్తికుడివే కదా, నాస్తికుడిగా ఆలోచించు. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేనప్పుడు క్రైస్తవులు కులం పేరు చెప్పుకోవడం హాస్యాస్పదమా, కాదా? క్రైస్తవ మిషనరీల నుంచి ఆర్థిక సహాయం పొంది, క్రైస్తవ మిషనరీలు నడిపే ఇంగ్లిష్ మీడియం పాఠశాలల్లో చదువుకుని హిందూ కోటాలో రిజర్వేషన్లు అనుభవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వెళ్ళేది చర్చిలకే కానీ కాస్ట్ సర్టిఫికేట్స్ లో మాత్రం హిందువులమనే వ్రాయించుకుంటారు.

    రిప్లయితొలగించండి
  3. డొంక తిరుగుడొద్దు, సూటిగా మాట్టాడండి మహేష్ గారూ..
    "..విస్తృత సామాజిక-ఆర్థిక-రాజకీయ సమస్య.." - జోకా? మతం కులం కాకుండా ఇక 'సామాజిక'మేంటో చెప్పండి. (సామాజిక లోంచి మతం కులం తీసేస్తే అర్థంపర్థం లేని సా, జి మిగులుతాయి.)

    ఆర్థిక -ఇవి కుల పరమైన రిజర్వేషనులా, అర్థిక పరమైన రిజర్వేషనులా? (రిజర్వేషనులను ఆర్థిక స్థాయిని బట్టి పెట్టమని కొందరడుగుతున్న సంగతి మీకు తెలుసు కదా. అలా కుదరదని కదా మిగతా వారంటున్నది) రిజర్వేషను కాడికొచ్చేసరికి కులపరంగా ఉండాలా.. కాని ఈ చర్చకొచ్చేసరికి మాత్రం అదొక ఆర్థిక సమస్యా? భలే!

    ఇక రాజకీయ.. నిజమే ఇది రాజకీయ సమస్యే. లౌకిక రాజ్యమంటూనే మతంలోకి రాజకీయాన్ని చొప్పించి, మతప్రచారం, మతమార్పిడి అంటూ భ్రష్టు పట్టించారు. అందుకేగా ఇప్పుడు రాజకీయులను పట్టుకోవాల్సి వస్తోంది, తిట్టుకోవాల్సి వస్తోంది.

    హిందూమత సంస్కరణలు: ఎన్నో సంస్కరణలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి కూడా. ఆలస్యం కావచ్చు, నిదానం కావచ్చు. ఆలస్యాన్ని భరించలేనివారు అవతలి మతాల్లోకి పోతున్నారు. సరే.. ఏ కులవివక్షను తప్పించుకోడానికి మతాన్ని మార్చుకున్నారో, ఆ కులం ప్రకారమే రిజర్వేషనులు కావాలని అడగడం ఏంటనేది నా ప్రశ్న. దానికి సమాధానం ఏదన్నా ఉంటే చెప్పండి.

    రిప్లయితొలగించండి
  4. ఇది ఒక రాజకీయ నిర్ణయం. వోటు బాంకు రాజకీయాలకి పరాకాష్ట.
    దీనికి మతంతో, కులంతో సంబంధం లేదు.

    రిప్లయితొలగించండి
  5. స్వాతంత్ర్యం వచ్చి అరవై యేళ్ళ పైబడినా, రిజర్వేషన్లను కొనసాగిస్తూనే ఉన్నారు, అసలు అంబేద్కర్ చెప్పిన దానికి విరుద్ధంగా. ఇన్నేళ్ళయినా సమస్య అలాగే ఉంది అన్నప్పుడు, సమస్యకు పరిష్కారం మరో విధంగా ఆలోచించాలి తప్ప, అదే formula ను సాగబీకి, మతం మార్చుకున్నా రిజర్వేషన్లు..ఇలాంటి పోకడలు పోవడం, కేవలం రాజకీయ నాయకుల చవకబారు మనస్తత్వాన్ని సూచిస్తూంది తప్ప, సమస్యపై అవగాహనను కాదు.

    ఓట్లేసి కొల్లబెట్టాం కదా, అనుభవిద్దాం. అయినా తెగులు దేశమూ వత్తాసు పలికింది లెండి. తాంబూలాలిచ్చేశారు...

    రిప్లయితొలగించండి
  6. @గోగినేని వినయ్ చక్రవర్తి: ఒక విస్తృత సామాజిక సమస్యను గురించి చర్చిస్తున్నప్పుడు భిన్నాభిప్రాయాల నేపధ్యంలో, వ్యక్తుల వ్యక్తిగతాలతో అభిప్రాయాల్ని ముడిపెట్టి ప్రశ్నించడం చాలా కృతకమైన వాదనా పద్దతి. అది సమస్యను వ్యక్తిగతానికి పరిమితం చేసి పరిధిని కుంచింపజేస్తుందేతప్ప సమస్యను అర్థం చేసుకోవడంలో సహాయపడదు.

    Having said that,నన్ను మీరొక వ్యక్తిగత ప్రశ్న అడిగారు కాబట్టి దానికి సమాధానం చెబుతాను.మా కుటుంబంలో రిజర్వేషన్ వాడుకున్న మొదటి తరం నాది. నేను చదువు కోసం రిజర్వేషన్ వాడుకున్నాను.ఉద్యోగం కోసం రిజర్వేషన్ వాడుకోలేదు. I am neither in public sector nor a private sector employee.I am a freelance consultant.My services are for hire not me.వ్యక్తిగతంగా నా కొడుక్కి కులంతో నిమిత్తం ఉండకూడదనుకున్నాను, అందుకే లేదు. కాబట్టి రిజర్వేషన్ పొందే ప్రశ్నే ఉత్పన్నం అవ్వదు.

    నా వ్యక్తిగత నిర్ణయాలతో సంబంధం లేకుండా నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. కనీసం మూడుతరాలవరకూ చదువూ,ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండాలని నమ్ముతాను. మూల ఉద్దేశాలలో మార్పు ఉన్నా, ఆర్థికపరమైన రిజర్వేషన్లకు లేదా స్కాలర్ షిప్ లకు నేను అనుకూలం.

    @చదువరి: నా మాటలు డొంకతిరుగుడు కాదు. నేను ఈ సమస్యను అర్థం చేసుకున్న పరిధి విశాలం అంతే!

    రిప్లయితొలగించండి
  7. //తక్కువ కులమనే పేరుతో గతంలో వివక్ష చూపించారు, అణచివేసారు.. అంచేతే కులప్రాతిపదికన రిజర్వేషనులిస్తున్నారు.

    ఇప్పటికి కూడా ఈ వివక్ష అనేది పోలేదు. ముందు హిందూ మతంలో ఉన్న కుల వివక్ష పోతే గానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. అలా తక్కువగా చూడబడిన వారిని ఆదరించే నెపంతో నీచబుద్ధి ఉన్న ఇతర మత ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. అమాయకులైన వీరు వాళ్ళ మతంలో చేరటానికి సిద్ధపడుతున్నారు.

    కులం హిందూమతం లో ఉండి కొంత మంది చర్చిలకు వెళుతుంటారు. ఇది ఖచ్చితంగా ద్వంద్వ ప్రవృత్తే.

    ముందు హిందూ మతంలో ఉన్న కుల వివక్ష పోవాలి.
    ప్రజల మీద బలవంతంగా తమ అభిప్రాయాలను రుద్దుతున్న మతప్రవక్తల ఆట కట్టించాలి.

    రిప్లయితొలగించండి
  8. అసలు కుల ప్రాతిపదికన రిజర్వేషన్ లు ఎందుకు ఉండాలో నాకిప్పటికీ అర్థం కాదు. నేను పీ.జీ చేస్తున్నప్పుడు మా క్లాస్ లో ఒక రిజర్వేషన్ కాండిడేట్ ఉండేవాడు, ప్రభుత్వం ఉచితం గా పుస్తకాలు, స్కాలర్షిప్పులు, చదువూ ఇస్తూ ఉంటె వాడికి వొళ్ళు కొవ్వెక్కి ఒక యేడాది ఎం.సి.యే, ఒక యేడాది ఎం.బి.యే, ఒక యేడాది ఎం.ఎస్.సీ అంటూ సమయం, డబ్బు (మనవి) వృధా చేస్తూ అమ్మాయిలని ఏడిపిస్తూ తిరిగేవాడు. ఎదురుపడి యేమైనా అంటే నా కులాన్ని బట్టి నన్ను హేళన చేస్తున్నారు అనేవాడు. వాడు అటెంప్ట్ టు రేప్ కేస్ నుండి కూడా కులాన్ని అడ్డం పెట్టుకుని బయట పడ్డాడు. ఈ కుల రిజర్వేషన్ ల వల్ల నిజంగా అవసరమైన వాళ్ళకి యేమైనా ఒరుగుతోందా? అడ్డమైన అడ్డగాడిదలను తీసుకొచ్చి నెత్తిన కూర్చోపెట్టుకున్నందుకు మన జనాలకి తగిన శాస్తి జరుగుతుంది లెండి

    రిప్లయితొలగించండి
  9. @katti mahesh

    sorry if i asked anything wrong.....
    econamy ni base chesukoni reservations vundaali gaani matam ..and so on kaadu.......

    anichivesaarani 50 acers vunnavaadu ,IAS lu,lectures andaru reservations teesukuntunte...nijam ga anichiveyabadaa vallaku ela .

    ma villagelo 100 families vuntay vallaki intavaraku reservations use chesukovatam raadu....

    baga settle ayina vaallu 3 taraalu teesukunte veella paristhi enti........logic correct ga ledu meedi....




    ina ippudu gola chestunna vaaru andaru bc la crimilayer values increase chesinappudu emayyaro....vallaki labham ani voorukunnara.

    reservations ki cast okate kakunda ika ippati nundi matam koodam add chestunnaru........


    @chaduvari
    మతం కులం కాకుండా ఇక 'సామాజిక'మేంటో చెప్పండి. (సామాజిక లోంచి మతం కులం తీసేస్తే అర్థంపర్థం లేని సా, జి మిగులుతాయి.)
    saamajikamante avena.............inka em leva boss.

    రిప్లయితొలగించండి
  10. @లక్ష్మి: మీ వ్యాఖ్య చూసి ఒకప్పుడైతే ఆశ్చర్యపడేవాడిని. కానీ చాలా మంది అర్బన్ స్నేహితుల ఆలోచనలు చూశాక వారి తెలియనితనం పట్ల కొంత జాలి, తెలియజెప్పాలనే కోరికా మాత్రం మిగిలాయి.

    బహుశా మీ పరిధిలో మీరు గమనించింది ఇంతే.అంతమాత్రానా, కొన్ని శతాబ్ధాల అణచివేతను అర్థం చేసుకునే విధానం అదికాదు. రిజర్వేషన్ ఎందుకు,ఎలా,ఏవిధంగా రాజ్యాంగబద్ధం చెయ్యబడింది (please read constituent assembly discussions on reservations)తెలుసుకోకుండా దాని ప్రాతిపదికని తేలిగ్గా తీసెయ్యడం సరికాదు. పల్లెల్లో తిరిగి అనుభవించకపోయినా, కనీసం పుస్తకాలద్వారానైనా ఈ విషయం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

    @గోగినేని వినయ్ చక్రవర్తి:రిజర్వేషన్ అమలవుతున్న మూల కారణాల్ని తెలియకనో లేక తెలిసి అర్థం కాకనో అదీ కాక తెలిసీ విస్మరించో మీ వాదన కొనసాగుతున్నట్లుంది.

    నేను చెప్పిన మూడు తరాల లాజిక్ కు anthropological కారణాలున్నాయి. వాటిని విప్పిచెప్పాలంటే అదొక పెద్ద వ్యాసమే అవుతుంది. మీకు నిజంగా ఆసక్తి ఉంటే కనీసం పైన లక్ష్మిగారికి చెప్పిన రెఫెరెన్స్ చదవడానికి ప్రయత్నించండి. అది కాకపోయినా అంబేద్కర్ పుస్తకాలు కోకొల్లలుగా మార్కెట్లో దొరుకుతాయి.

    రిప్లయితొలగించండి
  11. మొత్తానికి రిజర్వేషన్ పొందటానికి హిందువు అనే ముసుగు వేసుకునే అవసరం లేకుండా చేస్తున్నారన్నమాట దేవుడి గారి పాలన లో బాగుంది. ఒక రకం గా ఇదే మంచిదేమోనండి దొంగ ముసుగుల హిందువులను చూడనక్కరలేదు.

    ఇతర మతాల్లోని జనాలకి రిజర్వేషనులిస్తే రిజర్వేషను శాతం పెరిగిపోద్దేమోననేది నా బాధ కాదు. అందువలన కలిగే నష్టం కొంతే -హిందువుల పిల్లలకు ఉద్యోగం రావడం మరింత కష్టమౌతుంది .>> ఇంకా జనాలకు ఆశ ఉందంటారా రిజర్వేషన్ లేని వాళ్ళ పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయని - ఒక వేళ వచ్చినా ప్రోమోషన్ల లో రిజర్వేషన్ల దెబ్బ కు తమకు తామే సిగ్గు పడే పరిస్తితులు కి తలొగ్గి చేస్తారని.

    మీ పోస్టు చదివిన తరవాత నాకు కళ్ళ ముందు ఒక సినిమా కనపడుతుంది ఇప్పుడు ఇద్దరు సోదరులు రోడ్డు మీద పడి ఒక్కళ్ళు categorization కావాలని ఒకరు వద్దని కొట్టుకుంటున్నారు కదా తరవాత ఎంత మంది ఇలాంటి సోదరులు తయారవుతారో అని.

    రిప్లయితొలగించండి
  12. మహేష్ గారు, పల్లె జీవనం నాకు కొత్త కాదు, నిజానికి రిజర్వేషన్ ల వెనకాల ఉద్దేశం ఎంత మంచిదో దాన్ని ఎంత ఎక్ష్ప్లాయిట్ చేస్తున్నారో కళ్ళారా చూస్తున్నా కాబట్టే ఆ కామెంట్ రాయగలిగాను. తమకి రిజర్వేషన్ లు ఉన్నాయి అని కానీ వాటి వల్ల ఎంతో కొంత బాగుపడచ్చు అని కానీ తెలియని అమాయకులు మారుమూల పల్లెల్లో చాలా మంది కనిపించారు, వారి సామాజిక స్థితి ఆర్ధిక పరిస్థితి రెండూ కూడా యేమాత్రం మారలేదు. కానీ మీరన్నట్టు అర్బన్ సంస్కృతికి అలవాటు పడి దొంగ తెలివైతేటలు పెరిగిన స్వార్ధపరులు మాత్రం వీటిని దారుణంగా ఉపయోగించుకుంటున్నారు. మీరు నమ్మినా మన్నకపోయినా ఇది నిజం.

    రిప్లయితొలగించండి
  13. @లక్ష్మి: మీ అనుభవాలనుంచీ అభిప్రాయాలు ఏర్పరుచుకోవడాన్ని నేను గౌరవిస్తాను. కానీ, ఒక సామాజిక సమస్యని కేవలం మీ అనుభవంద్వారా ఏర్పరుచుకున్న అభిప్రాయాలతో "నిర్ణయించాలని"చూస్తాను అంటే అక్కడ కొంత సమస్యాత్మకం అవుతుంది.

    ఉదాహరణకు మొన్న దేవుడి నగల్ని తాకట్టు పెట్టిన పూజారిని చూసి "మొత్తం పుజారులు ఇంతే" అని ఎవరైనా అంటే మనం ఒప్పుకుంటామా? చచ్చినా ఒప్పుకోం. అదొక aberration అనే అనుకుంటాం. అలాగే మీరు చూసిన కొందరు "బలిసిన దళితుల" ఉదాహరణతో మొత్తం రిజర్వేషన్ విధానం తప్పు అనే ముందు, కొన్ని కోట్లమంది దళితుల ఆవేదనని కూడా పరిగణలోకి తీసుకోండి. ఆ ఆవేదన తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. I am ready to help in that.

    రిప్లయితొలగించండి
  14. నీ పిల్లలకి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగాలు ఇప్పించడానికే కదా ఈ వితండవాదం. లాయర్, చార్టర్డ్ అకౌంటంట్ లాంటి ప్రొఫెషన్లకి రిజర్వేషన్ తో పని లేదు. నీ పిల్లలని లాయర్లు లేదా చార్టర్డ్ అకౌంటంట్లు చెయ్యడానికి చదివించు.

    రిప్లయితొలగించండి
  15. ఉదాహరణకు మొన్న దేవుడి నగల్ని తాకట్టు పెట్టిన పూజారిని చూసి "మొత్తం పుజారులు ఇంతే" అని ఎవరైనా అంటే మనం ఒప్పుకుంటామా? చచ్చినా ఒప్పుకోం
    _________________________________________________

    You precisely did that. Didnt you blame the entire community for the acts of a few?

    రిప్లయితొలగించండి
  16. @మలక్పేట రౌడీ: We have already discussed this issue..but if you still want to understand it in the same way SO BE IT.

    But at least let me explain it one more time.

    కులవ్యవస్థ, తద్వారావచ్చిన కులవివక్షని చారిత్రకంగా-సామాజికంగా అర్థం చేసుకునే క్రమంలో బ్రాహ్మణవాదాన్ని మూలకారణంగా గుర్తిస్తాము. బ్రాహ్మణవాదం ఒక సామాజికప్రక్రియకు రూపం. ఒక "ఇజానికి" పేరు. ఇందులో కులం పేరున్నంతమాత్రానా నేనేదో ఒకే కులాన్ని ఈ సామాజిక రుగ్మతకు కారణంగా చూపుతున్నాననేది మీ తెలియనితనాన్ని లేక అపోహను సూచిస్తుందేతప్ప, నా అవగాహనా లేమినో లేక అక్కసునో కాదు.

    రిప్లయితొలగించండి
  17. Boss... if you had said "Brahmnism" then it would have been fine ... but just to copy paste your comment ..

    -------------------------

    "బహుశా అది మన post vedic Hindu సంస్కృతి నుంచీ వారసత్వంగా వచ్చిన లక్షణం. దేవుడ్నీ, మతాన్నీ, సామాజిక నిర్మాణాన్నీ ఎవడూ ప్రశ్నించకుండా అన్నిటినీ “డెఫినిటివ్” చేసిపడేసారు. ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది"

    ---------------------------------


    I was refering to that comment. I have no issues with the use of the word "Brahminism" if it refers to treating one caste as "better than the other castes" .. but my point here is about Stereotyping. I am not sure whether you meant something else, but it was the same comment you pasted in my blog and until then ,I dont think, I read it :))

    రిప్లయితొలగించండి
  18. I didnt and dont agree with that comment (and the subsequent stereotyping) because Brahmins had both the Orthodox clan who never questioned anything and the unorthodox types who questioned things.

    రిప్లయితొలగించండి
  19. మహేష్ అమాయకుడు కాదు, అవకాశవాది. "నీకు లక్ష రూపాయలు ఫ్రీగా ఇస్తే వదులుకుంటావా" లాంటి మాటలు ఆడడం నిజాయితీ లేని వాళ్ళు చేసే పనే.

    రిప్లయితొలగించండి
  20. http://stalin-mao.net/?p=28
    మహేష్ లాంటి వెన్నుపోటు దార్ల దెబ్బకి నాస్తికత్వం ఓడిపోయింది. మూఢ నమ్మకాలు గెలిచాయి.

    రిప్లయితొలగించండి
  21. @మలక్పేట రౌడీ: Don't you see???? you are choosing to see only one sentence out of the comment and ignoring the MEANING of the whole comment. Is it selective interpretation of bias?

    NOW PLEASE READ AGAIN...
    "ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది"

    రిప్లయితొలగించండి
  22. అసలు కుల ప్రస్తావనే లేని క్రైస్తవ, ఇస్లాం మతాలని నమ్మేవాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తే కుల వ్యవస్థకి అధికారిక ముద్ర వేసినట్టు కాదా? ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు.

    రిప్లయితొలగించండి
  23. >>>>>
    డొంక తిరుగుడొద్దు, సూటిగా మాట్టాడండి మహేష్ గారూ..
    "..విస్తృత సామాజిక-ఆర్థిక-రాజకీయ సమస్య.." - జోకా? మతం కులం కాకుండా ఇక 'సామాజిక'మేంటో చెప్పండి. (సామాజిక లోంచి మతం కులం తీసేస్తే అర్థంపర్థం లేని సా, జి మిగులుతాయి.)
    >>>>>
    మతానికీ, కులానికీ సంబంధం లేకపోతే మహేష్ హిందూ మతాన్ని తీవ్రంగా ఎందుకు విమర్శించినట్టు? కొన్ని నెలల క్రితం ఈ మహానుభవుడు హిందూ మతానికి వ్యతిరేకంగా వ్రాసిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. అదే సమయంలో నేను కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా పోస్టులు వ్రాసాను. అప్పట్లో నేను మహేష్ తో గూగుల్ చాట్ లో మాట్లాడితే తనకేమీ భయం లేదనీ, ఎంత మంది వివాదం చేసినా పట్టించుకోననీ చెప్పాడు. ఇప్పుడు మతానికీ, కులానికీ సంబంధం లేదంటూ పొంతన లేని వాదనలు చేస్తున్నాడు.

    రిప్లయితొలగించండి
  24. అవును మహేష్‌గారూ.. రాజశేఖరరెడ్డి అనే ఒక వ్యక్తి ఈపాటికే క్రైస్తవంలో ఉన్నాడండి. నేనూ దళితుణ్ణే నాకూ రిజర్వేషను కావాలి అని అడిగితే,

    మరనాత చౌదరి అని ఒకాయనుంటాడనుకోండి.. ఆయన కూడా నేను దళిత క్రైస్తవుణ్ణే, తే రిజర్వేషను తే! అని అంటే,

    దానికి ప్రభుత్వమేం చెయ్యాలి? ఇవ్వాలా, అక్కర్లేదా? ఇస్తే ఎందుకు? ఇవ్వకపోతే ఎందుకు? అతడు దళితుడు కాదని ఎలా చెప్పగలరు? దళితుడేనని ఎలా చెప్పగలరు?

    అసలింతకీ క్రైస్తవం వీళ్ళ గురించి ఏమని చెబుతోంది? అసలు దళిత క్రైస్తవుల గురించి ఏమని చెబుతోంది?

    మీరు విశాలమైన పరిధిలో సమస్యను అర్థం చేసుకుంటారని నాకర్థమైంది. కానీ ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం కుసింత సూటిగా రాయండి.

    రిప్లయితొలగించండి
  25. http://parnashaala.blogspot.com/2008/12/blog-post_879.html చదవండి
    ఇందులో విస్కాన్సిన్ రాధిక గారు ఇలా వ్రాసారు
    >>>>>
    దళితు చాలామంది మతం మారింది కేవలం డబ్బు కోసం.హిందువుగా వుండడం వల్ల రిజర్వేషన్లు వుంటాయి కాబట్టి అటు అదీ,ఇటు ఇదీ రాబట్టుకోవడం కోసం రెండు పేర్లతో చెలామణీ అవుతారు.మీరు చాలా కొత్త సిద్ధాంతాలు[సొంత సిద్దాంతాలు]చెప్పేస్తున్నారు దళితులు ఇందుకు హిందూత్వం వద్దనుకుంటున్నారు అంటూ.
    >>>>>

    రిప్లయితొలగించండి
  26. నాస్తికులని కూడా ఆశ్చర్యపరిచే నాస్తిక థీసిస్ ప్రవేశ పెట్టే నియో-రిచ్ క్లాస్ దళితులు ఉన్నారు. మందార ప్రభాకర్ గారి వాదన ప్రకారం మతం ఊహాజనితం అని జనానికి తెలుసట. మతం ఊహాజనితం అనేది జనానికి తెలిసిన విషయం అయితే మతం సైన్స్ ప్రగతికి అడ్డు గోడ అని మనం (నాస్తికులం) ఇంత కాలం ఎందుకు ప్రచారం చేశాము? నేను బలమైన నాస్తికుడినే. కొన్ని నెలల క్రితం హిందూ మతానికి వ్యతిరేకంగా నేను వ్రాసిన పోస్టులు చదివిన వాళ్ళందరికీ ఈ విషయం తెలుసు. రిజర్వేషన్ల విషయానికి వచ్చేసరికి "కులం సత్యం, మతం మాత్రమే మిథ్య" అనే కొత్త రకం థీసిస్ ప్రతిపాదిస్తున్నారు.

    రిప్లయితొలగించండి
  27. @చదువరి: ST/SC/BC (రిజర్వుడు)కులాల ధృవీకరణకు ప్రభుత్వం ఒక పద్దతిని ఏర్పాటుచేసింది."ఈ వ్యక్తి రాజ్యాంగంచే గుర్తింపబడిన రిజర్వుడు కులాలవాడే" అని మండలస్థాయి రెవెన్యూ అధికారి కులధృవీకరణ పత్రం ఇస్తేగానీ ఎవరికీ రిజర్వేషన్ అందుకునే సౌలభ్యం లేదు. ఈ తంతు కోసం గ్రామస్థాయి కార్యదర్శి నుంచీ స్థానిక వార్డు మెంబరు వరకూ అందరి సంతకాలతో ఒక అర్జీపెట్టుకోవాలి. ఇలా verify చేసిన తరువాత మాత్రమే ధృవీకరణ పత్రం జారీచెయ్యబడుతుంది.

    కాబట్టి రెడ్డి,నాయుడు,చౌదరి వంటి రిజర్వుడు కులాలు కానివాళ్ళు రిజర్వేషన్ పొందే అవకాశం లేదు. లోపాయకారిగా సర్టిఫికేట్ సంపాదించొచ్చనేది మీ వాదనైతే అది ఎంతోకొంతశాతం రేషన్ కార్డునుంచీ పాస్ పోర్టు వరకూ అన్ని విషయాలలోనూ వర్తిస్తుంది.

    రిప్లయితొలగించండి
  28. శతృచర్ల విజయరామరాజు (క్షత్రియుడు) దొంగ సర్టిఫికేట్ తోనే నాగూరు ST రిజర్వ్డ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. అతనికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిన తరువాత శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజక వర్గానికి వెళ్ళిపోయాడు. విజయరామరాజు చెల్లెలు థాట్రాజు నరసింహప్రియ పార్వతీపురం పట్టణంలో ST రిజర్వ్డ్ వార్డ్ నుంచి కౌన్సిలర్ గా పోటీ చేసి గెలిచింది. విజయరామరాజు అంతకు ముందు దొంగ సర్టిఫికేట్ తోనే శానిటరీ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేశాడు. అతని తమ్ముడు చ్అంద్రశేఖరరాజు దొంగ సర్టిఫికేట్ తోనే టీచర్ ఉద్యోగం చేశాడు. పుట్టుకతోనే పేరు చివర రాజు, వర్మ అని ఉన్న వాళ్ళు మేము క్షత్రియులం కాము అంటే నమ్మేసి ST సర్టిఫికేట్ ఇచ్చేశారు. నేను రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం చెయ్యను. గిరిజన కుటుంబంలో పుట్టి బ్రాహ్మణుడిలాగ పేరు చివర శర్మ అని పెట్టుకున్నా నాకు ఏమీ కాదు. డబ్బున్న కుటుంబంలో పుట్టి రిజర్వేషన్ కోటాలో గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకునే వ్యక్తికి కుల ఐడెంటిటీ వదులుకునే ధైర్యం ఉంటుందా?

    రిప్లయితొలగించండి
  29. ఒకప్పుడు ఊరి కరణం, మునసబ్ లకి లంచం ఇచ్చి దొంగ సర్టిఫికేట్ లు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు గ్రామ కార్యదర్శులకి లంచం ఇచ్చి దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి
  30. NOW PLEASE READ AGAIN...
    "ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక behaviour గా ఎప్పుడో మమేకం అయిపోయింది"
    _________________________________________________

    I read it again and again - and I am specifically referring to the first half of the sentence. You are holding one ENTIRE community responsible for the deeds of a few and thats my issue!

    రిప్లయితొలగించండి
  31. శతృచర్ల విజయరామరాజు గారి చిన్నాన్న ప్రతాపరుద్రరాజు గారు కూడా దొంగ ST సర్టిఫికేట్ తోనే పోటీ చేశారు. అది నేను పుట్టకముందు జరిగింది. విజయరామరాజు, ప్రతాపరుద్రరాజులు చిన్న మేరంగి మాజీ జమీందార్ల కుటుంబానికి చెందిన వాళ్ళు కావడం వల్ల వాళ్ళ దొంగ సర్టిఫికేట్ల వ్యవహారం బయట పడింది.

    రిప్లయితొలగించండి
  32. ఈ ధోరణికి ఆద్యులు బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక బెహవిఔర్ గా ఎప్పుడో మమేకం అయిపోయింది"
    ఇలా మారిస్తే పేచీ ఉండదా?

    ఈ ధోరణికి ఆద్యులు కొంతమంది బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక బెహవిఔర్ గా ఎప్పుడో మమేకం అయిపోయింది"

    రిప్లయితొలగించండి
  33. నిజంగా పొంతన లేని సమాధానాలు మహేష్ ఈ పోస్ట్ లో వ్రాసాడు http://uyyaala.blogspot.com/2009/08/blog-post_27.html
    మహేష్ చెప్పిన పొంతన లేని సమాధానాలలో ఒకటి
    >>>>>
    ప్రభుత్వ విద్యాసంస్థలూ, ఉద్యోగాలూ చర్చ్ నడపడం లేదే! మరి రెండుసార్లు దళితులు ఎలా లబ్ధిపొందుతున్నారు?

    నీకు జీతం వస్తోందికదా అని బ్యాంక్ లోనిస్తే వద్దంటావా? లేదా ఎవరైనా తేరగా ఒక లక్ష ఇస్తామంటే కాదంటావా? ఏదోఒక లబ్ధికలిగిస్తామంటే తృణీకరిస్తావా? లాభపడేది ఏదైనా మనిషి కావాలనే కోరుకుంటాడు.అది ఎన్ని రకాలుగా ఉన్నా అది కావలసిందే! దీనికి దళితులు మాత్రం వంచితులు ఎందుకవ్వాలి?

    చర్చ్ మంచి విద్యనిస్త్రే తీసుకుంటాం. వైద్యాన్ని అందిస్తే సంతోషిస్తాం. ఆర్థిక వనరులు కల్పిస్త్రే అందుకుంటాం. దానికీ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకూ లంకెకలిపి double benefit అనడం మీ తెలియనితనానికి ఒక ఉదాహరణగా మాత్రమే అనిపిస్తోంది.
    >>>>>

    రిప్లయితొలగించండి
  34. మహేష్ కూడా ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నవాడే. మా అమ్మానాన్నలు కూడా బ్యాంక్ ఆఫీసర్లు గా పని చేసి ఆర్థికంగా బాగా స్థిరపడ్డారని మహేష్ కి తెలుసు. డబ్బున్న వాడు లక్ష రూపాయలు ఫ్రీగా తీసుకోవడం తప్పు కాదని నమ్మితే నిజాయితీ ఎక్కడ ఉంటుంది?

    రిప్లయితొలగించండి
  35. బ్రాహ్మణులు కులవ్యవస్థకి ఆద్యులు ఎలా అవుతారు ? ఎవరో అలా అంటే, లేదా అలా ప్రచారం చేస్తే నమ్మెయ్యడమేనా ? సొంతబుఱ్ఱ ఉండనక్కర్లేదా ? విషయానికి లోతు అక్కఱలేదా ? ఎవరూ అంతకుముందు లేని కులాల్ని, జాతుల్నీ సృష్టించజాలరు. ఆల్రెడీ ఉనికిలో ఉంటే ప్రత్యేక గుర్తింపు ఇవ్వగలరు అంతే ! బ్రాహ్మణులు సృష్టించారు అంటే దాని అర్థమేంటి ? మొదట్లో కులాల్లేవనీ, బ్రాహ్మలొక్కళ్ళే ఉండేవాళ్ళని కాదూ ? అలా చూసుకున్నా ఇతరకులాలు కాలక్రమేణ బ్రాహ్మల్లోంచి విడిపోయాయనిపిస్తుంది తప్ప బ్రాహ్మలు సృష్టించారనిపించదు. తమ ప్రమేయం లేకుండా జఱిగిన ఈ చారిత్రిక పరిణామానికి బ్రాహ్మలెలా బాధ్యులవుతారు ?

    Whom or which particular caste can you specifically pinpoint for the emergence of 6,000 castes on India's cultural landscape ? Did the Brahmins create all these castes ? Utterly Ridiculous.

    కులాలు అనేక కారణాల వల్ల ఇండియాలో ఉనికిలో వచ్చాయి. బ్రాహ్మలు సృష్టించడం వల్ల కాదు. ఈ దేశపు జనం మొదట్నుంచి రకరకాల భాషలు మాట్లాడే రకరకాల తెగలకి చెందినవాళ్ళయి ఉండడం ఒక కారణం. ఆ భాషల్ని కూడా బ్రాహ్మలే సృష్టించారా ?

    మన దేశస్థులు మంగోలాయిడ్, ఆఫ్రో-ఏషియన్, కాకేషియన్, నెగ్రిటోయిడ్ మొదలైన రకరకాల జన్యుజాతులకీ, రంగులకీ చెందినవారై ఉండడం ఇంకో కారణం. ఈ రకరకాల జీన్స్ నీ, ఈ జాతుల్ని కూడా బ్రాహ్మలే సృష్టించారా ?

    నాగరికత విస్తరించినకొద్దీ కొత్తకొత్త వృత్తులు బయలుదేరాయి. ఒక్కొక్క వృత్తి చేపట్టిన ఒక్కొక్క గుంపు ఆర్థికలాభాల కోసం తమలో తాము వివాహాలు చేసుకోగా ఏర్పడ్డ కులాలు కొన్ని. ఈరోజు డాక్టర్లు, డాక్టర్లనీ, ఇంజనీర్లు ఇంజనీర్లనీ, సినిమాస్టార్లు సినిమాస్టార్లనీ చేసుకోవడంలేదా ఆదాయం కోసం ? అదే పూర్వీకులు చేస్తే అది వాళ్ళచేత బ్రాహ్మలు చేయించారంటారా ? లేదా ఆ వృత్తుల్ని సైతం బ్రాహ్మలే కనిపెట్టారా ?

    ఇండియాకి అన్ని కాలాల్లోను వలసదార్లు వస్తూనే ఉన్నారు. ఆ వచ్చినవాళ్ళు స్థానిక జనాభాతో కలవడానికి ఇష్టపడక తమ ప్రత్యేకతని మెయిన్ టెయిన్ చెయ్యగా పుట్టిన కులాలు కొన్ని. వాళ్ళని విదేశాల నుంచి బ్రాహ్మలే రప్పించారా ?

    ఏం మాట్లాడుతున్నారు ?

    ఒక హత్య జఱిగిందనుకోండి., అది జరిగిందని రిపోర్ట్ ఇచ్చేవాణ్ణి పట్టుకుని "నువ్వే చేశావీ హత్య" అంటే ఎలా ఉంటుంది ? బ్రాహ్మలు తమకాలానికి ఉన్న కులాల పేర్లూ, వృత్తులూ, ఆచారాలూ తమ పుస్తకాల్లో నమోదు చేశారు. అంతమాత్రానికే వాళ్ళు సృష్టించారనడం సమంజసమా ? వాళ్ళు అలా రికార్డు చేసుండకపోతే ఈ కులాలకి చరిత్ర ఉండేది కాదు.

    రిప్లయితొలగించండి
  36. Tadepalli garu!

    I could not find any comment which says that brahmins are the reason for varna vyavastha in this entire discussion,
    this second part of discussion between mahesh and bhardwaja is about the term 'brahminical attitude'!

    Emito!!! andariki marthanda/praveen sarma comment style vachhestondi :)

    Srinivas garu! your suggestion sounds good! hope with this change,these hot discussions about 'brahminism, brahminical attitude' stop and we will be able to move in for better discussion

    రిప్లయితొలగించండి
  37. విచిత్రమేంటంటే, గిరిజన గ్రామాల్లో కూడా వర్ణ వ్యవస్థలుంటాయి, అక్కడ బ్రాహ్మణులు ఉండరు కాని వారిలోనే వేరు వేరు తెగలు, ఉన్నత కులం (కొండ కాపు), నిమ్న కులం (వాల్మీకి) లాగ.

    భారతదేశంలో ప్రజలందరూ క్రైస్తవులైతే ఆ మతానికొచ్చే లాభమేంటి?

    రిప్లయితొలగించండి
  38. ఇలా మారిస్తే పేచీ ఉండదా?

    ఈ ధోరణికి ఆద్యులు కొంతమంది బ్రాహ్మణులే అయినా, ఈ జాఢ్యం కులానికి అతీతంగా ఒక సామాజిక బెహవిఔర్ గా ఎప్పుడో మమేకం అయిపోయింది"
    _________________________________________________

    I have absolutely no issues with that. But lets see whether Mahesh agrees!

    రిప్లయితొలగించండి
  39. క్రైస్తవ మతం పుచ్చుకున్న దళితులు అంటరాని వాళ్ళు కాదు. దళిత క్రైస్తవుల పై దాడి జరిగినా ఆట్రోసిటీ కేస్ నమోదు సాధ్యం కాదు. ఈ వ్యాసం చదవండి: http://vrdarla.blogspot.com/2009/08/blog-post_29.html దార్ల వెంకటేశ్వరరావు గారు కూడా దళిత ప్రొఫెసరే.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు