3, అక్టోబర్ 2008, శుక్రవారం

రక్తపాత రహిత కుట్ర !

ఈ జాబుకు ప్రేరణ నాగప్రసాదు రాసిన మీరు దేవుణ్ణి తింటారా అనే జాబు. నిజానికి ఈ జాబు అంతా అక్కడే వ్యాఖ్యగా రాయాల్సింది.. పెద్దదై పోయింది, పైగా కాస్త అసందర్భం అవుతుందేమోనన్న శంక.. అంచేత ఇదిగో ఇక్కడ..

నా దేవుణ్ణి నేను పూజించుకుంటున్నాను. నా మతాచారాలను, అనూచానంగా వస్తూ ఉన్న సంప్రదాయాలను నేను పాటిస్తున్నాను. ఇప్పుడు ఎవరో వచ్చి, మీ ఆచారాలు తప్పు, మీ దేవుడు మిధ్య, మా దేవుడు గొప్ప, ఈ విగ్రహాలేంటి, ఆ బొట్టేంటి ఇవన్నీ తప్పు అని చెబితే ఎలా ఉంటుంది? 'ఇక ఈ అనాచారాలను ఆపేసి, మా మతంలో చేరిపో, ఇదిగో నీకీ లాభాలు కలుగుతాయి' అని ఊదరగొడితే ఎలా ఉంటుంది. 'పోనీలే, తన మతాన్ని తాను ప్రచారం చేసుకుంటున్నాడు, మనకెందుకులే' అని ఊరుకోగలమా? నా దేవుణ్ణి కించపరచకుండా తమ దేవుడి గురించి చెప్పుకుంటే అలాగే అనుకోవచ్చు. కానీ వీళ్ళు చేస్తున్నది అది కాదే! నాగప్రసాదు గారి విషయంలో జరిగిందీ అది కాదు.

నేనూ మత మార్పిడి ప్రచారకులను చూసాను, చూసిన వాళ్ళు చెప్పగా విన్నాను.. ఏ ఒక్ఖరు కూడా తన మతంలోని మంచి వరకు చెప్పి ఊరుకోలేదు. ఎవరూ కూడా నా మతాన్ని విమర్శించకుండా తమ ప్రచారాన్ని ముగించలేదు. నా మతంలోని తప్పులను ఎంచకుండా ఎవరూ ఊరుకోలేదు. అసలు అలాంటివాళ్ళు అసలే ఉండరని అనను. ఉంటేగింటే ఖచ్చితంగా వాళ్ళు గంజాయి వనంలో తులసిమొక్కలని మాత్రం చెప్పగలను.

అందరినీ గౌరవించాలి -అది ధర్మం. కానీ నన్ను తక్కువగా చూసేవాణ్ణి, తేలిక చేసేవాణ్ణి నేనెలా గౌరవించను!? నా దగ్గరకొచ్చి తన దేవుడి గురించి చెప్పి, నా దేవుణ్ణి విమర్శించి, నా ఆచారాలను విమర్శించి, 'నువ్వు మతం మార్చుకుని నా మతంలోకి వచ్చేయ్' అని చెప్పేవాడు సరైన వాడెలా అవుతాడసలు ? 'ఇదిగో మీ మతంలో ఇలా ఉంది, కానీ మా మతంలోనైతే ఇది ఇలా భలేగా ఉంటది' అని చెప్పేవాడు మంచిమాటలు చెబుతున్నట్టా ? అలాంటివాళ్ళను ఎదిరించడం తప్పా? నా మతమంటే నా సంస్కృతి, నా వారసత్వం! తన మతం గొప్పదనం చెప్పుకోడం కోసం, నా సంస్కృతిని విమర్శిస్తే నేను ఊరుకోలేను గదా!
~~~~~~~~~~~~~
వాళ్ళు చాపకింద నీరులాగా మార్పిళ్ళు చేస్తూంటారు. ప్రచారాలు, ప్రలోభాలు, డబ్బులు,... ఇవీ, ఇలాంటివీ వీళ్ళ ఆయుధాలు. ఈ ఆయుధాలతో కనిపించని హింస సృష్టిస్తున్నారు. సమాజంలో కొత్త విభజనలు తెస్తున్నారు. రక్తపాత రహిత కుట్ర ఇది (ఇలా మార్పిళ్ళు చెయ్యకుండా చట్టాలు తేవడం తప్పని పోపు మనకు చెప్పిన నీతుల గురించి గతంలో రాసాను.). బలవంతపు మార్పిళ్ళకూ, వీటికీ తేడా లేదు. ఈ మార్పిళ్ళు అనేక అనర్ధాలకు దారితీయడం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం. గతంలో ఎన్నో అనర్ధాలు జరిగాయి కూడా! ఇవి సమాజంలో ఉద్రిక్తతలకు, హింసకు దారి తీస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలి. మత మార్పిడిని, అందుకోసం చేసే ప్రచారాలను నిషేధించాలి.
-------------------------------------------
(మతం వర్గంలో నేను రాసిన ఇతర వ్యాసాలను కూడా చూడండి.)

60 కామెంట్‌లు:

  1. Bravo.
    క్రైస్తవ మిషనరీలు విద్యా వైద్య రంగాల్లో మన దేశంలో కొన్ని వందల ఏళ్ళుగా చేసిన చేస్తున్న సేవని ఎవరం కాదనలేం, కానీ దాని వెనక ఉన్న మోటివేషను మాత్రం కొలోనియల్ అహంకారంకన్నా, కార్పొరేటు గ్రీడు కన్నా భయంకరమైనది. సుమారు వందేళ్ళ క్రితమే ఈ పరిస్థితి ఎలా వేళ్ళూనుకుందో ఉన్నవవారి మాలపల్లి నవల్లో చూడొచ్చు. ఇప్పుడు ఈ క్రైస్తవ మతోత్సాహానికి దన్నుగా అమెరికను ధన బలం నిలుస్తోంది.

    రిప్లయితొలగించండి
  2. కొత్తపాళీగారు మిషనరీలకి మతమార్పిడీ కోసం అమెరికానుండి ధనసహాయం అందుతున్నదన్నట్లు రాయటం ఆశ్చర్యంగా ఉంది. దేశంలో వేలాదిగా ఉన్న మిషనరీ బళ్లు, కాలేజిలూ ఇన్నేళ్లలో ఎందర్ని మతమార్పిడి చేశాయో చెప్పగలరా? ఆర్‌సి్ఎం మిషనరీలు వేరు, ఇతర ప్రొటెస్టంట్ సంస్థలు వేరు. మనదేశంలో స్కూళ్లు, హాస్టళ్లు ఎక్కువగా ఆర్‌సి్ఎం మిషనరీల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీళ్లు మతప్రచారం అసలు చేయరని చెప్పలేముకానీ వాళ్ల సేవతో పోలిస్తే అది శూన్యం కిందనే లెక్క. రోడ్ల మీద బైబిళ్లతో బయలుదేరి ఉపదేశాలు చెయ్యటం, స్వస్థత సభల పేరుతో జాతరలు జరపటం వీళ్ల పద్ధతి కాదు.

    క్రిస్టియన్లంటే ఏహ్యభావం కలిగేలా ప్రవర్తించేది కొద్దిమంది ప్రొటెస్టంట్ తెగలవారు. అదీ వాళ్లకి ఆ మతమ్మీదున్న భక్తితో కాదు. అది వారికో భుక్తిమార్గం మాత్రమే. వీళ్లకి ఎక్కువగా అమెరికా మరియూ జెర్మనీల నుండి ధన సహాయం అందుతుంది. అందులోనూ మతమార్పిడికి ఉద్దేశించినది కొంత; అనాధలకు, పేదలకు మతాతీతంగా సహాయం చెయ్యటానికుద్దేశించింది మరికొంత. ఆ డబ్బుతో ఆర్ఫనేజుల్లాంటివి నడుపుతున్నట్లు చెప్పుకుని హాయిగా మేడలు కట్టుకున్నవారు నాకు కొందరు తెలుసు.

    ఇకపోతే, మతమార్పిడి చేసుకున్న దళితుల్లో చాలామంది ఆ రకంగా వచ్చే డబ్బో మరో లాభం కోసమో ఓ వంక క్రిస్టియన్లుగా నటిస్తూ, మరోవంక ప్రభుత్వమిచ్చే రిజర్వేషన్ల కోసమో మరింకేదానికోసమో ఇటు హిందువులుగానూ చలామణి అవుతుంటారు. ఇటువంటివారినీ నేనెరుగుదును. ఈ మతమార్పిడీ అనేది చేసేవాళ్లైనా చేయించుకునేవాళ్లైనా ఇహలోకంలోని లాభాల కోసం చేసేవే కానీ పరలోకప్రాప్తి కోసం కాదు. అయినా తిండిలేని వాడికి దేవుడు ముఖ్యం కాదు కదా. అది ఓ స్వామీజీ నోటికందిస్తే అతడు హిందువుగానే మిగలడా? ఆ అవకాశం ఫాదరీలకో, ముల్లాలకో ఎందుకివ్వటం?

    రిప్లయితొలగించండి
  3. @అబ్రకదబ్ర .. నేను రాసిన వాక్యం ఆశ్చర్యం కలిగిస్తున్నదని మీ ఓపెనింగ్ స్టేట్మెంట్ తరవాత మీరు రాసిన మొత్తంలోనూ నా వాక్యాన్ని పూర్వపక్షం చేసిన వాదమేదీ నాకు కనబళ్ళేదు.

    రిప్లయితొలగించండి
  4. కొత్తపాళీగారు,

    మీ వాదన మిషనరీలకు వర్తించదనేది మాత్రమే నా ఓపెనింగ్ స్టేట్‌మెంట్ లక్ష్యం. మొదటి పేరా మొత్తం దానికే ఉద్దేశించింది. ఆ తర్వాతిదంతా ప్రొటెస్టెంట్ల మతమార్పిడుల వెనుకున్న నిజాల గురించి మాత్రమే - మీ వాదనకి ఖండనగా కాదు.

    రిప్లయితొలగించండి
  5. తమ మతంవారిమీదే హిందూ మతం చెసిన/చేస్తూవచ్చిన/చేస్తున్న తీవ్రమైన హింసముందు..ఈ రక్తపాత రహిత హింస పెద్ద లెఖ్ఖలోకి రాదేమో!

    వినేవాడు దొరికే తమ మతం గురించి గొప్పలు చెప్పడం అన్నిమతాల్లోనూ ఉంది. అదికాస్తో కూస్తో ఇతరమతాలవారిని ఎద్దేవా చెయ్యకపోతే కుదరదుకూడాను.ఇతరుల్ని disprove చెయ్యడంకూడా ఒక point ని prove చెయ్యడమే కదా! అది సైన్సైనా మతమైనా పెద్దతేడా ఉండకూడదు.

    ప్రపంచవ్యాపతంగా క్రైస్తవం harvest of hearts అనే mission తో మతమార్పిడి చెయ్యడానికి ఒక పధకం రచించింది. అదీ రహస్యంగా కాదు, చాలా బాహాటంగా. మరి వారి ఉద్దేశం తెలిసినప్పుడు, మన మతంవాళ్ళని కాపాడుకోవాలి (?) అని మీకు అనిపిస్తే మనమూ హిందూమత ప్రచారోద్యమం విస్తృతంగా చేద్దాం. వద్దన్నదెవరు?

    రిప్లయితొలగించండి
  6. Kathi garu, Whatever happened within two sects of Hinduism is an internal aspect of Hinduism. I wonder how would you comment about the major conflicts that happened between two sects of Christianity, i.e., Catholics and Protestants.

    Btw, Abrakadabra garu, Are you sure it is only Protestants who indulge in proselytization ? Don't Catholics and other sects of Christianity preach that too ?

    రిప్లయితొలగించండి
  7. మతమంటే నమ్మకం. వారి మతం గొప్పది అనుకుంటే తప్పులేదు కానీ ఎదుటివారి మతం మంచిది కాదంటే మాత్రం చాలా తప్పు. ప్రతి ఒక్కరికి ఎన్నో కొన్ని బలహీనతలుంటాయి అందులో డబ్బుబలహీనత ముఖ్యమైనది. ఈ బలహీనతను ఆధారంగా చేసుకుని మతమార్పిడులు చేస్తున్నాయి. ఇది చాపకింది నీరులా ఎంతవరకు పాకిందంటే పాఠశాలకు వచ్చే పిల్లల్ని సరదాకి పాట పాడమంటే 'ఏసు' పాటలు పాడేవరకు వచ్చింది. పిల్లల్ని ప్రతీ ఆదివారం చర్చికి రమ్మంటారట,వారికి అక్కడ చాక్లెట్లు, కొంత డబ్బులు(సుమారు 20/- per visit) ఇస్తారట.చర్చి ఫాదర్ పిల్లల్నందరినీ దగ్గరకు తీసుకుని ముద్దుల వర్షం కురిపించి ప్రతీవారం రావాలని అలావస్తే బవిష్యత్తులో మంచి స్థాయిలో ఉంటారని చెబుతాడట. పిల్లలను, వారి తల్లిదండ్రులను ఆకర్శించే అన్ని హంగులు వారికి ఉన్నపుడు మనమేమి చేయలేం. ఉపాధ్యాయుడిగా నేను చెబుతే మతప్రచారం అంటారు, సర్వమత సౌబ్రాత్రుత్యం పాటించాల్సిన ఉపాధ్యాయుడే ఇలా ప్రవర్తిస్తాడా అని సమాజం నన్ను ప్రశ్నిస్తుంది. నేను ఉపవాసం అయినా ఉంటాను కానీ అడ్డమయిన గడ్డీ తినను అని ప్రతి హిందువు భావించే వరకు దీన్ని ఆపలేము.

    రిప్లయితొలగించండి
  8. అప్రస్తుతమైనా, ఈ (ఇలాంటి) టపా(ల)కి రావలసిన వ్యాఖ్య వచ్చేసింది. ఇక మొదలు (ప్రతి) ఖండనలు ... ఆద్యంతం రసవత్తరమైన చర్చ(రచ్చ)కు ఇదే తొలి అడుగు

    రిప్లయితొలగించండి
  9. @ మహేష్ గారు
    హిందూ మత ప్రచారం జరగడం లేదని ఎవరు అన్నారు? జరుగుతుంది.. కానీ హిందూ మతంలోకి మార్పిడి చేసే ప్రచారం జరగడం లేదు. రెండిటికీ తేడా కనబడటం లేదా మీకు?

    మతాన్ని తీసుకెళ్ళి సైన్సుతో ముడి పెట్టి తేడా ఉండకూడదు అనడం ఈ టపాలో లేవనెత్తిన సమస్య మీద చర్చని తప్పుదారి పట్టించడమే అవుతుంది. మతం అనేది విశ్వాసాలమీద నిర్మితమవుతుంది... సైన్సు మౌళికంగా విశ్వాసాన్ని ఎద్దేవా చేసి భౌతికమైన కొన్ని నిజాన్ని చాటడానికి ప్రయత్నిస్తుంది. బౌతికమైన ఆ నిజాన్ని కనుక్కోడానికి చర్చ, వాదన అవసరం. ఒక్కోసారి అదే నిజాన్ని కనుక్కోవడానికి చాలా మార్గాలు వుండవచ్చు...

    మతం అనేది బౌతికమైనది కాదు. ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి మతం వారిది. ఇక్కడ ఎద్దేవా చెయ్యడం, disprove చెయ్యడం అనేదాన్ని ప్రోత్సహించడమే రోతగా ఉంది వినడానికి. మీరేమైనా ప్రపంచానికి ఒకే మతం ఉండాలి అనే లక్ష్యాన్నేమైనా ఎంచుకున్నారా?

    ఎంత సమన్వ్యయపరుచుకుందామన్నా, అసలు మీరు ఈ వ్యాఖ్య ఈ టపాకి ఎందుకు రాసారో అర్ధం కావడం లేదు. అసలు అవసరం లేదేమో అని కూడా అనిపిస్తుంది.

    అజ్ఞాత గారన్నట్టు ప్రతీ మతం లోను వర్గాల మధ్య రక్తపాతం జరిగింది జరుగుతుంది.. ఇస్లాంలో షియాలు సున్నీల మధ్య, వివిధ తెగల మధ్య.., సిక్కు మతంలోనూ జరుగుతున్నాయి...

    రిప్లయితొలగించండి
  10. @అబ్రకదబ్ర గారు: RCM మిషనరీలు కూడా చాలా ప్రచారాలు చేస్తారండీ... వాళ్ళు సేవ చేస్తారు - దీనికి ఒప్పుకుంటాను కానీ, అంతకుమించి మత ప్రచారం కూడా చేస్తారు(ఇది నేను గమనించినంతవరకూ - మీ అంత ఎక్కువ నేను గమనించి ఉండకపోవచ్చు).. మా తమ్ముడు చదివింది అలాంటి RCM స్కూల్ లోనే --> అక్కడ రోజూ అందరొ తప్పనిసరిగా, బైబిల్ చదవాలి... ఇంకా అక్కడికి అప్పుడప్పుడూ ఈ మతప్రచారకులు వచ్చి సభలు, సమావేశాలు గట్రా పెట్టేవారు...

    రిప్లయితొలగించండి
  11. @దిలీప్: మనహిందువుల్లో హిందూమతం తెలీనివాళ్ళే చాలా మంది ఉన్నారుకాబట్టి వాళ్ళకి తెలియజెప్పడానికి ప్రచారం జరుగుతోంది. క్రైస్తవం వారిమతాన్ని "పెంచుకోవడానికి" ప్రచారం జరుపుతోంది. ఉద్దేశాలలో తేడా ఉన్నంతమాత్రానా, వారిది తప్పని అనలేంకదా!

    మతంపై నమ్మకం కలిగేది దాని ఉనికిని గుర్తించినప్పుడే, అది భైతికమైన ఉనికైనా కావచ్చు,అధ్యాత్మికమైనా కావచ్చు.అదే ప్రయత్నం "ఫెయిత్ హీలింగ్" పేరిట క్రైస్తవులు చేస్తున్నారు.దాని ఉనికి మీరు గ్రహిస్తే మతం మారతారు లేకపోతే "తూచ్" అని విమర్శిస్తారు. అంటే ఒక శాస్త్రీయ ధృక్పధంతోనే దాన్ని పరికిస్తున్నారన్నమాట. అలాంటప్పుడు సైన్సుకీ మతానికి సంబంధం లేదంటే ఎలా? సైన్సంటే ఫిజిక్సూ,బయాలజీ,కెమిస్ట్రీ కాదు...అదొక proof ఆధారిత తార్కిక ధృక్పధం. అదే మనం మతంలోకూడా వాడుతాం. కేవలం ఇక్కడ అనుభూతి ఆధారితమౌతుంది..ఉనికి మనకు మాత్రమే తెలుస్తుంది. అదేతేడా!

    నా లక్ష్యంమాత్రం ఒకేమతమే..మానవత్వం.

    ఈ టపా శీర్షికలోనే నేను వ్యాక్యలో లేవనెత్తిన విషయాలున్నాయి, మరి లింకు లేదని మీరంటే నాకూ అర్థం కావడం లేదు.

    రిప్లయితొలగించండి
  12. We discuss and try to convert others to our point of view or sometimes change our views in many discussions like capitalism, social democracy etc. I think most religions including Hindus converted people from other groups. In Richard Eaton's "The Rise of Islam and the Bengal Frontier, 1204–1760", he says that both Hindus and Muslims converted the tribals and Muslims were more successful (around 90 percent converted to Islam and the rest to Hinduism.) I think these conversions and discussions of relative merits of religions have been going on for centuries and still go on. So, I do not see any thing wrong in the efforts to conversions by poiting to some problems in the other religion as long as no force is involved.

    I would like to add that I am an agnostic though born a Hindu. I enjoy many religious songs, Hindu sculptures etc but my early experiences with Hinduism have not been happy. My father was a school teacher and during some vacation, he sent me for a couple of weeks to another teacher's house. I played with his children, we slept side by side but I had to eat in the verandah and take out the banana leaf every time on to a dump on the road in full view of the public. We hear os similar and worse cases even now.
    Last year, I started participating in a micro-finance program through a pastor. One of the cases involved a woman with three children whose husband passed away. we gave her 2500 rupees to start a dhaba with the help of which she is making a living. The pastor himself lives on contributions from his congregation and has no salary. I did not see much evidence of foreign money. I did hear in Hyderabad of some cases of money sent from abroad for different religions and eaten up by middlemen.

    రిప్లయితొలగించండి
  13. @అజ్ఞాత:

    కేథలిక్కులు మతప్రచారం చెయ్యరని నేననలేదు. [మన దేశంలో] ప్రొటెస్టంట్ల స్థాయిలో మతమార్పిడులకు వీళ్ళు పాల్పడరని మాత్రమే నేనంటున్నాను. ప్రొటెస్టంట్లలోనే క్రిస్టియానిటీలోని non-catholic sects అన్నీ వస్తాయి, be it Baptists, Lutharans, Christ the Scientist's, Evangelists, Mormans, Seventh Day Adventists or anybody else.

    @మేధ:

    ఒకటో తరగతి నుండి ఎంఫిల్ వరకూ, పద్దెనిమిదేళ్లపాటు ఏకబిగిన మిషనరీ స్కూళ్లు, కళాశాలల్లో చదివాను నేను. నాకు మతమార్పిడి అనుభవాలెప్పుడూ ఎదురుకాలేదు. ఆ స్కూళ్లలో catechism తరగతులనేవి ఉంటాయి కానీ అవి క్రిస్టియన్లకి, అందునా కేథలిక్కులకి మాత్రమే ప్రత్యేకమయినవి. అసలు కేథలిక్ చర్చ్‌లలోకి ఏ ఇతర మతస్థులనూ అనుమతించరు (తెలీకుండా వెళితే అది వేరే సంగతి) - ముఖ్యంగా communion తీసుకునే సమయంలో. ఊరికే హిందువులనో, ఇతర మతస్థులనో తీసుకెళ్లి మత మార్పిడి చెయ్యటం కేథలిక్ గుళ్లలో చాలామంది అనుకునేంత తేలికగా జరిగే విషయం కాదు. మతం మారదలచుకున్నవారు నిజాయితీగా మారుతున్నారో లేక ఏదన్నా లాభం కోసం మారుతున్నారో పరిశీలించిగానీ చెయ్యరిక్కడ. కేథలిక్ మైనారిటీ విద్యాసంస్థల్లో ఉద్యోగాలొస్తాయని మతం మారబోయి దొరికిపోయి నిరాకరించబడిన స్నేహితులు కొందరున్నారు నాకు.

    ---- ----

    నేను నా మొదటి వ్యాఖ్య రాసింది మతమార్పిడులని సమర్ధించటానికో, వ్యతిరేకించటానికో కాదు. మన దేశంలో క్రిస్టియన్లలో మార్పిడులు నిజంగా చేసేది ఎవరు, ఎందుకు చేస్తారు అనే విషయమ్మీద నాకు తెలిసిన విషయాలని పంచుకోవటానికి మాత్రమే. అయితే కొందరు వ్యాఖ్యాతలు రాసింది చదివాక మతమార్పిడులగురించి మరింత వివరంగా రాయాలనిపించింది.

    పైన గద్దే స్వరూప్ అన్నట్లు, మతమార్పిడులనేవి క్రిస్టియన్లకో, ముస్లిములకో పరిమితమైనవి కావు. హిందువులూ ఆ తానులో ముక్కలే. మార్పిడులేవీ చెయ్యకుండానే బౌద్ధం, జైనం అంతరించి మనదేశంలో హిందూత్వం మళ్లీ మొగ్గ తొడిగిందా? గతంలో శ్రీలంక నుండీ కాంబోడియా దాకా హిందూ రాజుల దండయాత్రల ఫలితంగా మతమార్పిడులు జరిగిన దేశాలెన్నో. పురాతన కాలాన్నొదిలేసినా, ప్రస్తుతం గుజరాత్‌లో ప్రభుత్వ అండదండలతో జరుగుతున్న బలవంతపు మతమార్పిడులు సంగతేమిటి? ఈ ఏడాది జూన్ 13న గుజరాత్ రాష్ట్రం దాంగ్స్ జిల్లాలోని నందపెదా గ్రామంలో ముస్లిముల్ని గుజరాత్ పోలీసులు, అటవీశాఖాధికారులు బలవంతంగా హిందూ మతంలోకి మార్చారు - మారకపోతే వారి భూముల్ని, ఇళ్లనీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని భయపెట్టి మరీ.

    ఒరిస్సాలోనూ, కొన్ని తూర్పు రాష్ట్రాల్లోనూ re-conversions పేరిట విహెచ్‌పి వాళ్లు, ఇతర హిందూ గ్రూపులూ ముస్లిములనీ, క్రిస్టియన్లనీ ఇదే విధంగా భయపెట్టి హిందూత్వంలోకి మారుస్తున్నారు. ఆ కార్యక్రమానికి 'శుద్ధి' అనే వేదప్రవచిత నామమొకటి కూడా ఉంది. ఈ శుద్ధి తంతు ఏమిటో తెలుసా? హిందుత్వంలోనికి పునరాగమనం చేసేవారితో గోమూత్రపానం చేయించటం, వారికి గుండు గీయటం, బైబిల్/ఖురాన్ ప్రతులని చించివేయటం, వగైరా. మనుషులతో గోమూత్రం తాగించటం శుధ్ధి అట!

    ఆగస్టులో ఒరిస్సాలో మావోయిస్టులు స్వామీ లక్ష్మణానంద అనే హిందూ ప్రచారకుడిని వర్గహత్య చేస్తే విహెచ్‌పి, ప్రవీణ్ తొగాడియా దానికి మతం రంగు పులిమి ఒరిస్సాలో మారణహోమానికి తెరతీశారు. ఫలితం - యాభై మందిదాకా క్రిస్టియన్ల హత్య, వేలాదిమంది క్రిస్టియన్ల ఆస్థుల విధ్వంసం, చర్చ్‌ల దహనం, అనేకమందితో బలవంతంగా హిందూత్వంలోకి re-conversion.

    గోద్రా అనంతర గొడవల్లో గుజరాత్‌లో పెట్రేగిన గొడవల్లో హిందూమతంలోకి బలవంతపు మార్పిడులెన్ని జరిగాయో మీకు తెలుసా?

    ఏ మతానికీ చెందని ఆదివాసీలని క్రిస్టియన్లతో సమానంగా హిందువులూ మతమార్పిడులు చేస్తున్న సంగతి మీకు తెలుసా?

    మతమార్పిడుల వంటి సున్నితమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని నిజాయితీగా మాట్లాడాలి. ఇతరులు ఆశపెట్టి మతమార్పిడులు చేస్తుంటే హిందువులు భయపెట్టి అదేపని చేస్తున్నారు. చదువరిగారు శీర్షికలో చెప్పిన 'రక్తపాతరహిత కుట్ర'తో పోలిస్తే ఈ రక్తపాతసహిత కుట్ర మరింత భయంకరమైనది. ఇటువంటి నిజాలు నిష్టూరంగానే ఉంటాయి. ఒప్పుకునే ధైర్యం లేనప్పుడు ఇతరుల మతమార్పిడులగురించి ఆవేశపడకూడదు.

    ఇంకెవరో అన్నారు, 'వాళ్ళ దగ్గర డబ్బుంది, ఆశలు పెట్టి మార్పిడి చేస్తున్నారు' అని. హిందూ సంస్థల దగ్గర డబ్బు లేదా? తితిదే వాటికన్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కల దేవాలయం. ఇటువంటి దేవాలయాలెన్నో మనదేశంలో. ఆ డబ్బుతో హిందూ మార్పిడులని ప్రోత్సహించమనండి. భయపెట్టి చెయ్యటం ఎందుకు?

    ఇదంతా చదివాక 'హిందువులంతా అలాంటివారు కాదు కదా' అనే ప్రశ్న ఎవరో ఒకరు నన్నడుగుతారు. వారికి నా సమాధానం: 'కచ్చితంగా కాదు. అలాగే, క్రిస్టియన్లూ ముస్లిములూ కూడా కాదు. ఏ కొందరో చేసే పనులకి అందరినీ అసహ్యించుకోవటం సరికాదు'

    రిప్లయితొలగించండి
  14. @అబ్రకదబ్ర గారు: నేను కూడా చదివింది మిషనరీ స్కూల్స్లోనే... మా స్కూల్లో నాకు ఇలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాలేదు.. మా తమ్ముడు (ఇంకా మా కజిన్స్ చదివినవి - కూడా మిషనరీస్) - వాళ్ళు చదివిన చోట మాత్రం ఇవి జరిగాయి.. నేను చెప్పింది - కేథలిక్స్ కూడా మత ప్రచారం చేస్తారు అని మాత్రమే...

    రిప్లయితొలగించండి
  15. అబ్రకదబ్రగారు విశ్వరూపదర్శనం గావించిన తరువాత,ఈ చర్చ ఖచ్చితంగా శాంతించక, మరో కురుక్షేత్రానికి దారితూస్తుందని ఖరాఖండిగా చెప్పొచ్చు. ఎందుకంటే, చాలా మంది తెలుగు హిందూ మిత్రులకు అటు గుజరాత్,ఇటు ఒరిస్సాలో జరుగుతున్న హిందూ టెర్రరిజం గురించి కనీసం చూచాయగాకూడా తెలీదు.

    ఈ నిజాలు వారికి ‘నమ్మలేని నిజాల’కోవలోకి వస్తాయి..అదే replye believe it or not అంటారే, అలాంటివన్నమాట. "మనం అలా కాదు" అనేది మనకొక ఫాషన్..నిజానికి, అసలునిజాలు తెలుసుకోవడం, మన మతం ఎప్పటి నుంచో నిషేధించిందనేది సత్యం..ఓం శాంతి,శాంతి,శాంతి:

    రిప్లయితొలగించండి
  16. మతం ప్రాథమికంగా జాతీయతా భావన. పూర్తిగా దేవుడికి సంబంధించినది కాదు. మన దేశస్థుల్ని ఇతర మతాల్లోకి మార్చడం అంటే మన దేశస్థుల్ని మన దేశానికే విదేశీయులుగా, విరోధులుగా చెయ్యడం. వారి శ్రద్ధాస్థానాల్ని దారి మళ్ళించడం. వారి దృష్టిలో ఈ దేశాన్ని సాంస్కృతికంగా worthless చెయ్యడం.

    దేశభక్తీ, మతాభిమానమూ - విడదీయలేని కాన్సెప్టులు. ఇది మతం మారిన/ మార్చిన రోజు తెలియదు. కాలక్రమంలో తెలుస్తుంది. ముస్లిమ్ మతం అరబ్బు జాతీయత మీద ఆధారపడినటువంటిసి. ముస్లిమ్ మతంలోకి మారడం అంటే మానసికంగా అరబ్బుగా మారడమే. అలానే క్రైస్తవమతం యూదు (Jewish) జాతీయత మీద ఆధారపడినటుబంటిది. అందుచేత క్రైస్తవుడుగా మారడమంటే మానసికంగా యూదు (Jew) గా మారిపోవడమే. కాబట్టి మతం పేరుతో పరాయి జాతీయతల్ని కౌగలించుకోవడం కంటే మన దేశీయ మతాన్ని - ఇక్కడ పుట్టి పెఱిగినదాన్ని మనం నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే మనం మనంగా బతగ్గలం. ఎన్నో దిగుమతి చేసుకుంటున్నాం, అవసరం కొద్దీ ! కానీ మతాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా ?

    ఒక దేశపు మతం ఆ దేశపు భౌగోళిక తత్త్వానికి ప్రతిరూపం. ఆ భౌగోళికతని తీసేస్తే ఆ మతానికి ఉనికి ఉండదు. ఉదాహరణకి ఇస్లామ్ లోని ఆచరణలు ప్రాథమికంగా ఎడారువాసుల అలవాట్లకు సంబంధించినవి. అలాగే హిందువుల ఆచరణలు ప్రధానంగా సారవంతమైన భూములకు సంబంధించినవి. ఆ మతాన్ని పుచ్చుకున్న ఇతర దేశీయుల చెవులకి మతరూపంలో తమకు వచ్చి చేరిన ఇతరదేశాల జాతీయతా విషయాలు, భావజాలమూ నామమాత్రంగా ధ్వనిస్తాయి తప్ప ఏ విధమైన సెంటిమెంటల్ విలువనీ తమలో కలిగి ఉండవు.

    హిందువుల్లో లోఫాలున్నాయి. హిందూమతంలో కాదు. మతాన్ని ఒక మనిషిని చేసి మాట్లాడకూడదు. ప్రతిమతమూ ఒకరోజులో పుట్టి పెఱిగినది కాదు. ఎన్నో సంస్కరణల ఫలితంగా ఈ స్థితికి వచ్చినది. ఆ విధంగా ఎల్లప్పుడూ సంస్కరణకు అవకాశం ఉంది. మనం సంస్కరిస్తామంటే మతం కాదనదు. కానీ మతాన్ని ద్వేషించడమే అజెండాగా పెటటుకుని గతంలోనే జీవించడం, ఎప్పుడో జరిగిపోయినవాటిని మళ్ళీ మళ్ళీ అందఱికీ గుర్తు చెయ్యడం మంచిది కాదు. మనం చాలా మైళ్ళు వచ్చేశామని అర్థం చేసుకోవాలి.

    ఏతావతా ఇంత అశాంతికి కారణమౌతున్న మతమార్పిళ్ళని నిషేధించక తప్పదు. మన మతమే లేకుండా మనం బతకడం సాధ్యమని వాదిస్తున్నప్పుడు మఱి మతమార్పిళ్ళు లేకుండా కూడా బతగ్గలమనేదాంట్లో విప్రతిపత్తి లేదు కదా !

    రిప్లయితొలగించండి
  17. తాడేపల్లిగారు,

    >> "ఏతావతా ఇంత అశాంతికి కారణమౌతున్న మతమార్పిళ్ళని నిషేధించక తప్పదు. మన మతమే లేకుండా మనం బతకడం సాధ్యమని వాదిస్తున్నప్పుడు మఱి మతమార్పిళ్ళు లేకుండా కూడా బతగ్గలమనేదాంట్లో విప్రతిపత్తి లేదు కదా"

    అప్పుడు ఏకంగా మతాన్నే నిషేధించాలి, మతమార్పిడులని కాదు. మతమార్పిడులని నిషేధించటం అంటే వ్యక్తి స్వేచ్ఛని హరించటమే. స్వేచ్ఛకన్నా ఏ మతమూ అధికం కాదు. ఎవరికిష్టం వచ్చిన మతాన్ని వారు అవలంబించే హక్కులేని ప్రజాస్వామ్యమెందుకు? మతస్వేచ్ఛపై నిషేధాలున్నప్పుడు కమ్యూనిజానికీ ప్రజాస్వామ్యానికీ తేడా ఏమిటి? మీరు 'బలవంతపు మతమార్పిడులని నిరోధించే చట్టాలుండాలి' అంటే బాగుండేదేమో. నాకు తెలిసి కొన్ని రాష్ట్రాల్లో ఇటువంటివి ఇప్పటికే ఉన్నాయి. వాటిని దేశవ్యాప్తం చెయ్యాలి (వాటి అమలు ఎలా ఉంటుందనేది వేరే కధ).

    >> "ముస్లిమ్ మతంలోకి మారడం అంటే మానసికంగా అరబ్బుగా మారడమే. అలానే క్రైస్తవమతం యూదు (Jewish) జాతీయత మీద ఆధారపడినటుబంటిది. అందుచేత క్రైస్తవుడుగా మారడమంటే మానసికంగా యూదు (Jew) గా మారిపోవడమే"

    అన్నీ తెలిసిన మీరే ఇలా వాదిస్తే ఎలా? క్రైస్తవమతం యూదు జాతీయత మీద ఆధారపడిందా!?! క్రీస్తు పుట్టుకతో యూదుడే కానీ క్రైస్తవులు యూదులు కారు. యూదులు ఇప్పటికీ జుడాయిజం అవలంబిస్తారు. క్రైస్తవులకూ యూదులకూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. Antisemitism అనే మాట మీరు వినలేదా? మధ్య యుగాల్లో క్రైస్తవుల చేతిలో యూదుల ఊచకోత, వాళ్లని భూమ్మీదనుండే తుడిచిపెట్టాలనే ప్రయత్నాలూ మీరెరుగరా?

    >> "దేశభక్తీ, మతాభిమానమూ - విడదీయలేని కాన్సెప్టులు"

    ఈ ఒక్క వ్యాఖ్యతో మీరు అబ్దుల్ కలాం నుండి మన్మోహన్ సింగ్ దాకా, లియాండర్ పేస్ నుండి బిస్మిల్లా ఖాన్ దాకా - భారతదేశంలోని ఇతర మతస్థుల దేశభక్తిని టోకున అవమానిస్తున్నారు. అంటే హిందువులంతా దేశభక్తులు, పరాయి మతస్థులు దేశద్రోహులు అని మీ ఉద్దేశమా? కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ సైనికుల దేశభక్తి మీకగుపడలేదా? వాళ్లు మతం కోసం పోరాడారా లేక దేశం కోసమా? (ఇవి రెండూ కాక భుక్తి కోసం అనే యదార్ధవాదులు గుర్తుంచుకోవలసింది, హిందూ సైనికులూ భుక్తి కోసమే ప్రాణాలు పణంగా పెడతారు కానీ దేశం కోసమో మతం కోసమో కాదన్న విషయాన్ని)

    >> "ఎన్నో దిగుమతి చేసుకుంటున్నాం, అవసరం కొద్దీ ! కానీ మతాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉందా?"

    దిగుమతుల మాట సరే. హిందూత్వ ఎగుమతి సంగతేమిటి? ఎన్నెన్ని విదేశాల్లో హిందూ గుళ్లూ గోపురాలూ కట్టి అక్కడివారిని హిందూత్వం వైపు ఆకర్షించటం లేదు? లేదూ, ఆ గుళ్లు అక్కడ స్థిరపడ్డ హిందువుల కోసం మాత్రమే అంటారా .. మీరన్నట్లు మతం భౌగోళిక తత్వానికి ప్రతిరూపమైతే, విదేశాల్లో స్థిరపడ్డ హిందువులంతా అక్కడి స్థానిక మతంలోకి మారిపోవాలి కదా. ఆ పని చెయ్యరేం?

    మతాల పుట్టుక, వాటి ఆచారాలు ఆయా భౌగోళిక పరిస్థితులకనుగుణంగా రూపొంది ఉండొచ్చు. అయితే పుట్టిన వేల ఏళ్ల తర్వాత మతమమనేది మౌలికంగా దేవుడికి, విశ్వాసాలకూ సంబంధించిందే కానీ నైసర్గిక స్వరూపానికి సంబంధించినది అవదు. మీరన్నదే నిజమయితే హిందూత్వంతో సహా నేడున్న ప్రముఖ మతాలన్నీ ఏనాడో అంతరించిపోయుండేవి.

    >> "హిందువుల్లో లోఫాలున్నాయి. హిందూమతంలో కాదు. మతాన్ని ఒక మనిషిని చేసి మాట్లాడకూడదు"

    ఇది నిఖార్సైన సత్యం. ఇదే సత్యం అన్ని మతాలకూ అన్వయిస్తుంది.

    రిప్లయితొలగించండి
  18. ఇక్కడింత బాగా చర్చ జరుగుతుంటే, నేను మధ్యలో నా సోది చెప్పటం బాగోదేమో! అందుకే అన్ని చదివి, చక్కా పోతున్నా! :-)

    రిప్లయితొలగించండి
  19. మతమార్పిడుల విషయంలో హిందువులు ఇతరమతస్థులని తప్పుబట్టడం నిరర్థకం. ఇది ముమ్మాటికీ స్వయంకృతాపరాధమే!
    హిందూ మతం(?)లో ఉన్న అవ్యవస్థ, వైవిధ్యం ఏ ఇతర మతాలలోనీ లేదు. వేదాలని నమ్మని వాళ్ళూ నమ్మే వాళ్ళూ కూడా హిందువులే. ఆ మాటకి వస్తే అసలు దేవుడినే నమ్మనివాళ్ళు కూడా కేవలం తమ పుట్టుకచేత హిందువులే!
    ఇతర మతస్తులలో వాళ్ళ మతమ్మీద, దేవుడిమీద నమ్మకాన్ని ఉంచుకోడానికి అడ్డురాని సైన్సూ, విజ్ఞానం, తార్కికత హిందూ మతస్థులని నాస్తికత్వం వైపు లేదా సో కాల్డు సెక్యులరిసం వైపూ మరల్చడంలో సఫలమౌతోంది. అది మరింత వైవిధ్యానికి దారితీస్తోంది.
    ప్రతి ఆదివారం చర్చికి, ప్రతి శుక్రవారం మసీదుకీ వెళ్ళే క్రిష్టియన్, ముస్లింల శాతంతో పోలిస్తే, వారానికొకసారి గుడికివెళ్ళే హిందువుల శాతం ఎంత?
    పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్టు, ఇతర మతస్థుల్లోని తీవ్రవాదాన్ని చూసి, లేని ఐకమత్యాన్ని సాధించడానికి తీవ్ర(హింసా)వాదానికి పాల్పడుతున్న మరికొంత మంది, తటస్థులకి హిందూ మతం(?)పై మరింత నిరసన కలిగేలా చేస్తోంది.
    హిందువులందరూ కలిసి ఈ కాలానికి తగినట్టుగా ఒక "వ్యవస్థీకృత" మతాన్ని ఏర్పాటు చేసుకోగలిసినప్పుడే ఇతర మతాలకి మతమార్పిడులు జరగకుండా ఆపగలిసే అవకాశం ఉంటుంది. కానీ అలా వ్యవస్థీకృతం చేస్తే ఇప్పుడున్న చాలామంది హిందువులు ఆ మతానికి చెందినవారు కాకపోవచ్చు.
    విచారించాల్సిన ఆశ్చర్యకరమైన హాస్యాస్పదమైన విషయం ఏవిటంటే, ఇంత వైవిధ్యం అవ్యవస్థా ఉన్న హిందువులని, కేవలం పాలనా పరమైన సౌకర్యం కోసం ఒకే "మతం"గా గుర్తించి, ఇతర మతాలకి "మైనారిటీ" స్టేటస్సు ఇవ్వడం!

    రిప్లయితొలగించండి
  20. @ అబ్రకదబ్ర గారు
    వి ఎచ్ పి చేసిన మత మార్పిడిని, అల్లర్లప్పుడు జరిగిన మత మార్పిడిని తీసుకొచ్చి... క్రైస్తవులచేత అను నిత్యం జరుగుతున్న మత మార్పిడితో పోల్చడం నాకు రుచించ లేదు...

    వి ఎచ్ పి అంత భారీ స్థాయిలో మత మార్పిడి చేయిస్తుందా నిజంగా? మీరు గమనించారా? ఎవరైనా సంస్థలు హిందు మతంలోకి మత మార్పిడి కార్యక్రమం చేస్తుంటే హిందువుల జనభా పెరుగుతూ ఉండాలి కదా? ఎందుకు రోజు రోజుకీ తగ్గిపోతుంది? క్రైస్తవుల జనాభా గణనీయంగా ఎందుకు పెరుగుతుంది... మా వూరిలో నా చిన్నప్పుడు ఉన్న జనాభా నిష్పత్తితో పోల్చితే ఇప్పుడు క్రైస్తవుల నిష్పత్తి గణనీయంగా పెరిగింది...

    "హిందువులూ ఆ తానులో ముక్కలే. మార్పిడులేవీ చెయ్యకుండానే బౌద్ధం, జైనం అంతరించి మనదేశంలో హిందూత్వం మళ్లీ మొగ్గ తొడిగిందా? గతంలో శ్రీలంక నుండీ కాంబోడియా దాకా హిందూ రాజుల దండయాత్రల ఫలితంగా మతమార్పిడులు జరిగిన దేశాలెన్నో."

    అప్పుడు రాజరికాలు ఉండేవి... చాలా వరకు రాజు ఏ మతం పాటిస్తే అనుచరులు ప్రజలు అవే మతాలు పాటించే వారు... రాజు సాంస్కృతిక,మత పరమైన విషయాలకి కూడా పోషకుడు... ఇప్పుడు భారత ప్రభుత్వం మత పరమైన ఏ భాధ్యతని నెత్తిన వేసుకోవడం లేదు.. అది తటస్థంగా ఉంటుంది... (ఒక్కోసారి మైనారిటీ పక్షపాతాన్ని కూడా చూపుతుంది) రాజుల కాలం నాటి పరిస్థితులని నేటి పరిస్థితులతో పోల్చడం ఎంత వరకూ సమంజసం?

    "ఈ ఏడాది జూన్ 13న గుజరాత్ రాష్ట్రం దాంగ్స్ జిల్లాలోని నందపెదా గ్రామంలో ముస్లిముల్ని గుజరాత్ పోలీసులు, అటవీశాఖాధికారులు బలవంతంగా హిందూ మతంలోకి మార్చారు - మారకపోతే వారి భూముల్ని, ఇళ్లనీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని భయపెట్టి"

    దాన్ని వ్యతిరేకించాలి... కానీ ఒక్కచోట జరిగిన చిన్న స్థాయి సంఘటనని దేశం మొత్తం జరిగే విస్త్రుతంగా చేసే క్రైస్తవల ప్రక్రియతో పోల్చడం అసంభద్ధంగా ఉంది...

    మీరు చెప్పిన ఒరిస్సా మొదలగు రాష్ట్రాల్లో భయపెట్టి మత మార్పిడి చేసారంటున్నారు... దాన్ని ఖండించాలి... చెదురు మదురు ఘటనలని చూపించి దాన్ని నిరంతరంగా జరిగే అన్య మత మార్పుడులతో పోల్చడం సమంజసం కాదనిపిస్తుంది...

    "గోద్రా అనంతర గొడవల్లో గుజరాత్‌లో పెట్రేగిన గొడవల్లో హిందూమతంలోకి బలవంతపు మార్పిడులెన్ని జరిగాయో మీకు తెలుసా? "
    దయ చేసి లెక్కలేమైనా ఉంటే చూపించండి...

    "ఏ మతానికీ చెందని ఆదివాసీలని క్రిస్టియన్లతో సమానంగా హిందువులూ మతమార్పిడులు చేస్తున్న సంగతి మీకు తెలుసా? "

    ఆదివాసీలందరూ ఏ మతానికీ చేందరు అని మీరు చెప్పేస్తే ఎలా? భారత దేశంలో దాదాపు 8% ఆదివాసీలు ఉన్నారు... అందులో చాలా తెగలు హిందు మతాన్నే పాటిస్తాయి... మిగిలిన తెగలని క్రైస్తవులు తమ మతంలోకి మార్చుకుంటుంటే అడ్డుకుని, హిందూ ప్రచారక సంస్థలు హిందూ మతంలోకి మార్చుతున్నాయి... వీరి అలవాట్లు, ఆచారాలు హిందూ మతస్థులకే దగ్గరగా ఉంటాయి... మొత్తానికి వీరి శాతం కూడా చాలా తక్కువ...

    "మతమార్పిడుల వంటి సున్నితమైన విషయాల గురించి మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకుని నిజాయితీగా మాట్లాడాలి. ఇతరులు ఆశపెట్టి మతమార్పిడులు చేస్తుంటే హిందువులు భయపెట్టి అదేపని చేస్తున్నారు."
    చూడండి.. ఒక చిన్న సంఘటనని, పెద్ద సంఘటనతో పోల్చి అది అలా జరుగుతుంది కాబట్టి, ఇలా జరగడం భావ్యమే... అనడమే నిజానిజాలని రూఢి చేసెయ్యడం అయితే అలాగే అవుతుంది... తీవ్రతలని పట్టించుకోకుండా నిజానిజాల రూఢి చెయ్యడం వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో నాకు అర్ధం కావడం లేదు...

    "'రక్తపాతరహిత కుట్ర'తో పోలిస్తే ఈ రక్తపాతసహిత కుట్ర మరింత భయంకరమైనది. ఇటువంటి నిజాలు నిష్టూరంగానే ఉంటాయి. ఒప్పుకునే ధైర్యం లేనప్పుడు ఇతరుల మతమార్పిడులగురించి ఆవేశపడకూడదు."
    నిజంగా క్రైస్తవులు చేసే రక్తపాతరహిత కుట్ర స్థాయిలో రక్తపాతసహిత కుట్ర జరిగితే, భారత దేశంలో క్రైస్తవుల జనాభా ఎలా పెరిగింది? పెరుగుతుంది?

    "ఇంకెవరో అన్నారు, 'వాళ్ళ దగ్గర డబ్బుంది, ఆశలు పెట్టి మార్పిడి చేస్తున్నారు' అని. హిందూ సంస్థల దగ్గర డబ్బు లేదా? తితిదే వాటికన్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఆదాయం కల దేవాలయం. ఇటువంటి దేవాలయాలెన్నో మనదేశంలో. ఆ డబ్బుతో హిందూ మార్పిడులని ప్రోత్సహించమనండి. భయపెట్టి చెయ్యటం ఎందుకు?"

    తితిదే ను వాటికన్ తో ఎలా పోల్చుతారు? తితిదే ఎప్పుడైనా మత మార్పిడిని ప్రోత్సహించినదా? ఎక్కడో చెదురు మదురుగ జరిగిన ఘటనలు తితిదే పురమాయిస్తే చేసినవా? అలాంటి ఘటనలకి తితిదే లాంటి సంస్థలని ఎలా భాధ్యులు చెయ్యగలరు? వాటికన్ మత మార్పిడి ని ప్రోత్సహిస్తుంది, దాని కోసం అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. మదర్ తెరీస సంస్థల్లో సేవ చెయ్యడానికి కూడా మతం మార్చుకోవాలనే షరతు ఉంటుంది. ఇన్నయ్య గారు రాసిన బ్లాగులో కూడా ఆ ప్రస్తావన వచ్చింది. కానీ పైకి ఆ సంస్థలు చేసే సేవ మాత్రమే కనపడుతుంది...

    "ఇదంతా చదివాక 'హిందువులంతా అలాంటివారు కాదు కదా' అనే ప్రశ్న ఎవరో ఒకరు నన్నడుగుతారు. వారికి నా సమాధానం: 'కచ్చితంగా కాదు. అలాగే, క్రిస్టియన్లూ ముస్లిములూ కూడా కాదు. ఏ కొందరో చేసే పనులకి అందరినీ అసహ్యించుకోవటం సరికాదు'"
    ఇక్కడ మతమార్పిడిని వ్యతిరేకిస్తున్నారు, ఇతర మతస్థుల నమ్మకాలని తక్కువ చేసి చుపించేవారిని వ్యత్రిరేకిస్తున్నారు, తప్పితే అందరిని ఎవరూ అసహ్యించుకోవడం లేదు కదా?

    రిప్లయితొలగించండి
  21. క్రైస్తవులంతా మానసిక యూదులే. అందులో నాకు అనుమానమేమీ లేదు. నేనేమీ పొఱపడట్లేదు. ఇహపోతే, ఈ దేశాన్ని హిందువుల్లా ప్రేమించే క్రైస్తవుల్ని నేనింతవఱకు చూడలేదు. ఇది నా దురదృష్టమని ఎవరైనా అంటే నేనొప్పుకుంటాను.

    రిప్లయితొలగించండి
  22. చిన్న దిద్దుబాటు:
    >>మతమార్పిడుల విషయంలో హిందువులు ఇతరమతస్థులని తప్పుబట్టడం నిరర్థకం. ఇది ముమ్మాటికీ స్వయంకృతాపరాధమే!
    ఇక్కడ నా ఉద్దేశం, "స్వయంకృతమే" అని. అది అపరాధమా కాదా అన్నది మన మన దృక్కోణాల బట్టి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  23. @దిలీప్

    >> "తితిదే ను వాటికన్ తో ఎలా పోల్చుతారు? తితిదే ఎప్పుడైనా మత మార్పిడిని ప్రోత్సహించినదా? ఎక్కడో చెదురు మదురుగ జరిగిన ఘటనలు తితిదే పురమాయిస్తే చేసినవా? అలాంటి ఘటనలకి తితిదే లాంటి సంస్థలని ఎలా భాధ్యులు చెయ్యగలరు"

    నేను పోల్చలేదు; మతఘర్షణలకీ తితిదేకీ ఎటువంటి లింకూ పెట్టలేదు. నా వ్యాఖ్యని మరోసారి చదవండి.

    >> "నిజంగా క్రైస్తవులు చేసే రక్తపాతరహిత కుట్ర స్థాయిలో రక్తపాతసహిత కుట్ర జరిగితే, భారత దేశంలో క్రైస్తవుల జనాభా ఎలా పెరిగింది? పెరుగుతుంది?"

    నిజమే, ఎలా పెరుగుతుంది? పెరగదు. పెరగలేదు కూడా - కారణాలేమైనా. 1991 జనాభాలెక్కల ప్రకారం మనదేశంలో క్రైస్తవుల సంఖ్య 2.32 శాతం అయితే 2001 లెక్కల ప్రకారం అది 2.35 శాతం. ఎంత పెరిగిందంటారు వారి జనాభా? మరిన్ని లెక్కలు చెప్పేదా?

    1971 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 4.6% ఉన్న క్రైస్తవ జనాభా 2001 లో 1.6% కి పడిపోయింది. ఇది పెరగటం అంటారా?

    ఇక, దేశవ్యాప్తంగా ముస్లిముల జనాభా శాతం పెరగటం గురించి. 1981లో అస్సాములోనూ, 1991లో జమ్మూ-కాశ్మీరులోనూ ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఆ రెండు రాస్ట్రాల్లోనూ జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దేశంలోనే ముస్లిములు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో జమ్ము-కాశ్మీర్ మొదటిది, వారి ప్రాబల్యం ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో అస్సాం కూడా ఒకటి అని మీకెరుకేననుకుంటాను. 2001లో మాత్రం ఈ రెండు రాష్ట్రాలలోని ముస్లిముల శాతాన్ని కూడా జతచేసి దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిముల సంఖ్యని నిర్ధారించటం జరిగింది. చూసినవారికి ముస్లిముల శాతం అమాంతంగా పెరిగిపోయినట్లనిపించటంలో వింతేముంది?

    సిల్లీగా అనిపించినా, మరో ముఖ్యమైన విషయం. గత పదిహేనేళ్లలో దేశాన్నొదిలి విదేశాలకెళ్లిన భారతీయుల్లో హిందు-హిందుయేతరుల సంఖ్య ఎంత? అమెరికాలోనూ, ఐరోపా దేశాల్లోనూ ప్రతి వందమంది హిందువులకి ఓ హిందుయేతరుడుంటాడేమో. గల్ఫ్ దేశాల్లో వీరి సంఖ్య సమానంగా ఉండొచ్చు. ముస్లిములతో పోలిస్తే ఎక్కువమంది హిందువులు దేశాన్నొదిలి బయటకు పోవటం, కుటుంబ నియంత్రణ అమల్లో ముస్లిములకన్నా హిందువులే చురుకుగా ఉండటం, తదితర కారణాలెన్నో ఉన్నాయి ముస్లిముల జనాభా పెరుగుదలలో ఆ మాత్రం వృద్ధి కనబడటానికి - పై పేరాలో నేను చెప్పిన కారణానికి అదనంగా. ముఖవిలువతో ఆయా సంఖ్యలని తూచలేము.

    >> "చూడండి.. ఒక చిన్న సంఘటనని, పెద్ద సంఘటనతో పోల్చి అది అలా జరుగుతుంది కాబట్టి, ఇలా జరగడం భావ్యమే... అనడమే నిజానిజాలని రూఢి చేసెయ్యడం అయితే అలాగే అవుతుంది"

    నేను మతమార్పిడులు ఎవరు ఎక్కువ చేస్తున్నారనే విషయంలో పోలికలు పెట్టటం లేదు. బలవంతపు మతమార్పిడులు ఎవరు చేసినా తప్పే, అది ఖండించదగ్గదే అని చెప్పటం నా ఉద్దేశం. సంఘటన చిన్నదైనంత మాత్రాన దాన్నొదిలేస్తారా? అయినా, రెండు రాష్ట్రాలని వారాలపాటు అశాంతి, అరాచకాల్లో ముంచేసిన సంఘటన మీకు చిన్నదిగా కనిపిస్తుందా!?! నేను ఉదాహరణగా అందరికీ తెలిసిన కొన్ని సంఘటనల గురించి ప్రస్తావించానేకానీ అంతగా వెలుగులోకి రానివి మరెన్నో జరుగుతున్నాయి. వాటన్నిటి గురించీ రాయటం నావల్లకాని పని. మతమార్పిడుల గురించి మాట్లాడేటప్పుడు అన్ని మతాలవారు చేసే మార్పిడుల గురించీ మాట్లాడాలి. మనం హిందువులం కాబట్టి మన కోణంలోనే మాట్లాడితే ఎలా?

    >> "ఆదివాసీలందరూ ఏ మతానికీ చేందరు అని మీరు చెప్పేస్తే ఎలా"

    నేను చెప్పటం లేదు. ప్రభుత్వం చెబుతుంది.

    >> "... అందులో చాలా తెగలు హిందు మతాన్నే పాటిస్తాయి... "

    అలా అని మీరు చెప్పేస్తే ఎలా? ఆదివాసీలు/ఆటవిక తెగల వారి మతాల్లో ప్రముఖమైనది 'సంతాళ్' (పశ్చిమ బెంగాల్). దీనికీ హిందూ మతానికీ ఎటువంటి సంబంధం లేదు. చాలా తెగలవారికి మతాలంటే ఏమిటో కూడా తెలీదు. వారు కొలిచేది ప్రకృతిని (nature worshipers అన్నమాట). భూకంపాలని దేవుడిగా కొలిచే తెగలు కూడా ఉన్నాయి. వాళ్లంతా హిందువులే అని నిర్ణయించేయటం మన అమాయకత్వమే. హిందూత్వమంటే ఏమిటో కూడా తెలీదు వీరికి. 'నీకు తెలీదులే. నువ్వు హిందువ్వే' అని ఓ ఆదివాసీతో అంటే ఎలా ఉంటుంది?

    >> "దయ చేసి లెక్కలేమైనా ఉంటే చూపించండి..."

    వేలలోనే మతమార్పిడులు జరిగినట్లు కధనాలున్నాయి. వాటిని మించి, వెయ్యిమందికి పైగా ముస్లిముల హత్య, ఐదు వందల దాకా మసీదులు, దర్గాల విధ్వంసం, మనుషుల్ని సజీవంగా మంటల్లో వేసి చంపటం, గర్భిణీ స్త్రీ కడుపు చీల్చి లోనున్న బిడ్డతో సహా ఆమెని చంపటం, సామూహిక మానభంగాలు .... ఇవన్నీ నేను కల్పిస్తున్న కధలు కాదు. ఆరేళ్లుగా రకరకాల కమిటీల నివేదికల్లోనూ, మానవ హక్కుల సంఘాల, వార్తా పత్రికల సర్వేల్లోనూ బయటపడ్డ విషయాలే. అన్నిటికీ ఇప్పుడు రుజువులు చూపటం నాకు చేతకాదు. ఇవన్నీ చిన్న సంఘటనలైతే, మరి గోద్రాలో రైలు దహనం మరెంత చిన్నదయుండాలి? దానికి ఈ స్థాయిలో రెచ్చిపోయి హత్యలకు పాల్పడాలా?

    చివరగా ఓ ముక్క. భారతదేశంలో విహెచ్‌పి వంటి సంస్థలు పూనుకుని కాపాడాల్సినంత హీనస్థితిలో హిందూత్వం లేదు. వందలాది ఏళ్లుగా అనేక మతాల, సంస్కృతుల తాకిడి తట్టుకుని నిలబడ్డ హిందూత్వానికి ఏ కొన్ని పార్టీలో, దళాలో అండనిచ్చి ఆదుకోవాల్సిన దురవస్థ లేదు, రాదు.

    ఈ రచ్చోపరచ్చకి నా తరపున ఇంతటితో తెర.

    రిప్లయితొలగించండి
  24. Kathi garu, I differ with your arguments. What is the basis for you to claim that Lakshamanananda Saraswati was killed due to Maoist personal vendetta ? I would suggest you set your news sources straight. Saraswati was merely trying to educate people against forcible (I consider offering monetary and other kinds of benefits too as forcible) conversions. I would argue that the socalled maoissts were funded by the people who felt there were getting impeded by Saraswati's actions.

    Coming to personal freedom, what personal freedeom and freewill will remain in a person who gets his faith converted by someone else's preachings ?

    How can you say the Hindu kings who conquered South Asian provinces forced Hindu religion on the natives there ?

    And finally, how can you claim only you have access to all the facts in Orissa and Gujarat ? How can you say that Hindu terrorism is rampant in those places ? If it is so, how can Xtian missionaries go about converting people all these days in Orissa ? How can people of a so called minority community burn a Hindu temple in Surat (you can check out the picture from eenadu archives) if Hindu fundamentalism is so rampant in Gujarat ?

    Abrakadabra garu, how long can will you keep repeating one revenge Hindu act (which I too denounce) as an example for each and every non-Hindu atrocity ? Will you agree if I refer in the same vein, to the atrocities committed by European Xtians on the people of Konkan region in general and those in Goa in particular in 1700s ? What about the 3 lakh Kashmiri's pandits who were driven out from their native lands about just 2 decades ago ?

    I was the anonymous who posted a comment yesterday.

    - Shiv.

    రిప్లయితొలగించండి
  25. "నిజమే, ఎలా పెరుగుతుంది? పెరగదు. పెరగలేదు కూడా - కారణాలేమైనా. 1991 జనాభాలెక్కల ప్రకారం మనదేశంలో క్రైస్తవుల సంఖ్య 2.32 శాతం అయితే 2001 లెక్కల ప్రకారం అది 2.35 శాతం. ఎంత పెరిగిందంటారు వారి జనాభా? మరిన్ని లెక్కలు చెప్పేదా?

    1971 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 4.6% ఉన్న క్రైస్తవ జనాభా 2001 లో 1.6% కి పడిపోయింది. ఇది పెరగటం అంటారా? "

    @అబ్రకదబ్ర గారు

    మీరు చూపించిన గణాంకాలు మన గణాంకాల వ్యవస్థ దివాళాకోరుతనానికి మంచి నిదర్శనం. మీరు ఆ గణాంకాలని నమ్మే మీ విశ్లేషణ గావిస్తే నా దగ్గర చెప్పాల్సినది ఏమీ లేదు... కేవలం గణాంకాలనే నమ్మే ఒక అమాయక పౌరునిగా మిమ్మల్ని నేను పరిగణనలోకి తీసుకుంటాను ఈ విషయంలో... కులాలకతీతంగా కోస్తాలోని పల్లేల్లో, రాయలసీమలోను పేదవారికి నిత్యకృత్యంగా మత మార్పిడులు జరుగుతుంటుంటే..., వారి జనాభా తగ్గుతుందని చూపించే గణాంకాలని చూసి ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కావడం లేదు... ఆశ్చర్యకరంగా ఉన్నా ఆ గణాంకాలని మీరు ఎలా నమ్మేసారో కూడా నాకు అర్ధం కావడం లేదు... మన రాష్ట్రంలో కనీసం అది అదే స్థాయిలో ఉండకుండా తగ్గడమేమిటో, అదే నిజమని మీరు ఏ మాత్రం సంకోచం లేకుండా ఆధారాలు చేసుకోవడం నేను అభిమానించే మీ నుండి ఆశించలేదు...

    నాకు తెలిసిన నిజమే మీకు చెప్పదలచుకున్నాను... రిజర్వేషన్ల సౌలభ్యం కోసం చాలా మంది తమ మతాన్ని రికార్డులకి ఎక్కనివ్వడంలేదు...

    దయచేసి కొంచెం పరిశోధించండి...

    ఇంకా ఆదివాసీలలో అందరూ హిందువులు కాదనడంలో కూడా నిజం లేదు... కొన్ని తెగలు ప్రకృతిని ఆరాధిస్తాయి, కొన్ని తెగలు హిందూ మతాన్నే పాటిస్తాయి, ఈ విషయం మీద కూడా మీరు పరిశోధించండి...

    రిప్లయితొలగించండి
  26. మహేష్: హిందూ మతం చేస్తున్న 'తీవ్ర హింస'ను ఇతర మతస్తులు చేసే హింసతో పోల్చారు. భేష్! కాశ్మీరులో తలకాయనెప్పి భరించలేకపోతున్నాం.. దాన్ని పాకిస్తాను వాడికి ఇచ్చేస్తే పీడా పోద్ది అనే మీరు, ఇలా అనడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే, మతమార్పిడుల కారణంగా హింస తగ్గిందో లేదోగానీ, కొత్తకొత్త సామాజిక ఉద్రిక్తతలకు తెరలేపుతోదనే సంగతి మాత్రం స్పష్టం. ఓసారి కంధమాల్ గురించి తెలుసుకోండి.

    "అదికాస్తో కూస్తో ఇతరమతాలవారిని ఎద్దేవా చెయ్యకపోతే కుదరదుకూడాను." -మీరు చెబుతున్న ఈ 'కాస్తో కూస్తో' కొలతతోనే చూద్దాం.. అలా ఎద్దేవా చేసినపుడు కాస్తో కూస్తో ఇతరమతాల వాళ్ళు తిరగబడటం కూడా సహజమేనా మరి? కాసినో కూసినో కంధమాల్‌లు, కాసిని మీనాక్షీపురాలు, కూసిని మంగుళూరులూ జరగడం కూడా సహజమేనా? ఇహ సైన్సు గురించి.. ఏకాంతపు దిలీప్ గారిచ్చిన వివరణ మీకు చాలు!

    'మతమార్పిడి పథకం..' -అదేదో గొప్ప విషయమైనట్టు, ఇప్పుడే తెలుసుకున్నట్టూ చెబుతున్నారేంటి? మధ్య యుగం నుండి ఆధునిక యుగానికి కాలం నడుస్తూంటే వచ్చిన మార్పే అది. కాలాన్ని బట్టి పద్ధతి మారుతోంది. క్రుసేడ్లయ్యాయి, కుంఫిణీలయ్యాయి, వ్యాపారాలు, మిషనరీలు, కుష్టు రోగ నివారణలు, మందులు, దుప్పట్లు, రగ్గులు, డబ్బులు, హిప్నోటిజం, దౌత్యనీతి,.. అనేక పద్ధతులు! పద్ధతులు మారుతూ వచ్చాయి గానీ లక్ష్యం అదే, గురి ఇతర మతాల పైనే! అలాంటి దొంగదారి మార్పిడులను, ప్రచారాలను నిషేధిస్తూ చట్టం చెయ్యాలనే నేననేది. మీరేమో.. 'కాదు, దానికి వ్యతిరేకంగా హిందూ ప్రచారోద్యమం చేపట్టాల్సిందే, రండి చేపడదాం' అని పిలుపులిస్తున్నారు. మీలాంటి సమర్ధులైన విశ్వాసులు నాయకత్వం చేపట్టాలేగానీ, నాస్తికులు కూడా మీ వెనక నిలబడరూ!! కానివ్వండి.

    -------------------

    అబ్రకదబ్ర: మీరు గమనించారో లేదో.. ఇక్కడ నేను ఎత్తిచూపింది మతమార్పిడి చేసేవారిని. క్రైస్తవులందరినీ కాదు. క్యాథలిక్కులు చేస్తారా, ప్రొటెస్టెంట్లు చేస్తారా అనేది కాదు ఇక్కడి సందర్భం.. మార్పిడి ప్రచారాలు చేసేవారి గురించి -అంతే! మార్పిడి ప్రచారాలు చేసేవారిని విమర్శిస్తే క్రైస్తవులందరినీ విమర్శించినట్టు, బాంబులేసే ముస్లిములను విమర్శిస్తే మొత్తం సాయిబులందరినీ చెడ్డవాళ్ళని అన్నట్టూ చిత్రించడం లౌకికవాదులకు అలవాటైపోయింది. దయయుంచి మీరలా భావించకండి.

    పునర్మతాంతరీకరణ గురించి: తిరిగి హిందూమతంలోకి మతాంతరీకరణ అనేది ఎందుకు అవసరమైంది? పునర్మతాంతరీకరణ అనేది వాడారూ అంటే ముందో మతాంతరీకరణ జరిగిందనే కదా.. అదుగో, అదే... గొడవలకు మూలకారణమని నేననేది. దాన్ని ఆపాలనే నేనన్నది. ఆ మార్పిళ్ళు జరిగాయి కాబట్టే ఘర్షణ మొదలైంది. సంఘర్షించడం మొదలయ్యాక అది సాగుతూనే ఉంటుంది. హిందూ సంస్థలు చేస్తున్న పని స్పందన మాత్రమే!

    గుజరాతు: ఇతర మతస్తులను వెనకేసుకురావాల్సిన ప్రతీసారీ లౌకికవాదులు గుజరాత్ అల్లర్లను అడ్డం పెట్టుకుంటున్నారు. చక్కగా, ఓ ప్రణాళిక ప్రకారం, కుట్ర పన్ని, రాళ్ళు, పెట్రోలు వగైరాలను పోగుచేసుకుని, బోగీ తలుపులేసేసి, రైలుపెట్టెను తగలబెట్టి, కూచ్చున్నవాళ్ళను కూచ్చున్నట్టుగా, పడుకున్నవాళ్ళను పడుకున్నట్టుగా, నిలబడ్డవాళ్ళని నిలబడ్డట్టుగా.. సజీవంగా... నిలువెల్లా.. కాల్చేసిన ఘటనొకటి జరిగింది -ఇది నేను కల్పించిన సంఘటన కాదు. ఈ ఘటనను మసిపూసి మారేడుకాయ చేయబూనిన లౌకికవాదుల ఆగడం నేను కల్పించిందేం కాదు. ఒక అమానుషమైన, పాశవికమైన ఘటనకు ప్రజల్లోంచి వచ్చిన స్పాంటేనియస్ స్పందనే, గుజరాత్ అల్లర్లు. కొన్ని శక్తుల చేతుల్లో పడి అవి తీవ్రమయ్యాయి. ఏ అల్లర్ల విషయంలోనైనా జరుగుతుందది. స్పందన సరైనదా కాదా అని చూడాల్సిందే.. కానీ దానికంటే ముందు దానికి మూలమైన పని సరైనదా కాదా అనేది చూడండి.

    ఒరిస్సా: గుజరాతులో జరిగినదాన్ని మీరు ఒకే కోణంలోంచి చూసారు. కానీ ఒరిస్సా విషయంలో మాత్రం అసలు వాస్తవాన్ని దాచిపెట్టేసి (లేదా మీకు వాస్తవం తెలీదో మరి!) దానికి బజరంగ్‌దళ్‌నో మరోదాన్నో బాధ్యుల్ని చేసేసారు. లక్ష్మణానందను హత్య ఒక నిప్పు రవ్వ, అంతే! తీవ్రంగా ఉద్రిక్తతకు లోనైన సామాజిక వాతావరణంలో ఒక్క రవ్వ చాలు గొడవలు రేగేందుకు. సామాజిక వాతావరణం అంతలా కలుషితం కావడానికి కారణాలు చూడండి. స్పందించేవాళ్ళను విమర్శించే ముందు మూల కారకులను గమనించండి.

    ఒరిస్సాలో జరుగుతున్నది ఎస్సీ ఎస్టీల మధ్య కుల పోరాటమని మీకు తెలుసా? ఆ కుల పోరాటానికి కారణం మత మార్పిడేనని మీకు తెలుసా? క్రైస్తవం తీసుకున్న జనులు కులపరంగా తమకు దొరికే కొన్ని సౌకర్యాలు పోకుండా కాపాడుకునేందుకు తాము ఎస్టీలమని బుకాయించబోతే ఎస్టీలకది నచ్చక ఆ రెండు వర్గాలకూ జరుగుతున్న గొడవ ఇదని మీకు తెలుసా? (మతం మారితే అస్సీలు సౌకర్యాలు కోల్పోతారు. కానీ ఎస్టీలు కోల్పోరు -మీ వ్యాఖ్యలను బట్టి మీకు తెలిసే ఉంటుందనుకుంటున్నాను) ఈ పోరాటం ఇప్పటిది కాదు, కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నది. స్వామి లక్ష్మణానందను హత్య చెయ్యడానికి ముందు, గతంలో ఒకసారి ఆయనపై హత్యా యత్నం జరిగింది. ఆ చేసింది క్రైస్తవులేనని కూడా మీకు తెలుసా? లక్ష్మణానందది వర్గ హత్య అనీ ఆ తరవాత జరిగింది మాత్రమే మత ఘర్షణ అనీ మీరనడం ఆశ్చర్యం కలిగించింది. పైగా మీరు చెప్పిన హిందూ సంస్థలు, హిందూ నాయకులు కంధమాల్లో ప్రవేశించక పూర్వమే ఇవన్నీ జరిగాయి. వాస్తవాలు తెలుసుకుని మాట్టాడ్డం మంచిది. (అసత్యాలనో అర్థసత్యాలనో ప్రచారం చేసేవారికి లౌకికవాదులనే మరో పేరుంది.)

    హిందువులను విమర్శించాలనే మీ అతురతలో హిందూ ఆచారాలను కూడా విమర్శించారు. తిరుపతి గుడికి వచ్చే డబ్బుల గురించి మాట్టాడారు.. నిజమే. కానీ ఆ డబ్బులు మత మార్పిడికి వాడాలని మీరనడమే చిత్రంగా ఉంది. ఎలా ఉందంటే.. హిందూ మతం అనేది ఒక సంస్థ అయినట్టూ, తిరపతి దాని హెడ్డాఫీసు, దాని కాడ చాలా డబ్బులున్నాయి, ఆడబ్బుల్ని వాడుకుని మతమార్పిడి చేసుకోవాలనీ.. ఏంటండీ ఇది? అర్థముందా మీరు మాట్టాడేదానికి?

    పోతే మహేష్.. మీమీద నాకు అసూయగా ఉంది... "అయ్యో నాకేమీ తెలీదే, మహేష్‌కు అన్నీ తెలుసే" అని! ఒరిస్సా గురించీ, గుజరాతు గురించీ మీలాగా అన్నీ తెలిసినవారు, బోధిస్తూ ఉంటే నేర్చుకుంటూంటా! (దొంగ) లౌకికవాదం గురించి చెప్పకుండా ఉంటేనే సుమా!

    ఆపేముండు...
    అబ్రకదబ్ర:. గొడవలు జరిగిన అదే కంధమాల్ జిల్లాలో పదేళ్ళలో క్రైస్తవుల జనాభా శాతం 8.8 నుండి 11.6 అయిందట. దీన్నేమంటారు.. పెరగడమా లేక తగ్గడమా? పోతే, మీరు చూపిన గణాంకాలు తప్పులతడకలు. దిలీప్ గారు చెప్పినది నిజం.. మతం మార్చుకున్న వారు రిజర్వేషన్ల వంటి సదుపాయాల కోసం హిందువులుగానే చెప్పుకుంటారు. కంధమాల్లో గొడవలకు అసలు కారణం అదేనని చెప్పాను గదా! ఓసారి మీ వాస్తవాలు, గణాంకాలు సరి చూసుకోండి.

    రిప్లయితొలగించండి
  27. చర్చ బాగుంది. ఈ సమస్య వివిధ కోణాలు తెలుస్తున్నాయి. వాదోపవాదాలు సంయమనంతో జరగడం అభినందించాల్సిన విషయం

    రిప్లయితొలగించండి
  28. చదువరిగారూ,గుజరాత్-ఒరిస్సాలలో మానవహక్కులపై పనిచేసే కొన్ని నెట్వర్కులతో నాకు సంబంధాలున్నాయి. అందుకే సాధారణంగా mainstream media లో చెప్పే విషయాలతోపాటూ మరికొంత alternate reality తెలిసే అవకాశం ఉంది.

    ఇక మీరు చెప్పే "(దొంగ) లౌకికవాదం" సంగతేమోగానీ, మానవహక్కుల రక్షణపట్ల మాత్రం నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. ఈ హిందూ తీవ్రవాదం వల్ల వాటి ఉల్లంఘన జరుగుతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.

    రిప్లయితొలగించండి
  29. తాడేపల్లి గారి వ్యాఖ్య దానికి అబ్రకదబ్ర గారి జవాబులు రెండూ నాకు చాలా నచ్చాయి.

    నేను ఒక మిషనరీ హాస్పిటల్లో పుట్టాను. అది ఎవరికోసం కట్టారు అని ఎవరూ ఆలోచించలేదు అని అనుకుంటున్నాను. అటువంటి ఆసుపత్రుల నిర్మాణం వల్ల ఎందరో లాభపడ్డారు. "ఏ స్వార్ధం లేకుండా" ఊరికే కూర్చోవడం కన్నా, కొంత స్వార్ధంతో నలుగురికి ఉపయోగమైన పనులు చేయడమే మేలు.

    నిజానికి ఒక మతం అయితే విదేశాల్లో కనీసం నాలుగు అయిదు శాతం ప్రజలు హిందువులుగా మారిపోయెవారు. అమెరికాలో ధ్యానం, యోగా అంటే ఏమిటి అన్నది తెలియని వారు మైనారిటీ అంటే ఆశ్చర్యపోతారు. ఇక్కడ ఆధ్యాత్మిక విప్లవం పెరుగుతుంటే మన దగ్గర మూర్ఖ భక్తిని దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాము.

    అభివృద్ధి చెందిన క్రైస్తవ దేశాలు ప్రపంచంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాయి, ముందు వారికి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాలి. ఊరుకొక కులం వాడకొక వర్గంతో, పక్కవాడిని హీనంగా చూసే, దేశీయ మతాన్ని సంస్కరించుకోకుండా పక్క వాడిని తిట్టడంలో ఏ మాత్రం లాభం లేదు.

    రిప్లయితొలగించండి
  30. @నాగన్న గారు,
    సంపదలతో తులతూగుతున్న దేశం, అప్పుల పాలయ్యి ప్రస్తుత పరిస్థితికి రావడానికి కారణం మీకు తెలుసనుకుంటాను. బ్రిటీష్ వారు క్రిష్టియన్స్ కారా.

    రిప్లయితొలగించండి
  31. మహేష్: మీ పరిజ్ఞానంపై నాకు గౌరవమేనండి.
    ------------
    ఈ వ్యాసంలో విషయం భక్తి ఆధ్యాత్మికత కాదు. నేను చెబుతున్నవివి:
    నా మతమంటే నా సంస్కృతి, వారసత్వం, నా ఆచార, విచారాలు అని అంటున్నాను మతమార్పిడి పేరిట వీటికి ద్రోహం చేస్తున్నారు అని అంటున్నాను -అంతే!
    సేవల్లో ఉన్నది మతమార్పిడి - అంతే!
    మతమార్పిళ్ళలో ఉన్నది భక్తీ ఆధ్యాత్మికతా కాదు, కేవలం స్వార్థం, వ్యాపారం - అంతే!
    మతమర్పిడులు సమాజంలో బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి, అంచేత నిషేధించాలి - అంతే!

    రిప్లయితొలగించండి
  32. @నాగప్రసాద్: బ్రిటిష్ వాళ్ళు రాజకీయంగా,ఆర్థికంగా, పరిపాలనాపరంగా చేసిందాన్ని, వాళ్ళ మతానికి అంటగట్టడం అంత సబబు కాదనుకుంటాను.

    మతమార్పిడిని దాదాపు మానసిక,సాంస్కృతిక హింసలాగా చదువరిగారు అభివర్ణించడం వింతగాకాకున్నా, కొంత ఆమోదనీయం కాకుండా ఉంది. మతమార్పిడికి వ్యతిరేకంగా ఇప్పటివరకూ 5 రాష్ట్రాలలో చట్టాలున్నాయి. ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఇంతవరకూ "బలవంతంగా" మతమార్పిడి జరుపుతున్నట్లు కనీసం ఒక్కరిపైనైనా కేసు పెట్టారా????

    ఈ కేసులసంఖ్యనిబట్టి, బలవంతపు మతమార్పిడి తీవ్రతను లెఖ్ఖగడితే..సమాధానం శూన్యం! రాజ్యాంగం స్వచ్చంధ మతమార్పిడికి గ్రీన్ సిగ్నలిస్తుంటే, వ్యక్తిని మీరి, "వద్దని" చెప్పడానికి ఈ VHP,RSS,బజరంగ్ దళ్ ఎవరండీ? నేనూ హిందువునే,but, I am sure they don't represent me and many more Hindus like me.

    రిప్లయితొలగించండి
  33. ఒట్టు తీసి గట్టున పెట్టి మళ్లీ రాస్తున్నాను. అయితే ఇది కొన్ని నామీద చేసిన కొన్ని ఆరోపణలకి ప్రతిస్పందనే కానీ నా వ్యాఖ్యానాలకి వివరణో, సవరణో కాదు.

    చదువరిగారు, నేని హిందూ ఆచారాలని విమర్శించానా? ఎక్కడ? శుద్ధి పేరుతో జరిగే తంతు - ముఖ్యంగా గోమూత్ర పానం చేయించటాన్ని నేను ఎత్తి చూపాను. ఇది హిందూత్వంలో గర్వించదగ్గ ఆచారం అని మీరనుకుంటే నేనేమీ చేయలేను.

    హిందూత్వమే కాదు, క్రిస్టియానిటీ ఐనా ఇస్లామైనా, నాకు దురాచారమనిపించినదాన్ని నేను బయటికి చెబుతాను. ఏ మతమైనా నాకొక్కటే. ఆ మతాల్లో ఉన్న దురాచారాల గురించి ఇక్కడ రాసే సందర్భం కాదిది. కాబట్టి రాయలేదు.

    నేనీ చర్చలో జోక్యం చేసుకుంది మతమార్పిడులు క్రిస్టియన్లకి మాత్రమే పరిమితమన్న రీతిలో సాగుతున్న వాదనకి ఖండనగా. క్రిస్టియన్లు మత మార్పిడి చెయ్యటం ఒప్పని నేనెక్కడా అనలేదే. బలవంతపు మతమార్పిడిలని నిరోధించే చట్టాలు దేశవ్యాప్తంగా ఉండాలి అని నేను తాడేపల్లిగారికిచ్చిన సమాధానాన్ని మీరు చదవలేదా?

    నేను చెప్పిందే వేదమని నేననను. కానీ కొన్నిసార్లు అవతలి పక్షం ఒకవైపు నుండే మాట్లాడితే నేను మరోవైపునుండే మాట్లాడాల్సొస్తుంది. నే చేసిందదే.

    చివరగా, ప్రభుత్వ గణాంకాల మీద నమ్మకం లేకపోతే మీరూ వాటినే ఉదహరించటం ఎందుకు?

    @దిలీప్:

    Be cool dude. I'm done with my argument, and I stick to that. But I'll surely try and re-check the facts. Afterall, you are right about the 'reservation' part; and I mentioned about it in one of the comments above.

    @చదువరి (మళ్లీ):

    నేను మీ బ్లాగుని తినేస్తున్నాను, పెద్ద పెద్ద వ్యాఖ్యానాలు రాసి. ఇది నిఝంగా ని చివరి వ్యాఖ్య - ఈ టపాకి :)

    రిప్లయితొలగించండి
  34. అతి సున్నితమయిన విషయాన్ని, లాఘవంగా ప్రస్తావించేరు. టపాకన్నా, మీ పొడుగాటి వ్యాఖ్య మరింత ఆలోచింపజేసింది. అలాగే ఏకంతపు దిలీపు గారి వ్యాఖ్యానూ.
    కాశ్మీరునూ ఇచ్చేద్దాం, హి.ప్ర., అ. ప్ర. లనీ ఇచ్చేద్దాం. ఇన్ని సమస్యలతో సతమతమవుతున్న మనకెందుకు మతం? అదీ అప్పజెప్పేద్దాం. మనిల్లూ, మన బ్లాగూ తప్పనిచ్చి; ఆక్రమించుకో దలచినవాడికి మనమే ఎదురు (తిరక్కుండా) మొత్తం ఇచ్చేద్దాం. వాడి దేశమ్మీది భక్తయినా దేశభక్తేట గదా! ఇక మన మతం ఎవైలబుల్ ఫర్ టేకోవర్ - నెత్తురోడకుండా!

    రిప్లయితొలగించండి
  35. ఈ చర్చ తెగేలా నాకు కనిపించటం లేదు. చదువరిగారేమో ఇది "రక్తపాత రహిత" కూట్ర అని స్పష్టంగా శీర్షికలోనే అంటున్నారు. "ప్రచారాలు, ప్రలోభాలు, డబ్బులు,..." మొదలైనవాటితో మతమార్పిడులు జరుగుతునాయన్నారు. దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.
    ఇటు మహేష్ గారు, అబ్రకదబ్రగారు "బలవంతంగా" మతమార్పిడిని ఖండించాల్సిందే అంటున్నారు!
    మహేష్ గారిని, అబ్రకదబ్రగారిని(నాకోసం ఒక్కసారి మళ్ళీ ఒట్టు తీసి గట్టున పెట్టండి ప్లీస్ :-) సూటిగా ఈ కింది ప్రశ్నలకి జవాబులివ్వమని అభ్యర్ధిస్తున్నాను:

    1. చదువరిగారు చెప్పినట్టుగా ప్రలోభాలు, డబ్బులు వంటి వాటితో మతమార్పిడులు జరుగుతున్నాయని మీరు అంగీకరిస్తున్నారా?
    2. అలాటి మతమార్పిడులని (ఇందులో "బలవంతం" అంటూ ఏవి లేదు) ఆపవలసిన అవసరం ఉందా?
    3. ఈ ఆపే బాధ్యత ప్రభుత్వమ్మీద ఉన్నదా?
    4. మతమార్పిడి చేసేవాళ్ళు హిందూ మత విశ్వాసాలని హేళన చెయ్యడం/తప్పుపట్టడం సమంజసమని మీరనుకుంటున్నారా?
    5. ఈ హేళన చెయ్యడం/తప్పుపట్టడం హిందువులు ఇతర మతాలని చేస్తే అది సమంజసమని అనుకుంటున్నారా?

    దయచేసి వీటికి అవును కాదు అని మాత్రమే సమాధానాలివ్వండి. దీనికి వివరణ అవసరమైతే తదుపరి వ్యాఖ్యలలో ఇవ్వవచ్చు.

    రిప్లయితొలగించండి
  36. ఈ మతమార్పిడులు జరగట్లేదని అనుకునేవారు అజ్ఞాతంలో బతుకుతున్నట్టే. దీని మీద నాకు ప్రత్యక్ష అనుభవాలున్నాయి.
    బిలో పవర్టీ లైను వారిని డబ్బులిచ్చి క్రిస్టియన్ మతానికి మార్చడం నాకెరుక. సేవే ప్రధానమయిన వారయితే మతమార్పిడి చేస్తేనే సేవ(డబ్బు) చెయ్యడమేమిటి నా బొంద...
    దీనిని సమంజసం అని బలపరచుకునే వారిని వింటుంటే నాకు భలే ఆశ్చర్యంగా ఉంది.

    ఇతర మతాన్ని అర్థం చేసుకుని స్వచ్ఛందంగా మారాలనుకునే వారితో నాకెటువంటి ఇబ్బందీ లేదు. అది వ్యక్తిగత ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. కానీ జనాలను ప్రలోభ పెట్టి ఎందుకు మార్చాలి ?

    ఒరిస్సా రాష్ట్రంలో ఆదివాసీలను మతమార్పిడులు చేస్తున్నారని ఆ మధ్య పేపర్లలోనే వచ్చాయి వార్తలు. అవన్నీ కనబడుతున్నా ఏమీ జరగట్లేదని కళ్ళు మూసేసుకుందామా ?
    అదేంటో గానీ తప్పుని ఇంకో తప్పుతో ముడిపెట్టి అది జరిగింది కాబట్టి ఇదీ ఓకే అనడం మూర్ఖంగా తోస్తుంది నాకు. తప్పు ఎవరు చేసినా తప్పే. అది హిందువయినా ముస్లిమయినా క్రిస్టియనయినా.

    స్థూలంగా బలవంతపు మత మార్పిడులు తప్పే నా ఉద్దేశంలో. అది డబ్బిచ్చి అయినా, పవరు ఉపయోగించి అయినా ఎవరు చేసినా.

    (మీకెవరికీ అనుభవం లేదేమో కానీ అడక్కుండా రోడ్డు మీద, పెద్ద పెద్ద మాళ్ళలోనూ మతమార్పిడికి సంబంధించి / ప్రచారం చెయ్యడానికి నా వద్దకు వచ్చారు జనాలు. అలాంటివి ఎందుకు జరగాలి ?)

    రిప్లయితొలగించండి
  37. It is nice to see that the discussion is still going at an even keel and observe different points of view. I do not follow any religion and live abroad. So, I cannot contribute more to the discussion but will be reading the comments with interest.

    రిప్లయితొలగించండి
  38. చదువరికే నా ఓటు.నా బ్లాగులో రిలేటెడ్ టపా రాసా - ఓలుక్కు లుక్కండి.

    రిప్లయితొలగించండి
  39. క్రిష్టియన్లు సేవ చేస్తున్నారు సరే. వాళ్ళు కేవలం సేవ మాత్రమే చేస్తుంటె, అలాంటివాళ్ళకు నావంతు సహకారం అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. కానీ మధ్యలో మతమెందుకు మారమనడం. పోనీ, ఇలా మతమార్పిడులు చేయడం వలన వాళ్ళ కొచ్చే లాభమేంటొ ఎవరైనా చెప్పగలరా?

    రిప్లయితొలగించండి
  40. @భైరవభట్ల కామేశ్వర రావు:మీరు అడిగిన ప్రశ్నలు అవును/ కాదు అని simplistic గా తెల్చేసేవి కావు.

    1.ప్రలోభాలు లేనిదెక్కడ? గుండుగీయించుకుంటామని మొక్కుకుని, దేవుడ్ని వరాలకోసం కాకాపట్టడం ప్రలోభం కాదంటారా! పుణ్యమొస్తుందని పూజలూ,వ్రతాలూ చెయ్యడం ప్రలోభం కాదంటారా!! ఏదోఒక రూపంలో డబ్బులు కోరకుండానే మనం హుండీలో కాసులేసుస్తున్నామా!!!

    కొందరు డబ్బుకోసం,కొన్ని లాభాలకోసం మతం మారుతున్నమాట వాస్తవం. అది వారి అవసరపూర్తికేగాని ఆదర్శస్థాపనకు కాదు. అందుకే వార్ని వారిమానాన వదిలెయ్యండి అంటున్నాను. ఇక క్రైస్తవుల మౌళిక బాధ్యతల్లో మతమార్పిడి ఒకటి. అదివారి ధర్మంగనక వారు చెస్తున్నారు. తమ అవసరాలు తీర్చుకోవడానికి ‘కొందరు’ దాన్ని అంగీకరిస్తున్నారు. ఇక్కడ అలా చేస్తున్నది కొందరేగానీ ‘అందరూ కాదు’ అని గమనించగలరు.

    ఏది ఎమైనా ఇది వ్యక్తిస్వతంత్ర్యానికి సంబంధించిన ప్రశ్న. రాజకీయ అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని హిందూమత సమస్యగా చేసెయ్యడాన్ని నేను అంగికరించలేను.

    2&3 ఎలాంటి మతమార్పిడైనా ఎందుకు ఆపాలి? ఎవరు ఆపాలి?ప్రభుత్వాలు ఏంచెయ్యాలి?

    మతం ఇచ్చేవాడికి, పుచ్చుకునేవాడికీ అంగీకారంతో ఇది జరుగుతున్నప్పుడు. అది చట్టవ్యతిరేకం కానప్పుడు. దేశ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకుని ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు ఎందుకు ఆపాలి?

    ఒక వేళ ఆపాలనుకున్నా, ఈ VHP,RSS,బజరంగ్ దళ్ ఎవరండీ ఆపనిచెయ్యటానికి? ఇప్పటివరకూ 5 BJP పాలిత రాష్ట్రాలలో బలవంతపు మతమార్పిడికి సంబంధించి preventive చట్టాలున్నాయి. వీటి ఆధారంగా ఎంతమందిని అరెస్టు చెసారో చెప్పండి.నాకు తెలిసీ ఒక్కటికూడా కోర్టులో నిలబడి శిక్షపడిన దాఖలాలు లేవు. బహుశా అరెస్టులూ నగణమే!అలాంటప్పుడు "బలవంతపు మతమార్పిడులూ" అంటూ ఒక psycho frenzy సృష్టిస్తున్నారేతప్ప నిజాలు వాళ్ళకూ తెలుసు.

    4.మతమార్పిడులు చెసేవాళ్ళేంఖర్మ వెఅతక్కపొయినా హిందూమతంలో వేళ్ళూనుకుపోయిన చాదస్తాలు ఎత్తిచూపడానికి కోకొల్లలున్నాయి. అయినా,అవమానం జరక్కుండా మతంలోని తప్పొప్పుల్ని ఎత్తిచూపడానికి మనకు భావస్వతంత్ర్యం ఉండనే ఉందికదా! మీకు క్రైస్తవుల ఎత్తిపొడుపులు అవమానకరంగా అనిపిస్తే, వెంఠన ఒక పోలీస్ కేస్ పడేయ్యండి. వారు కోర్టుకేసుతో లాక్కోలేకా పోక్కోలేకా ఛస్తారు. ఆ మాత్రానికే దాడిచేసి ఆస్తినష్టం, మానభంగాలూ,హత్యలూ చెసేస్తారటండీ?

    5.మా కాలేజీలో క్రైస్తవకూటమికెళ్ళి వారిఛాంధస భావాల్ని ఏకిపెట్టిన చరిత్రుంది నాకు. కాబట్టి ప్రతి మతం scrutiny,questioning కు అర్హమైనదిగా నేను భావిస్తాను. స్వవిషయం పక్కనబెడీతే,తప్పుబట్టడాన్ని హేళన చెయడాన్నీ ఒకేగాటనకట్టారు మీరు. అదే ఇక్కడ సమస్య. సాధికారికంగా సహేతుకమైన ప్రశ్నలు అడగటం అంగీకారాత్మకమైతే,మిడిమిడి జ్ఞానంతో లేక prejudice తో ఎద్దేవాచెయ్యడం విభేధించదగిన పంధా. అది ఎవరు ఎవర్ని చేసినా నేను అంగీకరించను. క్రైస్తవులందరు ఇలా చేసే మతంమారుస్తారన్నది మీ అనుకోలైతే దాన్నికూడా అంగికరించను.

    రిప్లయితొలగించండి
  41. మహేష్ గారు,
    మీరు మళ్ళీ మీ పంథాలో మీ ఆలోచనలని వెళ్ళగక్కారే కాని నా ప్రశ్నలకి సూటిగా సమాధానాలు చెప్పలేదు, చెప్పలేరని కూడా తేల్చేసారు. సంతోషం!
    అయితే అలా సూటిగా సమాధానాలు చెప్పలేకపోవడం మీ పరిమితి.
    నా ప్రశ్నలు "అవును/ కాదు అని సింప్లిస్తిచ్ గా తెల్చేసేవి కావు" అని generalize చెయ్యడం భావ్యం కాదు.

    రిప్లయితొలగించండి
  42. కత్తి మహేష్ కుమార్ గారు, మీకు ఎందువలన ఎదుటివల్లది మిడిమిడి జ్ఞానం అనిపిస్తుందో అర్థం కావడం లేదు. మీరు మహా జ్ఞాని అనుకోవడంలో తప్పు లేదు గాని, ఇతరులకు జ్ఞానం లేదు అంటే ఎలాగండి ?
    మీకు హిందూ మతంలో ఉన్నా ఆచారాలూ పద్ధతులు చాదస్తాలు అని అనిపిస్తే అలాగే బుర్రలో ఉంచుకోవడానికి బదులు ముందుగా అటువంటి ఆచారాలు ఎందుకు వచ్చాయో పెద్ద వాళ్ళని అడిగి తెలుసుకోండి.
    ఈ కామెంట్ నేను భైరవభట్ల గారికి మీరిచ్చిన సమాధానాన్ని చూసి చేస్తున్నాను.
    ఇక పోతే, మీ బ్లాగ్లో పోస్ట్ చెయ్యబడ్డ టపాకి అక్కడి వ్యాఖ్య రాస్తాను (తెలుగులో రాయడం ఇప్పుడే మొదలు పెట్టాను ... బ్లాగర్లో ID కూడా తీసుకోవాలి).

    - Shiv.

    రిప్లయితొలగించండి
  43. @భైరవభట్ల కామేశ్వర రావు:
    1.అవును
    2.కాదు
    3.అవును
    4.కాదు
    5.కాదు
    ఇప్పుడు నేనిచ్చిన సమాధానాలను మీప్రశ్నలతొ పోల్చిచూసుకోండి. అప్పుడుగానీ ఇవంత సూటైనవి simple గా చెప్పగలిగేవీ కాదని అర్థమవుతుందేమో!
    ఆ తరువాతే నేను "వెళ్ళగక్కిన" ఆలోచనల్ని చదవండి.



    @శివ: ఒక పదం మీకు అనుకూలంగా కనబడగానే దాని ఆధారంగా ఎక్కెయ్యడమే!కనీసం ఆ తరువాత పదం చూడండి.దాని context చూడండి.పూర్తి వాక్యాల్ని చదవండి.

    నేను చెప్పింది సాధారణంగా జరిగే situation గురించి,ఇక్కడ ఎవరిదీ వ్యక్తిగతంగా మిడిమిడి జ్ఞానం అనలేదు. కనీసం సహేతుకమైన ప్రశ్నలు అడగాలి,మిడిమిడి జ్ఞానంతో ఎద్దేవా చెయ్యడం కాదని మాత్రమే చెప్పడం జరుగింది.

    ఇక నేను మహాజ్ఞానిని కానని తెలుసుకోగలిగినంత జ్ఞానం నాకుంది.Knowing what you don't know is close to knowing everything అనినేను నమ్ముతాను.

    పెద్దవాళ్ళని ఏమీ అడిగి తెలుసుకోకుండా లేక ఈ విషయంపై నాకు లభ్యంలో ఉన్న పుస్తకాల్ని/పత్రికల్ని చదవకుండా నేను నా అభిప్రాయాల్ని తెలియజెప్పగలగుతున్నాననే మీ అపోహకు జోహార్లు.

    రిప్లయితొలగించండి
  44. @మహేష్ - మర్చిపోయి మూడో ప్రశ్నకు అవును అన్నట్టున్నారు. ప్రభుత్వానికి ఆపే బాధ్యత లేదనికదా మీ వాదన?

    రిప్లయితొలగించండి
  45. @చివుకుల కృష్ణమోహన్‌: "బలవంతంగా" మతమార్పిడి జరిగితే ప్రభుత్వానికి చ..ట్ట..ప..రం..గా ఆపే బాధ్యత ఉంది. దానికి నేను వ్యతిరేకిని కాను.కాకపోతే ఇప్పటివరకూ అలాంటిచట్టాలున్న 5 రాష్ట్రాలలో ఒక్కటకూడా బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నట్లుగా నిరూపించలేకపొయాయి.

    ఎవరు ప్రభుత్వాలు? BJPనా! RSS!!,VHP!!!బజరంగ దళ్!!!

    రాజ్యాంగం స్ఫూర్తిని అనుసరించి చట్టప్రకారం చెయ్యాల్సిన విషయాల్ని హిందూ జాతీయవాదం పేరిట మరొ ఉన్మాదాన్ని/జిహాద్ ని జరపడం నాకు ఆమోదంకాదు. కొంత మంచి పిచ్చి హిందువులు, మతాన్ని రక్షించే ముసుగులో దారుణాల్ని జరపడం నేను నిరసిస్తాను. హిందూమతమేదో పెద్ద ప్రమాదముందని భయపెట్టి,ఇతర మతాలవారిని ఊచకోతకోసి, హిందుత్వాన్ని కాపాడాలనుకునే ఉన్మాదాన్ని నేను గర్హిస్తాను.

    రిప్లయితొలగించండి
  46. @మహేష్ - మీరు చాలా ఆవేశంలో ఉన్నట్టున్నారు. నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేనిక్కడ ఏవిధమైన స్టాండూ తీసుకోలేదు.
    1. బలవంతం మతమార్పిళ్ళు జరుగుతున్నాయా - అవును.
    2. వీటిని ఆపాలా - కాదు.
    3. ప్రభుత్వం ఆపాలా - అవును.
    రెండు - మూడు ప్రశ్నలకి మీ సమాధానాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియటం లేదు. అంటే - ఆపాలా అన్నదానికి అవును అంటే - ఎవరాపాలి, ఎలా ఆపాలి అన్న ప్రశ్నలొస్తాయి. అసలు ఆపక్కరలేదంటూ, మళ్ళీ ప్రభుత్వం ఆపాలనడం - ఏమిటో నాకర్థంకావడం లేదు.

    రిప్లయితొలగించండి
  47. చర్చ చాలా సీరియస్ గా జరుగుతూ అర్ధంతరంగా ఆగింది అనిపిస్తోంది. మంచి మంచి పాయింట్స్ నోట్ చేసుకొంటున్నానిక్కడ. కంటిన్యూ చేయండి..

    రిప్లయితొలగించండి
  48. @చివుకుల కృష్ణమోహన్‌: నేను చెప్పిన సమాధానాల్లోకాదు,అడిగిన ప్రశ్నల్లో ఆ vagueness ఉంది. పైగా కేవలం "అవును-కాదు" లో సమాధానం ఇవ్వాలన్నది షరతు. నేను విస్తృతంగా సమాధానమిస్తే, నాది సమాధానమే కాదన్నట్లు ఎత్తిపొడుపొకటి. అందుకే ఆ రెండుపదాల్తోనే సమాధానమిచ్చాను. అడిగారు కాబట్టి మళ్ళీ చెప్పక తప్పడం లేదు.

    1. చదువరిగారు చెప్పినట్టుగా ప్రలోభాలు, డబ్బులు వంటి వాటితో మతమార్పిడులు జరుగుతున్నాయని మీరు అంగీకరిస్తున్నారా?: "అవును" ప్రలోభాలూ డబ్బుకోసం కొందరు మతం మార్చుకుంటున్నారు.ఇక్కడా వ్యక్తిగతంగా మారుతున్నారేగానీ మతంమార్పిడి బలవంతంగా చెయ్యబడటం లేదు.

    2. అలాటి మతమార్పిడులని (ఇందులో "బలవంతం" అంటూ ఏవి లేదు) ఆపవలసిన అవసరం ఉందా?: "కాదు" అవి బలవంతంకాదు కాబట్టి చట్ట వ్యతిరేకం కాదు.

    3. ఈ ఆపే బాధ్యత ప్రభుత్వమ్మీద ఉన్నదా? "అవును" ఇకవేళ చట్టవ్యతిరేకంగా జరిగితే, ఆపే అధికారం ప్రభుత్వానికి ఉంది.VHP and party లాంటివారికి లేవు.కావాలంటే ప్రభుత్వం కొత్తచట్టం తెచ్చిమరీ బలవంతాన్ని,allurement-ప్రలోభాలకింద క్రిందమార్చి మరీ ఆపోచ్చు.

    రిప్లయితొలగించండి
  49. అబ్రకదబ్ర: క్రైస్తవులు కూడా "కాదు హిందువులుమే"నని చెప్పుకునే పరిస్థితిలోనే ఇలాంటి పెరుగుదల కనబడిందంటే, వాస్తవంగా ఇంకా ఎక్కువ ఉండి ఉండాలి.

    పోతే హిందూ ఆచారాలు: తాగే సంగతి నాకు తెలీదు గానీ, గోమూత్రాన్ని హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. గృహప్రవేశం నాడు ఆవును ఇంట్లో తిప్పుతారు. గోమూత్రంతో ఇంటిని పునీతం చేస్తారు. వీటిని మూడాచారాలంటారా? ఈ ఆచారాల విషయమ్మీద నాకు కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలున్నాయి. అయితే అది ప్రస్తుత మన చర్చ పరిధిలోది కాదు కాబట్టి వదిలేద్దాం. మీ వ్యాఖ్యల వలన నేను నొచ్చుకున్నదేమీ లేదు. నా వ్యాఖ్యలు మిమ్మల్ని నొప్పిస్తే మన్నింపు కోరుతాను. .

    మహేష్: "బ్రిటిష్ వాళ్ళు రాజకీయంగా,ఆర్థికంగా, పరిపాలనాపరంగా చేసిందాన్ని, వాళ్ళ మతానికి అంటగట్టడం అంత సబబు కాదనుకుంటాను." - మీరు చేసిన ఈ వ్యాఖ్య చదివాక నేను చదివిన ఓ సంగతి గుర్తుకొచ్చింది.. తమ సేనలు కంధమాల్ జిల్లాలోకి అడుగు పెట్టలేని సందర్భంలో ముందుగా అక్కడికి క్రైస్తవ మత ప్రచారకులను పంపిందట, బ్రిటిషు ప్రభుత్వం! భారతంపై పట్టు సాధించే క్రమంలో బ్రిటిషు ప్రభుత్వానికి దాని సైన్యం లాగానే, వారి ఆయుధాల లాగానే, వారి విభజించు, పాలించు నీతి లాగానే... క్రైస్తవ మిషనరీలు ఒక ప్రధాన అయుధం, పరికరంగా ఉపయోగపడ్డాయి! ఔనన్నా, కాదన్నా ఇది సత్యం!

    రిప్లయితొలగించండి
  50. వాదప్రతివాదాలతో సాగుతున్న ఈ Threadలోకి ఎక్కడ దూరాలో తెలీక, నా అభిప్రాయాలు టపాగా రాసాను. చదివి మీ అభిప్రాయాలు తెలపండి.

    http://chaitanyapaturu.blogspot.com/2008/10/blog-post.html

    రిప్లయితొలగించండి
  51. కత్తి మహేష్ కుమార్ గారు, నా ఈ మిడిమిడి జ్ఞానానికి సంబంధించిన వ్యాఖ్య మాత్రం ఈ టపాకి పరిమితమైనది కాదు ... మీ బ్లాగు, మీ బ్లాగులో వ్యాఖ్యానించే వార్కి మీరిచ్చే సమాధానాలు, ఇతర బ్లాగులలో మీ వ్యాఖ్యలు చూసి ఇక తట్టుకోలేక ఉపయోగించిన వాక్యం. మీకు ఏ విధంగా పుస్తకాలూ చదవడం, పెద్దల అభిప్రాయాలూ తెలుసుకొని జ్ఞానాన్ని పెంచుకోవడం అలవాటో, అలాంటి అలవాటే ఇతరులకు ఉంటుందని అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఇలా జరగడం వల్ల వారికి ఏర్పడే అభిప్రాయాలని pre-concieved లేక prejudiced అంటేనే బాధ కలిగేది. నా అభిప్రాయాలూ మీకు prejudiced అయితే మీ అభిప్రాయాలు నాకు prejudiced అనిపించడంలో తప్పు లేదు కదా.

    ఇకపోతే, మీ knowledge sources గురించి : మీరు ఎప్పుడైతే RSS ని VHP ని ఒక గాటన కట్టారో, అప్పుడే మీ knowledge sources మీద నాకు అనుమానం కలిగింది. ఈ విషయమై మీరు మీ ప్రొఫెసర్ జేమ్స్ బాండ్ రఘునాథ్ గారిని మళ్లీ ఒకసారి కలిస్తే బాగుంటుంది (నేను out of context లో మాట్లాడడం లేదు అని justify చేసుకోవడానికి మాత్రమే రఘునాథ్ గారిని ఇందులోకి లాగడం జరిగింది). పెద్ద వాళ్ళంటే మా తాత గారు, మీ తాత గారు కాదండి. మీకు హిందూ ఆచారాల మీద ఏమైనా ప్రశ్నలు ఉంటే మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి లాంటి పండితుల దగ్గర నివృత్తి చేసుకోండి. నా knowledge sources అలాంటి వారే.

    ఇకపోతే, క్రైస్తవులకి సూది మొన గుచ్చుకున్నా తీవ్ర సంతాపం ప్రకటించడానికి హిందువులకి Nicholas Sarkozy లు, George Bush లు, Pope Benedict లు, డాలర్లకి డాలర్లు ఖర్చు పెట్టడానికి క్రైస్తవ మిస్సోనరీలు లేరు కాబట్టే ప్రవీణ్ తొగాడియా లాంటి వాళ్ళు ఆ బాధ్యతని భుజాన వేసుకున్నారు. అంతకన్నా మంచి వారు ఎవరన్నా ఉంటే చెప్పండి, అందరం వాళ్ళని అనుసరిద్దాం.

    ఒక పదాన్ని పట్టుకొని మీదకి ఎక్కడం అనే వాక్యాన్ని మీరు వాడడం వలన మళ్ళీ వ్యాఖ్యానించ వలసి వస్తోంది. మీలాగా, ఒక బ్లాగ్ పోస్ట్ లో ఒక వాక్యం ఉపయోగించి, తరువాత ఎవరన్నా దాన్ని విమర్శిస్తే, అది నాది కాదు Romilla Thapar గారిది అని నేను చెప్పలేను.

    చదువరి గారు, చర్చ పక్క దారి పట్టింది. అది నా వల్ల అని మీరు అనుకుంటే క్షంతవ్యుడను.

    వీవెన్ గారు, తెలుగు typewriter layout లో english keyboard మీద టైపు చెయ్యగలిగే software ఉంటే చెప్పి పుణ్యం కట్టుకోండి బాబూ ...

    - Shiv.

    రిప్లయితొలగించండి
  52. మీరు ఒక్కటి వినేఉంటారు.అదేమిటంటే ముస్లింపెద్దలు తమ మతం వారు తరతరాలుగా వెనుకబడిఉండడం వలనే తిరుగుబాటుచేస్తున్నారని అందుకే వారిబాధను అర్థం చేసుకోవాలని అంటారు.కాని ఈ సమరంలో అందరూ సమిధలు అవుతూనేఉన్నారు.అందరూ ఒక్కటి గమనించేఉంటారు.హిందువులలో 1990ల వరకూ చెప్పుకోదగ్గ స్థాయిలో తిరుగుబాటు లేదు.ఎంతగా కడుపు మండుతూంటే ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నారు?ఇది ఎవరూ అర్థం చేసుకోరు.మానభంగాలు మొదలగునవి హిందూమతం కాదు.ఇలాంటివి ఎవరు చేసినా నిర్దయగా అరబ్ దేశాలలోలా శిక్షించాలి.కొందరు వ్యాఖ్యానించారు ఇతర దేశాలలో గుళ్ళూ,గోపురాలు కట్టిస్తున్నారని.కాని క్రిష్టియన్ దేశాలలో ఉన్న చర్చులకు పోటీగా,కొన్ని దేశాలలో కంటే ఎక్కువగానే చర్చులు,అలాగే మసీదులు భారత్ లో ఉన్నాయి.పై టపాకు వ్యాఖ్యానించినవారిలో కొందరు మతమార్పిడి చెందిన క్రిష్టియనులు ఉన్నారు.స్పష్టం గా అర్థం అవుతోంది.అసలైన క్రిష్టియనులు మార్పిడి చెందిన క్రిష్టియనుల కన్నా ఎంతో ఉత్తములు.ఇలాంటివారి సూడో లౌకికవాదులు.అంతెందుకు ప్రస్తుతం క్రిష్టియనులపై దాడికి మూలకారణమైన లక్ష్మనానందస్వామి,అతని 8 మంది అనుచరుల హత్యను అసలు ఎవరూ ఖండించ లేదు కూడా.కొందరికి హిందువులు అని చెప్పుకోవడానికి అవమానమనిపిస్తోందట.సిగ్గులేదు ఇలాంటివారికి ఇలా చెప్పడానికి.యూదులను తమ స్వంత దేశమునుండి తరిమికొట్టినప్పుడు అక్కున చేర్చుకొన్నది భారతదేశము.ఇలానే అన్ని మతాలవారినీ బేషరతుగా అక్కున చేర్చుకొని పీకలమీదికి తెచ్చుకొన్నది భారతదేశం.శతాబ్దాలుగా లేని తిరుగుబాటు ఇప్పుడు హిందువులలో ఎందుకు వస్తోంది అన్నది ఎందరు అర్థం చేసుకుంటున్నారు?సునామీని భగవంతుడు క్రైస్తవులకు తమ మతాన్ని వ్యాప్తి చేసుకోవడానికి ఇచ్చిన అవకాశంగా వర్ణించిన మిషనరీల ప్రలాపం ఎంతమందికి తెలుసు?రామకృష్ణమఠం లాంటి వారు బేషరతుగా ఇలాంటి బాధితులను ఆదుకునేందుకు కృషి చేస్తుంటే మతం మారితే కానీ నీళ్ళు ఇవ్వము అని చివరికి పడవ ఎక్కించుకోమనే మిషనరీలను ఏమనాలి?
    చదువరిగారూ మీరు చెప్పినదే సరైనది.ప్రస్తుతం మతమార్పిడిని నిరోధించడమే శ్రేయస్కరము.కాని కొందరన్నారు మతమార్పిడిని కాదు మతాన్ని నిషేదించాలని.ఇలాంటివారు ఖచ్చితముగా మతప్రచారకులే.
    ఎవరోకొందరు మతం మార్చుకున్నంత మాత్రాన హిందువులకు వచ్చే నష్టం ఏమీలేదు.కాకపోతే వారందరూ హిందూమతానికి శత్రువులుగా తయారవుతుండడమే నష్టం.

    రిప్లయితొలగించండి
  53. @శివ్: మీనిరసన అర్థమయ్యింది.నా అభిప్రాయాల్ని ఖండించడాన్ని నేనెప్పుడూ స్వాగతిస్తాను.నా అజ్ఞానాన్ని ఒప్పుకోవడానికి నేను సిద్దమే. మధ్యలో మీరు తీసుకొచ్చిన ప్రస్తావనలతో నేను బాధపడలేదుగానీ, మీ అక్కసువెళ్ళబుచ్చే శైలిని చూసి నవ్వుకుంటున్నాను. మళ్ళీమళ్ళీ మీరు ఎదురుపడాలని కోరుకుంటూ..మహేష్

    రిప్లయితొలగించండి
  54. I agree with chaduvari here. Why are these ppl so much interested in converting our country men into their religion? There must be some ulterior motive, right? otherwise why should they spend money for that.

    If a religion / faith is good enough then why to give incentives to adopt it?

    ~suryudu

    రిప్లయితొలగించండి
  55. శివ్, మీకు అభినందనలు. ప్రతిదానికీ అడ్డగోలు వాదన చేసే కొందరు కుహనా మేధావులకి మీరు బాగా గడ్డి పెట్టారు. నిన్న పర్ణశాల బ్లాగులో మీ వాదనలు చూశాం. అద్భుతం. మీ కామెంటుకి రెస్పాన్సుగా మహేష్ RSS గురించీ, PTI గురించీ, హవాలా గురించీ పిచ్చి వాగుడు వాగాడు. దానికి మీరు చెప్పిన సమాధానాలు చూసి అందరికీ పెద్ద పెద్ద ఉపన్యాసాలిచ్చి, మేధావి కబుర్లు చెప్పే మహేష్ కి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. మళ్ళీ నోరెత్తకుండా సైలెంటుగా తన కామెంటూ, మీ కామెంటూ డిలీట్ చేశాడు. మిమ్మల్ని అభినందిస్తూ రాసిన నా కామెంటు కూడా డిలీట్ చేశాడు. చర్చలో చాలా ముఖ్యమైన ఈ కామెంట్లు ఎందుకు డిలీట్ చేశావు, నీ అజ్ఞానం బయటపడిందనా అని అడిగితే అలా అడిగిన కామెంట్లు కూడా డిలీట్ చేశాడు. ఇప్పుడు కామెంటు మోడరేషన్ కూడా పెట్టుకున్నాడు. అందరికీ జోస్యం చెప్పే బల్లి కుడితిలో పడిందంటే ఇదే మరి.

    మహేషూ, నీకు దమ్ముంటే డిలీట్ చేసిన కామెంట్లు మళ్ళీ పెట్టి నీ వాదన కొనసాగించు.

    రిప్లయితొలగించండి
  56. చిట్టచివరి అజ్ఞాత వ్యక్తికి: మీ వ్యాఖ్య, సమంజసంగా లేదు. ఇప్పటి వరకూ ఇదొక ఆరోగ్యకరమైన చర్చగానే ఉంది -ఇక్కడా, మహేష్ బ్లాగులోనూ! దీన్నలాగే ఉండనిద్దాం.

    రిప్లయితొలగించండి
  57. Mahesh said, తమ మతంవారిమీదే హిందూ మతం చెసిన/చేస్తూవచ్చిన/చేస్తున్న తీవ్రమైన హింసముందు..ఈ రక్తపాత రహిత హింస పెద్ద లెఖ్ఖలోకి రాదేమో!

    అయ్యా మహేష్ గారు,

    మరి క్రిష్టియన్లు ఎప్పుడూ వారి మతం లో తక్కువ జాతి వారిపై తీవ్రమైన హింసేమీ చెయ్యనట్లు చెప్పారే! నల్లజాతి వారిపై జరిగిన దాడులు తెలియవా? మనలో ఒక వివక్ష, వారిలో మరొక రకమైన!

    రిప్లయితొలగించండి
  58. 1971 సెన్సస్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో 4.6% ఉన్న క్రైస్తవ జనాభా 2001 లో 1.6% కి పడిపోయింది. ఇది పెరగటం అంటారా?

    దిలీప్ గారు, ఇక్కడే మనం తప్పుదోవ పడుతున్నాం.. అబ్రకదబ్ర గారు చెప్పినవి క్రిస్టియన్ల లెక్కలు. కాని మన దేశం లో మతం మార్చుకున్న కూడా వారు దళితులైతే హిందూ-మాల గానే పరిగణింపబడతారు. మిగతా కులాలైతే అదే కులానికి చెందిన వారిగానే కొనసాగుతారు. మనం చూడవలసింది practisioning christians/converted christians ని.

    రిప్లయితొలగించండి
  59. Mahesh said,
    "ఇప్పటివరకూ 5 BJP పాలిత రాష్ట్రాలలో బలవంతపు మతమార్పిడికి సంబంధించి preventive చట్టాలున్నాయి. వీటి ఆధారంగా ఎంతమందిని అరెస్టు చెసారో చెప్పండి.నాకు తెలిసీ ఒక్కటికూడా కోర్టులో నిలబడి శిక్షపడిన దాఖలాలు లేవు. బహుశా అరెస్టులూ నగణమే!అలాంటప్పుడు "బలవంతపు మతమార్పిడులూ" అంటూ ఒక psycho frenzy సృష్టిస్తున్నారేతప్ప నిజాలు వాళ్ళకూ తెలుసు."

    మరి గుజరాత్ అల్లర్లలో ఎంత నిరూపించగలిగారు? మీరు పుస్తకాలు, ఆర్టికల్స్ ఆధారంగా చూపితే అలాంటివి కోకొల్లలు గా చూపించగలను. మీకు కూడా తెలుసు కాని బయటకి చెప్పలేరేమో.. Lets believe and act to the conscience.

    అబ్రకదబ్ర గారు చాల ఉదాహరణలు ఇచ్చారు, కాని 57 మందిని సజీవదహనం చేసిన సంగతి మరిచారు!!

    మరి గుజరాత్ అల్లర్లలో ఎంత నిరూపించగలిగారు? మీరు పుస్తకాలు, ఆర్టికల్స్ ఆధారంగా చూపితే అలాంటివి కోకొల్లలు గా చూపించగలను. మీకు కూడా తెలుసు కాని బయటకి చెప్పలేరేమో.. అబ్రకదబ్ర గారు చాల ఉదాహరణలు ఇచ్చారు, కాని 57 మందిని సజీవదహనం చేసిన సంగతి మరిచారు!!

    అలానే బాబ్రి ఘటన తర్వాత బంగ్లాదేశ్ లో జరిగిన విషయాలు కూడా ప్రస్తావిస్తే మంచింది. ఇది విదేశంలో విషయాలైనా, వారు అమెరికా, ఇతర పాశ్త్యాత్య దేశాల లోని హిందువుల విషయం ప్రస్తావించారు గాబట్టి!

    రిప్లయితొలగించండి
  60. ayyaa! Mana bangaaram manchidaite,
    christhava matham ane peru bible lo ledu, it is a change in attitude and understanding....
    daya chesi "koda meedi prasangam chadavandi"
    "sermon on the mount" Ninnu vale nee porugu vaanni preminchandi
    god bless india

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు