14, ఏప్రిల్ 2007, శనివారం

అప్పన్న, అప్పన్న, అప్పన్న

అనిల్ చీమలమర్రి గారి నటురె పుటురె చదివాక..
చాన్నాళ్ల తరువాత తిరిగొచ్చిన అనిల్ బాగా నవ్వు తెప్పించారు. అది చదివాక, చిన్నప్పుడు (బహుశా ఆంధ్రప్రభలో అనుకుంటా) నేను చదివిన ఓ జోకు జ్ఞాపకమొచ్చింది.

ఇద్దరు ఆడపిల్లలు. కవల పిల్లలు. మూడేళ్ళిలా వచ్చాయో లేదో బడికి పంపించారు. పాలేరు వెంట హుషారుగా బడికి వెళ్ళారు పిల్లలిద్దరూ.

బళ్ళో మేష్టారు వాళ్ళను ముద్దు చేసి,
"నీ పేరేంటమ్మా" అని అడిగారు
"అప్పన్న"
"ఏదీ మళ్ళీ చెప్పు"
"అప్పన్న"
పేరు నోరు తిరగడం లేనట్లుంది అని అనుకుని రెండో పాపను అడిగారు
"నీ పేరేంటమ్మా?"
"అప్పన్న"
"!"..., "అక్క పేరు కాదమ్మా, నీ పేరు చెప్పు"
"అప్పన్న"
మేష్టారు తెలివిగా "సరే, మీ అక్క పేరు చెప్పు"
"అప్పన్న"
"!!"
ఇలా లాభం లేదని పాలేరును పిలిచి అడిగారు
"ఈ పాప పేరేమిటోయ్?"
"అప్పన్నండి"
"!!!"..., "మరి ఈ పాప పేరు?"
"అప్పన్నండి"
"!!!!"
......
......

"ఏమిటయ్యా ఇద్దరికీ ఒకటే పేరు చెబుతున్నావు, అందునా మగపేరు చెబుతున్నావు, ఇంతకీ నీ పేరేమిటీ?"
"అప్పన్నండి"
!!??!!??!!!

తరువాత తెలిసింది..,
ఆ పాపల పేర్లు - అపర్ణ, అర్పణ, పాలేరు పేరు అప్పన్న అని.
పిల్లలకు నోరు తిరగలేదు. పాలేరుకూ నోరు తిరగలేదు మరి!

2 కామెంట్‌లు:

  1. Hi,
    I liked reading your blog.
    Keep writing.
    I madhya raayaDamlEdeMdukO!
    thanks
    venkat
    www.24fps.co.in

    రిప్లయితొలగించండి
  2. మసీదులో బాంబు వ్యాఖ్యలని తీసుకోవడంలేదు. అందుకే ఇక్కడ వ్రాస్తున్నా.
    చాలా బాగుంది. 'పరిస్థితులని అదుపులోకి తీసుకోవడం' మర్చిపోయారు. నిన్న ఒక వార్త చదివా-పరిస్థితులని అదుపులోకి తీసుకోవడానికి మంత్రులు, పోలీసులు వెళ్ళారని. అంటే ఏమిటో? మీరన్నట్టు క్రిమినల్స్ కి మతం ఏమిటీ? మన రాతలు రాసినవాడే మనకి గతి.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు