4, ఫిబ్రవరి 2007, ఆదివారం

మానవత!

ముక్కు పెరిగిపోయిన బాలుడి గురించి ఈనాడులో చదివి మనసు చివుక్కుమంది. ఆ మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, అన్ని ఖర్చులూ భరించి వైద్యం చేయించడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వపు మానవీయ కోణమిది.

ఈనాడులో ఇస్కాన్ వారి అక్షయపాత్ర కార్యక్రమం గురించి చదివాను. ఎంతో సంతోషం కలిగింది. చాలా ఉదాత్తమైన కార్యక్రమం. ఇస్కాన్ నిర్వహిస్తున్న బృహత్తర యజ్ఞమిది.

రాష్ట్ర ప్రభుత్వానికీ, ఇస్కాన్ కూ అభినందనలు!

5 కామెంట్‌లు:

  1. నిజమే ..ఇస్కాన్ వారి గురించిన వ్యాసం చదివి చాలా ఆనందించాను. ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలంటే ఇస్కాన్ వంటి సంస్థల వల్లనే అవుతుంది.

    రిప్లయితొలగించండి
  2. ఇస్కాన్ వారి దేవాలయాలు ఎంత అందం గా విశాలంగా వుంటాయో వారు చేసే పనులు కూడా అలానే వుంటున్నాయి.కానీ వారు ప్రతీ దేవాలయానికి కోట్లు ఖర్చుపెట్టడం చూస్తుంటే ఒక్కోసారి బాధగా అనిపిస్తూవుంటుంది.

    రిప్లయితొలగించండి
  3. మానవ సేవే మాధవ సేవ అని ఈ బృహుత్కార్యానికి పూనుకున్న ఇస్కాన్ వారు అభినందనీయులు. వారి భక్తి భావము లో కృష్ణ చైతన్యం ఎంతో సామజీకచైతన్యం అంతే. మన రాష్ట్రంలో కుడా సత్యసాయీ బాబా, చిన్నజీయర్ స్వామి వంటి వారు ఇలాంతి సత్కార్యాలకి పూనుకోని ఇతరులకి మార్గదర్శకులు అవ్వాలి.

    రిప్లయితొలగించండి
  4. నాకు స్వామీజీల మీద, ఒక దేవుడిని మాత్రమే ప్రోత్సాహించే వారి మీద పెద్ద నమ్మకం లేక పోయినా వారంటే గౌరవం కలిగేది ఇలాంటి పనుల వల్లే.

    వీరిని ఎంతగానో అభినందించాలి.

    రిప్లయితొలగించండి
  5. ఇది ఉపయోగపడుతుందేమో చదవండి...
    http://krishnadevarayalu.blogspot.com/2007/03/blog-post_03.html

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు