22, జనవరి 2007, సోమవారం

ఆర్టీసీకి కొత్త రంగులు

ఆర్టీసీ బస్సులకు కొత్త రంగులు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారట, ఈనాడులో వార్త వచ్చింది. పల్లెటూళ్ళకు తిరిగే బస్సుల పేరు "పల్లె వెలుగు" - చక్కగుంది, పేరు. ఏసీ బస్సుల పేరు మాత్రం మేఘదూత్! సంస్కృతపదం, అందునా హలంతంగా రాస్తే గొప్పగా ఉంటుందనుకున్నారు కాబోలు. ఎందుకు పెట్టినా ఆ పేరు మాత్రం బాలేదు; మేఘదూత అని ఉండాలి, లేదా మరో అచ్చతెలుగు పేరయినా పెట్టాలని ఈ జీవుడి కోరిక.

కొత్త సౌకర్యాలు ఆర్టీసీకి మరింత ఆదాయాన్ని, లాభాలను తెచ్చిపెట్టాలని, ఆర్టీసీ బస్సు ప్రైవేటు బస్సులను దాటేసి, ఉసీగా ముందుకు దూసుకుపోవాలని ఆశిస్తున్నాను.

1 కామెంట్‌:

  1. భలే వారె! మన రాష్ట్రం లో అర్టీసి బస్సులు రోడ్డ్ల మీద ఎక్కడ తిరుగుతాయాండి? అర్టీసి వారు ముందు చూపు తొనే " మేఘధూత్ " అని పేరు పెట్టారు. ఎందుకంటే " నేటి ' మేఘధూత్ ' లే, రేపటి 'యమధూత ' లు.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు