5, సెప్టెంబర్ 2011, సోమవారం

గాలిని అరెస్టు చేస్తే నాకేంటయా సంబంధం..?

ఎట్టకేలకు గాలి జనార్దనరెడ్డిని అరెస్టు చేసారు సీబీఐ వాళ్ళు. గాలి అరెస్టుపై మీ అభిప్రాయం ఏంటీ అని జగన్నడిగారు విలేఖరులు. ఎంతో చిరాకుపడ్డాడు వాళ్ళ మీద. గాలి అరెస్టైతే జగనుకెందుకంత అసహనం..?

ఎక్కడో కర్ణాటకలో ఎవడో అరెస్టైతే నాకేంటి సంబంధం? నన్నడుగుతారేంటి? పొయ్యి కర్ణాటకలో అడగండి, బీజేపీని అడగండి . పాత్రికేయ విలువలంటూ కొన్ని ఉన్నాయి. వాటిని పాటించండి. నేనూ ఒక పత్రిక నడుపుతున్నవాణ్ణే, ఒక చానెలు నడుపుతున్నవాణ్ణే. ఇలా అడగడం ఎథిక్స్ ఏమాత్రం కాదు. ఇది నడుం కింద కొట్టడమే, దొంగ దెబ్బ వెయ్యడమే.’ అని విరుచుకుపడ్డాడు జగన్.

ఎందుకీ అసహనం? అరెస్టు గురించి స్పందించమని ఇతర పార్టీలకు చెందిన అనేకమంది నాయకులను కూడా విలేఖరులు అడిగారు. వాళ్ళెవరూ ఇలా ఆవేశపడలేదు, తమ అభిప్రాయాలు చెప్పారు. జగను మాత్రం అలా సమాధానం చెప్పలేదు. అడగడమే తప్పన్నట్టుగా అడిగినవాళ్ల మీద తిరగబడ్డాడు. అలా బుజాలు తడుంకోటమెందుకబ్బా..!?

జగన్ ఎథిక్సు గురించి మాట్టాడుతూంటే నవ్వొచ్చింది. తన సొంత పత్రిక సాక్షి రాతల్లో  -రాతల సంగతి తరవాత, అసలు దాని పుట్టుకలోనైనా - ఉన్నాయా ఎథిక్సు? (అసలు, అసలిప్పటి సీబీఐ విచారణ కూడా అందుకేననుకోండి!) లేక, అసలు ఎథిక్సంటేనే అవి అని అనుకుంటున్నాడేమో!
.................
ఇంతకీ గాలిని అరెస్టు చెయ్యడానికి బెంగళూరు ఆఫీసర్లు కాకుండా హై. నుండి సీబీఐ ఆఫీసర్లు వెళ్ళారు. అరెస్టు చేసి హై. కి ఎందుకు తీసుకొచ్చినట్టో తెలవడం లేదు. జగను కేసులను దర్యాప్తు చేస్తున్న జాయింట్ డైరెక్టరే గాలి కోసమూ వెళ్ళాడు ఎంచేతో గాని!
జగను కేసుకూ గాలికీ,
గాలి కేసులకూ జగనుకూ..
దగ్గరి సంబంధాలు ఉన్నాయి కాబోలు!
....................
రాశేరె ఉన్న రోజుల్లో జరిగిన సంగతి.. గనుల్ని దోచేసుకున్న వ్యవహారాన్ని చూసి, అసలుసంగతి ఆరా తీస్తామంటూ మన రాజకీయ నాయకులు అనంతపురం పోయొచ్చారు. అక్కడకు పోయి గాలి అబ్బాయి గారి గాలిమిషను ఎక్కి చక్కర్లు కొట్టొచ్చారు తప్ప, ఏమీ తెలుసుకోలేకపోయారు, ఏమీ తేల్చనూ లేకపోయారు. ఆ ’దూడగడ్డి యాత్ర’ గురించి నేను ఒక టపాలో ప్రస్తావించాను, చూడండి. అసలు దూడగడ్డి యాత్ర అనగా ఏంటో తెలుసుకోవాలంటే వేరే టపా చూడాల్సిందే!

ఇక్కడితో ఈ టపా అయిపోయింది.
======================
ఇది ఉపటపా..
కట్నం కోసం  కోడల్ని చంపేసారు అత్తింటివాళ్ళు. పాపం ఆ అమ్మాయికి పుట్టింటివైపు ఎవరూ లేరు. కేసు పెట్టేందుకు కూడాలేరు. హత్య కదా.. పోలీసులు ఊరుకోలేదు. కేసుపెట్టి, దర్యాప్తు చేసి, భర్త, అత్తమామలను అరెస్టు చేసారు. పోలీసులతో భర్త ఇలా వాదించాడు: ’ఏంటి సార్ ఇది.., మేం చంపామని ఎవరన్నా ఫిర్యాదు చేసారా? పోనీ చచ్చిపోయిన నా పెళ్ళాం (!) వచ్చి చెప్పిందా? నేనూ మా నాన్నా మాకు తోచినదేదో చేసుకున్నాం. మిమ్మల్నేమీ చెయ్యలేదే! ప్రజలనేమీ అనలేదే! మామీద కేసు పెట్టడమేంటి సార్? ఏంటి సార్ ఈ అన్యాయం? ఎవరు ఫిర్యాదు చేసారని ఈ కేసు పెట్టారు సార్? ఎందుకు సార్ మామీదా, జగను మీదా, గాలి జనార్దనరెడ్డి మీదా, టూజీ రాజా మీదా మీకింత కసి? చంద్రబాబు నాయుడు గారి ముత్తాత చచ్చిపోయినపుడు కేసు పెట్టారా?  సోనియా గారి ముత్తవ్వ చచ్చిపోయినపుడు కేసు పెట్టారా? ఇప్పుడు నా భార్య చచ్చిపోతే కేసెందుకు పెట్టారో చెప్పండి. చెప్పండి సార్, ఎందుకీ వివక్ష?’

ఓరి నీ లాజిక్ తగలెయ్య.. పేరేంటయా నీది?
’జగన్మోసన్’ సార్.

గమనిక: దీన్ని సరదాకి రాసానని మీరు అనుకుంటారన్న సంగతి నాకు తెలుసని మీరు భావిస్తున్నట్టు చెబితే వాస్తవం చెప్పినట్టు కాదని మాత్రం అనలేను.

9 కామెంట్‌లు:

 1. " గాలిని బధించి హసించి దాచగ పనిలేదు
  జగనును హింసించి ఓదార్పులు చేయగ పనిలేదూ"

  "గాలికి కులమేదీ...
  ఏదీ అవినీతికి మతమేదీ .. ఈ.. "

  అని చెప్పారు గాని, గాలిని బంధించడంపై తాడేపల్లిగారి స్టేట్మెంట్ ఒక్కటి ఇప్పించండి, చదువరి, ప్లీజ్:P :))

  రిప్లయితొలగించండి
 2. hyd cbi officers enduku arrest chesaru ante aa mines andhra lo unnay kabatti.. case valla paridhiloke vastundi kada....

  రిప్లయితొలగించండి
 3. అసలు కంటె కొసరు ముద్దున్నట్లు, అసల టపా కంటే ఉపటపా చాలా బాగుంది. ఏదో కాలుతున్న వాసన వస్తోంది. ఎవరికబ్బా. ఇంకా ఎవరూ కుంయ్యో మొర్రొ అనలేదు.

  కాముధ

  రిప్లయితొలగించండి
 4. హ హ కాముధ గారు చెప్పినట్లు అసలు కథ కన్నా కొసరు కథ బావుందండి :)))

  రిప్లయితొలగించండి
 5. గమనిక: జగన్ పై CBI ఎంక్వరీ చెయ్యడంలొ చదువరి గారి పాత్ర ఉందని తాడేపల్లి గారు భావిస్తారని చదువరిగారు అనుకుంటారని మని అనుకుంటామని తాడేపల్లి గారు బావిస్తే ఆ పొరపాటు వాస్తవం కాదని నేను అంటాను.

  రిప్లయితొలగించండి
 6. CBI Joint Director laxminarayana is incharge for 3 states, in that Karnataka also included.so they arrested Gali Reddy not because of part of mines are there in AP.

  రిప్లయితొలగించండి
 7. చంచల్ గుడా జైలు లో 'గాలి'.... బాగానే వుంది కాని.. మన ప్రాంతీయవాదులు ఇందుకు వప్పుకుంటారా ? హైదరాబాద్ జైల్లు తెలంగాణా వాళ్ళకే అని కొత్త వుద్యమం మొదలుపెడతారా ?

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు