30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

నా తెలంగాణకే ఎందుకిలా జరుగుతోంది..

తెలంగాణ ఎందుకు ఇవ్వరు అని తల్లడిల్లిపోతున్న ఒక కరుడుగట్టిన తీవ్ర తెవాది మనోగతం! 
 • తెలంగాణ కావాలని మేం అడుగుతూంటే ఎవడూ పట్టించుకోడేంటి? ఎంతో ప్రజాస్వామికమైన మా డిమాండును ప్రపంచమంతా ఎందుకు వ్యతిరేకిస్తోంది? మా డిమాండు లోని సహేతుకత మాకు ఇంత స్పష్టంగా కనబడుతూంటే లోకంలో ఎవ్వడికీ కనబడదేంటి?
 • ఎనకబడిపోయామని గోలపెడితే అది తప్పని నిరూపించారు తప్ప నా తెలంగాణ నాకు ఇవ్వలేదు. అన్యాయం జరిగిందని వాపోతే ఆ శ్రీకృష్ణ కమిటీ వేసి కానేకాదని చెప్పించారు తప్ప నా తెలంగాణ నాకు ఇవ్వలేదు. ఎందుకు మాపై ఇంత కక్ష?
 • శ్రీకృష్ణ గాడు తప్పుడెదవని మేం ముక్తకంఠంతో దిక్కులు పిక్కటిల్లేలా బూతులు తిట్టామే.. ఒక్ఖడంటే ఒక్ఖడైనా ’ఔను, నిజమే’ అని అన్నాడా ఈ లోకంలో? ఒక్కడైనా శ్రీకృష్ణను బూతులు తిట్టాడా? నా తెలంగాణ నాకు ఇచ్చేసారా?
 • ఎన్నేసి బూతులు రాసాం మా కవితల్లో! కనీసం ఒక్కడంటే ఒక్కడైనా "వాహ్" అన్నాడా? మేమేమైనా చాటుమాటుగా, అర్థమయ్యీ కాకుండా తిట్టామా.. నేరుగానే తిట్టామే, అచ్చబూతులే తిట్టామే! అయినా తెలంగాణ ఎందుకివ్వరీ కొడుకులు?
 • ’ఆంద్ర పెట్టుబడిదారుల’ను అమ్మ నాబూతులు తిట్టినా.. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజినా.. వాళ్ళ వ్యాపారాలను మాత్రం చేసుకోనిచ్చామే.. అయినా తెలంగాణ ఇవ్వరేంటి?
 • ’ఆంద్ర నాయకులు’ తెలంగాణ ప్రజల గుండెగోసను ఎందుకు వినరు? తమ ప్రజల మాటను ఎందుకు వింటున్నారు వాళ్ళు? వాళ్ళకేం పోయే కాలం?
 • ’ఆంద్రోళ్ళు’ మా గోడును వినరెందుకు? మా డిమాండుకు మద్దతు ఇవ్వడం లేదెందుకు? అమాయకుడైన  తమ్ముడి గోడును పట్టించుకోరెందుకు ఆ దోపిడీదారులు, కులపిచ్చిగాళ్ళు, ఆ సన్నాసులు, ఆ వలసవాదులు?
 • నా ఇష్టమొచ్చిన విగ్రహాలను నేను పడగొట్టుకుంటాను. వీళ్ళకెందుకు ఏడుపు?  విగ్రహాలను పడగొట్టుకునే స్వేచ్ఛ కూడా తెలంగాణవాడికి లేదా  ఈ సమైక్య రాష్ట్రంలో? ఎందుకు మాకెవ్వడూ మద్దతివ్వలేదు ఈ విషయంలో?
 • ఆంద్రోడు గడసరి అని, తెలంగాణోడు అమాయకుడనీ జవహర్ లాల్ నెహ్రూ కూడా చెప్పాడే.. అయినా మా అమాయకత్వము, ఆంద్రోడి గడసరితనమూ ఒక్క సాలెగాని క్కూడా కనబడదేంటి? 
 • కేంద్రప్రభుత్వం మహత్తరమైన మా ఉద్యమాన్ని ఎందుకు ఉపేక్షిస్తోంది? ఎందుకు దానికి మా ఆకాంక్ష వినబడ్డం లేదు? ఎందుకు నా తెలంగాణ నాకు ఇచ్చెయ్యదు? 
 • తెలుగు మీడియా మాకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వదు? జనం చేత పనులు మానిపించి ఇరవైనాలుగ్గంటలూ ఉద్యమం చేయిస్తున్నామే.. ఈ మీడియా సన్నాసులు ఇరవై మూడు గంటలే మాకు కేటాయిస్తున్నారెందుకు? మిగతా గంటను ఆంద్రోళ్ళకు ఎందుకు తాకట్టు పెట్టారు ఈ తల మాసిన వెధవలు?
 • జాతీయ మీడియా తెలంగాణను పట్టించుకోదెందుకు? ఎందుకు వాళ్ళు ఆంద్ర పెట్టుబడిదార్లకు అమ్ముడుబోయారు? మాకెందుకు అమ్ముడు పోలేదు? మా బ్లాక్ మెయిలుకు ఎందుకు లొంగరు? 
 • ఉద్యమానికి మద్దతు ఇవ్వని ఉద్యోగులను కొట్టడం తప్పా? వాళ్ళను బూతులు తిట్టడం నేరమా? మా చేతుల్లో దెబ్బలు తిన్నవాళ్ళను ఓదార్చడం మాత్రం రైటా? ఏమిటీ పక్షపాతం? ఎందుకురా నా తెలంగాణపై మీ అందరికీ ఈ వివక్ష?
 • కథల సంకలనాల్లో కూడా తెలంగాణ కవులు రచయితలను పట్టించుకోవడం లేదు ఆంద్ర కుట్రదారులు. ఎందుకు వాళ్ళు మాకు బొందపెడుతున్నారు? ఎందుకీ వివక్ష?
 • చివరికి అమెరికావోడు కూడా ఈ ఉద్యమం గురించి వ్యతిరేకంగానే ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఎందుకు తెలంగాణపై అంతర్జాతీయ కుట్ర జరుగుతోంది?
 • ఆకరికి మా సొంత తెలంగాణ బిడ్డలు కూడా మా గోస పట్టించుకోరెందుకు? వాళ్ల చదువులు చెడగొట్టుకోరెందుకు?  పిల్లల చదువులు చెడగొట్టి మరీ ఈ ఉద్యమం చేస్తూంటే, వాళ్ళంతా పోయి ఆంద్రలోను, కర్ణాటకలోను, తమిళనాడులోనూ చేరి చదూకుంటారా.. హన్నా!
 • వికీలీకులు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే ఎందుకున్నై?  మా గోసను వాడెందుకు పట్టించుకోడు? మాకు మద్దతుగా ఏదో ఒకటి లీకు చెయ్యడెందుకు?
 • ప్రపంచంలోనే అద్భుతము, అపురూపము, అపూర్వమూ అయిన మహత్తర ప్రజాస్వామిక ఉద్యమం తెలంగాణలో మాత్రమే జరుగుతూంటే బ్రూనై నుంచి బుర్కినాఫాసో దాకా ఒక్కదేశం నుంచైనా, ఒక్కడైనా, ఒక్కసారంటే ఒక్క సారన్నా ఇక్కడికి వచ్చి చూసిపోయాడా? మా ఇంటర్వ్యూ తీసుకున్నాడా? మమ్మల్ని పిలిచి వాళ్ళ టీవీల్లో చర్చ పెట్టాడా? 
దేవుడా, నా గుండెచప్పుడును ప్రపంచం ఎందుకు వినలేకపోతోంది?
ఎందుకీ లోకమంతా నాకు అన్యాయం చేస్తోంది?
ఎందుకీ కుట్ర?
ఎందుకు?
ఎందుకు??
ఎందుకు దేవుడా..???

33 కామెంట్‌లు:

 1. గదేందిరా భయ్ గట్లంటవ్? ప్రవీణ్ ఫొరగాడు పొద్దుగాల ఈడ కచ్చర్ మీద కలయదిరుగుతూ, కాకిలా అరుస్తూ మద్దదిచ్చిండాడా లేదా? సాపాటు బ్లాగాయన తోక ఊపుకుంటూ మీ అమాయక తెలబాన్ల బ్లాగుల్లో కలియదిరిగి మద్దతిచ్చిండు, మీకు ఎరికలేదా?
  మేమూ మీకు మద్దతిస్తున్నాం, మద్దతుగా సీమాంధ్రను ఇస్తుండాం, ఏలుకోరా భయ్ , నీకన్నా మాకేంగావాలె?

  రిప్లయితొలగించండి
 2. /ఉద్యమానికి మద్దతు ఇవ్వని ఉద్యోగులను కొట్టడం తప్పా? వాళ్ళను బూతులు తిట్టడం నేరమా? మా చేతుల్లో దెబ్బలు తిన్నవాళ్ళను ఓదార్చడం మాత్రం రైటా? /

  ఔ లే, ఎంతమాట!! మంచిగ చెప్పిండవు, పద హైకోర్ట్‌లో సుమోటో మీద బతుకమ్మ ఆడనీకి అనుమతిస్తారేమో మనోడిని కనుక్కో, పోయి ఆడుదాం. నాకాళ్ళు పీకుతున్నయ్. :P

  రిప్లయితొలగించండి
 3. ప్రవీణ్ గారూ! కామెంట్ పెట్టడానికి ఇంకా రాలేదా? త్వరగా వచ్చేయండి ....

  రిప్లయితొలగించండి
 4. /

  076f26a6-eb26-11e0-b0e9-000bcdcb471e చెప్పారు...

  go to hell

  /

  ప్రత్యేకం...ప్రత్యేకం... అని తెగ ఏడుస్తున్నారుగా...మీరందరూ వెళ్ళి అక్కడ "ప్రత్యేకంగా" వుండండి. మేమెవ్వరమూ రాము లేండి.

  రిప్లయితొలగించండి
 5. ఇంకా చాలా ఉన్నై. అయినా తప్పుడు కూతలకు వెతికే కారణాలకు లెక్కుంటదాండి?

  "మా తెలంగాణా వేములవాడ భీమకవిని ఆంద్రోల్ల నన్నయ్య తొక్కేశాడు.మాకు తెలంగాణా గావాలె."

  "మా నేలకొండపల్లె, కొండాపురం ఇత్యాది చోట్లలో బౌద్ధ అవశేషాలు బయటపడినయ్. అవన్నీ కప్పేసి అమరావతిని శాతవాహన రాజధానిగా పుస్తకాలలో రాసిన్రు.

  "మా బతుకమ్మ పండగ ఆంద్రోల్లు జరుపుకోరు."

  "ఆంద్రోల్ల బిరియాణీ పేడ లాగుంటది. మా తెలంగాణా మాగ్గావాలె."

  "పచ్చల్లోడు కోట్లు సంపాదించిండు. మాకు తెలంగాణా కావాలి."

  రిప్లయితొలగించండి
 6. కొందరు చదువుకుంటారు కానీ సంస్కారముండదు, మీలాగే !!
  కొందరికి లెక్కలు వచ్చు గానీ ఎక్కాలు రావు, మీలాగే !!
  కొందరు మనుషులే గానీ మానవత్వముండదు, మీలాగే !!
  కొందరికి జాలి, దయ గురించి తెలుసు గానీ చూపరు, మీలాగే!!
  కొందరు పైకి మంచివాళ్ళలాగా నటిస్తారు, మీలాగే !!
  కొందరు మెత్తగా కనిపిస్తారు గానీ మెతక మనుషులు కాదు, మీలాగే !!
  కొందరు నాయకులే తెలంగాణా వాదుల శత్రువులు, మీలాగే !!
  కొందరికి హృదయమే లేకపోతే గుండెచప్పుడు ఎలా వినిపిస్తుంది, మీలాగే !!
  కొందరు నా ఇంటికి వచ్చి ఎవరూ నా అభిప్రాయం అడగలేదు అని శెలవిచ్చారు, మీలాగే !!
  కొందరు తెలంగాణా వాదులు అమాయకులే కావచ్చు అంధ్రోళ్ళు మాత్రం గడసరులే, మీలాగే !!
  కొందరు మాత్రమే తెలంగాణా వారికి మద్దతిస్తున్నారు అందరూ దెప్పిపొడిచేవారే, మీలాగే !!
  కొందరికి జాతీయ మీడియా పట్టించుకోవటం లేదని అనిపిస్తుంది కానీ అంతర్జాతీయ మీడియా దృష్టి తెలంగాణా వైపు పడబోతున్న సత్యం బోధపడదు, మీలాగే !!
  కొందరికి మంచిగా మాటలతో చెపితే అర్ధం కాదు, మీలాగే !!
  కొందరు పుట్టటానికి పెద్దవాడిగా పుడతారు కానీ బుద్ధులే చిన్నవి, మీలాగే!!
  కొందరు అంధ్రా వాళ్ళే విగ్రహాలను పడగొట్టటం, మసీదులు పడగొట్టటం నేర్పించారు, మీలాగే !!
  కొందరు అమెరికా వాళ్ళకు కూడా తెలంగాణా వైపు న్యాయం ఉందని తెలుసు కానీ బయటికి చెప్పే ధైర్యం లేదు, మీలాగే !!
  కొందరు డబ్బున్న బడా నేతల జాతకాలు బయట పెట్టాడానికే వికీలీకులున్నారు కానీ, కాలే కడుపుల గురించి ఏమి లీకు చేస్తారు, మీలాగే !!
  కొందరు ప్రపంచ మేధావుల దృష్టికి తెలంగాణా ఉద్యమం వెళ్ళబోతుంది, ప్రపంచం లోనే అద్భుతమూ, అపూర్వమూ,అపురూపమూ కాబోతున్న ప్రజాస్వామిక ఉద్యమం గురించి చర్చలూ, ఇంటర్వ్యూలూ చూడబోతున్నారు, మీలాగే !!
  కొందరికి అపుడు దేవుడా ఎంత కుట్రచేసారు ఈ ఆంధ్రా వాళ్ళు, ఈ ఆంధ్రాలో ఎందుకు పుట్టాను తెలంగాణా వాడిలాగా ఎందుకు పుట్టలేదు అనిపిస్తుంది, మీలాగే !!

  రిప్లయితొలగించండి
 7. కొందరు వ్యాఖ్యలు రాస్తారు గానీ అర్థమయ్యి చావవు, మీలాగే!!

  రిప్లయితొలగించండి
 8. కొందరు ఎంతో గొప్పగా చెప్పేశామనుకుంటారు. కానీ అంతా చప్పగా జోకులా పిచ్చిలా ఉంటుంది, పైన కనిపిస్తున్న నీహారిక వెఱ్ఱిమొఱ్ఱి వ్యాఖ్యలా !

  తరతరాల విఫల పోరాటాల గడ్డ తెలంగాణ నుంచి ఈ మాత్రం ఉక్రోషం సహజమే. ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ విఫల పోరాటాల గురించి ఇంటర్వ్యూలూ, పరిశోధనలూ. అట ఆహా ఏమి ఊహ !

  రిప్లయితొలగించండి
 9. 076f26a6-eb26-11e0-b0e9-000bcdcb471e: మీ బుర్రల నిండా మేమే. సర్వకాల సర్వావస్థల్లోనూ మేమే. నిదర్లోనూ మేమే, మెలకువలోనూ మేమే. ఆంటే మేం ప్రస్తుతం ఉంటున్నది నరకంలోనే! అంతకంటే నికృష్టపు నరకం మరోటుండదు. కాబట్టి మీ శాపం ఫలించదు.
  Snkr: :)
  laba laba: ఒకళ్ళొచ్చేసారు చూసారుగా.. ఇక చాల్లెండి. ఇద్దరిని భరించడం మామూలు మనుషుల వల్ల కాదు.
  John: తెవాదుల బుర్రలే నరక కూపాలండి. ఇక మనకు వేరే నరకపు అవసరం ఏముంది?
  రవి: నిజమేనండి. చెప్పుకుంటూ పోతే బోలెడుంటాయి.
  RK: :)
  కుమార్ దత్తా: :)

  రిప్లయితొలగించండి
 10. ఈ పరిస్థితులకు కారణాలు, కారకులను వదిలేసి తప్పంతా తెలంగాన వాళ్ళదే అని వాదించడం బాగోలేదు.

  అధికారం కోసం టి.ఆర్.యస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు, వారిని సమర్దించి ఓట్లేసిన సీమాంధ్ర ప్రజలను అమాయకులు, నిజాయితీపరులు, హింసా వాదులు అన్నట్టు మాట్లాడటం బాగో లేదు.

  ఇప్పటికైనా తెలంగాన సపోర్టర్స్ ని విమర్శించడం మాని నిజం మాట్లాడండి.

  రిప్లయితొలగించండి
 11. /సీమాంధ్ర ప్రజలను అమాయకులు, నిజాయితీపరులు, హింసా వాదులు అన్నట్టు మాట్లాడటం బాగో లేదు/
  బాగుండదు, ఎలా బాగుంటుంది?! తమ అభివృద్ధికి ఎదువాళ్ళు చేయలేదో అని పడి పడి 50ఏళ్ళైనా తమ అభివృద్ధి తాము చేసుకోవాలనే కాని ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసే ముష్టి జనాలకి బాగా అనిపించదు, అదంతే! ఇదేమన్నా ముష్టిలో సింహభాగమా 'మాగ్గావాలె' అని పట్టుకెళ్ళటానికి?! ఇలా పరాన్నజీవులుగా బ్రతకనేర్చినోళ్ళకు రాష్ట్రాం దేనికి? వుందిగా దేశం, మొత్తం మీద దేశం మీద పడి ముష్టెత్తుకోవచ్చుగా! ఓ ప్రాంతానికే ఎందుకు పరిమితం చేసుకోవడం? గుంపులుగా ప్రయాణం చేస్తే ముష్టివాళ్ళకు అదీ వుచితమే, ఈ దేశంలో.
  /ఇప్పటికైనా తెలంగాన సపోర్టర్స్ ని విమర్శించడం మాని నిజం మాట్లాడండి/
  నిజాలే చెబుతున్నారు. మీరు భ్రమసే,కావాలన్న 'నిజం' మాట్లాడకపోతే 'బ్లాగుల్లో తిర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్రగనీయం' అంటారా? :)) మాకు మీకులాగా అవకాశవాదులు 'నూరిపోసిన నిజాలు' అంటూ వుండవు.

  రిప్లయితొలగించండి
 12. @a2....,
  చదువరి తనవరకు, తన బ్లాగు పాఠకులు చాలామంది వరకూ నిజాలే మాట్లాడుతున్నారు,

  ఇవి కాక మీ బుఱ్ఱ కు తోచిన నిజాలు మీ "చిరు" దృష్టిలో ఎమయినా ఉంటే, అవి ఏమిటో చెప్పకూడదూ!!!.

  అసలు పైన టపాలో చదువరి గారు,
  "సీమాంధ్ర ప్రజలను అమాయకులు, నిజాయితీపరులు,గట్రా " ఎక్కడన్నారు? మీకు మీరు ఏదో ఊహించుకొని, ఏదో కామెంట్ పెట్టటం ఎందుకు?
  పైన లబ లబ గారు పిలిచినాయన రాకపోతే, ఆయన రాని లోటు తీర్చటానికి ఆ కామెంట్ పెట్టానంటారా, అర్ధం చేసుకోగలను :)

  రిప్లయితొలగించండి
 13. a2zdreams: పరిస్థితులు, కారణాల గురించి కాదు నేను మాట్టాడుతోంది. వాటి గురించి రాయడం ఐపోయింది. వాళ్ళు చెప్పే కారణాలు తప్పుడువనీ, అబద్ధాలనీ, వాళ్ళు సృష్టించినవనీ శ్రీకృష్ణ కమిటీ దగ్గర్నుండి, బ్లాగరుల దాకా గణాంకాలతో సహా తేల్చి చెప్పేసారు. అన్నీ తేలిపోయాయి కాబట్టే మాటలు మార్చీ, మార్చీ చివరాకరికి ’మా తెలంగాన, మాగ్గావాలె’ అనే కాడకొచ్చారు. వాళ్ళ బతుకులు బైట పెట్టిందనే కదా శ్రీకృష్ణ కమిటీ సభ్యుల్ని అమ్మనాబూతులు కూసారు! అది కాదిక్కడి విషయం.. ఇక్కడ సీమాంధ్ర ప్రజల ప్రస్తావన అనవసరం. నేను వాళ్ళ గురించి రాయలేదు. నేను రాసింది తెవాద నాయకుల అతి తెలివి గురించి. ప్రపంచమంతా తమను వ్యతిరేకిస్తోంది అంటూ నోరేసుకు పడటం తప్ప, తమ తప్పులేంటో ఎరగని గురివిందగింజలు వాళ్ళు. వాళ్ళ గురించి నేనిక్కడ రాసాను. గమనించండి. పోతే..

  తెవాదులు కోస్తా సీమల ప్రజలను తిట్టిన తిట్లతో పోలిస్తే నేను అంటున్నవి నత్...త్థింగ్! మీరు ఆ తిట్లు పట్టించుకోకుండా నేను అన్నవి మాత్రమే ఎందుకు పట్టించుకుంటున్నారో తెలవడం లేదు. వాళ్ళు మమ్మల్ని (మనల్ని) అన్న మాటలు మీకు కనబడలేదా, వినబడలేదా? తెలంగాణ కవులు (అనగా.. అనాగరికులు) కూసిన బూతు కూతలు మీరు చదివారా? గొడ్డకాడ బుడ్డాళ్ళు కూడా ఎదటోణ్ణి అలా తిట్టరు. వాటిని చదివి కూడా ’నన్ను కాదులే’ అని దులపరించుకు పోతున్నారా? లేక, ’నిజమే నేను అట్టాంటివాణ్ణే గదా అంటే మాత్రం తప్పేముందిలే’ అని సరిపుచ్చుకున్నారా?

  కేవలం నెల్లూరికి చెందినవాడు కాబట్టి ఎస్పీ బాలును ’బండగొంతు గాయకుడ’ని ఈసడించినపుడు అది మీకు వినబడలేదా? వినబడినా, ఎస్పీని అంటే నాదేంపోయిందిలే అనుకున్నారా? ’సీమాంధ్రుల పాటలు ఏడ్చినట్టు ఉంటాయి, మన పాటలు జీవంతో తొణికిసలాడుతూ ఉంటాయి’ అని బహిరంగసభలో మైకు పట్టుకు కూసినపుడు ఎక్కడున్నారు మీరు? అప్పుడు మాట్టాడలేదే? లేక నేను కవిని కాదు గదా, నాకెందుకులెమ్మని ఊరుకున్నారా? గోదావరి జిల్లాల రైతులు సాగుసెలవు ప్రకటిస్తే అది బ్లాక్ మెయిలా? తాము చేసేది ఉద్యమమా? ఈ ముక్క మాట్టాడిన ఎదవని ’ఎదవ’ అని అనడమా తప్పు..!! ఇదెక్కడి వాదనండీ బాబూ.. !!

  ఈ బూతుకూతల్ని విన్నాక కూడా పరిస్థితులు, కారణాలు, బోషాణాలూ - వీటి గురించా మాట్టాడాల్సింది..? వాళ్ల దుష్ప్రవర్తన గురించి మాట్టాడాల. వాళ్ళ దురుసుతనం గురించి మాట్టాడాల. వాళ్ళ పొగరు గురించి, బలుపు గురించి మాట్టాడాల!

  మీరు అసలు విషయాలేమీ తెలీక మాట్టాడుతున్నారో లేక తెలిసీ ’కోస్తా సీమల జనాన్ని విమర్శించడం, తెవాదులకు మద్దతివ్వడం ఫ్యాషను’ అనుకుని ఇట్టా మాట్టాడుతున్నారో తెలవడం లేదు.

  రిప్లయితొలగించండి
 14. |కోస్తా సీమల జనాన్ని విమర్శించడం, తెవాదులకు మద్దతివ్వడం ఫ్యాషను’ అనుకుని ఇట్టా మాట్టాడుతున్నారో తెలవడం లేదు|

  ఇది నిజం!

  రిప్లయితొలగించండి
 15. చదువరి,
  ఒకే మాటపై ఒకే లక్ష్యంపై పోరాడుతున్న తెలంగాన ప్రజలకు నా మద్దతు తప్ప, కోస్తా సీమల జనాన్ని విమర్శించడం కాదు నా టార్గెట్. I do support లగడపాటి. మాట మార్చలేదు కాబట్టి.

  ప్రత్యేక తెలంగానకు ఒప్పుకొని, కేంద్రం ఇస్తామనగానే ప్లేటు ఫిరాయించడం పెద్ద తప్పు, మోసం. తప్పు చేసిన వాడికి వాదించే హక్కు వుందని నేననుకోను.

  తమకు తాము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ సమ్మె చేస్తున్న తరుణంలో సమస్యకు పరిష్కారం కోసం వెతకాలి. సమస్య ఎంత జటిలమైనదో మీలాంటి చదువరులు చెప్పాలి కానీ ఆవేశంతో చేసే కామెంట్స్ పట్టుకొని వాటికి సమాధానం ఇవ్వడం ఏమిటనేదే నా బాద.

  తెలంగాన ప్రజలను ఉటకించే బదులు, సమస్య ఎంత జటిలమైనదో తెలియజేసే పని మీలాంటి చదువరులు తెలియజెప్పాలన్నదే నా విన్నపం.

  రిప్లయితొలగించండి
 16. కేసిఆర్ గెలిచి తెలంగాన తెలంగాన ప్రజలు ఓడిపోకూడదు

  రిప్లయితొలగించండి
 17. a2zdreams:

  "ప్రత్యేక తెలంగానకు ఒప్పుకొని, కేంద్రం ఇస్తామనగానే ప్లేటు ఫిరాయించడం పెద్ద తప్పు, మోసం." అని అన్నారు. కానీ లగడపాటిని సపోర్టు చేస్తానంటున్నారు. కోస్తా సీమల వాళ్ళంతా మాట మార్చినవాళ్ళూనూ.., లగడపాటి ఒక్కడు మాత్రమే మాటమీద నిలబడ్డవాడూనా? అసలు రాజీనామాలు చేసినవాళ్ళలో లగడపాటే మొదటివాడు.:) నాకు మీ ఆలోచనల్లో స్పష్టత కనబడ్డం లేదు.

  సరే, దాన్నలా ఉణ్ణీండి..
  తప్పు, మోసం చేసారని మీరంటున్నది కోస్తా సీమల జనం గురించైతే.. అది హద్దు మీరి మాట్టాడ్డమవుతుంది. ఎనకా ముందూ ఆలోచించి మాట్టాడమని కోరుతున్నాను.

  తెలంగాణ ఇచ్చిపారెయ్యమని కోస్తా సీమల జనం చెప్పారా? పార్టీలు చెప్పుకున్నై. పార్టీలు చెబితే వాళ్ళనెన్నుకున్న ప్రజలు చెప్పినట్టే అని మీరు అనే పనైతే.. తెలంగాణను చీల్చాక, కోస్తా సీమలకు వచ్చేదేమిటో ఎవుడైనా చెప్పాడా? రాజధానిగా ఫలానా అని దేన్నైనా ప్రతిపాదించారా? హై. ఎవుడికెళ్తదో ఎవుడైనా చెప్పాడా? ఒకవేళ హై. ను కోల్పోతే అపుడేర్పడే ఆదాయపు లోటును ఎలా పూరిస్తాడో ఎవుడైనా చెప్పాడా? పొలాలకు నీళ్ళు నిరాటంకంగా వచ్చే ఏర్పాటు ఎలా చేస్తాడో ఎవుడైనా చెప్పాడా? ఏమీ చెప్పలా! కనీసం కొత్త రాజధానిగా ఏ ఊరిని ప్రతిపాదిస్తున్నారో కూడా చెప్పకుండా, రాష్ట్రాన్ని చీలుస్తాం అని గాలి వాగుడు వాగితే జనం దాన్ని పట్టించుకుంటారా? కోస్తా సీమల జనం పట్టించుకోలేదు. అపుడా గాలిమాటలు చెప్పేసి, ఇప్పుడు జనం కోపగించారని వాళ్ళు వెనక్కి తగ్గితే తప్పు జనానిదా? తెవాదులు బూతులు తిడుతూంటే తిట్టించుకోవాలా? ఎక్కడి వింత వాదనండీ?

  మీరంటున్నది నాయకుల గురించైతే.. కానీండి, మీచేత కూడా తిట్టించుకునే శాస్తి వాళ్ళకు జరగాల్సిందే!

  "సమస్య ఎంత జటిలమైనదో మీలాంటి చదువరులు చెప్పాలి కానీ ఆవేశంతో చేసే కామెంట్స్ పట్టుకొని వాటికి సమాధానం ఇవ్వడం ఏమిటనేదే.." - సమస్య జటిలత్వం గురించి మనం చెప్పాలటండి? ఆవేశాలంకార శోభితులైన నాయకాసురులకు తెలవదా? అయినా ఆవేశం వస్తే నోటికొచ్చినట్టల్లా వాగుతారా? "ఆవేశం" ఉన్నంత మాత్రాన ఆ చెత్తవాగుడు, ఆ మాటతూలుడూ సమర్ధనీయమా?

  రిప్లయితొలగించండి
 18. అ2జ్
  మీ మొదటి వ్యాఖ్యలో ఏమని రాసారో, ఇప్పుడేమంటున్నారో అది స్థిరంగా వుందంటారా? మీ స్థిరత్వ సిద్దాంతం హాస్యాస్పదంగా వుంది.
  ఏమన్నారూ.... స్థిరత్వం వుంటే చాలా, మీరు మెచ్చేసుకుంటారా?! వాదంలో పస, న్యాయం, బుర్ర బుద్ధివుందాలేదా అనేది పట్టించుకోరా?!!హమ్మ్మ్మ్మ్.. అచ్చు మార్తాండిజాన్ని పోలివుందే మీ స్థిరవాదం! మార్తాండ ఓ వ్యక్తి కాదు ఓ శక్తి, ఓ వైరస్, ఓ అంటువ్యాధి, ఓHIV+ అనిపిస్తోంది. :))))
  స్థిరంగా ఒకటే లక్ష్యంగా చేసుకున్న, బిన్లాడన్, ముల్లాఓమర్, రేసిస్టులు, హిజాబుల్ ముజహిద్దెన్, లష్కర్, రాజ్ థాకరే, లల్లూ యాదవ్, కరుణానిధి & ఫేమిలీ, వీరప్పన్, గాలి, జగన్ ... మీకు ఫేవరెట్లు అయివుండాలి మరి!

  రిప్లయితొలగించండి
 19. /కేసిఆర్ గెలిచి తెలంగాన తెలంగాన ప్రజలు ఓడిపోకూడదు/
  కుక్క ఆదరి చేరినా, చేరకున్నా, కుక్కతోక పట్టిన వాడు మాత్రం గోదారి దాటేయాలంటారు?! :)) బావుంది, మీకు నా విప్లవజోహార్లు! మంచి తెలివైన ఐడియా.

  రిప్లయితొలగించండి
 20. >> లగడపాటి ఒక్కడు మాత్రమే మాటమీద నిలబడ్డవాడూనా? అసలు రాజీనామాలు చేసినవాళ్ళలో లగడపాటే మొదటివాడు.:) నాకు మీ ఆలోచనల్లో స్పష్టత కనబడ్డం లేదు. <<

  సమైక్య వాదులంటే నాకు గౌరవం. ప్రత్యేక తెలంగానకు సై అని మాట మార్చి మౌనంగా వుండకుండా, కేసీఆర్ గ్యాంగ్ తిట్లు ఇప్పుడే వినిపిస్తున్నట్టు మాట్లాడే వారంటే అసహ్యం.

  >>"ఆవేశం" ఉన్నంత మాత్రాన ఆ చెత్తవాగుడు, ఆ మాటతూలుడూ సమర్ధనీయమా? <<

  సమర్దనీయం కాదు .. అలా అని ఇప్పుడు వారిని రెచ్చగొట్టడం కూడా సరైనది కాదు .. ఈ సమస్యపై ఆలోచించే వాళ్ళంతా శాశ్వత పరిష్కారం కోసం పొరాడవలసిన సమయం.

  Snkr జీ, మీరు ఎవరో నాకు తెలియదు. మీతో చర్చించే/వాదించే ఓపిక నాకు లేదు.

  రిప్లయితొలగించండి
 21. a2zdreams:
  ఎవర్ని గౌరవించాలో, ఎందుకు గౌరవించాలో.., ఎవర్ని, ఎందుకు అసహ్యించుకోవాలో మీకు స్పష్టత లేనట్టుగా కనబడుతోంది. మీ అస్పష్టత ఇనుమడిస్తూ కారుమబ్బుల్లాగా మిమ్మల్ని ముసురుకుంటోంది.

  లగడపాటి గతంలో ప్రత్యేక తెలంగాణకు సై అన్నవాడే (కాంగ్రెసు సై అన్నప్పుడు మాట్టాడకుండా ఉన్నవాడే), ఇప్పుడు మాట మార్చాడు. మరి, ఎందుకతడిపై మీకు గౌరవం? ఇప్పుడు సమైక్యవాదం వల్లిస్తున్న కాంగ్రెసు తెదేపా నాయకులంతా ఒకప్పుడు తమతమ పార్టీలు తెలంగాణకు అనుకూలమని ప్రకటించినప్పుడు మౌనంగా ఉన్నవాళ్ళే. వాళ్లపై మీకు గౌరవం!! ఏంటీ సందిగ్ధత? వాళ్ళపై మీకు గౌరవముంటే నాకేమీ అభ్యంతరం లేదు. మంచిదే. కానీ..

  "కేసీఆర్ గ్యాంగ్ తిట్లు ఇప్పుడే వినిపిస్తున్నట్టు మాట్లాడే వారంటే అసహ్యం." అని అన్నారే.. ఎవరు వాళ్ళు? అందరూ కాకపోయినా కొందరి పేర్లు చెప్పండి.

  రిప్లయితొలగించండి
 22. /అలా అని ఇప్పుడు వారిని రెచ్చగొట్టడం కూడా సరైనది కాదు /

  ఆంధ్రా వాడు వాడి బాతురూం లొ వాడు లఘుశంక తీర్చుకుంటున్నా..కిటికీ లోంచి చూసి...ఆంధ్రావాడు నన్ను రెచ్చగొట్టాడానికే లఘుశంక తీర్చుకుంటున్నాడు అని వాదించేవాళ్ళకు ఏమి సమాధానం చెప్పాలి ?

  రిప్లయితొలగించండి
 23. తెవాదులు కోస్తా సీమల ప్రజలను తిట్టిన తిట్లతో పోలిస్తే నేను అంటున్నవి నత్...త్థింగ్!
  Here'e my 5 cents.
  http://tinyurl.com/3j9dxuf

  రిప్లయితొలగించండి
 24. అత్యంత జుగుప్సాకరమైన కవితలివి. ఛీ!

  రిప్లయితొలగించండి
 25. a2zdreams: చూసారా ఆ లింకును? వాటిని కవితలని పిలిస్తే ’కవిత్వాన్ని’ బండబూతులు తిట్టినట్టే! పావని గారు అన్నట్టు ’జుగుప్స’ కలిగిస్తాయవి. వాటితో పోలిస్తే మేం చేసే విమర్శలు విమర్శలే కావు -పొగడ్తలు!

  రిప్లయితొలగించండి
 26. /మీరు ఎవరో నాకు తెలియదు. మీతో చర్చించే/వాదించే ఓపిక నాకు లేదు/
  నాకు అలాంటి మూర్ఖపు సెంటిమెంట్లు, ఎదవ బేషజాలు లేవులేండి. ఏ అనామక ఎ2జడ్ డేడ్రీంస్ ఎదవైనా ఏమి మాట్లాడాడన్నది ముఖ్యం కాని ఎవడు అన్నది తరువాత. మా తాతగారు వూర్లో ఇలా అరుగుమీద కూచోని ఎరిగిన వాళ్ళని పలకరిస్తూ వుండేవారు, మీరు మీ అరుగు మీద కూచోని ఆపని చేసుకోవచ్చుగా! అంతజాలానికి ఎందుకు వచ్చి మీ ఏడుపు వెళ్ళబోసుకోవడం?!

  రిప్లయితొలగించండి
 27. ఎందుకు ఈ సీమాంద్రుల బ్లాగులని,కామెంట్లని, బ్లాగరు.కాం, వర్డు్‌ప్రెస్.కాం,గూగుల్,మైక్రోసాఫ్ట్ సంస్థలు బాన్(ban) చేయవు.
  ఎందుకు ఈ సమైఖ్యవాదాన్ని వినిపించే "చదువరి"గారి బ్లాగుకి ఇన్ని హిట్లు,కామెంట్లు, ఎందుకు ఎందుకు ఎందుకు ???

  రిప్లయితొలగించండి
 28. తరాస పార్టీ వారూ, సూచన గమనించారా? సీమాంధ్రులని అంతర్జాలంనుండి బహిష్కరించాలి. సీమాంధ్రులని ఉద్యోగాలనుండి తొలగించాలి. అలాచెయ్యడానికి సిధ్ధంకాని సంస్థలమీద తెరాస దాడిచేసి ఇండియానుండి వెళ్ళగొట్టాలి - వాళ్ళమీద అవుసరంమైతే ఐ.రా.స కు పితూరీ చెయ్యాలి.

  రిప్లయితొలగించండి
 29. పై కామెంట్లన్నీ చదివినతరువాత నాకు ఒక్కటే అనిపిస్తోంది. పాపం తెలంగాణా వాళ్ళు మిగిలిన రంగాలలో ఎలా ఉన్నా ఇంటర్నెట్ ,బ్లాగు లు కంపూటర్లు విషయంలో నిజంగానే చాలా వెనకబడి ఉన్నారనేది వాస్తవంగా కనబడుతోంది.వాళ్ళ వెనకబాటుని రాజకీయ నాయకులు బాగా వాడుకుంటున్నారు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు