6, సెప్టెంబర్ 2010, సోమవారం

మబ్బులు చూపించి.. ముంత ఒలకబోయించి..

కొందరు తెవాదుల అకృత్యాలు ఉండేకొద్దీ వికృత రూపాన్ని తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. డిసెంబరు తరవాత ’అలజడి సృష్టించడానికి’ ఇప్పటినుండే రిహార్సళ్ళు చేసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. మొన్న ఉస్మానియాలో తెవాదులు పేపర్లు దిద్దే పంతుళ్ళను వెంటబడి మరీ దాడి చేసి కొట్టారు.  అప్పుడు చేసిన తప్పును కప్పిపుచ్చే అవకాశం గ్రూప్ వన్ పరీక్షల రూపంలో ఇప్పుడు వచ్చింది. వెంటనే అవకాశాన్ని అందుకున్నారు. ప్రజలకు అబద్ధాలు చెప్పి, వాళ్ళ మనసులను విషపూరితం చేసే ఏ అవకాశాన్నీ ఈ దుష్ట తెవాదులు ఒదులుకోరు. గ్రూప్ వన్ పరీక్షలు ఆపెయ్యాల్సిందేనంటూ గోల చేసారు.


అసలు ఏ కారణంతో ఈ పరీక్షలు ఆపాలనే ప్రశ్నకు తెవాదుల దగ్గర సరైన సమాధానం లేదు. ఆ ఉద్యోగాల్లో తమకు 42% రిజర్వేషన్లు కావాలని వాళ్ళ డిమాండు. గ్రూప్ వన్ ఉద్యోగాలకు ప్రాంతీయ రిజర్వేషన్లు లేవు.  అయినా  అడుగుతున్నారు.  అలా మొదలుపెట్టినప్పటికీ, తమ వాదనలో పస లేదని గ్రహించాక, దాన్ని మార్చారు. కమిషను చైర్మను వెంకట్రామిరెడ్డిని తీసేసాక మాత్రమే పరీక్షలు పెట్టాలంట.  ఎందుకూ? అతడు ఇంటర్వ్యూల్లో తెలంగాణ వాళ్ళకి అన్యాయం చేసాడంట,  ఇప్పుడూ చేస్తాడంట.

వెంకట్రామిరెడ్డికి అన్యాయం చేసే అవకాశం ఎప్పుడొస్తది? ఈ మొదటి అంచె  ఫలితాలు రావాలి, ఆ తరవాత రెండో అంచె జరగాలి, వాటి ఫలితాలు రావాలి, ఆ పైన ఇంటర్వ్యూలు జరగాలి. ఇవన్నీ జరిగేటప్పటికి అతడెలాగూ ఉండడు. ఒకవేళ ఉన్నా, ఈ లోగా అతణ్ణి తప్పించమని వత్తిడి చెయ్యొచ్చు.  ఇదంతా  దాచిపెట్టేసి,  పరీక్షలను అడ్డుకోవాలని, రాసేవాళ్ళను చెల్లాచెదురు చెయ్యాలని ప్రయత్నించారు. ఉస్మానియా బియ్యీడీ కాలేజీ సెంటరులో పరీక్షలను రద్దు చేయించడంలో విజయులయ్యారు కూడాను. (అసలు రౌడీమూకల మధ్య పరీక్ష పెట్టి, వాళ్ళ నుండి రక్షణ కోసం వందల మంది పోలీసులను పెట్టడం ఎందుకు?)

ఈ డ్రామాలో  విలన్లే కాదు, జోకర్లూ ఉన్నారు -కాంగ్రెసు ఎంపీలు! వాళ్ళు బియ్యీడీ కాలేజీని ముట్టడించడానికి పోతూంటే పోలీసులు అరెస్టు చేసి వానులో తీసుకెళ్తుండగా, టీవీల్లో చూపించారు. ఆ పిచ్చి సన్నాసులను  చూస్తే నవ్వొచ్చింది. తోలుబొమ్మలాటలో బొమ్మల్లాగా ఉన్నారు. కోతులాటలో కోతుల్లాగా ఉన్నారు. అయ్యగారికి దణ్ణంపెట్టూ అని ఆడించేవాడు అనగానే నెత్తిన చేతులు పెట్టుకునే కోతిలాగా అనిపించారు. ఈ చవటాయిల్ని, ఈ తోలుబొమ్మల్ని ఒక ఆట ఆడిస్తున్నాడు కేసీయారు. అతడాడిస్తూంటే ఈ కేతిగాళ్ళు తైతక్కలాడుతున్నారు.  ఒకళ్ళిద్దరు కాదు..,  నలుగురో ఐదుగురో ఎంపీలు.  ఒకవేళ కేసీయారు చెప్పినట్టు వీళ్ళు ఆడలేదనుకోండి.. ’చూడండి,  మనమంటే వీళ్ళకు లెక్ఖలేదు, తెలంగాణ పట్ల వీళ్లకి  శ్రద్ధలేదు’ అని తిట్టి, ప్రజలచేత తిట్టిస్తాడేమోనని ఈళ్ళ భయం!

ఆ ఎంపీల్లోనే ఒకతడు మొన్నొక నాటకం కూడా ఆడాడంట.. ఈ పరీక్షల అక్రమం గురించి సోనియాతో మాట్టాడాను, అహ్మద్ పటేలుతో మాట్టాడాను, వీరప్పతోటీ, దారిన పోయే దానప్పతోటి మాట్టాడాను అంటూ టీవీ వాళ్ళకి అబద్ధాలు చెప్పాడంట. వెంటనే ఆ దానప్పలు అబ్బెబ్బే , మాతో టెవడూ మాట్టాడలేదు, అసలు మాకు ఆ పరీక్షలతో సంబంధమేమీ లేదు అంటూ తేల్చేసారు.

ఇలా అబద్ధాలు ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ ఎంపీకి? ఇలా తోలుబొమ్మల్లాగా తైతక్కలాడాల్సిన ఖర్మ ఎందుకు పట్టింది వీళ్ళకి? తమ డిమాండు తెలివితక్కువదనీ, దాన్ని అడ్డం పెట్టుకుని ఇలా పరీక్షను అడ్డుకుంటే  కుర్రాళ్ళకు నష్టమనీ తెలిసి కూడా వీళ్ళీ దౌష్ట్యానికి ఎందుకు ఒడిగట్టినట్టు?  ’నీకంటే పెద్ద తెవాదిని నేనూ, ఒట్ఠీ తెవాదిని నేనూ’  అని చెప్పుకోవాలనే దురద కాకపోతే ఇంకేంటి?

కేసీయారు చూడండి ఏమంటున్నాడో..  ఇప్పటికైనా ప్రభుత్వం ’చెంపలేసుకుని, పరీక్షను రద్దు చేసి మళ్ళీ పెట్టాలం’ట!  తప్పు చేసింది తామైతే, ప్రభుత్వం ఎందుకు చెంపలేసుకోవాలి?  ’ఈ రకంగా పరీక్ష పెట్టడం ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదం’ట.  ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడైనా జరిగి ఉంటుందో ఉండదో తెలవదు గానీ, ఈ తెవాదుల వంటి ఉద్యమకారులు మాత్రం ప్రపంచంలో ఎక్కడా ఉండి ఉండరు.   వీళ్ళలాగా ప్రజల గుండెల్లో విషం గక్కినవాళ్ళు, వీళ్ళలాగా మబ్బుల్ని చూపించి, ముంతలో నీళ్ళను ఒలకబోయించేవాళ్ళు మాత్రం ఇంకెక్కడా ఉండరు.  వస్తదో రాదో తెలీని, వచ్చినా ఎప్పుడొస్తదో తెలీని, తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పి, ఇవ్వాళ కుర్రాళ్ళ నోట మట్టిగొట్టారు.

తెలుగు  ప్రజలకు పట్టిన  చీడ, ఈ దుష్ట తెవాద రాజకీయ నాయకులు.  తమ రాజకీయ ప్రయోజనాల కోసం  వీళ్ళు అమాయక ప్రజలకు చేస్తున్న అన్యాయం  అనన్య సామాన్యం!

33 కామెంట్‌లు:

 1. >> కుర్రాళ్ళ నోట మట్టిగొట్టారు.

  బాగా చెప్పారు. అక్కడ వీరంగమేసిన ఒక్కడికీ ఎందుకు వీరంగమేస్తున్నారో (42% Or రెడ్డి Or both) తెలిసుండదు.


  >> ’నీకంటే పెద్ద తెవాదిని నేనూ, ఒట్ఠీ తెవాదిని నేనూ’
  >> అని చెప్పుకోవాలనే దురద కాకపోతే ఇంకేంటి?

  ఇది దేనికి పేరడీనో నాకు తెలుసులేండి ;)

  తెలీని వాల్లు ఈ లింకు లో వినొచ్చు: http://www.tollynation.com/track/2-Chavataayanu-Nenu

  రిప్లయితొలగించండి
 2. @చదువరి, Wit Real

  తెలంగాణా వాదులకు అన్నీ తెలుసు. డిసెంబరు ముప్పయ్యొకటి వరకు ఆగితే మీ పాటల అర్థాలు మీకే అద్దంలో కనబడతాయి.

  రిప్లయితొలగించండి
 3. అదేంటి సార్, మీకు తెలంగాణా ప్రజలకి కాసిని నీటి బొట్లిస్తున్నదన్న అక్కసుతో, తమకు వాటా లేకున్నా మొత్తంగా క్రిష్ణా నీరంతా తమకే దక్కాలనే పేరాశతో ప్రాణంలేని బ్యారేజి గేట్లని అర్ధరాత్రి గూండాల్లా ధ్వంసం చేసిన వారూ, వారిని ఉసిగొల్పిన నేతలూ విధ్వేషకారులుగా కనపడరు. తెలంగాణాకి చెందినవనే అక్కసుతో నోరులేని ఎద్దులని రాళ్ళతో కొట్టినవారు విధ్వెషకారులుగా కనపడరు. అమెరికాలో ఉంటున్నా విధ్వేషం, ముఠాతత్వ బుద్ధి మానుకోక తెలంగాణా విద్యార్థులపై దాడి చేసిన వారూ విధ్వేషకారులుగా కనపడరు.

  కానీ దశాబ్దాలుగా తమపై వివక్షను చూపిస్తూ తెలంగాణా వారనే అక్కసుతో మౌఖిక పరీక్షల్లో ఉద్దేషపూర్వకంగా తక్కువ మార్కులు వేసే మోసబుద్ధిని ప్రశ్నించే వారు విధ్వేషకారుల్లా కనపడతారు? ఎందుకీ వివక్ష? ఎన్నాల్లు భరించమంటారీ వివక్ష?

  రిప్లయితొలగించండి
 4. Wit Real: :)
  శ్రీకాంత్: సరేనండి.
  సత్యాన్వేషి: మనం మనం కొట్టుకు చచ్చి, అవతలోడికి అవకాశమివ్వడానికి, లోకువవ్వడానికీ ఆర్డీయెస్ ఒక చక్కటి ఉదాహరణ. పగలగొట్టినవాడి తప్పును నేను సమర్ధించడం లేదు. కానీ కర్ణాటక మనకు చేస్తున్న అన్యాయం కనబడకుండా తెలంగాణ వాదం మన కళ్ళను కమ్మేసింది, బాబ్లీ అన్యాయం కనబడకుండా కమ్మేసినట్టు. ఎప్పుడు తెలుసుకుంటామో మనం!
  ఎద్దులని కొట్టినవాడు ఖచ్చితంగా ద్వేషియే! సందేహం లేదు. అలా కొట్టినవాడు మిగతా ప్రజల ముందుకు వచ్చి రండీ మనందరం కలిసి తెలంగాణ ఎద్దుల్ని రాళ్ళతో కొడదాం అంటే, అందరూ కలిసి వాణ్ణి చెప్పు తీసుక్కొట్టేవాళ్ళు. ఎందుకంటే ద్వేషభావం మనకు ఇసుమంతైనా ప్రయోజనం చెయ్యదని అక్కడ జనానికి తెలుసు. వాళ్ళ మనసులను విరిచేసే ద్రోహులు అక్కడ లేరు. అదే ఇక్కడేం చేస్తున్నారో చూడండి, మీరే పోల్చి చూసుకోండి.

  "తెలంగాణా వారనే అక్కసుతో మౌఖిక పరీక్షల్లో ఉద్దేషపూర్వకంగా తక్కువ మార్కులు వేసే" - మీరు నిజంగానే దీన్ని నమ్ముతున్నారా? పోనీ నిజమేనని అనుకుందాం.. వీళ్ళు చేస్తున్నది ’మోసబుద్ధిని ప్రశ్నించ’డమా? పరీక్షలు రాయనివ్వకపోవడం పద్ధతా? ప్రశ్నించొచ్చు, కానీ ప్రజల ఆశలను అణగదొక్కడమెందుకు? ప్రజల్ని పాలించాల్సినవాడు వీళ్ళ కారణంగా రేపు ఆటో నడుపుకు బతకాల్సిన పరిస్థితి వస్తే దానికి ఎవర్ని బాధ్యుల్ని చెయ్యబోతున్నారు? ఆంద్రోళ్ళనేగా!?

  నిన్నగాక మొన్న సబ్బం హి చెప్పాడు రెండు ఆత్మహత్యలు ఆత్మహత్యలు కావు, హత్యలని! ఊరికే గాలిమాటలు చెప్పలేదు, పేర్లు కూడా చెప్పాడు. ఒకపేరు వేణుగోపాలరెడ్డి. రెండోది గుర్తు లేదు. ప్రభుత్వం దగ్గర సమాచారం కూడా ఉన్నదంట. ’నన్ను మోసం చేసారు, రక్షించండి, రక్షించండి’ అని అరిచాడంట ఆ ఇద్దరిలో ఒకరు. ఏమంటారు మీరిప్పుడు? వీళ్ళు ఉద్యమకారులా విద్వేషకారులా? భోజనానికి పిలిచి అన్నంలో విషం కలిపి పెట్టేవాళ్ళకీ, ఈ వేణుగోపాలరెడ్డి హంతకులకూ తేడా ఏమిటి?

  రిప్లయితొలగించండి
 5. >> తెలంగాణా వాదులకు అన్నీ తెలుసు.

  నిన్న జరిగిన గొడవ ఎందుకు జరిగింది, దాని ఉద్దేశ్యమేమిటి అనేది కొంచెం ఆ గొడవ చేసిన వాల్ల చేత చెప్పించగలరా? రెడ్డి మీదా గొడవా? లేక 42% మీదా? లేక వివక్ష మీదా? -- ఇప్పటివరకు గ్రూప్-1 నియమకాలలో ఎవరికెవరికి ఎంతెంత వచ్చిందీ లగడపాటి స్టాటిస్టిక్స్ ఇచ్చాడు గదా. మీరు చూడలేదా?

  >> కానీ దశాబ్దాలుగా తమపై వివక్షను చూపిస్తూ

  ఇదొక లత్తుకోరి వాదన.
  వివక్ష మీరు చూసారా? నిరూపించగలరా? పరీక్ష లో వేరే సిలబస్ కావాలా? తప్పినా ఉద్యొగాలు ఇవ్వాలా?

  మీరు ఎప్పుడైనా వివక్ష ఎదుర్కొన్నారా
  1. నాకు 520 మార్కులు వచ్చినా లయొలా లో అడ్మిషన్ ఇవ్వలా. 430 వచ్చిన వాడికి ఇచ్చారు. వివక్ష అంటే అది. అక్కడ నా కులం చూసి నాకు సీటు ఇవ్వలెదు.
  2. లెక్కల్లో 99 మార్కులు, తెలుగులో 55 మార్కులు వచ్చాయి. ఇక్కడ నా భాషా పరిజ్ఞానం ఇలా వుంది అనుకోవాలా లేక నాపై వివక్ష చూపించి తక్కువ మార్కులు వేసారనుకొవాలా?

  రిప్లయితొలగించండి
 6. @చదువరి

  తోటి తెలుగు వాడు ఏళ్లతరబడి గొంతుదగ్గరి నీటిని దోచుకుంటుంటే అరిచి సొమ్మసిల్లిన తెలంగాణ ప్రజలు మరాఠీ వాడి 2 TMCల ప్రాజెక్టుకోసం గొంతు చించుకొమ్మంటారా, లేక మీ బాబుగారిలాగా డ్రామాలాడి ఉత్త(మ) స్వార్ధం చూపమంటారా? ఏళ్ళ తరబడి నీటిని దోచుకుంది చాలక ఆర్డీయెస్ ను ధ్వంసం చేసిన తరువాతి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డీ, భూమా నాగిరెడ్డి ల స్టేట్మేంట్లు ఒక్కసారి చూడండి, వీరి విద్వేషం, రౌడీ జులుం తెలుస్తుంది. వీరు మీరడిగినట్లుగానే పబ్లిక్కానే తెలంగాణాకి నీరిచ్చే తూములని ధ్వంసం చేస్తామన్నారు, మరి మీరు మాత్రం ఒక టపా వేసి ఖండించలేదు కదా కనీసం ఒప్పుకోరు.

  వేణుగోపాల్ రెడ్డి ఇక్కడి అరుపులు వైజాగ్‌లో ఉన్న సబ్బం హరికి వినబాడ్డట్టున్నాయి, అదే నిజమయితే ఆలస్యం ఎందుకు నిరూపించి దోషులను శిక్షించమనండి, అందరం కలిసి ఖండిద్దాం, కానీ ముందే మీరు నేరాన్ని అంటగట్టకండి.

  ఉద్యోగాల్లో వివక్ష విషయం నేను నమ్మడం కాదు, స్వయంగా చాలా చోట్ల చూశాను. మరి తె. వాదులేమీ ఎక్కువ వాటా అడగలేదు కదా, 42% వాటా, అవినీతి ఆరోపణలున్న వెంకట్రామిరెడ్డి తొలగింపు లాంటి న్యాయమయిన డిమాండ్లను కూడా పట్టించుకోకుండా లాఠీలనడుమ పరీక్షలు జరపాల్సిన అవసరం ఏముంది? ఎన్ని సార్లు appsc అకారణంగా వాయిదా పడలేదు, ఇప్పుడు సకారణంగా మరోసారి వాయిదా పడితే నష్టమేంటి?

  రిప్లయితొలగించండి
 7. అసలయిన సత్యాలు ఎవరికి అవసరం లేదు.ప్ర త్యెక రాశ్త్రం వస్తే ఏం జరుగుతున్దిహైదరాబాదు లొ తి శ్త వేసిన ఐఎస్ ఐ వాళ్ల ను కట్టడి చేయగలరా?నీరు ఏమాత్రం నిలువఉండని భౌగోళిక స్థితి లో మేలు ఏమి జరుగుతుంది.పూర్వం రాశ్త్ర విభజన సమయంలో తె లన్గాణా వాదుల కోసమే హైదరాబాదు ను కెపిటల్ చేసారుకర్నూలు కాకున్డా.ఆ విశయాన్ని అన్దరూ మర్చి పోయారా?పిట్ట పొరు పిట్ట పొరు పిల్లి తీర్చిన్దని.మన సమస్యలను ఎవరో పక్క రాశ్త్రమ్ వాళ్లు తీర్చాలి.మన తిరుపతి లొ అన్యాయాలు జరుగుతున్నాయని సొనియా కు నివెదిన్చుకోవాలి .మన నాయకులు,మన మీడియా!!??!!.వహ్వవహ్వా!

  రిప్లయితొలగించండి
 8. ’ఈ రకంగా పరీక్ష పెట్టడం ప్రపంచంలో ఇంకెక్కడా జరగలేదం’ట. ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడైనా జరిగి ఉంటుందో ఉండదో తెలవదు గానీ, ఈ తెవాదుల వంటి ఉద్యమకారులు మాత్రం ప్రపంచంలో ఎక్కడా ఉండి ఉండరు. వీళ్ళలాగా ప్రజల గుండెల్లో విషం గక్కినవాళ్ళు, వీళ్ళలాగా మబ్బుల్ని చూపించి, ముంతలో నీళ్ళను ఒలకబోయించేవాళ్ళు మాత్రం ఇంకెక్కడా ఉండరు. వస్తదో రాదో తెలీని, వచ్చినా ఎప్పుడొస్తదో తెలీని, తెలంగాణ రాష్ట్రం పేరు చెప్పి, ఇవ్వాళ కుర్రాళ్ళ నోట మట్టిగొట్టారు.

  ----------------
  Rightly said !

  రిప్లయితొలగించండి
 9. సివిల్ సర్వీసస్ లో తెలంగాణా వాటా ఎందుకు అడగరు? ఈ అల్లరి మూకకు గ్రూప్1 కాదు కదా గ్రూప్4 లో కూడా పాస్ అయ్యే అర్హతలు లేవు. వీళ్ళనుంచి తెలంగాణానుంచి సెలక్ట్ అయ్యేవాళ్ళు కూడా అవకాశాన్ని కోల్పోయారు. ఫైనల్ రిజల్ట్ వచ్చాక తెలంగాణా వాళ్ళు తక్కువ వుంటే మాకు అన్యాయం జరిగింది అని ఏడ్వటానికి అవకాశం వుంటుంది. గవర్నర్ నరసింహన్ చేతికి ఓ 2ఏళ్ళు పగ్గాలు ఇస్తే అంతా సర్దుకుంటుంది, ఆయనకు తెలుసుఎలా తొక్కాలో. ఈ రోశయ్య, వెంకయ్యల తో ఇది అయ్యేపని కాదు.

  రిప్లయితొలగించండి
 10. సత్యాన్వేషి: ఆర్డీయెస్సు విషయంలో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేసారు, అది ఒప్పని నేను అనడం లేదు. కానీ కర్ణాటక కారణంగా మహబూబ్ నగరుకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరూ మాట్టాడరే? ఎంచేత మాట్టాడరంటే.., సమస్య పరిష్కారం ఎవరికీ అక్కర్లేదు. దాన్ని మన ఉద్యమానికి అనుకూలంగా మలచుకోవాలి, అంతే! కర్ణాటకను తిడితే ప్రత్యేకరాష్ట్ర వాదనకు లాభమేముంది, సీమను తిట్టాలిగాని? అంచేత సీమనే తిడతారు.

  "మీ బాబుగారిలాగా డ్రామాలాడి ఉత్త(మ) స్వార్ధం చూపమంటారా?" - ’మా’ మాత్రమే కాదులెండి, ’మన’ బాబే! :) తెరాస, కాంగ్రెసుల నీచ స్వార్థం కంటే బాబు స్వార్థం నయం, రాష్ట్రానికి అంతో ఇంతో ఉపయోగం.

  "..నిరూపించి దోషులను శిక్షించమనండి,.." - నిజమే, నిరూపించాల్సిందే! అలాగే తెవాదుల ఆరోపణలన్నిటినీ కూడా నిరూపించాల్సిందే!

  సబ్బం హరి చెప్పిన సంగతి ఇప్పుడు విన్నాం. కానీ ఆయన కంటే ముందే మీడియా చెప్పింది. తెలుగు మీడియా తెవాదుల అబద్ధాలను నెత్తికెత్తుకుని మోస్తోంది కాబట్టి, వాళ్ళ దృష్టిలో అవతలి పక్షపు వాదనకు విలువ లేదు కాబట్టీ, వాటిల్లో ఈ వార్తలు వచ్చి ఉండవు. ఇవి చూడండి:
  యాదయ్య ఆత్మహత్య గురించి ఐబీయెన్ ఏమంటోందో చూడండిక్కడ: http://ibnlive.in.com/blogs/shaikahmedali/2200/61558/the-anatomy-of-telangana-agitation.html
  ఇదే వ్యాసంలో వేణుగోపాలరెడ్డి మరణం గురించి కూడా సందేహాస్పదంగానే రాసాడు.

  రామోజీ స్వామి అనే కుర్రాడి ఆత్మహత్య గురించి టైమ్స్ ఆఫ్ ఇండియా ఏం చెబుతోందో చూడండిక్కడ: http://timesofindia.indiatimes.com/city/hyderabad/The-Anatomy-Of-A-Suicide/articleshow/5609423.cms

  రిప్లయితొలగించండి
 11. ee emotional drama lo ketigaAllaku maAtram kodava leEdu.kk ani okadu unnaAdu.darwin veEdini choose thana theory propose cheEsaAdeEmoO annattu ga untaAdu. tanaku thanu pedda meEdhaAvini ani anukontadu,kaAni entha jugupsa kaliginchEla maAtlaAdataAdO choOdu.telangana vaAllu asalE burra thakkuva vaAllu.veElla mayalO padi elaA bali ayipootunnaro choodandi.

  రిప్లయితొలగించండి
 12. చదువరి చాలా మంచి టపా వ్రాశారు.

  వుద్యమానికి విద్యార్థుల మద్దతు లేక, కే సీ ఆర్ యూనివర్శిటీల్ని టార్గెట్ చేస్తున్నాడని నాలాంటి వాళ్లు ఓ రెండేళ్ల క్రితం నించీ అంటూండడం వల్ల, తన క్రిమినల్ బ్రెయిన్ తో ప్రతిక్రియ చెయ్యడం మొదలెట్టాడు.

  లేకపోతే, హాస్టలు లోంచి, తన బ్యాక్ ప్యాక్ తగిలించుకొని, బయటికి పరుగెత్తుకొస్తున్న విద్యార్థి, హటాత్తుగా అంటుకొని మండిపోవడం యేమిటి? దాన్ని ఆత్మాహుతి అని వీళ్లు ప్రచారం చెయ్యడం యేమిటి?

  రాక్షసుల్ని రాళ్లతో కొట్టడం ప్రారంభిస్తేగానీ, ఈ దేశానికి మోక్షం లేదు.

  రిప్లయితొలగించండి
 13. >>>కానీ దశాబ్దాలుగా తమపై వివక్షను చూపిస్తూ తెలంగాణా వారనే అక్కసుతో మౌఖిక పరీక్షల్లో ఉద్దేషపూర్వకంగా తక్కువ మార్కులు వేసే మోసబుద్ధిని ప్రశ్నించే వారు విధ్వేషకారుల్లా కనపడతారు?
  ఉద్దేశ్యపూర్వకంగా తక్కువ మార్కులు వేశారని మీరు రుజువు చేయగలరా?? వాళ్ళు ఆ మౌఖిక పరీక్ష జరిగిన సమయంలో సరిగ్గా చెయ్యలేకపోయారు కాబోలు.. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి మనము బాగా చేశాము అనుకున్నవి ఫలితం ఇవ్వకపోవచ్చు.. దానికి ఏదో వివక్ష అని పేరు పెట్టడం ఎద్దు ఈనింది అంటే దూడను కట్టేయమనడం లాంటిది..

  మరొక మాట:
  పెద్దమనుషుల ఒప్పదందం ప్రకారం అవి ఆ వాటాలు కేవలం 10 ఏళ్ళు మాత్రమే అని ఆ అ తర్వాత అంతా సమానమేనని లగడపాటి చెబుతున్నాడు.. దీని గురించి ఎవరి దగ్గరైనా ఆ ఒప్పందం తాలూకు కాపీలు గానీ ఇంకేమైనా ఇంఫర్మేషన్ గానీ ఉంటే స్కాన్ చేసి బ్లాగుల్లో పెడితే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 14. సరిగ్గా చెప్పారు....ఏదో చేసేసి...మాకు చాల బలం ఉంది చూడండహో...అని చెప్పడానికి తప్ప, వాళ్ళు చేసిన పనిని సమర్దిన్చుకోవడానికి వాళ్ళ దగ్గర ఏమి లేదు.

  రిప్లయితొలగించండి
 15. చదువరి గారు.
  మీరు ప్రతిసారి తెలంగానా నాయకుల గురుంచి చెప్పుతున్నరు కాని, మీ ఆంధ్ర లొ నాయకుల గురుంచి ఏందుకు చెప్పదం లెదు, మా తెలంగానా కి మొసం చెసినా వాల్ల గురుంచి కూద చెబిత్ బాగుంతుంది.

  రిప్లయితొలగించండి
 16. అజ్ఞాత:
  మా నాయకులు మిమ్మల్ని మోసం చెయ్యడమేమిటండి? మోసం చేసే పనిని మావాళ్ళకు ఔట్ సోర్సు చెయ్యడానికి మీ నాయకులు దద్దమ్మలనుకుంటన్నారా ఏంటి? :) వాళ్ళు తక్కువాళ్ళేం కాదు, ఖతర్నాకులు -ఖతర్నాయకులు!

  ఎంత ఖతర్నాక్ మోసగాళ్ళంటే, మీ కళ్ళెదురుగానే మీకు గుండు చేసేసి, "అదుగదుగో ’ఆంద్రోళ్ళే’ మీకు గుండు చేసేసారు, వెళ్ళండి వాళ్ళను తిట్టండి" అని మిమ్మల్ని ఉస్కో అంటే మీరేమో కాస్కో, చూస్కో అంటూ మా ఎంట బడతన్నారు. అంతలా మోసం చేసారు మిమ్మల్ని.

  రిప్లయితొలగించండి
 17. ఛదువరి గారు......
  మీరు మనసులొ ఫూర్థ్హిగా, టెలంగానా వాల్ల పాత్ల్ల కొపం నింపుకుని వున్నరు, మీ అంధ్ర నాయకులు పత్త్తి విత్థులు అంతారు Okkkkkkkk. మాకు మొసాం చెసినా ఆంధ్ర నాయకులు చాలమంది వున్నరు, ఆసలు ఏవ్వరు మొసం చెయాకుంద మా వాల్లు ఏందుకు 1953 నుంచి పొరాధుతున్నరు, మీరు మీ భ్లొగ్ లొ చాలమంది, టెలంగనా నాయకులు ఆది చెసారు , ఈది చెసారు ఆంత్తునారు, మీరు ఏమి చెయకుంధ మా వాల్లు ఏందుku ఆంతారు, కచ్హితమగ్ మొసం చెసారు . దాని వలన ఇప్పుదు ఇంతా జరుగుతుంది. ప్రొబ్లెం వున్నప్పుదు ఆది ఏందుకు వచీంది, అని కుద మీరు చర్చ పెత్తలి.
  (Im New to Telugu Lipi)

  రిప్లయితొలగించండి
 18. "మీరు మనసులొ ఫూర్థ్హిగా, టెలంగానా వాల్ల పాత్ల్ల కొపం నింపుకుని వున్నరు," - తెలంగాణ వాళ్ళ పట్ల కాదు అబద్ధాలు చెప్పుకుంటూ, ఇతర ప్రాంతీయులను తిడుతూ ప్రజల మనసులను విషపూరితం చేస్తున్న తెవాద నాయకుల పట్ల!

  "మీ అంధ్ర నాయకులు పత్త్తి విత్థులు అంతారు" - ణెనలా అనలేదు, అనను.

  "ఆసలు ఏవ్వరు మొసం చెయాకుంద మా వాల్లు ఏందుకు 1953 నుంచి పొరాధుతున్నరు," - 1953 నుంచీ పోరాడడం లేదు. ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పదవులు దక్కవో అప్పుటికప్పుడు ఆయా నాయకులు తెవాద ఉద్యమాన్ని చెట్టుమీంచి దించి తెవాద ఉద్యమ నాయకుల అవతారాలెత్తుతున్నారు. మిమ్మల్ని మోసం చేస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 19. మీరు ఏప్పుదు మాదె తప్పు అంతున్నరు, మీ ఆంధ్ర ఆహంకరం ఏలావుంతుందొ మీరు ఊదాహరనా, మీరు చెసినా తప్ప్లులు గురుంచి మత్లదరు , కాని మీము మాత్రం మీ కాకి,కాధలు వినలి. మెము ఒకా దాని గురుంచి అదిగిత్, మీరు ఇంకొ దాన్ని గురుంచి చెబూతురు, మారి చంద్రబాబు(2008) ,రాజాసీఖర్రెదీ(2004 & 2009) ఏందుకు మాకు తెలాంగనా ఇస్తం అన్నరూ , అప్పుదు మీ అంధ్ర నాయకులు మామాలిని మొసం చెయలేదా ? లేకపొత్ వాల్లు సీమ ఆంధ్రా వాల్లు కాదా? మీ నాయకులు కచ్హితం గా మంలని పుర్థిగా మొసంచేసారు, మీ ఆంధ్ర వాల్లు కాదు అన్న ఈది నిజం

  మీ పారిపలనా లొ వున్ననీ రొజులు మా తెలాంగనా బాగు పదదు.

  మా నాయాకులూ గురుంచి మాకు తెలుసు వాల్లు అంధరు మచొల్లు అన్ని నేను అనను , కాని మీ నాయకులూ వల్ల ఈ పరిస్థిథి 70% వచ్హింది మత్రం నేను చెప్పగలను
  మా నాయకుల దగ్గర పదివి లేదు దబ్బు లేదు , మొత్తం మీ ఆంధ్ర వాల్ల హంద్స్లొ వుంచుకుని మా నాయ్కులది తప్పు అనాదము తప్పు

  రిప్లయితొలగించండి
 20. పై అజ్ఞాత ఎం చెప్పదలచుకున్నారు ? నాకు ఎవరైనా అనువదించగలరా ?

  రిప్లయితొలగించండి
 21. My Dear,అజ్ఞాత.....


  నువ్వు అర్ధం చెసుకుని ఏమి చెస్త్తవూ అని చెప్పడు.

  రిప్లయితొలగించండి
 22. సీమాంధ్ర ఆందోళనను ఖండించిన కేసీఆర్

  హైదరాబాద్: ఎస్సై రాత పరీక్షను వాయిదా వేయడాన్ని నిరసిస్తూ సీమాంధ్ర విద్యార్థులు చేస్తున్న ఆందోళనను టీఆర్‌ఎస్ కే.చంద్రశేఖరరావు ఖండించారు. ఏ హక్కుతో సమైక్యవాదం గురించి మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని నిజాం కాలం నుంచే పోరాటం జరుగుతోందని అన్నారు. ఫ్రీజోన్ వివాదాన్ని ముఖ్యమంత్రి రోశయ్యే నానబెట్టారని ఆరోపించారు. తన మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఎస్సై రాత పరీక్షను నెల రోజులు వాయిదా వేస్తే కొంపలు అంటుకుంటాయా? అని కేసీఆర్ ప్రశ్నించారు. 14(ఎఫ్) నిబంధనను రద్దు చేయకుండా ఎస్సై పరీక్ష నిర్వహిస్తే అసెంబ్లీ తీర్మానాన్ని ధిక్కరించినట్టేనని అన్నారు. శాసససభ చేసిన తీర్మానాన్నే అమలు చేయడానికి సమ్మతించని సీమాంధ్రులతో ఎందుకు కలిసుండాలని కేసీఆర్ నిలదీశారు.

  రిప్లయితొలగించండి
 23. My Dear Chaduvari garu....
  మీరు ఏప్పుదు మాదె తప్పు అంతున్నరు, మీ ఆంధ్ర ఆహంకరం ఏలావుంతుందొ మీరు ఊదాహరనా, మీరు చెసినా తప్ప్లులు గురుంచి మత్లదరు , కాని మీము మాత్రం మీ కాకి,కాధలు వినలి. మెము ఒకా దాని గురుంచి అదిగిత్, మీరు ఇంకొ దాన్ని గురుంచి చెబూతురు, మారి చంద్రబాబు(2008) ,రాజాసీఖర్రెదీ(2004 & 2009) ఏందుకు మాకు తెలాంగనా ఇస్తం అన్నరూ , అప్పుదు మీ అంధ్ర నాయకులు మామాలిని మొసం చెయలేదా ? లేకపొత్ వాల్లు సీమ ఆంధ్రా వాల్లు కాదా? మీ నాయకులు కచ్హితం గా మంలని పుర్థిగా మొసంచేసారు, మీ ఆంధ్ర వాల్లు కాదు అన్న ఈది నిజం

  మీ పారిపలనా లొ వున్ననీ రొజులు మా తెలాంగనా బాగు పదదు.

  మా నాయాకులూ గురుంచి మాకు తెలుసు వాల్లు అంధరు మచొల్లు అన్ని నేను అనను , కాని మీ నాయకులూ వల్ల ఈ పరిస్థిథి 70% వచ్హింది మత్రం నేను చెప్పగలను
  మా నాయకుల దగ్గర పదివి లేదు దబ్బు లేదు , మొత్తం మీ ఆంధ్ర వాల్ల హంద్స్లొ వుంచుకుని మా నాయ్కులది తప్పు అనాదము తప్పు

  రిప్లయితొలగించండి
 24. అనువాదానికి నేను కొద్దిగా ప్రయత్నిస్తాను.

  మీరు ఎప్పుడూ తప్పు మాదే అంటున్నారు! మీ ఆంధ్రా అహంకారం ఎలా ఉంటుందో చెప్పడానికి మీరే ఒక ఉదాహరణ!మీరు చేసిన తప్పుల గురించి మాట్లాడరు గానీ మేము మాత్రం మీ కాకమ్మ కథలు వినాలేం పాపం?మేమొకదాన్ని గురించి అడిగితే మీరింకోదాన్ని గురించి చెప్తారు.మరి చంద్రబాబు నాయుడు 2008 లో, రాజశేఖర్ రెడ్డి 2004 లోనూ 2009లోనూ తెలంగాణా ఇస్తామని ఎందుకన్నారో చెప్పండి? అప్పుడు మీ ఆంధ్రా నాయకులు మమ్మల్ని మోసం చేయలేదా? లేకపోతే వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు కాదంటారా? మీ నాయకులు మమ్మల్ని పూర్తిగా మోసం చేశారన్నది నిజం! మీరు కాదన్నా ఇది మాత్రం నిజం!

  మీ పరిపాలన ఉన్నన్నాళ్ళూ తెలంగాణా బాగుపడదు. ఇది నిజం!

  మా నాయకుల గురించి మాకు తెలుసు. వాళ్ళు మంచోళ్ళని నేననను. కానీ ఇప్పుడున్న పరిస్థితికి 70% కారణం మీవాళ్ళేనని మాత్రం చెప్పగలను.

  మా నాయకుల దగ్గర డబ్బు లేదు, పదవి లేదు. మొత్తం మీ ఆంధ్రా వాళ్ళ (హంద్స్లో అంటే ఏంటో అర్థం కాలా) గుప్పిట్లో ఉంచుకుని మా నాయకులది తప్పు అనడం తప్పు!

  ఇదండీ ఆయన చెప్తోంది. భాషను అయితే తిప్పి రాయగలిగాను గానీ ఆ భావం అర్థం చేసుగలిగే పరిపక్వత ఇంకా వచ్చినట్లు లేదు నాకు. మొత్తానికి చాలా "నిజాల" గురించి చెప్పాలనుకుంటున్నారన్నది మాత్రం నిజం!

  రిప్లయితొలగించండి
 25. My Dear Chaduvari garu....

  >>మీరు ఏప్పుదు మాదె తప్పు అంతున్నరు
  మీరు ఎప్పుడు తప్పు మాది కాదు అనండి

  >>కాని మీము మాత్రం మీ కాకి,కాధలు వినలి
  వాళ్ళ కాకి కధలు అంట కొన్ని రోజులు వినండి
  మిగతావి అన్నీ కలిపి, మా నాయకులు హోల్ మొత్తంగా రాష్ట్రాన్ని మోసం చేసుకొనే చాన్స్ ఇవ్వండి

  ...

  Taara

  రిప్లయితొలగించండి
 26. చదువరి గారు......

  ఏందుకు ఆ0డీ ఇంత దొంగ బతుకు సుటీగా సమాదానం ఈవ్వలెకా( సుజాత, అజ్ఞాత)వారి రుపం లొ సమాదానం ఇస్తున్నరు ?

  రిప్లయితొలగించండి
 27. ఒక అజ్ఞాతది దొంగబతుకు అని మరొక అజ్ఞాత అనడం బహుశ అజ్ఞాత చరిత్రలో ప్రధమం అనుకుంటా:P

  రిప్లయితొలగించండి
 28. పొద్దున ఒక అజ్ఞాత తన పేరుని ఇంకో అజ్ఞాత కొట్టేశాడు అన్నట్టా?

  నాకు లాగిన్ అవ్వడానికి బద్దకంవేసి ఇట్టా అజ్ఞాతగా ఎడుతున్నా, కింద నా పేరు రాస్తున్నాలే.

  ..

  Taara

  రిప్లయితొలగించండి
 29. :) మొత్తానికి మంచి వినోదమే ఇచ్చారు అజ్ఞాతా! మీరు నా మిగతా తెలంగాణ వ్యాసాలు కూడా చదివి వ్యాఖ్యలు రాస్తారేమోనని నాకు భయంగా ఉందండి. :)

  "ఏందుకు ఆ0డీ ఇంత దొంగ బతుకు సుటీగా సమాదానం ఈవ్వలెకా( సుజాత, అజ్ఞాత)వారి రుపం లొ సమాదానం ఇస్తున్నరు ?" - ఊరుకోండి సార్! నాది దొంగ బతుకైతే మీది ఏమనుకోవాలి? చచ్చి, దెయ్యమై (తెలంగాణ కోరిక తీరక) బ్లాగులకు వేళ్ళాడుతున్నారని అనుకోవాలా?

  రిప్లయితొలగించండి
 30. హంద్స్లో అంటే Hands లో అని అర్ధమనుకుంటా :-)

  రిప్లయితొలగించండి
 31. "ఎప్పుడెప్పుడు ఎవరెవరికి పదవులు దక్కవో అప్పుటికప్పుడు ఆయా నాయకులు తెవాద ఉద్యమాన్ని చెట్టుమీంచి దించి తెవాద ఉద్యమ నాయకుల అవతారాలెత్తుతున్నారు."

  1952లో తమరి ప్రత్యేకాంధ్ర ఉద్యమం కూడా పదవులు దక్కని నాయకులు చేపట్టినదేనట గదా, నిజమేనా?"

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు