18, సెప్టెంబర్ 2010, శనివారం

వంచన దినం! వంచకుల దినం!!

ఈయేడు సెప్టెంబరు 17 నాడు ఏం చేసుకోవాలో తెలీలేదు మన రాజకీయ నాయకులకు.  పదిహేను రోజుల ముందుదాకా ఒక్కోడు పెద్దపెద్ద కబుర్లు చెప్పారు. వీర తెవాదులు విమోచనమన్నారు. అంత వీరులుకానివారు విలీనమన్నారు. సరే.., కొందరు మూర్ఖవాదులు విద్రోహమన్నారు - వీళ్ళని పక్కన పెట్టెయ్యొచ్చు ప్రస్తుతానికి.  వీళ్ళంతా ఇట్టా పోసుకోలు కబుర్లు చెబుతూ ఉన్నప్పుడు ముస్లిములు అడ్డు చెప్పలేదు, వాగనిచ్చారు. తరవాత ఒక ఇఫ్తారు పార్టీ పెట్టారు. 
వీళ్ళు తమను ముస్లిములు అని పిలుచుకోరు మూవ్‍మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ అనో మరోటో పిలుచుకుంటారు.  రాజకీయ నాయకులు  కొందరు రూమీ టోపీలు పెట్టేసుకుని ఇఫ్తారుకెళ్ళారంట. అక్కడ ఆ ముస్లిములు తమ (అభి)మతాన్ని బైటపెట్టారు.  అంథే...! అప్పటి దాకా ఓ.. థెగ మాట్టాడేసిన పోసుకోలు రాయుళ్ళ నోళ్ళకు తాళాలు పడ్డాయి. నోటమాట రాలేదు.  కొందరు ద్రోహులైతే అసలు పదిహేడో తేదీన  బైటికే రాలేదు.

1948 సెప్టెంబరు 17న  హైదరాబాదు సంస్థానం భారత్ లో విలీనమైపోయింది. నిజాము, రజాకార్ల దుష్కృత్యాల నుంచి ప్రజలు విముక్తులయ్యారు.  ఈ సందర్భాన్ని తెలంగాణ విమోచన దినంగానే ఇన్నాళ్ళుగా జరుపుకుంటూ వస్తున్నారు. ఈయేడు మాత్రం మొత్తం అన్ని పార్టీలవాళ్ళూ మాట మార్చేసి విమోచన దినం కాదు, విలీనదినం అని పేరు మార్చారు - భాజపా,  లోక్ సత్తాలు తప్ప. ప్రభుత్వమే అధికారికంగా విమోచన దినాన్ని జరపాలని డిమాండిన తెరాస ఇప్పుడు గప్ చుప్ ఐపోయింది.

ఇక కేసీయారు సంగతి.. ఈయన  నాయకులందరి తల్లోంచి దూరెళ్ళినవాడు.  దంచుటకైనా, ముంచుటకైనా..  సారు  చాలా పెద్దవారు. గతంలో విమోచన దినమంటూ దంచిన కేసీయారు ఈసారి విలీనదినంగా చేసుకోవాలని మాటమార్చాడు. పాపం, మార్చక ఏం చేస్తాడులే - నిజామంటే భయభక్తులు ఉన్న వాడు, నిజాము కీర్తిగానం చేసేవాడూ గదా!  ముస్లిములు ఇచ్చిన షాకుతో  కేసీయారు మాట మార్చడమే కాదు, అసలు తమ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉత్సవానికి హాజరే కాలేదు.  వంచన ఎరిగిన తన మనసునకు ముంచుట యన్నది సహజమెగా!

తెరాస వారి తోక ఐన తెలంగాణ రాజకీయ జేయేసీ కూడా మాటమార్చేసి ఇది విమోచన కాదు, విలీనమని ప్రకటించింది. ఎందుకు విలీనమో, విమోచనమెందుక్కాదో వివరించి చెప్పేందుకు పాపం కోదండరామ్ కు తలప్రాణం తోకలోకొచ్చింది.  సారు గూడా ఆ ఇఫ్తారు పార్టీలో ఉన్నాడని భోగట్టా!

నవంబరు 1 నాడు రాష్ట్రావతరణ దినోత్సవం కదా!  ఆరోజున వీళ్ళేం చేస్తారో చూడాలి. రాష్ట్రావతరణకు ఏం పేరు పెట్టడానికైనా వీళ్ళు ఎనకాడరు. ఎంత గొడవ చెయ్యడానికైనా తయారు. ’ఆంద్రోళ్ళ’ మీద విషం గక్కడమే కదా వాళ్ళ లక్ష్యం. కోస్తా సీమల ప్రజలను  తిట్టడమే వాళ్ళ ధ్యేయం.  ఇలాంటి అవకాశాన్ని ఎందుకొదులుకుంటారు? ముస్లిముల మనోభావాలంటే బయ్యంగానీ ఆంద్రోళ్ళ మనోభావాలంటే వాళ్ళకేం పట్టింది?

మరో సారుండారు.. వరవరరావు!  వీరు అసలు మాట మాత్రమైనా విమోచన దినం గురించి చెప్పినట్టు లేదు. ముస్లిములకు వ్యతిరేకమైన విషయంపై మాట్టాడ్డమంటే అది దేశద్రోహమే గదా! అంచేత వారు మాటాడ్రు. కానీ రేపు సెప్టెంబరు 24  న అయోధ్య వివాదంపై కోర్టు తీర్పొచ్చాక మాత్రం బైటికొస్తారు.  అయోధ్యలో  మసీదు కట్టించాల్సిందేనని డిసెంబరు 6 న డిమాండేందుకు మాత్రం  నోళ్ళొస్తాయ్, ఉద్యమాలు చేసేందుకు కాళ్ళొస్తాయ్! ఇస్లామిక్ మార్క్సిజమ్  ప్రత్యేకతే అంత మరి!  ముస్లిము మార్కు మార్క్సిస్టుల వ్యవహారశైలే అంత!

 మొత్తమ్మీద విమోచనం , విలీనం అంటూ మాటలు మార్చి వీళ్ళంతా ఆత్మవంచన చేసుకున్నారు, జనాన్ని వంచించారు.

12 కామెంట్‌లు:

 1. [ముస్లిముల మనోభావాలంటే బయ్యంగానీ ఆంద్రోళ్ళ మనోభావాలంటే వాళ్ళకేం పట్టింది] well said .

  ఇలా భాయి భాయి అని పూసుకు తిరిగితేనే కదా అందరు కలిసి దేశాన్ని నాశనం చేయచ్చు . ఈ వరవర్రావ్ గారి లాంటి మార్క్సిజమ్ పేరు చెప్పుకొని నక్షలైట్ లకి పబ్లిక్ పేస్ లాగ వ్యవరించే వాళ్ళంతా ఈ మధ్య హై లో పట్టుబడిన టెర్రరిస్ట్ అనుమానిత జాబితా లోని వాళ్ళకు ఎంత చక్క గా వత్తాసు పలుకుతున్నారో చూస్తూనే ఉన్నాము . ఇదంతా ఒక ప్లాను ప్రకారం జరుగుతుంది ఆయుదాల దగ్గర నుంచి అంతా కొలాబరేషన్ యవ్వారమే . ముందు దేశానికి ఈ సుడో మేతావుల వాళ్ళ పట్టిన చీడ వదిలితే కాని బాగుపడదు .
  ఇక రేపు అయోధ్య తీర్పు రాగానే (హిందువుల అనుకూలం గా వస్తుంది అన్న ఊహాగానం ఎంత వరకు నిజమవుతుందో ) ఒక్కొక్కళ్ళు పుట్టలలోనుంచి పాముల్లాగా బుసలు కొట్టుకుంటూ బయటకు వస్తారు .

  రిప్లయితొలగించండి
 2. ఇక్కడ ఏంటి మా కమ్యూనిష్ట్‌లకి వ్యతిరేకంగా ఏదో కుట్ర జరుగుతున్నది?

  రిప్లయితొలగించండి
 3. భారత స్వాతంత్ర్య సంగ్రామం కోసం కాంగ్రేసు పార్టీ పోరాటం చేసినా, ఆజాద్ హింద్ ఫౌజు చేసినా, ముస్లింలీగు చేసినా భారతీయులు సమర్థించినరు. అలాగే ప్రత్యేక తెలంగాణా కోసం కూడా కేసీయార్ పోరాడినా, విజయశాంతి పోరాడినా, బీజేపీ పోరాడినా, ఆంధ్రా నించి వచ్చిన ఇంకో సెటిలర్ పోరాడినా తెలంగాణా ప్రజలు స్వాగతిస్తరు. అంత మాత్రాన సమర్థించేది ప్రత్యేక తెలంగాణా విషయంలోనే గానీ, వారు వేసే సవాలక్ష వేషాలను కాదు.

  ఇంక కమ్యూనిష్టులంటరా! వాళ్ళ సిద్ధాంతం ప్రకారం జై తెలంగాణా అనాల్నో, జై సమైఖ్యాంధ్ర అనాల్నో వాళ్ళకే అర్థమైతలేదు మరి! కమ్యూనిష్టులైనా సరే, జై తెలంగాణా అంటేనే తెలంగాణలో గిరాకీ ఉంటది మరి!

  రిప్లయితొలగించండి
 4. "మొత్తమ్మీద విమోచనం , విలీనం అంటూ మాటలు మార్చి వీళ్ళంతా ఆత్మవంచన చేసుకున్నారు, జనాన్ని వంచించారు"

  లెస్స పలికితిరి చదువరి!

  రిప్లయితొలగించండి
 5. అలాగే ప్రత్యేక తెలంగాణా కోసం కూడా కేసీయార్ పోరాడినా, విజయశాంతి పోరాడినా, బీజేపీ పోరాడినా, ఆంధ్రా నించి వచ్చిన ఇంకో సెటిలర్ పోరాడినా తెలంగాణా ప్రజలు స్వాగతిస్తరు.
  --------------------------
  MIM వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు చల్ల గా ఊరుకున్నారు ఎందుకోమరి, అదే కోస్తాంధ్ర వాళ్ళు సమైక్యాంధ్ర అంటే మాత్రం తలలు నరికేస్తాం, నాలుకలు కోస్తాం :)

  రిప్లయితొలగించండి
 6. MIM వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు చల్ల గా ఊరుకున్నారు ఎందుకోమరి
  _____________________________________________

  వాళ్ళైతే కోసి చేతిలో పెట్టరూ మరి

  రిప్లయితొలగించండి
 7. మరి ఒక వేళ రేపు తెలంగాణా వస్తే(రాదనుకోండి), మళ్ళీ ఆ ఈ అంటూ సెక్యులర్ అంటూ పూర్తిగా మరో పాకిస్తాన్ గా హైదరాబాద్ ను మార్చడానికి నడుం బిగించారుగా కేసీయార్ గారు. ముస్లిమ్ వాళ్ళు ఇన్నేళ్ళలో బాగా వెన్కబాటుతనానికి గురయ్యారట, అదే భారతదేశంలో ఐక్యం కాకుంటే బాగుపడేవారట, రేపు తెలంగాణా వచ్చాక బాగుపడతారట -- దీనర్థమేమిటో?(రాజ్ న్యూస్ సౌజన్యంతో)
  సరి మరి రేపు మన ఆంధ్రరాష్ట్ర అవతరణను హేళన చెయ్యటానికి నడుం బిగిస్తన్నా వాళ్ళని ఏం చెయ్యాలి?
  ఇవాళ ౪౨% అంటన్న వాళ్ళు రేపు మొత్తం దేశంలో మా జనాభా ౪% అందుకని మాకు ప్రతి ఉద్యోగంలోనూ ౪% రిజర్వేషన్ కల్పించాలని ఆందోళన చేస్తారా?
  అనవసరంగా ప్రజల పన్ను రూపంలో ని ప్రభుత్వ ధనాన్ని మొన్న గ్రూప్-౧ పరీక్షల్ని ఆపటం ద్వారా వృథా చేసారు. ఇంకా ఏమేమి ఉపద్రవాలు చూడాలో -- శ్రీరామచంద్రప్రభో

  రిప్లయితొలగించండి
 8. >> ఇక కేసీయారు సంగతి..

  ఇందులో నకిలీ కణికుల కుట్ర వుంది ;)

  విద్రోహ దినోత్సవానికి ఇటో రోజు & అటో రోజు న్యాయవ్యాధుల తో లొల్లి సేయించి, జనాల్ని మీడియాని ఎర్రి పప్పల్ని సేసాడు.

  ఆ న్యాయవ్యాధులు మొదలెట్టింది 42% & AG removal. అయ్యేమీ లేకుండానే ఇప్పుడు నిమ్మ రసం తాగేశారు!

  గవర్నమెంటు లెక్కల పెకారం ఎట్టాగూ 48% తె. వాళ్ళే వున్నారు. So, rosayya will escape with numbers.

  >> ఆంధ్రా నించి వచ్చిన ఇంకో సెటిలర్ పోరాడినా
  >> తెలంగాణా ప్రజలు స్వాగతిస్తరు

  ఇక మధ్యలో ఎర్రిపప్పలయ్యింది ఆ పైనున్న సీకాంతన్న లాటోల్లు.
  ఈ డ్రామా అంతా తె. కోసం అనుకుని సొక్కాలు సించుకుంటున్నారు.

  రిప్లయితొలగించండి
 9. snkr: నెనరులు.
  Sravya Vattikuti: అందుకే.. వాళ్ళని ఇస్లామిక్ మార్క్సిస్టులు!
  తార: కమ్యూనిస్టుల మీద కుట్రలే..! మైనారిటీ మతస్తుల వ్యవహారాల గురించి మాట్టాడాల్సొచ్చినపుడు కొందరు కమ్యూనిస్టులకు మాట పెగల్దు. అప్పుడు వాళ్ళు మ్యూటిస్టులు. అదే హిందువుల గురించి మాట్టాడమనండి.. వాళ్ళే ఆయుధాలెత్తుకుని దూకుతారు. అప్పుడు వాళ్ళు ఎమ్యూనిష్టులు. ఈ బాపతు శ్రేష్టుల కుట్రలను గుర్తించడానికే మన జీవితం చాలదు. ఇక వాళ్ళమీద కుట్రలేం చేస్తాం!
  శ్రీకాంత్: ఒకమాట చెప్పండి.. తెలంగాణలో పుట్టి, పెరిగి, బతుకుతున్నవాడు తెలంగాణకు చెందిన 42 శాతంలోకి రాడని హైకోర్టు లాయర్లు అంటున్నారు. వాళ్ళు వేస్తున్న ఈ వేషాలను మీరు ఎలా సమర్ధిస్తారు?
  అన్వేషి: నెనరులు
  అజ్ఞాత: "MIM వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినప్పుడు చల్లగా ఊరుకున్నారు ఎందుకోమరి," - ఎమ్మయ్యెమ్ వారసత్వం ఏంటో తెవాదులకు తెలుసు కాబట్టి, వాళ్ళు ఏ వేషాలు వేసినా ఏమీ చెయ్య(లే)రు.
  రహ్మానుద్దీన్ షేక్: అ 42 శాతంలో కూడా తెలంగాణలో పుట్టి పెరిగిన కోస్తా సీమల వాళ్ళ పిల్లలు రారంట - లాయర్లు చెబుతున్నారు. ’లా’ ఒక్కింతయు లేదు సార్.
  Wit Real: "ఇందులో నకిలీ కణికుల కుట్ర వుంది" :)

  రిప్లయితొలగించండి
 10. చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డిలు ముస్లింల వోట్ల కోసం నిజాంని బహిరంగంగా పొగడలేదా? తెలంగాణా విమోచన దినం జరిపితే ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని మొదట వాదించింది వాళ్లే కదా. కెసిఆర్ ని విమర్శిస్తే ఏమి లాభం? ముస్లింలు ఫామిలీ ప్లానింగ్ చెయ్యించుకోవాలని చెపితే ముస్లింల వోట్లు పడవని భయపడే నాయకులు ఉత్తర్ ప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ లలో కూడా ఉన్నారు. మార్క్సిస్టులని విమర్శించడానికి వరవరరావు పేరు తెచ్చారు. వరవరరావుని విమర్శించే ముందు కాంగ్రెస్, తెలుగు దేశం నాయకులలో ఎంత మందికి ముస్లింలు ఫామిలీ ప్లానింగ్ చెయ్యించుకోవాలని చెప్పే ధైర్యం ఉందో ఆలోచించండి.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు