12, మార్చి 2007, సోమవారం

పునరంకితం -మళ్ళీ మళ్ళీ

పునః అంటే మళ్ళీ/తిరిగి అని అర్థం. పునరంకితం అంటే మళ్ళీ అంకితమవడం అని. ప్రజాసేవకై మళ్ళీ, మళ్ళీ పునరంకితం అంటే?

మే 14 న పునరంకిత దినోత్సవం జరపనున్నామని ఈమధ్య ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రకటించాడు. గత ఏడు మేలో ఓసారి పునరంకితమయ్యారు. మళ్ళీ ఇప్పుడవుతారట. మళ్ళీ మళ్ళీ పునరంకితం అవ్వడమేంటి? అదేదో ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలో - బహుశా యమలీలేమో- తనికెళ్ళ భరణి -రౌడీ పాత్ర - కవితలు రాస్తాడు. "చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ" అని రాస్తాడు. చెల్లి పెళ్ళి.. మళ్ళీ మళ్ళీ!! పత్రికా సంపాదకుడైన జెన్నీ కూడా అచ్చు మనలాగే అనుకుంటాడు. కానీ భరణి రౌడీయిజానికి భయపడి పత్రికలో వేసుకుంటాడు. ఆ తరువాత ఆ కవితకు పాఠకుల నుండి విపరీతమైన స్పందన వస్తుంది కూడా! ఇప్పుడు ప్రజాసేవకు కాంగ్రెసు పార్టీ మళ్ళీ మళ్ళీ పునరంకితమవడం చూస్తుంటే చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఉంది.

నిరుటి పునరంకిత జాతర సమయాన నేను రాసిన జాబులో తిరిగి పునరంకిత జాతర ఎన్నికల ఏడాది జరగొచ్చని ఊహ పోయాను. అది అపోహ మాత్రమేనని తేలింది. ప్రతి ఏడూ జరుగుతుందన్నమాట!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు