గవర్నరు గారూ,
ఏనాడూ జరగని సంఘటనలు సభలోనూ బయటా జరిగాయి. ఒక శాసనసభ్యుడికే రక్షణ లేకుండా పోయింది. ప్రజాస్వామ్యమంటే నచ్చని కొందరి కారణంగా ఇవ్వాళ స్వేచ్ఛకు విఘాతం ఏర్పడింది. స్వేచ్ఛగా తన అభిప్రాయాలను వెల్లడించే ఒక గౌరవనీయ సభ్యునికి, తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తికి అవమానం జరిగింది. ’మేము చెప్పినదే నిజం, మేము చెప్పేదే అందరూ వినాలి, అవతలి పక్షం మాటలను వినం, విననివ్వం, అసలు అవతలి వారిని మాట్టాడనివ్వం’ అనే ధోరణి గల నియంతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.
17, ఫిబ్రవరి 2011, గురువారం
శాసనసభ వద్ద రౌడీలు
శాసనసభలో తెలంగాణ ఎమ్మెల్యేలు గొడవచేసి సభ వాయిదా పడేలా చేసారు. తరవాత సభనుంచి బయటికి వచ్చిన జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్టాడాక వెళ్తూండగా తెరాస ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎవరో ఆయన మీద దాడి చేసి తలపై కొట్టారు. టీవీ9 లో ఇది స్పష్టంగా కనబడింది. అయితే చెయ్యి కనబడింది గానీ, అది ఎవరిదో కనబడలేదు. చెయ్యి మాత్రం అక్కడ కెమెరాలు పట్టుకున్న జనాల గుంపులోనుండి వచ్చింది.
28, జనవరి 2011, శుక్రవారం
కలియుగంలో శూర్పణఖ
[ఈ టపా రాయడానికి ప్రేరణ ఇది: http://www.youtube.com/watch?v=JlMUlgWsd7w&feature=player_embedded]
త్రేతాయుగం! ముక్కూ చెవులూ కోయించుకున్నాక, శూర్పణఖ నెత్తురోడుతూ అన్న దగ్గరికి వెళ్ళి చెప్పుకుని ఏడవడం, సీతాపహరణం, రావణవధ, శ్రీరామ పట్టాభిషేకం.. ఇవన్నీ మనందరికీ తెలిసినవే!. అయితే ముక్కుచెవులూ కోయించుకున్న శూర్పణఖ గతి ఆ తరవాత ఏమైందో మనం పట్టించుకోలేదు. ఏమైందో చూద్దాం..

20, జనవరి 2011, గురువారం
అధిష్ఠానం కేళి - కాంగీయుల కథాకళి
అసలు సంగతి కెళ్ళేముందు..
మన ప్రధానమంత్రి గారు ఇవ్వాళ కొన్ని రత్నాల్లాంటి మాటలు చెప్పాడు. వాటి సంగతి చూద్దాం.
1. తెలంగాణ సంగతి ఎప్పుడు తేలుస్తారు అని అడిగితే "సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం" అని చెప్పాడు. సరైన సమయమంటే మళ్ళీ మేడమ్మ పుట్టినరోజు రావాలి కాబోలు. ("సరైన సమయంలో సరైన నిర్ణయం" కోసం గూగిలించి చూస్తే.. 2490 ఫలితాలొచ్చాయి.)

లై బోలో తెలంగాణ
మనకు శంకరనే ఒక దర్శకుడున్నాడంట. దర్శకుడు శంకరంటే 'జంటిల్మెన్' శంకరనే అనుకుంటూండేవాణ్ణి నేను. కానీ ఇతడు ఆ తమిళ శంకరు కాదనీ.. తెలుగు శంకరేనని తరవాత తెలిసింది. అయితే అతడు తనను తెలంగాణ శంకరని పిలుచుకుంటన్నాడు. ఇదివరకు పెద్దగా కనబడేవాడు కాదుగానీ, ఈమధ్య మాత్రం హఠాత్తుగా ఎక్కడబడితే అక్కడ తెగ కనబడిపోతున్నాడు, వినబడిపోతున్నాడు.ఔను మరి ఇది తెలంగాణ సీజను కదా!
8, జనవరి 2011, శనివారం
’చదువరి’ పత్రికలో వచ్చిన కొన్ని వార్తాశీర్షికలు
’చదువరి’ పత్రికలో ఇప్పుడు/రాబోయే పదేళ్ళలో వచ్చే వార్తల శీర్షికలివి. అవధరించండి.
"మరో నెల రోజుల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుండి హైదరాబాదు రాక"
"ఉద్యమం కోసం ఇంకా ఎవరూ ప్రాణత్యాగం చేసుకోలేదు. కాబట్టి ఎవరూ చేసుకోకండి - జాక్ ది రిప్పర్"
"మీ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే తెలంగాణ సాధిస్తాం -ఉస్మానియాలో ఇంకో జాక్"

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..