కానీ ఇప్పుడు.. రాజ్య పౌరులే అంటున్నారు. మన్నికైన వారని ఎన్నిక చేసి తెచ్చుకున్న వారే అంటున్నారీ మాటలు. ఇవిగాదు, వీటి తాతల్లాంటి మాటలన్నారు.
- "అదో విషవృక్షం" అని అన్నాడు పరకాల ప్రభాకర్. ఇంతవరకూ ప్రత్యర్థి పార్టీలు కూడా అనలేదింత మాట. టిక్కెట్టులమ్ముకున్నారనే మాట నిజమే అన్నట్టుగా కూడా మాట్లాడాడు. చిరంజీవికి ఈ సంగతులు తెలుసా అని అడిగాడో విలేకరి. తెలీదని ఒక్కరిని చెప్పమనండి అని అన్నాడు ప్రభాకర్.
- "మిగతా పార్టీలకూ ప్రజారాజ్యానికీ తేడా లేద"ని తేల్చేసాడు ఆంజనేయరెడ్డి.
- సమరం కూడా దాదాపు ఇలాంటి మాటే ఏదో అన్నాడు. కార్యకర్తలకు గుర్తింపు లేదని చెప్పేసాడు. (టిక్కెట్టు రానివాళ్ళ బాధ ఇలాగే ఉంటుంది. ఏ పార్టీవాడైనా సరే, కార్యకర్తలకు గుర్తింపు లేదు అని అన్నాడంటే తనకు టిక్కెట్టు రాలేదని ఏడుస్తున్నాడన్నమాటే! పాపం కొంతమంది మాత్రం సూటిగానే చెప్పేస్తారు) చిరంజీవి సేవా సంస్థ నుండి కూడా రాజీనామా చేసాడీయన.
అల్లు అరవిందు ఏమన్నాడూ..
అరవిందుకు బాగా కోపం వచ్చినట్టే ఉంది. కోపం అతడిముఖంలో కనబడింది. మాటల్లో కనబడింది. అతడి నవ్వులోనూ కనబడింది. ప్రభాకర్ గట్టిదెబ్బే కొట్టాడు. విషవృక్షం అనేది చిన్నమాట కాదు. అంచేతే అరవిందు విరుచుకుపడ్డాడు, పరకాల మీద. పరకాలను తిట్టడం ఒక్కటే కాదు, తన నిర్దోషిత్వాన్నీ, తన నైతికతనూ, పార్టీ పట్ల - అనగా చిరంజీవి పట్ల - తన నిబద్ధతను నిరూపించుకునే ప్రయత్నం చేసాడు. చాలా చాకచక్యంగా పరకాల తిట్టిన తిట్లన్నిటినీ చిరంజీవి మీదకే -అన్యాపదేశంగానే - మళ్ళించాడు. పరకాల చిరంజీవిని అనలేదని కాదు, అన్నాడు. కానీ చిరంజీవితో పాటు అందరినీ అన్నాడు.
అరవిందు ఇలా అన్నాడు:
చిరంజీవి మీదకు గురి పెట్టిన తూటా, ముందు నా గుండెల్లోంచి దూసుకుపోవాలి లాంటి, సినిమా డైలాగు లాంటిదేదో చెప్పాడు. ఇంకోమాట అన్నాడు.. స్వయంగా చిరంజీవిగారు అంటే తప్ప, ఇక ఎవరు ఏమన్నా నేను పట్టించుకోను. అనీ అన్నాడు. ఈ ముక్క మాత్రం, ఈ మధ్య తనమీద వస్తున్న ఆరోపణలన్నిటికీ కలిపి సమాధానం చెబుతున్నట్టు ఉంది.
ఈ ముక్కలు చెప్పి, రెండు ప్రయోజనాలు సాధించజూసాడు.
- పరకాల ఏకంగా చిరంజీవినే తిడుతున్నాడు. ఎంత ఘోరమో, ఎంత అన్యాయమో చూడండి అని చెప్పడం. చిరంజీవి తప్పు చెయ్యడు, ఆరోపణలకు అతీతుడు అనుకునే కొందరికి ఇది చెవుల్లో బడి, గుండె కలుక్కుమంటుందని అరవిందుకు తెలుసు. వాళ్ళ కోపాన్ని ప్రభాకరు మీదకు గురిపెడుతున్నాడు.
- ఇది చాలా ముఖ్యం.. నేను చిరంజీవి కోసం పని చేస్తున్నాను. నేను ఆయన అనుచరుణ్ణి. నేను చేసే పనులు ఆయనకూ తెలుసు. నేను చేసే పనులకు చిరంజీవి ఆశీస్సులున్నాయి అని చెప్పడం.
ఇంకా..
పరకాల నర్సాపురం (నర్సపూర్ అంట దానిపేరు!) టిక్కెట్టు ఆశించాడు, ఇస్తే ఆయనేమో గెలవలేడు, అందుకే ఇవ్వలేదు. ఆశాభంగం చెంది, ఇప్పుడు బయటికి పోతున్నాడు అని అన్నాడు.
నన్ను కూడా కోవర్టు అని అంటారు చూడండి అని పరకాల చెప్పాడు. అరవిందు అమాట అననే అన్నాడు. (ఈ కోవర్టును కలవడం కోసం అతడి ఇంటికి ఎందుకు వెళ్ళినట్టో?)
ఇంకా కొంతమంది కోవర్టులున్నారు అని గతంలో ప్రకటించి, బయటకు వెళ్ళబోయే వాళ్ళ ముందరి కాళ్ళకు బంధాలు వెయ్యబూనింది ఆ పార్టీ. కానీ ఆ బంధాలేవీ ఆపలేకపోతున్నాయి వెళ్ళేవాళ్ళను. ఆ మధ్య అభిమాన సంఘాల నాయకులు కూడా కొంతమంది వెళ్ళిపోయారంట.
ఎంచేతో ఆంజనేయరెడ్డి గురించి మాత్రం అరవిందు మంచిగానే చెప్పాడు..
ఆంజనేయరెడ్డి అలా కాదు, ఆయన టిక్కెట్టేమీ ఆశించలేదు. ప్రత్యేకమైన ఒక పని చేసేందుకు వచ్చారు, ఆ పని పూర్తి చేసారు. ఆ సంతృప్తితో తప్పుకున్నారు అని చెప్పాడు. అదేంటి, మిగతా పార్టీలకూ ప్రరాపాకూ తేడా లేదని తెగేసి చెప్పేసాడు గదా అని విలేకరులడిగితే. "ఓ అలాగన్నారా? నాకు తెలీదులెండి" అని చెప్పాడు అరవిందు. క్యామిడీ!!
ఇంకో చిత్రమేంటంటే, పరకాల గెలవడని టిక్కెట్టు ఇవ్వలేదు అని అరవిందు అంటే, ఉపేంద్రేమో పరకాల ఆ సీటుకు తగినవాడే, కానీ సామాజిక సమీకరణాలు కుదరక ఇవ్వలేకపోయాం అని అన్నాడంట.
----------------
ప్రజారాజ్యానికీ మిగతా పార్టీలకూ తేడా ఏమీ లేదు. మిగతా పార్టీలన్నిటికీ ఉండే అవలక్షణాలు అన్నీ ఈ పార్టీకి ఉన్నాయి. అవినీతి, దొంగ మాటలు చెప్పడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. మిగతావాటికి లేనిదీ దీనికి ఉన్నదీ ఒకటుంది.. బలహీనమైన, అసమర్థ నాయకత్వం.
చిరంజీవికి విగ్రహం పుష్టి ఉందంతే! సినిమా హీరోగా తాను సంపాదించుకున్న అపారమైన అభిమానం ఒక్కటే అతడి సానుకూలత. నాయకత్వ పటిమ లేదు. ప్రజారాజ్యంపై గల అంచనాల్లో ఇప్పటికే తేడాలు కనబడుతున్నాయి. కింగు అవుతాడన్నవారు, కాస్త తగ్గి, కింగు మేకరవుతాడంటున్నారు. కింగయితే పరవాలేదు.. కింగుమేకరే గనక అయితే, ఐదేళ్ళ పాటు, తన నాయకత్వాన్ని కాపాడుకోవడం చిరంజీవి వల్ల అవుతుందని నేను అనుకోను. ఎందుకంటే, రాజకీయం అంటే సినిమా నటన అంత వీజీ కాదు. సినీ అభిమానులు నటుణ్ణి హీరో చేస్తారు, హీరోని దేవుడు గానూ చూ(చే)స్తారు. దేవుడు దేవుడుగానే ఉండాలి, తాను అభిమానిగానే ఉండాలి అనుకుంటాడు, సగటు అభిమాని. చిరంజీవిని వదిలేసి, మరో హీరోకి అభిమానిగా మారడు. కాబట్టి హీరో ఏంచేసినా చెల్లుతుంది, అసలేం చెయ్యకపోయినా కూడా చెల్లుతుంది. కానీ రాజకీయాల్లో అలాక్కాదు.. సరుకున్నవాడే నాయకుడు అవుతాడు. నాయకత్వం చూపిస్తేనే అనుచరులు వెంట ఉంటారు. లేకపోతే మరో నాయకుడికి జై అంటారు. ఈ మధ్య ప్రరాపాను వదిలేసి, కాంగ్రెసులో చేరిపోయిన వీరాభిమాని దీనికో ఉదాహరణ. పైగా ప్రతీవాడూ నాయకుడు కావాలనుకుంటాడు.
బ్లాగుల్లోనే ఎక్కడో చదివాను.. అల్లు అరవిందు అమర్‌సింగు లాగా కనిపిస్తున్నాడేంటీ అని. భలే చక్కగా చెప్పారాయన. పనితీరులో ఇద్దరికీ దగ్గరి పోలికలున్నాయి.కానీ చిరంజీవికీ ములాయంకూ పోలికలున్నాయా?
ఇది వెరె బ్లాగు లొ రాసిన కామెంటు.. మీకు వర్తిస్తుంది. -----
రిప్లయితొలగించండిమీడియా దుమారం గురించి.. మీకు నిజంగా 294 మంది అభ్యర్ధుల ఫైనాన్షియల్ పొసిషన్ తెలుసా ? డబ్బులు ఇచ్చె అంతమంది బి సి లు, యసి లు , మైనారిటి లు టికెట్ట్లు కొనుకున్నరా ? ఈ లెక్కలు రాసిన వాడికి బుర్ర వుంటె అర్థం అవుతుంది. మునెమ్మ కి ఎం డబ్బు వుంది ఖర్చుపెట్టడనికి. ? ఆమెకు పార్టి ఫండ్ కాదా ఇవ్వాలి. పార్టి ఫండ్ అంటె చిరు సొంత డబ్బు ఇవ్వాలా ? టికెట్ పది కొట్లకి అమ్మునున్న కె సి అర్ , పొత్తు కి 200 కొట్లు ఇచ్చిన చంద్రబాబు, కొట్లు కి కొట్లు అంధ్ర డబ్బు డిల్లి లొ పొసె వై స్ వీళ్ళు ఎవరు మీడియా కు ఎక్కువ కాలం గుర్తు వుండరు. కాంగ్రెస్ పార్టి ఫండ్ ఎన్ని కొట్లొ తెలుసా ? NTR ట్రస్టు బాంక్ బెలెన్స్ మీకు తెలుసా? ఈ డబ్బులు దార్లొ దొరికాయా లెక చంద్రబాబు సొంత డబ్బు నా ?.. చిరు కి లెనిదల్లా సొంత పత్రిక లెక సొంత చానల్ మరియు రాజకీయ అనుభవం. చంద్రబాబు, వై స్ యెంత గుండెలు తీసిన బంటు లొ అంచనా వెయ్యక పొవడం. తెలుగు దెశం నుండి ఇంత మంది బయటకు వచినప్పుడు లెని హడవుడి ఇప్పుడు పి అర్ పి నుండి ఒక నలుగురు వెళ్ళగానే ఇంక పి ర్ పి పని అయిపొయిందన్నట్టు , రాస్ట్రం అందరూ చిరు ని హెట్ చెస్తున్నట్టు మీలాంటి వాళ్ళ కేంపైన్ ఒకవైపు.
@మంచు పల్లకీ ,
రిప్లయితొలగించండిచిరు కి లెనిదల్లా సొంత పత్రిక లెక సొంత చానల్ మరియు రాజకీయ అనుభవం. చంద్రబాబు, వై స్ యెంత గుండెలు తీసిన బంటు లొ అంచనా వెయ్యక పొవడం."
who told chiru does not have media support ? are u watching MAA TV?MAA news became "Prajarajayam News" and MAA Prantiya Vaartalu became "Prajarajyam Prantiya Vaartalu".. every one knows Chiru has partner ship in MAA.
For rest of your comment- You are comparing PRP to Congress and TDP. that means you are agreed that PRP is no difference than TDP and Congress..
వారం రోజుల్లో ఎన్నికలు పెట్టుకుని - మిగతా పార్టీలు ప్రచారంలో దూసుకుపోతుంటే పాపం చిరంజీవి, అరవింద్ విలేకర్ల సమావేశాలు పెట్టుకుని ఆరోపణలకి బదులిచ్చుకుంటూ గడుపుతున్నట్లున్నారు. ఇలాగైతే కష్టమే. ఇంతకీ ప్రరాపా తురుపు ముక్క, ఫైర్ బ్రాండ్ అంటున్న పవన్ కల్యాణ్ జాడేదీ? నాగబాబెక్కడికి పోయాడు??
రిప్లయితొలగించండిHonestly I don't see much difference between all these three parties. However what I don't like is media over (re)action on ANY chiru issues. If any filthy person (i mean this) abuses Chiru or his family, thats a news. If anyone from Chiru party reacts to that its a BIG news. If Chiru apologies for that - its a small news. When other party leaders don't even condemn thier party members filty and abusive languages and personal remarks - no one will see any thing wrong.
రిప్లయితొలగించండిYou may see Loksatta as clean party at this point of time. Why you dont see any of these issues in Loksatta because who is other leader in Loksatta. (As a great leader, JP could not make/support any other leader in Loksatta - thats seperate discussion)
Just imagine PRP has only one leader that is Chiru and no arvind, no Radha, no Bhuma, no shobharani, Do you think any of these comments come on Chiru ? I don't think so.
I support PRP among the all other leading parties (Congress, TDP, TRS and PRP). I believe PRP is not the ideal party. What I feel is PRP is a better alternative for TDP and Congress for this term.
All I hate is this biased media and hypocrotical comments.
అతి ఉత్సాహానికి పోయి పార్టీలో బోలెడు మంది చేరితే ఎంత మందికి టికెట్లు ఇవ్వగలరు? ఇందులో పరకాల ప్రభాకర్ తప్పు కూడా ఉంది, మైసూరా రెడ్డి లాగ కేవలం టికెట్ కోసం రాజీనామా చేసేయ్యడం.
రిప్లయితొలగించండిమొత్తం మీద నవ్వు తెప్పించిన మాట "నర్సపూర్ అంట దాని పేరు"
రిప్లయితొలగించండిపుట్టిందేమో పాలకొల్లు లో!
"కార్యకర్తలని నిర్లక్ష్యం చేస్తున్నారు,including me.." సమరం గారి డైలాగు ఇది.అంటే ఈయన something special అన్నమాట. వాళ్ళ కుటుంబానికి ఉన్న సామాజిక సేవా నేపథ్యం రీత్యా ఆయన నిజంగా ప్రజాసేవో, ప్రక్షాళనో చేయాలనుకుంటే చేరాల్సిన పార్టీ ఏదో ఆయనకు తెలీదా?
ఇదంతా కుదిరే పని కాదని ఎప్పుడో అనుకునారు జనం!
అసలు ప్రజారాజ్యం నుంచి చిరంజీవి రాజీనామా చేసి మహాకూటమిలోనో, కాంగ్రెస్ లోనో చేరితే సరి..దెబ్బకు అంతా సర్దుకుంటుంది.:)))
సుజాతగారూ, హహ్హహ్హ :)
రిప్లయితొలగించండిప్రజారాజ్యం విశ్వసనీయత మొదట్నుంచి అనుమానాస్పదంగా ఉంది. ఈరోజున బయటికి వెళుతున్నవారంతా ఒకేరకమైన ఆరోపణలు చేస్తున్నారంటే ...? వారిలో అందరూ నమ్మదగినవారని కాదు. కానీ మొదట్నుంచి అంటిపెట్టుకుని ఉన్న పరకాల, ఆంజనేయరెడ్డి లాంటివారు కూడా అవే ఆరోపణలు చేశారంటే... ?
రిప్లయితొలగించండిచిరంజీవి మరో ఎన్.టీ.ఆర్ అనుకునేవాళ్ళు పునరాలోచించాలి. ఈయన ఒక కులనాయకుడుగా మిగిలిపోతాడేనని కొంతమంది అభిమానులు భయపడుతున్నారు. కానీ కుటుంబనాయకుడుగా మిగిలిపోతాడేమోనని నేను భయపడుతున్నాను.
అరవింద్ అన్న ఇంకోమాట: ప్రభాకర్ మీద చాలా కేసులున్నాయట. అది నిజమైతే ప్రారంభం నుంచే ఇలాంటి బడా నేరస్థులను చేర్చుకుని ఏం మార్పు తేవాలనుకున్నారో వారికే తెలియాలి.
రిప్లయితొలగించండిదీని ద్వారా "సామాజిక న్యాయం" అంటే "స్పష్టత" వచ్చింది :)
రిప్లయితొలగించండిసామాజిక న్యాయం అంటే: bc లకి 104 sc/st ??(గుర్తులేదు) జనరల్ కి 5 సీట్లు ఇవ్వడం + ట ;)
కేవలం ప్రజారాజ్యంని విమర్శిస్తే సరిపోదు. కేవలం టికెట్ల కోసం పార్టీలో చేరి రాజీనామాలు చేసేవాళ్ళు తెలుగు దేశం, కాంగ్రెస్, టి.ఆర్.ఎస్.లలో కూడా ఉన్నారు. ప్రజారాజ్యం నాయకులలో ఎక్కువ మంది తెలుగు దేశం, కాంగ్రెస్ ల నుంచి వచ్చిన వాళ్ళే. మా జిల్లాలో ఒక లోక్ సత్తా నాయకురాలు లోక్ సత్తాకి రాజీనామా చేసి ప్రజారాజ్యంలో చేరింది. ప్రజారాజ్యం నాయకుడు ఇంకొకడు లోక్ సత్తాలో చేరాడు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకునేవాళ్ళు అన్ని పార్టీలలో ఉన్నారు.
రిప్లయితొలగించండిపరకాల ప్రబాకర్ ఒక జంపు జిలాని . కాంగ్రెస్ తరుపున రెండు సార్లు పోటీ చేసి ఓడాడు. బీజేపీ తరుపునా నరసాపురం పోటీ చేసి ఓడాడు .ఉబయగోదావరి యమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడాడు. ఇప్పుడు ప్రజారాజ్యం టిక్కెట్ ఆశించి అది రాక ఆరోపణలు చేస్తున్నాడు . ఇలాంటి వారి మాటలు పట్టించుకోనక్కర్లేదు. మీడియా అనవసరంగా ఇలాంటి వారికి ప్రాదాన్యం ఇస్తుంది,ప్రజా సమస్యలపై మానేసి.
రిప్లయితొలగించండితాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు మీరు బాగా చెప్పారు "ఈయన ఒక కులనాయకుడుగా మిగిలిపోతాడేనని కొంతమంది అభిమానులు భయపడుతున్నారు. కానీ కుటుంబనాయకుడుగా మిగిలిపోతాడేమోనని నేను భయపడుతున్నాను"
రిప్లయితొలగించండిసుజాత గారు అన్నట్టూ ఈ గోలంతా చూస్తే చిరంజీవి పి ఆర్ పి వదిలి ఏ మహాకూటమిలోనో, కాంగ్రెస్ లోనో చేరితే సరి!
నాకు తెలిసినంత వరకూ ఈ పార్టీ కి ముఖ్య సలహదారులు "పరకాల" మరియు "ఆంజనేయ రెడ్డి ".. ఇలాంటి మేధావి వర్గమే అడుగు బయటపెట్టాక ఇక పార్టి కి మిగిలింది కుళ్ళు రాజకీయలే(అరవింద్).
పరకాల లాంటి ఒక విశ్లెషకుడే పార్టీని "అదో విషవృక్షం" అని అన్నాడు అంటే , దీని ప్రభావం ప్రజలపై ఎక్కువే ఉంటుంది.
ఏదైతేనేం మొత్తానికి "ప్రజారాజ్యాం" మరొక "కుటుంబ పార్టీ" గా మిగిలిపోక తప్పేలా లేదు.
@ Manchu Pallaki
రిప్లయితొలగించండి"మీకు నిజంగా 294 మంది అభ్యర్ధుల ఫైనాన్షియల్ పొసిషన్ తెలుసా ? డబ్బులు ఇచ్చె అంతమంది బి సి లు, యసి లు , మైనారిటి లు టికెట్ట్లు కొనుకున్నరా"
అంటే మిగతా సీట్లు అమ్ముకున్నారా ?
@టికెట్ పది కొట్లకి అమ్మునున్న కె సి అర్ , పొత్తు కి 200 కొట్లు ఇచ్చిన చంద్రబాబు, కొట్లు కి కొట్లు అంధ్ర డబ్బు డిల్లి లొ పొసె వై స్ వీళ్ళు ఎవరు మీడియా కు ఎక్కువ కాలం గుర్తు వుండరు. కాంగ్రెస్ పార్టి ఫండ్ ఎన్ని కొట్లొ తెలుసా ? NTR ట్రస్టు బాంక్ బెలెన్స్ మీకు తెలుసా? ఈ డబ్బులు దార్లొ దొరికాయా లెక చంద్రబాబు సొంత డబ్బు నా ?
రాజకీయాల్లో సాధారణం గా ఉండే ఎదురు దాడి సిద్దాంతం ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు . ఇక్కడ మార్పు తెస్తాం అని చెప్పిన ప్రజారాజ్యం గురించి మాత్రమే చర్చ.
ఇంత జరిగినా చిరంజీవి నోరెందుకు విప్పడం లేదు ... అంట గుట్టు ఎందుకు వాళ్ళకి.
మీరు వ్రాసిన అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను. త్రివిక్రం గారు రాసినట్లుగా పరకాల మీద ఎన్నెన్నో కేసులు ఉండగా ఏం చేద్దామని ఆయనకు అగ్ర తాంబూలం ఇచ్చారుట? అన్ని పార్టీలలోనూ ఇలాంటివి మామూలే కదా, ప్రజలూ అలవాటు పడిపోయారు,అనవసరంగా మనం ఏదో ఉద్ధరించడం ఎందుకూ అనుకొన్నట్లుగా ఉంది. పరకాలేమో ప్ర.రా. పార్టి విషవృక్షం అన్నాడు. అరవిందేమో ఈ యన మీద కేసులు చాలా ఉన్నాయి అన్నాడు.అన్నింటికంటే కామెడీ ఏమిటంటే తన రాజీనామా ని, పార్టీ ని తిట్టడం కూడా ప్ర.రా. పార్టీ వేదిక మీదనుంచి చెయ్యడం. అప్పుడు రాజశేఖర్ ఏదో అన్నాడని కొట్టించారని అన్నారు. ఇప్పుడు ఈయన గతి ఏమిటంటారు? జెడ్ కాటిగరీ సెక్యూరిటీ అడుగుతారా?
రిప్లయితొలగించండిఅరవిందుడిని అమర సింగుతొ పోల్చింది నేనే.
రిప్లయితొలగించండిఇంకో మాట కూడా అన్నాను.
అరవింద్ మరొ లక్ష్మీ పార్వతిలా కాకుండా చూసుకోవాలని.
ఇవి నేను పబ్లిక్ లో విన్న మాటలు.
మూడు పార్టీలు,
మూడు కుటుంబాలు,
మూడు కులాలు.
ఇదేనా రాజకీయం?
రాష్ట్ర ఓటరులారా ఆలోచించండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచిరంజివి పరిస్థితి ఇలా ఉంట్టే మరి దలిత మేధావులు,తాత్వికులు ఎక్కడకి పొయారు, మంచి సలహాలు ఇవ్వకుండా ? పరిస్థితిని చక్కదిద్ద కుండా?.పుంకాను పుంకాల పుస్తకాలు రాయడం కాదు, ఓట్లుమావి సీట్లు మీవా? అని అవసరమొస్తె ఆదుకునే వాడు ఎవ్వరు కనపడుటం లేదు. చిరంజివి కి కష్టమొస్తె సీనులో ఒక్కరు కూడ కనిపించటం లేదు. మరి దీనిని వర్గ/ కుల పోరాటాల దృక్పదం లో నుంచి ఎలా చూడాలి అని అనాలిసిస్ మొదలు పెట్టి ఉంటాడు ఉస్మానియా ఆచార్యుడు. మన మార్తండ నయం కనీసం పరిస్థిని గమనించి బ్లొగ్ లో వ్యాక్యలు అన్నా రాశాడు. మిగతా వారు ఇంకొక పుస్తకం రాసి అమ్ముకొనే పని లొ నిమగ్న మైనట్టూన్నారు. ఎమైతే నేమి దలిత పేపర్ మేధావులు ,( ఆంధ్రజ్యొతి పపెర్ ఎదితొరీల్ ) రచైతలు 10-15 సం|| ల నుంచి కలలు కన్న సామజిక న్యాయము మాటెమిటి? అవి కల్లలేనా? కలచెదిరింది కథ మారింది అని పాడు కోవడమేనా? బి.సి.కృష్నయ్య ఎక్కడ, మంద కృష్న ఎక్కడ? ఎక్కడ ఎక్కడ వీరంతా ఎలెక్షన్ ల ముందు ఒక్కరు కూడా టి.వి. లో కూడా కనపడటం లేదు.
రిప్లయితొలగించండిరాజకీయాలా లో డబ్బు సంపాదించేవారిని చూసి, డబ్బు తో రాజకీయ రథచక్రాన్ని నడపవచ్చు అని విని, పేపర్ల లో చదివి, రాజకీయాలు డబ్బు తో మాత్రమే నడుస్తాయి అని నమ్మి భవిషత్ లొ రాజకీయా పార్టి పెట్టెవారికి దానికి వాదాల (సామాజిక న్యాయం లాంటి ) ముసుగు వేసెవారికి ప్రజారాజ్యం పార్టి త్వరలో ఒక ఉదాహరణ గా మిగిలి పోతుంది. ప్రేమించిన అమ్మాయి తో పెళ్ళి కాక పొతె విరహ గీతాలు పాడుకునె వారిలా ఇక నుంచి దలిత, సామజిక న్యాయ మేధావులు రాజ్యాధికారం గురించి కలలను పుస్తకాలు, బ్లాగులు రాసు కోవలసిందే .నాకు ప్రజారాజ్యం వచ్చిన అవకాశాన్ని జార విడుచు కునంట్లు అని పిస్తున్నాది. ఎప్పుడు ఎంతొ ఉత్సాహం గా ఉండె చిరంజివిని టి.వి. లో చూస్తె చాల బాధ వెసింది. అతని ముఖం నల్లబడి నిద్ర లేక, మిత్రా గారు షెక్ హాండ్ ఇస్తే నేను మరో షాక్ ఎమొనని అనుకున్నాను అని అన్నాడు. నాకు తెలిసి చిరంజివి లాగా యువతని ఎంటెర్ టైన్ చేసిన హీరొ ఎవ్వరు లేరు. ఎట్ట ఉండెవాడు ఇప్పుడు ఇట్ట అయ్యాడు రేపు మరి ఎట్టూంటాడో.
మంచు పల్లకి గారు,
రిప్లయితొలగించండిమీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
సివ గారు,
"జంపు జిలాని" పదం భలే నవ్వు తెప్పించింది.
ఈ అంశానికి సంబందించిన ఈ క్రింది టపా కి....,
రిప్లయితొలగించండిhttp://a2zdreams.wordpress.com/2009/04/10/%E0%B0%85%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%85%E0%B0%B0%E0%B0%B5%E0%B0%BF%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%82/
...., నా వ్యాఖ్య..!
"ఇంకేమన్నా కాదూ…, పచ్చి అవకాశవాదం, అపరిపక్వత తప్ప మరొకటి కనపడటంలేదు బామ్మర్ది మాటల్లో..!
నైతిక విలువ్వల్లేవని ఈరోజే తెలిసిందా..!? (ఇద్దరికీ.., అల్లు కీ పరకాలకూ) (ఇద్దరూ ఎప్పటి నుంచో స్నేహితులట..!)
ఓడిపోతాడని టికెట్ ఇవ్వలేదట ( ఇప్పుడు టికెట్ ఇచ్చిన వాళ్ళందరూ గెలుస్తారా..!? పోనీ తను పోటీ చేసే చోట గెలుస్తాడా..!?)
తన దగ్గర డబ్బుంది కాబట్టి గెలుస్తానని అతి విశ్వాసమా..!?
ఓడిపోతాడు అని కనిపెట్టిన వారు, మన బంగారానికి (మార్పు, చిరు, సామాజిక న్యాయం) మెరుపు లేదని పరోక్షంగా అంగీకరించినట్లే కదా..!!
ఇంతకుముందు రెండు సార్లు ఓడిపోతే పోటీ చేయటానికి అనర్హుడా..!?
ఎంత దుర్మార్గమయిన ఆరోపణ..!!
మరి అటువంటి వ్యక్తిని, పార్టీ లోకి తీసుకురావటం ఆ తర్వాత ఇంటి ముందు గంటల తరబడి ఎదురుచూపులు ఎందుకో…!!?
కుళ్ళిన చేపల కంపు..!! ( ఎండిన చేపల కంపు కాదు) ఎక్కడ నుంచో మరి..!?"
ఇంకొక కామెడీ statement పర్వతనేని ఉపేంద్ర గారి నుంచి..,
రిప్లయితొలగించండి"80 శాతం సీట్లు సబబు గానే ఇచ్చారు."
...!!??
ప్రతి సీటుకూ 5 కోట్ల చొప్పున 200 సీట్లు అమ్ముకొని ఆ తరువాత ఎన్ని సీట్లొచ్చినా వాటి ఆధారంగా ఎవరికో ఒకరిక్లి మద్దతిచ్చి మినిస్ట్రీ పట్టేసి డబ్బులు చేసుకోవడం. ఎన్ని సినిమాలు తీస్తే,చేస్తే ఇంత డబ్బు ఈ లేటు వయసులో వస్తుంది? చిరంజీవి -అరవింద్ ల తెలివికి జిందాబాద్. మన మూర్ఖత్వానికి జిందాబాద్.
రిప్లయితొలగించండికత్తి మహేష్ గారు, సవరణ! ప్రతి సీటూ ఐదు కోట్ల చొప్పున అమ్ముకుని....ఇంత అభాండం నేనొప్పుకోను. మా నియోజకవర్గ అభ్యర్థి బం.ర. మూడుకోట్లేనట ఇచ్చింది.
రిప్లయితొలగించండిప్రజారాజ్యానికీ, ఇతర పార్టీలకు పెద్ద తేడా లేదని తేలిపోయింది. ఎంతో మంది ఆశలను, కలలను మోసుకొచ్చిన మెగాస్టార్ రాజకీయ రైలుబండి, తన కొన్ని సినిమాలకు మల్లే, అంచనాలను అందుకోలేక చతికిల పడటం చాలా బాధాకరం.
రిప్లయితొలగించండి>>>
రిప్లయితొలగించండిపరకాల ప్రబాకర్ ఒక జంపు జిలాని . కాంగ్రెస్ తరుపున రెండు సార్లు పోటీ చేసి ఓడాడు. బీజేపీ తరుపునా నరసాపురం పోటీ చేసి ఓడాడు .ఉబయగోదావరి యమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓడాడు. ఇప్పుడు ప్రజారాజ్యం టిక్కెట్ ఆశించి అది రాక ఆరోపణలు చేస్తున్నాడు . ఇలాంటి వారి మాటలు పట్టించుకోనక్కర్లేదు. మీడియా అనవసరంగా ఇలాంటి వారికి ప్రాదాన్యం ఇస్తుంది,ప్రజా సమస్యలపై మానేసి.
>>>
2002 నుంచి 2006 వరకు మేము తూర్పు గోదావరి జిల్లా రాజోలులో ఉండేవాళ్ళం. అప్పట్లో ఇంటర్నెట్ కోసం దగ్గర్లో పాలకొల్లు (పశ్చిమ గోదావరి) కి వెళ్ళేవాడ్ని. పరకాల ప్రభాకర్ గురించి నాకు కూడా తెలుసు. ఆరోపణలు చేసిన వ్యక్తి యొక్క బ్యాక్ గ్రౌండ్ తెలుసుకోకుండా అతని ఆరోపణలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వడం నిజంగా తప్పే. చేగొండి హరిరామ జోగయ్య (దొడ్డిపట్ల గ్రామ మునసబ్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఫిరాయింపుదారుడు), గొల్లపల్లి సూర్యారావు (మంత్రి పదవి కాలం ముగియడానికి కొన్ని రోజుల ముందు పార్టీ మారే ఫిరాయింపుదారుడు), ఇంకా మరింత మంది ఫిరాయింపుదారుల చరిత్రలు నాకు తెలుసు.
మన చిరు రాజకీయ గురువు, పెద్దవాళ్ళు చేగొండి హరి రామ జోగయ్య కన్నా జంపు జిలానీ ఇంకెవ్వరు ఉంటారు చెప్పండి... ఆయన నిర్ణయం ( అదే పెద్దల నిర్ణయం) ప్రకారమే కదా చిరు నిన్నటి వరకూ తన సొంతూరు మొగల్తూరు అని చెప్పుకుని, ఇప్పుడు పాలకొల్లు లో పోటీ చేస్తుంది! అలాంటి పెద్దోళ్ళు గురువులుగా ఉన్నప్పుడు జంపు జిలానీలు కాకుండా ఇంకెవరుంటారు అందులో!
రిప్లయితొలగించండిచిరంజీవి ని విమర్శించడానికి కొంత మందికి చాలా ఉత్సహం. ఎప్పుడు చిన్న పొరపాటు కనిపిస్తుందా అని ఎదురు చుస్తూంటారు.
రిప్లయితొలగించండిఒకె తప్పు మిగతా పార్టి నాయకులు చెస్తె అది రాజకీయాల్లొ మాములు విషయం. ఎప్పుడూ సిద్దంతాల గురించి మాట్లడె కమ్యూనిస్టులు ఇప్పుడు అన్ని వదిలెసి తెలుగు దెశం తొ జతకట్టడం, "తెలుగుదెశం తొ తెలంగణా ?? అన్న జొక్ ని నిజం అవుతుంది అనె కె సి అర్ , కాంగ్రెస్ అవినీతి .. ఇవన్ని ఒ కె వీళ్ళకి.. ఇవన్ని చాలా మామూలు విషయాలు వీళ్లకి.(తెలుగుదెశం/ చంద్రబాబు గురించి చెప్పనకర్లెద్దు. ఎప్పుడుదయితె రామారావు మీద చెప్పులు వెయించి మళ్ళి అధికారం కొసం సిగ్గులెకుండ అతనె దెవుడు అన్నడొ అప్పుడె వాళ్ళు అన్ని నైతిక విలువలు కొల్పొయారు).
ఇక చిరు పార్టి లొ దోమ చచ్చిన .. అదిగొ చిరంజీవి నిర్లక్ష్యం వల్ల అది చచ్చింది అని టి వి లొ స్క్రొలింగ్ లు, పేపరు లొ బాక్సు ఐటెంలు. ఒక కొత్త పార్టి పెట్టినప్పుడు ఎన్ని వొడిదుడుకులు వుంటయీ? మీరు మొదటి వుద్యొగం జాయిన్ అయిన కొత్త లొ ఎలా వుండెవారు. అసలు తప్పులె చెయ్యకుండ నెగ్గుకొచ్చరా ..
చిరు అధికారం లొకి వస్తె అవినీతి జరగొచ్చు. అందుకని అవినీతి పార్టి లు అయినా ఇప్పుడు వున్న పార్టిలనె గెలిపిద్దాం. ఇది కొంత మంది వరస.
ఎవరొ అంటున్నరు. సామాజిక న్యాయమంటె బి సి లకు SC లకు సీట్లు ఇవ్వడమెన అని.. వాళ్ళ ఉద్దెశ్యం లొ సామాజిక న్యాయమంటె ఎంటొ తెలుసుకొవలని వుంది. సామాజిక న్యాయం ఎజెండా లొ వెనుకబడిన తరగతుల వారిని అదికారం లొ బాగస్వాములను చెయ్యడం అన్నది ఒక పాయింటు కాదా?
శ్రీనివాసు - నా మొదటి కామెంటు ధీప్తిదార గారి బ్లాగు లొ పెట్టింది. మళ్ళి టైపు చెయ్యడానికి బద్దకం వేసి కాపి పెస్టు చెసాను. అది ఇక్కడ అంత అతకలెదు..
సుజాత గారు - 3.5 లెక 5 కొట్లు గురించి జొకులు వెసె ముందు కాస్త మిగత పార్టి ఫండులు , అవి ఎలా వచ్చాయి , ఈ పార్టి ఎంతకు అమ్ముతున్నారు.. ఎ టికెట్ ఎంత కాస్ట్ .. పార్టి ఫండు లు ఎందుకు .. దాన్ని ఎవరు ఎందుకు ఇస్తారు.. బాగా పేద వాళ్ళకి టికెట్ ఇచ్చిన్నప్పుడు వాళ్ళ ఎన్నికల కర్చులు ఎవరు ఇస్తారు.. మన అంధ్ర డబ్బు ఎంత డిల్లి కి సూటుకెసులలొ వెళుతుంది.. ఇంక చాలా ప్రశ్నలు వున్నయి అవి వెసుకొండి మీకు మీరు. ఎవరినయిన దెన్నయిన విమర్శించడం చాల ఈజి అండి .
ఒకళ్ళు నమ్మినది ఎంత మంచి విషయం అయిన అది అమలు పరచడానికి చాలా కస్టాలు నస్టాలు వుంతాయి. అందుకె అన్ని మంచి అలొచనలు వున్న లొక్ సత్తా ఇంక ఒక పార్టి గా నెగ్గెలెక పొతుంది.. కొన్ని వర్గాల ప్రజలను చెరలెకపొతుంది.
దిలీప్ గారు, చేగొండి హరిరామ జోగయ్య గతంలో తెలుగు దేశం మంత్రి వర్గంలో పనిచేశాడని మీరు మరిచిపోతున్నట్టు ఉన్నారు. తెలుగు దేశం బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం తప్పే. చిరంజీవే కాదు, ఇంకెవడు పార్టీ పెట్టినా తెలుగు దేశం బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్ళని నమ్మితే మునుగుతారు.
రిప్లయితొలగించండిమంచుపల్లకి గారు,
రిప్లయితొలగించండిపార్టీ ఫండ్స్ ఎలా వస్తాయో, పార్టీల ఖర్చులేమిటో తెలియకుండానే వ్యాఖ్య రాశానంటారా అయితే?
బాగా పేద వాళ్ళకి టికెట్ ఇచ్చిన్నప్పుడు వాళ్ళ ఎన్నికల కర్చులు ఎవరు ఇస్తారు.. ఈ ప్రశ్న నేను కాదు, మీరు ఒకసారి ప్రజారాజ్యం నాయకులను అడిగి జవాబు చెప్పండి నాకు!
I don't see a major difference between NTR (Sr) and Chiranjeevi in entering politics. Don't attribute any saintly qualities to NTR, he was also a piece of the same fabric. The only difference is that when TDP was formed, Congress in AP was at its worst state both in quality and the leadership.
రిప్లయితొలగించండిAs someone already pointed out, there is no doubt that every candidate has to spend lot of money for the campaign. Without funds it is very difficult to survive in politics. I don't see any issue in taking money for giving tickets. But no one wants to admit this (hypocrisy).
I heard from many people, TDP is suffering from lack of funds as it was out of power for 5 years, now you how they were generating funds including our beloved "Naidu gaaru" ;)
BTW, someone in this blog space has written how TDP is pressurizing NRIs to donate money to it ;)
As some other already mentioned above, not even the parties, here people in blogs also polarized on the same caste lines supporting each of those parties, shame on each of us :( (BTW, Lok Satta is mukhouta of TDP not anything else and some people here trying to oversell as if it is another saintly stuff from the heavens ;))
I consider this post as ("another") mud slinging than any other :-)
~sUryuDu :-)
సూర్యుడు గారు.. మీరు భలె వారే.. మిగతా పార్టి లు తీసుకుంటె అది పార్టికి, రాస్ట్ర ప్రజలకు, మీకు , నాకు.. అది ప్రజారాజ్యం పార్టి తీసుకుంటె అది చిరు కి , అరవిందుకు. ఇదె ఇక్కడ మేధావులు అంతా చెప్పెది .
రిప్లయితొలగించండిసుజాత గారు - నెనే ప్రజరాజ్యం నాయకుడిని లెక ఈ పార్టి నాయకుడనయినా .. మునెమ్మ లాంటి వాళ్ళ ఎన్నికల ఖర్చు పార్టి ఫండ్ నుండె ఇస్తాను. ఇది ఎవరిని అడగక్కర్లెదు. మీరయిన అలాగె చెస్తారని అనుకుంటున్న.. కానీ పార్టి ఫండ్ ఎక్కడి నుండి వస్తుంది. పార్టి అభిమానులనుండి. పార్టి అభ్యర్దులు కంటె పార్టి అభిమానులు వుంటారని అనుకొను. ఇక పొతె ...ఇస్తె తీసుకొవాలి కానీ డిమాండు చెయాకుడదు అంటె.. అది ఫండ్ ఇచ్చెవాళ్ళ బాద.. ఇస్టం వుంటె, ఇవ్వగలిగితె ఇస్తారు. లెకపొతె మానెస్తారు. అదెదొ మహా పాపం అయినట్టు మీ అందరి బాద ఎమొటొ అర్ధం కాదు.
దైవకార్యానికి కుడా మనం చందాలు వసూలు చెస్తాం.. డబ్బులు లెనిదే రైలె కాదు సైకిలు , కారు కూడా కదలవ్..చెయ్యా నిలబడదు. కొద్ది ప్రాక్టికల్ అలొచించండి.
BTW
మీరు నా పేరు 'మంచుపల్లకి 'అని రాసారు. నేను 'మంచుపల్లకీ' అని పెట్టాను.. ఇప్పుడు ఎది కరక్టొ నాకు డవుటు వస్తుంది. ఎవరయిన కాస్త కంఫర్మ్ చెయ్యండి.
మొదట నాకు సామాజికన్యాయం అంటే అర్ధం,రెండు మార్పు అంటే ఏమిటి ఈ రెంటికి సరయిన సమాధానం నాకింత వరకు తెలియలేదు. పక్కవాళ్ళకి పెట్టుబడి కోసమైనా ఎన్ని కోట్లకైనా సరే టికట్లు అమ్ముకోవడం కరక్టే అనిచెప్పుకోవడం కూడా తప్పే లోక్ సత్తా ఇంకా నెగ్గలేక పోతుంది అంటే ఇలా చిరు లాగ ఆరు నెలల్లో సి.యం.అవ్వాలనో కొన్ని కోట్లు సంపాదించి వెళిపోవాలనో రాలేదు
రిప్లయితొలగించండికొద్దిగా సొషలిజం కనిపిస్తుందా? పేదవాళ్ళని అసెంబ్లి కి తీసుకువెళ్ళదానికి డబ్బు వున్నవాల్ల దగ్గర డబ్బు తీసుకొవడం తప్పు కనిపిస్తుందా?
రిప్లయితొలగించండిఎమి చెద్దాం మరి.. మునెమ్మ లాంటి వాల్లకి టికట్ ఇవ్వడం మనేయాలా ? లేక టికట్ ఇచ్చి చెతులు దులుపుకుని మన పని అయిపొయింది అనుకొవలా?..లెక చిరు తన సొంత డబ్బు ఇవ్వలొ తమరు చిరు కి సెలవిస్తె అయన అదె చెస్తారు మరి.
ఇక మీకు తెలిసిన సామాజికన్యాయం గురించి చెప్పండి. మీ అవగాహన చెప్పండి.
ఇక ఆరునెల్లల్లొ అవ్వలా, ఆరు సంవత్సరాలు ఆగాల అన్నది వాళ్ళ సత్తా మీద అదారపడి వుంది.
చిరు అర్జంట్ గా సి ఎం అవ్వలని , కొట్లు సంపాదించాలని వచ్చారు అనెది మీలా విషం చల్లాలనుకునె వాళ్ళ ప్రచారం. చిరు కి ఇంకొ మూడు తరాలు తిన్న తరగని సొమ్ము వుంది. కొట్లాది మంది అభిమానం వుంది. (మీరు ఆ కొట్లలొ వుండకపొవచ్చు).
ఇక లొక్ సత్తా గూరించి..పార్టి పెట్టిన ఇన్నాళ్ళకి కుడా.. ఇంకొ మంచి లీడర్ ను లొక్ సత్తా ఎందుకు ప్రొడ్యుస్ చెయ్యలెకపొయింది. ఎందుకు చదువుకొనివాల్లకి ఆ పార్టి విదానాలు అర్ధం కావు? (అర్దం అయితె ఈపాటికి మిగతా పార్టిలు అన్ని మట్టి కొట్టుకుపొయెవి).
రాంజీ.. మీకు వెరె బ్లాగు లొ సమాదానం ఇచ్చాను. ప్రజారాజ్యం లొక్ సత్తా అంత గొప్ప పార్టి కాకపొవచ్చు. కానీ తెలుగుదెశం , కాంగ్రెస్ అంత నీచమయిన పార్టి అయితె కాదు. మీరు ప్రజారాజ్యం ను లొక్ సత్తా తొ కంపెర్ చెస్తె సంతొషం. అదొక పొగడ్త గా ఫీల్ అవుతా... కానీ చిరు కేరక్టర్ ని , intentions ను అవమానించకండి. ఇప్పుడు వున్న మీడియా ఆ పని ఎలాగూ చెస్తుంది.
మంచు పల్లకీ: చిరంజీవిని విమర్శిస్తే, దానర్థం -బాబును, రాజశేఖరుణ్ణీ సమర్ధించినట్టు కాదు. చిరంజీవి రాజకీయాల్లోకి మార్పు తెచ్చేందుకు వచ్చాడు. అవినీతిని అంతం చేసేందుకు వచ్చాడు. సామాజిక న్యాయం తెచ్చేందుకు వచ్చాడు. ఏం మార్పు తెచ్చాడు? మీ మాటల్లోనే చూస్తే.. తెదేపా ఇలా చేస్తే తప్పు కాదు, కాంగ్రెసు అలా చేస్తే తప్పు కాదు, కానీ అలాంటి పనే ప్రరాపా చేస్తే మాత్రం తప్పా? అని అడుగుతున్నారు. ఆ రెండు పార్టీలు చేసిన తప్పే ప్రరాపా కూడా చేసే పనైతే, ఇక చిరంజీవి తెచ్చే మార్పు ఏంటంట? అవినీతిని అంతం చేసేందుకు వచ్చినవాడిపై, అధికారం పొందకముందే ఇన్ని అవినీతి ఆరోపణలు వస్తూంటే.. అతడి నుంచి మనం ఆశించే నీతి ఏంటని? చిరంజీవిని విమర్శించాలంటే కొంతమందికి ఉత్సాహం అని అన్నారు. ఆ కొంతమందిలో నేనొకణ్ణి. ఎంచేతంటే, మనల్ని ఉద్ధరిస్తానని కదా, రాజకీయాల్లోకొచ్చింది. మరి, తను చేసే పనులు మనల్ని ఉద్ధరించేలా ఉండాలి కదా! నేను టీవీ ఛానెలు పెట్టుకుంటాను, లేదా ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ పెట్టుకుంటాను, నా వ్యాపారమేదో నేను చేసుకుంటాను అని అన్నాడనుకోండి, మనకేంటి బాధ? తనకిష్టమైన పద్ధతిలో చేసుకోవచ్చు. కానీ ఇది అలా కాదుగదా, ప్రజలకుపయోగపడేలా చెయ్యాలి రాజకీయం. ప్రజలకోసం చెయ్యాలి రాజకీయం. తేడాగా అనిపిస్తే విమర్శిస్తారు, విమర్శించాలి కూడా!
రిప్లయితొలగించండిసామాజికన్యాయం పేరిట బీసీ కులాలకు ఎక్కువ సీట్లు కేటాయించారు, ఒప్పుకోవాల్సిందే! అది ఒక ముందడుగే, కాదన్ను. అంతమాత్రాన సామాజికన్యాయం ఒనగూడినట్టేనా? శ్రీకర్ చెప్పిన నాయకుల్లో ఒకరు - ఆర్.కృష్ణయ్య - నిన్న టీవీలో మాట్టాడుతూ, సీట్లు ఇచ్చారు సరే, ఎక్కడ ఇచ్చారు? బీసీలు ఎక్కువగా ఉన్న గోదావరి జిల్లాల్లో ఇచ్చారా? లేదే! బీసీలు బలంగా ఉన్న చోట్ల ఇస్తే వాళ్ళు గెలిచేవారు. ఇలా బలహీనమైన చోట్ల ఇస్తే లాభమేంటి? మళ్ళీ అదే రెడ్లు, కమ్మలు, కాపులు అధికారానికొస్తారు. సామాజికన్యాయం ఏది అని అడిగాడు. దీని నిజానిజాలు నాకు తెలవదు, కృష్ణయ్య చేసిన విమర్శ ఇక్కడ రాస్తున్నాను, అంతే!
బోనగిరి: ఆ టపాకు లింకు ఇద్దామని అని వెతికాను, దొరకలా. మీ బ్లాగులో ఇప్పుడు చూసాను కనబడలేదే! ఎక్కడైనా వ్యాఖ్యలో రాసారా?
శ్రీకర్: కాకతాళీయంగా మీరు చెప్పిన ఆ ఆచార్యవర్యులు, ఆర్. కృష్ణయ్య ఇద్దరూ నిన్న ఐన్యూస్ వాడి కార్యక్రమంలో పాల్గొని పోట్టాడుకున్నారు. అరవిందు ప్రభాకరుపై నిప్పులు చెరుగుతున్న వేళ, దాదాపుగా అదే వేళ, వీళ్ళిద్దరూ ఈ చర్చలో పాల్గొన్నారు. బీసీలకు ఇన్ని సీట్లిచ్చిన ప్రరాపాను విమర్శిస్తావుగానీ, తక్కువ ఇచ్చిన తెదేపా, కాంగ్రెసులను విమర్శించవు అన్న ధోరణిలో ఆచార్యుడు కృష్ణయ్యను విమర్శిస్తున్నాడు. ఛానెళ్ళ ప్రయాణంలో ఈ చర్చను గమనించాను. ఇక కృష్ణయ్య రెచ్చిపోయి, మీరు నన్ను అలా అనకూడదు. అవసరం వచ్చినపుడు అన్ని పార్టీలనూ విమర్శిస్తూనే ఉన్నాను, అంటూ ప్రరాపా గురించి పైన నేను చెప్పిన మాట చెప్పాడు.
సూర్యుడు: చిరంజీవి గొప్ప నటుడు, మెగాస్టారు. అతడు మానవాతీతుడు, తప్పు చెయ్యడు. అతన్ని విమర్శించడం దేశద్రోహంతో సమానం అని వీరాభిమానులు అనుకుంటూంటారు. విమర్శిస్తే తట్టుకోలేరు. అసమంజసంగా, అనుచితంగా మాట్టాడ్డం మొదలెడతారు. మీరు కూడా అలాంటి అసహనాన్నే చూపించారు. చర్చలోకి కులాన్ని చొప్పించారు. అసలు కులం గురించి మాట్టాడిందెవరిక్కడ? చిరంజీవిపై ఈ టపాలో నేను చేసిన విమర్శలో కుల ప్రసక్తి లేదు, ఇక్కడి వ్యాఖ్యల్లోనూ లేదు. కానీ మీ వ్యాఖ్యలో మాత్రం కుల ప్రసక్తి తీసుకొచ్చారు. మీరు కులాభిమానంతో రగిలిపోతున్నట్టు మీ వ్యాఖ్య చెబుతోంది. మనందరం సిగ్గుపడాలని అన్నారు.. సిగ్గుపడేదానికి మీకు మా తోడెందుకు, మీరు పడండి, చాలు. :)
రామారావు గురించి మీరు పోలిక తెచ్చారు కాబట్టి చెబుతున్నా.. రామారావుకున్న అనుకూలత చిరంజీవికి లేదు -ఇది నిజం. కానీ దానికి మించిన తేడా ఏంటంటే రామారావు సమర్ధుడైన నాయకుడు. చిరంజీవికి నాయకత్వ పటిమ లేదు. ఇద్దరికీ సలహాదారులున్నారు. కానీ రామారావు సలహాదారులు కేవలం సలహాదారులే. రామారావు నీడన ఎదిగారు, రామారావును మించి ఎదగలేదు.1984లో తోక జాడించిన కోపైలటుడు, చరిత్రహీనుడయ్యాడు -అదికూడా మళ్ళీ రామారావు నాయకత్వ పటిమ కారణంగానే. చిరంజీవి మీద గురిపెట్టిన గుండుకు, తన గుండె అడ్డమేస్తానన్న వ్యక్తి రేపు ఎదురు తిరిగితే, చిరంజీవి రామారావు స్థాయిలో దండెత్తగలడనే నమ్మకం నాకు లేదు -ఎంచేతంటే దానికి నాయకత్వ పటిమ కావాలి, తనమీద తనకు నమ్మకం ఉండాలి. :) ఆ పటిమ తగ్గినరోజున, 1995లో, రామారావు పరిస్థితి ఏమయిందో చూసాం.
తెదేపా డబ్బుల సంగతి.. ఈ వ్యాఖ్యలో పైన మార్పు గురించి రాసినది చదవండి. ఇక లోక్‌సత్తా గురించి మీరు చెప్పిన మాటలు.. నే జెప్పేదేంలేదు. మంచుపల్లకీ చివరి వ్యాఖ్య చూడండి. :)
మిగతా పార్టిలు ఎలాగు చెడిపొయాయి.. ఇంక విమర్శించడనికి ఎమిలెదు అందుకే చిరు పార్టి మీద అనా ?
రిప్లయితొలగించండినెను అనెది "తెదేపా ఇలా చేస్తే తప్పు కాదు, కాంగ్రెసు అలా చేస్తే తప్పు కాదు, కానీ అలాంటి పనే ప్రరాపా చేస్తే మాత్రం తప్పా?" అని కాదు " ప్రరాపా చేస్తే మాత్రం కాస్త ఎక్కువ తప్పు " అనే వాళ్ళ గురించి.
ఇక బి సి సీట్లకొసం మీరు చెప్పిన ఆర్.కృష్ణయ్య మాటలు చాల అశ్చర్యం కలిగించాయి (నేను చూడలెదు). నరసాపురం లొక్ సభ- చిరు కి అత్యంత నమ్మకమయిన స్తానం ఒక బి సి కి ఇచ్చేరని మర్చిపొతున్నారు. అసలు చిరు సొంతజిల్లా రెండు లొక్ సభ సీట్లు బి సి లకి ఇచ్చారని , వీటిలొ ఏది రిజర్వడ్ కానీ ఒపెన్ సీట్లని ఇప్పటివరకు ఉభయగొదావరి లొ ఇవ్వన్నని సీట్లు బి సి కి ఇచ్చారని, ఇది ఒక రికార్డని , చంద్రబాబు కరపత్రిక ఈనాడె చెప్పింది. అలాంటిది ఆర్.కృష్ణయ్య మాటలు ఇక్కడ ఉదహరించడం ఎమిటి. ఒకవెళ మీకు ఇప్పటివరకు తెలియక పొతె ఒకసారి చూడంది. రేపు నెగ్గిన అన్ని పార్టిలనుండి నెగ్గిన వాళ్ళ లొ బి సి ల రెషియొ చూడండి . చిరు తప్పక ఇచ్చాడొ? ..మనస్పూర్తి గా ఇచ్చాడొ తెలుస్తుంది. నాకు తెలుసినంత వరకు చిరు మంచి ఉద్దెశ్యం తొనె రాజకీయాలకు వచ్చిన వాడు. తనకి వచిన అన్ని అవరొధాలూ తొలగి ప్రజలందరికి తను కరక్ట్ గా అర్థం అవ్వాలని కొరుకుంటున్నాను.
ఇంత డబ్బు వఱదలై ప్రవహిస్తూంటే Liquidity crunch, మాంద్యమూ గాడిదగుడ్డు ఎక్కడున్నాయంటారు ?
రిప్లయితొలగించండిచంద్ర బాబు కి వొటెయ్యండి స్విస్ బాంకులొ వున్న కాంగ్రెస్ వాళ్ళ కొట్లు తెస్తాడట. ఈయన ఆస్తులు సింగపూర్ లొ వున్నాయని స్విస్ కమిట్ అయినట్టు వున్నాడు.
రిప్లయితొలగించండితాడెపల్లి గారు.. ఈ టైము లొనె బ్లాక్ మని బయటకు వచ్చెది. ఇదె మంచి అవకాశం..
గుండుకి ఎదురీగే ఆ ఒక్క వ్యక్తే కాదు. చేగొండి, శివ శంకర్, భూమా లాంటి వాళ్ళ కనుసన్నల్లోనే వాళ్ళ సలహాలు సూచనలతోనే, వాళ్ళు ఏమి చెప్తే దాన్ని సమర్ధించే విగ్రహంలా నిలిచిపోతాడు. ఆయా ప్రాంతాల్లో బలంగా ఉన్న నాయకులకి ఎదురేగి వెళ్ళే సత్తా నాకైతే చిరులో కనిపించడం లేదు. చిరంజీవి బలం ఎన్నికలయ్యేంత వరకే... తను ప్రభుత్వాన్ని ఏర్పాటుకి కావలసినన్ని సీట్లు గెలుచుకోలేకపోతే, చిరంజీవి తన పార్టీలోనే మిగిలిన నాయకులముందు బలహీనుడైపోతాడు.
రిప్లయితొలగించండి@ మార్తాండ
చేగొండి, తెలుగుదేశం హయాములోనే అత్యున్నత స్థితిలో ఉన్నాడు. ఆ తరవాత ఆ స్థితిని చేరుకోలేక చతికిల బడి, తనకి చేతనైన రాజకీయాలు చేసుకుంటూ, తన ఉనికిని కాపాడుకోడం లోనే కాలం గడిపేస్తున్నాడు. అది చేగొండి ఒక్కడి విషయమే కాదు, తెలుగు దేశాన్ని విడిచి అప్పుడు కాంగ్రెస్ లో చేరిన అందరి నాయకులు పరిస్థితీ అంతే... ఇప్పుడు వాళ్ళే కాంగ్రెస్ని కూడా వదిలి పి ఆర్ పి లో చేరారు. చిరంజీవిని గత 15 యేళ్ళ నుండీ నువ్వే ముఖ్య మంత్రివి అని ఆశలు కల్పించినవాడిలో ప్రధముడు.
చిరంజీవి చేసినవి తప్పులే కానీ అతని కంటే పెద్ద పోటుగాళ్ళు ఉన్నప్పుడు అతన్ని మాత్రమే తీవ్రంగా విమర్శించడం సరైనది కాదు. ఏ ఎండకి ఆ గొడుగు పట్టుకునే తెలుగు దేశం, కాంగ్రెస్ నాయకుల్ని తన పార్టీలో చేర్చుకోవడం అన్నిటికంటే పెద్ద తప్పు. తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీల బ్యాక్ గ్రౌండ్ & ఫోర్ గ్రౌండ్ ఎలాంటివో చాలా మందికి తెలుసు. మన రాష్ట్రంలో ప్రతి ఎన్నికలలోనూ 60% మించి వోట్లు పోలవ్వడం కష్టంగా ఉంది. పడిన వోట్లలో కూడా దొంగ వోట్లు, డబ్బు & సారా ప్యాకెట్లతో కొన్న వోట్లు, కులం & మతం పేరు చెప్పుకుని వెయ్యించుకున్న వోట్లు ఇవన్నీ లేకపోతే 10% వోట్లు కూడా నమోదవ్వవు. వేర్పాటువాదుల ప్రభావం ఎక్కువగా ఉన్న కాశ్మీర్ & ఈశాన్య రాష్ట్రాలలోనూ, మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న జార్ఖండ్, ఒరిస్సా, దండకారణ్యంలలోనూ కొన్ని గ్రామాలలో ఒక్క వ్యక్తి కూడా వోట్ వెయ్యడని ఒక ఇంగ్లిష్ పత్రికలో చదివాను. అక్కడ కూడా ప్రతి ఎన్నికలలోనూ అలంకారప్రాయంగా పోలింగ్ కేందాలు పనిచేస్తాయి. కానీ ఎవరూ వచ్చి వోట్ వెయ్యరు. ఈ పాలక వర్గ పార్టీల బిహేవియర్ చూస్తే వోట్ వెయ్యకపోవడం వైపే ఇంక్లినేషన్ కలుగుతుంది.
రిప్లయితొలగించండి@చదువరి:
రిప్లయితొలగించండిI am neither his fan nor belongs to his community. I am still with my above comment on the caste lines. You don't have to use that word to display the inner intentions ;)
I could have very well said shame on you but was a bit polite I thought :-)
As far as Lok Satta, I understood their satta when HE (and there is no one else anyways ;)) talked on Margadarshi issue on a TV channel, again the same fabric. I have my own conclusions drawn base my own observations and analysis, don't go by someone's observations.
My last comment for this post :-)
~sUryuDu :-)
సూర్యుడు: మీ కులమేంటో, మీరు చిరంజీవి అభిమానో కాదో నాకనవసరం. మీరిక్కడ రాసిన అనుచితమైన వ్యాఖ్యకు అర్థం, నేను రాసినది తప్ప, మరోటి లేదు. అంచేత అలా రాసాను. మీ తప్పును సవరించుకునేంత వరకు అదంతే!
రిప్లయితొలగించండిమనం అభిమానించేవాళ్ళను మరొకరు విమర్శిస్తే కష్టం కలుగుతుంది, సహజమే. తప్పేం కాదు. కానీ, దాన్ని ఎదుర్కోవడానికి అడ్డదారులు తొక్కడమే తప్పు.
-----------------
చిరంజీవికున్న అతి పెద్ద ప్రతికూల అంశాల్లో ఒకటి, అతడి వీరాభిమానుల అసహనం. తాము చిరంజీవిని దేవుడిగా ఎలా చూస్తున్నామో, అందరూ అదే విధంగా చూడాలని అనుకుంటారు. విమర్శను ఏమాత్రం సహించరు. అపరిమితమైన అసహనం. తటస్థులను ప్రరాపా వ్యతిరేకులుగా మార్చడంలో వీరాభిమానులు చాలా పెద్ద పాత్ర పోషిస్తున్నారు.
@సూర్యుడు
రిప్లయితొలగించండిఒక వ్యక్తి మీద ముద్ర వేసేప్పుడు అతని గత కృషిని విస్మరించకూడదు... మీరు జేపీ రాసిన వందలాది వ్యాసాలను చదివి ఆకళింపు చేసుకుని, ఇప్పుడు లోక్సత్తా పార్టీ మానిఫెస్టో ని గమనిస్తే తెలుస్తుంది ఎంతటి ఆలోచన, సాధన ఉన్నాయో... మీరు ఆయన గత పదేళ్ళగా రాసిన వాటి గురించి చదవాలనుకుంటే ఇక్కడ చదవండి...
http://www.loksattamovement.org/etarticles.htm
ఆపైన మీ పరిశీలన... జేపీ అప్పట్లో చెప్పిన విషయమే, రిజర్వు బాంకు చేతల్లో చూపించింది... మార్గదర్శి విషయంలో డిపాజిట్ల నిలిపివేత, హెచ్చరికలకన్నా జోక్యం చేసుకోనంది... చెల్లింపుల గురించి తనకి తెలియచేయమంది... ఇకపోతే అది కక్ష సాధింపు చర్యో కాదో, నిజంగా మదుపుదారుల ప్రయోజనాల కోసమే ఈ చర్య తీసుకున్నారా లేదా అని మార్గదర్శిలో పెట్టుబడుల విషయంలో ౠజువైపోయింది... సంభందిత శాఖలన్నీ అనుమతించినా ఒక్క ఆర్ధిక మంత్రి సంతకం పెట్టకుండా పెట్టుబడులని ఆపేసారు... ఇక రామోజీ దేశీయ పెట్టుబడుల కోసం వెతుక్కోవాల్సి వచ్చింది... ఎవరికున్న రాజాకీయ కోణాల్లోంచి, ఆకాంక్షలలోనుండి వాళ్ళు అసలు జారగాల్సినదాన్ని విస్మరించి, అన్ని విషయాలని పరిగణనలోకి తీసుకోకుండా, ఉన్న వాళ్ళల్లో ఒక నిజాయితీపరుడి పైనా, సమర్ధుడి పైనా ముద్రలు వెయ్యడం, మనకి మనమే వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం లాంటిది... అలాంటి వాళ్ళని తీవ్రంగా నిరుత్సాహపరచినట్టవుతుంది...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి*ప్రతి సీటుకూ 5 కోట్ల చొప్పున 200 సీట్లు అమ్ముకొని ఆ తరువాత ఎన్ని సీట్లొచ్చినా వాటి ఆధారంగా ఎవరికో ఒకరిక్లి మద్దతిచ్చి మినిస్ట్రీ పట్టేసి డబ్బులు చేసుకోవడం. ఎన్ని సినిమాలు తీస్తే,చేస్తే ఇంత డబ్బు ఈ లేటు వయసులో వస్తుంది? *
రిప్లయితొలగించండిమహెష్ గారు, సరిగ్గ లెక్క వేశారు. సాజికన్యాయ సిద్దాంతం యొక్క ప్రస్తుత విలువ రమారమి 1000 కోట్లన్నమాట. త్వరలో మిగతా మిగిలిన భావజాలను లెక్క కడితే మహా ఐతే మొత్తం కలిపి ఒక 5000 కొట్లు గా వస్తుందేమొ. ఈ 5000 కోట్ల రుపాయల కోసం ఈ సిద్దాంత కర్తలు సామజానికి చేసె నష్టం చెప్పనలవి కానిది. సామాన్య ప్రజల లో లేని భావలను, కొంతమంది స్వలాభం కొరకు విశ్వ విద్యాయలయాలయాల్లో పుట్టించిన కృత్తిమ భావజాలాలను నిజ జీవితంలో అమలు చేయాటానికి ప్రయత్నిస్తే ఎటువంటి పరిణామాలకు,పరిస్థితులకు దారిటిస్తాయొ అని చెప్పటానికి ప్రజారాజ్యం ఒక ఉదాహరణ. విశ్వ విద్యాయలయాలయాల్లో తేలికగా పదవులు సంపాదించటానికి రాసుకున్న కృత్తిమ సిద్దాంతాలు, వారి అపరిపక్వ అనాలిసిస్లు ఈ కృత్తిమ భవజాలాన్ని ప్రజల నెత్తిన బలవంతం గా రుద్ద టానికి చేసిన ప్రయత్నాలు వికటించాయి. వారు వేసుకున్న అంచనాలకి చావుదెబ్బ తగిలింది.దానికి చిరంజివి బలి అయ్యాడు. నాయకత్వ లక్షణాలు ఆ వర్గాల లో ఇంకా పూర్తి స్తాయి లో అభివృద్ది చెందకపొవడం దీనికి ఒక కారణం అని నేనకుంటాను.
ఈ భవజాలాల అంతిమ స్వరూపం వందల కోట్లు సంపాదించటమా? లేక బలహినవర్గాల కి సేవా? సేవ చేయటమా అని ఆలొచిస్తే బలహినవర్గాల వారిలో అభివృద్ది చెందిన వాళ్ళే, వాళ్ళ వార్గములొని వెనుక బడిన వారిని భవజాలం పేరుతో అగ్రవర్ణాలకన్నా దారుణం గా దోచుకుంట్టునట్టు అనిపిస్తున్నాది. ఇటువంటి భావజాలం అంతిమంగా ముర్ఖులను సృష్తించి వారిని ఎదిరించెవారిని అభివృద్ది నిరోదకులుగా,బడుగు వర్గాల అణచివేతా దారులుగా పేర్కొంటం అత్యంత దారుణ మైన విషయం. ఇటువంటి భావజాలం దానికి రూపం ఇచ్చెవారిని/పార్టిలను నమ్మటం అనేది నిజం గా
మహెష్ గారు చెప్పినట్టు మన మూర్ఖత్వానికి జిందాబాద్.
చిరంజీవి సినిమా గ్లామర్ ని రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవడం తప్పే కానీ అదొక్కటే పెద్ద సమస్య అయినట్టు మాట్లాడుతున్నారు. చిరంజీవి టికెట్ కి ఇన్ని కోట్లు తీసుకున్నాడని పరకాల ప్రభాకర్ చెపితే ఎలా నమ్మేశారు? అతనేమైనా ఎవిడెన్సెస్ చూపించాడా? టికెట్లు కోసం పార్టీలు మార్చే గోడ మీది పిల్లులకి నిజాయితీ ఉంటుందనుకుంటున్నారా? ఆరోపణలు చేసిన వ్యక్తి యొక్క బ్యాక్ గ్రౌండ్ ఏమిటో ఆలోచించండి. పార్టీ టికెట్ రాలేదన్న కసితో ఎవిడెన్స్ చూపించకుండా చేసిన ఆరోపణలు పట్టుకుని కాపీ & పేస్ట్ చేస్తే నిజాయితీ దిగజారినట్టే. రాజకీయ నాయకులు క్రిమినల్స్ తో కలిసుండగా తీసిన ఫొటోలు బయట పెట్టినా వాళ్ళు సిగ్గు పడని సందర్భాలు ఉన్నాయి. ఏ ఎవిడెన్స్ చూపించకుండా టికెట్ ఐదు కోట్లకి అమ్ముతున్నాడు అని ఆరోపిస్తే ఎవడు భయపడతాడు?
రిప్లయితొలగించండిబాబు మంచుపల్లకి, పార్టీ ఫండ్ టికెట్లు అమ్ముకుంటే రాదు, ఎలక్షన్ కమీషన్ తో చెప్తే తంతారు, ఫండ్ కోసం టికెట్లు అమ్ముతున్నాం అని.. పార్టీ ఫండ్ కార్పోరేట్ల నించి, సభ్యత్వం తీసుకున్న వారినించి సేకరిస్తారు. ఇక్కడ చిరంజీవి ని విమర్శిస్తే TDP, కాంగ్రెస్ ని సపోర్ట్ చేసినట్లు గా ఉన్నాయి మీ వ్యాఖ్యలు. ఇంకా నయం, కోవర్ట్లు అనలేదు.
రిప్లయితొలగించండి"..కొద్దిగా సొషలిజం కనిపిస్తుందా? పేదవాళ్ళని అసెంబ్లి కి తీసుకువెళ్ళదానికి డబ్బు వున్నవాల్ల దగ్గర డబ్బు తీసుకొవడం తప్పు కనిపిస్తుందా?"
రిప్లయితొలగించండిఒక్కటి అర్ధం అవ్వదో, చేసుకోవాలని ఉండదో? ఈ రోజు పార్టీ ఫండ్ అని కోట్లు తీసుకుంటే వారు ఊరికినే ఏదో MLA అయ్యి దేశ సేవ చేసుకుందాం అని ఇస్తారా? వాళ్ళ వ్యాపారాలు, వ్యవహారాలు అన్నీ వదిలేసి పక్కనోడి గెలుపు కి కూడా డబ్బులు ఖర్చు చేసే వాళ్ళ ఉద్దేశ్యాలు అర్ధం కావా? అలాంటి వారిని చంకన పెట్టుకొని మార్పా? డబ్బే పెట్టాలనుకుంటే చిరంజీవి ఇమేజ్ ఎందుకు? ఆయన నిజాయితి, చిత్తశుద్ది మీద ప్రజలకు నమ్మకం లేదని అర్ధం చేసుకోవచ్చా?
@మంచుపల్లకీ,>> పార్టి అభ్యర్దులు కంటె పార్టి అభిమానులు వుంటారని అనుకొను.
రిప్లయితొలగించండిరేపొద్దున ఓడిపోయి, అవతలి పార్టీకి ఒక పది సీట్లు అవసరపడితే జంప్ జిలానీలు అయ్యే వీళ్ళా వీరాభిమానులు? అయినా పార్టీ కి ప్రజలు అభిమానులైతే ఓట్లు పడతాయి కాని అభ్యర్ధులు అయితే కాదు.
జనం ఎలాగూ సినిమా గ్లామర్ చూసి వోట్లు వేసేంత అమాయకులు కారు. చిరంజీవి ఎలాగూ ముఖ్యమంత్రి అవ్వలేడు. కాపు వ్యతిరేక ప్రోపగాండా కోసమే చిరంజీవిని ఈ స్థాయిలో తిడుతున్నారని డౌట్ వస్తోంది. ఒక కులాన్ని డైరెక్ట్ గా దూషిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు కనుక ఆ కులానికి చెందిన సినిమా హీరోని ఏదో ఒక వంక పెట్టి తిట్టడం బెస్ట్ ఆప్షన్ అనుకుంటున్నారు. జనానికి సినిమాల మీద మీరనుకుంటున్నంత క్రేజ్ లేదు. మా చిన్నప్పుడు సినిమాలు 100 రోజులు ఆడేవి, 365 రోజులు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సినిమా 50 రోజులు ఆడితేనే గొప్ప అనుకునే స్థితిలో ఉన్నారు. సినిమాలకి పాపులారిటీ తగ్గితే సినిమా నటులపై కూడా క్రేజ్ తగ్గిందనుకోవాలి. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేని వ్యక్తి పేరు చెప్పి ఒక కులానికి వ్యతిరేకంగా ఇంత ప్రోపగాండా చెయ్యడం వల్ల కులతత్వం స్పష్టంగా బయట పడుతోంది.
రిప్లయితొలగించండి@మార్తాండబ్బాయా
రిప్లయితొలగించండి>> "జనానికి సినిమాల మీద మీరనుకుంటున్నంత క్రేజ్ లేదు. మా చిన్నప్పుడు సినిమాలు 100 రోజులు ఆడేవి, 365 రోజులు ఆడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సినిమా 50 రోజులు ఆడితేనే గొప్ప అనుకునే స్థితిలో ఉన్నారు. సినిమాలకి పాపులారిటీ తగ్గితే సినిమా నటులపై కూడా క్రేజ్ తగ్గిందనుకోవాలి"
భలే కామెడీ చేస్తావులే :-)
ఎవరు కాపులకి వ్యతిరేకం గా ప్రాపగాండా చేసారు బాబు? అసలు చిరంజీవి ని అడ్డు పెట్టుకొని కాపుల్ని తిడుతున్నారని కొత్త ప్రాపగాండా మీరే చేస్తున్నారు. మీడియా లో చూడట్లేదు, ప్రజల్లో లేదు, ఇక్కడ బ్లాగుల్లో ఎవరూ అసలు ఆ అర్ధం వచ్చేలా కూడ వ్రాయలేదు కానీ ఎక్కడ నించి పట్టుకొచ్చారో అన్ని చోట్ల కాపు వ్యతిరేక అజెండా అని వ్రాసేస్తున్నారు. మీ అభియోగానికి source అయినా చెప్పు బాబు, అర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తాము.
రిప్లయితొలగించండిఈ రోజు పరకాల ప్రెస్ మీట్లో ప్రజారాజ్యం గురించి చెపుతుంటే నాకు భారత్ బంద్ సినేమాలో కాస్ట్యుముస్ కృష్ణ అసెంబ్లిలో బడ్జెట్ ప్రవేశ పెట్టీన సీను గుర్తుకు వచ్చింది. నలుగురి నిజాయితి పరులను ముందుగా పార్టి లో చేర్చుకుని అవసరమైన తరువాత పొమ్మన కుండా పొగ పెట్టారు. ప్రజారాజ్యం ని చూస్తుంటె నాకు బ్రమ్హర్షి విశ్వామిత్ర సినేమా గుర్తు కొస్తున్నాది, ఆ సినేమా రామారావు మొదలు పేట్టినప్పుడు మంచి పబ్లిసితి వచ్చింది విడుదలైన తరువాత మనకు తెసు అది ఎంత విజయవంతమైందో. సత్యం కంపేని కి బెస్ట్ కార్పోరేట్ గవర్నేన్స్ అవార్డ్ ఎలా వచిందో దీనికి రాజకీయ పార్టి అనే గురితింపు అలానే వచ్చింది.
రిప్లయితొలగించండిఅల్పబుద్ది వానికి అధికారమిచ్చిన్న
సజ్జనులని ఎల్ల వెడలగోట్టు
కంచు మ్రొగినట్టు కన కంబు మ్రొగునా
విశ్వదాభిరామ వినుర వేమ.
బాబు సత్యా.. నువ్వు చిరు ఎలాగయిన విమర్శించాలి అని దిగినట్టు వున్నావ్..టికట్ ఎన్ని కొట్లకు అమ్ముకున్నా.. ఎలెక్షన్ కమీషన్ పీకెదేమీ వుండదు..
రిప్లయితొలగించండిఇంకొ విషయం .. టికట్ తీసుకునె వాళ్ళు అందరూ పార్టి కి డబ్బులు ఇవ్వడం చాల మాములు విషయం. కాకొపొతె మిగతా పార్టిల విషయం లొ దాన్ని ఫండ్ అని ప్రజారాజ్యం విషయం లొ అది ఆమ్ముకొవడం అని నీలాంటి చిరు ని సహించలెని వాళ్ళ విష ప్రచారం. ఇదెదొ కొత్త విషయం , ఇప్పుడే అంధ్ర లొ ఇండియా లొ చుసినట్టు మీరు హిపొక్రిటికల్ కామెంట్స్ చెస్తున్నారు. కాస్త ప్రాక్టికల్ గా అలొచించిన ఎవరికయినా అర్థం అవుతుంది. నువ్వు ఎక్కడ పుట్టావొ నాకు తెలీదు కానీ నువ్వు కనుక ఎదయినా పల్లెటూరులొ లొ పుట్టి వుంటె ..అమ్మవారి జాతర గానీ , శ్రీరామ నవమి పండగలు చూసె వుంటావు. ఆ పండగ కమిటీ లొ బాగ చందా ఇచ్చిన వాళ్ళు లెక బాగా పలుకుబడి కలవాళ్ళు మాత్రమె కమెటీ మెంబెర్స్ గా వుంటారు. ఎక్కడయిన అంతె బాబు డబ్బులు లెక పలుకుబడి మాత్రమె మెంబెర్స్ ని చెస్తుంది.
ఎలాగయిన చిరు ని తిట్టాలి అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టి , ఒక కొత్త పార్టి నడపాలంటె యెంత డబ్బు కావాలి , అది యెక్కడ నుండి వస్తుంది అన్న కాస్త కామన్ సెన్సు ఉపయొగించి మాట్లడు.
చిరు ఇమెజ్ వుంటె చాలు పార్టి అదె రన్ అవుతుంది, డబ్బులు ఆకాశం లొంచి దిగిపడతాయి అనుకుంటె నేను చెప్పది ఎమి లేదు.
ఫండ్ కర్పొరట్ నుండి సేకరిస్తె ప్రాబ్లం లెదు అన్నట్టు మాట్లాడు తున్నారు.. వాళ్ళు ఎమి ఆశించకుండనె ఫండ్ ఇస్తారు మరి? కార్పొరెట్ ఇచ్చెది లంచమె నాయనా..
జంప్ జిలానీ లు మనకి కొత్తెమి కాదు.. కొన్ని ఎళ్ళగా మనం మిగతా పార్టిలలొ చుస్తూనే వున్నం. అంత ఎందుకు వెరే కంపెని వాడు ఇంకొ లక్ష ఎక్కువిస్తానంటె నువ్వు జంప్ జిలానీ వె. అప్పటి వరకు ఎంతొ కస్టపడి ట్రైనినిగ్ ఇచ్చిన కంపెని కి దినీ వల్ల అఫెక్ట్ ఎమిటి అని కూడ అలొచించ కుండా జంప్ చెసె మనం అంత తెలిగ్గా వెరె జంప్ జిలానీల గురించి కామెంట్స్ వద్దులె. వుద్యొగం వేరు , ప్రజా సేవ వెరు లాంటి డైలాగులు ఒక 20 సంవత్సరాల క్రితమె మాయం అయ్యాయి.. ఇప్పటి రాజకీయనాయకులకి పాలటిక్స్ ఒక ప్రొఫెషన్ ..సేవ కొసం ఎంత మాత్రం కాదు.
ఎదెదొ చిరు పార్టి లొ కొత్త గా చుసినట్టు , మరీ ఎక్కువ బాద పడకండి . ఇడియల్ పార్టి అంటు ఎదీ వుండదు. ఎవరు ఇడియల్ గా వుండలెరు. మీరు చిరు ని విమర్శించడనికి ఇది తప్ప ఇంకెమి లెదు అని తెలుసు.
చదువరి గారు - మార్పు తెస్తాన్నన్న పార్టి కాబట్టి నేను విమర్శిస్తున్నాను అనుటున్నారు. కానీ ఇప్పుడు వున్న పార్టీలు ఎమి వాళ్ళు చెడిపొయిన్నట్టు
వప్పు కొవడం లేదె? . వాళ్ళు మెము చాల పర్ఫెక్ట్ అంటున్నారు. మీరు వాళ్ళని వదిలెసి చిరు మాత్రమె పనికట్టుకుని ఎక్కువ విమర్శించడం అర్థం కాకె నెను ఇంత టైం తీసుకుని రాసెది . వాళ్ళు చెసెది చిరు చెస్తె ఒప్పని కాదు.. ఒక్కళ్లని టార్గట్ చెసుకుని అదె పని గా విమర్శించి మీ క్రెడిబిలిటి ఎందుకు పొగొట్టు కుంటున్నారు? ఇకనుండి మీరు చిరు మీద నిజమయిన విమర్శ చెసినా ఇప్పటివరకు నూట్రల్ గా వుండె రీడర్స్ ..చదువరి ఎప్పుడూ చిరు కి వ్యతిరెకం గానె రాస్తడూ ..ఇది అలాంటిదె అయివుంటుంది అనుకునె ప్రమాదం వుంది. ఇప్పటి ఈనాడు, జ్యొతి, సాక్షి లాగ.
ఇకనుండి నెను సత్యా లంటి చిరు హెటెర్స్ కి రెప్లై ఇవ్వలెను.. మీలా అలొచించె వాల్లకి సమాదానం చెప్పదానికి నాకెప్పుడూ టైము వుంటుంది .
ఇకపొతె చిరు అభిమానులు కుడా రాస్ట్ర ప్రజలె .వళ్ళేమి విలన్లు కాదు.. మీరు చుట్టూ చుసుకుంటె చాలమంది కనిపిస్తారు. చిరు వీరభిమానులంటె అదెదొ పాపత్ములు, పిచ్చొళ్ళు అని బ్రాండ్ వెసెయ్యకండి. అలా అయితె ఈ రాస్ట్రం లొ చాలామంది అలాంటి వాళ్ళు వున్నారు.
నెను ఇంతకు ముందు చెప్పింది మళ్ళి ఇక్కడ చెబుతున్నా.. ప్రజారాజ్యం లొక్ సత్తా అంత గొప్ప పార్టి కాకపొవచ్చు ..తెలుగు దెశం ,కాంగ్రెస్ , టి అర్ స్ అంత నీచమయిన పార్టి అయితె కాదు( ఈరొజుకి)
సింపిల్ పొలిటికల్ మెథ్
రిప్లయితొలగించండిఅట్ టైం = 2009
కాంగ్రెస్స్ - వై యెస్ ఆర్ = కాంగ్రెస్స్
తెగులు దెశం - చంద్రబాబు = తెలుగు దెశం
తెగులు దెశం < కాంగ్రెస్స్
తెగులు దెశం + కమూనిస్టులు < కాంగ్రెస్స్
తెగులు దెశం + కమూనిస్టులు + తె రా స < కాంగ్రెస్స్
తెగులు దెశం + కమూనిస్టులు + తె రా స + (*%@*^(@ <= కాంగ్రెస్స్
ప్రజారాజ్యం -చిరు = 0
లొక్ సత్తా - జె . పి = 0
రాజకీయాలని ప్రక్షాళన చేస్తాము, కొత్త రాజకీయాలు తెస్తాము, మార్పు, అవినీతి నిర్మూలన, నిశ్శబ్ధ విప్లవం ( ఇవన్నీ లోక్సత్తా ముందే చెప్పింది.. ఆ తరవాత మెల్లి మెల్లిగా ప్రజారాజ్యం ఒక్కో నినాదాన్ని కలుపుకుంటూ పోయింది) ఇలాంటి నినాదాలతో అవతరించిన పార్టీని వాటిని ఆధారంగా చేసుకునే బేరీజు వేసి చూసుకోవడంలో తప్పేంటో అర్ధం కావడం లేదు... వాళ్ళు చేస్తున్న పనులును చూసి వాళ్ళ నినాదాలు నిజం కాదు, ప్రజారాజ్యానికి పాత పార్టీలకీ ఎమీ తేడా లేదు అంటే తప్పేంటో! రెండు కొత్త పార్టీలు ఒకే నినాదాలతో వస్తుంటే ఆ రెండు పార్టీలని పోల్చుకుని ఏది నిజంగా చెప్పింది పాటిస్తుందో చాటి చెప్పడం అవగాహన ఉన్న ప్రతి పౌరుడి భాధ్యత... ఎందుకంటే కొత్త సీసా లో పాత సారా మాదిరి ప్రజలని మోసం చేసే ప్రతీ చర్యని విమర్శించాలి, అడ్డుకోవాలి కాబట్టి... ఇంకో గుదిబండని నెత్తి మీద పెట్టుకోడానికి చిరంజీవి అభిమానులు (అందరూ కాదు) సిద్ధమేమో కానీ, అవగాహన ఉన్న ప్రజలు కారనే వివేకాన్ని చిరు అభిమానులు గ్రహిస్తే మంచిది... ఆ స్పూర్తిని అర్ధం చేసుకోకుండా, తమ అర్ధం లేని ఆవేశంతో, అసహనంతో విమర్శలు చేసే వాళ్ళ మీద ముద్రలు వేయ్యడం బుద్ధిమాలిన చర్య... పోను పోనూ, ప్రజారాజ్యంలో కాంగ్రెస్ ఛాయలు ఎక్కువైపోతున్నాయి...
రిప్లయితొలగించండిబహుశా మిత్రా లోక్ సత్తా నుంచి వీటన్నిటిని కాపీ కొట్టి ప్రజారాజ్యం సిద్దాంతాల జాబితాలో పెట్టినట్లున్నాడు. ఏదయినప్పటికి 'చిత్తసుద్ది మాటలలో కాదు చేతలలో చూపించాలనే' విషయం తొందరిలోనే ప్రజలకు అర్ధమవ్వుతుంది.
రిప్లయితొలగించండి*ఒక కొత్త పార్టి నడపాలంటె యెంత డబ్బు కావాలి , అది యెక్కడ నుండి వస్తుంది అన్న కాస్త కామన్ సెన్సు ఉపయొగించి మాట్లడు. *
రిప్లయితొలగించండిఇప్పటి వరకు నా కు తెలిసి పార్టి టికేట్ ఆశించేవారు, అభిమాన సంఘాల వారు డబ్బు ఖర్చు పెట్టుకున్నరు అని నా అభిప్రాయము. ఇంతలో నే చిరంజివికి ఐన ఖర్చు ఎమిటి? అందుకు అంత భారిగా డబ్బు తీసుకోవలసిన అవసరము ఎందుకొచ్చింది పార్టి ఫండ్ పేరుతో? మరి పవన్ కల్యాన్ మాటలు ఎంత ఆదర్శవాదం తో కూడి ఉనంటాయొ మనకు తెలియనిది కాదు కదా. అందరికన్న పవన్ కి క్లారిటి ఎక్కువా అని అర్థమౌతుంది రేపు అటువంటి వ్యక్తి మాటలకి పార్టిలో విలువేముంటుంది? పవన్ లాంటి వారు రేపు ఎదైనా ప్రజా ఉపయోగ పధకాలు మాట్లాడితే ఇచ్చిన వారు ఊరుకొంటారా ఇంత డబ్బులు తీసుకొన్నవారి మిదా?
ప్రజారాజ్యం వివిధ 21 శతాబ్దపు వివిధ వర్గాల/భావాల కూడలి "
చిరంజివి : సెల్ఫ్ హెల్ప్ బుక్ లో చేప్పె వ్యక్తి ( జీవితం లో అన్ని ప్లాన్ గా చేయాలి. )
నాగబాబు: డబ్బులున్న మధ్యతరగతి మనిషి( సాయంత్రమైతే తీరికగా తనకు నచ్చిన వాల్లతో మాట్లాడు కోవాలి అనే రకం, వీలైనంత ఉన్నంతలో సాహాయం చేయాలి అనే స్వభావం.)
పవన్ కల్యణ్: పుస్తకాల లో ప్రజల కష్టాలు చదివి, విని, కొంచెం చూసి సమాజానికి ఎమైనా చేద్దం అనుకోనే రకం.
మిత్ర & మూర్తీ : వీళ్ళు నాటి తరానికి ప్రతినిదులు, అన్ని సిద్దంతల తో విసుగెత్తి ఇక్కడెమైనా మంచి చేయటానికి విలౌతుందేమో కొత్త పార్టి కదా అవినితి తక్కువగా ఉనంటుందేమొ అని ఒక సారి ప్రయత్నిచి చూద్దాం అని వచ్చి ఓపిక గా వెచి చూచె రకం.వీళ్ళు ఇప్పుడు చివరి నిమిషంలో బయటకు వెల్లినా కొవర్ట్ బిరుదు తప్ప మరే విధము గా గుర్తింపు ఉండదు. వీళ్ళకి బెదిరింపు కాల్స్ చేసి వారిని ఎదొ విధం గా ఇంకొక పార్టి లొ చేర్పించి చూశారా! వీళ్ళు మేము ముందు చెప్పిన విధంగా ఆ పార్టీ తరపున మా పార్టిలో చేరిన కోవర్ట్లు అని అంటారు. అందువలన ఎన్నికలు అయ్యెనంత వరకు వీళ్ళకి ఇంకొక చాయిస్ లేదు. అక్కడ పడి ఉనండాలిసిందే. ఇప్పుడె వీరీ మాట ఎవ్వరు వినడంలేదు ఎన్నికల తరువాత కూరలో కరివేపాకే వీరీ పరిస్థితి. ఇదంతా తెలిసి సమరం ఒక్కడే వీరిని సరిగ్గా అంచనా వేసి ముందు చూపుగల నాయకుడిలా మొదటనే అన్ని పదవులకు రాజీనామ పడెశాడు అనిపిస్తున్నాది. ఇన్ని రోజుల పరిచయం ఉన్నవాళ్ళను, ఫామిలి స్నేహితులతో ఈ విధంగా ప్రవర్తించినవారు ( అది కూడా అధికారం లోనికి రాకముందే ) రేపు మిగతా వారి తో ఎలా ప్రవర్తిస్తారో బేరీజు వేయడం మనకు కష్టం కాదు.
అరవింద్: పక్కా తెలివైన వ్యాపారి ఎంత గోల జరిగినా కంపేని లాభాలను మరచి పోవడంలేదు. వ్యాపారి ఎప్పుడు ఇతరుల స్వభావాన్ని తనకు అనుకూలంగా మలచుకొంటాడు. పార్టి గెలిచిన తరువాత ఇతనే ఈ కంపెనికి ఓనరు, చిరంజీవిని ఇతడు బయటకు నేట్టకుండా ఉంటే పదివేలు....
ఈ పార్టి లో ఏ ఒక్కరీ కి కూడా సంపూర్ణమైన నాయకత్వ లక్షణాలు లేవు. అందరి దగ్గర ఒకొక్కగుణం ఉంది అంతే. నాయకత్వ లక్షణాలు లేని పార్టిలు అభిమానుల బలం తో ఎన్ని రొజులు బతుకుతుందో చూడాలి.
>>బాబు సత్యా.. నువ్వు చిరు ఎలాగయిన విమర్శించాలి అని దిగినట్టు వున్నావ్..టికట్ ఎన్ని కొట్లకు అమ్ముకున్నా.. ఎలెక్షన్ కమీషన్ పీకెదేమీ వుండదు..
రిప్లయితొలగించండినేను 10 కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్నా అని చెప్పిన టీఆర్‌యస్ అభ్యర్ధి పరిస్థితి ఏంటో తెలిసే చేసావా ఈ కామెంట్. పీకేదేమి లేకపోతే అల్లు అరవింద్ ని చెప్పమను బాబు, పార్టీ ఫండ్ కి టికెట్ అమ్ముకున్నాం అని. కొత్తగా రాజకీయాల మీద శ్రద్ద కలిగినట్లు ఉంది. కొంచెం విషయాలు తెలుసుకొని మాట్లాడు నాయనా.. ఇంక నేనేదో సహించలేను అని మాట్లాడుతున్నావ్, ప్రజారాజ్యం ని విమర్శిస్తే టీడీపీ, కాంగ్రెస్ సపోర్టర్స్ అనే చిన్న పిల్లల లక్షణాలు వదిలించుకో. ఒకసారి చాకిరేవు, ఇంక ఇతర బ్లాగుల్లో నా వ్యాఖ్యలు చూసి మాట్లాడు. పొలిటికల్ పార్టీ అందునా మార్పు తెస్తా అని ఊదరగొడుతున్న పార్టీ ని అమ్మోరి జాతర తో పోల్చావు. సంతోషం. విమర్శించే వాళ్ళందరని విషం చిమ్ముతున్నారని ఏడిస్తే ఎవడికి నష్టం? సామాజిక న్యాయం అని చావకొడుతున్న వాళ్ళు, పలుకుబడి కి ప్రాతిపదిక డబ్బే అని తీర్మానిస్తే వాళ్ళు సాధించే న్యాయం ఏంటో చిరంజీవి ని ముఖ్యమంత్రి ని చేసి మరీ తెలుసుకోవాల్సిన అమాయకత్వం లేదు.
ఒక కొత్త పార్టీ ని నడపాలంటే మిగతా పార్టీల్లో ఏమి లోపించాయో వాటిని తీసుకొని నడపాలి. నిజాయితి, చిత్తశుద్ధి. వాటిల్లో ఉన్నవాటితోనే మేమూ నడుపుతాం అంటే తీరేది చిరంజీవి ముఖ్యమంత్రి కోరిక తప్ప ప్రజల జీవితాల్లో మార్పు కాదు. మిగతా పార్టీల్లనే అన్నీ చేస్తూ సిగ్గు లేకుండా మాది భిన్నం అని చెప్పుకోవటం ఎందుకు, నీ లాంటి వాళ్ళు పొలోమని సంబరపడటం ఎందుకు? అసెంబ్లీ అభ్యర్ది ఖర్చు 10 లక్షలకు మించకూడదు అని చెప్పిన ఎలక్షన్ కమీషన్ కి కూడా కామన్ సెన్స్ లేదా? అసలు 10 లక్షలు కూడా పెట్టలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ కోట్లాది రూపాయలు పెట్టే వారికి టికెట్లు ఇవ్వటం ద్వార రాజకీయాన్ని మధ్యతరగతి కి దూరం చేస్తున్న పాపం లో చిరంజీవి కూడా భాగస్వామే అని ఒప్పుకున్నావు..
పార్టీ నడపాలంటే డబ్బు కావాల్సిందే. మరి టికెట్లు ఇవ్వకముందు వరకు 8 నెలలు పార్టీ ఎలా నడిచింది? ఇంక టికెట్లిచ్చిన తర్వాత ఒక నెల నడవలేదా? దీనిని బట్టే పార్టీ కోసమే డబ్బులు తీసుకోలేదని స్పష్టం అవుతుంది. ప్రపంచం లో ఏ పార్టీ అయినా ఫలానా కార్పోరేట్ మాకు ఫండ్ ఇచ్చింది అని చెప్పటానికి సంకోచించవు, మన దేశం లో బ్లాక్ మనీ కోశం బయటకు వెల్లడించకపోయినా అమెరికా వంటి దేశాల్లో అవి ఖచ్చితంగా విరాళాలు బహిర్గత పరుస్తాయి. చిరు ఇమేజ్ కి ఓట్లు రాలతాయో లేదో తెలీదు గానీ ఆ ఇమేజ్ ని టికెట్ల లెక్కన అమ్ముకొని సొమ్ముచేసుకోవచ్చు అని మాత్రం అర్ధం అయింది.
చదువరి గారు తన పాత టపాల్లో వేరే పార్టీ లని విమర్శిస్తే బాగు బాగు అని చంకలు గుద్దుకున్న మీ లాంటి అభిమానులు చిరంజీవి ని విమర్శిస్తే మాంత్రం చిరు ని టార్గెట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అర్ధం అయిందా ఎవరిది hypocrasy అని.. ప్రజారాజ్యం లోక్సత్త అంత గొప్ప పార్టీ కాదు అని తెల్సుకున్నందుకు సంతోషం.
>> ఎదెదొ చిరు పార్టి లొ కొత్త గా చుసినట్టు , మరీ ఎక్కువ బాద పడకండి .
చిరు పార్టీ లో కొత్తగా ఏమీ చూడట్లేదనే మా బాధ. అయితే చిరంజీవి లో ఇప్పటివరకు చూడని కొత్త కోణం అయితే చూస్తున్నాం. thanks to aravind. ఇంకొక విషయం.. కార్పోరేట్ లో జంప్ జిలానీ అనరు, వాళ్ళకి నోటీస్ పిరియడ్ అని ఒకటి ఉంటుంది, దానికి ఇద్దరి అంగీకారం ఉంటుంది.(employer, and employee). రాజకీయాల్లో అలా కాదే. పైన పార్టీ వాళ్ళు వద్దన్నా కూడా దొబ్బెయ్ బే అంటారు. సినిమాల్లో చిరంజీవి క్రమక్రమం గా ఎదిగాడు, కానీ ఇక్కడ ఆ ఓపిక నసించినట్లుంది. short cuts కోసం ప్రయత్నిస్తున్నాడు.,
చెప్పగా .. నీలాంటి చిరు హెటెర్స్ కి నేను అంత టైం స్పెండ్ చెయ్యలేను. ఒక పదిరొజులు ఈలా అర్గ్యుమెంట్ నడచినా నువ్వు నేను మారం.. చిరు ని హెట్ చెయ్యడం ని నరనరాల్లొ వుంది. చిరు ని అభిమానించడం నా నరనరాల్లొ వుంది.
రిప్లయితొలగించండిటెక్ కేర్
BTW.. జంప్ జిలానీ లు ఎక్కడయినా ఒకటే.. కార్పోరేట్ లో అయిన నువ్వు వెళ్లిపోతాను అంటే ఎవరు ఆపలేరు. 1 month నోటీసు ఓన్లీ 1 month delay చేస్తుంది. అది 1 month శాలరీ ఇచేస్తే అది వుండదు. నువ్వే కార్పొరేట్ కంపెనీ లో చేస్తున్నావో తెలీదు మరి.
చిరు ని నరనరాల్లో పెట్టుకొని ద్వేషించటానికి నాకు ఆయనతో ఆస్థి తగాదాలు, ప్రేమ గొడవలు, రాయలసీమ ఫ్యాక్షనిజం గట్రా ఏమీ లేవు బాబు.. అలానే నరనరాల్లో పెట్టుకొని పూజించాల్సిన అగత్యమూ లేదు. నేను సినిమాల్లో మాత్రమే చిరంజీవి వీరాభిమానిని. ఎందుకంటే నా దృష్టి లో మిగిలిన వాళ్ళకన్నా నటన, డ్యాన్సులు, ఫైట్లు బాగుంటాయి. atleast నాకు నచ్చుతాయి. అలానే రాజకీయాల్లో చిరంజీవి కన్నా అవగాహన, చిత్తశుద్ది, నిజాయితి ఉన్నవాళ్ళు వేరే ఉన్నారు కాబట్టి వాళ్ళది నచ్చుతుంది. When i have the best, why should I prefer the better? Also, to me politics and movies are mutually exclusive. when you have chiranjeevi as an actor in the back of your mind then your opinion is impure. have chiranjeevi as a politician and make your thought. నీ లాంటి వాళ్ళకి చెప్పే ఓపిక నాకు ఎప్పుడూ ఉంటుంది. btw.. మీకు కార్పోరేట్ విషయాల్లో కూడా తెలిసింది అంతంత మాత్రమే అని అర్ధం అయింది. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే అరిపిరాల గారిని అడుగు. http://hasyadurbar.blogspot.com/
రిప్లయితొలగించండిచదువరి గారు, అనవసర చర్చ తో మీ బ్లాగు ప్లేస్ ని వృధా చేసినందుకు మన్నించండి.
కార్పొరట్ లొ మాత్రం మీకు చెప్పె లెవెల్ లొ పొసిషన్ లొ నేను వున్ననని నా నమ్మకం.అఫ్ కొర్స్ మీరు సి యి వొ లెవెల్ లొ వుంటె నేను యెమి చెప్పలెను కాని .
రిప్లయితొలగించండిపైన వ్యాఖ్య లోని మీరు ప్రస్తావించిన కార్పోరేట్ అంశాలకి కూడా నేను సమాధానం చెప్పేవాణ్ణి. కానీ ఇక్కడ అది అప్రస్తుతం, అసంధర్బం. ఇప్పటికే అర్ధం లేని పోలికలతో చర్చ చాలా పక్కదారి పట్టింది, మీరు మీ బ్లాగు లో దీని గురించి వ్రాస్తే అక్కడ వ్యాఖ్యలు వ్రాస్తాను. btw.. నేను నాకు అంతా తెలుసని చెప్పలేదు, కానీ మీరు చెప్పిన దాన్ని contradict చెయ్యచ్చు, కానీ ఇక్కడ టపా కి సంభందించి చర్చించటానికే గానీ ఎవరి పరిఙ్ఞానం ఎంత అని వాదులాడుకోటానికి కాదు. ఇంక ఈ టపా కి సంభందించి ఇదే నా చివరి వ్యాఖ్య.
రిప్లయితొలగించండిచదువరి గారు, మీరు ఇప్పటికే చూపిన సహనానికి కృతఙ్ఞతలు.
pseudo intellectuals ekkuvai poaaru!!
రిప్లయితొలగించండిJai Loksatta, jai JP anadam, edo painundi kinda oodi padinantha feeling ivvadam!! ento janaalu..
loksatta yokka veerabhimaanulu ee linkulo chadavandi...
రిప్లయితొలగించండిhttp://telugu.greatandhra.com/sangathulu/20-04-2009/evaru_part2.php
dantlo, lavu rattayya ticket pai raasaadu..
+ C.purnachandra rao ani oka strelaki pichcha gouravam ichche aayanni kooda JP loksatta lo join chesukunnaadu.. mari daanni emantaaru JP bhajana parulu..
నేను అనుకునంత అయింది. వలస వచ్చిన వాళ్ళకు అదికంగా టికెట్ ఇచ్చారు, దాని ఫలితం అనుభవించారు. ఇది జరగాల్సిందే. చిరు రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నవాళ్ళలో నేను వకడిని. చిరు రాజకీయాల్లోకి వచ్చారు కానీ పాటించాల్సిన నియమాలు తుంగలో తొక్కారు. మార్పూ అన్నారు కానీ చేసింది సున్యం. వలస వచ్చిన వారికీ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడే పరాప విజయానికి బీటలు వారాయి. ఉదాహరణ చెప్పాలంటే మాది బి.కొత్త కోట . తంబళ్ళపల్లి నియోజక వర్గం . అక్కడ కాంగ్రెస్ పార్టి నాయకుడు కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి సొంత పార్టి లో టికెట్ తగ్గక పోవడంతో రాత్రికి రాత్రి పరాప లో చేరి పోయారు. విచిత్రం ఏమిటంటే చేరిన రెండు రోజుల్లోనే ఆయనకు చిరు గారు టికెట్ కేటాయించేసారు. అది మాకు ( చిరు అభిమానులు ) ఆగ్రహం తెప్పించింది, ఫలితం పార్టి కోసం ఎవరు పనిచేయలేదు . ఇక్కడ పరాప కు పనిచేసిన వాళ్ళు కులం అధారంగా బలిజ కులం మాత్రమే పని చేసింది. ఇది సంగతి. గోడ దుకు నాయకులకు మంచి బుద్ది చెప్పారు ఇక్కడి ప్రజలు.
రిప్లయితొలగించండిపార్టి లో అల్లు అరవింద్ పెత్తనం ఎంతవరకు సబబు. మహా మహుల్ని పక్కన పెట్టి పెత్తనం మొత్తం అల్లు అరవింద్ గారికి అప్పగించారు. ఫలితం అనుభవించారు. మమ్మల్ని బాధ పెట్టారు. అందుకే మేమంతా కాంగ్రెస్ కు వోటేసాం. ఇక వచ్చే ఎలెక్షన్ లో నైన చిరు పార్టి కి సరైన నాయకత్వం వహించి పార్టి కి ముందుకు తీసుకో పోవాలని అసిస్దాం.