28, సెప్టెంబర్ 2011, బుధవారం

కోదండరామ్ గారి మిలిటెంటు అహింస!

ప్రపంచం మొత్తానికి నలుపంటే నలుపే, తెలుపంటే తెలుపే. కానీ తెవాదనాయకులు అబద్ధాల జీవులు కాబట్టి, వాళ్ళు తెలుపంటే నలుపనీ, నలుపంటే మరోటనీ మనం అర్థం చెప్పుకోవాలి. కోస్తా సీమల ప్రజలను బూతులు తిట్టి, తరవాత "అబ్బే అది తిట్టడం కాదు. మా బాసే అంత. మేం గట్టనే మాట్టాడుకుంటం" అని చెప్పేవాళ్ళు. ఈ బాపతు భాష్యాలను ఇప్పుడు ఉద్యమంలో చాలా ప్రభావశీలంగా ఆచరణలో పెడుతున్నారు కోదండరామ్ సారు.

ప్రొఫెసరు సారు, ఉద్యమాన్ని ఇక మిలిటెంటు పంథా తొక్కించాలి అంటూ వ్యాఖ్యానించారు మొన్నామధ్య. తెవాదులు తల పంకించారు. మిలిటెంటు ధోరణా అని తెవాదులు కానివాళ్ళు ఆశ్చర్యపోయారు. తెవాద నాయకుడు ఈసారి కూడా తమకే ప్రత్యేకించిన కొత్త అర్థం చెప్పారు.. మిలిటెంటు అంటే తీవ్రతరమైన అహింసా పోరాటం/సహాయ నిరాకరణ అంట. అర్థం కానివాళ్ళకు ఇంకో జెర్కిచ్చారు సారు - ’అసలు గాంధీ చేసిన దండి సత్యాగ్రహం కూడా మిలిటెంటు పోరాటమే’ అని గాంధీని కూడా తన తెవాదం లోకి లాక్కున్నారు. తెవాద ప్రొఫెసరు గారు పైకి చెబుతున్నది ఏమైనప్పటికీ, అసలు అర్థమేంటో వారి అనుచరులకు బాగానే తెలుసు.

వెన్వెంటనే ఆయన శిష్యరేణువులు మిలిటెంటు అహింసను ఆచరణలో పెట్టేసారు కూడా.
తెవాద నాయకులు, వారి అనుచరగణమూ మొన్న రవాణా శాఖ ఆఫీసుకు పోయి, అక్కడ అధికారులను బూతులు తిట్టారు. తెవాది రౌడీ ఒకడు ఒక అధికారిని కొట్టాడు కూడా. చాటుగా మాటేసి కొట్టేందుకు ఈ బాపతు అరకప్పు చాయ్ రౌడీలను వెంట తీసుకుపోతూ ఉంటారు తెవాద నాయకులు.

మరసటి రోజున (నిన్న) దెబ్బలు తిన్న అధికారిని పరామర్శించడానికి లగడపాటి రాజగోపాల్ వెళ్తే, ఆ మూక మళ్ళీ వెళ్ళారు. గందరగోళం సృష్టించారు. హరీష్ రావు ’పోలీసు ఆఫీసరు స్టీఫెన్ రవీంద్ర నా చేతులకు బేడీలు వేసి తీసుకుపోతానని అన్నాడు’ అంటూ ఆరోపించాడు. నమ్మే మాటలేనా అవి? రాజకీయ నాయకుల మాటలు నమ్మదగ్గవి కావు. తెవాదుల మాటలు అసలే నమ్మదగ్గవి కాదు. హరీష్ రావు తెవాద రాజకీయనాయకుడు - ఇక ఇతడి మాటలనా నమ్మేది!!?

హరీష్ రావు ఈ మాటలు చెప్పిన కాసేపటికే, మధు యాస్కీ కెమెరాల ముందు మాట్టాడుతూ రాజగోపాలును తిట్టాడు. ’నా కొడుకును తంతం’ అని అన్నాడు.ఇది టీవీల్లో వచ్చింది. మరో తెవాద రాజకీయ నాయకుడి ప్రవర్తన ఇది.

మరి కాస్సేపటికి లాయర్ల వంతు - రాజగోపాలు పరామర్శను నిరసిస్తూ ధర్నా చేసారు. వీళ్ళను అరెస్టు చేసి తీసుకుపోతూంటే లాయర్ల నాయకుడు విలేఖరులతో అంటున్నాడు. ’ఆణ్ణి హైదరాబాదు కాదు, తెలంగాణ పొలిమేరల అవతల దాకా పారదోలుతం’ అని.

ఇదీ తెవాద నాయకుల ప్రవర్తన! దుష్ప్రవర్తన వీళ్ళ ట్రేడ్ మార్కు. బూతులు వీళ్ళ అధికార భాష (ఒక బ్లాగులో ఒక వ్యంగ్య వ్యాఖ్య చూసాను - ’మా తెలంగాణ కోటి బూతుల వీణ’ అని. అతికినట్టు సరిపోతుంది ఈ తెవాద నాయకులకు). వీధుల్లో పడి అడ్డొచ్చినవాళ్లను కొట్టడం వీళ్ళ సంస్కృతి.

ఇదంతా చూసాక, సామాన్యుడికి అర్థమైంది మిలిటెంటు అహింస అంటే ఏంటో! కోదండరామ్ గారూ.., ఇదేనా తీవ్రతరమైన అహింసా పోరాటం!?

గురూజీ తీవ్రతరమైన అహింస చెయ్యమంటే.. వీళ్ళు హింసను తీవ్రతరం చేసారు. ఇన్నాళ్ళూ మాటల్లోనే ఉన్న హింసను మరింతగా పెంచడమే కాకుండా చేతల్లోకీ దిగారు. గురువుగారు మిలిటెంటు పోరాటం చెయ్యమంటే వీళ్ళు "అమిలిటెంటు"  పోరాటం చేస్తున్నారు. మిలిటెంటుకు ఆయన పైకి చెప్పింది తప్పుడు భాష్యమని వాళ్ళే తేల్చి చెప్పేసారు. ఆచరణ మాత్రం అసలైన అర్థంలోనే చేస్తున్నారు. ఇకనుండి కోదండరామ్ చెప్పే విషయాలకు జాగ్రత్తగా అర్థాలు వెతుక్కోవాలి మనం. 

తెవాదుల ఆస్థాన అబద్ధాల సామ్రాట్టు, ఇంకో ఆచార్యవర్యుడు, ప్రొఫెసరు వక్రవాణి ఈమధ్య కొత్తగా మళ్ళీ విషం కక్కాడు: "కోస్తాలో ఒక జిల్లాలో  కొద్ది మంది రైతులు సాగుసెలవు ప్రకటించి బ్లాక్ మెయిలు చేస్తే పరుగెత్తుకుంటూ కమిటీ వేసి నివేదిక తెప్పించుకుంది ఈ ప్రభుత్వం. కానీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతోంటే మాత్రం పట్టించుకోవడం లేదు", అని అన్నాడు. అక్కడి ప్రజలు సాగు మానేసి నిరసన తెలిపితే అది బ్లాక్ మెయిలంట. వీళ్ళది మాత్రం ప్రజాస్వామిక ఉద్యమమంట!!! (వీళ్ళ ప్రజాస్వామిక ఉద్యమపు సొంపు నిన్నా మొన్నా చూసాం). ఈ ప్రొఫెసరు అవాకులు చెవాకులకు అంతు లేకుండా పోతోంది.

.............................

ప్రశ్న: అధ్యక్షా, రవాణా శాఖ అధికారిని కొట్టినవాడి మీద ఏం చర్య తీసుకున్నది ఈ ప్రభుత్వం?
ముఖ్యమంత్రి: మేం చవటాయిలం కాబట్టి, చర్య తీసుకునే సత్తా మాకు లేదు కాబట్టి, ఈ ప్రశ్నకు ఆస్కారమే లేదు.

10 కామెంట్‌లు:

  1. ప్రశ్న: అధ్యక్షా, రవాణా శాఖ అధికారిని కొట్టినవాడి మీద ఏం చర్య తీసుకున్నది ఈ ప్రభుత్వం?

    రిప్లయితొలగించండి
  2. ప్రశ్న: అధ్యక్షా, రవాణా శాఖ అధికారిని కొట్టినవాడి మీద ఏం చర్య తీసుకున్నది ఈ ప్రభుత్వం?

    ముఖ్యమంత్రి: కళ్ళు పనిచెయ్యడం లేదా ? ఈ విషయం లోనే కదా లగడపాటి ని అరెస్ట్ చేసాం...ఇంకా ఏంటి మీ లొల్లి ?

    రిప్లయితొలగించండి
  3. ఇంగితజ్ఞానం లేని కోదండరాం గూర్చి మాట్లాడడం టైం వేస్ట్

    రిప్లయితొలగించండి
  4. ఏమాత్రం పసలేని వాగుడు వాగే ఆ కో.రా గురించి మాట్లాడడం శుద్ధ దండగ. నోటికేదొస్తే అదిమాట్లాడే నాయకుడి అనుచరగణం వీళ్ళంతా.
    అయినా మా భాష వేరు అని చెప్పి స్వచ్చమైన తెలుగులో ’సకల జనుల సమ్మె’ అని అంటారేంటి వీళ్ళు.. ’మొత్తం బంద్ వెట్టుడు... మందిని బొంద వెట్టుడు’ అని పెట్టుకోవాలిగాని

    రిప్లయితొలగించండి
  5. కోదండ తీవ్ర-అహింసా న్యాయం! :D ఎదవలండి శుద్ధ ఎదవలు, ఏమి మాట్లాడుతారో వారికే తెలియని ట్రాన్స్లో వుంటారు.

    కిరణ్ కుమార్ మౌనాయుధంతో తెలబాన్లలో తీవ్ర అసహనాన్ని ప్రేరేపిస్తున్నట్టుంది. ఏదో ఒహ 'ఇన్‌స్టంట్ న్యాయం' జరిగేలా పరిస్థితులు మారుతున్నాయనిపిస్తోంది. :P

    రిప్లయితొలగించండి
  6. http://www.andhrabhoomi.net/state/y%C3%B0fy%C3%B0f-503
    చదువరీ,
    రాయల-తెలంగాణ పై మీ అభిప్రాయాలు పోస్టండి. నా వుద్దేశ్యంలో ఇది ఆత్మహత్యాసదృశం అవుతుంది. రాయలసీమ తెలబాన్లతో కలవడమా?! అసంభవం, ఇంత పనికిమాలిన ప్రతిపాదనకు ఏ రాయలసీమ పౌరుడు అంగీకరించడు. మజ్లిస్, తెలబాన్లతో తప్ప ఏ జార్ఖండ్, చత్తీస్‌ఘడ్లతో వుండటం మేలేమో :D.
    హైదరాబాద్ తెలంగాణాకే ఇవ్వాలంటే, నల్గొండ, ఖమ్మం జిల్లాలు కోస్తాంధ్రలోను, నెల్లూరు, మహబూబ్‌నగర్ రాయలసీమలోను కలిపేయాలి. అప్పటికీ సీమాంధ్ర కలిసే వుంటుంది, వుండాలి.

    రిప్లయితొలగించండి
  7. Snkr: అదొక తెలివితక్కువ ప్రతిపాదన అని తెలిసిపోతూనే ఉంది. అది కేసీయాసురుడు చెలామణీలో పెట్టిన మాట అని, సకల జనుల సజల కనులను తుడిచేందుకు అతడిలాంటి జిత్తులు వేసాడనీ జనం అంటున్నారు. అసలివన్నీ కాదుగానీ.. కేసీయారుకు జిల్లా బహిష్కరణ శిక్ష వేసి అతణ్ణి ఇడుపులపాయకు తోలేస్తే రాష్ట్రానికి అతడి శని వదిలిపోతుంది. అక్కడ జగనో కేసీయారో ఎవడో ఒక్కడే మిగులుతాడు (ఒక్కడు చాలు మనకు, ఇద్దర్నీ భరించలేం). ఒకవేళ ఇద్దరూ కలిసిపోయారనుకోండి.. ఇద్దర్నీ కలిపి తీహారుకు పంపించొచ్చేమో పరిశీలించొచ్చు! :)

    రిప్లయితొలగించండి
  8. మా "నూతన ప్రజా మిలిటెంట్ అహింసా సకలజనుల విప్లవపోరాట స్పూర్తిదాయక నిరశనోద్యమ పిడివాదపు దొమ్మీ” క్షమించాలి సమ్మె గురించి మీకు సరిగా అర్ధం అయినట్టు లేదు, అందుకు మీరందరు మా కోదండరామిరెడ్డి ఆచార్యులవారి క్లాసులకి వచ్చి తెలుసుకొనండి.

    రిప్లయితొలగించండి
  9. ఒకసారి,తెలంగాణావాది(ఎవరో మీకు తెలుసు.ఇక్కడ వ్యక్తిగత ప్రస్తావన ముఖ్యం కాదు) ఒక T.V.ఇంటర్వూ లో ఇలా అన్నాడు."1956 నవంబర్ 1 కి ముందు మాది ఒక ప్రత్యేక రాష్ట్రం.1956 నవంబర్ 1 న రెండు రాష్ట్రాల కలయిక ఈ ఆంధ్రప్రదేశ్.ఇప్పుడు మేమడుగుతున్నది 1956 కి ముందు ఉన్న మా రాష్ట్రం.అప్పటి రాష్ట్రం లో ఒక్క ఇంచ్ తక్కువైనా ఊరుకోం.ఆంధ్ర ప్రాంతం నుండి ఒక్క ఇంచ్ కూడా మాకు అక్కరలేదు"అని.

    నిజానికి 1956 నవంబర్ 1 కి ముందు తెలంగాణా రాష్ట్ర మనేది ఏదీ లేదు.నిజాం పాలన లో "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం" 1948 సెప్టెంబర్ 17 పోలీస్ చర్య తరువాత ఇండియన్ యూనియన్ లో విలీనమైంది.అప్పటి నుండి 1956 నవంబర్ 1 న భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేవరకు హైదరాబాద్ ఒక రాష్ట్రంగా కొనసాగింది. అప్పటి "16 జిల్లాలుగా గల హైదరాబాద్ రాష్ట్రం"లో "8 జిల్లాలు గల తెలంగాణా ప్రాంతం(తరువాత 1978 లో రంగారెడ్డి,హైదరాబాద్ 9,10 వ జిల్లాలుగా ఏర్పడ్డాయి)" ఒక భాగం మాత్రమే.విలీనం తరువాత 1950 వరకు జనరల్ J.N.Chowdary సైనిక పాలన కొనసాగింది.తరువాత హైదరాబాద్ రాష్ట్ర తాత్కాలిక Civil Administrator గా M.K.Vellodi 1950 జనవరి 26 న భారత ప్రభుత్వం చే నియమింపబడ్డారు.1952 లో తొలి సారత్రిక ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లు గల హైదరాబాద్ రాష్ట్రం లో 93 సీట్లు గెల్చుకొన్న కాంగ్రెస్ పార్టీ,బూర్గుల రామకృష్ణా రావు CM గా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.1955 లో 1st State Reorganisation Commission హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి కన్నడం మాట్లాడే 3 జిల్లాలని కర్ణాటక లో,మరాఠా మాట్లాడే 5 జిల్లాలని మహరాష్ట్ర లో కలిపి మిగిలిన "8 జిల్లాలు గా గల తెలంగాణా ప్రాంతాన్ని" ప్రత్యేక రాష్ట్రంగా గాని లేక అప్పటికే ఒక రాష్ట్రం గా ఉన్న ఆంధ్ర రాష్ట్రం లో గాని కలపవచ్చు అని సిఫార్సు చేసింది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు కోసం కేంద్రం ప్రయత్నిస్తున్న తరుణం లో తెలుగు మాట్లాడే ఆంధ్ర రాష్ట్రం పక్కనే తెలంగాణా ను ప్రత్యేక రాష్ట్రం చేయడంలో అర్థం లేదు.అలాగని అప్రజాస్వామికంగా కలుపలేరు కాబట్టి 1955 డిసెంబర్ లో అప్పటి హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీ లో తీర్మానం పెట్టగా హాజరైన 147 మందిలో 103 మంది తెలంగాణాను ఆంధ్ర రాష్ట్రం లో కలుపమని, 29 మంది వద్దని వాదించారు. 15 మంది తటస్థంగా ఉన్నారు.ఆ తరువాత కూడా తెలంగాణావాసుల అపోహలు తీరుస్తూ 1956 ఫిబ్రవరి 20 న పెద్దమనుషుల ఒప్పందం(Gentlemen's Agreement ) చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక తెలంగాణా కు ప్రత్యేక హక్కులు,రాయితీలు కల్పిస్తామని ఆంధ్రనాయకులు హామీ ఇచ్చారు.దాంతో అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఆ "8 జిల్లాల తెలంగాణా ",ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడానికి మార్గం సుగమమైంది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసారు.
    ఔరంగాబాద్,బీడ్,నాందేడ్, పర్భాని ,ఉస్మానాబాద్ అనే 5 జిల్లాలను మహరాష్ట్ర లో(అప్పటికి దాన్ని బోంబే రాష్ట్రం అనేవారు) కలిపారు.
    బీదర్,గుల్బర్గా,రాయచూర్ అనే 3 జిల్లాలను కర్ణాటక లో కలిపారు.
    "మిగిలిన 8 జిల్లాల తెలంగాణా"ను అప్పటి ఆంధ్రరాష్ట్రంతో కలిపి 1956 నవంబర్ 1 న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసారు.పై మార్పులన్నీఒకేసారి చేసారు.కాబట్టి తెలంగాణాను హైదరాబాద్ రాష్ట్రం నుండి వేరు చేయడం, ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం రెండూ ఒకేసారి జరిగాయి.అంటే కనీసం ఒక్క రోజు కూడా తెలంగాణా ఒక ప్రత్యేక రాష్ట్రంగా గాని,కనీసం ప్రత్యేక పరిపాలనా విభాగం గా గాని చరిత్ర లో ఎప్పుడూ లేదు.మరి ఇప్పుడు తెలంగాణావాదులు అన్నట్టు అప్పటి హైదరాబాద్ రాష్ట్రం"ఒక్క ఇంచ్ కూడా" కోల్పోకుండా కావాలంటే మహరాష్ట్ర ని, కర్ణాటక ని కూడా అడగాలి.అడిగితే బాగుండేది వాళ్ళని "ఒక్క ఇంచ్ కోల్పోకుండా కావాలని ".అప్పుడు ఒక్క పంచ్ కూడా వేస్ట్ అవకుండా కుమ్మేస్తారు వాళ్ళు.అసలే ఆ రాజ్ ధాకరే మంచోడు కాదు

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు