8, జనవరి 2011, శనివారం

’చదువరి’ పత్రికలో వచ్చిన కొన్ని వార్తాశీర్షికలు

’చదువరి’ పత్రికలో ఇప్పుడు/రాబోయే పదేళ్ళలో వచ్చే వార్తల శీర్షికలివి. అవధరించండి.

"మరో నెల రోజుల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ నుండి హైదరాబాదు రాక"

"ఉద్యమం కోసం ఇంకా ఎవరూ ప్రాణత్యాగం చేసుకోలేదు. కాబట్టి ఎవరూ చేసుకోకండి - జాక్ ది రిప్పర్"

"మీ ప్రాణాలు పణంగా పెట్టైనా సరే తెలంగాణ సాధిస్తాం -ఉస్మానియాలో ఇంకో జాక్"



"నిజాలు మాత్రమే చెప్పాలని మీడియాపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడం అప్రజాస్వామికం -మరో జాక్"

"2014 కల్లా శ్రీకృష్ణ కమిటీ నివేదికపై మధ్యంతర అధ్యయన నివేదిక, పూర్తిస్థాయి నివేదిక 2025 లోపే - చిదంబరం"

"ధరలు పైకి పోయీ పోయీ.., పూర్తిగా మాయమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు - పౌర సరఫరాల శాఖ మంత్రి"

"ఇకపై అవినీతి గురించి ప్రజలకు తెలీకుండా ఏం చెయ్యాలో అన్నీ చేస్తాం - మన్మోహన్"

"ఒక్కరాత్రి కూడా నా నిదర పాడు కాలేదు కాబట్టి, నా ప్రభుత్వంలో అవినీతి లేనట్టే -మన్మోహన్"

"కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎంపీలకు సిగ్గూ శరం, చీమూ నెత్తురూ ఉన్నై - కేకే పునరుద్ఘాటన"

"సమైక్యాంధ్రప్రదేశును నిలుపుకుంటూనే తెలంగాణను ఏర్పాటు చేస్తాం - చంద్రబాబు"

"తెలంగాణ ఏర్పాటు కాకుండా ఉండటం కోసం అవసరమైతే ఆంధ్ర ప్రదేశును చీలుస్తాం - కాంగ్రెసు ఎంపీలతో సోనియా"

 "తెలంగాణను తెచ్చేదీ మేమే, సమైక్యాంధ్రను ఉంచేదీ మేమే - కాంగ్రెసు ఎంపీల సమైక్య వేదిక"

"నేను రాజీనామా చెయ్యడం లేదని ఈ రాజీనామాలేఖ ద్వారా మీకు తెలియజేస్తున్నాను, ఇక మీ ఇష్టం! - లోక్ సభ స్పీకరుకు రాసిన లేఖలో కేసీయార్"

"మన తెలంగాణ, మా రాయలసీమ, ఆ కోస్తా - మూడూ సమైక్యాంధ్రలో భాగమే!- కిరణ్ కుమార్ రెడ్డి"

 "సమైక్యాంధ్ర ప్రదేశ్, ప్రత్యేక తెలంగాణలే డిమాండ్లుగా చంద్రబాబు ఆమరణ దీక్ష"

"రాష్ట్రాన్ని చీల్చకుండానే తెలంగాణ ఏర్పాటు చేస్తాం - చిరంజీవి"

"తెలంగాణ పట్ల నా ఉద్దేశం ................................................... - సోనియా"

"తెలంగాణ పట్ల తన అభిప్రాయాన్ని సోనియా గుసగుసగా చెప్పడంతో విలేకరులకు వినబడలేదు"

 "బీహారును బీ, హా, రు అనే మూడు రాష్ట్రాలుగా చీల్చాలి - బీహారు ఎన్నికల ఫలితాల తరవాత కాంగ్రెసు ఆలోచనలు"

"ఏదో ఒకనాటికి తెలంగాణ ఏర్పాటు కాకపోతే నేను ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసేస్తాను - కేకే"

"తెలంగాణ కోసం ప్రణబ్ వద్ద ఏడ్చిన మధు యాస్కీని వచ్చే ఏడు ఓదారుస్తా - జగన్"

"ఓదార్పు యాత్రలో ఉన్నందున నాన్న పదో వర్ధంతికి ఇడుపులపాయకు పోలేను -జగన్"

"మా తమ్ముడు తీసిన ’కొమరం పులి’ సినిమాయే తెలంగాణ పట్ల మా నిబద్ధతకు సాక్షి"

"తెలంగాణలో నా అభిమానుల కోసం అవసరమైతే నేనే ఇంకో సినిమా తీస్తా - చిరంజీవి"

24 కామెంట్‌లు:

  1. చాలా బాగున్నాయండి. ఎవర్ ఫ్రెష్.

    రిప్లయితొలగించండి
  2. బావున్నాయండి. ఇదిగో ఇంకొన్ని హెడ్ లైన్లు

    4G స్కాంలో పదిహేను లక్షల కోట్ల గోల్ మాల్
    ట్వంటీ ట్వంటీ ఫార్మాట్లో పదివేల పరుగులు పూర్తి చేసిన సచిన్
    రాహుల్ గాంధీకి భారత రత్న ఇవ్వాలి - ప్లీనరీలో కాంగ్రెస్ ఎంపీల డిమాండ్
    ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ కు జగన్ పార్టీ మద్దతిస్తుంది - అంబటి రాంబాబు
    తెలంగాణా జెఎసి లన్నిటిని సమన్వయ పరిచేందుకు మరొక జెఎసి ఏర్పాటు - ప్రో. కోదండ రాం
    కసబ్ పై కొనసాగుతున్న విచారణ
    కొనసాగుతున్న హైదరాబాద్ మెట్రో రైల్ పనులు

    రిప్లయితొలగించండి
  3. హ్హ..హ్హ..హ్హ.. బావుంది.

    రిప్లయితొలగించండి
  4. తెలంగాణా జెఎసి లన్నిటిని సమన్వయ పరిచేందుకు మరొక జెఎసి ఏర్పాటు - ప్రో. కోదండ రాం lolllll..

    రిప్లయితొలగించండి
  5. ఉగాండా, సైబీరియా దేశాలకు ఓదార్పుయాత్ర రూట్ మ్యాపు విడుదల చేసిన అంబటి రాంబాబు.
    ఈ యేడాది దేశ సంపన్నుల జాబితాలో 4వ స్థానానికి చేరుకున్న వయ్యస్ విగ్రహాల తయారీదారు జక్కయ్య. 13 వ స్థానానికి పడిపోయిన జగన్
    సొనియా కి కొండా సురేఖ 1349 వ లేఖాస్త్రం.
    జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో తెలంగాణ కి అన్యాయలపై ప్రొ. జయసంకర్ పేపర్.
    సైద్దాంతికంగా కలిసి వచ్చే పార్టీలతో పొత్తుకి సిద్దం. - లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ
    తమిళాన్ని ప్రపంచ బాషలన్నిటికి మాతృబాష గా గుర్తించాలి - అంతర్జాతీయ తమిళ దినోత్సవం లో ముఖ్యమంత్రి కరుణానిధి
    పస్చిమ బెంగాల్ చైనా లో అంతర్భాగం. - గూగుల్ మ్యాపు విడుదల. నిరసన తెలిపిన భారత్

    రిప్లయితొలగించండి
  6. ప్రశాంతంగ బస్సులు కాల్చనీరు రాల్లు రువ్వనీరు ఇదేం ప్రజాస్వామ్యమా పోలీసు రాజ్యమారా బయ్? -మెదక్ మహా ఓండ్రలో కేసీయార్ సూటి ప్రశ్న

    పై అజ్ఞాత: అప్పటికీ ముఖ్యమంత్రి కరుణానిధా? అంటే జూనియర్ ఎంటీయార్ లాగ జూనియర్ కరుణానిధి అని మీ అభిప్రాయమా?

    రిప్లయితొలగించండి
  7. జూనియర్ కరుణానిధా? అంత తొందరేంటండి? మధ్యలో అళగిరి, స్టాలిన్, కనిమోజి ఏమౌతారు?

    రిప్లయితొలగించండి
  8. హిహిహి...

    బాగా వ్రాశారు, చదువరి పత్రికలో ఉండేవన్నీ ఊహాజనితాలేనని!

    రిప్లయితొలగించండి
  9. బాగున్నాయ్ మీ headlines .అవి నిజం కాకూడదని ఆశిద్దాం

    రిప్లయితొలగించండి
  10. /హిహిహి...బాగా వ్రాశారు, చదువరి పత్రికలో ఉండేవన్నీ ఊహాజనితాలేనని!/

    హమ్మయ్యా... అన్నీ ఒకచోట చూశాకగాని వెలగలేదన్నమాట! వేయండీతనికి రెండు 'గులాబి రంగు ' వీరతాళ్ళు. :)) :P

    రిప్లయితొలగించండి
  11. బీహారును బీ, హా, రు అనే మూడు రాష్ట్రాలుగా చీల్చాలి
    అదిరింది :)

    రిప్లయితొలగించండి
  12. Excellent. Particularly the following two.

    "బీహారును బీ, హా, రు అనే మూడు రాష్ట్రాలుగా చీల్చాలి - బీహారు ఎన్నికల ఫలితాల తరవాత కాంగ్రెసు ఆలోచనలు"

    "తెలంగాణలో నా అభిమానుల కోసం అవసరమైతే నేనే ఇంకో సినిమా తీస్తా - చిరంజీవి"

    రిప్లయితొలగించండి
  13. //చదువరి పత్రికలో ఉండేవన్నీ ఊహాజనితాలేనని!

    హమ్మయ్యా... అన్నీ ఒకచోట చూశాకగాని వెలగలేదన్నమాట!//


    ఔను Snkr

    ఈ బ్లాగులో మిగతా కొన్ని పోస్టులు కూడా చూశాక వెలిగింది నాకు. నీకు ముందే తెలుసన్న మాట!

    రిప్లయితొలగించండి
  14. శ్రీకాంతాచారి గారూ, మరీ అన్నీ ఊహాజనితాలేనంటే ఎలాగండీ.. తెవాదుల అబద్ధాల గురించి రాసినవి చూడండి, పచ్చినిజాలేగదా అవి! :)

    రిప్లయితొలగించండి
  15. నిజాలేవో, సరదాలేవో, అబద్దాలేవో తెలుసుకోలేనంతగా 'వెనకబడ్డారా', శ్రీకాంత్ ఆచారి? ప్చ్ .. అయ్యయ్యో! పాపం. వెనకబడ్డ ప్రాతం అంటే ఆర్థికంగా అనుకున్నా, మేధోపరంగా అని వూహించలేదు సుమీ! :P

    రిప్లయితొలగించండి
  16. ఇంకొన్ని పతాక శీర్షికలు మనవిచేసుకొంటున్నాను,
    ప్రత్యేక తెలంగాణా కోసం (దీనితో సహా) మా తాత అన్నీ అబధ్ధాలే చెప్పాడు.నేను మాత్రం అన్నీ నిజాలే చెబుతుండ్ర మరి జూస్కో.......జూనియర్ కెటీఆర్.
    మా నాన్నాకు రెండు ప్రాంతాలు రెండు కళ్ళయితే నాకు మూడు ప్రాంతాలు మూడు కళ్ళు......లోకేష్
    మా అబ్బది పాదయాత్ర,మా తండ్రిది ఓదార్పు యాత్ర, మా జీవితమంతా విహారయాత్రే ...... హర్షిత,వర్షిత

    మా తాత కమిటీ కేవలం ఆరు పరిష్కారమార్గాలే సూచించింది ,కాని మా కమిటీ 36 మార్గాలు సూచిస్తున్నాం.అయినా మా తాత కమిటీ సూచించిన ఆరో ప్రత్యామ్నాయమే ఉత్తమమని నా వ్యక్తిగత అభిప్రాయం .............జూ.శ్రీకృష్న ,కమిటీ ఛైర్మన్

    రిప్లయితొలగించండి
  17. తెలంగాణా వాళ్ళ పైన జోకులు వేస్తూ కలిసిఉందాం అంటారు. కలిసి ఉంటె మీరు లాభ పడితే విడిపోతే మేము లాభ పడుతం అంటున్నాం. మాది స్వార్థం అయితే మరి మీదో ??

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు