"అయోధ్య తీర్పు న్యాయంగా లేదు, సాక్ష్యాలను బట్టి కాక, నమ్మకాలను బట్టి ఇచ్చిన తీర్పు" అని విమర్శిస్తున్నారు ఉగ్ర లౌకికవాదులు.
నిజమే, ఇది సాక్ష్యాలను బట్టి ఇచ్చిన తీర్పు కాదు, నమ్మకాలను బట్టి ఇచ్చిన తీర్పే! సాక్ష్యాలను బట్టి ఇచ్చిన తీర్పే అయితే, మూడోవంతు కాదు, మొత్తం వివాదాస్పద స్థలమంతా హిందువులకే దక్కి ఉండాల్సింది. ఎందుకంటే..
ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, బాబ్రీ మసీదు కింద హిందూ దేవాలయం ఉందని కోర్టుకు చెప్పారు. "బాబ్రీ మసీదుకు సరిగ్గా కింద, బృహత్తరమైన ఒక నిర్మాణం యొక్క శిథిలాలు ఉన్నాయి. ఇటుకలు, శిలలు, శిల్పాలు ఆ శిథిలాల్లో ఉన్నాయి. యాభైకిపైగా స్థంభాల పీఠాలు కూడా ఉన్నాయి. ఈ శిథిలాలు ఉత్తర భారత దేవాలయ నిర్మాణ శైలిలో ఉన్నాయి" కొద్దిగా అటూఇటూగా వాళ్ళు కోర్టుకు చెప్పినదిది. అంటే ఏంటన్నమాటా.. మసీదును కట్టించినవాడెవుడోగానీ, దేవాలయాన్ని పడగొట్టి మరీ దాన్ని కట్టించాడన్నమాట.ఆ స్థలం మీద సున్నీ బోర్డు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసిందంటే కొట్టెయ్యదూ మరి!
అయినప్పటికీ, ప్రజల మనోభావాలను పరిగణన లోకి తీసుకుని, అందరినీ అనునయించేలా, అందరికీ వీలైనంత ఆమోదయోగ్యంగా ఉండేలా ఈ తీర్పు ఇచ్చింది కోర్టు. నల్సార్ యూనివర్సిటీ (లా యూనివర్సిటీ) ప్రొఫెసరు మాడభూషి శ్రీధర్ ఓ టీవీ చర్చలో చెప్పినట్టు "ఇది ఈ కేసుపై ఇవ్వదగ్గ అత్యుత్తమ తీర్పు"!
రామజన్మభూమిని వేరే మతస్తులకు పంచి ఇచ్చినప్పటికీ, హిందువులు ఈ తీర్పును స్వాగతించారు. ఎంచేతంటే... హిందువులు శాంత స్వభావులు. ద్వేషం వారిలో లేదు. కారణం - వారికి "దొంగ లౌకికవాదం" తెలీదు.
...............................................................
హిందూద్వేషం నరనరానా ప్రవహిస్తున్న హిందూ వ్యతిరేక ఉన్మాదులకు ఇది రుచించలేదు. లౌకికవాదులమని చెప్పుకునే వీళ్ళు దీన్ని సాక్ష్యంగా భావించడం లేదు. అసలు దీని గురించే మాట్టాడ్డం లేదు. ఒకవేళ ఎవరైనా మాట్టాడినా.. వాళ్ళు మూర్ఖంగా వాదిస్తున్నారు. వాళ్ళ వాదనలు ఇలా ఉంటై:- మసీదు కింద గుడి శిథిలాల్లేవు.
- ఒకవేళ ఉన్నా అవి గుడి శిథిలాలని అనకూడదు. ఇస్లాము మతానికి ముందు ఉన్న ’మరొక మతం’ యొక్క శైలిలో ఉన్న నిర్మాణం అని అనాలి. హిందూ దేవాలయ శైలి అని అనకూడదు.
- ఒకవేళ మసీదు కింద గుడి ఉందని అన్నా అది రామ జన్మభూమి అని అనకూడదు. ఎంచేతంటే రాముడు అక్కడే పుట్టాడని ఆధారాలు ఎలా చెప్పగలరు?
- ఈ శిథిలాల విషయంలో సైన్సు ఏం చెబుతోందో, దాన్ని సైంటిస్టులు బైటికి చెప్పకూడదు. లౌకిక వాదులు ఏం చెప్పమని చెబుతారో అదే చెప్పాలి.
ఈ లౌకికవాదుల కంటే, మతం పేరిటో మతం మాటునో రాజకీయాలు చేసే మన రాజకీయ పార్టీలు ఎంతో నయమనిపిస్తోంది. రాజకీయుల తిప్పలన్నీ మన ఓట్ల కోసమేనని మనకు తెలుసు, ఆ ఓట్లేవో వాళ్ళ మొహాన కొడితే పెద్దగా మన జోలికి రారు. కానీ ఈ (అ)లౌకికవాదులు అలాక్కాదు, హిందువులను అణగదొక్కాలనేది వీళ్ళ అప్రకటిత ఎజెండా. ఈ దేశానికి మొదటి శత్రువు దొంగ లౌకికవాదియే!
.....................................................................
తీర్పు తరవాత వచ్చిన స్పందనలను బట్టి, స్థూలంగా ప్రజలంతా తీర్పును స్వాగతించారనే చెప్పుకోవాలి. హిందూ , ముస్లిము ధార్మిక సంస్థలు స్పందించిన తీరు ప్రశంసనీయం. తీర్పు ఇద్దరికీ అంత సంతృప్తి కలిగించకపోయినా, చాలా బాధ్యతాయుతంగా స్పందించారు తప్ప, తీర్పును, న్యాయవ్యవస్థనీ తిట్టలేదు. చాల అభినందనీయంగా ఉంది వాళ్ళ స్పందన. మీడియా కూడా క్రమశిక్షణతో వ్యవహరించింది. తీర్పు తరవాత పరిస్థితి ప్రశాంతంగా ఉండడానికి మీడియా ప్రవర్తన ఒక ప్రధాన కారణమని చెప్పవచ్చు.
రాజకీయ పార్టీలు, నాయకులు కూడా చాలావరకు పద్ధతిగానే ఉన్నారు. ములాయం లాంటివాళ్ళు ముస్లిములకు అన్యాయం జరిగిందని రెచ్చగొట్టబోయారుగానీ, నోరుమూసుక్కూచ్చోమని ముస్లిములే అన్నారు. కొన్నికొన్ని పార్టీలు ఇప్పుడిప్పుడే వంకరమాటలు మాట్టాడ్డం మొదలెడుతున్నట్టుగా కనబడుతోంది. ఉదాహరణకు, రాహులు గాంధీ ఈమధ్య మాట్టాడిన మాట - అరెస్సెస్సును ముస్లిము ఉగ్రవాద సంస్థ సిమితో పోల్చి రెండూ ఒకటే అనడం. హిందూ సంస్థను తిట్టి, ముస్లిములను సంతృప్తిపరచేలా మాట్టాడి, తాము ముస్లిములకు అనుకూలమని ఆ అజ్ఞాని చేత చెప్పించడం కాంగ్రెసు పార్టీ ఎత్తు. (దగ్గర్లో శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కూడాను). సూటిగా మాట్టాడే మాటల కంటే ఈ బాపతు వంకరమాటలే చేటు.
ఈ తీర్పు ప్రస్తుత దేశ కాల పరిస్థితులలో అత్యుత్తమ మైన తీర్పు అనే విషయంలో సందేహం ఉండాల్సిన అవసరం లేదు. తీర్పు దరిమిలా అంతా ప్రశాంతంగా ఉండడమే అందుకు తార్కాణం.
రిప్లయితొలగించండిఅయితే ఇది ఒక తీర్పు కన్నా ఒక పెద్దమనుషుల ఒప్పందం మాదిరిగా కనపడుతుందనే విషయాన్ని కూడా ఒప్పుకోక తప్పదు. నిజానికి ప్రభుత్వమో, రాజకీయులో పూనుకొని చేయాల్సిన, చేయించాల్సిన ఒప్పందం. వీళ్ళంతా విఫలమైన కారణంగా కోర్టు ఆపనిని భుజాలపై వేసుకుంది. కోర్టు తన తీర్పు ద్వారా ఉత్పన్నమయ్యే పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని తీర్పు వెలువరించాల్సి రావడం మన రాజకీయ వ్యవస్థ బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.
ఇక పోతే మీరు ఉదహరించిన ఆర్కియాలజీ రిపోర్టు గురించి. ఇది ఎంతవరకు వాంఛనీయమో ఆలోచించాలి. ప్రతి వివాదంలో ఇలా పురాతత్వ సర్వేలు చేయిస్తే ఎన్ని మసీదులు, ఎన్ని గుళ్ళు, ఎన్ని బౌద్ధ, జైన దేవాలయాలు ఒరిజినల్ విగా నిగ్గుదేలుతాయో అనుమానమే. గడిచిన రెండువేల సంవత్సరాలుగా ఎన్నో సార్లు ఒక మతంవారి కట్టడాల శిధిలాలపై వేరొక మతంవారు నిర్మాణాలు జరపడం ఒక చారిత్రక వాస్తవం.
మన 'లౌక్య'వాదులను కోర్టు ఎలా ఎండగట్టిందో ఒక సారి చూడండి.
రిప్లయితొలగించండిHow Allahabad HC exposed 'experts' espousing Masjid cause
రేపు మీ ఇంటి దగ్గరికి ఒక ఛోటా B.J.P నాయకుడు 100 మందిని ఏసుకొని వచ్చి ఈ స్థలం లో 300 B.C నాటి హనుమాన్ గుడి ఉంది.మీ ఇల్లు పడగొడతాం అంటే ఒప్పుకుంటారా??
రిప్లయితొలగించండిASI report B.J.P హాయం లో వచ్చింది.....దాని మీద archeaology department లోనే చాల అనుమానాలు ఉన్నాయి...
గొడవ గుడి కోసం కాదు....ఆ మసీదు...central dome కింద కౌసల్య రామున్ణి కన్నదంట ......దీనికి ఏ ఆధారాలు లేవు....కానీ, హిందువులు నమ్ముతారు కాబట్టి ,ఆ dome కిందున్న స్థలాన్ని హిందువులకు ఇచ్చెయ్యాలి...అని చెప్పింది ....ఇది ఎంత వరకు న్యాయం.....
"ASI report B.J.P హాయం లో వచ్చింది.....దాని మీద archeaology department లోనే చాల అనుమానాలు ఉన్నాయి..."
రిప్లయితొలగించండికోర్టులో ఆ అనుమానలను ఎందుకు నివృత్తి చేసుకోలేదో చెబుతారా? మీరడిగిన ప్రశ్న బాగానే ఉంది కానీ, దాన్నే నేను మరోలా అడుగుతాను సమాధానం చెబుతారా?
మీ పాత ఇంటిని ఎవరో కూలగొట్టి దాని మీద వాల్ల ఇల్లు కట్టారు, మీరు వెల్లి అడిగితే గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ తమ ఇల్లే ఉంది కాబట్టి మీకు హక్కు లేదు పొమ్మన్నారనుకుందాం. మీరేం చేస్తారు?
"రేపు మీ ఇంటి దగ్గరికి ఒక ఛోటా B.J.P నాయకుడు 100 మందిని ఏసుకొని వచ్చి ఈ స్థలం లో 300 B.C నాటి హనుమాన్ గుడి ఉంది.మీ ఇల్లు పడగొడతాం అంటే ఒప్పుకుంటారా??" - :) అద్భుతమైన ప్రశ్న మాస్టారూ! నా ఇంటికి రావాలంటే దారి మీకు తెలుసోలేదో.. చెబుతాను చూడండి.. అయోధ్యలో మొదలెట్టి కాశీ, మధుర, తాజమహలు, వగైరా వేలాది దేవాలయాల శిథిలాలను వెలికితీస్తూ రావాల్సి ఉంటది. అలా వస్తే నేనెందుకు ఒప్పుకోనండీ?
రిప్లయితొలగించండి"ASI report B.J.P హాయం లో వచ్చింది.....దాని మీద archeaology department లోనే చాల అనుమానాలు ఉన్నాయి..." - కోర్టులో ఆ అనుమానాలు బైటపెడితే కొడతానని కోర్టు అందా? మీకు తెలుసోలేదో.. జెయెన్యూ (కమ్యూనిస్టు యూనివర్సిటీ) ప్రొఫెసర్లు కోర్టులో సున్నీ బోర్డు తరఫున సాక్ష్యమిచ్చారు (స్వతంత్ర సాక్షులు అనే ముసుగేసుకోని). మసీదును దేవాలయ శిథిలాల మీద కట్టలేదని చెబుతూ అందుకు ఆధారంగా తామే రాసిన పుస్తకాలను ఉదహరించారంట ఆ జోకర్లు! ఈ సన్నాసి వాదనలన్నీ విన్నాకే, కోర్టు తన నిర్ధారణకు వచ్చింది మాస్టారూ. అసలైనా.. మీకు అనుకూలంగా ఉంటే ధర్మం గెలిచినట్టు, అననుకూలంగా ఉంటే బీజేపీ హయామా? ఈ లెక్కన తీర్పు వచ్చిన ఈ కాలాన, బీజేపీయే అధికారంలో ఉండి ఉంటే దొంగలకికవాదులు ఎంత గొడవ చేసేవారో, ఎన్నేసి అభాండాలు వేసేవారో, ఎంత నీచానికి దిగేవారో ఊహించుకోగలం!
"గొడవ గుడి కోసం కాదు....ఆ మసీదు...central dome కింద కౌసల్య రామున్ణి కన్నదంట ......దీనికి ఏ ఆధారాలు లేవు....కానీ, హిందువులు నమ్ముతారు కాబట్టి ,ఆ dome కిందున్న స్థలాన్ని హిందువులకు ఇచ్చెయ్యాలి...అని చెప్పింది ....ఇది ఎంత వరకు న్యాయం....." - ప్రజల నమ్మకాలను పట్టించుకోకే అయోధ్య వివాదం ఇన్నేళ్ళు సాగింది. కోర్టు చూపించిన ప్రాప్తకాలజ్ఞత ప్రభుత్వాలు చూపించలేకపోయాయి. ప్రజలు, మతసంస్థలు, రాజకీయ పార్టీలు ఎంతో నయం - కోర్టు చూపించిన చొరవను ఆహానించారు. లౌకికవాదులకు ఆ మాత్రపు ఇంగితం కూడా లేకపోయింది. అందుకే ఇలాంటి వాదనలు చేస్తున్నారు.
"One cannot say that though I had made a statement but I am not responsible for its authenticity since it is not based on my study or research but what I have learnt from what others have uttered," Justice Aggarwal has said, emphasising the need for thorough original research before concurring with what someone else has claimed.
రిప్లయితొలగించండి====
కామెడీ మేధావులకు కోర్టు చాలా బాగా గడ్డి పెట్టింది.
చదువరి గారు బాగా వ్రాసారండి.
"ఇది ఎంతవరకు వాంఛనీయమో ఆలోచించాలి." - అసలీ కేసు కోర్టుకు పోవడమే అవాంఛనీయం సార్. ఈ వివాదాన్ని ప్రజాప్రతినిధులు పరిష్కరించాల్సి ఉంది. మనకేమో రాజకీయ నాయకులు ఉన్నారుగానీ, పెద్దమనుషులు (స్టేట్స్‍మెన్) లేరు.
రిప్లయితొలగించండిప్రజల మతవిశ్వాసాలను ప్రాపంచిక విషయాలతో ముడిపెట్టి ఏనాడైతే కోర్టుకు పోయామో, ఆనాడే మనం ఈ సంగతిపై మాట్టాడే హక్కును పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఈ లౌకికవాదులు మాట్టాడ్డముంది చూసారూ.. కుట్రపూరితం, ద్వేషజనితం, పక్షపాతయుతం.
ఆకాశరామన్న: లింకు ఇచ్చినందుకు నెనరులు. ప్రశ్న బాగా అడిగారు.
>> జెయెన్యూ ప్రొఫెసర్లు కోర్టులో సున్నీ బోర్డు తరఫున సాక్ష్యమిచ్చారు
రిప్లయితొలగించండినలంద తక్షశిల లని హిందూ బ్రామ్మలు నాశనం చేసారని JNU ప్రొఫెసర్లు అల్రెడీ చరిత్రలో రాసేసారు కదా! ;) ;) దీనికి ప్రూఫ్ లు అక్కర్లా!
ఖిల్జీ వచ్చి, జస్ట్ ఒక వెయ్యి మంది బౌద్ధ సన్యాసుల్ని నరికి, ఇంకో వెయ్యి మందిని సజీవంగా తగలేసి పొయ్యాడనేది మాత్రం కాకమ్మ కథలన్నమాట!
>> ..కానీ, హిందువులు నమ్ముతారు కాబట్టి
How long these moronic pseudo secularists hide the facts & preach crap?
The invaders are slave armies.
They don't have any values & principles.
They went on to destroy temples, monasteries, and centers of learning.
The "masters" of these "slaves" who are Turk/Persian, dont have any interest in this land, except for the exploits. and thus let the slaves to plunder.
The slaves established a slave kingdom here.
The heirs of slaves went on to rule by sword for the next few centuries.
And the pillage continued.
What are we trying to hide here?
హరీష్ గారిల్లు ఎక్కడో కనుక్కోండి, వెళ్ళి లౌకిక వాదానికి ప్రతీకగా ఓ మశీదుకు, ఓ చర్చికి శంఖుస్థాపన చేసివద్దాం, ఓ పనైపోతుంది.
రిప్లయితొలగించండిరేపు మీ ఇంటి దగ్గరికి ఒక ఛోటా B.J.P నాయకుడు 100 మందిని ఏసుకొని వచ్చి ఈ స్థలం లో[క్రీ.పూ.]300 నాటి హనుమాన్ గుడి ఉంది.మీ ఇల్లు పడగొడతాం అంటే ఒప్పుకుంటారా??
రిప్లయితొలగించండిలౌకికవాదుల సంగతి తెలియదు కానీ, ఈ తీర్పుపై ముస్లిం సోదరులకు కొన్ని అపూహలున్నాయి, ఉర్దూ పత్రికలలో కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని కాస్త తొలగించాలన్నది ఈ ప్రయత్నం, పెద్ద సైజు వ్యాఖ్యతో మీ కామెంట్ల పేజీని ముంచేబోతున్నందుకు ముందరే క్షమాపణలు :)
బాబ్రీ వివాదం ఈ కోవకు చెందిన వివాదలలో కల్లా ఆఖరిది. 1993లో అమలు పరచిన చట్టం ప్రకారం, బాబ్రీ మినహా 1949లో కల్ల స్థితినే కోర్టులు ఇకపై పరిగణంలోకి తీసుకోవాలి, దానికంటే ముందు జరిగిన కట్టడాలు, కూల్చివేతలను న్యాయస్థానాలు చట్టరిత్యా బేఖాతరు చేయాలిసిందే. అంటే ఈ తీర్పుని పుర్వప్రమాణంగా (precedent) ఇంకే న్యాయస్థానమూ ఇంకే వివాదానికీ వర్తింపచేయలేదు.
ఇంకో విషయం, బాల రాముడు (హిందీలో రాం లల్లా) చట్టం దృష్టిలో సజీవవ్యక్తి (juristic person) అని ప్రకటించింది న్యాయస్థానం కాదు, మెజారిటీ తీర్పుకి భిన్నంగా ప్రకటించిన న్యాయముర్తి మాత్రమే. తీర్పులో ఈ వ్యాఖ్యలు జోడించినా, అవి కోర్టు అభిప్రాయంగా మనం పరిగణించకోడదు. ఎందుకంటే, రిటైర్ అవబోతున్న ఈ న్యాయమూర్తి తన తీర్పులో పూర్తి స్థలం హిందూవులకే కేటాయించాడు. కానీ ఈ తీర్పు అమలు అవ్వట్లేదు కదా.
మెజారిటీ తీర్పు బాబ్రీ స్థలాన్ని మూడుగా చీల్చి, చెరి మూడోవంతు, హిందూ మహాసభకి, నిరోమీ అఖారాకీ, సున్నీ వక్ఫ్ బోర్డు వారికీ కేటాయించింది. అలా చెయ్యడానికి ప్రథమ కారణం, నమ్మకం కాదు, చెరిత్ర. 1840's వరకూ హిందూవులూ, ముస్లింలూ కలిసి పక్కపక్కనే ఒకే గూటి కింద ప్రార్థించేవారని, ఆ స్థితిగతులను ఆధారంగా తీసుకొని బాబ్రీ మసీదు నిలిచిన స్థలాన్ని హిందూవులకూ, ముస్లింలకూ సరిసమానంగా పంచింది.
అయితే, వివాదాస్పద స్థలం కేవలం బాబ్రీ కట్టడం ఉండే చోటే కాదు, ఆ మసీదును ఆనుకున్న ప్రాంగణం, ఇతర కట్టడాలు కూడా. ఈ వివాదంలోని మూడో పార్టీ అయిన నిర్మోహీ అఖారాకి కేటాయించిన స్థలం ఇది; 1850 దశాబ్దములో సీతా రసోయి, హనుమాన్ ఛబూతరా అనే రెండు కట్టడాలను ఈ అఖారా వారు కట్టించి హిందూ భక్తుల సేవనార్థం నడిపించే వారు. ఇవి బాబ్రీ మసీదు ప్రాంగణంలో వున్నా అవి మసీదు భవనాన్ని ఆనుకున్నాయి తప్ప, వివాదాస్పద కట్టడం పరిధిలోకి రావు. ముస్లిం సోదరులకు 1850లలోనూ, 1980లలోనూ, చివరికి ఇప్పుడు - అంటే తీర్పు విడుదల చేసే ముందు, తరువాత రోజులు - వీటిపై వివాదం లేదు. మసీదు బయటున్న వాటి గురించి మాకేం ఇబ్బంది అన్నది వారి వాదన.
ఇక పోతే, అసలు వివాదం, బాబ్రీ మసీదు మధ్య గోపురం ఉన్న చోటే బాల రాముని పుట్టుక స్థలం (హిందీలో రాం లల్లా అక్కడ విరాజిమాన్ అయ్యాడు అని హిందుత్వవాదులు వ్యవహరిస్తారు) అని అనడం. ఈ విషయంలో భిన్నాభిప్రాయాలకు చాలా తావు వున్నది, వివాదంలోని మిగతా విషయాలెలా వున్నా ఈ విషయం మాత్రం ఆధార-రహితమైన ప్రశ్న. ఆర్కియాలజిస్టులు, ASI వారు కట్టడాలు ఎంత పురాతనమైనవి, కట్టడాల కింద సిధాలలున్నాయా, ఆ సిధిలాల నామరూపాలు ఎలాంటివి అన్న ప్రశ్నలపైనే సమాధానం చెప్పగలరు. చరిత్ర కారులు అలాంటి సిధిలాల వెనుకటి కథ, ఏ పరిస్తులలో ఎవరు ఎలా కట్టించారు, అలా కట్టించారని ఎవరు ఇతహాసాలు రాశారు లాంటి ప్రశ్నలకే సమాధానాలివ్వగలరు. వాల్మీకి రామాయణంలో రాముడు పుట్టింది సరయూ నదీ తీరాన అయోధ్య అని పిలువబడే నగరమనే అనే చెప్పుతుంది. బాబ్రీ మసీదు మధ్య గోపురం కిందనే బాల రాముడు విరాజితుడయ్యాడు అని ఎక్కడా పేర్కొనదు.
మరి ఈ ప్రశ్నకి సామాధాననికి అద్వైతులు ఆస్రయించాల్సిన గ్రంథము వాల్మీకి రామాయణం కాదు, పోతన శ్రీమదాంధ్ర మహా భాగవతమం: శ్రీ రామచంద్రుడు ఇందు గలడ అందులేడని సంధేహము వలదు, ఎందెందు వెతకిన అందందే కలడు. రాముడు పుట్టింది ఈ కొనలోనే అని పట్టుబడడం హిందుత్వ మతప్రవక్తల అతిసంచయేచ్ఛ. దానిని విడనాడలన్నది అద్వైత సాంప్రదాయము యొక్క సారాంశమూ, సందేశము. :)
భారత న్యాయవ్యవస్థ వెలువరించిన తీర్పులలో అన్యాయమైనవీ, చట్టనిబంధనలను వక్రీకిరించినవీ, తమ పరిధిని అతిక్రమించినవీ ఎన్నో ఉన్నాయి. కింది కోర్టులు అటువంటి అన్యాయమైన తీర్పులు ఇచ్చినప్పుడు పై కోర్టులు సవరించిన సందర్భాలు కూడ ఎన్నో ఉన్నాయి. మరణశిక్షతో సహా కింది కోర్టులు వేసిన ఎన్నో శిక్షలను పై కోర్టులు కొట్టివేసిన సందర్భాలకు కూడ లెక్కలేదు.
రిప్లయితొలగించండికనుక ఒక తీర్పు న్యాయమైనదా, అన్యాయమైనదా, చట్టాని కి లోబడి ఇచ్చినదా, చట్టాన్ని అధిగమించి ఇచ్చినదా అని చర్చించే అవకాశం ఎప్పుడైనా ఉంటుంది. ఆ చర్చను హైకోర్టుకు, అన్ని కోర్టులకూ పైన ఉండే సమాజం ముందరికి తీసుకుపోయే అధికారం ప్రతి పౌరుడికీ ఉంది. పౌరులకు సహజంగా ఉండే ఆ హక్కుతో చూసినప్పుడు బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదంలో అలహాబాద్ హైకోర్టు స్పెషల్‌ఫుల్ బెంచి సెప్టెంబర్ 30న ఇచ్చిన తీర్పు అన్యాయమైనదని, చరిత్రకు వ్యతిరేకమైనదని, తార్కికంగా కూడ సరయినదికాదని చెప్పవలసి ఉంటుంది.....
http://kadalitaraga.wordpress.com/2010/10/07/%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%82-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81/
-తర్కం లోపించిన తీర్పు-
కత్తి మహేష్ గారూ,
రిప్లయితొలగించండిటపాతో పాటూ కామెంట్లు కూడా చదివుంటే బావుండేది.
మీ Copy & Paste స్టైల్లో చెప్పాలంటే ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
కృష్ణశ్రీ says:
October 7, 2010 at 10:19 pm
(మళ్లీ అంతా వ్రాసే వోపిక లేక, “తెలుగిల్లు” వారికిచ్చిన కామెంట్ నే ఇక్కడ వ్రాస్తున్నాను)
యెంత సింపుల్ గా అనేశారు–”నమ్మకాలమీద ఆథారపడిన తీర్పు” అని!!!
ములాయం లాంటి కుహనా సెక్యులరిస్టులూ, చిదంబరం లాంటి ఓవరాక్షన్ గాళ్లూ ప్రచారం చేస్తున్న అబధ్ధాల వలలో పడకండి.
“నమ్మకాల” ప్రస్తావన వచ్చింది, “రాం లాలా విరాజ్ మాన్” అంటే బాల రాముడి విగ్రహం స్వయం గా దాఖలు చేసిన కేసులో! ఈ కేసులో, ఆ విగ్రహం “చట్టం కంటిలో” ఒక వ్యక్తేననీ, ఆ వ్యక్తి “మైనర్” (బాలుడు–ఇంకా వ్యక్తిత్వం సంతరించుకోనివాడు) అనీ, ఆయన తరుఫున “సమ్‌రక్షకుడు” దాఖలు చేసినదీ కేసు.
http://kadalitaraga.wordpress.com/2010/10/07/%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%82-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81/#comment-608
చదువరి says:
October 11, 2010 at 12:28 am
“ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చగలిగినదీ, తేల్చినదీ కూడ విధ్వంసం జరిగిందనో, అది బాబర్ చేయించాడనో, మీర్ బాఖీ చేశాడనో కాదు. బాబ్రీ మసీదు నిర్మాణంలో ఇస్లామిక్ నిర్మాణ శైలికి సంబంధంలేని, అంతకు ముందరి మతాల నిర్మాణ శైలికి సంబంధించిన స్తంభాలు, రాళ్లు ఉన్నాయని మాత్రమే.” – అంతకు ముందరి మతాలంటే ఏవవి? మీకు తెలియక రాయలేదా లేక తెలిసీ రాయకుండా వదిలేసారా?
http://kadalitaraga.wordpress.com/2010/10/07/%e0%b0%a4%e0%b0%b0%e0%b1%8d%e0%b0%95%e0%b0%82-%e0%b0%b2%e0%b1%8b%e0%b0%aa%e0%b0%bf%e0%b0%82%e0%b0%9a%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b1%8d%e0%b0%aa%e0%b1%81/#comment-611
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
హిందూ మత(ధర్మ) వ్యతిరేకులు (వీళ్ళు కూడా హిందువులే లెండి) లౌకికవాదం అనే ముసుగులో ఎలాగైనా పేల్తారు(సారీ..... అంటారు.) ఎన్నన్నా, శాంతం మన రక్ష కదా. వాళ్ళ జోలికి పోవడం కన్నా... వెధవాయ్ పని ఇంకొకటి లేదు. వాళ్ళు మానవతా ద్వేషులు
రిప్లయితొలగించండిరాజ్యాంగం ఇచ్చిన వెసులుబాటుతో ఇప్పటికే చాలా మెట్లు ఎక్కి, ఇప్పుడు న్యాయస్థానాలమీద పడ్డారు. వెకిలివాదనలు అసహ్యంగా ఉంటాయి. ఇప్పటికైనా తెలివి తెచ్చుకుని మాట్లాడమనండి. లేకపోతే నోరు.. పోస్టులు..కట్టిబెట్టి.............. ఊ.
రిప్లయితొలగించండిహ హ ఇంకా రాలేదు ఏమిటా అనుకుంటున్నా!.
రిప్లయితొలగించండిఇక మొదలవుతుంది,అసలు కామెడి
>>> 1993లో అమలు పరచిన చట్టం ప్రకారం, బాబ్రీ మినహా 1949లో కల్ల స్థితినే కోర్టులు ఇకపై పరిగణంలోకి తీసుకోవాలి, దానికంటే ముందు జరిగిన కట్టడాలు, కూల్చివేతలను న్యాయస్థానాలు చట్టరిత్యా బేఖాతరు చేయాలిసిందే
రిప్లయితొలగించండిన్యాయానికి, చట్టానికి తేడా అదే ... చట్టానికి పరిధి ఉంది ... న్యాయానికి లేదు ... అది ధర్మాన్ని నిలబెట్టట్టం మీదే శ్రద్ద చూపుతుంది ... సో ఈ తీర్పు న్యాయానికి లోబడి ఇచ్హిన తీర్పు.
@katti, u say for thousands of years dalits are oppressed. Where is the proof Mr. Katti? is it belief or history? who defines history? are we reading only proven historical events in the books? we read about alexander or kakatiya dynasty.. is all written in so-called books are real? who validated it?
రిప్లయితొలగించండిThe key is what u consider as history. for someone it is from 1523 when masjid built, for someone else it is from the birth of RAM. since u dont have proofs doesn't mean there is no history. If so, u should stop writing thousands of years of dalit oppression nonsense stuff in ur blog.
Please stop argueing with ur bull***t thought process
ఈ మధ్య అయొధ్య వివాదం లొ కక్షి దారులంతా కలసి అందరికి ఈ విధం గా విజ్ఞప్తి చేసారు. `ఈ వివాదం ముందు తరాల వారికి వారసత్వం గా వెళ్ళొద్దు. హిదూ ముస్లిం లు కలసి స్వాతంత్రం సంపాదించుకొన్నారు. ఈ రాజకీయ నాయకులే వారిని కలసి ఉండనివ్వరు.`ఇక JUH అధ్యక్షులు మదానీ `ముస్లింలు దీనిపై ప్రశాంత చిత్తం తో ఆలోచించాలి,తీర్పును గౌరవించాలి `అన్నారు. కక్షిదారులకు,ముస్లిం సమాజానికి లేని బాధ ఈ కుహనా లౌకికవాదుల కెందుకు. కందకు లేని దురద కత్తి పీట కెందుకు ?
రిప్లయితొలగించండి"ASI report B.J.P హాయం లో వచ్చింది.....దాని మీద archeaology department లోనే చాల అనుమానాలు ఉన్నాయి..."
రిప్లయితొలగించండిమఱి ఈ తీర్పు కాంగ్రెస్ హయాలులో వచ్చింది. పాపం, అయినా ఎందుకని ఇది ముస్లిములకు పూర్తి అనుకూలంగా లేదంటారు ? బి.జె.పి. హయాములో ఇచ్చిన పురావస్తుశాఖ నివేదికని త్రోసిపుచ్చి కొత్తగా మఱో తాజా నివేదిక ఇప్పించవచ్చుగా, కాంగ్రెస్ హయాములోని న్యాయవ్యవస్థ ? ఎందుకని అలా చెయ్యలేకపోయారంటారు ? చెయ్యడానికి అవకాశముంటే తప్పకుండా చేసేవారే కదా ? అంటే ఆ అవకాశం లేదన్నమాట.
మఱి, ఆ ASI నివేదిక నిష్పక్షపాతమైనదనీ, చారిత్రిక సత్యాలతో కూడుకొన్నదనీ ఒప్పుకుందామా ?
లేక
కాంగ్రెస్ కూడా బి.జె.పి. లాగానే హిందూ పక్షపాతి అందామా ?
మీ వాదనలకు పరాకాస్ట రూపం ఇస్తే........ముస్లింలను ఈ దేశం నుండి తరిమేయమంటారేమో ...
రిప్లయితొలగించండినాకు గుర్తున్నంత వరకు ముస్లింలు 620 లో ఎప్పుడో వచ్చారనుకుంటా...అంటే అప్పటికి ఒక్క ముస్లిం కి కూడా ఈ దేశం లో ఇల్లు లేదు.....ఇప్పుడు ఉన్న ముస్లిం ల తాత తాత...తాత...తాత లు, ఇప్పటి హిందువుల తాత తాత...తాత...తాత ల ఇల్ల స్థలాలను ఆక్రమించుకున్నారు....ఆ లెక్కన...ముస్లింలంతా ఈ దేశం లోని ఆస్తులన్ని వదులుకొని "వాల్ల" దేశానికి వెల్ళిపొమ్మని చెప్పాలి...అంతే కదా...
హరిష్ గారు ... ఆక్రమించుకొని ఉండొచ్చు... లేక కొనుక్కుని ఉండొచ్చు... అది పక్కన పెడదాం....
రిప్లయితొలగించండిఅయితే దేశం నుండి తరమాల్సింది ముస్లిం సొదరులను కాదు...
హిందు ద్వేషులంటే ముస్లిం లే ...లేక ముస్లిం లు హిందువులను ద్వేషించడనికే పుట్టారు అని అర్ధం వచ్చేలా రాసి ఇద్దరి మద్య చిచ్చు పెట్టాలని చూసే మీలాంటి వారిని .. మీతొ పాటు కుహానా లౌకిక వాదులను... కమ్యూనిస్టులను...
చదువరి గారి పొస్ట్ సరిగ్గా చదివుంటే మీకు అర్ధం అవుతుంది... సరిగ్గా ఎవర్ని వెళ్ళగొట్టాలొ ..........
It is a strong belief among majority of indians that ram temple was in ayodhya just like any other religious place (like Mathura) . But I think who people believe(and practice) vedas may not fully agree that the temple was at the same exact place where the babri masjid was located before. I think It is against our Indian culture to demolish a place of prayer where people of other faiths or beliefs use it. I don't think It should be an issue if a temple was constructed in ayodhya at a different site. I think Lord Rama and his devotees would be happy and not be offended with it. I would say worship your own and respect others with regards to religious beliefs.
రిప్లయితొలగించండిCorrection to my earlier post:
రిప్లయితొలగించండిI think many vedic people may not fully agree that Lord Rama was born at the same exact place where the babri masjid was located before.
>>I think many vedic people may not fully agree
రిప్లయితొలగించండిఅంతే గదా! అక్కడ తప్పా ఎక్కడైనా వుండివుంటుందేమో అన్న విషయం మా లౌకిక హేటువాదులు ఆధారాలు లేకున్నా నమ్ముతారు, మీరు బాగా అర్థం చేసుకున్నారు. వృద్ధిలోకి వస్తారు.
@manchu
రిప్లయితొలగించండిcomments అన్ని కూడా చదివి ఆ తర్వాత comment రాస్తే better....last లో ఒక comment చూసి...ఆవేశ పడి comment రాయద్దు...
Harish: "మీ వాదనలకు పరాకాస్ట రూపం ఇస్తే........ముస్లింలను ఈ దేశం నుండి తరిమేయమంటారేమో ..." - మనం మాట్టాడుతోంది రామజన్మభూమి-బాబ్రీ మసీదు గురించి, అవునా? నా ఇంటికెవడో వాడొచ్చి ఇల్లు కూలగొడతానని అడిగితే నేనేం చేస్తానని ప్రశ్నించి, సమస్యను బాబ్రీ మసీదు నుంచి నా ఇంటికి తీసుకొచ్చింది మీరు, అవునా? దానికే నేను సమాధానమిచ్చాను, అవునా? ఆ సమాధానానికి మీరు స్పందించి నేనేదో ముస్లిములను బైటికి తోలేస్తా నన్నానని అర్థం పర్థం లేని, దొంగ లౌకికవాదుల ట్రేడ్‍మార్కు వాదనలు చేస్తున్నారు, అవునా? అవునా, కాదా?
రిప్లయితొలగించండిఇక ఇలాంటి అతి తెలివి, తంపులమారి, లౌకికవాద వాదనలు ఆపండి.
"I think It is against our Indian culture to demolish a place of prayer where people of other faiths or beliefs use it." మన ఇండియన్ కల్చరా!! అలా చెప్పిందా? ఓహో! మరి, మన ముస్లిము సంస్కృతి ఏం చెబుతోందో తెలుసా? (తెలిసుండదులెండి -లౌకికవాదులకు ఉన్నవి కనబడవు, లేనివి కనిపిస్తాయి కదా!) ముస్లిము సంస్కారం ఏం చెబుతోందంటే, ’మరో మతానికి చెందిన దేవాలయాలను కూల్చి మసీదులు కట్టగూడదు. అలా కట్టిన మసీదుల్లో ప్రార్థనలు చెయ్యకూడదు.’
రిప్లయితొలగించండిఅంచేత ఓ లౌకికవాదీ.. భారతంలోని - ముఖ్యంగా ఉత్తర భారతంలోని - వేలాది మసీదులు మసీదులు కావు, అవి కేవలం భవనాలు. వాటిలో ప్రార్థనలు చెయ్యకూడదు. కానీ వాటి కింద ఉన్న గుడులు గుడులే! ఆ మసీదులను కూల్చేసి గుడులను మళ్ళీ కడితే కోట్లాది హిందువుల విశ్వాసాలను గౌరవించినట్టే! మసీదులను కూల్చేసినంత మాత్రాన ముస్లిములకు పోయేదేమీ లేదు - ఎందుకో తెలుసుగదా., ఆ మసీదులు మసీదులే కావని ఇస్లాము చెబుతోంది. కాబట్టి ఒకే దెబ్బకు వేలాది మసీదుల సమస్యలను పరిష్కరించి పారెయ్యొచ్చు. ఏమంటారు? అంచేత లౌకికవాదుల్లారా.. మీరంతా కలిసి ముస్లిములకు ఈ ముక్క చెప్పి వాళ్ళను ఒప్పించేందుకు ప్రయత్నించి, ఆ తరవాత మాకు కనబడండి.
కనబడితే, కనబడితే.. అప్పుడు మిగతా సంగతులు మాట్టాడుకుందాం!
"మతం ఒక మత్తు".......నేను ఇంకేం మాట్లాడలేను....
రిప్లయితొలగించండిమతం మత్తో కాదోగానీ, దొంగ లౌకికవాదం మాత్రం విషం - హిందువులని కరిచి దాన్ని ఎక్కించాలని చూస్తున్నారు.
రిప్లయితొలగించండిహ హ ఏమి జొకో ...
రిప్లయితొలగించండి"మతం ఒక మత్తు" .. అహా
వేస్కోండి నావో రెండు స్లోగన్లు
రిప్లయితొలగించండి"డ్రైనేజి గొట్టాల ద్వారానే మురికి నీరు వస్తుంది"
"అరచేతిని అడ్డుపెట్టి మా లౌకిక దివాళాకోరు మురికినీరు ఆపలేరు"
>> "I think It is against our Indian culture to demolish a place of prayer where people of other faiths or beliefs use it."
రిప్లయితొలగించండిis this against Hindu culture or Indian culture or both are same? because when muslims are invaded they demolished many temples in India. So they didn't respect the culture of the country. does it mean muslims are against to indian culture?
ఊరికే తెలివితేటలు చూపించాలంటే మీరు వ్రాసే లాంటి కామెంట్లు వంద వ్రాయచ్చు.
Demolishing temples by past muslim rulers is also against indian culture. I agree that past rulers caused damage to our temples and there is evidence now that a temple existed before the babri mosque was built. But that doesn't mean we can go and destroy the strucures which are used by people of that faith for their worship. I don't know whether the current site(demolished) or an alternative site in Ayodhya is a good place to construct a temple to worship Lord Rama.
రిప్లయితొలగించండిChaduvari, I didn't know that my observations are secular as you have mentioned and I don't think I know the defintion of being secular.
With regards to these comments that you made:
"ఆ మసీదులను కూల్చేసి గుడులను మళ్ళీ కడితే కోట్లాది హిందువుల విశ్వాసాలను గౌరవించినట్టే!"
I wish Lord Rama keeps all of us in the right path with regards to our thoughts, deeds and actions.
Sorry for posting in telugu and this is my last post here.
Dear Harish.
రిప్లయితొలగించండినా మీద మీ కామెంట్ కి చదువరి గారు సమాధానం ఇచ్చారు... ఇంకేమయినా డవుట్లు ఉంటే అడగండి...
కందకు లేని దురద కత్తిపీట కెందుకనే సామెత ఎలా వచ్చిందో ఇప్పుడు నాకు తెలిసింది
రిప్లయితొలగించండికాముధ
Shahi Imam 'assaults' scribe at meet
రిప్లయితొలగించండిLUCKNOW: A local journalist has lodged an FIR against Shahi Imam of Delhi's Jama Masjid, Syed Ahmed Bukhari, for assaulting him during a press conference on Thursday. Mohammed Wahid Chishti, editor of 'Dastan-e-Awadh', has accused Bukhari and his entourage of beating him up and threatening him of dire consequences when he asked some uncomfortable questions during the press conference.
The maulana, who has been highly critical of the Allahabad high court's judgment on Ayodhya title suit, lost his cool when Chishti reminded him about his earlier stand that Muslims must respect the verdict. Appearing to be in a particularly dark mood, he brusquely ordered Chishti to be quiet and take his seat.
When Chishti didn't stop, Bukhari ordered the man to hold his tongue or his neck would be broken. "Traitors like you have killed all the aspirations of Muslims in India," he said amidst torrents of threats. The press conference broke up soon after and Chishti was surrounded by TV crews. This enraged Bukhari further and he charged towards the journalist who had to be rescued by other journalists who were present.
Read more: Shahi Imam 'assaults' scribe at meet - The Times of India http://timesofindia.indiatimes.com/india/Shahi-Imam-assaults-scribe-at-meet/articleshow/6751055.cms#ixzz12RzmYKnI