2, అక్టోబర్ 2010, శనివారం

సునామీ రావాలని కోరుకోకు!

ఈమధ్య బ్లాగుల్లో ఒక కొత్త ధోరణి వచ్చింది - మనకు నచ్చని విషయం ఎక్కడైనా కనిపించిందనుకోండి.. వెంటనే మన బ్లాగుకు వెళ్ళిపోయి దాన్ని విమర్శిస్తూ ఒక కవిత రాసిపడెయ్యడమన్నమాట!   ఏదైనా కవితను కాపీకొట్టైనా సరే..  నేనూ ఒక కవిత రాసెయ్యాల్సిందే అనుకున్నాను.  కత్తిలాంటి బ్లాగు, మహేష్ కుమార్ గారి పర్ణశాల అందుబాటులో ఉందిగదా.. అందులోని దళిత తీవ్రవాదం అనే టపాను ఎంచుకున్నాను.


ఇంతకీ.., నాక్కూడా  కవిత రాయాలనిపించేంత చిరాకు ఎందుక్కలిగిందంటే.. ఇదిగో ఇది  కారణం: http://sahacharudu.blogspot.com/2010/09/blog-post_30.html
ఇహ నా కవిత చదవండి..
=======================
విభజించు పాలించు
కాటు వెయ్యి, విషం కక్కు
ఇవి మీకు ఉగ్గుపాల కలబోత

మీ ప్రతీమాటలో విషం
మీ నరనరాన విద్వేషం
మీ కణకణాన పక్షపాతం
మీ వెనక సామ్రాజ్యవాదం
మీ ముందు దొంగ లౌకికవాదం

మీకూ మానవతకూ
మీకూ సంస్కారానికీ
మీకూ కోర్టులకు
మీకూ భారతీయతకు
చుక్కెదురే!

మీ వ్యవహారం
మేమెరుగనిదా..
పరమతాలకు బానిసత్వం
హిందూద్వేష పరాయణత్వం
లౌకికవాదం మాటున
మత వ్యాపారం
మీ వ్యవహారం
మా కవగతమేలే

ప్రజల మనసుల్లో  మీరు
విషబీజాలు నాటారు
లౌకికవాదం పేరుతో మీరు
హిందూమతాన్ని ద్వేషించారు
మైనారిటీల పేరుతో మీరు
వివక్ష రచించారు
ఇతరమతాలను నెత్తిన పెట్టుకు
మా మతాన్ని ద్వేషించారు

అయినా..

మీ క్షుద్ర జీవితాల్ని
మీ నికృష్ట నిర్వాకాల్ని
మీ చీకటి నాటకాల్ని
మీ ద్రోహ చింతనను
మీ కుట్రలను కూహకాలనూ
సహించాం
...................
కంటికి కన్నేనని
పంటికి పన్నేనని
మేమూ నమ్ముంటే...
దొంగ లౌకికవాదం
ఈ దేశంలో ఉండేదా
హిందూద్వేష రేబీస్ మీ తలకెక్కేదా
మీ మది ఇట్లా కుళ్ళేదా
కుళ్ళిన మీ మదిలో
"హిందూ రాజ్యపు" వెర్రి తలపు
మొలిచుండేదా!

సముద్రం శాంతంగా ఉందంటే
కారణం చెలియలికట్ట కాదోయ్
స్వీయ నియంత్రణ, కఠోర క్రమశిక్షణ
అనంత గాంభీర్యం, సముద్రమంత సహనం!

ఆ నియంత్రణ చెదిరిపోతే
ఆ సహనం హననమైతే....


వద్దు..
---------------------------
ఇక ఇప్పుడు టపా శీర్షిక చదూకోండి.

160 కామెంట్‌లు:

  1. మీరు కొన్ని ప్రాధమికమైన విషయాలు మర్చిపోతున్నారు.
    ఆనవసరంగా మా కమ్యూనిష్ట్ లను ఆడిపోసుకుంటున్నారేమో అనిపిస్తుంది.

    ఒక ఉదాహరణ చెప్తాను చూడండి.
    మీ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయ్యింది, అది చెత్త, కానీ దాని మీరు కాదు బాగున్నది అని చెప్పి, ఎంతో కొంత ఆడించే ప్రయత్నమో, లేక కాస్త ఐనా పాజిటివ్ టాక్ కోసం ఆరాటపడతారా లేదా.

    అలానే, కమ్యూనిష్ట్లు కూడా ఎంతో ఆశపడ్డారు, ఎవరికో ఒకరికి వస్తుంది స్థలం మొత్తం, అప్పుడు చక్కగా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి, హ్యాపీగా మా చైనా వచ్చి ఆక్రమించేసుకోవచ్చు అని, కుదరలేదు, సరే తమవంతు ప్రయత్నంగా ఆరిపోయిన నిప్పుని ఎగదోయతాగానికి ప్రయత్నిస్తున్నారు అదన్నమ్మట..

    అసలు హింస లేకపోతే కమ్యూనిష్టుకి బోర్ కొట్టదు

    అర్ధం చేసుకోరూ......

    ఇక్కడో లుక్కెయండి.
    http://pramaadavanam.blogspot.com/2010/08/blog-post.html

    రిప్లయితొలగించండి
  2. లౌకికత్వమంటే అందరినీ సమానంగా చూడడమా? మెజారిటీలు అణిగిమణిగి ఉండి మైనారిటీలకి సర్వాధికారాలూ, అడిగిందల్లా ఇచ్చేయడమా?
    >>>>Indian state is a capitalist, upper caste, Hindu state...
    అని డిక్లేర్ చేస్తున్న మేధావులకి ఆ మాత్రం తెలియదా? లౌకికత్వమంటే హిందూ ద్వేషం అన్నమాట.

    రిప్లయితొలగించండి
  3. (contd..)
    హిందువులు, అగ్రవర్ణాలూ ఏ విధంగానూ ఏక్టివ్‌గా ఉండకుండా మిగిలిన మతాల, కులాల వారికి అన్నీ అప్పగించేసికూర్చోవడమే లౌకికత్వమంటే. అలాజరిగితేనే ఇండియా లౌకిక రాజ్యం అని ఒప్పుకుంటారు వీళ్ళు. మిగిలిన మతాలకీ, కులాలకీ సమానత్వం కాదు వీళ్ళకి కావలసింది, హిదూమతం, అగ్రకులాలు తుడిచిపెట్టుకుపోవడమే వీరి దృష్టిలో లౌకికత్వం.

    రిప్లయితొలగించండి
  4. ఔను నిజం ఔను నిజం
    నీవన్నది నీవన్నది
    నీవన్నది నిజం నిజం

    ~

    రిప్లయితొలగించండి
  5. పై పంక్తులు
    శ్రీ శ్రీ గారికి క్షమాపణలతో

    ~

    రిప్లయితొలగించండి
  6. Minorities in any country put their faith and belief in democratic institutions to safe guard their rights. Dalits, Muslims, Christians do that in India. This verdict is a clear let down of such democratic spirit.

    రిప్లయితొలగించండి
  7. That doesn't mean majority shouldn't put faith& belief in democratic/autocratic(Communist countries)/Feudal-religious(mostly Islamic).

    Democratic system doesn't believe spirits.

    Just by depositing faith/belief in a system doesn't assure life long wish-fulfilment. Those who live in competitive world wud understand this subtle principles than those who live on charities by others.

    రిప్లయితొలగించండి
  8. Hindus in this country have more faith in religion than the law of the land. That's clearly evident in the judgment too. That's the saddest part.

    Legal system cannot take its decisions based on "religious faith/belief". Once it does, the very faith on this mutually agreed system will become questionable. That's why the doubt raises, whether Indian state is moving towards 'Hindurashtra'. It is already functioning like a capitalist, upper caste state and now with this addition of Hindu....I doubt what will happen to our secular democracy !

    రిప్లయితొలగించండి
  9. /Legal system cannot take its decisions based on "religious faith/belief". /

    Then who should give decissions/comments? Neo-Dalit/ communist/atheists/gays?? :D

    Those who have belief in legal system only went to the courts. Buffoons who are no way connected are blabbering with their filthy mouths on the so called'injustice'.

    Watch how wise Muslims leaders spat in Mulayam's filthy mouth:

    http://timesofindia.indiatimes.com/india/Mulayams-remark-on-Ayodhya-verdict-evokes-sharp-response-from-Muslim-leaders/articleshow/6671581.cms

    Pigs& its eaters are NOT HALAL for Muslims. :P

    రిప్లయితొలగించండి
  10. 3 Parties went to court claiming a piece of land ownership.

    As every one failed to prove their ownership, court decided to give equal part to all the 3.

    In order to decide which part each one should get, it considered some belief, so whats the problem here?

    Either with giving land to each of the 3 parties or with the partition?

    రిప్లయితొలగించండి
  11. మీ కవిత బాగుంది కాని "మీకూ మీకూ కోర్టులకు చుక్కెదురే!" ఇది మాత్రం ఈ లౌకికవాదులకు కొద్దిగా సెలెక్టివ్ గా వరిస్తుందనుకుంటాను అంటే కేవలం వారికి అనుకూలం గా లేనప్పుడు మాత్రమే చుక్కెదురు , మిగిలినప్పుడు మాత్రం ఈ కోర్టులకి , రాజ్యాంగానికి అత్యంత విలువుంటుంది .

    రిప్లయితొలగించండి
  12. @SRK: "we welcome the judgment" (ramjanmabhoomi trust), "victory for ram" (pravin togadia), "must help in building ram temple" (murli manohar joshi), "we believe today's judgment will put a fullstop to the ayodhya conflict" (bal thackrey)

    రిప్లయితొలగించండి
  13. Well said Tara.
    Those who went to the court with faith& belief got the verdict. Then, why these beliefless buffoons who are in no way connected with any of the faiths, talk rubbish on the courts, which are constitutional authorities?!!

    Do they believe Courts are un-constitutional?!! Are they commenting with so called "CONSTITUTIONAL SPIRIT" of Ambedkar & whoever?

    రిప్లయితొలగించండి
  14. So what? Is it not acceptable just because those guys welcomed it?!! :))

    మొగుడు కొట్టినందుకు కాదు, సవతి నవ్వినందుకు ఏడ్చినట్టుంది. :))

    రిప్లయితొలగించండి
  15. కోర్టులు రాజ్యాంగ సంస్థలా కాదా? కోర్టు తీర్పులు రాజ్యాంగ భద్దం కాదా?! కాదంటే, అంభోత్కర్ మీద ఒట్టు! :D

    రిప్లయితొలగించండి
  16. భేతాళునకు పట్టిన చిడుముకు చిట్కా ఏది?

    వాడైన గోరు...అనుపానంగా సలసలకాగే వేణ్ణీళ్ళు.

    ఐతే చిడుము తామరగా మారే దశ మొదలైందని ధన్వంతరి గారు చెప్పారు.

    మరి దానికి చిట్కా ఏదయ్యా అని చార్వాకుల వారి చేత ధన్వంతరి గారిని అడిగించా!

    అప్పుడు చార్వాకుల వారికి చెప్పిందిదీ -

    చిడుము తామరైపోతే గోర్లొదిలేసి, గచ్చుగోడల వద్ద నిలబెట్టవలె, వీలు కాని పక్షంలో తాటిమట్టలు అందించి శాంతి చెయ్యవలె.

    ఐతే ఫలశ్రుతి మటుకు : భేతాళుడు మాత్రం రక్తాలొస్తే పూలతో నిండిపోయిన తురాయి చెట్టని అందరికీ చెప్పి మళ్ళీ చెట్టు ఎక్కుతాడనిన్నీ.....

    అదండీ సంగతి.... :)

    రిప్లయితొలగించండి
  17. చరిత్రలో హిందువులు చేసిన తప్పేదైనా ఉంటే అది ఈ లౌకిక రాజ్యాన్ని ఇంతకాలం పాటు నోరుమూసుకొని భరించడమే. ఆ తప్పు మూలానే హిందువులు హిందువుల స్థానంలో నిలబడి ఏం చేసినా ఏం మాట్లాడినా ఈ దేశంలో తప్పుగా భావించబడే పరిస్థితి వచ్చింది. నాన్-హిందువులకు ఇంత బ్రాడ్ విండో ఇవ్వడమే హిందువుల తప్పిదం.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా స్వాములూ మీకు ఇంగ్లీషులో మంచి పట్టుండొచ్చేమోగానీ మాబోటి పల్లెటూరు సేద్యం చేసుకునేవాళ్ళ పరిస్థితేంటి.తెలుగును రక్షించండి రక్షించండి అనడం కాదండి దాన్ని అమలుజేసి చూపిస్తే కదా! దయచేసి చక్కటి తెలుగులో చెప్పండి మేమూ వింటాం.

    రిప్లయితొలగించండి
  19. మీ కవిత బాగుంది. నాదొక్క ప్రశ్న, ఒక హిందువుగా మీరు రోజులో ఎంత సేపు భగవంతుడిని ధ్యానం చేస్తారు? మీరు నిజమైన హిందువు అయిన పక్షం లో మీలో ఇంత ఆవేశం ఉండదు.

    రిప్లయితొలగించండి
  20. నీహారికగారూ ! మీ జడ్జిమెంటు భలే వుంది. హిందువులంటే ఉప్పూకారం తినని, పౌరుషం చచ్చిన శవాలనుకున్నారా ఏంటి ? సమయం వచ్చినప్పుడు కూడా గొంతుపెంచకపోతే ఆ మనిషిలో ఉండాల్సినదేదో లోపించిందని కాదూ అర్థం ? అలాంటి అటు-ఇటుకాని హిందువులనా మీరు కోరుకుంటున్నది ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Neti hunduvulu nenu hinduvu ani garvam ga cheppkodaniki kuda siggu paduthunnaru ante kaaranam ee kuhaanaa laukika vaadule. Ugravaadula kante veella valle desaaniki pramaadam ponchi undhi.

      Anti-hindu= Secularism
      Being Hindu= Communalism

      తొలగించండి
  21. నాస్తికుడిగా మారకముందు నేను హిందువునే. ముస్లింలకి ఉన్నంత భక్తి శ్రద్ధలు హిందువులకి లేవు అని చెప్పగలను. ముస్లింలు తప్పనిసరిగా ఖురాన్ చదువుతారు. హిందువులలో రామాయణమహాభారతాలు చదివినవాళ్లు ఎంత మంది, వేదాలు చదివినవాళ్లు ఎంత మంది? మనం ఐడెంటిటీ కోసం హిందువులమని చెప్పుకుంటాము కానీ మనకి భక్తి శ్రద్ధలు తక్కువే.

    రిప్లయితొలగించండి
  22. నీహారిక గారు అడిగిన ప్రశ్నలో తప్పేమీ లేదు. భక్తి దేవుని మీద, చిత్తం చెప్పుల మీద అనే సామెత వినలేదా?

    రిప్లయితొలగించండి
  23. అయ్యా ప్రవీణ్ గారు మీరు ముందు హిందువో , నాస్తికులో తేల్చుకోండి . ఒక వేళ నాస్తికులయితే "మనం" అని మీ కామెంట్లలో వాడకండి , అలాగే భక్తీ శ్రద్దల గురించి ఆ హిందువులు వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడతారు మీరు ఎక్కువ శ్రమ పడకండి .

    రిప్లయితొలగించండి
  24. అయ్యా చదువరి గారు

    ఈ పైనున్న శర్మగారెవరో నాకు తెలీదు, మీకు గానీ తెలిస్తే కొద్దిగా ఆయనకు ఒక రెండు మణుగుల గ్రాసం ఇవ్వండి.....నెమరేస్తూ కూర్చుంటారు......ఒకవేళ మీకు కూడా తెలియకపోతే చేసేదేమీ లేదు కానీ....వారి కామెంట్లు చదివిన తరువాత ఇహ ఇలా రాయాల్సి వచ్చింది...కలికాలం!

    రిప్లయితొలగించండి
  25. http://ongoluseenu.blogspot.com/2010/05/blog-post_14.html

    రిప్లయితొలగించండి
  26. పై శర్మ మెల్లగా దీన్ని వాడిన పెళ్ళి వైపో, ఎవరితో కావలిస్తే వారితో తిరిగే స్వేచ్చ వైపో, లేకపోతే మళ్ళీ మళ్ళీ పెళ్ళి పై తను చెడ్డీలు వేసుకోకుండా తిరిగే వయసులో ఎవరినే కేలికి టన్నులు తిని రాసిన కధో, అటు తిప్పి, ఇటు తిప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు బ్యాంక్ ఉద్యోగాలు చేస్తున్నారని, బాగా రిచ్ అని, ఏ.సి. ట్రైన్లో హైదారాబాద్ వెళ్ళానానో చెప్తారు..

    ఆ ముక్క చక్కగా విని వారు ఉత్తరాంధ్రలోకెల్ల ధనవంతులు అని చెప్పి, ఎవరైనా ఒక మంచి కేస్ ని ఇచ్చి పెళ్ళి చేయిస్తాము అని చెబితే కానీ వారి ప్రకోపం చల్లరాదు, అది చెప్పనివ్వండి

    రిప్లయితొలగించండి
  27. నీహారిక గారు చెప్పిన విషయంలో నిజం ఉందనిపించి వ్రాసాను. దీనికే ఎక్కడెక్కడి అర్థాలో వెతకడం నెగటివ్ ఆలోచన కాకపోతే ఏమిటి?

    రిప్లయితొలగించండి
  28. "Hindus in this country have more faith in religion than the law of the land." - హహ్హహ్హా.. ఏం జోకు! మొత్తం వాదనలన్నిటిలోకీ నాసి వాదన ఇది. ఒక తప్పుడు వాదన. హే..టువాదులు, దొంగ లౌకికవాదులు కూడా చెప్పరిది. వందేమాతరం పొడకపోతే ఏంటంటా అని అడిగేవాళ్ళు హిందువులను ఈవిధంగా అనడమా! హవ్వ! దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయండీ..!

    కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అది నచ్చకపోతే పై కోర్టుకు పోవాలి. అంతేగానీ, హిందువులకు మతమే ముఖ్యం లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. (ఈ డైలాగు కూడా మీ బ్లాగు నుండి కాపీయే.. రిజర్వేషన్ల గురించి తమరిదే వచించారు, గుర్తుకు తెచ్చుకోండి).

    "doubt what will happen to our secular democracy!" నాకూ ఉందీ సందేహం. లౌకికవాదం పేరుతో ఈ దొంగ లౌకికవాదులు దేశాన్ని ఎవడికి తాకట్టు పెడతారో ఏమతానికి అప్పజెబుతారోనని నాకూ సందేహం ఉంది.

    రిప్లయితొలగించండి
  29. @ నీ హారిక
    పిల్లలు కంటున్న ప్రతి హిందూ దంపతులూ ఆవేశం వున్నవారే.

    రిప్లయితొలగించండి
  30. పై వ్యాఖ్య కత్తి మహేష్ కుమార్ కు సమాధానంగా రాసాను.

    నీహారిక: "ఒక హిందువుగా మీరు రోజులో ఎంత సేపు భగవంతుడిని ధ్యానం చేస్తారు?" అస్సలు చెయ్యను. ఏం నేను హిందువును కానా? :)

    "మీరు నిజమైన హిందువు అయిన పక్షం లో మీలో ఇంత ఆవేశం ఉండదు." - ఏమిటండీ ఈ వాదన? నిజమైన హిందువు ఎవడెన్ని అన్నా విని, ఎవడెన్ని కొట్టినా తినీ పడుంటాడని మీ ఉద్దేశమా?

    రిప్లయితొలగించండి
  31. ప్రవీణ్ శర్మ: ఈ టపాలో మీ వ్యాఖ్యల కోటా ఐపోయింది. ఇహ నాపండి.

    రిప్లయితొలగించండి
  32. నీహారికగారు హిందువు అనే పదానికి డెఫినిషన్ ఇస్తునట్టున్నారే..

    రిప్లయితొలగించండి
  33. ఇదన్యాయం, మా గురువుగారికి, నాకూ సూర్యచంద్రులున్నంతవరకూ కోటా వుంటుందని లంబోద్గారుడు కలలో కనిపించి చెప్పాడు. కావాలంటే ఆయన్ను అడగండి.

    రిప్లయితొలగించండి
  34. భలే ఉంది కామెడి. పిచ్చ కితకితలు పెడుతున్నారు. నాక్కూడా కవితావేశం కొట్టుకొస్తోంది, తన్నుకొస్తోంది, బాదుకొస్తోంది.. అనుభవించండిక.

    కత్తో, సుత్తో దేంతోనో చంపేద్దాం ఎవణ్ణో ఒకణ్ణి
    గుడో, మసీదో, సందుదొరికితే కక్కేద్దాం విషాన్ని
    ద్వేషానికి తర్కం లేదు, ఈ ఎదవల బ్రతుకులకు అర్థం లేదు
    ఈ జాతి చస్తే... దేశానికి వచ్చిన నష్టం వెంట్రుకంత కూడా లేదు

    రిప్లయితొలగించండి
  35. బాగా వ్రాసారు @ చదువరి గారు.
    దేశాన్ని హిందుదేశంగా ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. లేదంటే, ప్రతి గుడి పక్కన ఓ మసీదు కడతామని కోర్టుల్లో లిటిగేషన్లు వేసి మూడింట ఓ వంతు వాటా కోసం క్యూలు కడతారు. వాళ్ళకు కంటితుడుపుగా మన కోర్టులు కూడా స్థలాలని కేటాయిస్తాయి. అలా స్థలాలు కేటాయించినా అన్యాయం జరిగిందనే అడ్డమైన ఏడ్పులు ఏడ్చే దద్దమ్మలు మత సామరస్యానికి తూట్లు పొడుస్తూనే ఉంటారు.

    రిప్లయితొలగించండి
  36. Excellent చదువరి గారు... హిందువులకి ముస్లిం లు శత్రువులు కాదు... ముస్లిం లకి హిందువులు శత్రువులు కాదు...

    ఈ కుహానా లౌకికవాదులు , వొటు బేంక్ కొసం విభజించి పాలించాలనుకునే పార్టీలు ... వీరే హిందువులకి, ముస్లింలకి, భారతదేశానికి శత్రువులు

    రిప్లయితొలగించండి
  37. హిందు దేశంగా వద్దులెండి... అది చాలా పెద్దది.

    దేశాన్ని మన దేశంగానే ఉంచుదాం

    రిప్లయితొలగించండి
  38. ఎంటి ఇక్కడ నిహారిక గారు ...ఆవిడ తప్ప మిగతావారు అందరూ అసలు హిందువులు కాదని డిసైడ్ చేసేసినట్టు ఉన్నారు :-))
    మీఇంటికొచ్చి ఎవడయినా నాలుగు తంతే అప్పుడు అవేశం లేకుండా అలొచించండి... క్షమించండి ఈ ఉదాహరణ ఇచ్చినందుకు... కానీ ఇదే కరెక్ట్ ఉదాహరణ మీకు

    శర్మ గారు నాస్తికులట :? ఆయన అలొచనల గురించి ప్రిఫరెన్సుల గురించి మీకు తెలియాల్సినది ఇంకొటుంది .. ఆయన మాట్రిమొనియల్ ఆడ్ లొ ఇలా ఉంది

    ఏజ్ : 20 - 40 (వయస్సు పెద్ద పట్టింపు లేదు)
    ఎత్తు : 4.8 - 6 (ఎత్తు పెద్ద పట్టింపు లేదు )
    విడొ , డైవొర్స్ అయినా పర్లేదు (పట్టింపులేదు )
    మతం : హిందూ మాత్రమే

    ఎందుకటా ??? నాస్తికునికి ఈ మతమయినా పర్లెదు కదా ??? తప్పదు మరి రిజర్వెషన్స్ కిరస్తాని మతం కి కూడా ఇచ్చెవరకూ హిందూ మతం మాత్రమె కావాలని మన నాస్తిక ప్రవీణ్ అడగక తప్పదు...

    అసలు ప్రవీణ్ కొసం ఇంత పెద్ద కామెంట్ అవసరమా అనుకున్నా కానీ .. మన నాస్తిక ప్రవీణ్ నాటకాలు ఒకసారి చెబుదామని :-))

    రిప్లయితొలగించండి
  39. మైనార్టీ,
    మైనార్టీ,
    మైనార్టీ,

    దేశాన్ని ఇలా విభజిస్తూ పోతే,
    ప్రతి కులమూ మైనార్టీనే.
    ఇంహ పండుగ చేసుకోండి. అందరికీ హక్కులే హక్కులు.

    రిప్లయితొలగించండి
  40. నా అఖరు కామెంట్...ఇదె ఇంతకుముందొసారి వెరే బ్లాగు లొ రాసాను

    మీరు రొడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నారు. మీ చేతిలొ ఒక కర్ర కూడా ఉంది .... ఇంతలొ సడన్ గా రొడ్డు మీద ఒక కమ్యూ , ఒక పాము కనిపించాయి ... మీ చెతిలొ ఉన్న కర్రతొ ముందు ఎవర్ని కొడతారు ???

    రిప్లయితొలగించండి
  41. >>మీ చెతిలొ ఉన్న కర్రతొ ముందు ఎవర్ని కొడతారు ???

    పాము దాని దగ్గిరకి వెళ్ళి దానికి ప్రాణ హాని అని భయం వేస్తేనే ఏదో కాటేస్తుంది, అస్సలు పోలిక బాలేదు..

    నేను కేస్ వేస్తున్నాను మంచు గారి మీద, జంతుహక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం జంతువులని ఇలా హింసించడం నేరం..

    రిప్లయితొలగించండి
  42. ఒక అజ్ఞాత ఇలా వ్యాఖ్యానించారు:

    నిహారిక, హిందువు అయినంత మాత్రాన దేవుడిని నమ్మాల్సిన అవసరం లేదు. హిందువులలో polytheists, monotheists, atheists కూడా ఉంటారు. హిందువు అన్న పదానికి నిర్వచనం లేదు. ఎవడికి వాడు నేను హిందువు అనుకుంటే వారు హిందువులైపోతారు. అంతే తప్ప దేవుడిని నమ్మారా, పూజలు చేస్తారా అన్నదానితో సంబంధం లేదు. కొందరు నమ్ముతారు, కొందరు కేవలం జీవన విధానంగా భావిస్తారు. నాకు దేవుడి మీద నమ్మకం లేకపోయినా గౌరవం, ఇష్టం ఉన్నాయి. అంతేగాక నేను హిందువు అని చెప్పుకోడానికే ఇష్టపడతా తప్ప నాస్తికుడని ఎప్పుడూ చెప్పుకోను. నా హిందూధర్మం నాకు ఇచ్చిన స్వాతంత్ర్యం అది. మరే ఇతర మతాలలోనూ లేనిది. అంతగా అవసరమైతే హిందూ-నాస్తికుడినని చెప్పుకుంటానే తప్ప నా ఐడెంటిటీని ఎప్పుటికీ వదలలేను.

    రిప్లయితొలగించండి
  43. చదువరి గారు, మీరు చాలా బాగా రాస్తున్నారు. ఇలాగే ఈ దొంగనా కుహనా లౌకికవాదుల పని పట్టండి. నేను కూడా నా వంతు కృషి చేస్తాను. ఇప్పటికే హిందువులు చాలా రాష్ట్రాలలో మైనారిటీలో ఉన్నారు. ఇలాగే కొనసాగితే మనల్ని తన్ని తరిమేస్తారు. మనం నోరు విప్పాల్సిన సమయం ఇదే.

    రిప్లయితొలగించండి
  44. చదువరి గారు &మిత్రులారా,
    ఈ టపాతో సంబంధం లేక పోయినా మీకు వీలున్నపుడు ఈ క్రింది వ్యాసం చదివేది.

    "Indian does not mean just holding an Indian Passport"
    http://www.haindavakeralam.com/HKPage.aspx?PageID=11060&SKIN=B

    రిప్లయితొలగించండి
  45. *ముస్లింలకి ఉన్నంత భక్తి శ్రద్ధలు హిందువులకి లేవు అని చెప్పగలను. ముస్లింలు తప్పనిసరిగా ఖురాన్ చదువుతారు. హిందువులలో రామాయణమహాభారతాలు చదివినవాళ్లు ఎంత మంది, వేదాలు చదివినవాళ్లు ఎంత మంది? మనం ఐడెంటిటీ కోసం హిందువులమని చెప్పుకుంటాము కానీ మనకి భక్తి శ్రద్ధలు తక్కువే.*

    చూడు మార్తాండా నువ్వు ఒకటి ఇంకొకటి అర్థం చేసుకొంటావు. హిందూ మతం లో కనిపించిన ప్రతివొకడికి లేక ఆ మతం లో పుట్టిన ప్రతి ఒక్కడికి మత గ్రంధాలు చదవమని చావ గొట్ట లేదు. మీలాంటి వారు దానిని గ్రహించి పొగడాలి కాని హిందువులకు భక్తి తక్కువ అని ఎలా అంటారు? రోజు పూజలు చెసినంతమాత్రాన భక్తి ఉన్నదనా అర్థం? అటువంటి వాటిని ఎక్కడ హిందువులలో అన్ని వర్గాలకు చెప్పలేదు. ప్రతి వర్గానికి వారు చేసుకొనే పనే దైవం అని చెప్పారు. ఆ పని లో భాగం గా కొంతమంది బ్రహ్మణులకు సంధ్యా వందనం, వేదాలు, ఉపనిషత్లు, భగవద్గీత, రామాయణ, మహాభారతాలు లాంటివి చదివేవారు. మన గ్రామాలలో రామాయణ, మహాభారతాలు చదవక పోయిన వారు ఉన్నా వాటిలో ఎముందో అందరికి తెలుసు. ఎందుకంటె చిన్నపటినుంచి వీటీని కథల రూపం లో అందరూ వినేవారు కదా!
    మిగతా మతాల వారిలా నిద్దర లేచిన మొదలు పూజ పేరు తో ఇష్టమున్నా లేక పోయినా బలవంతం గా చేయాలని వొత్తిడి తేలేదు. దీనిని బట్టి మన పూర్వీకులు మీలాంటి నాస్థికుల కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని అర్థమౌతుంది కదా? మిగతా మతాల వారిలా నిద్దర లేచిన మొదలు పూజ పేరు తో ఇష్టమున్నా లేక పోయినా బలవంతం గా చేయాలని వొత్తిడి తేలేదు. దీనిని బట్టి మన పూర్వీకులు మీలాంటి నాస్థికుల కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని అర్థమౌతుంది కదా? అన్ని వర్గాలకు దేవుడు, భక్తి పేరుతో నర నరాన మత పిచ్చి ఎక్కించ లేదు. సంతోషించు. ఎవరు విజ్ణులో ఆలోచించు.

    రిప్లయితొలగించండి
  46. అజ్ఞాత, 3 అక్టోబర్ 2010 12:15:00 ఉ GMT+05:30
    పై అజ్ఞాత గారిని సమర్థిస్తున్నాను.ఎవరు విజ్ఞులో ఆలోచించు అని అడిగితే విజ్ఞత వస్తుందా మన పిచ్చి గానీ...
    అలాగే ఇంకో(?) అజ్ఞాతగారిమాటలు
    " చరిత్రలో హిందువులు చేసిన తప్పేదైనా ఉంటే అది ఈ లౌకిక రాజ్యాన్ని ఇంతకాలం పాటు నోరుమూసుకొని భరించడమే. ఆ తప్పు మూలానే హిందువులు హిందువుల స్థానంలో నిలబడి ఏం చేసినా ఏం మాట్లాడినా ఈ దేశంలో తప్పుగా భావించబడే పరిస్థితి వచ్చింది. నాన్-హిందువులకు ఇంత బ్రాడ్ విండో ఇవ్వడమే హిందువుల తప్పిదం."
    వీటిని కూడా ....
    పోతే నీహారిక విషయం... అది ఆవిడో... ఆవిడ డూపో తెలిసే వరకూ ఏమీ చెప్పలేం.

    రిప్లయితొలగించండి
  47. /మీ చెతిలొ ఉన్న కర్రతొ ముందు ఎవర్ని కొడతారు ???/
    పాము కనిపిస్తే .. " నాగుల చవితి నాగన్నా లేచిరావయ్యా .. " అని పాడుతూ పాలు పోసి, నృత్యం చేస్తాను. హేటువాదో, ముష్టి కమ్యూనిస్టో కనిపిస్తే కర్రతో నాలుగివ్వడానికే ప్రయత్నిస్తాను. :)

    రిప్లయితొలగించండి
  48. @చదువరి : Let me elaborate.
    (అగ్రకుల) హిందువులు తమ సామాజిక శక్తిని, రాజకీయ అధికారాన్నీ,ఆర్థిక బలిమిని by design మతం నుంచే పొందారు. This holds good for any majority across the world.

    దళితులూ, మైనారిటీలూ అదే dominant మతం కారణంగా exploitation, inhuman treatment ఎదుర్కోవడమే కాకుండా సామాజిక-రాజకీయ-ఆర్థికావకాశాలు కోల్పోయారు.

    ఈ పరిస్థితుల్లో the only level playing field possible came through constitution. రాజ్యాంగం కేవలం సమాన అధికారాలు కల్పించలేదు. అప్పటివరకూ వంచితులుగా నిలబడినవాళ్ళకు nominal incremental advantage ఇవ్వజూసింది.

    ఇది సహజంగానే కులహిందువులకు అంగీకారం కాని విషయం. సచేతనంగా కాకపోయినా, ఉపచేతనంగా (subconscious గా)హిందువులకు రాజ్యాంగంపైనుండే అక్కసుకు ఇదొక కారణం. You can observe this in your own discourses of caste and religion when they are pitted against constitutional guarantees granted to Dalits and minorities.

    On the other hand, దళితులకూ మైనారిటీల మనుగడకున్న ఏకైన ఆధారం రాజ్యాంగం. This is the only place that will guarantee them their rightful position in this society. అందుకే we swear by law and constitution. And get more worried if it doesn't deliver justice. అందుకే ఈ కేసులో మెజారిటీ మతవిశ్వాసాల ప్రాతిపదిక తీసుకుని కోర్టు తీర్పు నివ్వడం ఇంత disappointment కు కారణం.

    రిప్లయితొలగించండి
  49. మహేష్ కుమార్: హిందువులకు రాజ్యాంగమంటే గౌరవమే లేదా? హ హ.. జోకులెయ్యడం ఆపండిక!

    ఒక తీర్పు మీకు కొంత ప్రతికూలంగా, హిందువులకు కొంత -కొంతే-అనుకూలంగా (నిజానికి ఆ తీర్పు అందరికీ అనుకూలమే అందరికీ ప్రతికూలమే) వచ్చిందనే అక్కసుతో కోర్టుల్ని, తీర్పిచ్చిన జడ్జీలనూ విమర్శించేసింది మీరు. రాజ్యాంగం అంటే మీకు గౌరవమా? వందేమాతరం పాడకపోతే ఏంబోయిందంటా అని రొమ్మిరుసుకోని అడిగారు -రాజ్యాంగమంటే మీకు గౌరవముందని నేను అనుకోవాలా? పొద్దున లేచింది మొదలు పొడుకునేదాకా కులం, మతం అంటూ హిందువులపై విద్వేషాన్ని రగిలిస్తూ, ఇతర కులాలవాళ్ళను తిడుతూ, కవితలల్లుతూ, పాటలు కడుతూంటారు.. మీకు రాజ్యాంగంపై నమ్మకముందని నన్ను నమ్మించజూస్తారా? ఆపండాపండి.. నేనిక నవ్వలేను, నమ్మలేను.

    కానీ ఒకటి.., మీకు రాజ్యాంగమంటే గౌరవమే -అది మీకు అనుకూలంగా ఉన్నంతవరకే! మీ ప్రయోజనాలను రక్షిస్తున్నంతవరకే! మీకు రాజ్యాంగం కంటే హిందూ ద్వేషం ముఖ్యం. అంచేతే కోర్టు తీర్పు రాగానే అంతటి విషం గక్కారు. కానీ నాకు అలాకాదు.. వందేమాతరమైనా, రిజర్వేషన్లైనా, కాశ్మీరైనా, కోర్టు తీర్పులైనా, నాకు నచ్చినా, నచ్చకున్నా, ఇప్పుడైనా, ఎప్పుడైనా.. నాకు రాజ్యాంగమంటే గౌరవమే.

    మీకు మీరే సృష్టించుకున్న ఒక మిథ్యాలోకంలో మీరు జీవిస్తున్నారు. రేయింబవళ్ళూ పటికలలు కంటూంటారు.. అక్కడ మీరు హీరో, హిందువులు విలన్లు. ’హిందువులెప్పుడూ మీపై కుట్రలు చేస్తూంటారు. వాళ్ళకు రాజ్యాంగం అంటే పడదు.’ ఇదీ మీ స్క్రిప్టు. ఆ పిచ్చిలోకం నుండి బైటపడండి.

    రిప్లయితొలగించండి
  50. హిందువులు గుజరాత్ మారణకాండ చేసింది రాజ్యాంగం మీద గౌరవంతోనే కదా.

    రిప్లయితొలగించండి
  51. అజ్ఞాత: మీకు బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే.., మీరు దేనిపై గౌరవంతోటి గోధ్రాలో హిందువులను సజీవదహనం చేసారో, దానిపైనే.. రెట్టించిన గౌరవంతో.. ఇనుమడించిన భక్తితో హిందువులు చేసారు.

    రిప్లయితొలగించండి
  52. ఈ లౌకిక సన్నాసులు చెప్పే దిక్కుమాలిన తర్కం చూడండి.
    ముంబైలో మారణకాండ చేసింది ఉగ్రవాదులు - వాళ్ళు ముస్లిములు కాదు, ఇస్లామిక్ ఉగ్రవాదులు అని అనకూడదు.
    కేరళలో, ఆంధ్రప్రదేశులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశులో, కాశ్మీరులో, దేశంలో మూలమూలనా వినాశనం సృష్టిస్తున్న కల్లోలకర్తలు కే..వలం ఉగ్రవాదులు, అంతే! - వీళ్ల విషయంలో ఇస్లామిక్కు లాజిక్కు పనికిరాదు.

    చదువు చెప్పేవాడి చేతులు నరికినా - దానికి మతంతో సంబంధం లేదు, సిలామును ఇక్కడ లాక్కు రాకూడదు.

    తెల్లారుజామున మసకచీకట్లో వేటకొడవళ్ళతో దాడి చేసి పదిమందిని చంపేసినా, రక్తమంటిన ఆ ఆయుధాలు ఊరి మసీదులో పోలీసులకు దొరికినా - దానికి మతంతో సంబంధం లేదు, ఇస్లామును ఇక్కడ లాక్కు రాకూడదు.
    ఇంత జరిగినా ఆ కేసును ముందుకు సాగనివ్వని కమ్యూనిస్టు ప్రభుత్వ దొరలు మాత్రం మహా లౌకిక వాదులు.

    పదుల మంది హిందువులను సజీవ దహనం చేసినా - అది ఏ మతస్తులూ చేసినట్టు కాదు. ఇక్కడ మతం పేరెత్తకూదదు.
    కానీ, దానికి స్పందనగా జరిగిన గుజరాతు మారణకాండ మాత్రం.. హిందువులంతా క్జలిసి కుట్ర చేసినట్టు! యథేచ్ఛగా అడిగెయ్యొచ్చు - "హిందువులు గుజరాత్ మారణకాండ చేసింది రాజ్యాంగం మీద గౌరవంతోనే కదా." అని. ఎంత విద్వేషం! ఏమి కుట్ర! ఎంత కుచ్చితం!

    దొంగ లౌకికవాద మెంత దొంగది!!!

    రిప్లయితొలగించండి
  53. చదువరి, "ఇదే పాట, ప్రతీచోట ఇలాగే పాడుతుంటాను" టైపులో ఇక్కడ అయోధ్య విషయంలో కుళ్ళిపోయిన ఏడుపుగొట్టు దళిత అజెండా అలవాటు ప్రకారం చొప్పించే ప్రయత్నాలను మీరు అడ్డుకోవాలని మనవి. ఎక్కడపోయినా అదే పాటనా? ఆ అప్రస్తుత కామెంట్లు తొలగించి టాపిక్ హైజాకింగ్ ఆపాలని కోరుతున్నాను.

    రిప్లయితొలగించండి
  54. చదువరి గారు మంచి సమాధానమిచ్చారు గట్టి గా చప్పట్లు ! కాశ్మీర్ ని పాకిస్తాన్ కిచ్చేయాలి అని వెర్రి రాతలు రాసేవాళ్ళు పెద్ద దేశభక్తులు . దేశమంతా జాతిపిత గా గౌరవించే మనిషిని ఆయన చేసిన మంచి పనులు తలుచుకోవాల్సిన జయంతి రోజున ఎక్కడెక్కడినుంచో ఎత్తుకొచ్చి వీడియోలు పెట్టిన నా బ్లాగు నా ఇష్టం అనే పెద్ద మనుషులు వేరే వాళ్ళకి దేశభక్తి , రాజ్యాంగం వాటి గొప్పతనాల గురించి నీతులు చెబుతుంటే మహా గొప్పగా ఉంది .
    అయ్యా పై అజ్ఞాత గారు హిందువులనే వాళ్ళు రాజ్యాంగం పైన గౌరవం, పరమత సహనం పాటించ బట్టే ఇంకా ఈ దేశం ఇలా ఉంది.

    రిప్లయితొలగించండి
  55. తమ దాక వస్తే ఎలా ఉంట్టుందో చూడండి.

    http://expressbuzz.com/states/kerala/kerala-churches-unite-over-existential-threat/208560.html

    Kerala churches unite over 'existential threat'
    M P Prashanth - www.expressbuzz.com
    KOZHIKODE: Confronted by ‘increasing threats to the existence of the community’, believers of the major Christian Churches in Kerala have formed a common platform to face the challenges unitedly.

    The first meeting of the Christian Democratic Union (CDU) was held here on Sunday which was attended by representatives of the CMI, CSI, Syrian Catholic and Orthodox Churches. Fr. Dr. Antony Kozhuvanal, national general secretary of the Infam, inaugurated the meeting.

    The CDU came into being against the backdrop of the incidents after the attack on T J Joseph, lecturer at the Newman College, Thodupuzha. Sources said the CDU feels that unorganised Christians are facing stiff challenges from other ‘organised forces’.

    "They convert our people after giving many promises. These persons were sent to Kashmir to fight the Indian army," says the notice distributed before the meeting of the CDU.

    Indirectly referring to the attack on Joseph, the notice says "nobody reacts when the hands and legs of Christians are being chopped off."

    It went on to add "political parties and the ruling class are hunting the Christians and their institutions. They need vote banks. They want the support of the communities whose population graph shows an upward trend."

    The CDU is also concerned about the decline in the population of the Christians in the state. It says the population of the Christians came down from 30 percent in 1950 to less than 20 percent in 2010.

    "This is because educationally forward Christian community imbibed the spirit of the family planning programme."

    The fledgling organisation is dejected by the let-down by the political parties which traditionally enjoyed the support of the Christians. Sources said initially the organisation will concentrate in the northern districts before spreading to other areas. Advocate Babu Benedict has been elected the president and Advocate Joy Abraham general secretary. T M Abraham is the treasurer

    రిప్లయితొలగించండి
  56. ఇటువంటి వాదనలు చేస్తూ హైదరబాదులో ఏ మొహం పెట్టుకొని తిరుగుతున్నారో అర్థం కాదు. హైదరాబాద్ లో ఎవరికైనా సిగ్గు,లజ్జ,మానం,అభిమానం,రోషం,చీము,నెక్తురు,అన్నం తినే బ్లాగరులు ఉంటె ఇటువంటి వారితో సంబంధాలు తెంచుకోవాలి. ఇటువంటి వారిని మద్దతునిచ్చె ఎవరైనా బ్లాగరులు ఉంటె ఒక లిస్ట్ చేస్తే మనం వారి జోడికి వేళ్ళకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  57. "ఇదే పాట, ప్రతీచోట ఇలాగే పాడుతుంటాను"

    చక్కని పాట గుర్తు చేశారు. ఏదో శోభన్ బాబు సినిమాలోని పాట, బాలు చాలా బాగా పాడారు.

    రిప్లయితొలగించండి
  58. @అజ్ఞాత,
    లౌకికత్వమంటే అందరినీ సమానంగా చూడడమా? మెజారిటీలు అణిగిమణిగి ఉండి మైనారిటీలకి సర్వాధికారాలూ, అడిగిందల్లా ఇచ్చేయడమా?
    >>>>Indian state is a capitalist, upper caste, Hindu state...
    అని డిక్లేర్ చేస్తున్న మేధావులకి ఆ మాత్రం తెలియదా? లౌకికత్వమంటే హిందూ ద్వేషం అన్నమాట.

    హిందువులు, అగ్రవర్ణాలూ ఏ విధంగానూ ఏక్టివ్‌గా ఉండకుండా మిగిలిన మతాల, కులాల వారికి అన్నీ అప్పగించేసికూర్చోవడమే లౌకికత్వమంటే. అలాజరిగితేనే ఇండియా లౌకిక రాజ్యం అని ఒప్పుకుంటారు వీళ్ళు. మిగిలిన మతాలకీ, కులాలకీ సమానత్వం కాదు వీళ్ళకి కావలసింది, హిదూమతం, అగ్రకులాలు తుడిచిపెట్టుకుపోవడమే వీరి దృష్టిలో లౌకికత్వం.
    -----------------------------------
    @అజ్ఞాత వెల్ said ........నా చిన్నప్పుడు నా కళ్ళెదుట కుహన లౌకిక బడుగు వర్గాల ఆరాజాకియ నాయకులు అమాయక బడుగు ప్రజలను చెప్పుడు కూతలతో రెచ్చగొట్టి అగ్రవర్ణాల మీదకు పంపినప్పుడు జరిగిన మా వూరి రక్త చరిత్ర మారణహోమం లో నరకబడిన తలలన్ని అమాయక బడుగు ప్రజలవే...
    మీడియా, ప్రభుత్వం అన్ని వర్గాలు అసలు మరణ హోమం కు దారి తీసిన నిజమైన విషయాలను గాలికి వదిలివేసి ఇప్పటికి ఆవాస్తవాలను కుహనా ఆ లౌకిక నాయకుల చెప్పుడు మాటలు ప్రచారం చేస్తూ అగ్రవర్ణాల మీద దారుణమైన దాడి చేస్తున్నాయే?

    అగ్రవర్ణాలు పన్నుల రూపంలో కట్టిన డబ్బును ...ఈ కుహనా బడుగు వెధవలు(నాయకులు) రిజర్వేషన్స్ రాజ్యాంగం ప్రకారం అంటూ Govt .hostels లో free ఫుడ్ దే.గి తిని పెరిగి అన్నం పెడుతున్న చేతినే కొరుకుతున్నారు...యాక్...దూ...
    మన బారత దేశం లో అగ్రవర్ణాలు గా పుట్టడమే పాపం అని అన్ని విధాలుగా(రాజ్యాంగం,Govt .Polices,మీడియా, మైనారిటీ,బడుగు వర్గాల అలౌకిక నాయకులూ,నీచ కాంగ్రెస్ &అన్ని ఆరాజకీయ పార్టి ఆరాజాకీయులు) అగ్రవర్ణాల మీద దాడులు చేస్తూ,హింసిస్తున్న ప్రస్తుత పరిస్తితులను చూస్తుంటే మరో కనీ, వీని ఎరుగని దారుణ మారణ హోమ రక్త చరిత్ర జరగక తప్పదు....ఒకవేళ వేర్పాటు రాష్ట్రం ఏర్పాటు జరిగితే ఇంకా అతి త్వరగా జరుగుతుంది.

    రిప్లయితొలగించండి
  59. అప్పట్లో అబ్రకదబ్ర పోస్టుల్లో ఈ వాడి వేడి ఉండేవి . You have same intensity. Keep the good work.

    రిప్లయితొలగించండి
  60. బాబూ రక్తచరిత్ర నువ్వు నీతులు చెప్పడం ఏమిటి? సమైక్యాంధ్రలో ఉండకపోతే అడ్డంగా నరికేస్తాము అనే రక్తపిపాసివి నువ్వు లౌకికత్వం, సమానత్వం గురించి మాట్లాడుతున్నావా? దెయ్యాలు వేదాలు పాడుతున్నట్టు ఉంది.

    రిప్లయితొలగించండి
  61. ఎందుకయ్య ఊరు ఊరు
    ఆంజనేయ విగ్రహాలు
    ఇన్ని మసీదులు
    ఈ శిలువ కొలువులు
    మతబోధలో ఉందా
    ఉద్రిక్తత బీజం
    బీడువారుతోందా
    మన హృదయ క్షేత్రం
    ఎన్నళ్ళకు తొలగుతుంది
    నిరాశా గ్రహణం
    వెలుగు కిరణరేఖ వెంట
    పోదాం నేస్తం
    http://vennelalu.blogspot.com

    రిప్లయితొలగించండి
  62. ఎందుకయ్య ఊరు ఊరు
    ఆంజనేయ విగ్రహాలు
    ఇన్ని మసీదులు
    ఈ శిలువ కొలువులు
    మతబోధలో ఉందా
    ఉద్రిక్తత బీజం
    బీడువారుతోందా
    మన హృదయ క్షేత్రం
    ఎన్నళ్ళకు తొలగుతుంది
    నిరాశా గ్రహణం
    వెలుగు కిరణరేఖ వెంట
    పోదాం నేస్తం
    http://vennelalu.blogspot.com

    రిప్లయితొలగించండి
  63. చదువరి గారూ..,
    గట్టిగా చప్పట్లు..!!

    "ఎంత కష్టం ఎంత కష్టం
    కుహన లౌకికవాదులకెంత కష్టం
    మొన్న అయోధ్య తీర్పు
    ఈరోజు కామన్వెల్త్ ప్రారంభ వేడుక
    రెండూ భారతీయతే ప్రతిఫలిస్తున్నాయ్
    ఎంత కష్టం ఎంత కష్టం
    కుహన లౌకికవాదులకెంత కష్టం"

    We(all Indians)can forgive Nihaarika for her ignorance on Indainness OR Hinduness. But the well known venomous character should be condemned by every Indian.

    Niharika,
    You too should condemn that venomous character and try to understand the Indian-ness. It's not that easy to understand as decide on voting to nasty dynasty party during elections.

    రిప్లయితొలగించండి
  64. "సముద్రం శాంతంగా ఉందంటే
    కారణం చెలియలికట్ట కాదోయ్
    స్వీయ నియంత్రణ, కఠోర క్రమశిక్షణ
    అనంత గాంభీర్యం, సముద్రమంత సహనం!"

    Excelent..!!

    రిప్లయితొలగించండి
  65. "పోతే నీహారిక విషయం... అది ఆవిడో... ఆవిడ డూపో తెలిసే వరకూ ఏమీ చెప్పలేం."

    సుధారాణి గారూ,
    ఆవిడ, ఆవిడే..! కొంచెం పరిపక్వత తక్కువ కానీ,మంచామే(మంచి ఆమే) ఎందుకిలా చెప్పగలుగుతున్నానంటే, ఆవిడ టపాలు కొన్ని చదివాను మరి.

    రిప్లయితొలగించండి
  66. @ చదువరి:
    నేను ప్రారంభం నించి మీ బ్లాగుని ఆసక్తితో చదువుతున్నాను. బ్లాగులు నిలదొక్కుకోడానికి నిష్పాక్షికత అలవర్చుకోవాలి. అప్పుడే మన బుద్ధి మన ఆధీనంలో ఉండి విశ్లేషణలు చక్కగా చేయగలుగుతాం. మనకి కోపం ఎప్పుడు రావాలో మనమే నిర్ణయించుకోవాలి. రెచ్చగొట్టుడు బ్లాగులకి అతిగా స్పందించడం వల్ల వాళ్ళకి రెండు లాభాలు. ఒకటి-వాళ్ళ బ్లాగుల్లో విశేషమైన ప్రతిస్పందనలు, రెండు-మళ్ళీ ఇక్కడ మరికొన్ని స్పందనలు. ఇప్పటికే ఈ రియాక్టివ్ బ్లాగులవలన వ్యక్తులకి నెగటివ్ హీరోయిజం ఆపాదించి వారూహించని పబ్లిసిటీని వాళ్ళకిచ్చేస్తున్నారు. కేవలం వ్యక్తి దూషణే ధ్యేయంగా నడిచే బ్లాగరుల జాబితాలో మీరు చేరకండి. దానివలన వ్యక్తిత్వం పలచబడుతుంది. మఖలో పుట్టి పుబ్బలో నశించే బ్లాగరిగా కాక "వెయ్యి విభిన్న అంశాలపై చదువరి వ్యాఖ్యానం" వంటి ధ్యేయాలను పెట్టుకుని విజృంభించండి. శుభమస్తు!

    రిప్లయితొలగించండి
  67. Surya: మీ పాయింటు అర్థమైంది.

    నీహారిక: మీరు "హమ్మయ్య" అని అంటూంటే నవ్వొచ్చింది. :) ఎందుకంటే, ఇక్కడ మీరు మొదటి వ్యాఖ్య రాసేటప్పటికి, మీ బ్లాగులో టపా రాసేటప్పటికీ.. అసలు నేను రాసిందేంటో మీకు అర్థం కాలేదు. ఇప్పటికి కూడా అర్థం కాలేదని తెలిసింది. ఎప్పటికో అప్పటికి మీకు అర్థమవకపోదు, అప్పుడు నేనూ ’హమ్మయ్య’ అని అనుకోకపోను అని అనుకుంటున్నాను. కానీ నాకా అవకాశం ఇప్పట్లో దొరుకుతుందో లేదో తెలవడం లేదు. :)

    రిప్లయితొలగించండి
  68. కవితలు రాయాలంటే ఏమి చేయాలో అర్థమయింది. ఇన్ని రోజులూ సూర్యోదయాలు, పూలమొక్కలు, పసిపాప బోసినవ్వులు, సముద్ర తీరాలు ఇలాంటివి కవితకు ప్రేరణనిస్తాయని అనుకున్నాను.నేనూ మార్గదర్శిలో చేరి ఓ చిన్న తవిక రాస్తాను. ఇదుగోండి.

    చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
    బ్లాగులోన గబ్బు లౌకికత్వ
    మనెడు క్షుద్రనీతి వినగనోపగలేము
    విశ్వదాభిరామ వినురవేమ.

    (వేమనా, నిన్నో ఇందులోకి లాగుతున్నందుకు క్షమించు!)

    రిప్లయితొలగించండి
  69. నేను ఒకటి చెపితే ఒకటి అర్ధం చేసుకుంటారండీ అందరూ,.....

    నీహారిక,
    సో, మీకు సరిగా చెప్పడం రాదని ఒప్పుకున్నారన్నమాట. పైగా ఆవేశంతో పోస్టులు కూడా రాసేస్తారు వెంటనే! LOL!

    రిప్లయితొలగించండి
  70. "నా వ్యాఖ్యను పత్రికల వాళ్ళు వక్రీకరించారు." అనేస్తే పోలా

    రిప్లయితొలగించండి
  71. ఆలోచిస్తేనే ఆవేశమొచ్చిందండి :(

    బలహీనత పోగొడదాం, డాక్టర్ దగ్గరికి వస్తారా అంటే అదేదో ఇంగ్లీషులో తిట్టారండీ. ఏంటదీ... ఆ 'stay out of it' ట!

    "మీకు అర్ధం కాని విషయం అదే మనుష్యుల్లో ఎవరెవరికి ఏయే బలహీనతలు,బలాలు ఉంటాయో అదే నేను ఒక బ్లాగు పెట్టి మరీ చెపుతున్నాను. నేను మనిషిని కానా దేవతనా?"
    హబ్బా, మిమ్మల్నెవరండీ దేవత కాదంది? అసలంతకంటే ఉపయోగకరమైన బ్లాగులేమున్నాయనీ?

    ధన్యవాదాలండి మరి.

    రిప్లయితొలగించండి
  72. ఊప్స్...
    క్షమించండి, మీరు మనిషే.
    నేనే తప్పుగా అర్థం చేస్కున్నట్టున్నాను

    రిప్లయితొలగించండి
  73. హయ్యో, మీకెందుకండీ శ్రమా?
    బలాలూ, బలహీనతల బ్లాగును ఇంకా జనరంజకంగా మలచడంలో నిమగ్నమైపోండి మీరు.
    చదువరి గారి పోస్టులకి కామెంట్లు వాటంతటవే వచ్చేస్తాయ్. మీరు హాఫ్ఫీగా నిద్రపోండి.

    రిప్లయితొలగించండి
  74. మీ అభిమానానికి కృతజ్ఞతలండి నీహారిక గారు.

    మనమసలు మామూలుగానే ఏమీ చెయ్యం, ఇంకా డిఫరెంట్ గానా?? వామ్మో, నా వల్ల కాదండి.

    అప్పటికీ మీరు చేస్తున్న మానసికోద్ధరణ సేవని చూసి నేనూ బాగా ఇన్‌స్పైర్ అయ్యాననుకోండీ. ఐనా మీరలా దిశనిర్దేశం చేస్తే ఏమన్నా డిఫరెంట్ గా సమాజ సేవ మొదలెడతాన్లెండి.

    రిప్లయితొలగించండి
  75. నీహారిక గారూ, ఇక్కడ రెండు విషయాలున్నై..
    1. అందరికీ విపులంగా తెలిసిన సంగతిని అర్థం చేసుకోవడంలో మీరు తికమక పడిపోతున్నారు. (ఆ సంగతి మీకూ తెలుసు)
    2. అందరికీ తెలిసిన ఆ సంగతేంటో మీకింకా తెలవదు. (మీరు రాస్తున్న వ్యాఖ్యలను బట్టి ఈ సంగతి తెలుస్తోంది.) ముందు మీరు ఆ సంగతిని తెలుసుకునే ప్రయత్నం చెయ్యగలరు. ఆ తరవాత నా బ్లాగు వ్యాఖ్యల సంగతి చూద్దురుగాని.

    రిప్లయితొలగించండి
  76. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  77. మీరేం టెన్షన్ పడకండి.
    విషయాన్ని మీకు కత్తిలా అర్థమయ్యేట్టు చేయగలవారొచ్చేదాకా నిరీక్షించండి.

    (పై కామెంట్ ఇక అనవసరం అనిపించి తొలగించాను)

    రిప్లయితొలగించండి
  78. అద్వానీ ఇపుడు చేస్తున్న రాజీ యత్నాలు ముందే ఎందుకు చేయలేదు?

    రిప్లయితొలగించండి
  79. చనిపోయిన వారి కుటుంబాలకి ఏం న్యాయం చెపుతారు?

    రిప్లయితొలగించండి
  80. ఈ చిక్కటి అర్ధరాత్రి నిద్రపట్టక ఈ టపా వ్యాఖ్యలు చదువుతోంటే చక్కిలిగింతలు పెట్టినట్టయి చాలా నవ్వొస్తోంది. ఎవరి వ్యాఖ్యలకు అని నన్నడక్కండి, ప్లీజ్.

    రిప్లయితొలగించండి
  81. "ఎన్ని లక్షల అగ్రకులం తలలు మొండాలకి మిగిలుండేవా!"

    అన్నంతమాత్రాన కత్తిగారు మాంసంకొట్టు ఓనరు అనగలమా??

    రిప్లయితొలగించండి
  82. "ఒక్కసారి మెదడుంటే ఆలోచించు"

    అన్నంతమాత్రాన కత్తిగారికీ ఎర్రగడ్డకీ సంబంధం అంటగట్టగలమా??

    రిప్లయితొలగించండి
  83. "ఓర్చుకోవడం తెలిసినంతగా
    ఓదార్పు నటించడం తెలీదు"

    అన్నంతమాత్రాన కత్తిగారిని నటశెఖర క్రిష్ణ గారితో పోల్చగలమా??

    రిప్లయితొలగించండి
  84. "ధిక్కారం
    పోరాటం"

    అన్నంతమాత్రాన కత్తిగారి సెల్ ఫోన్ రింగ్ టోన్ ఎరజెండెరజెండెన్నీయల్లో అని నిర్ధారించగలమా??

    రిప్లయితొలగించండి
  85. "మీ ఉపదేశం"

    అన్నంతమాత్రాన కత్తిగారిని స్వామీ *త్యానందుడనగలమా ??

    రిప్లయితొలగించండి
  86. @ నీహారిక
    మీరేమయినా మతం మారారా లేక మీది లౌకిక తత్వమా?

    రిప్లయితొలగించండి
  87. "మీకూమాకూ చుక్కెదురే
    చుక్కలు కనిపించడం ఖరారే"

    అన్నంతమాత్రాన కత్తిగారు ఆస్ట్రోనాట్ అవగలరా??

    రిప్లయితొలగించండి
  88. తిరు: :) :)

    నీహారిక: ఎబ్బే.. ఇంకా గురికి బారెడు ఎడంగానే వెళ్తున్నారు. ఎంచేతంటే, అసలు ముస్లిముల ప్రసక్తే ఈ టపాలో రాలేదు. మీకు ఎప్పటికి అర్థమౌతుందో తెలవడం లేదు.

    ముస్లిములను ఏదో అన్నట్టుగా భావిస్తున్నారెందుకు? మీకెందుకింత అసహనం? ముస్లిములు గొప్పవారే అని నొక్కి వక్కాణించడంలో, మీరు వారిపట్ల ఎంత అన్యాయం చేస్తున్నారో మీకు తెలవడంలేదు.. ’వారి గురించి దేశ ప్రజలు ఫలానా విధంగా అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అలా ఫలనాలాగా లేరు, వాళ్ళు చాలా గొప్పవారు’ అని చెబుతూ, నిజానికి వాళ్ళు ఫలానా అని మీరు మరొక్కమారు గుర్తు చేస్తున్నారు. మీరు ప్రతీ విషయంలోకి ఇలా ముస్లిములను తెచ్చి, వాళ్ళను అవమానించడం బాలేదు. ఎందుకండీ ఇలా ముస్లిములను ఆడిపోసుకుంటారు?

    రిప్లయితొలగించండి
  89. నీహారిక = ఆడ మార్తాండా??

    రిప్లయితొలగించండి
  90. అయ్యో చదువరి గారి మీ బ్లాగుపరిస్తితి ఇలా అయ్యిందే :(

    రిప్లయితొలగించండి
  91. "అంత శాంత మూర్తులే అయితే, మసీదుని ఎందుకు పడగొట్టారు?"

    సూటిగా, స్పష్టంగా టీవీ9 యాంకర్లా నీహారికగారడిగిన ఈ ప్రశ్నకి జవాబివ్వండీ?
    ఓహో, మరి పురాతనమైన రామాలయం ఎందుకు కూలగొట్టారంటారా? ఇదేనా మీ జవాబు?
    ఐతే కాస్కోండి:
    "
    హిందువులందరికీ మళ్ళీ చెపుతున్నాను. ఎప్పటికయినా త్యాగం చేసేదీ, చేయించేదీ ముస్లిం లు మాత్రమే. "
    (ఇది పైన అక్కయ్యగారిచ్చిన తీర్పు)

    బాగా కడిగేసానా అక్కయ్యా ?

    రిప్లయితొలగించండి
  92. మరోటి మర్చేపోయా :)

    "అద్వానీ ఇపుడు చేస్తున్న రాజీ యత్నాలు ముందే ఎందుకు చేయలేదు?"
    మరి మా మార్తాండన్నయ్య చిన్నప్పుడేస్కునే ఎర్ర చెడ్డీలు ఇప్పుడెందుకు వేసుకోవట్లేదు???
    అన్నయ్యనడిగితే నేనెప్పుడేం చేయాలో నువ్వు చెప్పేదేంట్రా పో అన్నాడు :)

    రిప్లయితొలగించండి
  93. చదువరి గారు, కాస్త శృతి మించినట్టనిపిస్తే నా కామెంట్లు డిలీట్ చేయగలరు.
    యేదో అక్కగారికి ఉడతాభక్తిగా...

    రిప్లయితొలగించండి
  94. >>ఎప్పటికయినా త్యాగం చేసేదీ, చేయించేదీ ముస్లిం లు మాత్రమే.

    అవునవును త్యాగాలు హిందువుల చేత చేయిస్తారు,... వాళ్ళ బీబీలని త్యాగం చేస్తారు,..

    ఏదమ్మ ఒక్క ఉదాహరణ చెప్పు త్యాగం చేశారు అని.

    కొన్ని వందల గుళ్ళు పడగొడితే, కొన్ని కోట్ల హిందువులని చంపితే అది త్యాగామా?

    కోర్ట్ ద్వారా న్యాయమైన వాటా పొందితే, అది ముస్లిములు చేసిన త్యాగామా? మరి ఐతే పై కోర్ట్ కి ఎందుకు వెళ్తున్నట్టో, అసలు ఈ త్యాగం ముందే చేయొచ్చుగా, కోర్ట్ లో కేస్ ఓడిపోయినప్పుడా?

    ఆడలేక ఓడిపోయి మనోళ్ళకి మ్యాచ్ త్యాగం చేశాం అని రికీ పాంటింగ్ చెప్పిన్నట్టున్నది.

    రిప్లయితొలగించండి
  95. సారీ శరత్ గారు, క్లారిటీ మిస్సైంది ఆ కామెంట్లో.
    అంటే ముస్లింలు అంత త్యాగశీలురు కదా, ఆ మాత్రం భరించలేరా అని అక్కయ్యగారి కవిహృదయం!

    రిప్లయితొలగించండి
  96. @ తిరు
    అది మీక్కాదులెండి. పడేసరికి ఆలస్యం అయ్యింది.

    రిప్లయితొలగించండి
  97. అజ్ఞాత గారూ,
    మీరు అక్కయ్యనేమైనా అనేముందోసారి మహేశ్వర్ గారి కామెంట్ చదవగలరని మనవి.

    క్లుప్తంగా...

    "ఆవిడ, ఆవిడే..! కొంచెం పరిపక్వత తక్కువ కానీ,"

    :)

    రిప్లయితొలగించండి
  98. నీహారిక గారు... మీది తెలీనతనమో, తింగరి తనమో అర్ధం కాదు... ఒక కులం బట్టి, మతం బట్టి వీరందరు మంచి వారు, వీరందరు చెడ్డవాళ్ళు, వీరు త్యాగమూర్తులు అని తీర్మానించడం అంత తింగరి తనం లేదు...
    అసలు మీరు ప్రపంచ వార్తలు చదువుతారా ?? ప్రపంచం లొ ఏ మూల టెర్రరిస్ట్ దాడులు జరిగినా అవి ఇస్లామిక్ టెర్రిస్టుల పని కాదా... అదేనా త్యాగమూర్తులు చెసే పని...అమాయకుల ప్రాణాలు తీయ్యడమా... ఈ వంకతొ మొత్తం ముస్లిం లని తిట్టెద్దామా...
    అంతకు ముందు ఉన్న ఆలయాన్ని పడగొట్టే కదా అక్కడ మసీదు కట్టింది...అదీ ముస్లిం రాజుల త్యాగమేనా ? ఎప్పుడయినా ఓరుగల్లు కొటకి వెళ్ళారా ? వెయ్యి స్తంబాల గుడి చుసారా... ఎంత పైశాచికంగా కూల గొట్టారొ గమనించారా... అదీ త్యాగమేనా ??
    నాకు ఒక్కటి మాత్రం ఖచ్చితం గా అర్ధం అవుతుంది.... మీకు ఈ పొస్ట్ అర్ధం కాలెదని... అంతె కాదు... చదువరి గారు రాసిన పొస్ట్ కన్నా మీరు రాసిన వ్యాఖ్యలే అవేసం తెప్పించేదిగా రెచ్చగొట్టేవిగా ఉన్నాయి...మీరు అసలు హిందువులేనా ఇలా ఇంతమందిని రెచ్చగొడుతున్నారు ???

    రిప్లయితొలగించండి
  99. మీరందరూ కలిసి ఇలా నా నిద్ర చెడగొట్టాలని కుట్ర పన్నడం ఏమన్నా బావుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  100. సూటిగా అంటే టి.వి. 9 ఏంకర్ లానా శరత్ గారు ;)

    రిప్లయితొలగించండి
  101. అలాగే అనుకోండి ;)

    సరే, ఇక నేను బజ్జుంటా. పొద్దటికల్లా ఓ రెండొందలో, మూడొందలో చేసెయ్యండేం. లేకపోతే నాకు ఆఫీసులో బోరు కొట్టుద్ది.

    రిప్లయితొలగించండి
  102. హే శరత్ స్లీప్ వెల్ అండ్ కం టు ఆఫీస్ విత్ ఏ ప్లేసేంట్ మూడ్ మాన్

    రిప్లయితొలగించండి
  103. చిన్ని చిన్ని బుర్రలతో గోదావరి అమ్మాయిలు కృష్ణా అబ్బాయిలూ అంటూ మీరు చూసిన చిన్ని ప్రపంచం గూర్చి గోడ మీద నిండి మాట్లాడటానికి పక్కింటి పిన్నిగార్లు ఒదినగార్లు దొరకట్లేదు కనుక బ్లాగుల్లో కెలుక్కోక ఎందుకమ్మా పెద్ద పెద్ద విషయాల మీద మాట్లాడుతారు. అందర్నీ కాచి వడపోసినట్లు సమర్దిస్తారు.
    ఇలా అన్నానని ఫెమినిస్టులు పడీపోకండి. 'నాదీ ఆడ జన్మే'. అయితే బర్కా దత్ పూనినట్లు ఈమె మాట్లాడే మాటలు, సుత్తి భరించలేక..

    రిప్లయితొలగించండి
  104. గుడి కావాలంటే వాళ్ళతో మంచిగా ఉంటే వస్తుంది కానీ రెచ్చగొడితే వస్తుందా?
    ఏవడబ్బ సొమ్ము.... న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు వస్తుంది... క్షమాపణ చెబుదాం... బారతదేశం లొ కూలగొట్టిన అలాయాల కన్నిటికీ క్షమాపణ అందుకుంటే ....

    రిప్లయితొలగించండి
  105. ఈవిడగారు ఆ నీహారిక యేన లేక ఎవరన్న క్లోనింగ్ చేస్తున్నారా

    రిప్లయితొలగించండి
  106. >>అపుడు వాళ్ళు పడగొడుతుంటే అపుడున్న హిందువులు ఏం చేసారు?

    అమెరికా వాళ్ళు ఇరాక్ మీద యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ ముస్లిములు ఏమి చేశారు?
    సోమనాధ్ ఆలయం పడగొట్టడానికి 50,000 హిందువులని చంపారు అంట, మరి అప్పుడు మీ ముస్లిం త్యాగ మూర్తులు ఏమిత్యాగం చేస్తున్నారు?

    మతం మారలేదని, ఔరంగజేబు బ్రతికుండగానే శివాజీ కొడుకు చర్మ ఒలిపించాడు, మరి అప్పుడు మీ ముస్లిం త్యాగమూర్తులు ఏమయ్యారు?

    హిందువుల మీద చేసిన అర్రాచకాలు వ్రాసిన కారణంగా, తస్లీమా నస్రీన్ చంపబోయారు మీ ముస్లిం త్యాగముర్తులే.

    మధుర, కాశీ, కొన్ని వందల గుడులు పడగొడుతున్నప్పుడు మరి ఏమి చేస్తున్నారు మీ ముస్లిం త్యాగమూర్తులు?

    త్యాగం అంటే కాస్త చెప్పగలరు, ఇలా అన్య మతస్తులని చంపడం త్యాగామా, లేక హిందూ స్త్రీలని నాశనం చేయడం త్యాగామా?

    మీ త్యాగ-వధాన్యతకి ప్రయోగాలు చక్కగా చేసుకోండి, ఈ పాకిస్తానో, ఇరానూ, ఇరక్కో వెళ్ళి, ఇక్కడ కాదా మహానుభవా, ఆ త్యాగాలు (80 కోట్ల హిందువులని చంపడం) అంటే కూసింత కష్టం, హిందువులు తిరిగి త్యాగం చేస్తారు అప్పుడు..

    రిప్లయితొలగించండి
  107. చదువరు గారు గూగుల్ అకౌంట్ ఇమేజెస్ కనిపించేలా సెట్టింగ్స్ మార్చండి

    రిప్లయితొలగించండి
  108. "ఆయన బాధంతా కాంగ్రెస్ గురించి అని నాకర్ధం అయింది." - హహ్హహ్హా...!

    ------------
    శ్రీనివాస్:
    "వాసంత సమీరంలా.." రాసే నీహారిక గారు (http://www.blogger.com/profile/11164164278288421907), ఇక్కడ వ్యాఖ్యానిస్తున్న నీహారిక గారు (http://www.blogger.com/profile/15436136312634156146) వేరువేరని తెలుస్తోంది.
    ఏమిటో అంతా మాయ!

    రిప్లయితొలగించండి
  109. @మంచు, ఈ NDTV, CNN లలో బర్క మొదలైన వాళ్ళు టాక్ షోలు పెట్టి కొంత మంది మేతావులను పిల్చి పిచ్చ పిచ్చ గా మాట్లాడు తుంటారు. అవి మాత్రమే చూసి వాళ్ళద్వారానే ప్రపంచకాన్ని తెలుసుకొనే చాలా మంది ఆంగ్లం తెలిసిన వారు ఇలాగే మేతావుల్లా మారి పోతున్నారు. పెద్దగా చెప్పి ప్రయోజనం ఉండదు. వదిలేయండీ.

    రిప్లయితొలగించండి
  110. >>ఆయన బాధంతా కాంగ్రెస్ గురించి అని నాకర్ధం అయింది.

    ముస్లిములను త్యాగమూర్తులుగా కీర్తించిన మీకు తప్పనిసరిగా ఎర్రగడ్డలో ఐనా మంచి వైధ్యం దొరకాలని కోరుకుంటు.. ఆ ప్రభువు మీ ఆత్మ,..తు,తు, సారి, సారి, మీ త్యాగ శాంతి జరిపించాలని..కోరుకుంటున్నాను..

    రిప్లయితొలగించండి
  111. శ్రీనివాస్:
    "వాసంత సమీరంలా.." రాసే నీహారిక గారు

    -------

    రెండూ వారివే..

    రిప్లయితొలగించండి
  112. శ్రీనివాస్: "గూగుల్ అకౌంట్ ఇమేజెస్ కనిపించేలా సెట్టింగ్స్ మార్చండి" - "Show profile images on comments?" దీనికి ’yes’ అనే ఉందండి! ఎందుకు కనబడ్డంలేదో మరి.

    రిప్లయితొలగించండి
  113. శ్రీనివాస్ గారు , చదువరి గారు ఆ నీహారిక గారు , ఈ నీహారిక గారు ఒకరే అనిపిస్తుంది .

    రిప్లయితొలగించండి
  114. >>ఇతరుల నుంచి నీవేమి ఆశిస్తావో,దానినే ఇతరులకి చేయడం మానవధర్మమని బలంగా నమ్ముతాను కాబట్టి.

    మంచిది, మీరు వెళ్ళి మీ అనన్య సామాన్య త్యాగమూర్తి శ్రీ శ్రీ శ్రీ ఒసామా బిన్ లాడెన్ తో ప్రపంచం శాంతి స్థాపన గురించి చర్చించుకోండి...

    రిప్లయితొలగించండి
  115. అమ్మా, ఈ మాటలే మనకు రెండు వేల సంవత్సరాల దాస్యాన్ని, ఇంకా కొనసాగుతున్న భావ దాస్యాన్ని ఇచ్చాయి. ఇవి హిందూ మాటలు కాదు బౌద్దం తెచ్చిన చవటతనం. అశోకుడే బౌద్దం తీసుకోకుండా రాజ ధర్మం పాటిస్తే ఈ దేశ చరిత్ర మరోలా ఉండేది.
    దుష్ట శిక్షణ చేయంది శిష్టరక్షణ సాద్యం కాదని ప్రతి పురాణకధ చెబుతున్నాయి.
    పండే చెట్టుకే రాళ్ళని ఈ రత్న గర్బ పై, మన మాతృమూర్తి పై దాడి కొత్త కాదు. ఈ నేలకు కావల్సింది వీర రుద్రమలు, శివాజీని చేసిన జిజియా బాయిలు కానీ నీలాంటి అమాయక స్త్రీలు కాదు

    రిప్లయితొలగించండి
  116. "ఇతరుల నుంచి నీవేమి ఆశిస్తావో,దానినే ఇతరులకి చేయడం మానవధర్మమని బలంగా నమ్ముతాను కాబట్టి."
    వావ్! ఐతే మీరాశించేది ఇప్పుడు మీరు మాకిచ్చిందేనన్నమాట. మీకూ అదేకదా తిరిగిచ్చాం? ఇక గోలేంటి?

    "ఒక నిజమైన హిందువు అవతలి వ్యక్తిలో కూడా దేవుడిని చూస్తాడు."
    నిజమేనక్కయ్యా, పనికిమాలిన హిందువు హిందూత్వాన్ని తిట్టిపోస్తాడు.
    మన్లో మాటక్కయ్యా, ఇతరమతాలలో ఈ సౌలభ్యం లేదు. తోలు తీస్తారు.

    "ఒక తిట్టు తిడితే నేనూ తిడతాను, ఒక దెబ్బ వేస్తే నేను వేస్తాను. ఇదే ఇప్పటి లోకం తీరు."
    ఈ జ్ఞానోదయం 110 కామెంట్ల తర్వాత రావడం కాస్త బాధాకరమే!

    "ఇక్కడి వ్యాఖ్యాతల వ్యాఖ్యలే ఎంత హీనంగా ఉన్నాయో"
    మెజారిటీ వ్యాఖ్యలు మీవే కదక్కయ్యా?

    ఇంక ఆఖరుగా ఒక విషయం చెప్పే వెళతాను. మీరు డాక్టర్ని మార్చి చూస్తే బెటరని :)

    రిప్లయితొలగించండి
  117. చదువరి గారూ ఇది మీ బ్లాగేనా?
    ఏమిటి ఈ విధ్వంసక వింత చర్యలు బై నీహారిక అండ్ తిరు???
    ఆయా వ్యాఖ్యలను స్పాం గా పెట్టండి సరిపోతుంది

    రిప్లయితొలగించండి
  118. ఇంక ఆఖరుగా ఒక విషయం చెప్పే వెళతాను. మీరు డాక్టర్ని మార్చి చూస్తే బెటరని :)

    kevvvvvvvvvvvvv

    రిప్లయితొలగించండి
  119. రహ్మానుద్దీన్ షేక్ గారు,

    క్షమించండి నా విధ్వంసక మరియు వింత కామెంట్లకి.
    కానీ తప్పలేదు, నీహారిక గారికి జవాబివ్వాలనిపించింది.
    మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి.
    ఇబ్బందికరం ఐతే నా వ్యాఖ్యలు తీసేయమని చదువరిగార్కి ఇందాకే విన్నవించానండి.

    రిప్లయితొలగించండి
  120. ఇంక ఆఖరుగా ఒక విషయం చెప్పే వెళతాను. మీరు డాక్టర్ని మార్చి చూస్తే బెటరని :)

    :):):):):)

    రిప్లయితొలగించండి
  121. నీహారిక గారి వాదన వింటుంటే నాకు కోపం రావట్లేదు బాధ, జాలీ వస్తున్నాయి. లెఫ్టిస్ట్ చరిత్రలు చదివిన హిందువులు ఎలా ఆలోచిస్తారో అలాగే ఉంది ఆవిడ ఆలోచనా విధానం. అందుకు తప్పు పట్టవలసింది ఏమీ లేదు మనం ఈ స్థితికి వచ్చామే అని బాధపడటం తప్ప. చరిత్రలో హిందువుల మీద, వాళ్ళ ఆడవాళ్ళ మీద, వాళ్ళ గుళ్ళ మీద, వాళ్ళ నమ్మకాల మీద జరిగిన వేలాది దాడులకు శిలాశాసనాల్లాంటి సాక్ష్యాలు ఇంకా ఉండగా అసలలాంటిది ఏమీ జరగలేదని, ఇస్లామిక్ పాలకులు పరమ దయాళువులని, మత సామరస్యానికి చిహ్నాలని, హిందువులే ఈ దేశంలో అన్ని సమస్యలకు కారణమని, అసలు వాళ్ళదీ దేశమే కాదని ఇలా ఎవడి నోటికొచ్చింది వాడు కూసి దాన్ని చరిత్రని చెపితే దాన్ని ఈ పనికిమాలిన భారత ప్రభుత్వం జనాల చేత చదివిస్తోంది. అవి చదివి పెరిగిన వాళ్ళకు హిందువులు మీద జరిగినవేవి తెలీవు కనపడవు కేవలం వాళ్ళు పగలగొట్టిన మసీదు తప్ప.

    ఒకపక్క కట్టడం క్రింద నుంచి గుడి శకలాలు బయటకి తీసి చూపించినా, మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నలు. ఆఖరికి జస్టిస్ ఖాన్ గారు కూడా ఒప్పుకున్నారు క్రింద గుడి ఉండేదని. కళ్ళ ముందున్న సాక్ష్యాలు లేవని వాదించటానికి పాపం ఆయన కమ్యూనిస్ట్ కాదు కదా. మొగలుల కాలంలో వందలాది గుళ్ళు పడగొట్టి కాదూ దేశం నిండా మసీదులు కట్టింది. పడగొట్టిన వారు అదే శకలాలతో మసీదులు కట్టడం ఎందుకు హిందువుల గాయాలకు కారం రాయాలని కాకపోతే. ఇంతకముందెవరో అడిగినట్టు నాలుగు రాతి స్థంభాలు చేయించుకోలేని దరిద్రుడా బాబర్ చక్రవర్తి. సోమనాధ్ ఆలయాన్ని పంతానికి ఏడుసార్లు నేలకు కూల్చి దాని మీద మసీదు కట్టి, మూల విగ్రహాన్ని పగలగొట్టించి దాని శకలాలని డిల్లీ వీధుల్లో జనాలు తొక్కటానికి పరిపించిన వీళ్ళేనా పరమ దయాళువులు, త్యాగమూర్తులు.

    మసీదు కూలగొట్టినందుకు క్షమాపణ చెప్పాలా. ఓ భేషుగ్గా చెబుదాం. ముందు వారిని తమ మతం శాంతి మతమని బుకాయించటం మానేసి తాము గొప్పవాళ్ళుగా ఘాజీలుగా భావించే తమ పాలకుల క్రూరకృత్యాలు, ఈ దేశంలో పట్టుబట్టి కూలగొట్టిన గుళ్ళ గురించి, నరికేసిన కోట్లాది మంది మనుషుల గురించి ఒప్పుకుని క్షమాపణ చెప్పమనండి, అప్పుడు మనం క్షమాపణ ఏం ఖర్మ సాగిలపడదాం.

    రిప్లయితొలగించండి
  122. చదువరై గారు,
    మీ టెంప్లేట్ లో వ్యాఖ్యాతల ప్రొఫైల్ ఇమేజ్ లు చూపించే ఫీచరు లేనట్లుంది. నా బ్లాగులో కూడా ఇలానే ఉంటే కోడ్ మార్చి ఎనేబుల్ చేసాను. ఒక సారి ఇక్కడ చెప్పిన విధంగా HTML మార్చి చూడండి.

    http://www.bloggerplugins.org/2009/09/show-avatars-on-blogger-comments.html
    http://www.bloggerbuster.com/2009/09/profile-avatars-for-blogger-comments.html

    కాకపోతే సమస్యేమిటంటె మీ టెంప్లేట్ లోని మీ కామెంట్ సెక్షను id వేరుగా ఉండొచ్చు. కాబట్టి మీరు కొంచెం ఓపిగ్గా వెతికి మార్చవలసి ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  123. నీహారిక 29కామెంట్లలో సూటిగా తెగేసి చెప్పారు. :D

    రిప్లయితొలగించండి
  124. నీహారికకు రెండు బ్లాగులున్నాయి బాబులూ! ఈ వాసంత సమీరంలా బ్లాగు ఇంతకు ముందు నీహారిక అనే పేరుతోనే ఉండేది. ఇప్పుడు ఇష్టైలు మారింది.

    రిప్లయితొలగించండి
  125. Mr Katti, from when Dalits become a minority in the country? You say u r 75%. By the way, are dalits are part of hindus or not? comeon, dont juggle the statements at wish. If u want to talk about minority all the so called 'upper castes' are minority in number in this country.
    by the way, u should feel ashamed of using the word 'upper castes'. It is Other Castes.

    రిప్లయితొలగించండి
  126. నిర్మోహి అఖాడా ఆనే ఆయనకు రామజన్మభూమి స్థలంలో మూడో వంతు వాటా ఇచ్చింది లక్నో బెంచి. అది తన ప్రైవేటు ఆస్తి అని ఆయన గట్టి సాక్ష్యాధారాలతో సహా వ్యాజ్యం వేశాడు. ఆయన హిందువు కావడం కాకతాళీయం. కాబట్టి హిందూసంస్థలకు దక్కింది మూడోవంతు స్థలం మాత్రమే. అంటే ముస్లిములకు ఎంత దక్కిందో హిందువులకూ అంతే దక్కింది. అయితే హిందువులకు ఇస్లామిక దేశాల్లో నైతే అంగుళం స్థలం కూడా దక్కనిచ్చేవారు కారన్నది గమనంలో ఉంచుకుంటే లౌకికరాజ్యమైన ఈ హిందూ-మెజారిటీ ఇండియా మతపరమైన మైనారిటీల పట్ల ఎంత ఉదారంగా వ్యవహరిస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఉపకారం చేసినవాణ్ణే దూషించడం లోకనైజం. మన దేశంలోని మతమైనారిటీలు చేస్తున్నది అదే.

    రిప్లయితొలగించండి
  127. హిందువులకి మత సహనమా? ముస్లింలు ఒక హత్య చేస్తే మేము రెండు హత్యలు చేస్తామనేవాళ్లు ముస్లింలే ఉగ్రవాదానికి సృష్టికర్తలు అంటున్నారు.

    రిప్లయితొలగించండి
  128. తాడేపల్లి గారు,
    నిర్మోహి అఖాడా ఒక వ్యక్తి కాదు. అఖాడా అంటే మల్ల యుధ్ధం, కుస్తీ గట్రా చేసే రింగు లాంటిది.హనుమ భక్తులు ఇలాంటి అఖాడాలని నిర్వహించి కుస్తీ, మల్ల యుద్ధాలని ప్రోత్సహిస్తారు. అఖిల భారత అఖాడా సంస్థలాంటిది ఒకటి నిర్మోహి అఖాడాని గుర్తించింది. వారు వివాదస్పద భూమి దగ్గర ప్రాక్టీసు చేసుకునే వారు. అసలు 1949లో కేసు వేసిన లిటిగేంట్లలో వాళ్లు ఒకరు.
    హిందు మహా సభ తో కలిసి మందిర నిర్మాణం కోసం కలిసి ముందుకు వెళతామని ఈ రోజు వారు ప్రకటించారు.

    రిప్లయితొలగించండి
  129. ఇప్పుడో చిన్న అప్రస్తుత ప్రసంగం: "నాకు తెలీకడుగుతానూ" అనడానికి ఇంగ్లీషులో ఏమంటారు?

    రిప్లయితొలగించండి
  130. Well, I ask you ! అంటారు. కానీ ఇది తెలుగులో మాదిరి వాక్యం మొదట్లో కాకుండా చివఱ వస్తుంది.

    ఉదా :- What could be their intention behind firing associates in batches ? Well, I ask you !

    రిప్లయితొలగించండి
  131. మేధావులను బెదిరిస్తారేంటి సార్? వాళ్ళు ఇంకా నిప్పులు కక్కే కవిత్వం రాయగలరు, వీలుంటే తమ మేధావి తనాన్ని అర్థం చేసుకోలేని వాళ్లని అవే నిప్పుల్లో కూడా తోయగలరు.

    ఐనా హిందువులకు తీర్పు అనుకూలంగా వస్తే, ఆ తీర్పు ఎలా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో ఆలోచించడమేంటి అసయ్యంగా? హిందువులకు అనుకూలంగా వస్తే అది తప్పకుండా దుర్మార్గమైన తీర్పే అయి ఉంటుంది. ఆ మాత్రం తెలీకపోతే మీరు ఎప్పటికీ మేధావి కాలేరు.

    లాల్ సలాం!

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు