20, జూన్ 2010, ఆదివారం

బియ్యెస్సెన్నెల్ బ్రాడ్ బ్యాండు వాడుకరులారా..

..అనురాగ దేవతలారా!

ఇలా ధర్మవరపు సుబ్రహ్మణ్యం శైలిలో పిలవడానికి కారణమేంటంటే.. కుసింత జాగర్తగా ఈ టపా చదివి ఇందులో చెప్పిన సూచన పాటించాలని. 

నేను బియ్యెస్సెన్నెల్లు వారి బ్రాడ్ బ్యాండు వాడుతున్నాను. పని చేసినన్నాళ్ళూ అది చక్కగా పని చేస్తుంది. ఏదైనా సమస్య వస్తే మాత్రం నానా తిప్పలూ పడాలి దాన్ని బాగు చేయించుకొనేందుకు. అదృష్టవశాత్తూ నాకు ఈమధ్య కాలంలో సమస్యలేమీ రాలేదు. అంచేత నేను బియ్యెస్సెన్నెల్లు వారిని పిలవనూ లేదు.

ఈవిధంగా హాయిగా జీవిస్తూండగా రాత్రి కంప్యూటరు మొదలెట్టగానే, http://www.motive.bsnl.co.in/ అనే సైటు తెరుచుకుంది. మీ మోడెమును చక్కగా పనిచేయించేందుకు, సమస్య వచ్చినపుడు బియ్యెస్సెన్నెల్లు వాడిచేత రిమోటుగా రిపేరు చేయించుకొనేందుకు, ఇదిగో ఈ లింకు నొక్కి, సాఫ్టువేరును దించుకోండి అని ఉంది. చక్కగా బియ్యెస్సెన్నెల్లు వాడి సైటులాగానే ఉందా పేజీ. ఓహో మన బియ్యెస్సెన్నెల్లేగదా అని ఆత్రంగా వాడిచ్చిన  డౌనులోడు లింకును నొక్కి motiveactivation.zip అనే, చిన్నాచితకా కాదు, 138 ఎంబీల ఫైలును దించుకున్నాను. అయితే, వెంటనే నా యాంటీవైరసు తెరమీదకు దూసుకొచ్చింది.. ఇందులో Click2kUns.exe అనే వైరసుంది అంటూ! వెంటనే ఆ ఇన్‍స్టాలును ఆపుజేసేసాను. జాలంలో Click2kUns.exe కోసం వెతికితే నాలాంటి ఆత్రగాళ్ళు ఇంకా ఉన్నారని తెలిసింది. 

అంచేత మీరు గ్రహించాల్సింది ఏంటంటే.. మీరూ నాలాగా ఆత్రపడకండి, ఆ ఫైలును డౌనులోడు చేసుకోకండి. అది బియ్యెస్సెన్నెల్లు పేరుతో ఎవడో వైరసుగాడు పంపిస్తున్నట్టున్నాడు. దీని గురించి మరింతగా తెలిసినవాళ్ళుంటే చెప్పగలరు. మరిన్ని వివరాలు తెలిసేదాకా  దాని జోలికి వెళ్ళకపోతే మంచిది.  

26 కామెంట్‌లు:

  1. అవును వారంరోజుల నుండి నాకు తరచూ ఈ బొమ్మ ప్రత్యక్షమవుతుంది. దించుకోండి అని. ఎందుకులే ఇప్పుడు నెట్ బానే పనిచేస్తుందిగా అని పట్టించుకోలేదు. ఇంత కథుందా??

    రిప్లయితొలగించండి
  2. అవును నాకు కూడా గత పదిరోజులనుంచి నాకు కూడా Bsnl Karnataka అని వస్తోంది

    రిప్లయితొలగించండి
  3. Meelanti vaare boltha padithe..

    Maa boti samanyula paristhiti..

    Entandi?..

    రిప్లయితొలగించండి
  4. నాది లినక్స్ సిస్టమ్. exe ఫైల్స్ ఓపెన్ అవ్వవు. అందుకే నాకు ఎలాంటి ప్రోబ్లం రాలేదు.

    రిప్లయితొలగించండి
  5. Thanks for this info.

    నాక్కూడా వస్తుంది. కానీ ఇప్పుడు బాగానే పని చేస్తుంది కదా అని నొక్కలేదు.

    రిప్లయితొలగించండి
  6. I'm using Ubuntu Linux, so safe from Windo-ish viruses.

    Unless you have a very strong reason to use Windows, abandon it and move to any Linux flavors.

    రిప్లయితొలగించండి
  7. నాక్కూడా వచ్చింది, దాన్ని దించుకుని నా కంప్యూటరలో ఇన్‌స్టాలు చేసుకున్నా. వైరస్ ఏదీ ఉన్నట్టు నా యాంటీ వైరస్ చెప్పలేదు. ఇది వాడి కస్టమర్ సపోర్టు సాఫ్టువేరు. మన కనెక్షన్ సరిగా పనిచేయకపోతే సరిచేసే ఉపకరణాలు కొన్ని ఉన్నాయి దాంట్లో.

    రిప్లయితొలగించండి
  8. Sir, MS-WORD-perutho...meeru Lottery..lo

    gelicharany mails vasthunnai..

    Delete cheyyaleka chala ibbandi padtunnanu..

    Is there any remedy?

    రిప్లయితొలగించండి
  9. Thank you. naaku gata nela rojulugaa startinglo redirect avutu open avutondi. endukule ani download cheyaledu. mee informationto mari dani joliki vellanu. once again thank you sir.

    రిప్లయితొలగించండి
  10. ధన్యవాదాలు. నాకు కూడా దాదాపు నెల రోజుల నుండి Bsnl Karnataka అని వస్తోంది. డౌన్లోడ్ చేసాగానీ ఇది సరైనదైతే కర్ణాటక ఎందుకు A.P BSNL సైటులోనే ఇవ్వచ్చుగా ఈ సాఫ్ట్‌వేర్ అనే అనుమానంతో ఇన్‌స్టాల్ చేయలేదు. ఇన్‌స్టాల్ చేసేటప్పుడు వైరస్ అని తెలుస్తుందేమో.

    రిప్లయితొలగించండి
  11. Sir,

    Meeru mistake chesi manchi pani chesharu..

    Mee snehitulantha jagratha padutunnaru.

    Best of luck..to Chaduvary family..

    రిప్లయితొలగించండి
  12. Ok, I too have seen this message but before that I have changed by modem from the default BSNL one to a different one. I thought it is due the change in mode and as usual I have derived my own conspiracy theories and didn't try that ;) lucky me :)

    రిప్లయితొలగించండి
  13. @CHADUVARY:-

    Ramulu intlo rojoo tannukuntaru..

    Mee drushtilo Ramulu sukhanga nidrapothunnada?

    రిప్లయితొలగించండి
  14. వ్యాఖ్యాతలందరికీ నెనరులు.

    వెంకట రమణ: అనుమానం వచ్చాక మళ్ళీ ఆ సైటుకు వెళ్ళి చూసాను. కాంటాక్టు చెయ్యండంటూ పేజీకి అడుగున ఒక ఈమెయిలైడీ ఇచ్చాడు. అది జీమెయిలు ఐడీ, bsnl ఐడి కాదు. అప్పుడు నా అనుమానం మరింత బలపడింది. ఏదేమైనా మీరన్నట్టు అది మంచిదే కావచ్చేమో! కానీ నా యాంటీవైరసు ఒప్పుకోలేదెంచేతో!?

    ramnarsimha: ఆ లాటరీ మెయిళ్ళను చెయ్యగలిగేదేమీ లేదనుకుంటాను. స్పాములోకి తొయ్యడమే!

    "sukhanga nidrapothunnada?" - :) తన్నుకున్నా, మళ్ళీ తల్లో పేలు చూసుకుంటూ సుఖంగా ఉంటారు గదా! అందుకని అలా అన్నాను.

    రిప్లయితొలగించండి
  15. నేను ఈ సాఫ్ట్ వేర్ ని ఇన్స్టాల్ చేసుకున్నాను. బహుశా అందువల్లనేమో నా యాహూ ఐ డీ ఓపెన్ కావడం లేదు. ట్విత్తర్ ఫేస్ బుక్ లలో ఏదీ అప్లోడ్ కావడం లేదు. బి ఎస్ ఎన్
    ఎల్ వాళ్ళు వచ్చి చూసారు. వాళ్ళ లాప్ తప మీద అన్ని పనిచేస్తున్నాయి. మీ కంప్యూటర్ లోపం అతని వెళ్లి పోయారు. ఫార్మేట్ చేసినా సమస్య పోలేదు. హార్డ్ వేర్ ప్రాబ్లామేమో అంటారు. జిమెయిల్ మొదలైనవి బాగానే పనిచేస్తున్నాయి. నా వద్ద మంచి ఆంటి వైరస్ లేదు. ఎవరైనా నా సమస్యకు పరిష్కారం చెప్పగలరా? ప్లీజ్

    రిప్లయితొలగించండి
  16. రవి , మీ సమస్యని ఇక్కడ పోస్టు చేయండి
    http://mahigrafix.com/forums/

    రిప్లయితొలగించండి
  17. It's better be reported to BSNL immediately. This issue is coming across all places in Andhra.

    రిప్లయితొలగించండి
  18. ravi gaaru toatal hard disk format chesaara leka.only c drive(os vunna) chesaara. warms meeru backup vunchukunna softwareslo store ayyi vuntayi so.so meeru vaatini run chesinapudu marala .....same prob vastundi.meeru mottam hard disk format cheste prob solve kaavachhu.

    రిప్లయితొలగించండి
  19. Ravi: వినయ్ గారు చెప్పినట్టు డిస్కును పూర్తిగా తుడిచి, శుభ్రం చెయ్యాలనుకుంటానండి.

    రిప్లయితొలగించండి
  20. రంజని , సుధాకర్ , వినయ్ చక్రవర్తి గోగినేని , చదువరి గార్లకు
    ధన్యవాదాలు .
    నిజమే . నేను C Drive ని ఫార్మేట్ చేయలేదు .
    ఈసారి మీరు సూచించినట్టు మొత్తం అన్ని drives ఫార్మేట్ చేసి చూస్తాను .

    రిప్లయితొలగించండి
  21. బియస్ఎన్ఎల్ చీకుతుంది। సక్స్ అని।
    నాలాంటి పల్లెటూరోళ్ళు గతిలేక దానితో సరిపెట్టుకోవాల్సివస్తుంది।
    మఱీ ఇలా రీడైరెక్టు పేజీలో వైరస్ వుండడం చాలా పెద్ద విషయం।
    మీరు వాడి మీద కేసు వేసి కోట్లు కోట్లు గడించవచ్చు। అలా అందరం వేస్తే!!!

    నేను దానిని దించుకోలేదు గాని, అది వైరసు కాదేమే మీ ఆంటీవేరసు కాస్త ఛాదస్తం ఎక్కువేమో అని నాకు అనిపిస్తుంది।

    కానీ బిఎస్ఎన్ఎల్ వాడు నాకు పెట్టిన క్షోభ తలచుకుంటుంటే, అది వైరసు అయినా ఆశ్చర్యం లేదనిపిస్తుంది।

    రిప్లయితొలగించండి
  22. రాకేశ్వర రావు: బియ్యెస్సెన్నెల్లు పని చేసినన్నాళ్ళూ సుబ్బరంగా చేస్తుంది, స్పీడూ బాగుంటుంది (హై.లో). నే జూసిన మూణ్ణాలుగు సేవల కంటే అది చాలా నయం. కానీ, ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం మీరన్నట్టు క్షోభ పెడతాడు.

    రిప్లయితొలగించండి
  23. హమ్మయ్య చదువరి గారు,
    ఒక ప్రమాదం అంచునుంచి లాక్కొచ్చారన్న మాటే!ఉన్న మాటే. అసలే నా ఇ-జ్ఞానం అంతంత మాత్రం కదా.వారి టపా రాగానే బుద్ధిగా బియస్సన్ వాళ్ళ మాటిని ఆ అత్యవసర సాఫ్ట్ వేర్ ఎదో దిగుమతి చేసుకోక పోతే ఎలా అని అనుకుంటూ ఉండగా ..మీరు చటుక్కున ఆపారు. అసలే కొతులు కరకరలాడించిన వైర్లను బియస్సన్ వాళ్ళ చుట్టూ తిరిగి కొత్తగా పెట్టించుకొన్నానా.. మరో ఉపద్రవం ఆవరణ దాకా వెళ్ల బోయనన్నమాట!తప్పించుకొన్నట్లేనా? ఏమో !
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  24. when i open firefox, motive.bsnl.co.in is opening instead of my home page.

    రిప్లయితొలగించండి
  25. ^^ @ అజ్ఞాత
    do not allow firefox to redirect to that site !
    when firefox asks for permission to re-direct ,
    just put cursor to end of address bar in browser
    and press enter key

    if problem persists then look at :
    http://vinuthomas.com/Forums/viewtopic/t=10909.html

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు