కేంద్ర మంత్రి శరద్ పవారుకు పనెక్కువైపోయిందంట, కాస్త రిలీఫు కావాలంట. అవును మరి, బీసీసీఐ, ఐసీసీల్లో పనిచెయ్యడం చేత ఇక్కడ మంత్రిగా పని చెయ్యడానికి టైము దొరకడం లేదు, తీరికా దొరకడం లేదు పాపం. అందుగ్గాను, కేంద్రమంత్రిగా పని తగ్గించాలంట. మంత్రి పదవిని ఈడి బాబు ఈడికి వారసత్వంగా ఇచ్చినట్టు, పన్నులేసుకుని ఈణ్ణి పోషించండని మన నెత్తిన కూచ్చోబెట్టినట్టూ, ఈ పనీ పాటా చెయ్యని సన్నాసికి కంచిగరుడసేవ చేస్తూ పని చేసేందుకు ఇంకోణ్ణి పెట్టుకోవాలంట. ఈడేమో క్రికెట్టు సంఘాల్లో సమావేశాల్లో తలమునకలుగా ఉంటాడు.
పని భారం తగ్గించాలంట సారుకు.. పని అంత భారంగా ఉన్నవాడు, బీసీసీఐలోను, ఐసీసీలో పని ఎందుకు నెత్తిన పెట్టుకున్నట్టు? అది మానెయ్యొచ్చుగా. లేదా ఆ పని అంత ముద్దుగా ఉంటే ఇక్కడ మంత్రి పదవికి రాజీనామా చేసి పారేసి అవతలికి పోవచ్చు. తేరగా ఇక్కడ పదవీ భోగాలు అనుభవిద్దామని కాకపోతే, పదవిని పట్టుకు ఏలాడటం ఎందుకు? పనులనుండి ఉపశమనం కావాలిగానీ, డబ్బులూ, భోగాలూ మాత్రం వదులుకోడంట.
కొంతమంది ముష్టెదవలుంటారండీ, మన చూరు పట్టుకు వేలాడుతూనే ఉంటారు, పొమ్మన్నా పోరు! మన ఇంటి వాసాలు లెక్కెడుతూనే ఉంటారు. అలాటెదవల్ని ఎన్నుకుంటున్నందుకు మనల్ని మనం చెప్పెట్టుక్కొట్టుకోవాలి.
ఏమయ్యా ప్రధానమంత్రీ!
మేం చెప్పెట్టుక్కొట్టుకుంటాం సరే, నువ్వేం చేస్తావ్?
అసలు కేంద్రమంత్రి పదవంటే అదేమైనా పార్ట్‍టైము ఉద్యోగమా? ఒక పక్క ఈ పని చేస్తూ అసలు దీనికేమీ సంబంధం లేని మరో పని చెయ్యడమేంటి? ఆపైన, మంత్రి పని చేసేందుకు తీరిక లేకుండా ఉంది, ఇంకో మంత్రిని వేసి నా భారాన్ని తగ్గించండి అని అడగడమేంటి? సిగ్గుందా అసలా అడిగినాడికి? ఆణ్ణి ఇంకా మంత్రిగా ఉంచుకున్న నిన్నేమనుకోవాలసలు? ఆడికి నీతి లేదు సరే, నీ నీతేమయింది? నీకేదో నీతీ నిజాయితీ ఉన్నాయంటారే.. ఉన్నాయా, లేక ఉండేవా?
మంత్రిపదవికి సంబంధించిన మరో పనేదైనా అయితే ఆలోచించాల్సిన పనిలేదు. ప్రభుత్వానికి అస లేమాత్రం సంబంధం లేని క్రికెట్లో పనేంటి? జనం ఆణ్ణి ఎన్నుకున్నదెందుకు? మంత్రివర్గంలో ఎందుకు చేర్చుకున్నట్టు? మంత్రిగా భోగాలననుభవిస్తూ, జీతం తీసుకుంటూ, పని మాత్రం క్రికెట్లో చేస్తాడా? మాడబ్బులు తింటూ, ఎవుడిదగ్గరో పని చేస్తాడా? నీ దగ్గర పనిచేసే బంట్రోతు ఇంకోడి దగ్గర ఉద్యోగం చేస్తే నియమ నిబంధనల పేరు చెప్పి తీసేస్తావు, మంత్రి కాడికొచ్చేసరికి ఏమయింది? దర్జాగా క్రికెట్టు సంఘాల్లో చేరిపోయాడు, అదేదో మామూలే నన్నట్టు.
సిగ్గూ శరాలేమైనా ఉంటే పదవుల నుంచి తప్పుకోండి. అవి లేకపోతే ఇట్టాంటి వార్తలు బైటికి పొక్కకుండానైనా జాగర్త పడేడవండి. మీరెంత మురికి సన్నాసులో మాకు తెలవకుండానైనా ఉంటది. కనీసం, సిగ్గు నటించండి. మీ కోసం కాకపోయినా, ప్రజలు చూస్తున్నారనైనా కాస్త సిగ్గు నటించండయా!
బాగా రాశారు. మనకు ఈ నాయకుల నుంచి ఉపశమనం కావాలి, నిజమే.
రిప్లయితొలగించండితెలుగు బ్లాగుల గురించి ఇంగ్లీషులో రాస్తున్నాం, చూశారా? telugublogworld.blogspot.com
లెస్స.. లెస్స..
రిప్లయితొలగించండిమీరు మరీనూ !
రిప్లయితొలగించండిరాజకీయ నాయకులిప్పుడు నటించటం మాని జీవిస్తున్నారు . ఎప్పుడో చిన్నప్పుడు మరచిపోయిన సిగ్గూశరాలు ఇప్పుడుతెచ్చుకోమంటే ఎక్డనుంచి తెస్తారు . వాల్లు మాత్రం.
ఇంతకీ మనలననుకోవాలి అవి మరచిపోయి వీల్లను నెత్తికెక్కించుకుంటూఉన్నందుకు
దరిద్రులు, సిగ్గూ శరమూ ఉండి చస్తే కదా వీళ్ళకు.
రిప్లయితొలగించండిగట్టిగా అడిగే పార్టీ లేక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి.
రిప్లయితొలగించండిగట్టిగా అడిగే పార్టీ లేక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి.
రిప్లయితొలగించండిమీరేక్కడో పాత కాలం లో ఉన్నారు సార్ వీళ్ళు మురికి సన్నాసులు ఎట్లా అవుతారు ? ఇక సిగ్గు శరమా ఆ మాటలకి అర్ధం కూడా తెలుసా వీళ్ళకి , అవి వాళ్ళ డిక్షనరీ లోనే ఉండవు .
రిప్లయితొలగించండిchaduvari garu
రిప్లయితొలగించండిmeeru Eantha CBN gurunchi cheeppina CBN eppatike Power lo ke Radu
"అలాటెదవల్ని ఎన్నుకుంటున్నందుకు మనల్ని మనం చెప్పెట్టుక్కొట్టుకోవాలి"
రిప్లయితొలగించండిముందు ఆ పని చేయండి, తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి.
"గట్టిగా అడిగే పార్టీ లేక వీళ్ళ ఆటలు సాగుతున్నాయి."
రిప్లయితొలగించండిఇప్పటికయినా తెలిసొచ్చిందా? మరి ఇపుడయినా మేల్కోండి, నిద్రపోకండి.
125 సంవత్సరాలయింది. ఇప్పటి వరకు సరైన ప్రతిపక్షాన్ని ఏర్పాటుచేయలేక పోయారు.ఇంకా కబుర్లు చెపుతారు.అవినీతి అని గోల పెడతారు. ఓటేయడానికి తీరిక ఉండదు.
రిప్లయితొలగించండిఅజ్ఞాత: "meeru Eantha CBN gurunchi cheeppina CBN eppatike Power lo ke Radu" అలాగంటారా..? మంచిదే కదండీ!
రిప్లయితొలగించండి@చదువరి గారు,
రిప్లయితొలగించండిఇదే విషయం మీద ఇంతకుముందొక టపా రాశాను. వీలైతే చూడండి.
http://weekend-politician.blogspot.com/2010/07/blog-post.html
నేను చెపుతున్నాను, కాంగ్రెస్ మూడో సారి కూడా హాట్రిక్ కొడుతుంది,మీరందరూ కూడా కాంగ్రెస్ కే ఓటేస్తారు.
రిప్లయితొలగించండిWeekend Politician: చూసానండి. "..think about it and talk about it" - ఔనండి.
రిప్లయితొలగించండి2G Spectrum Scam: What To Read And Listen To, And Where
రిప్లయితొలగించండిhttp://www.medianama.com/2010/11/223-2g-spectrum-scam-what-to-read-where/
Yesterday, Open magazine and Outlook published audio files and transcripts of conversations that Niira Radia, who runs several PR and consultancy companies, allegedly had with Tata Group Chairman Ratan Tata, Telecom Minister A. Raja, and the DMK’s Kanimozhi, as well as with senior journalists Barkha Dutt (from NDTV) and Vir Sanghvi (Editorial Director, HT Media), around the appointment of the Telecom Minstry in India. This follows previous revelations published by Mail Today and The Pioneer, and broadcast by HeadlinesToday. For reference purposes, we’re putting together is a list of information related (and allegedly related) to the appointment, and the 2G Spectrum scam that preceded the appointment, that has been published online; if true, it is shocking commentary on how the Telecom sector is manipulative, and policies manipulated. We’re updating this list, so feel free to suggest more links in the comments below.
Introduction
Some of these are alleged to be recordings of conversations that Niira Radia had with several people, in the aftermath of the Parliamentary elections that took place last year, discussing alleged issues with the appointment of ministers from the DMK, a regional political party from Tamil Nadu, as well as appointments to India’s Cabinet of Ministers. The context of these discussions is appointment of A. Raja as Telecom Minister, who allocated 2G mobile licenses in India, on a controversial first-come-first-served basis, by choosing an arbitrary cut-off date for allocation, and it was expected at the time that he would not head the ministry again.
Documents
- CAG Report on 2G Spectrum Scam – Tabled in Parliament. Download (pdf)
- Allegedly, scans of documents that were submitted by India’s Income Tax Department to the Central Bureau of Investigation (CBI). View Here
Audio & Transcripts of Conversations allegedly between
4. Vir Sanghvi and Niira Radia
- By Open Magazine on November 18th 2010: Read and listen here
- By Outlook on November 18th 2010: Read and listen here
5. Barkha Dutt and Niira Radia
- By Open Magazine on November 18th 2010: Read and listen here
- By Outlook on November 18th 2010: Listen here.