ఆ స్కెచ్చిని సిగ్గులేకుండా అనుకరించే ఇంకో స్కెచ్చి ఇది. అయితే తాము ఎవరి గురించి రాస్తున్నారో బాపురమణలు హెడ్డింగు పెట్టి మరీ చెప్పేసారు. నేను మాత్రం ఎవరి గురించి రాస్తున్నానో చెప్పడం లేదు. అది అత్యంత రహస్యం. సుమన్ సినిమాలో విలనెవడో హీరోయెవడో కనుక్కోవచ్చేమోగానీ, ఈ స్కెచ్చెవరిదో కనుక్కోడం మాత్రం దేవుడికే కాదు, సాక్షాత్తూ ఆ సుమనుకైనా సాధ్యం కాదని నా నమ్మకం. ఇక చదవండి..
- మంత్రివర్గ విస్తరణ మేడమ్మ ఇష్టమంటూ బాధ్యతను అటేపు తోసేసేటపుడు త్రోశయ్య
- ’జగనుడి విమర్శలపై ఒక్కరూ నోరు తెరవరే? నాకేనా, మీకు లేదా బాధ్యత?’ అని మంత్రులను అనేటపుడు ఆక్రోశయ్య
- ’నేనేమైనా ఖాళీగా ఉన్నానా? మంత్రివర్గ సమావేశం నుండి ఇప్పుడే గదా బైటికి వస్తున్నాను.. రాష్ట్రంలో తుపాను వచ్చిందని, కేసీయారు నిరాహారదీక్షకు కూచ్చున్నాడనీ, కర్నూలు మునిగిపోయిందనీ.. మీటింగుల్లో ఉన్నవాడికి ఎలా తెలుస్తుందయా? అసలేమీ తెలియనిదాని గురించి వ్యాఖ్యానించమంటావేంటి? మాట్టాడేదానికి అర్థముండక్కర్లా?’ అంటూ విలేఖరిపై బక్కకోపం చూపించేటపుడు ఉక్రోశయ్య
- సంక్షేమ పథకాలకు నిధులను అడ్డంగా, నిలువుగా, ఐమూలగా కోసిపారేసేవేళ ’కట్ కరో’శయ్య, ’మరోమారు మారో’శయ్య
- ’ఏమయ్యా అరుణ్ కుమారూ, నువ్వేం పెద్దమనిషివయ్యా?’ అంటూ ఉగ్రమూర్తి ఐనపుడు ఉగ్రోశయ్య
- పరిపాలన గురించి గవినీరు దొర ఇంకో కొత్త కామెంటు విడుదల చేసినపుడు మూగ’రో’శయ్య
- మేడమ్మ మంత్రివర్గ విస్తరణను మరోసారి వాయిదా వేసినపుడు ఢిల్లీ నుంచి తిరిగొస్తూ ’ఈసురో’శయ్య
- బాబును ఎగతాళి చేస్తూ ఎడాపెడా బ్యాటింగు చేసేవేళ సిక్సరోశయ్య
- నాగం జనార్దనుడి చెయ్యి తీసేస్తానని అనుచుండ, ఆతడు రోశయుండ!
- తప్పనిసరై హెలికాప్టరు ఎక్కాల్సినవేళ ’డరో’శయ్య
- రెణ్ణెల్లకొకటి చొప్పున ఏదో ఒక సమస్య వచ్చిపడి, జగనుడికడ్డంపడి, తాను తెరపినపడి, మనసులోనే ఆనందపడి.. హుషారోశయ్య
- ఆయా సందర్భాల్లో ఆయా విధాలుగా కాక, ఇంకేయే విధాలుగా ఉన్నా.., ఆయన ’అన్’రోశయ్య, ’మరో’శయ్య
పోతే, బాపురమణలను ఇలా ఎందుకు అనుకరించావని అడిగితే.. నిజాయితీగా ఓ మాట చెప్పుకోవాలి. అనుకరిద్దామని మొదలెట్టలేదు, ఓ మూణ్ణాలుగు రాసాక, అది గుర్తొచ్చింది. నాకే గుర్తుకు రాగా లేంది, మీకు మొదటిది చదవగానే గుర్తొచ్చేస్తదని నాకు తెలుసు. అంచేత కాపీ కొట్టేసానని మీరు అనకముందే నేనే అనేసుకుంటన్నానన్నమాట.
--------------
అన్నట్టు, భారతీయ అమెరికనులు చేసిన యజ్ఞం వివరాలు చదివారా?
:)
రిప్లయితొలగించండిపాపం. అసలే కష్టాల్లో ఉన్న రోశయ్యను ఇలా ఆడేసుకున్నారేంటండి??
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండిexcellent.
Bravo!
రిప్లయితొలగించండిఈసురోశయ్య .. hilight
:-D
రిప్లయితొలగించండిఏదో పాపం పెద్దాయన ముక్కుతూ మూలుగుతూ బండి లాక్కొస్తున్నాడు మీరిలా ఆడుకోవడం భావ్యమా!! అని అడుగుతున్నాను అధ్యక్షా :-)
"సుమన్ సినిమాలో విలనెవడో హీరోయెవడో కనుక్కోవచ్చేమోగానీ" కెవ్ వ్ వ్ వ్ వ్ వ్ :-D
కెవ్వు కేక. ఓ రేంజులో ఏకారుగా. ఓ రెండు మూడు సీస పద్యాలుగా వ్రాయచ్చేమో కష్టపడితే.
రిప్లయితొలగించండిఊ..మొత్తానికి రోసయ్యో మోసయ్య అని ఫైనలైజ్ చేశారు.
:-)
రిప్లయితొలగించండిమీ టపా "అదరో"శయ్య! :-)
రిప్లయితొలగించండిఇలా బ్లాగర్లందరూ సుమన్ ను ఆడిపోసుకుంటారు కాబట్టే సుమన్ దేవుడికోసం తపస్సు చేసి బ్లాగర్ల మీదికి మార్తాండను వదిలించి పగ తీర్చుకున్నాడు..
రిప్లయితొలగించండిరజకీయాల్లో మాత్రం ఆయన ముదురోశయ్య. మీ టపా చదివి కెవ్వు కేకపెట్టరోశయ్య :))
రిప్లయితొలగించండిచదువరి గారూ...,
రిప్లయితొలగించండినమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.
తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
- హారం ప్రచారకులు.
:) :)
రిప్లయితొలగించండిఎన్ని జరిగినా అధిష్టానం పై నమ్మకం తో భరోసయ్య
రిప్లయితొలగించండిభలే! మొత్తానికి, పరిపరిపాలనలో కాంగీ'వేదం' బాగా ఒంటబట్టించుకున్న సైనికుడు 'సరోశ'య్య!
రిప్లయితొలగించండిచాలా బాగుందండీ.
రిప్లయితొలగించండి>> సుమన్ సినిమాలో విలనెవడో హీరోయెవడో కనుక్కోవచ్చేమోగానీ
రిప్లయితొలగించండిsuper.