2, అక్టోబర్ 2009, శుక్రవారం

పోటెత్తిన కృష్ణ -ప్రమాదంలో రాష్ట్రం

కృష్ణానది ఉప్పొంగుతోంది. ఊళ్ళను, నగరాలను, మండలాలను కూడా ముంచెత్తుతూ ఉరకలెత్తుతోంది. గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద వచ్చిందట.  కర్నూలు నగరం నడుంలోతు నీళ్ళలో మునిగిపోయింది.  మంత్రాలయం మునిగిపోయింది. రాఘవేంద్రస్వామి మఠం మునిగిపోయింది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అనేక ఊళ్ళు నీళ్ళలో చిక్కుకుపోయాయి. విజయవాడ ప్రమాదపు అంచున ఉంది. పులిచింతల కాఫరు డ్యాము కొట్టుకుపోయింది.  శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగరు డ్యాము పాటవ పరీక్షను, పటుత్వ పరీక్షను ఎదుర్కొంటున్నాయి.


వరద ఎంత ఉధృతంగా ఉందంటే శ్రీశైలం ఆనకట్ట భద్రతను కూడా సందేహించేంతగా! జలాశయ పూర్తి నిల్వ మట్టం 885 అడుగులు. దానిపైన మరో ఆరేడు అడుగులు పెరగవచ్చు. అది గరిష్ఠ స్థాయి అట. ఆపైన మరి కొన్ని అడుగుల వరకు పరవాలేదు, అదీ దాటితే నీళ్ళు డ్యాము పై నుండి ప్రవహిస్తాయి.  అదీ ప్రమాదం. ఈలోగా ఈ నీటి మట్టం పెరుగుతూ ఉండే క్రమంలో డ్యాముకు ఎగువన (ఫోర్‌షోర్) ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయి.  కర్నూలు కూడా ఈ ప్రాంతంలోనే ఉంది. శ్రీశైలం జలాశయంలో నీటి చేరిక పరంగా ఇప్పటివరకు ఉన్న రికార్డు 10 లక్షల క్యూసెక్కుల చిల్లర. అసలు ఆనకట్టను కట్టేప్పుడు తీసుకున్న అత్యథిక నీటిచేరిక అంచనా - 24 లక్షల క్యూసెక్కులట.  ప్రస్తుతం అది 20 లక్షల క్యూసెక్కులకంటే ఎక్కువగానే ఉంది. ఇవ్వాళ పొద్దుటి నుండి 10 లక్షలు, 12 లక్షలు, 16 లక్షలు ఇలా పెరుగుతూ ఉన్న చేరిక ఇప్పుడు మధ్యాహ్నం మూడింటికి 20 లక్షల క్యూసెక్కులకు పైగా గా ఉందని అంటున్నారు.  జలాశయం నుంచి కిందకు వదులుతున్నది 10 లక్షల క్యూసెక్కుల కంటే కాస్త తక్కువ. ఈ లెక్కన ఇప్పటికే దాదాపు నిండిపోయిన జలాశయం గరిష్ఠ స్థాయికి చేరడానికి ఎక్కువ సమయమేమీ పట్టేట్టు లేదు. జలాశయంలోకి నీటిచేరిక మరింత పెరిగితే నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలపై కూడా వత్తిడి పెరిగే అవకాశం చాలా ఉంది.  నాగార్జున సాగర్లోకి చేరుకునే నీటిని కిందకు వదిలేందుకు అక్కడి గేట్ల సామర్థ్యం చాలకపోతే పక్కనుండే మట్టికట్ట (ఎర్త్ డ్యాము)కు గండికొట్టి, నీటిని వదిలేసే అవకాశం ఉందని టీవీవాళ్ళు చెబుతున్నారు. అదే జరిగితే విజయవాడే కాదు, డ్యాముకు దిగువన ఉండే అనేక ప్రాంతాలు ప్రమాదంలో పడినట్టే. అయితే డ్యాములకు వచ్చిన ప్రమాదమేమీ లేదని కొందరు సీనియరు ఇంజనీర్లు భరోసా ఇస్తున్నారు.


కనీవినీ ఎరుగనంత వరద వచ్చిన పరిస్థితిలో  సహజంగానే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. ప్రభుత్వమూ అంతే! కానీ అలాంటి పరిస్థితిలోనే ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తూ ప్రజలకు ధైర్యం కలిగించాలి. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎలా ఉందంటే..
  • కర్నూలు నగరం మునిగిపోయే ప్రమాదం అంచున ఉంది, జాగ్రత్తలు తీసుకోవాలి అని నిన్నటినుండి ప్రజలు ఘోషిస్తే అలాటిదేం జరగదు, ఏం పరవాలేదు అని కర్నూలు కలెక్టరు మీణా అన్నాడట. నగరం మునిగిపోయి, నడుముల దాకా నీళ్ళొచ్చిన ప్రస్తుత పరిస్థితిలో అక్కడ జనాన్ని తరలించడానికి ఇప్పుడక్కడ పడవల్లేవు, నీళ్ళలో చిక్కుకున్నవారికి అన్నం లేదు, తాగను నీళ్ళు లేవు. 
  • రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరు నుంచి కర్నూలుకు హెలికాప్టర్లు పంపించిందట, అవి అక్కడ దిగాయిగానీ పనుల్లోకి దిగలేదట. ఎంచేతంటే .. -వాటికి పెట్రోల్లేదు!  హై. నుండి పెట్రోలు పంపిస్తారంట!!
-----------------------------------------------------


తాజా:
వరద బాధితులకు సహాయం అందించదలచినవారు కిందివారిని సంప్రదించవచ్చు:
హిందూ ధార్మిక సంస్థలు (మళ్ళ వాసుబాబు): 96035 49469
లోక్‌సత్తా పార్టీ (రత్నం): 93983 03029, 93910 38940

44 కామెంట్‌లు:

  1. శ్రీశైలంలో నీటిచేరిక 23 లక్షల క్యూసెక్కులకు చేరింది. డ్యాము పూర్తిగా నిండింది. ఎత్తకుండా మిగిలిన ఒకే ఒక్క గేటు -ఒకటో గేటును - ఎత్తే ప్రయత్నం చేస్తున్నారంట. దాన్ని ఎత్తితే దిగువన ఉన్న వంతెనకు ప్రమాదమనే ఉద్దేశంతో దాన్ని ఎప్పుడూ ఎత్తరంట. కానీ ఇప్పుడు ఎత్తక తప్పని పరిస్థితి వచ్చింది.

    రిప్లయితొలగించండి
  2. శ్రీశైలం డ్యాము నిండిపోయి, డ్యాము పైనుండి నీళ్ళు ప్రవహిస్తున్నాయని ఐన్యూసు వార్త!

    రిప్లయితొలగించండి
  3. సాయంత్రం 5:35 - కర్నూల్లో పరిస్థితి చాలా భయానకంగా ఉంది అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇప్పటికే 25 వేల మంది నీటిలో చిక్కుకుపోయి ఉన్నారు. ఇవాళ రాత్రికి నీటి మట్టం మరో 4 అడుగులు, రేపు మరో 4 అడుగులు పెరిగే అవకాశం ఉంది.

    రిప్లయితొలగించండి
  4. సుంకేశుల డ్యాము మట్టికట్ట కొట్టుకుపోయింది - ఇది మధ్యాహ్నమే జరిగింది. అందులో ఇద్దరు ఇంజనీర్లు కూడా కొట్టుకుపోయారని వార్త.

    రిప్లయితొలగించండి
  5. పొన్నాల లక్ష్మయ్యకు జ్వరంగా ఉండి ఆసుపత్రిలో చేరారట. అతడు నటిస్తున్నాడని పాత్రికేయుడు పాశం యాదగిరి అన్యాపదేశంగా, పేరు పెట్టకుండా విమర్శించాడు.

    రిప్లయితొలగించండి
  6. ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందని, ఇది ఉండీ ప్రయోజనం లేదనీ, ఈ ముఖ్యమంత్రి లాభం లేదనీ పాశం యాదగిరి చా..లా తీవ్రంగా విమర్శించాడు.

    రిప్లయితొలగించండి
  7. విమర్శించినవాడు జగన్ అభిమాని కావచ్చు కదా. మనుషులు మునుగుతున్న టైమ్ లో ఈ విమర్శలకి ప్రాధాన్యం అవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  8. IMHO, instead of providing updates every two minutes, if possible, you can organize some help centers to those who were affected by these floods.

    రిప్లయితొలగించండి
  9. సూర్యుడు: You must have already been busy organizing a relief camp, because I am sure, you will consider it better to organize a camp, instead of expressing HOs. BTW, I am surprised, how you could find time to express HOs in the midst of such a busy relief activity. Great HO job, SuryuDu!

    రిప్లయితొలగించండి
  10. ప్రకాశం బ్యారేజీ గేట్లు అన్నిటినీ ఎత్తడంలో ఇబ్బంది ఉందని ఐన్యూస్ చెబుతోంది. అధికారులు మాత్రం ఆ ఇబ్బందేమీ లేదని అన్నారట.

    రిప్లయితొలగించండి
  11. కర్ణాటక నుండి రేపు మరిన్ని నీళ్ళు వచ్చే అవకాశం ఉందని కర్ణాటక ప్రభుత్వం మన రాష్ట్రానికి చెప్పిందట.

    రిప్లయితొలగించండి
  12. This is the news line from NDTV website. On Friday night, the River Krishna's levels are expected to hit a 100-year high. Hope AP is prepared for the inflow.

    రిప్లయితొలగించండి
  13. అయ్యో ఉంటే అతివృష్టి లేకపొతే అనావృష్టి :(

    రిప్లయితొలగించండి
  14. కర్నూలు, మహబూబ్ నగర్, తెలంగాణ వైపు వరద ఉధృతంగా ఉందని విన్నా.
    శ్రీశైలం డ్యాం పైనుండి నీళ్ళు ప్రవహిస్తున్నాయి అని వార్త.
    డ్యంస్ కి ఏమైనా ప్రమాదమా?
    సాగర్ కి ఏమినా ముప్పుందా? విజయవాడకి ఏమైనా ముప్పు ఉండొచ్చా?

    రిప్లయితొలగించండి
  15. భాస్కర్ రామరాజు: కర్నూలులో పరిస్థితి భయానకంగా ఉందని ముఖ్యమంత్రే చెబుతున్నారు. రేపటికి, ఇప్పుడున్న నీళ్ళ మట్టం మరో 8 అడుగులు పెరిగే ప్రమాదం ఉంది. శ్రీశైలం నుండి వదిలే నీటికంటే వచ్చే నీళ్ళప్రవాహం చాలా ఎక్కువ కావడం దానికి కారణం.

    జలాశయాల్లోకి వస్తున్న నీళ్ళ పరిమాణాన్ని బట్టి చూస్తే శ్రీశైలం, నాగార్జున సాగరు డ్యాములకు గట్టి పరీక్షే అని అనిపిస్తోంది. ఇంజనీర్లు మాత్రం ఏం దిగుల్లేదని భరోసా ఇస్తున్నారు.

    మొత్తమ్మీద ప్రస్తుతం వరదదెబ్బ తిన్నవి కర్నూలు మహబూబ్‌నగరు జిల్లాలే. రేపు కృష్ణాజిల్లా వంతు. గుంటూరు జిల్లాలో అమరావతి వైపు కూడా దెబ్బ తినొచ్చు. బ్యారేజీ కొన్ని గేట్లు తెరుచుకోకపోతే, గుంటూరు జిల్లాలో జరిగే వినాశనం ఎక్కువగా ఉండొచ్చట.

    రిప్లయితొలగించండి
  16. >>సూర్యుడు, October 2, 2009 6:33:00 PM IST

    IMHO, instead of providing updates every two minutes, if possible, you can organize some help centers to those who were affected by these floods.

    సూర్యుడు - ఇది సమయం కాదుకదా ఇలా ఒపీనియన్స్ చెప్పుకోటానికి తెలుపుకోటానికి...ఏమంటారు??

    రిప్లయితొలగించండి
  17. ఇలాంటి వరదలు ఇప్పుడు కడుతున్న జల యజ్ఞం ప్రాజెక్టులకు వస్తే అంతే సంగతులు.

    రిప్లయితొలగించండి
  18. http://www.sakshi.com/main/SportsDetailsNormal.aspx?catid=329474&Categoryid=14&subcatid=0

    వరదకు తోడు భుకంపం కూడా నట కర్నూల్ జిల్లాలో

    రిప్లయితొలగించండి
  19. టీవీ చూస్తుంటే హృదయవిదారకంగా వున్నది. నాయకులు రాజకీయాలకు అతీతంగా ఆర్తులను ఆదుకోవలసిన సమయములో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వరదప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నవారు సైతం ఆత్మరక్షణకు హైదరాబాదుకు తరలిరావడం శోచనీయం. మేము నాయకులముకాదు, వినాయకులము అని వారికివారే చెప్పకనే చెప్పుకుంటున్నట్టు వున్నది. ఒక పీటాదిపతిని హెలికాప్టర్లో కాపాడి చేతులు తుడుచుకున్న అధికారులు ఎంతమంది వరదలో చిక్కుకున్నవారిని కాపాడినారో చెప్పుకోలేని దుస్థితిలో వున్నారంటే ఈ అధికారులపై సామాన్యప్రజలు ఏవిధముగా నమ్మకము వుంచుకోవాలి? ఓహ్, చదువరీ ఆలోచించు.

    --

    రిప్లయితొలగించండి
  20. శ్రీశైలం నీటిమట్టం 887 అడుగులకు చేరిందని, రాత్రి 11 గంటలకల్లా 890-892 అడుగులకు చేరవచ్చని రెవిన్యూ మంత్రి ధర్మాన చెప్పాడు. రేపు పొద్దున్నే ప్రజారక్షణ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసామని చెప్పాడు. హై.నుండి వెళ్ళేందుకు రోడ్డు దెబ్బతింది కాబట్టి బెంగళూరు, బళ్ళారి, తిరుపతి, పుట్టపర్తి వంటి స్థలాల నుంది వాహనాలు, హెలికాప్టర్ల ద్వారా రక్షణచర్యలు చేపట్టబోతున్నారు.

    రిప్లయితొలగించండి
  21. శ్రీశైలం నీటిమట్టం 892 అడుగులకు చేరిందని ఈటీవీ వార్త. కుడి విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ఆపేసారు.

    రిప్లయితొలగించండి
  22. భాస్కర్ రామరాజు: ఇప్పుడొచ్చే వరదకు ఎక్కువ భాగం రాష్ట్రంలో కురిసిన వర్షాలే కారణమని చెబుతున్నారు.

    రిప్లయితొలగించండి
  23. శ్రీశైలం డ్యాము 12 గేట్లలో 11 ఎత్తారు. మొరాయించిన మొదటి గేటును చివరికి తెరవలేకనే పోయారు. దాన్ని కూడా తెరిచి ఉంటే ఓ లక్ష క్యూసెక్కుల దాకా విడుదలయ్యేది. ఇంతకీ, అది అత్యవసర గేటట. 1998 లో తెరిచారు, మళ్ళీ ఇప్పటిదాకా తెరవలేదు.

    రిప్లయితొలగించండి
  24. >>అది అత్యవసర గేటట.
    మనోళ్ళు మోక్ టెస్ట్స్ కూడా చేయరు సుత్తినాయాళ్ళు. ఏమి, సమచ్చరానికోసారి కూసింత ఆముదం ఏసి గేటు ఓసారి ఎత్తి దించితే?

    రిప్లయితొలగించండి
  25. A modati gate teriste bridge okati kottukoni potundi ata.

    ippati daaka prakasam barrage maximum 10 lakh cusecs water ata.. ippudu okka pUta lO 6 lakshalu vastundi reepatiki. emautundo ento..

    రిప్లయితొలగించండి
  26. శశాంక్: అవును ఆ గేటు ఎత్తితే హై. వైపు వంతెన కొట్టుకుపోయే ప్రమాదం ఉందట.
    ---------

    కర్నూలులో సాయంత్రానికే కొన్నిచోట్ల నడుం లోతు నీళ్ళొచ్చాయి. రేపు మధ్యాహ్నానికి మరో 8 అడుగుల దాకా నీటి మట్టం పెరగవచ్చని ముఖ్యమంత్రి చెప్పాడు. రేపు కర్నూలు పరిస్థితి గురించిన వార్తలు ఎంత భయంకరంగానైనా రావచ్చు.

    రిప్లయితొలగించండి
  27. రెండు మూడు రోజులు వర్షాలు కురిస్తే ఇంత ఉత్పాతమా!?! నీటిపారుదలకి పేరులొక భారీ మంత్రి. సమయానికి నదుల్లో పూడికలు తీయించటం, చెత్తా చెదారమూ పారిశ్రామిక వ్యర్ధాలతో అవి నిండిపోకుండా చూట్టం .. ఇవన్నీ చేస్తే కదా. నెల నుండీ ప్రభుత్వ పెద్దలు సీఎమ్ కుర్చీ ఆటలో మునిగి తేలుతున్నారు. రోశయ్యని సరిగా పని చేసుకోనిస్తే పరిస్థితి బ్రహ్మాండంగా కాకపోయినా మరీ ఇంత ఘోరంగా ఉండేది కాదేమో.

    రిప్లయితొలగించండి
  28. వై.యస్.రా.శే.రె దయ్యమై ఇవన్నీ చేస్తున్నాడా ఏంది??
    అదేదో ఆ జగన్ ని ఆ కుర్చీలో అంట కూకోబెట్టండయ్యా బాబూ..
    [జోక్]

    రిప్లయితొలగించండి
  29. @ రామరాజు
    వై ఎస్ గారి ఆత్మ శాంతించలేదు. అందుకే ఏ నగరాన్నన్నా బలి ఇవ్వాలేమో!

    రిప్లయితొలగించండి
  30. నాస్తికుడైన శరత్ ఆత్మల గురించి మాట్లాడడమేమిటి? విచిత్రంగా ఉంది? ఆరేడు సంవత్సరాల క్రితం అనుకుంటాను, కర్నూల్ జిల్లాలో తుంగభద్ర నది కబ్జా వార్తలు వచ్చాయి. నదులు కబ్జా చేస్తే నదులలో నీళ్ళు నిలవక వరదలు రావడం జరిగే అవకాశాలు ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  31. అబ్రకదబ్ర: మీరు చెప్పింది కొంతవరకు నిజమే. రెండు రోజుల వానలు - విపరీతంగా పడ్డాయి. అప్పటికే జలాశయాలన్నీ నిండుగా ఉన్నాయి. చేరే ప్రతి బొట్టునూ కిందికి వదలాల్సిన పరిస్థితి.
    అన్నట్టు 'భారీ మంత్రి'కి జరవొఁచ్చిందంట.

    శరత్ 'కాలమ్': వయ్యెస్సుడి ఆత్మ అంతంత మాత్రాన శాంతించే రకం కాదు, నగరం చాలదు, రాష్ట్రమే కావాలి. తనకన్నా కావాలి, కొడుక్కన్నా కావాలి.

    రిప్లయితొలగించండి
  32. పర్యావరణ పరిశుభ్రత లేకపోతే మంత్రికైనా, మారుమూల పల్లెటూరి వాడికైనా మలేరియా జ్వరాలు వస్తాయి. ఇప్పుడు వరదలు వచ్చాయి కదా, వరద నీళ్ళ వల్ల అంటు వ్యాధులు సులభంగా వ్యాపిస్తాయి.

    రిప్లయితొలగించండి
  33. మంత్రాలయం వరద తగ్గుముఖం పట్టిందట. (ఈనాడు వార్త)

    రిప్లయితొలగించండి
  34. http://picasaweb.google.com/nandana18/FloodsAroundMantralayam# మంత్రాలయం బొమ్మల్లో వరద

    రిప్లయితొలగించండి
  35. చూసాను కిరణ్, టీవీ9 వాడు రాత్రి ఈ ఫోటోలను చూపించాడు.

    రిప్లయితొలగించండి
  36. ఏమి, సమచ్చరానికోసారి కూసింత ఆముదం ఏసి గేటు ఓసారి ఎత్తి దించితే?....
    సర్లెండి! ఆ గేటు కి కాసింత ఆవదం పూయడానికి అవుట్ సోర్సింగట వేరే కంపెనీకి! నీటి పారుదల వాళ్ళు కాదట! ఆ గేట్లకు ఉండే మోకుల్లాంటి తాళ్ళు చీకిపోయి ఎప్పుడో తెగిపోయాయట.ఏమి చెప్తాం?

    రిప్లయితొలగించండి
  37. వరద సహాయం అందించదలచినవారు కింది నంబర్లను సంప్రదించవచ్చు:

    హిందూ ధార్మిక సంస్థలు (మళ్ళ వాసుబాబు): 96035 49469
    లోక్‌సత్తా పార్టీ (రత్నం): 93983 03029, 93910 38940

    రిప్లయితొలగించండి
  38. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  39. ఒక వూరు లేదు ఒక దారి లేదు.పల్లె లేదు పట్నం లేదు.. లంక లేదు మెట్ట లేదు. అంతా నీరే నీరు.
    వీలైతే మా వూరి పరిస్థితి నీ ఒక మారు చూడండీ. సరిగ్గా కర్నూలు,సుంకెసుల, కు ఆవలి గట్టున.ఇది పాలమూరు.యంత్రాంగం మంత్రాంగం వేరు వేరు.ఇప్పటికే అందజేయగలిగిన యంత్రాంగానికి వార్తను చేరవేసాం. ఇంకా ఏ వార్తా మాకు చేరలేదు.ఎదురుచూస్తున్నాం.ఈ రాత్రి గడిస్తే చాలు అన్నట్లుగా ఉన్నది నది పరిస్థితి.
    వివరాలకు .."మడతపేజీ"లో చూడవలసిందిగా విజ్ఞప్తి.
    http://chandralata.blogspot.com

    రిప్లయితొలగించండి
  40. ఈ వఱదకి సగం కారణం గత ముఖ్యమంత్రి జారీచేసిపోయిన ఆదేశాలేనని జనం చెప్పుకుంటున్నారు.

    -- తాడేపల్లి

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు