ఒకరి సీ...టు గోవిందా! ఓ పక్క శవాన్ని పెట్టుకోని, అంత బాధనూ దిగమింగుతూ కూడా జగను బ్యాచ్చీ అంత రాజకీయం చేసారే! అంతటి కష్టంలోనూ రాజకీయం చెయ్యక తప్పని వాళ్ళ పరిస్థితిని అధిష్ఠానదేవత ఇసుమంతైనా పట్టించుకుందా? మరీ సెంటిమెంట్లు లేనట్టుగా వ్యవహరించింది.
24, అక్టోబర్ 2009, శనివారం
21, అక్టోబర్ 2009, బుధవారం
తెలంగాణ ఉద్యమాన్ని లేవదీసే ప్రయత్నం
సిద్దిపేటలో ఉద్యోగుల గర్జన పేరుతో అక్టోబరు 21న తెరాస నిర్వహించిన సభను టీవీలో చూసాను. హైదరాబాదును ఫ్రీజోనుగా ప్రకటిస్తూ (పోలీసు నియామకాలకు సంబంధించి) సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణా ఉద్యోగ సంఘాలతో కలిసి పెట్టిన సభ ఇది.
14, అక్టోబర్ 2009, బుధవారం
హైకమాండు, హై.కమాండు
జగను హై. చేరాడు. ఇక ఢిల్లీలో హైకమాండు - హైదరాబాదులో హై.కమాండు. మంత్రులు, ఎమ్మెల్యేల తీర్థయాత్రాస్థలం ఇక కళకళలాడబోతోంది. ముఖ్యమంత్రి జగనుకు చేసే ఫోన్లు ఇలా ఉండొచ్చు - 'జగనూ, ఆ రఘువీరారెడ్డి ఉంటే రేపో ఎల్లుండో ఓసారి సచివాలయానికి పంపించవా, కాస్త పనుంది.'
పాకిస్తానువాడిక్కూడా వద్దురా నాయనా ఇలాంటి మంత్రులు !
పాకిస్తానువాడిక్కూడా వద్దురా నాయనా ఇలాంటి మంత్రులు !
10, అక్టోబర్ 2009, శనివారం
ఒబామాకు నోబెలిస్తే మనకెందుకాశ్చర్యం?
ఒబామాకు నోబెలిస్తున్నట్టు ప్రకటించినప్పుడు అక్కడున్న విలేకరులు ఆశ్చర్యంతో ఆవులించారు. ప్రపంచమంతా విస్తుపోయింది. అధ్యక్షపదవిలోకి వచ్చిన 12 రోజుల్లోనే అతడు అంత శాంతిదూత ఎలా అయ్యాడో పాపం ఒబామాకు కూడా అర్థమయ్యుండదు. ఒక రకంగా ఇది ఒబామాను చిన్నబుచ్చడమే. ఒబామాను విమర్శించేందుకు, అతడి మీద కార్టూన్లు జోకులూ వేసుకునేందుకు ప్రజలకిచ్చిన అవకాశమే ఇది. ఇప్పుడు నేనేం చేసానని నాకీ పురస్కారం అని అతడు తలపట్టుకునే పరిస్థితి. దానికితోడు,
2, అక్టోబర్ 2009, శుక్రవారం
పోటెత్తిన కృష్ణ -ప్రమాదంలో రాష్ట్రం
కృష్ణానది ఉప్పొంగుతోంది. ఊళ్ళను, నగరాలను, మండలాలను కూడా ముంచెత్తుతూ ఉరకలెత్తుతోంది. గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద వచ్చిందట. కర్నూలు నగరం నడుంలోతు నీళ్ళలో మునిగిపోయింది. మంత్రాలయం మునిగిపోయింది. రాఘవేంద్రస్వామి మఠం మునిగిపోయింది. కర్నూలు, మహబూబ్నగర్ జిల్లాల్లో అనేక ఊళ్ళు నీళ్ళలో చిక్కుకుపోయాయి. విజయవాడ ప్రమాదపు అంచున ఉంది. పులిచింతల కాఫరు డ్యాము కొట్టుకుపోయింది. శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగరు డ్యాము పాటవ పరీక్షను, పటుత్వ పరీక్షను ఎదుర్కొంటున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..