ఎన్నికల ప్రచారంలో తన ఆరోగ్యశ్రీ పథకం గురించి చెప్పుకునే క్రమమంలో అంబులెన్సు మోతను అనుకరించడానికి గాను రాజశేఖరరెడ్డి కుఁయ్.. కుఁయ్.. కూఁయ్.. అంటూ గుక్కపట్టి అరిచేవాడు. యాడుల్లో తమ ఉత్పత్తులను తేలిగ్గా గుర్తుకు తెచ్చేలా ఉండటం కోసం, తమ ఉత్పత్తికో బ్రాండు గుర్తింపును, బ్రాండు విలువనూ తేవడం కోసం జింగిల్స్ వాడుతూంటారు. అలాగ, వయ్యెస్ కూడా ఈ కూతతో తనకూ, ఆరోగ్యశ్రీకీ ప్రజల్లో ఒక బ్రాండుస్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అంబులెన్సు కూత వింటే, ఏదో అనర్ధాన్ని సూచిస్తూ, ఆందోళన కలిగిస్తుంది. వయ్యెస్ వేసే ఈ కూత అంతకంటే ఎక్కువ చిరాకు కలిగించేది. అన్ని యేళ్ళొచ్చినవాడు వేదికనెక్కి ఇలా కారాట, బస్సాట ఆడుకున్నట్టు అంబులెన్సాట ఆడుకుంటూ ఉంటే, ఎబ్బెట్టుగా ఉండదా మరి.
18, ఏప్రిల్ 2009, శనివారం
14, ఏప్రిల్ 2009, మంగళవారం
చారిత్రిక అవసరం
అధికారమనేది లక్ష్యం కాకూడదు, అదొక మార్గం అంతే! అంటున్నాడు లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ. జాతినిర్మాణం, బిడ్డల భవిష్యత్తూ లక్ష్యాలు కావాలి. అధికారం -దాన్ని సాధించే మార్గం కావాలి. కానీ సాంప్రదాయిక రాజకీయ పార్టీలు అధికారాన్ని లక్ష్యంగా చూస్తున్నాయి అని అంటున్నాడు.
10, ఏప్రిల్ 2009, శుక్రవారం
ఏం తేడా లేదు!
ఇన్నాళ్ళూ ప్రజారాజ్యాన్ని రాజ్యేతరులే విమర్శించారు. ఆ పార్టీలో ప్రత్యేకత ఏమీ లేదన్నారు. మిగతా పార్టీల కంటే కొత్తదనం, వైవిధ్యత ఏదీ లేదన్నారు. డబ్బులు తీసుకుని టిక్కెట్లిస్తున్నారనీ అన్నారు. చిరంజీవి పైకి కనబడేంత సౌమ్యుడు, అమాయకుడూ కాదన్నారు. అతడిది నటన అని అన్నారు. అది అతివినయం అనీ అన్నారు.
2, ఏప్రిల్ 2009, గురువారం
రెండు చర్చలు
ఇవ్వాళ టీవీ ఛానళ్ళలో రెండు చర్చలు చూసాను. రోజూ చూస్తాననుకోండి, ఎందుకో ఈ రెంటి గురించీ రాయాలనిపించింది. కాస్త సమయమూ చిక్కింది. ముందుగా..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..