18, ఏప్రిల్ 2009, శనివారం

కుఁయ్..కుయ్...కుయ్య్

ఎన్నికల ప్రచారంలో తన ఆరోగ్యశ్రీ  పథకం గురించి చెప్పుకునే క్రమమంలో అంబులెన్సు మోతను అనుకరించడానికి గాను రాజశేఖరరెడ్డి కుఁయ్.. కుఁయ్.. కూఁయ్.. అంటూ గుక్కపట్టి అరిచేవాడు. యాడుల్లో తమ ఉత్పత్తులను తేలిగ్గా గుర్తుకు తెచ్చేలా ఉండటం కోసం, తమ ఉత్పత్తికో బ్రాండు గుర్తింపును, బ్రాండు విలువనూ తేవడం కోసం జింగిల్స్ వాడుతూంటారు. అలాగ,  వయ్యెస్ కూడా ఈ కూతతో తనకూ, ఆరోగ్యశ్రీకీ ప్రజల్లో ఒక బ్రాండుస్పృహ కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. అంబులెన్సు కూత వింటే, ఏదో అనర్ధాన్ని సూచిస్తూ, ఆందోళన కలిగిస్తుంది. వయ్యెస్ వేసే ఈ కూత అంతకంటే ఎక్కువ చిరాకు కలిగించేది. అన్ని యేళ్ళొచ్చినవాడు వేదికనెక్కి ఇలా కారాట, బస్సాట ఆడుకున్నట్టు అంబులెన్సాట ఆడుకుంటూ ఉంటే, ఎబ్బెట్టుగా ఉండదా మరి.


అయితే మొదటి విడత తరవాత, ఈ కూత ఎన్నికల్లో పెద్దగా పనిచేస్తున్నట్టు లేదనుకున్నాడో ఏంటో..ఇప్పుడా కూతతో పాటు, మరో కూత కూడా పెట్టడం మొదలుపెట్టాడు. తెలంగాణా వస్తే ఇతర ప్రాంతాల వాళ్ళకు హై. పరాయిదేశమైపోతుందంట. ఇతరప్రాంతాల వాళ్ళు అక్కడ వ్యాపారాలు చేసుకోలేరంట. ఈ సంగతి కేసీయారు ఎప్పుడో చెప్పాడంట. అంచేత ఆ ప్రమాదం నుండి తప్పించుకోవాలంటే తమకు వోటెయ్యాలని ఆయన ప్రసంగ సారాంశం.

ఈ కూత వెనక ఉన్న దురాలోచనను పరిగణనలోకి తీసుకుంటే దీన్ని కూత అనకూడదు,  ఊళ అనాలని మనకర్థమవుతుంది. వయ్యెస్ చెప్పినట్టుగా కేసీయారు ఆ మాటలన్నది నిజమే. ఇవేంటి, ఇంకా ఎక్కువే అన్నాడు. (దీని గురించి గతంలో అడ్డుగోడలు, అడ్డగోలు మాటలు అంటూ టపా ఒకటి రాసాను) ఆ మాటల్లోని అనుచిత ధోరణి, వయ్యెస్‌కు తెలంగాణాలో పోలింగు అయ్యీ అవ్వగానే గుర్తుకొచ్చిందేమోగానీ, అతడీ మాటలన్నది చాన్నాళ్ళ కిందటే. వయ్యెస్సూ, కేసీయారూ కండవాలు మార్చుకుని రాజకీయపు పెళ్ళిజేసుకుని, అధికారం వెలగబెడుతూ వెలిగిపోతున్నప్పుడే అన్నాడు. ఆ పెళ్ళికి ముందూ అన్నాడు. అప్పుడు ఆ మాటల్లోని పల్లదనం వయ్యెస్‌కు కనబడలేదు. తెలంగాణా వస్తే, రాయలసీమవాసులు ఎదుర్కోబోయే కష్టాలు ఆయనకప్పుడు తట్టలేదు.

పోలింగు అయిపోయాక, ఇక తెలంగాణా వాళ్ళతో తనకు పని లేదనుకున్నాడు వయ్యెస్.  సీమ, కోస్తా వాసులతో ఇంకా పని ఉందిగాబట్టి, ఇప్పుడు ఆ గూటి పాట పాడ్డం మొదలుపెట్టాడు. రేపు వాళ్ళ పోలింగు కూడా అయిపోయాక, వాళ్ళతో కూడా పని ఐపోతుంది. వాళ్ళ నెత్తిన కూడా చెయ్యి పెడతాడు. పొరపాటున కాంగ్రెసు అధికారంలోకి వస్తే (మొదటి విడత అయ్యాక జనాలు, పత్రికలు చెబుతున్న మాటలను బట్టి, ఆ ప్రమాదం లేదనిపిస్తోంది), ఒకవేళ మన ఖర్మ కాలి వస్తే, ఇతడే ముఖ్యమంత్రి అవుతాడు. ఇంకో ఐదేళ్ళపాటు మనలని పీక్కుతింటాడు. అప్పుడిక మన పని ఐపోయినట్టే!

తెలంగాణా పట్ల అలాంటి అభిప్రాయం కలిగి ఉండటం కాదు తప్పు. ఇలాంటి అభిప్రాయాన్ని కడుపులో దాచుకుని కూడా, ఎన్నికల ముందేమో శాసనసభాసంఘమనీ మరోటనీ వేసి మాయజేసాడే, అదీ తప్పు. తెలంగాణ జనుల వోట్లు అవసరమైనన్నాళ్ళూ ఒక రకంగా మాట్టాడి, అవసరం తీరగానే ఇప్పుడు మాట మార్చాడే.. అదీ తప్పు.  తెలంగాణలో ఎన్నికల పని అయిపోయిందిగదా.. ఇక కోస్తా, సీమ వాసుల వోట్లకోసం, ఇలా బరితెగించి మాట్టాడుతున్నాడు.

ఏరు దాటాక తెప్ప తగలెయ్యడం, పడవ దిగగానే ఓడ మల్లయ్యను బోడి మల్లయ్య అనడం. అంటే ఇదే! ఈ సంగతిని గ్రహించిన కోస్తా, సీమ వాసులు వోటుచ్చుకుని ఒక్కటేస్తే, కుయ్యో మొర్రో మనడం వయ్యెస్ వంతవుతుంది.

19 కామెంట్‌లు:

  1. వయ్యస్ గురించి ఊరికే బీపీ పెంచుకుని ఉపయోగం లేదులెండి. ఫ్యాక్షనిస్టుకి అధికారమిస్తే ఎంత చక్కగా వెలగబెడతాడో ఐదేళ్లపాటు రుచి చూపించాడు. అయ్యగారి అవినీతి సంగతవతలబెడితే - నా మటుకు నాకు - ఈయనెప్పుడు దిగిపోతాడా, ఆం.ప్ర.లో ఉన్న రాజీవ నామధేయ పధకాల, ఫలకాల పేర్లెప్పుడు మారిపోతాయా అని ఆత్రంగా ఉంది. ఆ వచ్చేవాళ్లు ఇంకేమీ పీకకపోయినా నెహ్రూ వంశం పేర్లు పీకి అవతల పడేస్తే చాలు.

    రిప్లయితొలగించండి
  2. అవినీతితోపాటూ పార్టీకి రోజుకు ఇన్నికోట్లని చెల్లించుకుంటూ తన అధికారాన్ని కాపాడుకున్న వై.ఎస్. పరిస్థితి తారుమారవుతుందన్న భయంతో వాగుతున్న పిచ్చి "కూతలివి". అర్థం చేసుకోదగ్గ పరిణామమే. ప్రాంతీయవైషమ్యాలు రెచ్చగొడుతున్నాడంటూ తన మీదా NSA invoke చేసి లోపల పడెయ్యాలి. ఓ పనైపోతుంది.

    రిప్లయితొలగించండి
  3. ఓటుచ్చుకుని ఒక్కటిస్తే, కుఁయ్..కుయ్...కుయ్య్... :):). (ఫలితాలొచ్చాక వై.యస్ కోసం నిజంగానే 108 పిలవాల్సొందేమో).

    రిప్లయితొలగించండి
  4. ఈ రాజకీయ కాలుష్యంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎలర్జీ ;)

    రిప్లయితొలగించండి
  5. కుఁయ్.. కుఁయ్.. కూఁయ్.. అంటూ గుక్కపెట్టి అరిచేవాడు :)

    ఆయనగారు అన్నింటికి అతీతుడు.

    రిప్లయితొలగించండి
  6. వై యెస్ అంత దరిద్రపు ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరు. అబ్రకదబ్ర గారన్నట్టు వీడి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా, నెహ్రు నామ జపానికి చరమ గీతం ఎప్పుడా అని ఎదురుచూస్తున్నాం. తెలివైన, నైతిక విలువలున్న (లోక్సత్తా)నాయకుడి ని ప్రజలు ఎప్పుడూ ఎన్నుకోరు వారికి అంత చైతన్యం లేదు (పట్టణ ప్రజలు లాగ) మార్పు అంటున్నారు (పి ఆర్ పి) వారెంత వెలగపెడుతారొ చూడాలి అవకశం వస్తే. బాబు (టి డి పి) వచ్చిన పెద్దగా ఒరిగేదేం ఉండదు. మళ్లి తెలంగాణా ఇచ్చేనపుడు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో.

    రిప్లయితొలగించండి
  7. మీకు వై యస్సు మీద వున్న అభిమానం చూస్తే ముచ్చటేస్తుంది.ఓటిచ్చుకుని ఒక్కటేస్తే.........అవునూ మీరు యమా సీరియస్సు కదా మరీ జోకులేంటండీ. ఈరోజు ఈనాడులో రాజావారి ఫోటోలు చూసారా ఒక్కదాంట్లోనూ జీవం లేదు. తిరుపతిలో సెటగోపం పెట్టించుకుంటున్న ఫొటో చూసి నవ్వపుకోలేకపోయాను. అసెంబ్లీలో వెకిలి నవ్వులు ఇప్పుడేమయ్యాయో. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందేమో.

    రిప్లయితొలగించండి
  8. మీ టపా చివరి గమనిక బావుంది. ఇది ఎలా పెట్టుకోవాలి ? / ఎలా ఉపయోగించాలి ?

    రిప్లయితొలగించండి
  9. i am eagrly waiting for this stupid get out. does not he know when he made alliance with TRS in 2004? no CM in the past looted like this..

    Abrakadabra,well said .. i am eagrly waiting too

    రిప్లయితొలగించండి
  10. కానీ ప్రజారాజ్యం వల్ల కోస్తా లో వోట్లు చీలతాయి... ఒక వేళ చిరు కింగ్ మేకర్ అయితే (30-40 సీట్లతో అయినా సరే), ఆయన గారు పొయ్యి ఈ కాంగ్రేసుకి మద్దతిస్తాడేమో అని భయంగా ఉంది...అప్పుడింక ఇంకో 5 సం. ల పాలనతో మనం ఇరవయ్యేళ్ళు వెనక్కి వెళ్ళొచ్చు...

    రిప్లయితొలగించండి
  11. "వయ్యెస్ వేసే ఈ కూత అంతకంటే ఎక్కువ చిరాకు కలిగించేది."

    "ఆ వచ్చేవాళ్లు ఇంకేమీ పీకకపోయినా నెహ్రూ వంశం పేర్లు పీకి అవతల పడేస్తే చాలు. "

    "ఓటుచ్చుకుని ఒక్కటిస్తే, కుఁయ్..కుయ్...కుయ్య్... :):).
    (ఫలితాలొచ్చాక వై.యస్ కోసం నిజంగానే 108 పిలవాల్సొందేమో). "

    "తిరుపతిలో సెటగోపం పెట్టించుకుంటున్న ఫొటో చూసి నవ్వపుకోలేకపోయాను. "

    "వై యెస్ అంత దరిద్రపు ముఖ్యమంత్రి చరిత్రలో ఎవరూ లేరు. "

    Yes...That's the spirit...:-)

    రిప్లయితొలగించండి
  12. http://timesofindia.indiatimes.com/articleshow/msid-4396986,prtpage-1.cms

    NGOs, Teesta spiced up Gujarat riot incidents: SIT
    14 Apr 2009, 1213 hrs IST, Dhananjay Mahapatra, TNN



    NEW DELHI: The Special Investigation Team responsible for the arrests of those accused in Gujarat riots has severely censured NGOs and social activist Teesta Setalvad who campaigned for the riot victims.

    In a significant development, the SIT led by former CBI director R K Raghavan told the Supreme Court on Monday that the celebrated rights activist cooked up macabre tales of wanton killings.

    Many incidents of killings and violence were cooked up, false charges were levelled against then police chief P C Pandey and false witnesses were tutored to give evidence about imaginary incidents, the SIT said in a report submitted before a Bench comprising Justices Arijit Pasayat, P Sathasivam and Aftab Alam.

    The SIT said it had been alleged in the Gulbarg Society case that Pandey, instead of taking measures to protect people facing the wrath of rioteers, was helping the mob. The truth was that he was helping with hospitalisation of riot victims and making arrangements for police bandobast, Gujarat counsel, senior advocate Mukul Rohtagi, said quoting from the SIT report.

    Rohtagi also said that 22 witnesses, who had submitted identical affidavits before various courts relating to riot incidents, were questioned by the SIT which found that they had been tutored and handed over the affidavits by Setalvad and that they had not actually witnessed the riot incidents.

    The SIT also found no truth in the following incidents widely publicised by the NGOs:

    * A pregnant Muslim woman Kausar Banu was gangraped by a mob, who then gouged out the foetus with sharp weapons

    * Dumping of dead bodies into a well by rioteers at Naroda Patiya

    * Police botching up investigation into the killing of British nationals, who were on a visit to Gujarat and unfortunately got caught in the riots

    Rohtagi said: "On a reading of the report, it is clear that horrendous allegations made by the NGOs were false. Stereotyped affidavits were supplied by a social activist and the allegations made in them were found untrue."

    Obviously happy with the fresh findings of the SIT which was responsible for the recent arrests of former Gujarat minister Maya Kodanani and VHP leader Jaideep Patel, Rohtagi tried to spruce up the image of the Modi administration, which was castigated in the Best Bakery case by the apex court as "modern day Neros". He was swiftly told by the Bench that but for the SIT, many more accused, who are freshly added, would not have been brought to book.

    The Bench said there was no room for allegations and counter-allegations at this late stage. "In riot cases, the more the delay, there is likelihood of falsity creeping in. So, there should be a designated court to fast track the trials. Riot cases should be given priority because feelings run high having a cascading effect," it said and asked for suggestions from the Gujarat government, Centre, NGOs and amicus curiae Harish Salve, who said the time had come for the apex court to lift the stay on trials into several post-Godhra riot cases.

    While additional solicitor general Gopal Subramaniam agreed with the court that public prosecutors should be selected in consultation with Raghavan, counsel Indira Jaising said there should be a complete regime for protection of witnesses as the same government, which was accused of engineering the riots, was in power now.

    Salve said that he would consult Raghavan and let the court know about a witness protection system for post-Godhra riot cases. The court asked the parties to submit their suggestions within a week.

    రిప్లయితొలగించండి
  13. అమెరికాలో జార్జి బుష్ ఓడిపోవడంతో ప్రపంచనికి పట్టిన శని వదిలింది.

    సెంటర్లో సోనియా, మన రాష్ట్రంలో వై. యస్, ఓడిపోతే దేశానికి, రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది.

    ఇంకెంత ఒక్క నెల రోజులే.

    రిప్లయితొలగించండి
  14. వ్యాఖ్యాతలందరికీ నెనరులు.

    Sujatha: మీకోసం ఈ సమాచారం-
    1. ఆ గమనికను పెట్టుకునే విధానం ఇది: blogger.com లో లాగిన్ అయి, మీ బ్లాగు settings ట్యాబులో comments ఉప ట్యాబుకు వెళ్ళండి. అక్కడ Comment Form Message పెట్టెలో మీరు రాయదలచుకున్న సందేశం రాయొచ్చు. ఈ సందేశమే వ్యాఖ్యల పెట్టె పైన కనిపిస్తుంది.

    2. అజ్ఞాత వ్యాఖ్యాతలను నిరోధించే విధానం: పైన చెప్పిన పేజీలోనే Who Can Comment? అనే పెట్టెలోని విలువల్లోంచి మీకు తగినదాన్ని ఎంచుకోవచ్చు.

    రిప్లయితొలగించండి
  15. నాకయితె ఈ 5 సంవత్స్రాలలొ 20 ఇయర్స్ బాక్ కి వెళ్ళినట్టు ఎమి అనిపించడం లేదు. కొద్ది గ్రొత్ రెట్ తగ్గిన మాట నిజమె, కాకపొతె అది అన్ని రాస్ట్రలలొ వుంది. నాకు బాబు కి వైఎస్ కి పెద్ద తెడా కనిపించదు. ఇద్దరు దొచుకుతిన్న వాళ్ళె. సొ ఇంకొ సారి వైఎస్ వచ్చిన పెద్ద మార్పు ఎమి వుండదు .......

    కానీ

    ఈ మార్పులు చూడవచ్చు

    1. మన రాస్ట్రం లొ హిందువులు కి రిజెర్వషన్స్ వస్తాయి. మరి మైనారిటి మతం వాళ్ళకి రిజెర్వషన్స్ వైఎస్ కి ఒకె కదా.
    2. తిరుపతి కొండ మీద కొన్ని చర్చిలు వస్తాయి.
    3. ఈనాడు, జ్యొతి దివాళా తీస్తాయి.
    4. తెలంగాణ పూర్తి గా మర్చ్చిపొవచ్చు.
    5. వర్షాలు విస్తరంగా పడతాయి. (దేవుడు మావైపె వున్నడని వైఎస్ అంటు వుంటాదు).
    6. ఆ నెక్స్త్ టర్మ్ లొ ఎవరు వచ్చిన ప్రాజెక్ట్ లు ఆగిపొతాయని వైఎస్ చెబుతూ వుంటాడు. (ఎప్పటికయినా వెరే పార్టి అదికారం లొకి వచ్చి , ప్రాజెక్ట్స్ అపెవరకు ..ఈ ప్రాజెక్ట్స్ పూర్తి అవ్వవు కదా మరి)
    6. ఫొర్బ్స్ టాప్ టెన్ లొ జగన్
    7. ఇంకొంత మంది సంఘ విద్రొహశక్తులు ఎంకౌంటర్ చెయ్యబడతారు (గమనిక : అందరు సంఘ విద్రొహశక్తులు వెరె పార్టిలలొనె వుంటారు).
    8. అంధ్ర రాస్ట్ర కాంగ్రెస్స్ పార్టి పర్యవెక్షకుడి పదవికి విపరీతమయిన పొటి. మాకు మినిస్త్రి కుడా వద్దని వీరప్ప మొయిలీ , దిగ్విజయ్ సింగు ఈ పొస్టు కొసం ఎగబడతారు. హైదరాబాదు లొ చీప్ గా అస్తులు సంపాదించలంటె ఇదె మంచి మార్గం.

    ఇంకా చాల వున్నాయి కానీ ప్రస్తుతానికి ఇవి.

    రిప్లయితొలగించండి
  16. @Bonagiri.

    .. tamaru kooda CBN school lo chadivanattunnaru.!!
    Bush vodipoledandi!! aayana padaveekaalam ipoyyindi.. malli poti cheyyaalante, vaala rules oppukovu..

    రిప్లయితొలగించండి
  17. Any how YSR is Great !!

    EE endalu choosthunte mallee aa paadu chandra babu mallee vasthaademo anipithondi

    mee raashtraani ki ilane jaragalaa??

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు