(గత టపా తరువాయి)
వీటన్నిటికంటే ముందు యువ వచ్చేది. వడ్డాది పాపయ్య బొమ్మలు తప్ప మరింకేవీ గుర్తు లేవు నాకు. వపా బొమ్మల వేళ్ళు ఎలా ఉండేవి.. సన్నగా, కోసుగా, చివర్లు నైసుగా వంపు దిరిగి ఉండేవి. ఎంత హొయలు బోయేవి ఆ బొమ్మలు!! యువలో నాకు అవే నచ్చేవి. అలాగే చందమామ బాలమిత్ర కూడా వచ్చేవి. కొన్నాళ్ళు బొమ్మరిల్లూ చదివాను. వాటికి నేను ఏకైక పాఠకుణ్ణి అవడం చేత, మాయింట్లో అంత ఆదరణ ఉండేది గాదు. తరవాత్తరవాత కొన్నాళ్ళకి వాటిని మానిపించారు.
20, మార్చి 2009, శుక్రవారం
19, మార్చి 2009, గురువారం
నేను చదివిన పత్రికలు
చిన్నప్పుడు మాయింటికి ఈనాడు, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పేపర్లతో పాటు, వారపత్రికలు కూడా వచ్చేవి. ఈనాడు విజయవాడలో ముద్రణ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా మాయింటికి ఈనాడు వస్తూనే ఉంది. జ్యోతి మధ్యలో కొన్నాళ్ళు ఆపారుగానీ, ఈనాడు మాత్రం ఎప్పుడూ మానలేదు. అప్పటినుండి ఇప్పటిదాకా మా కుటుంబమంతా కాంగ్రెసు పార్టీవారైనా , నేను మాత్రం ఈనాడు పార్టీనే. :) (అనగా కాంగ్రెసు వ్యతిరేకిని). ఇప్పుడు మావాళ్ళు తమ అభిమాన, ముష్టిపార్టీ పత్రికను కూడా వేయించుకుంటున్నారు (పార్టీ ముష్టిది, పత్రిక వీరముష్టిది). ఏం చేస్తాను, ఆళ్ళ రాజకీయాలు ఆళ్ళవి.
ఆగండాగండి.. ఇకముందు రాజకీయాల్లేవీ టపాలో, ఒట్టు!
ఆగండాగండి.. ఇకముందు రాజకీయాల్లేవీ టపాలో, ఒట్టు!
2, మార్చి 2009, సోమవారం
ఎన్నిక లెన్నిక లెన్నిక లెండిక!
ఎన్నికల తేదీలు ఖరారయ్యాయి. పార్టీలు, నాయకులు మన ముందు చేతులు కట్టుకు నిలబడే రోజు వస్తోంది. 2009 సార్వత్రిక ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది.
1, మార్చి 2009, ఆదివారం
పేర్ల పురాణం
"విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, డాక్టర్, పద్మశ్రీ నందమూరి తారక రామారావు నటించిన.. " అని మన రాష్ట్ర విఖ్యాత సినిమారిక్షా వాడు చెప్పుకుంటూ పోతూంటే, అది వింటూ, వాడు పంచే కరపత్రాల కోసం ఆ బండెనకాలే పరిగెడుతూ -ఆహా, తలుచుకుంటూంటేనే మైకం కమ్ముతోంది. ఆ మైకువాడు ప్రతీసారీ ఆ ముందరి బిరుదులన్నీ వరసాగ్గా చదివేవాడు, అదంతా రామారావు ఇంటిపేరైనట్టు! రామారావు భక్తులైన కొందరు నాబోటిగాళ్ళు కూడా ఉత్త రా. మా. రా. వు. అని అంటే పాపం తగులుద్దేమో అన్నట్టు మొత్తం బిరుదులన్నీ చదివి మరీ పేరు చెప్పేవాళ్ళు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
సంబంధిత టపాలు
loading..