29, నవంబర్ 2008, శనివారం

ప్రధానికో లేఖ

కంథమాల్లో జరిగినదాని గురించి తలెత్తుకోలేకపోతున్నామని, బయటి దేశాల్లో పరువు పోయిందని, ఫ్రాన్సు అధ్యక్షుడో మరొహడో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేకపోయానని వాపోయిన ప్రధానమంత్రి గారూ..


ముంబైలో మూడురోజుల పాటు, వందలాది మందిని ఖైదీలుగా పట్టుకుని, 195 మందిని పొట్టనబెట్టుకుని, బీభత్సం సృష్టించిన ఈ సంఘటన మీకు లజ్జాకరంగా అనిపించలేదా? మూడు రోజులపాటు నగరాన్ని కిడ్నాపు చేసి, దేశం మొత్తాన్నీ హడలగొట్టిన సంఘటన అవమానకరం కాదా?  పాకిస్తాన్నో, మరొకణ్ణో నిందించి చేతులు దులిపేసుకుంటే సరిపోద్దా? గతంలో దాడికి పాల్పడిన ఉగ్రవాదులు, వాళ్ళను పోషించిన ఇంటిదొంగలూ, దేశద్రోహులను -ముస్లిములైనా సరే- వెనకాడకుండా, మట్టుబెట్టి ఉంటే ఈ అవమానకరమైన దాడి జరిగేదా? ఇవ్వాళ 195 మంది బలయ్యేవారా? ఇన్నాళ్ళుగా మీ నాయకత్వం పాటిస్తూ వచ్చిన మైనారిటీ బుజ్జగింపు కార్యక్రమం ఎంతకు దారితీసిందో చూసారా? అదే ఉగ్రవాదుల ముఠా మంత్రాలయ వైపు పోయి, అక్కడున్న మంత్రులూ, ఎమ్మెల్యేలను పట్టేసి, చేతులు కట్టేసి, తలలు కొట్టేసి ఉంటే మీకెలా ఉండేది? (పీడా బోయిందని సంతోషించి ఉండేవాళ్ళం అని ఈ దేశంలో కనీసం 80 శాతం మంది చెబుతారు స్వామీ! రాజకీయ నాయకత్వానికున్న పరపతి అంతటిది మరి!!)

మైనారిటీ వాదులకు, మైనారిటీ పక్షపాతులకు ఎందుకు ప్రభుత్వమంత లోకువైపోయింది? ఉగ్రవాదులపై కర్కశంగా ఎందుకు వ్యవహరించలేకపోయాం? కర్కశత్వం ఒక్కరి సొత్తేనా? మనకు లేవా కరకు గుండెలు? మాటల్లో ఉక్కుపాదాలు మోపడం కాదు చేతల్లో చేవ చూపించాలి, ఉక్కులాంటి దృఢచిత్తం చూపెట్టాలి. ఉగ్రవాదులు ముస్లిములన్న కారణమ్మీద వెనకేసుకురాబోయిన మంత్రులు మీ మంత్రిమండలిలో ఇంకా ఎందుకున్నారు? దేశాన్ని ఉగ్రవాదం నుండి కాపాడ్డానికి మతం ఎందుకు అడ్డు రావాలి? పార్లమెంటు మీద దాడి చేసినవాడికి ఖరారైపోయిన ఉరిశిక్షను ఎలా తప్పించాలా అని ఆలోచించే సమయంలో కొంత భాగాన్ని ఇలాంటి దాడులను ఎలా తప్పించాలనే ఆలోచనకు కేటాయించలేకపోయా రెందుకు? ఈ నిష్క్రియాపరత్వంతో దేశభద్రత విషయంలో సమాధానపడ్డారా లేదా?

2001 లో అమెరికా మీద ఘోరమైన దాడి జరిగింది. ఆ తరవాత ఇంతవరకూ ఉగ్రవాద దాడి జరగలేదు. మన పార్లమెంటు మీద దాడి జరిగిన తరవాత, ఈ ఏడేళ్ళలోను ఎన్ని మార్లు దాడులు జరిగాయో గమనించారా? ఒక టైమ్‌టేబులు పెట్టుకుని, ఓ షెడ్యూలు ప్రకారం దాడులు చేస్తున్నారు సార్! ఏంటి వాళ్లకీ మనకీ ఉన్న తేడా?

పౌరులకు భద్రత కల్పించాలనే చిత్తశుద్ధి మీకుందా? ఫలానా సమయానికల్లా దేశంలో ఉగ్రవాదుల మహారాజ పోషకులను లేకుండా చేస్తాననే ఆత్మవిశ్వాసం, మరొక్ఖ ఉగ్రవాద ఘటన కూడా జరగనీయననే ఆత్మ విశ్వాసం -ఉందా మీకు? అవున్లే.. మీ హోమ్‌మంత్రి పైన మీకు విశ్వాసం లేదు -అయినా ఆయన్ని తీసెయ్యలేరు. ఇక మాకేం ధైర్యం చెప్పగలరు?

బయటి దేశాధినేతలకు మొహం చూపించడం సంగత్తరవాత.. మీ స్వంత దేశ పౌరులకు ఎదురుపడి, తలెత్తుకుని, సిగ్గు పడకుండా, కళ్ళలోకి చూసి మాట్టాడగలరా?

63 కామెంట్‌లు:

  1. ధన్యవాదాలు.
    మా అందరి తరపున ప్రధానిని నిలదీసినందుకు.
    పాపం అని ఆయన మీద ఒక పక్క జాలి కూడా వేస్తోంది.
    కీలుబొమ్మను తిట్టి ప్రయోజనం ఏమిటి?
    "కీ"ని చేతిలో ఉంచుకున్నవారిని అనాలి ఏమైనా అంటే.

    రిప్లయితొలగించండి
  2. I think now india has a good strategic advantage to bring pakistan to its knees. we have the weapon of nuclear deal and we also can use it to our benefit. there are around 20,000 jobs can be created by this deal and there is a lot of advantage to US. We can use this deal to ask US to handover dawood ibrahim and other Jaish-e-mohammed and lashkar-e-toiba leaders to india by using this deal. We shud just use it for our own benefit. We should blackmail US. Because now no construction had begun whatsoever, so there is nothing for us to loose. In one blog one of my friend has told we shud need a person like shivaji for India today. I beg to differ, today what we need is not shivaji we need a chanakya and i think he is the only best guy to handle a situation like this. I even don't understand why we are not striking targets in pakistan with missile just like US?????

    రిప్లయితొలగించండి
  3. @ spiritualindia - excellent ! But how to send your voice to big heads we should think about this. - Sravya

    రిప్లయితొలగించండి
  4. spiritualindia: మీ ఆలోచన బాగుంది. మనకిటువంటి అవాకాశాలు - ఇలా అమెరికాతో మన సంబంధాలను మనకనుకూలంగా వాడుకోగలిగే అవకాశాలు - గతంలోనూ వచ్చాయి. మనకాపాటి వ్యాపార తెలివితేటలే ఉంటే.. ఎయిరుబస్సులు కాదు, బోయింగు విమానాలను కొనితీరాల్సిందే అని అమెరికావోడు మన మెడలు వంచుతున్నరోజున చేసి ఉండొచ్చీ పని - ఈ పనిగాని, ఇలాంటిదే మరో పని గానీ!

    చూసారో లేదో, ఇప్పుడు గభాలున కొందరందుకుంటారు .. 'దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఎలా ఉంటాయో మీకు తెలిసినట్టు లేదు, దేని దారి దానిదే, ఒకదానితో ఒకటి కలపగూడదు, కలపరు అంటూ వస్తారు మన మేధావులు కొందరు. (అక్కడికేదో బోయింగు విమానాలనమ్ముకోడమే బుష్షు పనయినట్టు.)

    మీ వ్యాఖ్యకు నెనరులు

    రిప్లయితొలగించండి
  5. ప్రశ్నించాల్సిందే...ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే.

    మైనారిటీ మెజారిటీ (రాజకీయవాదాల)ల ప్రమేయం లేకుండా.హిందూ ముస్లిం తేడాలు ప్రస్తావించకుండా ప్రశ్నించడం నిజంగా కుదరదంటారా? మీరు సంధించిన ప్రశ్నల్లో నిజాలెంతున్నాయో,ఇజాలూ అంతేవున్నాయి. అది ప్రశ్నలకు సమాధానాల్నికాదు కదా సమస్యల్ని మరింత జటిలం చెయ్యడానికి మాత్రం పనికొస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. మంచి ప్రశ్న లేవదీసారు.

    ఇంత వరకు మన దేశం తీవ్రవాదాన్ని ఉపేక్షిస్తూ వుండానికి ఏకైక కారణం - మైనారిటి వర్గాల బుజ్జగింపే.

    అదే ఫ్రాన్స్ లో ని పారిస్ slums లో ముస్లిం మైనారిటీల పైన జరిగిన దాడుల్ని మన ప్రధాని ప్రస్తావించి వుంటే ఫ్రెంచి ప్రసిడెంటు నోర్ముసుకుని వుండే వాడు. సుప్రీం కోర్టు చెప్పినా కూడా అఫ్జాల్ గురుని ఊరి తీయకుండా రాజ్యాంగాన్ని అవమానించిన వారి నుంచి ఆశించడానికి ఇంతకంటే ఏమి వుంటుంది. ఇప్పటికి తీవ్రవాదాన్ని ఎదుర్కొనడానికి మనకు ఒక ఖచ్చితమైన జాతీయ విధానం లేదు.

    సోనియా, PM, హోం మినిస్టర్ - Bunch of Jokers.

    రిప్లయితొలగించండి
  7. "ఇంత వరకు మన దేశం తీవ్రవాదాన్ని ఉపేక్షిస్తూ వుండానికి ఏకైక కారణం - మైనారిటి వర్గాల బుజ్జగింపే ". ఇది వంద శాతం నిజం.

    రిప్లయితొలగించండి
  8. నిన్న టి.వి పెడితే, నాకు తట్టింది మీరడిగ చివరి ప్రశ్న యే.
    వీరు వీరితో పాటు, వీరి పార్టి కి చెందిన, వీరి కంతే మీడీయాలో పెరు పొందిన ఒక ఎం.పీ క్షతగ్రాత్రుల ను పరామర్సించటానికిలో లేక సందర్శించటనికో గాని, ఓ ఆసుపత్రి కి వెళ్లారు..
    ఏ మొహం పెట్టుకొని వెళ్లారో .. వారిని చూస్తున్నప్పుడు తమ వైఫల్యం ఎలా కనిపించలేదో
    పైగా ఇలా వెళ్లటం వల్ల, కొంత రక్షణ బలగాన్ని వీరి భద్రతకి కేటాయించాలి..
    వెళ్లి రావటం వల్ల సాధించింది ఏమిటో తెలియదు...
    ప్రాణాలు తెగించి పోరాడిన యోధులకు జోహారులు.
    అమరవీరులకు భక్తి పూర్వక నివాళులు..

    దురదృష్టమేమంటే - దేశభక్తి లోనూ కర్తవ్య దీక్షలోనూ తమ కాలిగోటికి సరిపోని రాజకీయ నాయకుల చేతిలో - రెపో యెల్లుండో ఈ జవానులు పతకాలు, ప్రసంశలు అందుకోవాల్సి రావటం.

    రిప్లయితొలగించండి
  9. Three sane voices:

    “It is extremely important to understand that the criminal activities of a minuscule group, even if it turns out to have home-grown elements, say nothing about Indian Muslims in general, who are an integral part of the country’s social fabric,”
    - AMARTYA SEN, the Harvard economist and Indian-born Nobel laureate.

    "Just as they tried to stoke a Shiite-Sunni civil war in Iraq, and failed, they are now trying to stoke a Hindu-Muslim civil war in India."
    -THOMAS L. FRIEDMAN Author of "The World is Flat"

    The problems of India, Pakistan, Afghanistan and Bangladesh are now bleeding into one another, and any purely national approach is not going to work. The best outcome of these attacks would be if they spurred cooperation and reform. If instead they feed rivalry, bitterness and finger-pointing, the victims will have died in vain, and there will be more victims and an insecure neighborhood.

    The crucial point is to remember the common enemy. When discussing causes and cures, never forget who is to blame first and foremost: the terrorists, the evil men who chose to deliberately kill innocent men, women and children, to burn young families to death. They are the ones who did it.
    - Fareed Zakaria, Editor of News Week.

    రిప్లయితొలగించండి
  10. చివరకి మన ప్రధాని గారు సోనియా కలిసి ఇంటి మంత్రి గారిని ఇంటికి పొమ్మన్నారట.
    ఈ వార్త విని ఎంతో అనందిస్తుండగా ఇంటి మంత్రి గారు నైతిక బాధ్యత వహిస్తు రాజీనామా చేసారని
    మీడియా అంత ఒకటె ఫ్లాష్ న్యూస్. నిజంగా నైతిక బాధ్యత వహిస్తే దాడి జరిగిన రోజే రాజీనామా చెయ్యొచ్చు కదా.

    పైగా రాజినామా చేసినందుకు ఏమైనా బాధ పడుతున్నారా అని అడిగితే అబ్బెబ్బే అలంటిదేం లేదు ఇప్పుడు చాలా రిలీఫ్ గా ఉండి అన్నాట్ట.చాలా బరువు దించేసుకున్నట్టు ఉంది అని ఒక వెధవ నవ్వు నవ్వుతూ చెప్పాట్ట.అది విని నాకు నవ్వాలో ఏడవాలో అర్ఠం కాలేదు. అంత బరువుగా ఫీల్ అవుతూ ఎవడు చెయ్యమన్నాట్ట. దోచుకున్నాల్లు దోచుకొని ప్రజల ప్రాణాల్ని లెక్క చెయ్యకుండా ఇన్నాళ్లూ ఒక అత్యున్నత పదవిననుభవించి ఇప్పుడు చేతులు దులిపేసుకున్నారు.

    రిప్లయితొలగించండి
  11. మహేష్,
    మీ ధోరణి నాకు అర్థం కావడం లేదు. ఇంటిదొంగలూ దేశద్రోహులను పట్టుకుంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు అన్నది నా ఉద్దేశ్యం. అలా పట్టుకోకపోవడానికి కారణం - మైనారిటీల బుజ్జగింపు, వాళ్ళమీద చూపుతున్న నిర్హేతుక పక్షపాతం అని నేనంటున్నాను. కాదంటే ఎలాగో చెప్పండి.

    వాళ్ళ పేరు వాడకుండా రాయలేమా అంటారేంటి? కొన్నివర్గాలు, ఓ మతానికి చెందినవారు,.. ఇలా రాయాలా? ఏంటీ మీ ఉద్దేశ్యం? నేను ముస్లిముల పేరు ఎత్తడమే మీకు కోపకారణమైతే, ఒక్క విషయం..

    మాలెగావ్‌ బాంబు పేలుడు కేసులో కొందరు హిందువులను అరెస్టు చేసి, దర్యాప్తు చేస్తున్నారు అన్న వార్త రాగానే మీరు హిందూ టెర్రరిజం అంటూ గొంతెత్తి అరచి సేమ్, షేమ్ అంటూ చంకలు గుద్దుకున్నారే, అంత తొందరపాటు చూపించారే! భయంకరమైన హిందూ వ్యతిరేకతను మీ రాతల్లో పరిచారే! మీరు వాడినమాట ఎంతవరకు సహేతుకమో ఆలోచించారా? హిందూ తీవ్రవాదమనేది లేదు అని మన దేశం కాదు, ఏకంగా ఒక పరాయి దేశ ప్రభుత్వమే నిర్ద్వంద్వంగా, విస్పష్టంగా ప్రకటించిన సంగతి మీకు వినబడిందా?

    మీది లౌకికవాదమా? కేవలం ముస్లిములైనంత మాత్రాన ఉగ్రవాదులను, వాళ్ళకు సాయపడే దేశద్రోహులను అలా అనకూడదా? మీరు మాత్రం హిందూ టెర్రరిజం అని యథేచ్ఛగా వాడెయ్యొచ్చా? ఇంత దారుణమైన హిందూ వ్యతిరేకతా? లౌకికవాదం ఎంత కుత్సితమైనది, భయంకరమైనది!!!

    కుహనా లౌకికవాదులు ఇన్నాళ్ళూ చేస్తున్న వాదనల కారణంగానే చర్యలు తీసుకోవాల్సిన చోట కూడా పోలీసులు నిష్క్రియగా ఉండి పోతున్నారు. "ముస్లిము ఉగ్రవాదులకు సాయం చేసే తుచ్ఛులు మన దేశంలో ఉన్నారు వాళ్ళ పీచమణచండి" అని సామాన్యులు ఆక్రోశిస్తే, మాన్యులైన మీవంటివారు ఇదిగో చూడండి, వీళ్ళు ముస్లిము సోదరులందరినీ అంటున్నారు అనే వాదాన్ని లేవదీయకుండా ఉంటే చాలు... ఏ చర్యలు తీసుకున్నా.. ఏ గొడవలూ రావు.

    దేవన అనంతం: ఫ్రాన్సు గొడవలు - సరిగ్గా నాకూ ఇదే ఆలోచన వచ్చింది, గతంలో ఈ జాబులో రాసాను.

    krishna rao jallipalli: హిట్లరక్కరలేదండి.. దొంగ లౌకికవాది కాకుండా ఉంటే చాలనుకుంటా

    ఊకదంపుడు: "దేశభక్తి లోనూ కర్తవ్య దీక్షలోనూ తమ కాలిగోటికి సరిపోని రాజకీయ నాయకుల.." - సరిగ్గా చెప్పారు.

    srinivasa krishna, చైతన్య,: మీ ఆలోచనలు చెప్పినందుకు నెనరులు

    రిప్లయితొలగించండి
  12. డాక్టరు గారూ, ఇవి మతున్నవాళ్ళు మాట్టాడే మాటలు నావి మతిలేనివన్నమాట! భలే!!

    1. ముస్లిములు భారత సామాజిక వ్యవస్థలో భాగం! కాదని ఎవరన్నారు? ఎవరైనా అనగలరా? మొద్దు శీను కాదా? వీరప్పన్ కాదా? అంతమాత్రాన వాళ్ళను వదిలామా? అలాగే దేశద్రోహులైన ఎవరినీ వదలొద్దు అని అంటున్నాను. వాళ్ళు ముస్లిములైతే ఏంటి హిందువులైతే ఏంటి? ముస్లిము ఉగ్రవాదులకు అండనిచ్చే ఇంటిదొంగల పనిపట్టండి అంటే దానర్థం జనరలుగా ముస్లిములందర్నీ అన్నట్టా? ఆశ్చర్యంగా ఉండే! అది మీ భావమా? అమర్త్యసేనుదా?

    2. ఈ ఫ్రైడ్‌మానో ఫ్రీడ్‌మానో గానీ సరిగ్గా చెప్పాడు. కానీ నాదో ప్రశ్న.. అక్కడ ముస్లిములకు వాళ్ళలో వాళ్ళకి పెట్టబోయారు, ఇక్కడ ముస్లిములకీ, హిందువులకీ పెట్టబోయారు, అమెరికాలో, స్పెయినులో, .. ఇలా ప్రపంచంలోని అనేకచోట్ల ముస్లిములకీ క్రైస్తవులకీ పెట్టబోయారు.. ఎందుకిలా? ఇంకో ప్రశ్న.. బయటినుండి వచ్చినవాడు ఇక్కడ తీరుబడిగా మనమధ్య తంపులు ఎలా పెట్టగలుగుతున్నారు? అంత వెసులుబాటు వాళ్ళకెక్కడిది? ఆయనకి తెలుసోలేదో మరి?

    3. సరే ఈయనన్నట్టే కోపరేషను పెట్టుకుందాం. ఆఫ్ఘనిస్తానులో ప్రభుత్వం ఒకటేదో ఉన్నట్టుంది.. దానికో అధ్యక్షుడూ ఉన్నాడు.. కర్జాయనుకుంటా ఆయన పేరు. ఆయనతో మాట్టాడదాం. మరి పాకిస్తానులో ఎవరితో మాట్టాడదాం? ప్రధానమంత్రి తోనా, అధ్యక్షుడితోనా? సరే ఇద్దరితో పెట్టుకుందాం. మరి కియానీతో ఎవరు మాట్టాడతారు? అయ్యస్సైతో ఎవరు, ఎప్పుడు మాట్టాడతారు? (వాళ్ళు లెట్లకూ, జెమ్ములకూ శిక్షణనివ్వడంలో చాలా బిజీగా ఉన్నారే!) మీరీ సంగతి వినే ఉంటారు.. మన ప్రధానమంత్రితో పాక్ ప్రధానో, అధ్యక్షుడో (ఏ సత్రకాయయితేనేం లెండి) మాట్టాడుతూ అయ్యస్సై ఛీఫును చర్చల కోసం ఢిల్లీ పంపిస్తామని ఒప్పుకున్నారు. తీరా కియానీ ఒప్పుకోలేదట.. మరొకణ్ణెవణ్ణో పంపిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి కోపరేషను ఎవరితోటి చెయ్యాలి? ప్రధాని? ప్రెసిడెంటు, సైన్యాధ్యక్షుడు, అయ్యస్సై?

    రిప్లయితొలగించండి
  13. మన దేశంలోని రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రక్రియలో భాగమే ఇదంతా...ఇద్దరూ కొట్టుకొని దేశం విచ్ఛిన్నమైతే చాలని కూర్చొన్న గోతికాడ నక్కలకు మంచి విందే పెడుతున్నారు. మన తెలుగు బ్లాగులు రాసే ప్రతి ఒక్కరికీ ఒక వినతి: మీకు ఏ ఒక్క ముస్లింతో నైనా ముఖపరిచయం ఉంటుంది కదా? దయచేసి "మీకున్న పరిచయాల్లో"ని భారతముస్లింలలో మీకన్పించిన తీవ్రవాదం, దేశద్రోహం, అరాచకత్వం ఎంత శాతమో గుండె మీద చేయి వేసుకొని నిజాయితీగా చెప్పండి/రాయండి. అలాగే "మీరు చూసిన", "మీకు తెలిసిన" ముస్లిం కుటుంబాల్లో ఎంత మంది మన ప్రభుత్వాల చేత దువ్వబడి ఆర్థికంగా, సామాజికంగా బలపడి సుఖాలనుభవిస్తున్నారో తెలియజేయండి. అప్పుడు ఓ అర్థవంతమైన చర్చకు మన బ్లాగులు వేదిక అవుతాయి.

    రిప్లయితొలగించండి
  14. చదువరి గారూ...

    ఇక్కడ "Sane" అన్న పదం ఉపయోగించంది మిమ్మల్ని ఉద్దేశించి కాదు. Generalizedగా వాడానంతే. నొప్పించి ఉంటే క్షమించండి. ఇక నా సమాధానాలు:

    1. మరి "మొద్దు శీను" అనే వ్యక్తి పేరు బదులు ఓ వర్గాన్నో మరేదాన్నో మనం ముందుకు తీసుకురాలేదుగా. "వీరప్పన్"ను చూయించి తమిళులంతా ఇంతే అని అనలేదుగా. అందుకే కొంత మంది "evilness"ని ఓ వర్గానికి ఎలా ఆపాదిస్తారు మీరు?

    2.ఎలా పెట్టగలుగుతున్నాడంటే? మనం వాళ్ల బుట్టలో పడగలుగుతున్నాం కాబట్టే! ఒక దేశం మీద కక్షతోనే, ఒక జీవన విధానం మీద కక్షతోనో, లేదా వారి స్వంత ఎజండాల(ఉదా.కాశ్మీరు, ఇరాక్,..వగైరా) కోసమో ఏం జరిగినా ఇది "ముస్లిం తీవ్రవాదం", "Islamofascism" అని మతాన్ని ఎత్తి చూపే క్రమంలో ఎంత హాని జరుగుతోందో మీకు తెలియదా?

    3.మనకున్నట్లే అన్ని దేశాల్లోనూ వ్యతిరేక వాదాలుంటాయి. ఇండియాతో ఒక్క మంచి మాట మాట్లాడితే వారిని దేశద్రోహులుగా చిత్రించే పరిస్థితులు వారి రాజకీయనాయకులకు ఉంటాయి. ఇంతకన్నా ఈ విషయంలో (అంటే 3వ ప్రశ్న విషయంలో) ఏం చెప్పలేను.

    ఎంతో కొంత చదువుకొని,అవగాహన ఉన్న మనలాంటి వాళ్లకే ఇన్ని భేదాభిప్రాయాలున్నప్పుడు, ఇలాంటి సంఘటనల వల్ల నిరక్ష్యరాస్యులై,సొంత జ్ఞానం లేక, విచక్షణ కరువై ఏ నాయకుడు ఏది చెబితే అది విని తలలూపే వారి వల్ల పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో కదా అనే నా బాధ.

    రిప్లయితొలగించండి
  15. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  16. డాక్టరు గారూ, "మీకున్న పరిచయాల్లో", "మీరు చూసిన", "మీకు తెలిసిన" -- ఈ మాటలనడంలో 'అటువంటివాళ్ళు తక్కువ' అని చెప్పడం మీ ఉద్దేశ్యమని నేను అనుకుంటాను. అలా అయితే మీ వాదనతో నేను ఏకీభవిస్తాను. కానీ ఉన్న అ కొద్దిమందినే శిక్షించాలంటున్నాను.

    sane: ఏంపర్లేదు, నేను అపార్థం చేసుకోలేదు. మీ సంగతి నాకు తెలుసు. నేను సరదాగానే రాసాను.

    రిప్లయితొలగించండి
  17. ఇస్మాయిల్ గారూ, మరో సంగతి..
    పేర్లు చెప్పొచ్చు గదా అన్నారు.. నాకు ఫలానా వ్యక్తి ఉగ్రవాదులకు సాయం చేస్తున్నాడు అని తెలిస్తే అలాగే అని ఉందును. బంగ్లాదేశీయులకు హై.లోను, ఇంకా ఇతరచోట్లా ఆశ్రయమిచ్చినవాళ్ళు ఎవరని చెప్పను? సిమి వాళ్ళ గ్రంథాలయాల్లోకి ఎవరెవరు వస్తారో ఎలా చెప్పను? పేర్లు తెలీకే కదండి ఆశ్రయమిచ్చే వాళ్ళను ముస్లిములని చూడొద్దు, శిక్షించండి అని అంటున్నది.

    రిప్లయితొలగించండి
  18. చివరి అజ్ఞాత: మహేష్ మీద మీరు చేసిన వ్యాఖ్య నాకు ఆమోదయోగ్యం కాదు, తీసెయ్యండి.

    రిప్లయితొలగించండి
  19. మన వంట్లో భాగమే బాధపెడుతుందని కీమొథెరపి చెయ్యించకుండా వుంటామా కేన్సర్ రోగానికి..అవసరమయితే తీసెయ్యాల్సి ఉంటుంది ఆ భాగాన్ని..ఇదీ అంతే నరికి పారెయ్యడమే నిర్దాక్షిణ్యంగా..లేకపోతే వళ్ళంతా పాకి మన(భారత దేశపు)ఉనికినే లేకుండా చేస్తుంది ఈ ఉగ్రవాదం అనే కేన్సర్..

    రిప్లయితొలగించండి
  20. " మన తెలుగు బ్లాగులు రాసే ప్రతి ఒక్కరికీ ఒక వినతి: " .... అంటే మీ ఉద్దేశం .. పేర్లు చెప్ప గలిగితేనే రాయండి. అనా ? పోలీసులు, ఇంటెలిజెన్స్ వారే చెప్పలేక పోతున్నారు. ఈ విషయం మీకు తెలుసు. ఇక మన సంగతి... ఎలాగు చెప్పలేం కాబట్టి వారి గురించి మాట్లాడకండి అనా మీ అర్థం ? లోకల్ సహాయం లేకుండానే ఇన్ని జరుగుతున్నాయి..ఇదా మీ అభిప్రాయం !!!

    బషీర్ హై. మదర్సా లో ఉన్నాడు అన్న విషయం నిజం కాదా ?
    అఫ్జల్ గురూ విషయం ఏంటి ?

    ఇన్ని జరిగాక కూడా ఋజువులు కావాలా? ఇదే ఏ ముస్లిం కంట్రీ లో ఉంటే ఈ విధంగా మాట్లడగలిగే వారా ?

    "గుండె మీద చేయి వేసుకొని నిజాయితీగా చెప్పండి/రాయండి" మీరన్నది బాగుంది. మరి అదేవిధంగా మీరు గుండె మీద చేయి వేసుకొని చెప్ప గలరా లోకల్ ముస్లిం ల ప్రమేయం లేకుండా ఇవన్ని జరుగుతున్నాయి... అని ?
    కొంత మంది సపోర్ట్ ఉంది అన్న విషయం మీరు , నేను కూడా ఒప్పుకోని తీరవలసిన విషయం.

    రిప్లయితొలగించండి
  21. Chaduvari Garu,

    Thanks.

    Wanna say a quick thing to Dr Ismail here since I am in a hurry.

    I don't think Mr Fareed Zakaria gets it. He opined on Bill Maher show that, "Terrorists will not attack Americans, if Barack Obama is elected President, as his middle name is Hussein".

    Don't believe me..Search on youtube and you can find it.

    And,

    He also said that, one of the reasons he supports Obama is that, if a guy with the name 'Hussein' becomes elected, he(Fareed) will be very comfortable with America because his name is 'Omar'..

    Searchin CNN articles, you will find that quote..

    Now, tell me if he is "Sane"!

    I used to have high respect for him, but not I don't.

    Thanks

    రిప్లయితొలగించండి
  22. నిందాకా ఒక టీవీ ఛానల్ లో లైవ్ డిస్కషన్ లో సిమిగేర్వాల్ ,నారిమన్ హౌస్ పక్కన వున్న గుడిసెల్లో పాక్ జెండాలు ఎగురుతుంటాయి ఇంతకన్న నిదర్శనం ఏమి కావాలి అన్నందుకు ఒక ముస్లిం యువకుడు ఒంటి కాలి మీద లేచాడు ,బర్కదత్ టాపిక్ మర్చి వేడిని చలర్చిన్డి.హైదరాబాద్ లో కూడా చార్మినార్ ప్రాంతం వెళ్లి చుస్తే బార్కాస్ లాంటి చోట్ల పాకిస్తాన్ లో వున్నా భావమే కలుగుతుంది.అక్కడ ఎలక్ట్రిక్ మీటర్ రీడింగ్ రాసుకుందుకు ఉద్యోగిని లోపలికి రానియరు .వాళ్ళెంత రీడింగ్ చెపితే అంతే రాసుకుని పోవాలి.వాటర్ బిల్లు. ప్రోపెర్తి tax లాంటివి ఎవరు ఇచ్చే సాహసం చెయ్యరు ఇచ్చినా కట్టే వారెవరు లేరు. ఎవరైనా commisioner తీవ్ర వాదులు అన్న సాక్ష్యాలతో సహా పాత బస్తి వెళ్లి అరెస్టు చేద్దామనుకునే లోపు అతని కి transfer ఆర్డర్స్ వచ్చేస్తాయి హైదరాబాద్ mp గారి మేహర్భాని తో.చట్టం తన పని తాను చేసుకు పోతుంది వదిలై ఒవైసీ అనే ధైర్యం cm కి వచ్చిన రోజు లష్కేర్ లో తోయిబాలు పోఇన రోజు.

    రిప్లయితొలగించండి
  23. అంతా బానే రాసారు గానీ ఒక దగ్గర కొంచెం పొరపాటు జరిగింది. ఈ లేఖ ను మీరు భారత ప్రధాన మంత్రి ని ఉద్దేశించి రాయకుండా ఏ చైనీజ్ ప్రీమియర్ కో లేక సరదాగా మెద్వెయెవ్ కో రాయాల్సింది. మీకో 'మేన్-బ్లాగర్' ప్రైజ్ ఇచ్చుండే వాళ్ళు.

    హైదరాబాద్ లో కూడా పాకిస్తాన్ జెండాలు ఎగురుతూ ఉంటాయిట ! మోలానా అసద్, ఒసామా ల చిత్ర పటాలు కూడా పెట్టుకుంటారట. .. ఉగ్రవాదం పెరగడానికి బీదరికం, మతోన్మాదం ముఖ్య కారణం. మతం అనే మత్తు మందు నూ, బీద కుటుంబాల పిల్లలకు లక్షల కొద్దీ డబ్బులిస్తూ ఉంటే, వాళ్ళు తీవ్ర వాదం మీద ఆధారపడటం మొదలు పెట్టరూ ?

    అయితే దురదృష్టవశాత్తూ - నెలకొక బాంబు దాడి చొప్పున గడిచిన ఈ ఏడాది - ఇపుడు ఇలాంటి ఘోరకలి కూడా చూపించింది.

    టీవీ చూసి చూసి, విసిగిపోయి, నిద్ర పోయీ ముందు, తెల్లరికల్లా అయిపోతుంది లే అనుకుని పొద్దున్నే టీవీ వేస్కుని 'అయ్యో - ఇంకా కాలేదా?' అని గొణుక్కుంటూ గడిపిన మనం - ఆర్మీ నీ, కమేండో లనూ - చీర్ చేసిన జనాన్ని, భారత్ మాతాకీ జై అంటూ చేసిన నినాదాల్ని చూసిన మనం, ఇలాంటివాట్ని ఎదుర్కొంటాం లెండి. - ఎంత సేపూ పిల్లల్ని ఇంజనీరింగూ, డాక్టరూ, ఐ.ఐ.టీ, ఎం.బీ.యే చదివించి అమెరికా పంపించేద్దాం అనుకునే మధ్య తరగతీ వోటర్లూ, ఒక వంద నోటు కీ, బిర్యానీ పేకెట్టుకీ, చీప్ లిక్కరు కీ తమ సార్వభౌమత్వాన్ని అమ్ముకునే దిగువ తరగతి వోటర్లూ కళ్ళు తెరుచుకోవడమే ఆలస్యం.

    రిప్లయితొలగించండి
  24. ఇస్మాయిల్ గారు,
    ఇందాక బయటేకెళ్ళే తొందరలో రెండవ పాయింటు సరిగ్గా రాయలేదు.

    ఫరీద్ కుమారుడి పేరు 'ఒమార్" . నా కొడుకు పేరు ముస్లిం పేరు కాబట్టి, అమెరికా ముస్లిం మిడిల్ నేమ్ ఉన్న ప్రసిడెంట్ ని ఎన్నుకుంటే నేనీ దేశం లో ఎక్కువ comfortable గా ఉంటాను అన్న వ్యాఖ్య అలాంటి accomplished person దగ్గర్నుంచి expect చేయను నేను.

    అలాగే, ముస్లిమ్ మిడిల్ నేం ఉన్నవాణ్ణి ఎన్నుకుంటే, ముస్లిం ఉగ్రవాదులు అమెరికన్స్ ని అటాక్ చేయరు అన్నఆయన స్టేట్మెంట్ నేను చూస్తున్నప్పుడు నేను సోఫా లోంచి కిందపడ్డా. నవ్వాలో, ఏడవాలో తెలీలేదు నాకు. Wonder what he says now!! He may have forgotten that India had Muslim Presidents too, and that didn't prevent anything.

    పోనీ ఆయన కేమీ తెలీ దా అంటే, అతను Newsweek's international editor. ఆయన అమ్మ గారు, ఒకప్పుడు ఇండియాలో వచ్చే Illustrated Weekly లో Sunday Editionకి ఎదిటర్. వాళ్ళ నాన్న గారు, కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీ ప్రసిడెంట్ గానో ఏమో వుండేవారు. ఫరీదే స్వయంగా Yale and Harvard Educated. At one point of time he was widely touted as future Secratery of State. He socializes with people like Henry Kissinger..

    Yes, at least those two statements from him are NOT SANE and certainly represents an undertone of 'Religious Bias".

    రిప్లయితొలగించండి
  25. చదువరి,
    1. చాలా బాగా రాశారు.
    2. ఈ విధమైన జనాభిప్రాయాన్ని నాయ్కత్వం దృష్టికి తీసుకు వెళ్ళే పని ఏదైనా చేపట్టాలి మనం. దీనికి తగిన కార్యాచరణ ప్రణాళిక ఏదైనా ఆలోచించండి.
    3. ఇటువంటి లేఖ ఒకటి మీరు డ్రాఫ్ట్ చేస్తే ప్రధానికి, ముఖ్య మంత్రికి, మన నియోజక వర్గ ఎంపీకి "తెలుగు బ్లాగర్లు" అనే పేరిట పంపవచ్చు. సంతకం పెట్టేందుకు నేను సిద్ధం.
    4. లేఖలో emotional rhetoric ని ఒక పాలు తగ్గించి, కనీస డిమాండ్లని స్పష్టంగా వినిపించాలని నా ఉద్దేశం.
    5. ఇదే లేఖ ప్రతిని హైదరాబాదు నించి వెలువడే ప్రముఖ తెలుగు ఆంగ్ల దినపత్రికలన్నిటికీ పంపాలి.

    రిప్లయితొలగించండి
  26. @kumar, By starting to talk about Fareed, we may be getting away from the point under discussion. I feel that, just because he said something less than brilliant on a TV talk show, we need to write him off. Among the hundreds of cacophonic "expert" voices I have been hearing on the American mainstream media, he certainly is a sane voice (at least in my book):)

    రిప్లయితొలగించండి
  27. ఇస్మాయిల్ గారూ, మీరు చూపించిన ఫరీద్ కోట్ ని పట్టుకున్నా.. అదే ఆర్టికల్ లో ఆయన చెప్పిన క్రింద మాటలు, అది చదివి furious అయిపోయిన చాలా మంది ఇండియన్స్ కామెంట్లు, భలే వదెలేసారే మీరు?

    "Muslims there(in India) are disaffected and vulnerable to manipulation. They are underrepresented at every economic, political and social level—with a few high-profile exceptions. A perverse consequence of the partition of the Indian subcontinent is that Muslims are everywhere a minority—which closes off the chance at political power. (The parts of British India that had Muslim majorities became Pakistan and Bangladesh.) They have not shared in the progress of the last two decades and face a Hindu nationalist movement, parts of which are ugly and violent. None of this is to excuse in any sense the cruel choice anyone might make to join a jihad. But moral clarity does not always yield intellectual clarity."

    ఓహో, అయితే డెమొక్రసీ దేశాల్లో, అన్ని ethnic groups కీ వాళ్ళ వాళ్ళ జనాభా శాతాన్ని బట్టి ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి అన్నమాట!! లేకపోతే వాళ్ళలో కోపాన్ని ఇలా మనుషుల్ని(వేలకొద్దీ)blowup చేసి జస్టిఫై చేసుకోవచ్చన్న మాట.

    అయితే, మన దేశంలో మహిళలు, దళితులు, రక రకాల వెనుకబడిన వర్గాల వారు, ఈశాన్య రాష్ట్ర ప్రజలు, ఇంకొంచెం దిగితే Gays..వీళ్ళందరికీ సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభించట్లేదే, మరి వాళ్ళేమీ నడుములకి బాంబు బెల్టులు పెట్టుకొని వీధుల్లోకి ఉరకట్లేదే?

    అయినా నాకు తెలీకడుగుతానూ, ఆ ఒవైసీ గాడి ముడ్డి(క్షమించాలి) వెనకాల తిరక్కుండా, ఆ ముస్లిం యువత అంతా కొంచెం చదువుకొని, మోడరేట్ వ్యూస్ తో రాజకీయాల్లోకి వస్తే, భారత దేశం వాళ్ళకి వోట్లేయదా? ఎప్పుడబ్బా భారత ప్రజలు కేవలం ముస్లింస్ కాబట్టి, వాళ్ళకి అవకాశాల్ని ఇవ్వంది? క్రికెట్ లో కాని, ఫిలిం ఇండస్ట్రీ లో కాని, టెన్నిస్ లో కాని మన ఆరాధ్య దైవాలు చాలా మందే ఉన్నారే?

    ఇంతకీ ఈయన్నేనా సార్ మీరు Sane Voice అంది?!!!!!!!!!!!

    రిప్లయితొలగించండి
  28. Kottapaali Garu,
    I just saw your comment. Yes you are right..
    Fareed is not only a brilliant guy. He is not a fundamentalist muslim at all. I know him for many years, and I read his books too.

    Also, he probably is one of the very very few TV pundits out there, who knows what he is talking about especially on Foreign Policy. He was one of the Neo-Con who supported Iraq War in the begining, and didn't shy away from criticizing the administration when the strategy didn't go well.

    By pointing out comments like above, I know that I am running into the risk of being a "bomb-thrower" myself. I would like to clarify to the whole world that, I am not that kind of a guy.

    Most of the times, I try to 'bring up the opposite side" to what is presented in the blog. That doesn't mean that what I write is the complete picture of that person/view. Unfortunately if I have to start clarifying myself all the time, and write full comprehensive views of a person/idealogy/view, then I have to spend lots of time.

    My idea is that, if I throw up the alternative side , people who read blogs can make up their minds.

    If someone accuses me of being only one-sided, I then acknowledge and explain the opposite-side too like I did with Mr Abrakadabra by writing 2 pages of ugliness that exists in Republican Party.

    Having said all that, if Fareed Zakaria assists Secratary of State's office, I will be the first person who would be happy, 'coz I know how much of stuff he knows not only on foreign policy, but also on changing economic dynamics in the world.

    I will take your advice and hope to write both sides in future, but I can't promise all the time. Most of these mis-conceptions can be clarified, if I have my own blog, but Phew..

    రిప్లయితొలగించండి
  29. అందరికీ నిజాయితీగా ఒక ప్రశ్న?

    ఇది rhetorical question కాదు. I am not trying to stereotype here నిజంగానే అడుగుతున్నా..

    అన్ని టెర్రరిస్టు అటాక్స్ లోనూ ఒక్క ముస్లింస్ మాత్రమే ఎందుకుంటున్నారు?

    WHY ONLY MUSLMIS? WHY?

    రిప్లయితొలగించండి
  30. తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు ఇలా రాసారు:

    మైనారిటీల్ని బుజ్జగించడాన్ని ఒక శాశ్వత పాలసీగా అవలంబించిన ప్రభుత్వం ఆ మైనారిటీ వర్గాలకి చెందిన నేరస్థుల్ని బహిరంగంగా కాపాడుతూ మెజారిటీ వర్గపు భద్రతని గాలికొదిలేస్తే ఎంతకాలం పాటు మెజారిటీ వాళ్ళు భరించాలి ? ఎంతకాలం పాటు తమని తాము రక్షించుకోకుండా చేతులు ముడుచుక్కూర్చోవాలి ? మైనారిటీల చేతుల్లో చచ్చిపోతేనే మెజారిటీ వాళ్ళు మంచివాళ్ళు. లేదా మెజారిటీవాళ్ళంతా మైనారిటీ మతాల్లోకి మారడానికి అంగీకరిస్తేనో, ఎవడైనా అలా మారుతూంటే చూస్తూ ఊరుకుంటేనో మెజారిటీవాళ్ళు మంచివాళ్ళు. మత ప్రాతిపదికన జరుగుతున్న అన్యాయాలకి వ్యతిరేకంగా తిరగబడితే మాత్రం "హిందువులకి సహనం తగ్గింది, హిందువులు టెఱ్ఱరిస్టులు" వహ్వా ! ఏమి న్యాయం ? ఏమి లౌకిక వాదం ? ప్రభుత్వం తన పని తాను సక్రమంగా చేస్తే మెజారిటీవాళ్ళు ఆయుధాలు ధరించే అవసరం ఎందుకొస్తుంది ? అలా తమని తాము రక్షించుకున్నందుకు మెజారిటీవాళ్ళు టెఱ్ఱరిస్టులవుతారా ? అలా అయితే శ్రీకృష్ణదేవరాయలు, శివాజి, రాణా ప్రతాప్, గురు గోబిందసింగు అందఱూ టెఱ్ఱరిస్టులే అవుతారు. మత ప్రాతిపదికన మెజారిటీ వాళ్ళని ఊచకోత కోస్తున్నప్పుడు ఉగ్రవాదుల యొక్క వ్యక్తిగత మతగుర్తింపుని ప్రస్తావించకుండా సమస్య లోతుని అవగాహన చేసుకోవడం అసాధ్యం.
    -----------------
    (ఆయన వ్యాఖ్యను పంపించబోయినపుడు ఈ పేజీలో ఏదో ఇబ్బంది రావడం వలన నేరుగా ఈ బ్లాగరికి పంపించారు.)

    రిప్లయితొలగించండి
  31. కొత్తపాళీగారు,

    ఉత్తరాలు అవీ అన్నీ దండగ. మనదంతా కంట (రాత) శోష . ఇలాంటి ఉత్తరాలు లక్ష ఇచ్చినా, చూస్తాము, చేస్తాము అంటారే తప్ప పని జరగదు. అంతెందుకు దాడి జరిగిన మరునాడు ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు ఇద్దరూ ఎవరి దారిన వారు వచ్చి బాధితులను పరామర్శించారు. ఈ విపత్తు సమయంలొ కూడా కలవాలనే కనీస మర్యాద కూడ లేదు. ఇక మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి,, పెద్ద పెద్ద నగరాల్లొ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. (లైట్ తీసుకోవాలనా) అంటాడు. పైగా నేనెందుకు రాజీనామా చేస్తాను అంటాడు. తీవ్రవాదులు మాత్రం దేశంలో తమ దాడులు కొనసాగుతాయని మీడియాకు మెయిల్స్ చేసారు. కొద్ది రోజుల తర్వాత ఇలాంటి సంఘటన కోసం ఎదురుచూద్ధాం. మళ్లీ ఇలాగే ఆక్రోశిద్ధాం. పార్లమెంటు దాడి నిందితులకు సుప్రీం కోర్టు వేసిన శిక్ష ఇంతవరకు అమలు జరపలేదు. వాళ్లను ఎంచక్కా జైలులో మేపుతున్నారు. మిగతా బాంబు దాడిలో పట్టుకున్నవాళ్లను కూడా విచారిస్తున్నారు. ఈ విచారణ అవసరమా.. కాల్చేస్తే సరిపోదు. ఈసారి మన హైదరాబాదులోనే ఇలాంటి దాడుల కోసం ఎదురుచూడాలి. అప్పుడు కూడా ప్రభుత్వం ఏమీ చేయదు. చింతిస్తున్నాం, ఖండిస్తున్నాం. అని డైలాగులు తప్ప.. అసలు ఈ తీవ్రవాదుల సంగతి సైన్యానికి అప్పచెప్తే సరి. మూడు రోజుల్లో మొత్తం అన్ని రాష్ట్రాల్లో తీవ్రావాదులను వెతికి మరీ కాల్చేస్తారు. ఎవరెవరు ఎక్కడెక్కడున్నారు మొత్తం వివరాలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి.కాని వాళ్లు తమకనుకూలమైనవారిని వదిలేస్తారు, కాని వారిని చంపేస్తారు. ఎక్కడా కేసులుండవు. మన ప్రాణాల మీద ఆశలు వదులుకొని కొన్ని జాగ్రత్తలు ఇప్పటినుండే పాటించాలి.

    1. ఆస్థి గట్రా ఉంటే వీలునామా రాసి పెట్టుకోండి. (ఎందుకంటే మనం ఎప్పుడు పోతామో తెలీదు కదా)

    2. అందరు తమ ఇంటి అడ్రస్సు, ఫోన్ నంబరు, బంధువుల నంబర్లు రాసిన చిట్టీలు తమ పర్సులలో , జేబులలో, పిల్లల బ్యాగులలో పెట్టుకోవాలి.

    3. ఎక్కువమంది పిల్లలను కనండి. ఇటువంటి దాడుల్లో కొందరు పోయినా, మరికొందరు ఉంటారనే ధీమా ఉంటుంది కదా

    (ఈ సలహాలు ఖదీర్ గారు ఇచ్చినవి. బాగున్నాయి. ఆలోచించాల్సిందే మరి వేరే దారి లేదు.)

    రిప్లయితొలగించండి
  32. Thanks to all those who have participated.

    I am really bothered that no one has questioned the gross root problesm here.

    Be it muslim or Hindu , we are suffering from corruption here. even though the terrorists belong to muslim religion ,they are bribing hindus and getting away with it.e.g., dawood ibrahim had given money to encounter specialist and used him to kill the opposition gang members. Who has done the mistake here?
    a Hindu.

    -Few days back a Navy major has given permission to go to mubai a few people because that major was given a bribe.

    - Every one blames politicians at this point saying they are corrupt, are we not? if you see any s/w engr the so called genuine tax payers, they sumbit fake monthly rental bills.
    i mean the majority here. every one is corrupt with in our own limits. since we do not have a chance to get a bribe we are not like politicians who has a chance to.

    and for Dr ismail, Yes in a way you are right, people neeed one or the other reason to fight,
    Caste,Religion, Region, color....etc.I have a few muslim friends and close relations with them too. but when it comes to religion they are really franatic. this is most mind boggling question to me. if muslims were against terrorism, why so many had attacked DGP office in hyderabad when gujarath police came here arrest a suspect?

    when people say all muslims or all hindus , it means the majority, not the 100%.

    రిప్లయితొలగించండి
  33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  34. "Most of the times, I try to 'bring up the opposite side' to what is presented in the blog. That doesn't mean that what I write is the complete picture of that person/view." @kumar:నా మనస్సులోని భావాలను మీ అక్షరాలు ప్రతిఫలిస్తున్నాయి.

    ఇక ఇంత వరకూ వచ్చింది కాబట్టి నేనూ వివరణ ఇచ్చుకోవాలి: ఈ దేశంలో పుట్టిన ప్రతి ముస్లిం తనకు దేశభక్తి ఉందని నిరూపించుకోవాలి, అదే వేరే ఏ మతం వారైనా by default దేశభక్తి ఉన్నవారే. అసలు హిందూ అన్నది ఒక మతం కాదు జీవన విధానం(సింధు నదికి ఆవల ఉన్నవారికి పెట్టిన పేరని ఎవరికీ తెలియనది కాదు). 1500ల్లో కూడా శైవ మతం, వైష్ణవ మతం అంటూ ఉన్నాయే కానీ హిందూ మతం అని లేదు(చూ.ఆముక్తమాల్యద:-)). అసలు నేను హిందువును అని చెప్పుకొనేందుకు గర్వపడతాను, కాదని ఎవరనగలరు?

    ఇక విషయానికి వస్తే ముస్లిం, ముస్లిం అని ఆ మతాన్ని, మతావలంబీకులను కొంత మంది స్వప్రయోజనాల కారణంగా ఓ పెద్ద భూతంగా చిత్రిస్తున్నారు. అందువల్ల సమస్యను జటిలం చేస్తున్నారే కానీ పరిష్కారానికి బాటలు వేయడం లేదు. ఓ అఫ్జల్ గురు కానీ, మసూద్ షేక్ కానీ, అమాయక ప్రజల హననానికి ఒడిగట్టిన తీవ్రవాదులు గానీ వారి నేరం నిరూపించబడినప్పుడు ఉరికంబం ఎక్కాల్సిందే, వారిని ఉరి తీయాల్సిందే. కాదని ఎవరూ వాదించడం లేదు. కానీ వారి అకృత్యాలకు మిగతా అందరినీ దోషులుగా నిలబెట్టడం ఘర్హనీయం.

    స్థానిక సహకారం అందుతోంది, అదీ కాదనడం లేదు. ఆ కలుపు మొక్కల్ని ఏరిపారేయాల్సిందే, కానీ సమస్య మూలాల్లోకి పోకుండా కలుపు తీసి ప్రయోజనం లేదు. ఒకసారి సచార్ కమిషన్ రిపోర్టు (highly politicized అంటారా...సరే దానిలో 20-30% శాతమన్నా నిజమని నమ్మినా) చూస్తే భారత ముస్లింల పరిస్థితి అర్థమవుతుంది. అది వారి స్వయంకృతం అంటారా? మరి ఇతర వర్గాల, కులాల వెనుకబడినతనం స్వయంకృతం కాదా?

    నేను మొండిగా ముస్లింలను వెనకేసుకు రావడం లేదు, చాలా మంది విద్యావంతులు సైతం ముస్లింలు ఇబ్బడిముబ్బడిగా పిల్లలను పుట్టిస్తారని, పాకిస్థానుకు వంత పాడుతారని ఓ అంచనాకు వచ్చేసి ఉంటారు. మరి ముస్లింలను మినహాయించి మన దేశ జనాభా లెక్కలేస్తే birth rateలో తేడాలు కనిపిస్తాయా? పాకిస్థానుది ఓ అసహజ పుట్టుక, దానికి మంత్రసానిత్వం వహించిన బ్రిటిషు వారు పడుతున్న పాట్లు జగద్విదితమే!

    ఇక Fareed Zakaria గురించి కొత్తపాళీ గారిని మించి నేను చెప్పేదేమీ లేదు, ఆయన రాసిన Post-American World ఓ ఆసక్తికరమైన పుస్తకం అని తప్ప. అలాగే emotional rhetoricను తగ్గించినా, తగ్గించకున్నా ఈ లేఖపై సంతకం పెట్టేందుకు నేను సిద్ధం.

    చివరగా నేను చెప్పేదేమంటే "My idea is that, if I throw up the alternative side , people who read blogs can make up their minds."

    PS: @Kumar-Sorry for "hijacking" your sentences:-)This is my last వ్యాఖ్య on this టపా.

    Addedum: @Vicky:ఎంతో కొంత చదువుకొని,అవగాహన ఉన్న మనలాంటి వాళ్లకే ఇన్ని భేదాభిప్రాయాలున్నప్పుడు, ఇలాంటి సంఘటనల వల్ల నిరక్ష్యరాస్యులై,సొంత జ్ఞానం లేక, విచక్షణ కరువై ఏ నాయకుడు ఏది చెబితే అది విని తలలూపే వారి వల్ల పరిస్థితి ఇంకెంత దిగజారుతుందో కదా అనే నా బాధ.
    this is from my previous వ్యాఖ్య..this explains Why?

    రిప్లయితొలగించండి
  35. చదువరి గారు, దీనికి లోక్ సత్తా చూపిస్తున్న పరిష్కార మార్గం ఏమిటండి?

    రిప్లయితొలగించండి
  36. @డా.ఇస్మాయిల్: alternative point of view ని deviant view గా చూపించడం hegemonic పంధా. అదే బ్లాగుల్లోకూడా జరుగుతుంది.ఒక పాప్యులర్ భావజాలం లేక dominant paradigm దిశగా చర్చలు జరుగుతున్నప్పుడు even sanest of the voices sound like a hypocritical rhetoric.

    నిన్న టీవీలో అమీర్ ఖాన్ ‘తీవ్రవాదానికి మతముండదు’ అని చెబుతుంటే అదేభావజాలాన్ని బలంగానమ్మే నాక్కూడా నవ్వొచ్చింది.అదంతే! కానీ that moment of becoming one with dominant ideology at that point in time ను తట్టుకోగలిగితేగానీ కొంత తెరపిరాదు.

    It's alternate ideologies that makes a vibrant democracy. Let it prevail. Let it thrive.

    రిప్లయితొలగించండి
  37. Be it Saiva or Vaishnava, all of them draw their common and primary inspiration and authority from the Vedas. They were never considered as being distinct from one another whether in the pre-islamic or the post-Islamic India. The existence of various gods who are mutually related and the equal veneration with which they are worshipped by all Hindus point to the unique freedom of choice and peaceful co-existence offered by Hinduism. It is something which we can not witness in the imported faiths.

    On the other hand, sects and schisms are very common to a religion as largely organized and long-surviving as Hinduism which incidentally also has a vast geographical springboard. But basing purely on the existence of the said sects and their mutual rivalries, to deny that there is Hinduism, but for the existence of only Saivism, Vaishnavism etc. is a gross distortion of philosophical facts. One can not be faulted if one deems it to be a deliberate misiniformation campaign by the sworn enemies of India and Hinduism. Thereby, they appear to be giving vent to their deep-seated diatribe against or callous ignorance of Hinduism and its history. It is as good as saying that there is no Islam but only Shia and Sunni religions. Also, it amounts to saying that there is not a thing such as Christianity but only Catholic, Greek, Protestant and Anglical churches.

    The religion is never an inanimate, inert and frozen monolith but a living, evolving, dynamic and productive being, like Hinduism. Its diversity should not be misinterpreted to deny its very existence.

    రిప్లయితొలగించండి
  38. Yes Dr Ismail,
    We got to hear the alternate and other's views aswell.Otherwise we can not justify things. i always belive in onething, revolutions starts always with a suppression. example Naxalism. but what wonders me is that what kind of a supression these terrorsis under went? and what kind of a suppression these supporters of terrorsists underwent?
    please share your ideas if you know any..infact all these underworld people have suppressed others, they never underwent any. thats what i belive.

    రిప్లయితొలగించండి
  39. Mr.Magavadu,
    Once Dr Jayaprakash nrayan was visiting a small place and local people have asked me to visit a temple, and he denied saying i will not come to any religious places. there it self it shows his sincerity that he is beyond religions. terrorist is a terrosit and he should be punished what so ever be his religion. thats what his solution would be. and he would be unlike other politicians who doesn't give access to education, health for poor muslims. if every indidual is engaged with some wrok or responsibilty they would not engage in these kind of activities.

    రిప్లయితొలగించండి
  40. Just to add another perspective from my friend Jack in UK and some solutions tool...thought it would add up to the discussion.

    "Mumbai's 9/11? Attacks worse than 9/11 have been happening in India since years, has it taken so long for us to realise it? Every Indian citizen killed has a family and loved one behind them. 4000 Indian citizens have apparently been killed in terrorist attacks in 4 years!! Why does the Indian media give such importance to a business tycoon from Britain who died in the recent attacks rather than the 174 innocent Indian victims? Are their lives not worth it? This is what it all boils down to finally...how much is an Indian life worth? So much hullabulloo about foreign investment and businesses being affected...what is the point of increasing foreign investment when there is no public left to enjoy it's benefits! Protect foreign nationals and foreign investment at any cost, let the Indian public suffer and die at the hands of the militants is it? The rich were also hit in these attacks and therefore
    the press and the sudden sense of urgency among the government authorities! What a shame. What about those hundreds of innocent train commuters who died not so long ago? There seems to be warped sense of importance we attach when such events occur. The Governement has to do the following if futher terrorist attacks such as these are to be prevented in our country1) Set up NSG hubs not just at 4 major points, but in every state capital2) Set up an anti-terror network around the country and a seperate wing comprising of the RAW, ATS, ISRO, Defence services, IPS, CBI working together and sharing information. 3)Indict and enforce punishment of captured terrorists within 6 months. If even one Indian citizen has been killed by a terrorist, the terrorist must die ( not just a life sentence- we mean penalty by death)4)Hunt down those traitors who sponsor and support these b******s
    regardless of who they may be (politicians, film personalities etc)5)Seal the border with Pakistan, Nepal and Bangladesh effectively, increase naval security6) Hunt down and kick all illegal immigrants from Pakistan and Bangladesh out of our country7) Take a firm stand against Pakistan- the demand is very simple- capture every militant in PoK and hand them over to us, dismantle every terrorist sponsoring madrsas and militant training camp in Pakistan, arrest all those involved in Hawala money used to sponsor terrorism or else.....we send our NSG into Pakistan and do the above mentioned jobs ourselves.8) Tell the US and UK in firm terms that they have no business playing middlemen and trying to soothen public anger in India by supporting the Pakistan Government. Rather they should be talking to Mr Zardari and his team in Pakistan and the Bangladeshi Government about what they are doing to
    curb militancy in Pakistan and Bangladesh. We don't need the western media fuelling speculation about Hindu-Muslim riots in India and wars between India and Pakistan. They need to clean up their house and the mess they have created in the middle-east which is affecting all of us in India before lecturing or preaching peace to us.All this sounds incredible dosen't it? But can anyone suggest what else will improve matters at home? What other bloody alternatives do we have? How the hell do we deal with such fanatics otherwise? Beneath all the anger, my heart and feelings go out to the families and friends of my countrymen who died in the latest and the past terrorist attacks. May God give them strength and courage.Jai HindSrinivas

    రిప్లయితొలగించండి
  41. మతోన్మాదానికి మతం ఉండదు అనే oxymoron statements pass చేసే పెద్దలంతా, ప్రతి తీవ్రవాద దాడిలో జనాల్ని ఊచకోత కోసే evil people అందరూ ముస్లిమ్ మతం నుంచి మాత్రమే ఎందుకొస్తున్నారో అన్న జ్ఞానాన్ని అందరికీ పంచుతారా?

    రిప్లయితొలగించండి
  42. ఇక్కడ నాకో విషయం అర్ధం కావడం లేదు,
    ముస్లిమ్ అంటే ప్రటి ఒక్కరికి పాకిస్తాన్ దేశం మాత్రమే ఏందుకు గుర్తువస్తుంది?
    ఇండియా ముస్లిమ్ దేశం కాదా ఇక్కడ ముస్లిమ్ లు లేరా!
    సౌది,దుబాయ్ ముస్లిమ్ దేశాలు కాదా, అక్కడ హీందు సోదరులు ఉండడం లేదా, అక్కడీ ముస్లిమ్ హిందువులను రాకుందా బాన్ చేసారా.
    తివ్రవాదుల వల్ల నష్టం హిందువులకు మాత్రమే నా ముస్లిమ్ లకు నష్టం లేదా. ముస్లిమ్ లకు ఏమి ప్రయెజనం ఉంది.
    తీవ్రవాదులకు సహాయం చేసే వారు అంత ముస్లిమ్ లు మాత్రమేనా ఇది ఎలా సాధ్యం.

    రిప్లయితొలగించండి
  43. @కుమార్: ఈ క్రింది లంకెలో మీకు కొన్ని సమాధానాలు దొరకొచ్చు. ప్రయత్నించండి.
    http://www.freerepublic.com/focus/f-news/1444377/posts

    రిప్లయితొలగించండి
  44. చదువరి గారు, ఇక్కడ వ్యాఖ్యానించేంత సమాచార సంపద నా వద్ద లేదు. మీ ప్రశ్నలకు నా గొంతు శృతి కలుపుతున్నాను, తీవ్ర వాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిపై సానుభూతి, మానవత్వం ప్రాతిపదికగా.

    రిప్లయితొలగించండి
  45. See this.
    Conflicts around the world involving ISLAM

    http://there-is-only-one-islam.blogspot.com/2005/08/islam-conflicts-around-world.html

    రిప్లయితొలగించండి
  46. @హాసిబ్:

    >>"...పాకిస్తాన్ దేశం మాత్రమే ఏందుకు గుర్తువస్తుంది ? "
    మీరెందుకు అంత భాద పడి పోతున్నారు. ఆ ఆ దేశాలలోని హిందువులు ఇక్కడి లా మైనార్టీలుగా హక్కులు కోరుతున్నారా. లేదా ఆ ప్రభుత్వాలు ఇక్కడి లా ప్రత్యేక చట్టాలు కాని, ప్రత్యేక రాయితీలు కాని ఇస్తుందా హిందువులకు.

    >>"హిందువులను రాకుందా బాన్ చేసారా."
    అంటే ఏమి మీ అర్థం.. నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఎవరిని బ్యేన్ చేసారు అని మీ భాద ? అక్రమంగా సరిహద్దుల గుండా వచ్చి కాల్చిపోతున్నారు. ఇది మీరు కాదనగలరా ! లోకల్ సపోర్ట్ లేదు అని చెప్పగలరా ?

    అన్నిటికి మించి మీకు పాకిస్తాన్ ని తిడితే అంత భాద ఎందుకు ?

    రిప్లయితొలగించండి
  47. తీవ్రవాదానికి మతముండదు, మతోన్మాదానికి కాదు. ఋజువు మొన్న దాడిలో చనిపోయిన వారిలో ముస్లిములు ఉన్నారు. దాడి జరిగింది హిందువులను selectiveగా చంపడానికి కాదు, మతం కన్నా ఓ జాతి(nationality)ని center చేసుకొని జరిగింది. ఇక evil people ముస్లిం మతం నుండే ఎందుకొస్తున్నారంటే evil people ఇక ఏ ఇతర మతాల్లోనూ లేరు కాబట్టి!?! evil or good doesn't come from religion it is a personal trait.

    రిప్లయితొలగించండి
  48. "తీవ్రవాదానికి మతం లేదు, తీవ్రవాదులు ఏ మతానికీ చెందరు..." చాలా బావుంది, ఇన్ని వేల సార్లు విన్న తరువాత కూడా మాకు బోరుకొట్టడంలేదు. అదేంటో !

    సరే ! మనం అలా అనుకుంటున్నాం. ఒక సగటు-సరాసరి తీవ్రవాది అలా అనుకుంటున్నాడా తన గుఱించి ? అది నాక్కావాలి. అంటే - తనకి ఏ మతమూ లేదనీ, తన పని మానవజాతి నంతా నిర్మూలించడమేననీ !

    దీనికి సమాధానం ఖచ్చితంగా "కాదు" అని ! ఎందుకంటే ఇప్పటి దాకా పట్టుబడ్డ తీవ్రవాద సాహిత్యం నిండా ముస్లిమేతరుల మీద విషమే కక్కారు. వాళ్ళు ఆ సాహిత్యంలో ఇండియా గుఱించి "ఒక హిందూ ప్రాభవంతో కూడుకొన్న ప్రభుత్వం గల హిందువుల దేశం"గానే అభివర్ణిస్తారు, మనవాళ్ళు ఎంత లావుపాటి సెక్యులర్ రాజ్యాంగం రాసుకొన్నా కూడాను ! పైగా భారత ప్రభుత్వం చేసే ప్రతి పనినీ ప్రతి చర్యనీ, హిందూ 'మతదృక్కోణం' నుంచి ఇస్లాముకి వ్యతిరేకంగా, ఇస్లాముని బలహీనపఱిచే ఉద్దేశంతో తీసుకున్నదేనని వారు వ్యాఖ్యానిస్తారు. ఆ వ్యాఖ్యలతోనే వారు ఇప్పటిదాకా ఇన్ని వేలమంది కాశ్మీరీల్ని, పాకిస్తానీల్ని జిహాదీ టెఱ్ఱరిస్టులుగా మార్చగలిగారు.

    తీవ్రవాదులకి ఏ మతమూ లేకపోతే, వారు ఏ మతం తరఫునా పనిచేస్తూండకపోతే వారు ఇస్లామిక దేశాలక్కూడా వెళ్ళి అక్కడి ముస్లిముల్ని ఎందుకు మట్టుపెట్టడంలేదు ? వారు పాకిస్తాన్ వంటి ఒకటి-రెండు ఇస్లామిక దేశాల్లో విధ్వంసానికి పాల్పడుతున్న మాట నిజమే. కాని అందులో కూడా తమక్కొందఱు తోటి ముస్లిములు అడ్డొచ్చారనే అక్కసుతోనో, ఇస్లాముకి కొందఱు ముస్లిములు ద్రోహులనే ఆగ్రహంతోనో విధ్వంసానికి పూనుకుంటున్నారు తప్ప ఇస్లామిక దృక్కోణం నుంచి వారు వైదొలగిన సందర్భం ఒక్కటీ లేదు.

    సరే ! టెఱ్ఱరిజానికి ఏ మతమూ లేకపోతే, మఱి ఈ జరుగుతున్న ఉగ్రవాద చర్యల్ని ఏ కోణంలోంచి అర్థం చేసుకోవాలో దయచేసి ఎవరైనా చెప్పగలరా ? దీనికి మతం లేదంటున్నారు కాబట్టి, దీనికి "Secular terrorism" అని పునర్‌నామకరణం చేద్దామా ?

    రిప్లయితొలగించండి
  49. I understand doctor's feelings. It hurts if somebody brands the entire group. But from what i read and learnt, islam doesnot recognise any other religion (even the oldest religion of hinduism) and hence, non-muslims are kaafirs and killing them elevates them to heaven. ALso, many things are un-islamic like taking an insurance policy, family planning, etc. Family planning and money lending are not acceptable even in hindu religion but tell any hindu to follow? an average hindu preferes his welfare and economic well being to religion. I often feel that when things like the above are not facts why no body condemns and spreads right things about islam. Many muslims i met in my life till now never created such wrong impressions about islam through their behaviour. Definitely lot of apprehensions are going on. but people in old city like places are kept in ignorance by his politicians for their benefit.

    రిప్లయితొలగించండి
  50. Sai gaaru,
    Read the Friedman's article today in NYtimes.

    Will Muslims Protest Mumbai Murders? - Tom Friedman, New York Times

    http://www.nytimes.com/2008/12/03/opinion/03friedman.html?_r=1&ref=opinion

    రిప్లయితొలగించండి
  51. Dear All,

    Please sign this petition and forward it to you friends for signature...Dec 7th is the last date.

    http://www.petitiononline.com/26novAct/petition.html

    Thanks.

    రిప్లయితొలగించండి
  52. చదువరి గారు, మీరు మన ప్రధాని కి నిజంగానే ఈ క్రింది అడ్రస్ కి మెయిల్ చెయ్యచ్చు.

    pmh7rcr@pmo.nic.in
    manmohan@sansad.nic.in ,
    presidentofindia@rb.nic.in
    soniagandhi@sansad.nic.in
    advanilk@sansad.nic.in,

    btw..మీరు only ప్రధానికి పంపినా ఒక copy..madam కి వెల్తుంది :) he kept filters like that.

    ఇక, మీ బ్లాగు లోని కామెంట్లకు స్పందించకూడదనే అనుకుంటూనే మొదలుపెట్టా. ఎందుకంటే నాకు అర్ధవంతం గా వివరించేంత నేర్పు తక్కువ.

    మొదటగా.. ఇక్కడ ఎవరో అన్నారు, పాపం మన మన్మోహనుడు కీ ఇస్తే ఆడతాడని. శుద్ద తప్పు. ఇప్పటివరకు నిజమైన కాంగ్రెస్ వాదులు, ఇంకా కమూనిస్టులు కూడా ఇవ్వటానికి సాహసించని స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఉదాహరణకి, దేశవనరుల మీద తొలి హక్కు మైనారిటీలకే ఉండాలిట. తర్వాత వివరణలు ఏవో ఇచుకున్నారు లెండి. కాని అది ఉద్దేశ్యపూర్వకంగా ఇవ్వలేదు అంటే వారి అమాయకత్వానికి జాలి పడటం మాత్రమే మనం చెయ్యగలం. ఇంకేమన్నారంటే, హనీఫ్ ఆస్ట్రేలియా లో అరెస్ట్ అయినప్పుడు ఈయన నిద్రలేని రాత్రులు గడిపాడుట.ఇలాంటిదే కొంధమాల్ గురించిన వ్యాఖ్య కూడా. మరి ఇన్ని టెర్రరిస్టుల దాడులు జరుగుతుంటే ఈ మహానుభావుడికి నిద్ర ఎలా పడుతుందో? అసలు ఇలాంటివి ఓట్ల కోసం ఇచ్చే పబ్లిక్ స్టేట్మెంట్లు లే అనుకుంటే పొరపాటు. ఎందుకంటే, ఇటీవల పోలిస్ ఉన్నతాధికారుల మీటింగ్ లో ఉగ్రవాద కేసుల్లో విచారణ చేసేప్పుడు చాలా జాగ్రత్తలు (హద్దులు) సూచించాడుట. వాళ్ళ ఆత్మస్థైర్యం తగ్గేలా ఉన్నాయవి. ఇది ఇటీవల NDTV ఇంటర్వూ లో అరుణ్ సౌరీ ఆధారాలతో సహా వెలిబుచ్చిన వాస్తవాలు. లంకె దొరకలేదు, ఇక్కడ ఇద్దాం అంటే..

    ఇంక, నిన్న అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ అసలు భారతదేశంలో 'ఇస్లామిక్ ఉగ్రవాదం' బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాతే మొదలైంది అన్నాడు. ఇంతకన్నా ఋజువులు ఏం కావాలి? ఇది 'ఇస్లామిక్ ఉగ్రవాదం' అనటానికి? ఒకవేళ అతను చెప్పింది తప్పే అయితే ఏ ఒక్కరైన ఖండిస్తారేమో వేచి చూద్దాం. తాడేపల్లి గారు కరక్ట్ గా చెప్పారు, యే ఉగ్రవాది తనకి అన్ని మతాలు సమానం అనుకుంటున్నాడు? ఇస్మాయిల్ గారు..చెప్పగలరా? మీరు 1000 చెప్పినా ఇది ఖచ్చితం గా ఇస్లాం మతం అడ్డుపెట్టుకొని సాగుతున్న మారణహోమమే. దీనికి ఇంకో ఉదాహరణ, పట్టుబడ్డ ఉగ్రవాది, తమకి భారత్, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు ఇస్లాం కి శత్రుదేశాలు అని ప్రభోదించేవారని. ఇక్కడ ఎవరూ ముస్లిం మతస్థులంతా ఉగ్రవాదులు అనలేదు. కాని ప్రస్తుతం ప్రపంచం/భారతదేశం లో జరుగుతున్న ఈ దురాగతాలకి 80 శాతం ఇస్లాం కి వక్రభాష్యం చెప్పటం, దాన్ని విరివిగా ఫాలో అవ్వటం వల్లే జరుగుతుంది.

    ఇస్మాయిల్ గారు, మీ వాదనలో ఇంకొక కోణం నాకు ఎప్పటికీ అర్ధం కాదు, మూలాలు వెతకాలని.. నేను చదివిన అన్నిచోట్లా ఈ మాట అనేవాళ్ళు తగులుతారు, కాని ఇప్పటివరకు ఎవ్వరూ ఈ మూలాలేంటో, దానికి ఉగ్రవాదం ఏ విధమైన పరిష్కారమో అర్ధవంతంగా వివరించలేదు. ఎందుకంటే, అసలు మూలాలనేవే లేవుకాబట్టి. నా వరకు నేను హింస ని తక్కువ చేసి చూపేందుకు, ఉదారవాదులు ప్రయత్నిస్తున్న ఒక నాటకం గానె భావిస్తా,పదే, పదే మూలాలు అని చెప్పటం.. ఇదొక మితవాదుల ఉగ్రవాదం. కాకపోతే ఏంటి? ఉగ్రవాదులు దాన్ని సాకు గా చెప్పరంటే అర్ధం ఉంది..నిజాలు తెల్సిన వాళ్ళు, విద్యావంతులు కూడ అదే పాటా? పోని, ఇది మతం వల్ల కాదు, నిరక్షరాస్యత, ఆర్ధిక అసమానతల వల్ల అనుకుంటే, ఈ దేశంలో దళితులకి కన్నా ముందు ఎవ్వరికీ అలా మారే అవసరం ఉండకూడదు. దేశాన్ని 400 ఏళ్ళు పైగా పాలించిన ఒక మతం వారు, వాళ్ళని అణగద్రొక్కారని భావించటమా? ఒక్కసారి ఆ సుల్తానుల పాలన గుర్తు చేసుకుంటే, భారత చరిత్రలో ఇస్లాం రాజుల పాలన ఎటువంటి పరిణామాలకి దారితీసిందో తెలుస్తుంది. సరే, ఒకవేళ నిజంగా ప్రభుత్వాలు అలా అసమానతలు చూపిస్తున్నాయి అనుకుంటే, చాలా మంది విప్లవోద్యమాలు బాట పట్టి, నక్సలిజం లో చేరారు. ప్రభుత్వాలకి వ్యతిరేకం గా పోరాడారు. ఇలా బాంబ్ బ్లాస్ట్లతో భయోత్పాతాలు సృష్టించట్లా.. నిరక్ష్యరాస్యత కారణం అయితే యాహూ లో పని చేసే ఉద్యోగులకి ఏం అవసరమండి ఇలాంటి కార్యక్రమాలు చెయ్యటానికి? మళ్ళీ మీరు వస్తారు, ఒకళ్ళని చూపించి అంతా అంతే అంటునారు అని.. కాదు, ఆ ఒకళ్ళు అలా చెయ్యటానికి కూడా ఇస్లామే కారణం అయింది అని చెప్పటానికే. మీరు నమ్మినా, నమ్మకపోయినా , ఇది మతం వల్ల/మతం పేరుతో జరుగుతుందే.. లేదంటే, శ్రీలంక లోని ఏల్టీటీఇ ఉగ్రవాదం తీసుకోండి. అక్కడ మనకి మతం అనే విషయమే కనపడదు. ఇక్కడ నేను ఏల్టీటీఇ చేసేదాన్ని సమర్ధించట్లేదు. కేవలం ఇక్కడ చేసె దానికి ఇస్లాం ని వాడుకుంటున్నారని చెప్పే ప్రయత్నమే.
    "ముస్లిం, ముస్లిం అంటూ దాన్ని భూతం గ చూపిస్తునారు"... అసలు ముస్లిం మతాన్ని భూతం గా చూపించటం వల్ల ఉగ్రవాదం తలెత్తిందా? లేక ఉగ్రవాదుల్లో ఎక్కువ ముస్లింలు ఉండటం వల్ల దాన్ని భూతం గా చూస్తున్నారా? ఆలోచించుకోవాలి.

    ఇక ముస్లిం జనాభ విషయం లో కూడా మీతో నేను విభేదిస్తాను. దేశ విభజన అప్పుడు 12% ఉన్న ముస్లింలు ఇప్పుడు 20% పైగానే ఉన్నారు, కొన్ని చోట్ల ఈ సంఖ్య 35% వరకు ఉంది. మీకు తెలియకపోతే ఒక బహిరంగ రహస్యం చెప్పనా? ఈ స్థాయి లో లేకపొతే ఇంత జరగదు, వీళ్ళు ఒక సైజబుల్ ఓటుబ్యాంకు గా మారారు, అందుకే తస్లీమా పై దాడి కి దిగినా, నడి బజారులో తుపాకీ పేల్చినా ఏమి అనరు. దురదృష్టమేంటంటే, ప్రభుత్వాలు 1) ఇటువంటి వారిపై చర్య తీసుకోకుండా,ఆఫ్జల్ గురు ని ఉరి తీయకుండా 3) మంత్ర్లి వెళ్ళి జైలు నించి విడుదలైన ఉగ్రవాదిని పరామర్శించిరవటం 4) అక్రమ చొరబాటు దారులపై చర్య తీసుకోకపొవటం వంటి వాటిని ముస్లిం అనుకూల నిర్ణయాలు గ చూపించటం, నిజమే అని వీళ్ళు అధికారాన్ని అప్పగించటం.

    ఈ దేశంలో ముస్లిం లీగ్ ని మంత్రిత్వం లో తీసుకున్న పార్టి సెక్యులర్, ఒక మతానికి ప్రత్యేక శ్రద్ద కూడదన్న పార్టి కమ్యునల్.
    అసలు చదువుకున్న వారి ఆలొచనలు కూడా ఎల ఉన్నాయంటే,

    ఇక్కడ చదువరి గారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడిటే, కొందరేమో ముస్లింలని అన్నట్లు భావిస్తునారు. :(

    రిప్లయితొలగించండి
  53. in my above comment, i have wrongly mentioned as austrlia..it is israel.

    రిప్లయితొలగించండి
  54. తాడేపల్లి గారు,
    మీ ప్రశ్నలకు సమాధానం కావాలి అంటే ఈ క్రింది బ్లాగును చూడండి.
    http://islamgurinchinijalu.blogspot.com/

    రిప్లయితొలగించండి
  55. మహేష్ గారికి మీరిచ్చిన సమాధానం బాగుంది. ఎన్నోసార్లు నాకూ అనిపించింది he is a clever hypocrat అని..

    రిప్లయితొలగించండి
  56. @చదువరి: మీరు వ్యాసంలో చెప్పిన విషయాలతో నాకు విభేధం లేదు. కానీ,మూలవిషయాన్ని ప్రస్తావిస్తూ మీరు చేసిన మైనారిటీ-మెజారిటీ రాజకీయవాదంతోనే నా అభ్యంతరమంతా.

    ఇక నేను ప్రస్తావించిన హిందూతీవ్రవాదం సంగతంటారా...ఇస్లామిక్ టెర్రరిజం ఒక worldwide phenomenon. హిందూతీవ్రవాదం ఒక aberration.ఆమాత్రం తేడా మీకు తెలియంది కాదు. కానీ, ఎంతైనా మీ తరఫునుంచీ ఒక వాదన కావాలికదా!!! I understand that.

    రిప్లయితొలగించండి
  57. కత్తి మహేష్ కుమార్: satya చిట్టచివరి వ్యాఖ్యలో చెప్పినదాన్ని నిజం చేసారు మీ చివరి వ్యాఖ్యతో!

    రిప్లయితొలగించండి
  58. "Alternative point of view ని deviant view గా చూపించడం hegemonic పంధా. అదే బ్లాగుల్లోకూడా జరుగుతుంది.ఒక పాప్యులర్ భావజాలం లేక dominant paradigm దిశగా చర్చలు జరుగుతున్నప్పుడు even sanest of the voices sound like a hypocritical rhetoric." With that I rest my case.

    రిప్లయితొలగించండి
  59. Ismail గారు, "even sanest of the voices sound like a hypocritical rhetoric." అంటూన్నారు కాని, మిమ్ములని ఉద్దేశించి Satya గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే
    sanest voice లో బాగుండెది ఎమో నండి.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు