ఇక మనం ఇంట్లోంచే వోటరుగా నమోదు చేసుకోవచ్చు. మీ క్రెడిటుకార్డు వాడి జాలంలో పుస్తకం కొనుక్కున్నట్టుగా, డ్రాప్‌బాక్సు ద్వారా ఫోను బిల్లు కటినట్టుగా, కార్డు బిల్లును చెల్లించి పారేసినట్టుగా, పోస్టాఫీసులో ఉత్తరాన్ని రిజిస్టరు చేసినట్టుగా ఇక వోటరుగా నమోదు చేసుకోవచ్చు.
25, అక్టోబర్ 2008, శనివారం
22, అక్టోబర్ 2008, బుధవారం
ప్రయాణం మొదలైంది - చంద్రయాన్-1 (Chandrayaan-1)
చంద్రయాన్ (Chandrayan) ప్రయాణం మొదలైంది, విజయవంతంగా మొదలైంది. మన గుండెలు ఉప్పొంగిస్తూ, మన కళ్ళలో ఆనంద బాష్పాలు తెప్పిస్తూ, మనపై మనకున్న నమ్మకాన్ని మరో కక్ష్యను దాటిస్తూ ఇస్రో పీయెస్సెల్వీని, దాంతోటి చంద్రయాన్‌ను ప్రయోగించింది.
11, అక్టోబర్ 2008, శనివారం
కంధమాల్ కథేమిటి?
ఒరిస్సాలోని కంధమాల్ జిల్లాలో జరుగుతున్న కుల/మత ఘర్షణలు ఈమధ్య కాలంలో దేశవ్యాప్తంగా కలకలం కలిగించాయి. ఆ కలహాలకు మూల కారణమైన క్రైస్తవం బయటి దేశాలతో మతపరమైన సంబంధాలు కలిగి ఉండటాన, ఆ మతం, ఆ దేశాలు అంతర్జాతీయ రాజకీయాల్లో పలుకుబడి కలిగినవి కావటాన, ఈ ఘర్షణలు అంతర్జాతీయ దృష్టికి చేరాయి. ప్రధానమంత్రిని ఫ్రాన్సులో నిలదీసిన సంఘటన కూడా జరిగింది. "రెండేళ్ళ కిందట మీ పారిస్‌లో ముస్లిములపై అలా దౌర్జన్యాలు చేసారేంటని నేను అడిగానా? మీకెందుకు మా సంగతి?" అని ఆయన అడగాల్సింది. లేదూ.. క్రైస్తవ మిషనరీలు భారత్‌లో లేపుతున్న కల్లోలాల గురించి చెప్పి, "ముందు మీవాళ్ళని అదుపులో పెట్టండి. ఆ తరవాత గొడవల గురించి మాట్టాడండి" అని చెప్పుండాల్సింది. కనీసం "అది మా ఇంటిసంగతిలే, మేం చూసుకోగల్దుంలే" అనైనా అనుండాల్సింది. (పాపం ఒకచేతిలో యురేనియమ్ జోలె ఉండటాన ఆ మాట అడగలేకపోయి ఉండొచ్చు.) ఏదో తప్పు చేసినవాడిలాగా అక్కడేం మాట్టాడకుండా, ఇంటికొచ్చి దిండులో తలదూర్చి ఎక్కెక్కి ఏడిస్తే ఏం లాభం!?
అసలు కంధమాల్‌లో జరిగిన గాథ క్లుప్తంగా ఇక్కడ...
9, అక్టోబర్ 2008, గురువారం
దూడగడ్డి యాత్రలు
తాడిచెట్టెందుకెక్కావురా అంటే....దూడగడ్డి కోసమన్నాడని సామెత. ఈ మధ్య కొందరు చేస్తున్న రాష్ట్ర వ్యాప్త, దేశ వ్యాప్త యాత్రలు చూస్తుంటే ఈ సామెత గుర్తుకు రాకమానదు.కొండొకచో ప్రపంచయాత్రలు కూడా చేస్తూంటారు.
3, అక్టోబర్ 2008, శుక్రవారం
రక్తపాత రహిత కుట్ర !
ఈ జాబుకు ప్రేరణ నాగప్రసాదు రాసిన మీరు దేవుణ్ణి తింటారా అనే జాబు. నిజానికి ఈ జాబు అంతా అక్కడే వ్యాఖ్యగా రాయాల్సింది.. పెద్దదై పోయింది, పైగా కాస్త అసందర్భం అవుతుందేమోనన్న శంక.. అంచేత ఇదిగో ఇక్కడ..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
సంబంధిత టపాలు
loading..