22, జనవరి 2007, సోమవారం

సాయిబాబా - తెలంగాణా

"..ఈ విధంగా దేశాన్ని ముక్కలు చెయ్యడం మహాపాపం. నేను ఏ రాష్ట్రం, ప్రాంతం గురించి మాట్లాడడం లేదు. నాకు అలాంటి భేదాల్లేవు.." - చెన్నై సభలో సాయిబాబా.

సత్యసాయిబాబాకు రాష్ట్ర ప్రాంత భేదాల్లేవట. భారతదేశమొక్కటే ప్రధానమైనదట. దేవుడికి మానవాళి అంతా ఒక్కటే కదా, దేశ భేదాలుంటాయా? విశ్వం గురించి మాట్లాడాలసిన దేవుడు, దేశ రాజకీయాల గురించి మాట్లాడ్డమేమిటో?

వృద్ధాప్యం వలన ఆయన ప్రసంగంలో స్పష్టత లోపించిందట; ఈనాడంటోంది.

7 కామెంట్‌లు:

  1. ఈయనో కొత్తరకం భగవాన్...తప్పు తప్పు కళ్ళు పోతాయ్

    రిప్లయితొలగించండి
  2. "రాష్ట్రపతుల దగ్గరి నుండి, ఎంతటి వాడైనా సాయిబాబా దగ్గరికి వెళ్ళి కలవాల్సిందే. కరుణానిధిని కలవాలంటే మాత్రం బాబాయే ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడుంది తేడా? నమ్మడం, నమ్మకపోవడమా? ఇంకేమైనా కారణాలున్నాయా?"
    మీ ఈ ప్రశ్న నాకు భలే నచ్చింది. నమ్మిన వాడికి బాబా శక్తిమంతుడు. నమ్మని వాడికి వాడీకి వాడే శక్తిమంటుడు!
    బాబా దేవుడని నమ్మేవాళ్ళకి "ఆయన స్థాయికి తగ్గ విషయం కాదిది."
    బాబాను నమ్మని వాళ్ళకు "ఆయనా ఒక వ్యక్తే గనుక ఆయనకు నచ్చింది ఆయన చెప్పాడు."

    --ప్రసాద్
    http://blog.charasala.com

    రిప్లయితొలగించండి
  3. బాబా దేవుడని నమ్మేవాళ్ళకి "ఆయన స్థాయికి తగ్గ విషయం కాదిది."
    కానీ తన స్థాయికి తగని ఈ విషయంలో అనవసరంగా తలదూర్చింది ఆయనే కదా? తెలంగాణా విషయంలో మీ అభిప్రాయమేంటనిగానీ, దేవుడేమంటున్నాడనిగానీ ఆయన్నెవరైనా అడిగారా?

    రిప్లయితొలగించండి
  4. అసలు ఈ బాబాలకు ఆ స్థాయి కల్పించినదే మన వెధవ రాజకీయ నాయకులు. డేవిడ్ కోరిష్ లాంటి వాడినే FBI వణుకు పుట్టించి పట్టుకోవడానికి ప్రయత్నించింది. అదే మన దేశంలో అయితే రాజకీయ నాయకులు పోటీలు పడి ఫోటోలు తీయించుకోరూ?

    అయినా బాబా అయితే రాజకీయం మాట్లాడ కూడదా? దేశ పౌరుడికి ఉన్న అన్ని హక్కులూ అతనికి ఉన్నాయి. అలానే అన్ని చట్టాలు అతనికి వర్తిస్తాయి. కాకపోతే ఈ వెధవ రాజకీయ నాయకుల వల్లనే కదా ముగ్గురు హత్య జరిగినా అతనిని కనీసం ఒక్క ప్రశ్న కూడ అడగనివ్వలేదు.

    రిప్లయితొలగించండి
  5. శోధన గారూ!
    రాజకీయాల పట్ల తన గొంతు వినిపించే విషయమై సాయిబాబాకున్న హక్కు గురించి నాకిసుమంతైనా ఆక్షేపణ లేదు. రాజకీయం మాట్లాడినందుక్కాదు నా విమర్శ..

    -మాయలు మంత్రాలున్నాయని చెప్పి, కనికట్టు చేస్తున్నందుకు (మొన్న మంత్రులకు కూడా లింగాలిచ్చాడు!)
    -తన ఇంట్లోనే జరిగిన హత్యల పట్ల కిమ్మనకుండా ఉన్నందుకు. ఎందుకు జరిగాయో, ఎవరు చేయించారో నేటికీ తెలియనివ్వనందుకు
    -చిన్న పిల్లలతో అనైతిక పనులు చేయబూనినందుకు

    ఇన్ని చేసీ, తనేదో దైవాంశ సంభూతుడిలా కబుర్లు చెబుతున్నందుకే నా ఎత్తిపొడుపు.

    రిప్లయితొలగించండి
  6. అవును, మీ బ్లాగు సారాంశం నాకు అర్ధం అయ్యింది. నా బాధ ఏమిటంటే అసలు ఈ బాబాలకు ఆ స్థాయి ఎందుకు కల్పించాలి? లక్షలాదిమందిని గొర్రెలుగా ఎందుకు చెయ్యాలి? ఇండియా టుడే గొంతెత్తి ఇదే బాబా మీద రెండు సార్లు ప్రత్యేక పరిశోధనా సంచికలు వెలువరించితే కిక్కు మనని రాజకీయ నాయకులు, ముగ్గురు విద్యార్ధులు చేతులెత్తేసినా కాల్చి పారేసినప్పుడు కిమ్మనని రాజకీయ నాయకులు..తమ సొంత లాభాలు కొట్టుకుపోతాయనే ప్రమాదం వచ్చేసరికి...ఒక్క సారిగా నాస్తిక కబుర్లూ...నంగనాచి కబుర్లూనూ...చెప్పండి ఇప్పుడు నేనవరిని తిట్టాలి? :-) పౌర హక్కులను ప్రశిస్తున్న వాడినే కదా? బాబాను తిట్టాలంటే ఇక్కడ నాకు కొత్త సందర్భం ఏది కనిపించలేదు.అన్నీ పాతవే...

    రిప్లయితొలగించండి
  7. Your criticism of Baba is highly idiotic!
    Here he told his opinion as a citizen and as a person from AP and NOT as Godman! You are barking at him with your ignorance!

    He has given water to draught areas in AP, Karnataka & TN through his trust not wasting other's time with stupid blogs! This is enough to call him Godly , and not for his tricks.

    Take what is relevant and leave the rest.

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు