15, ఆగస్టు 2011, సోమవారం

తెవాదుల అబద్ధాల్ని మళ్ళీ ఇంకొకరు బైటపెట్టారు

తెవాదుల అబద్ధాలు పదే పదే బైటకొస్తూ ఉన్నాయి. సీయెన్నెన్ ఐబీయెన్ టీవీ వాళ్ళు చేసిన సర్వే ఈ తెవాదులు కప్పుకున్న అబద్ధాల వలువలను వలిచి మరీ బజాట్టో నిలబెట్టింది.

"తెలంగాణలోని మొత్తం నాలుక్కోట్ల మందీ కూడా ప్రత్యేకరాష్ట్రం కోరుతున్నారు. సీమాంధ్ర ప్రజల్లో మెజారిటీ సంఖ్యలో జనం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నారు" అనేది వీళ్ల సుప్రసిద్ధ అబద్ధం. ఒకే వాక్యంలో నాలుగైదు అబద్ధాల్ని కూరడం వీళ్ళకున్న చాతుర్యం. పై వాక్యంలో రెండు పెద్ద అబద్ధాలను ఇరికించారు. ఆ సంగతి ప్రతీ రోజూ కోస్తా సీమల నేతలు చెబుతూనే ఉన్నారు, బ్లాగరులు తమ టపాల్లో చెబుతున్నారు, మొన్న శ్రీకృష్ణ కమిటీ కూడా రాత పూర్వకంగా తమ నివేదికలో చెప్పింది. తాజాగా ఇప్పుడు సీబీయెన్ ఐబీయెన్ చెప్పింది -అంకెలతో సహా! ఏం చెప్పిందీ..

1. ప్రత్యేక రాష్ట్రం కావాలని తెలంగాణలో 50% మంది మాత్రమే కోరుకుంటున్నారు. 
2. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోస్తా సీమల్లో 90% మంది కోరుకుంటున్నారు.

ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులపై సీయెన్నెన్ ఐబీయెన్ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసారు. అందులో భాగంగా రాష్ట్రంలో వేర్పాటు సమస్యపై కూడా సర్వే చేసారు. అందులో బైటపడ్డ విశేషాలివి. ఇవి బైటపడ్డాక, తాము చెప్పిన అబద్ధాలను సమర్ధించుకోలేక నానాపాట్లూ పడ్డారు తెవాదులు. "సర్వే చేసిన వాళ్ల శక్తియుక్తుల మీద నాకు నమ్మకం ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు సరిగ్గా చేసినట్టు లేరు", అంటూ విమర్శించాడు ఒక నాయకుడు. అసలీ సర్వే అంతా బోగస్ అని అన్నారు కొందరు. మేమీ సర్వేలను నమ్మం అని తేల్చేసారు దాదాపుగా అందరూ. ఔను మరి, నమ్మితే తాము అబద్ధాలు చెప్పామని ఒప్పుకోవాలి కదా! సర్వేలు ఖచ్చితంగా నిజమని ఎవరూ అనుకోరు, అనరు. అయితే ఈ అంకెలు సూచిస్తున్న వాస్తవాన్ని మాత్రం గమనించకుండా ఉండలేం. కానీ తెవాద కబోదులు మాత్రం చూసేందుకు ఇష్టపడలేదు.

శ్రీకృష్ణ కమిటీ కూడా ఈ ముక్కే చెప్పింది: "తెలంగాణలో గణనీయమైన సంఖ్యలో ప్రజలు తటస్థంగా ఉన్నారు. కొందరైతే ప్రత్యేకరాష్ట్రం పట్ల సుముఖంగా లేరు." అని చెప్పింది.

ఇక శ్రీకృష్ణ కమిటీని ఎన్ని తిట్టారో చెప్పలేం. లంచాలు తిన్నారని అన్నారు, పోలీసు కేసులు పెట్టాలన్నారు, పెట్టారు. శాపనార్థాలు పెట్టారు. ’కమిటీ సభ్యులు ఈ పనిమీద 20 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టేసార’ని చెప్పాడు, మన ప్రొఫెసరు వక్రవాణి. ’వాళ్ళ మీద పోలీసు కేసు పెట్టాల’ని గర్జించాడు కూడా. మరి, నెలనెలా వేలకివేలు ప్రజాధనాన్ని జీతం రూపంలో తీసుకుంటూ అబద్ధాలు చెబుతున్న ఈ గురివింద ప్రొఫెసరు మీద కేసు పెట్టొద్దూ!
-------------------------------
అబద్ధాలు చెప్పే నాయకులు, బూతుకూతలు కూసే కుకవులు,  తెలంగాణ వాదం మాటున తమ నిష్క్రియాపరత్వాన్ని దాచుకోజూసే రాజకీయ నాయకులూ - వీళ్ళంతా కలిసి గోబెల్సును మరిపిస్తున్నారు. అబద్ధాలతో ప్రాంతాల మధ్య, ప్రజల మధ్యా, గోడలు కట్టజూస్తున్నారు. రోజూ ప్రజలను హింస పెడుతున్నారు.

52 కామెంట్‌లు:

 1. >>రోజూ ప్రజలను హింస పెడుతున్నారు.<<

  అది మీ అభిప్రాయం మాత్రమే. పచ్చి అబద్ధం.

  రిప్లయితొలగించండి
 2. మా మనసులో మాట
  హైధరాబాద్ మా రాష్ట్ర రాజధాని. మేము జీవిస్తున్న నగరం. ఈ నగరాన్నిఎన్నో ఏళ్లతరబడి నుంచి రాళ్ళు కొట్టి, రప్పలు ఏరి, తుప్పలు నరికి, మా చమటతో, మా రక్తంతో, మా కష్టార్జితంతో ఎంతో సుందరనగరంగా తీర్చిదిద్దామ్. ఎన్నో సంవత్సరాలుగా అన్ని కులాలు, మతాలవారు అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి జీవిస్తున్నాము. ఇప్పుడు వాడుపోతే వీడు, వీడుపోతే నేను, నేను పోతే నా అమ్మా మొగుడని ఏ వేర్పాటువాదులయినా ఈ నగరం మాది, మీరు ఇక్కడనుంచి వెళ్లిపొండి అని అంటే వారిని తరిమి కొడ్తాం. ఇంతకాలం మేమేంతో సహనంగా ఉన్నాం. సహనానికీ ఓ హద్దు ఉంటుంది. బ్లాక్ మెయిలింగులకి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, వసూళ్లకి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీయిజంతో వచ్చినా, ఎదుర్కొనేందుకు సిద్దంగా వున్నాం. బ్లాక్ మెయిలర్లకు సెల్యూట్ లు, వసూల్ రాజాలకు జిందాబాద్లు కొట్టే చచ్చు బ్రతుకు కాదు మాది. ఇక మీదట మేం కళ్ళు దించుకొనేది నేలను చూడటానికి ఉంటుంది కానీ, స్వార్థ రాజకీయనాయకులకు భయపడి మాత్రం కాదు. తలదించుకోవాల్సింది తప్పుచేసినప్పుడు కానీ, తప్పుడు నాకొడుకులకి కాదు. ఈ సుందరనగరం మా త్యాగ ఫలితం, మా శ్రమ ఫలితం. ఈ నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పటికీ రాజధాని గానే ఉంటుంది. ఈ దేశం లో ప్రతివొక్కరికి ఈ నగరంలో జీవించే హక్కు ఉంది.

  రిప్లయితొలగించండి
 3. ఆ అబద్ధాల సంగతి సరే. 14-F రద్దు వెనకున్న పెద్ద అబద్ధం సంగతేంటి? 14-F రద్దు చేసి హైదరాబాద్ ఆరో జోన్‌లో భాగం అనటం వల్ల నిజంగా అన్యాయమైపోయింది కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని తెలంగాణ ప్రజలు కారా? ఎక్కడో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలనుండో, లేక చిత్తూరు జిల్లానుండో వచ్చి హైదరాబాదులో ఎస్సై ఉద్యోగం వెలగబెట్టాలనుకునేవాళ్లకన్నా ఈ నాలుగు జిల్లాల్లో వాళ్లు అధికం కాదా? ఆరో జోన్‌లో ఆరు జిల్లాలే ఉన్నప్పుడు (హైదరాబాద్, మెదక్, మెహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్), అందులోనూ అధికం హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నప్పుడు, వాటిలో నాలుగు జిల్లాల్లో ఆంధ్రా/సీమ వాసుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు, 'స్థానికత' అనేదానికి ప్రభుత్వం ఇస్తున్న నిర్వచనం వీళ్లందరికీ అండగా ఉన్నప్పుడు - హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని పంతం పట్టి సాధించుకుంటే మునిగిపోయింది తక్కిన నాలుగు తెలంగాణ జిల్లాల ప్రజలు కారా? ఫ్రీజోన్ పుణ్యాన ఆ నాలుగు జిల్లాల వాసులకీ మొన్నటిదాకా అవకాశముందేది. ఇప్పుడది పోయింది. ఇంతోటి దానికి తెలంగాణ ప్రజల్ని ఉద్ధరించేసినట్లు అందరూ పోజులు కొట్టటం, దానికి కొందరు పండగలు చేసుకోటం!!

  రిప్లయితొలగించండి
 4. CNN ఎక్కడ సర్వే చేసింది? ఎంత మందిని సర్వే చేసింది? మా జిల్లాలో, కనీసం జిల్లా కేంద్రమైన మా పట్టణంలోనే సర్వే చెయ్యలేదు. పట్టణంలోని రద్దీ కేంద్రంలో (వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం & రెండవ పట్టణ పోలీస్ స్టేషన్)కి దగ్గరగా ఉండే మా షాపింగ్ కాంప్లెక్స్‌కి వచ్చి ఇక్కడి దుకాణదారులని అడిగారా? రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తొమ్మిది జిల్లాలలో సర్వే చేసి రాష్ట్రం మొత్తంలో ముస్లింలలో ఎక్కువ మంది పేదవాళ్ళు అని చెప్పి ముస్లింలకి రిజర్వేషన్లు ఇస్తే ఆ సర్వే చెల్లదని హై కోర్టు ప్రకటించలేదా? CNNవాళ్ళు ఏ క్రైటీరియా మీద సర్వే చేశారో, ఎన్ని జిల్లాలలో ఎంత మందిని సర్వే చేశారో? సమైక్యవాద ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తెరాసలాగే ఇక్కడ కూడా ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలిస్తే అప్పుడు తెలుస్తుంది, కోస్తా ఆంధ్రలో సమైక్యవాదం ఉందో, లేదో. నేను తెలంగాణాకి ఎంత సపోర్ట్ ఇచ్చినా సమైక్యవాద ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలలో నిజంగా పోటీ చేస్తే నాకు అభ్యంతరం లేదు. పత్రికలు వ్రాసే అసమగ్ర సర్వేలని పల్లెటూరివాళ్ళైనా నమ్మరు.

  రిప్లయితొలగించండి
 5. /సమైక్యవాద ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలలో నిజంగా పోటీ చేస్తే నాకు అభ్యంతరం లేదు. /
  :)) ఓహో! అదే అనుకుంటున్నా ... నీవు అభ్యంతరం వ్యక్తం చేస్తే వాళ్ళెలా పోటీ చేయగలుగుతారా? అని! వాళ్ళ రాజకీయ పొట్ట గడిచేదెలా?! కష్టమే! రాజ్యాంగ సంక్షోభంలో పుడుతుందేమో...

  తుర్రే బాజ్ ఖాన్ విగ్రహం విషయం ఏమయింది? తెలబాన్‌బ్లాగర్లు నీ డిమాండ్ సీరియస్‌గా పట్టించుకున్నట్టు లేరు. వదలద్దు, వెంటపడి సాధించాలి, అదే ధీరుల లక్షణం. తుర్రె బాజే ఖాన్ ... పేరు బాగుంది. ! అంటే బూర వూదేవాడనా?! కనీసం మీ షాపులోనైనా విగ్రహం పెట్టు, వచ్చి లాల్‌సలాం చేస్తాం.

  రిప్లయితొలగించండి
 6. ప్రత్యేక తెలంగాణా ఏర్పడితే కోస్తా ఆంధ్రకి వచ్చే నష్టం ఏమీ లేదు కనుక సమైక్యవాద ఎమ్మెల్యేలు ఉప ఎన్నికలలో పోటీ చేసినా గెలవరు. అటువంటప్పుడు ఉప ఎన్నికలకి అభ్యంతరం చెప్పడం ఎందుకు? దొంగ సర్వేలు చేసి జనం చెవుల్లో పువ్వులు పెట్టడం మాత్రం అభ్యంతరకరమే.

  రిప్లయితొలగించండి
 7. సర్వే ఎలా చేస్తారో తెలిసిన ఏ ఎదవా, నా షాపింగ్ కాంప్లెక్స్లో ఎవరినీ అడగలేదు కాబట్టి అది దొంగ సర్వే అని అనరు. సర్వే చేయడం ఎలా? సర్వే సత్యనారాయణకి ఫోన్ కొట్టి సందేహనివృత్తి చేసుకో.

  ఇదో తుర్రే బజ్జీ ఖాన్ విషయం లేవనెత్తావు, అది ఒప్పుకుంటా. పేరు బాగుంది, కాబట్టి ఓ విగ్రహం పెట్టాల్సిందే. కావాలంటే నా చందా ఇస్తా, మన షాపులో పెట్టిద్దాం. అంతేగాని, ఇలా... :)

  రిప్లయితొలగించండి
 8. a2zdreams: "అది మీ అభిప్రాయం మాత్రమే. పచ్చి అబద్ధం." - మీరన్న ఈ ముక్క కనీసం అబద్ధం కూడా కాదు, ఇది తెలియనితనం. :)

  రిప్లయితొలగించండి
 9. రక్తచరిత్ర: రోజురోజుకూ దృఢపడుతున్న ప్రజాభిప్రాయాన్ని మీ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. తెవాదులు తమ వాచాలతతో, తమ పనులతో దీనికి దోహదం చేస్తున్నారు.
  అబ్రకదబ్ర:అవతలోడి ఇల్లు తగలబెట్టాలి, అందుకు ఏదో ఒక రకంగా నిప్పు రాజెయ్యాలి, చేసి ఆ మంటలో చుట్ట వెలిగించుకోవాలి. ఇదీ తెవాదుల ఉద్దేశం. 14F తో నిప్పు రాజేసారు. చుట్ట వెలిగించుకుందామనుకుంటోండగా వాళ్ళ మూతీ మొహమూ కాలిపోయాయి. ఇప్పుడు మసిబారిన మొహాలతో కరీంనగరో, నిజామాబాదో పోతే జనం ఏం చేస్తారోనని వాళ్ళకు భయం ఉంది.
  Praveen Sarma: శెహబాష్ ప్రవీణ్..., ఒక తెవాద సన్నాసి కూడా సరిగ్గా ఇలాంటి తెలివైన వాదనే చేసాడు. ’సర్వే ఎక్కడ చేసారు? తెరాస నేతనైన మా ఇంటికే ఎవడూ రాలేదు, కాబట్టి అసలు సర్వే చెయ్యనే లేదు. మా ఊరు దిక్కుమాలినపూర్ లో ఉన్న మా నాయనమ్మను కూడా ఎవడూ పలకరించలేదు, అంచేత సర్వే జరిగిందనే మాట అబద్ధం’ అంటూ చెప్పుకెళ్ళాడు. ఇప్పుడు మీరు కూడా అవే ముక్కలు చెబుతున్నారు కాబట్టి, తల కాయ మీద మెడ కాయ ఉన్న తెవాది ఎవడైనా అభినందిస్తాడు. కానీ ఇంకా పెద్దగా శెహబాష్ లు రాలేదు. ముందు ముందు వస్తాయేమో చూద్దాం.
  కాయ: :)
  Snkr: :)

  రిప్లయితొలగించండి
 10. సర్వే చేయడం ఎలా? సర్వే సత్యనారాయణకి ఫోన్ కొట్టి సందేహనివృత్తి చేసుకో.
  Snkr: :)

  రిప్లయితొలగించండి
 11. నన్ను మీరు అనుకునే తెలబాన్‌తో పోల్చినందుకు సంతోషం

  రిప్లయితొలగించండి
 12. నేను సొంత న్యూస్ పేపర్ పెట్టుకుని సర్వే చేస్తే నా అభిమాన నాయకుడు మావో జెడాంగ్‌కి ప్రపంచంలో 90% మంది అభిమానులు ఉన్నట్టు నివేదికలు వస్తాయి. ఎవరి సర్వేలో వాళ్ళ సొంత నివేదికలే ఉంటాయి. అందుకే మీ పోస్ట్ చదివి కింద పడి దొర్లి నవ్వలేక చచ్చాను.

  రిప్లయితొలగించండి
 13. /"తెలంగాణలోని మొత్తం నాలుక్కోట్ల మందీ కూడా ప్రత్యేకరాష్ట్రం కోరుతున్నారు./

  తెలంగాణ జనాభ మొత్తం 3.5 crore నండీ బాబూ ( including SA's living in Hyd). ఇదే పెద్ద అబద్దం.

  రిప్లయితొలగించండి
 14. తెలంగాణలో 50% శాతం మంది మాత్రమే ప్రత్యేకరాష్ట్రం అడుగుతున్నారనేది నిజం కాకపోవచ్చు గానీ కనీసం ఒక 30 శాతం మంది సమైక్యానికే అనుకూలమని నాకు అనిపిస్తోంది.

  అయినా రాని తెలంగాణ గుఱించి సర్వేలెందుకంటారు ?

  రిప్లయితొలగించండి
 15. ప్రత్యేక తెలంగాణ వస్తే అందులో మావోయిస్టులు చేయదల్చుకున్న మారణహోమాలూ, అరాచకాలూ ఏవో ఉన్నాయి. లేకపోతే ఎఱ్ఱబ్లాగరులు కోస్తాకి చెంది ఉండీ ఎందుకు రాష్ట్రవిభజనని సమర్థిస్తారు ? వీళ్ళ బతుకేదో దాని మీద ఆధారపడ్డట్టు కనిపిస్తోంది. అలా చూస్తే శ్రీకృష్ణకమిటీ నివేదిక ఎనిమిదో అధ్యాయం అక్షరసత్యమే కావచ్చు,

  రిప్లయితొలగించండి
 16. "నేను సొంత న్యూస్ పేపర్ పెట్టుకుని సర్వే చేస్తే నా అభిమాన నాయకుడు మావో జెడాంగ్‌కి ప్రపంచంలో 90% మంది అభిమానులు ఉన్నట్టు నివేదికలు వస్తాయి." -ఎరుపులు ఆ బాపతేనని జనానికి తెలుసు. మీరు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదులెండి.

  "..కింద పడి దొర్లి.." - మీరు ఈ బాపతేనని నాకు తెలుసు, ప్రత్యేకించి చెప్పనక్కర్లేదులెండి. :)

  రిప్లయితొలగించండి
 17. ప్రవీణూ మావో మీ అభిమాన నాయకుడా? అయితే చైనా వెళ్ళిపోరాదూ?

  రిప్లయితొలగించండి
 18. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 19. /కింద పడి దొర్లి నవ్వలేక "చచ్చాను"./


  CNN-HINDU survey is believed by every STRAIT person in the world.

  /ఆ అబద్ధాల సంగతి సరే. 14-F రద్దు వెనకున్న పెద్ద అబద్ధం సంగతేంటి? 14-F రద్దు చేసి హైదరాబాద్ ఆరో జోన్‌లో భాగం అనటం వల్ల నిజంగా అన్యాయమైపోయింది కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని తెలంగాణ ప్రజలు కారా?/

  ఏమైనా సరే 14 F రద్దు చేయాలి అని మూర్ఖపు పట్టు పట్టిన వాళ్ళను అడుగు. వాళ్లకు దురదగా వుండి రద్దు చేయమన్నారు. సరే బాగుందని రద్దు చేసేసారు. రద్దు చేయక..మూర్ఖపు తెలబాన్ల కు నచ్చ చెప్పాలా ?

  రిప్లయితొలగించండి
 20. john: నిజానికి అదీ రాసాను. కానీ తరవాత తీసేసాను.
  LBS తాడేపల్లి: "తెలంగాణలో 50% శాతం మంది మాత్రమే ప్రత్యేకరాష్ట్రం అడుగుతున్నారనేది నిజం కాకపోవచ్చు గానీ.." - అవునండి, వాళ్ళ అంకెలు సరిగ్గా సరైనవేనని నమ్మనక్కర్లేదు. కనీసం ఆ అంకెలు దేన్ని సూచిస్తున్నాయో దాన్ని చూడదలచుకోలేదు తెవాదులు.

  రిప్లయితొలగించండి
 21. తాడేపల్లి గారు, మీరు అమాయకుల్లానే ఉన్నారు. మావోయిస్టులు ఇప్పుడు తెలంగాణా కంటే ఉత్తరాంధ్ర & ప్రకాశం జిల్లాలలోనే బలంగా ఉన్నారు. ఆ మధ్య మావోయిస్టులు దేశ వ్యాప్తంగా బంద్ ప్రకటించినప్పుడు ఉత్తరాంధ్ర & ప్రకాశం జిల్లాలలోని కొన్ని గ్రామాలలోనే దుకాణాలు మూసేశారు. తెలంగాణాలో ఒక్క దుకాణం కూడా ముయ్యలేదు. శ్రీకృష్ణ కమిటీ అధికారంలో ఉన్నవాళ్ళ చెప్పు చేతల్లో ఉన్న కమిటీ అని తెలియదా? తెలంగాణా వస్తే ముస్లింలు తక్కువగా ఉన్న కరీంనగర్‌లో కూడా మత ఘర్షణలు జరుగుతాయని వ్రాసింది ఆ కమిటీ. నా షాప్‌కి వెళ్ళే టైమ్ అయ్యింది. తరువాత చూద్దాం. నాకు ఇప్పుడు టైమ్ లేదు.

  రిప్లయితొలగించండి
 22. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 23. ఈ సర్వేల మీద నమ్మకం కలగడం లేదు చదువరిగారూ..! నా క్లాస్‌మేట్స్‌లో ఉన్న తెలంగాణప్రాంతీయులని చూస్తూనే ఉన్నా, వాళ్లిప్పటికీ తెలంగాణ రావాలనే బలంగా కోరుకుంటున్నారు. ఇటువంటి సర్వేలు ఎన్ని వచ్చినా, తెలుగువాళ్లకీ, హైదరాబాద్‌ జరగాల్సినంత బ్రాండ్‌ డేమేజి ఎప్పుడో జరిగిపోయింది.. రాష్ట్రం దాటి వచ్చిన ప్రతీ ఆంధ్రుడిని పక్కరాష్ట్రాలవాళ్లు అడుగుతున్న మొదటి ప్రశ్న తెలంగాణ ఎలా ఉందీ..అని..! రెండో ప్రశ్న నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడివీ అని..! రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మాటేమోగానీ, తెలంగాణేతర ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మీద తక్కిన భారతీయుల్లో చాలామందికి సానుభూతి ఉంది.. బిజెపి వాళ్లు తప్ప..! వాళ్ల సానుభూతైనా హైదరాబాద్‌ నుండి తెలంగాణేతరుల్ని గెంటేయబోతున్నారని మాత్రమే..! మద్రాస్‌ సంగతి చాలా మందికి తెలీదు..!
  ఇప్పుడు పరిస్థితి తెలంగాణ ఏర్పాటు చేసిన ప్రభుత్వం తక్షణమే కూలే పరిస్థితి ఉంది.. అందుకే గవర్న్‌మెంట్‌ స్పష్టంగా చెప్పేసింది. ఏకాభిప్రాయం వచ్చేవరకూ తెలంగాణ రాదని..!ఇప్పుడు ఈ తెలంగాణవాదులందరూ ఆంధ్రనాయకులను బతిమాలాల్సిన పరిస్థితిని క్రియేట్‌ చేస్తోంది ప్రభుత్వం... ఇంతకాలం వలసవాదులని తిట్టించుకున్నవాళ్ళని అడగాలంటే వాళ్ళని చిన్నతనంగా ఉన్నట్టుంది. అందుకే వాళ్ళు సమ్మెలు, బంద్‌లు చేద్దామని ప్లా న్లు వేసుకుంటున్నారు. బహుశా తెలంగాణ రాకపోవడమే కే.సి.ఆర్‌ కి కావల్సింది..
  ఇక, స్టూడెంట్స్‌ విషయానికి వస్తే, తెలంగాణ విద్యార్థుల ఐ. క్యూ తక్కువని నా అభిప్రాయం. ఎందుకంటే, వాళ్ల తల్లిదండ్రుల్లో ఎక్కువమంది నిరక్షరాస్యులు. అదే మనవైపు తల్లిదండ్రులు కనీసం పదో తరగతి వరకూ చదివినవాళ్లు ఎక్కువ ఉన్నారు. ఇదే వాళ్లలో చిన్నతనం నుండి ఉండే బెంగలకి, భవిష్యత్తు మీద అపనమ్మకానికీ కారణమై ఉండవచ్చు..! దాంతో వాళ్ళు ఈజీగా ఎఫెక్ట్‌ అవుతున్నారు. అవేశపూరిత ప్రసంగాలని ప్రభావితమైపోతున్నారు. మనవైపు జరుగుతున్న ఉద్యమాల్లో విద్యార్థులు పెద్దగా పాలుపంచుకోకపోవడానికి ఇది ఒక కారణం... తరం మారినపుడు, ఇప్పుడు ఉద్యమాలు చేసినవాళ్ల పిల్లలు ఇటువంటివాటికి ప్రభావితం కాకపోవచ్చు..ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే..!

  రిప్లయితొలగించండి
 24. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 25. వామన గీత గారు,

  @తరం మారినపుడు, ఇప్పుడు ఉద్యమాలు చేసినవాళ్ల పిల్లలు ఇటువంటివాటికి ప్రభావితం కాకపోవచ్చు..ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే..!

  బాగా చెప్పారు. కాని తరాలు మారినా అక్కడి విద్యావకాశాలు పెద్దగ మెరుగుపడడం లేదు అన్నది ఒక ముఖ్య కారణమైతే, నేటి తెల౦గాణ విద్యావ౦తులు ఎక్కువ శాతం విభజన కొరుకు౦టున్నారు . ఇవన్ని పక్కన పెట్టినా , నాలుగు తరాలకు కావాల్సిన తెల౦గాణా నాయకత్వం వేల్లూనుకు౦ది. హైదరాబాదును అభివృద్ధి చేసిన శ్రమ ఎప్పటిలానే హైదరాబాదులోనే ఉ౦టు౦ది. వారు హైదరాబాదును వదిలిపెత్తల్సిన అవసరమే లేదు. ఇప్పుడు వారు ఎన్నుకొన్న నేతలే ము౦దు ము౦దు కుడా ఉ౦టారు. వారికి వచ్చిన నష్టం ఏమిటో ఎవరూ చెప్పలేదు.

  సమైక్య వాదనలో నాకు కనిపి౦చిన ఒక లోపము : హైదరాబాదు ఒక్కటి వదిలేస్తే విభజన నిమిషాల్లో జరిగిపోతు౦ది.

  మరి మిగిలిన తెలంగాణా ప్రా౦తాల్లొ ఉన్నా ఆ౦ధ్రులు ఏమయినా పరవాలేదా? విభజనలో 'చెడు' ఉ౦టే అన్ని ప్రా౦తాలలో ఆ౦ధ్రులకు అది వర్తి౦చాలి. అందరి ప్రయోజనాలు పరిశీలించాలి మనవాళ్ళు అనుకు౦టే . అక్కడి వారికి లేని కష్టం హైదరా బాడు లోని ఆ౦ధ్రులకి మాత్రం ఎలా వచ్చి౦ది ?

  ఇక్కడ హైదరాబాదు లో ఉన్న ఆ౦ధ్రులు మిగిలిన ఏ జిల్లా ఆ౦ధ్రులను (ఆ౦ధ్ర ప్రా౦త జిల్లాలతో కలిపి) తమ వారిగా భావి౦చడమ్ లేదు. కాని సమైక్యా౦ధ్ర అ౦టున్నారు :)

  రిప్లయితొలగించండి
 26. ము౦దు వ్యాఖ్యని చిన్నసవరణ కొరకు తొలగి౦చాల్సివచ్చినది.

  రిప్లయితొలగించండి
 27. @ మౌళిగారూ..!
  విద్యావకాశాలు మెరుగవ్వడం లేదన్నది శుద్ధ అబద్ధం..! విద్యావకాశాల గురించి తెలంగాణవాదులు చెప్పే పరిస్థితులు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. అయితే, కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నాయి..అంతే..! పైగా తెలంగాణ ప్రాంతంలో విద్యావకాశాలు పెరిగాయనే అనుకుంటున్నా..! దానికి ఆ ప్రాంతంలో పెరిగిన అక్షరాస్యతే సాక్ష్యం...కానీ, అక్షరాస్యత కన్నా, జనంలో ఉన్న బతుకు భయమే అన్ని ఉద్యమాలకీ మూలకారణం...అది తెలంగాణా అయినా, సమైక్యాంధ్రా అయినా..! ఆ భయం తెలంగాణేతర విద్యార్థుల్లోకన్నా తెలంగాణ విద్యార్థుల్లో ఎక్కువగా ఉంది. దానికి నేను తర్కించుకున్న కారణాన్ని ముందు వ్యాఖ్యలో అభిప్రాయపర్చాను..
  ఎటొచ్చీ, ఇబ్బంది అంతా ఉద్యోగ అవకాశాల గురించే..! ఈనాడు ఇంజనీరింగ్‌ గానీ, ఎం.సి.ఎ గానీ చేసి కాలేజిలో ఉద్యోగం రానివాళ్లందరికీ డెస్టినేషన్‌ హైదరాబాద్‌లోని అమీర్‌పేటగానీ, సనత్‌నగర్‌గానీ (అన్ని ఏరియాలూ నాకు పూర్తిగా తెలీదు) అయి ఉంటోంది. ఇందుకు తెలంగాణా వాళ్ళు, తెలంగాణేతరులు అనే భేదం లేదు..! వాళ్లక్కడే ఏదో కోర్స్‌ చేస్తూ అప్పుడప్పుడూ పడే ఉద్యోగాలకి అప్లై చేస్తూ ఉంటారు... వాళ్లకందరికీ మరి యీ తెలంగాణవాదులు ఏం సమాధానం చెప్తారు..? అవతలికి పొమ్మనా..? మొన్న పేపర్‌ కరెక్షన్‌కి వెళ్ళిన లెక్చరర్లని తన్నేరు. తర్వాత వీళ్లని తన్నరని గేరంటీ ఏమిటి..? ఇటువంటి బాధలు వైజాగ్‌వాళ్లకి బాగా తెలుసు. ఉద్యోగాల కోసం, ఇంటర్వ్యూల కోసం ఒరిస్సాకో, బీహార్‌కో పోతే సర్టిఫికెట్లు చింపి చేతుల్లో పెట్టేవారు. (ఇప్పుడు పరిస్థితి కొద్దిగా బెటర్‌..!). ఇదే మీరన్న హైదరాబాద్‌ని మినహాయిస్తే విభజన వెంటనే జరిగిపోతుందన్నదానికి సమాధానం..! ఎందుకంటే హైదరాబాద్‌కి సాటి వచ్చే ఊరు మనరాష్ట్రంలో వేరే ఏదీ లేదు..! రానివ్వరుకూడా..!
  ఇంక మీరు ఆఖరిగా అన్నది..//ఇక్కడ హైదరాబాదు లో ఉన్న ఆ౦ధ్రులు మిగిలిన ఏ జిల్లా ఆ౦ధ్రులను (ఆ౦ధ్ర ప్రా౦త జిల్లాలతో కలిపి) తమ వారిగా భావి౦చడమ్ లేదు// దీంతో నేను ఏకీభవించడం లేదు..

  రిప్లయితొలగించండి
 28. గత కొన్నిరోజులుగా 14-F పై వివిధ బ్లాగుల్లో జరిగిన చర్చలు, తిట్లు పై నా అభిప్రాయాలు.

  ౧) దీని రద్దుకై 2010 లో *ఆంధ్రప్రదేశ్* శాసనసభ *ఏకగ్రీవంగా* తీర్మానం చేసిందట. అందువల్ల రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల వారికి నష్టం కలుగుతుంది అని అనుకున్నపుడు సమైక్యవాదం గురించి మాట్లాడే వాళ్లు ఎందుకు ఒప్పుకున్నట్టు. తెలంగాణేతరులను మోసం చేసినట్టుకాదా ? ఒకవేళ రద్దు చేయడం కల్ల అని తెలిసుంటే తెలంగాణా వాళ్లను మోసం చేసినట్టు ఎందుకు అనుకోకూడదు.

  పోని....

  ౨)14-F రద్దు వల్ల తెలంగాణా లోని మూడు జిల్లాలు నష్టపోతాయి అని మిగతావారంటున్ణారు గాని, ఆ జోన్ లోని మూడు జిల్లాలవారు అనడంలేదే. కందకు లేని దురద కత్తిపీటకెందుకో! ( ఇది తెలంగావాదులు అన్నందుకు )

  పోనీ...

  ౩)14-F రద్దు వల్ల తెలంగాణేతరులకు ఉద్యోగాలు పూర్తిగా పోతాయా. లేదే. నియామకాల్లొ డెబ్భై శాతం స్థానికులకు ముప్ఫై శాతం స్థానికేతరులకు ఇస్తున్నారుగా.

  పోనీ....
  ౪)స్థానికులు అంటే తెలంగాణా వారేనా అంటే అదీకాదు. ఒక వ్యక్తి స్థానికుడు అనిపించుకోవాలంటే నిర్దిష్టమైన సంవత్సరాలు ఆ జోన్‌లో ఉండి తీరాలి అని అన్నారు. అది ఇరుప్రాంతాలవారికి వర్తిస్తుంది కదా. ఒక ప్రాంతంలోని ఉద్యోగాలు ఆ ప్రాంతంవాళ్లకే (తెలంగాణావారా సీమాంధ్రులా అన్న సమస్యలేదిక్కడ) ఇస్తే తప్పేంటి ?

  పోనీ....
  ౫) తెలంగాణా లో ఉన్నవి రెండు జోన్స్. అంటే తక్కిన ఆంధ్రప్రదేశ్ లో నాలుగు జోనులు ఉన్నాయి. తెలుగువాడు రాష్టంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకునేట్టు ఉండాలి అంటున్నవారు ఈ నాలుగు జోనులు మాకొద్దు మేమంతా ఒకే జోన్/ప్రాంతంగా ఉంటాము అని ముల్కీ నిబంధనలు వచ్చినప్పడినుండి ఇప్పటిదాకా ఎందుకు కోరలేకపోయారు ? "మీ ప్రాంతం ఉద్యోగాలు మీకు మాత్రమే, తెలంగాణా ప్రాంతం ఉద్యోగాలు అందరికా" అని తెలంగాణావాళ్లు ఎందుకు ప్రశ్నించకూడదు ?

  తరచి చూస్తే ఇదీ ఈ ఒక్క విషయంలోనే మన 'సమైక్య' వాదం. !!!

  by the way, వామన గారి వ్యాక్య అర్ధవంతంగావుంది.

  రిప్లయితొలగించండి
 29. @JOHN:

  >> "ఏమైనా సరే 14 F రద్దు చేయాలి అని మూర్ఖపు పట్టు పట్టిన వాళ్ళను అడుగు. వాళ్లకు దురదగా వుండి రద్దు చేయమన్నారు. సరే బాగుందని రద్దు చేసేసారు. రద్దు చేయక..మూర్ఖపు తెలబాన్ల కు నచ్చ చెప్పాలా ?"

  అదే నేననేదీ.

  రిప్లయితొలగించండి
 30. వామన గీత గారు,

  @రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది.

  {తెల౦గాణా వారు కూడా ఇది వారి ఖర్మ అని సరిపెట్టుకోవడం లేదు కాబట్టి వారిదే తప్పంటారా .}

  @ ఆ ప్రాంతంలో పెరిగిన అక్షరాస్యతే సాక్ష్యం...

  {అక్షరాస్యత ఉ౦టే సరిపోదు కదా ఉన్నత విద్యావకాశాలు అ౦దుపుచ్చుకోడానికి (తాడేపల్లిగారిలా చేతకాక సాధి౦చుకోలెదని అనకండి )}

  @జనంలో ఉన్న బతుకు భయమే అన్ని ఉద్యమాలకీ మూలకారణం...అది తెలంగాణా అయినా, సమైక్యాంధ్రా అయినా..!

  {ఇప్పటికి ఎ౦త మ౦ది హైదరాబాదు లో ఉన్న ఆ౦ధ్రులు చనిపోయారు ?}

  @ఎటొచ్చీ, ఇబ్బంది అంతా ఉద్యోగ అవకాశాల గురించే..!

  {మీరు చెప్తున్నది ప్రభుత్వ ఉద్యోగాలగురి౦చి మాత్రం కాదు . ఇక ప్రివాతే ఉద్యోగాలు ఆ క౦పెనీ ల ఇష్టా ఇష్టాలపై ఉ౦టు౦ది. విభజన ప్రభావం పెద్దగా ఉ౦డాల్సిన పనిలేదు. }

  @ఉద్యోగం రానివాళ్లందరికీ డెస్టినేషన్‌ హైదరాబాద్‌లోని అమీర్‌పేటగానీ, సనత్‌నగర్‌గానీ (అన్ని ఏరియాలూ నాకు పూర్తిగా తెలీదు) అయి ఉంటోంది.

  సనత్ నగర్ ఆ :)

  {ఇన్ని సంవత్సరాలలో ఎ౦త మ౦ది ఇబ్బ౦ది పడినారు ?}


  @ మొన్న పేపర్‌ కరెక్షన్‌కి వెళ్ళిన లెక్చరర్లని తన్నేరు. తర్వాత వీళ్లని తన్నరని గేరంటీ ఏమిటి..?

  {ఒక్కసారే ఎ౦దుకు జరిగి౦దలా ? ఇప్పటివరకు ఉద్యోగాలకోసం వచ్చిన ఎవ్వరిని వాళ్ళు తన్నలేదే}

  @ఇదే మీరన్న హైదరాబాద్‌ని మినహాయిస్తే విభజన వెంటనే జరిగిపోతుందన్నదానికి సమాధానం..! ఎందుకంటే హైదరాబాద్‌కి సాటి వచ్చే ఊరు మనరాష్ట్రంలో వేరే ఏదీ లేదు..! రానివ్వరుకూడా..!

  {హైదరాబాదులో ఉన్న ఆ౦ధ్రులకి సాటివచ్చే ఆ౦ధ్రులు కూడా లేరా? ???? }

  @ఇంక మీరు ఆఖరిగా అన్నది..//ఇక్కడ హైదరాబాదు లో ఉన్న ఆ౦ధ్రులు మిగిలిన ఏ జిల్లా ఆ౦ధ్రులను (ఆ౦ధ్ర ప్రా౦త జిల్లాలతో కలిపి) తమ వారిగా భావి౦చడమ్ లేదు// దీంతో నేను ఏకీభవించడం లేదు..

  {సమైక్యవాదం చేస్తున్న మెజారిటి బ్లాగర్ల వ్రాతలలో ఇది ఉ౦ది }

  రిప్లయితొలగించండి
 31. మౌళిగారూ..!
  నా వ్యాఖ్యపై మీరు స్పందించిన దానికి నేను రాసిన పోస్టు... ఇక్కడ అంత పెద్దది రాయడం పద్ధతికాదేమోనని పోస్టు రాసాను. ఎవరూ తప్పుగా అనుకోరాదని మనవి..!

  http://vamana125kkd.blogspot.com/2011/08/blog-post_16.html

  రిప్లయితొలగించండి
 32. ప్రాంతమే కాదు, ఏ ప్రాతిపదిక మీదనైనా సరే, రిజర్వెషన్ కోరే ప్రతివాడూ చేతగానివాడే, పిఱికివాడే అసమర్థుడే, చవట దద్దమ్మే. అలాంటివాళ్ళు వట్టి useless fellows అని చెప్పడానికి నేను సంకోచించను. ఉద్యోగానికి ఉద్యోగం చేయగలగడమే criteria గా ఉండాలి. అలాంటి ప్రతిభ relevant criterion. తతిమ్మా అన్నీ irrelevant criteria. అమ్మాయిని ఏలుకోగలవాడే ఆమెకి మొగుడవ్వాలి. యుద్ధం చేయగలవాడే సైనికుడవ్వాలి. దైవభక్తుడే పూజారి అవ్వాలి. అలా ఉద్యోగ విధులతోనూ, పరిజ్ఞానంతోనూ సంబంధం లేని విషయాల్ని నియామకాల్లోకి ఈడ్చుకోస్తున్నారంటే దానర్థం వాళ్ళు అసలు విషయాన్ని bypass చేస్తున్నారన్నమాట.

  రిప్లయితొలగించండి
 33. వామనగీత గారు,

  మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఇ౦దుకు కొత్త, పాత అని అనుకోవాల్సిన పని లేదు.
  పొతే మీరు ఇ౦కా 'విద్యార్ధి' అని అన్నారు కావున మీ వ్యాఖ్యల్ని అలాగే అర్ధం చేసుకోవాలి. గ్యార౦టి ఏమిటన్నదే మీ సమస్య. తెల౦గానా వారిని అర్ధం చేసికోగలిగితే ఈ భయాలు ఉత్తినే తేలిపోతాయి.విషయాన్ని నాన్చుతూ ఉ౦టే ఇ౦కా ప్రతి ఏటా ఉద్యోగాలు పోతూనే ఉ౦టాయి.

  @తాడేపల్లి గారు,
  మహిళా రిజర్వేషన్ అయినా అనుభవి౦చిన మాకు మీ కోపం అర్ధమవుతు౦ది. కాని మీ వ్యాఖ్య సమ౦జసమ్ గా లేదు. :) రిజర్వేషన్ల అవసర౦ ఏమిటో సవ్యం గా చర్చి౦చే౦దుకు ఇది వేదిక కాదు.

  రిప్లయితొలగించండి
 34. మౌళిగారూ ! తెలంగాణవాళ్ళకి నిజంగానే చేతకాలేదు. వాళ్ళు కాలానికి తగ్గట్లు అప్‌డేట్ కాలేక ఆంధ్రావాళ్ళు తొండి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మాట చెబుతున్నందుకు నన్ను బూతులు తొట్టొద్దు. నాకు తెలుగువాళ్ళంతా సమానమే. ఎవఱినీ కించపఱచడానికి నేనీ మాట చెప్పడం లేదు. ఒక చారిత్రిక సత్యాన్ని చెబుతున్నాను. నేను వాస్తవంగా నా మనసులో ఏమనుకుంటున్నానో అదే చెబుతున్నాను. ఈ లోపాన్ని సవరించుకుంటే తెలంగాణవాళ్ళు పైకొస్తారనే ఉద్దేశంతో point out చేస్తున్నాను.

  నేను గమనించినంత వఱకూ తెలంగాణవాళ్ళు మానసికంగా 1970 లలో బతుకుతున్నారు. వాళ్ళు ఒక సోషలిస్టు కమ్యూనిస్టు మైండ్‌సెట్‌లో జీవిస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని ఇతరదేశాల మాదిరే ఒక పెట్టుబడిదారీ మార్కెట్ ఆర్థిక వ్యవస్థ గల రాజ్యమనీ, ఇక్కడ ఎవడూ ఎవణ్ణీ పనిగట్టుకుని ఉద్ధరించడనీ, ఎవఱి సంగతి వాళ్లే చూసుకోవాలనీ గుర్తించలేకపోతున్నారు. గుర్తించలేక తమ అన్ని కష్టాలకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్నీ, ఆంధ్రావాళ్ళనీ దూషిస్తున్నారు. ఇప్పటికీ రాజకీయ నాయకుల్ని గ్రుడ్డిగా నమ్ముతున్నారు. రాజకీయాల ద్వారా ఆర్థిక ప్రగతి అనే పాత చింతకాయ పచ్చడి భావనల్లో ఉన్నారు. అందుకే ప్రత్యేకరాష్ట్రం వస్తే తామేదో బంగారుపళ్ళేల్లో వెండిముద్దలు తినబోతామనీ, వజ్రాల వఱుగులూ, రత్నాల నంజులూ నముల్తామనీ భ్రమిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటి పరిస్థితి - ఆర్థికం ద్వారానే రాజకీయం.

  తమకి ఏ ఇబ్బందులున్నాయని వీళ్ళు చెబుతున్నారో, అలాంటి ఇబ్బందులు కొద్దో గొప్పో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలవారికీ ఉన్నాయి. కానీ దీనికంతా సమైక్యరాష్ట్రమే కారణం వారు అనట్లేదు. సమకాలీనాన్ని అవగాహన చేసుకొని ఎవఱి తంటాలు వాళ్ళు పడుతున్నారంతే ! 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఉభయప్రాంతాలవారూ ఒకే మానసిక, ఆర్థికస్థాయిలో ఉన్నారు. అందుకే కలిసిపోవాలనుకున్నారు. కలిసిపోయారు కూడా. కానీ ఈ మధ్యలో ఆంధ్రా సైకాలజీలో ఏదో జఱిగింది. హఠాత్తుగా ఏదో చైతన్యం వచ్చింది. అది ఆ జనాభాని భూతంలా పూనింది. అక్కడి జనం రాజకీయనాయకుల్ని నమ్మడం మానేశారు. ప్రభుత్వం తమకేదో ఒఱగబెడుతుందని కూడా నమ్మడం కూడా మానేశారు. ఎవడి సంగతి వాడు చూసుకోవడం మొదలుపెట్టాడు. ఎంత దూరమైనా సరే, డబ్బు కోసం వలసపోవడానికి వెనుదీయలేదు. ఎంత ఖర్చయినా సరే, పిల్లల్ని చదివించడానికి సంకోచించలేదు. దాన్తో ఆంధ్రా మధ్యతరగతి లోంచి ఆంధ్రా కోటీశ్వరులు ఉద్భవించారు. ఆ కోటీశ్వరులలోంచి క్రమంగా ఆంధ్రా కుబేరులు ఉద్భవించారు. అక్కడ లక్షలాదిగా కోటీశ్వరులు తయారవ్వడంతో వాళ్ళ పక్కన జీవించే సాధారణ, పేదవర్గాలు కూడా లక్షాధికారులయ్యారు. పెఱిగిన భూవిలువల మూలాన అక్కడ ప్రతివాడికీ సగటున పదీ-ఇఱవై లక్షల ఆస్తి ఏర్పడింది. అలా వాళ్ళ కొనుగోలుశక్తి (purchasing power) ఒక సగటు తెలంగాణవాడికంటే ఎన్నోరెట్లు అధికమై కూర్చుంది. ఆ ప్రభావమంతా హైదరాబాదు మీద పడింది.

  ఇది ఆంధ్రావాళ్ళ తప్పా ? తెలంగాణవాళ్ళ తప్పా ? స్థిమితంగా, తార్కికంగా ఆలోచించండి. రేసులో గెలిచినవాడు గెలవడమే తప్పా ? ఓడిపోయినవాడి తప్పేమీ లేదా ? గెలిచిన ప్రతివాడూ తొండిచేసి గెలిచినట్లేనా ? గెలిచినందుకు అతన్ని శిక్షించాలా ? అభినందించాలా ? గెలిచినవాణ్ణి చూసి నేర్చుకోవాలా ? లేక అతని మీద బుఱద జల్లాలా ? ఎప్పుడైనా ఒకడో ఇద్దఱో తొండిచేసి గెలిచి ఉండొచ్చు. అయిదుకోట్ల ఆంధ్రాజనమూ అలాగే గెలిచారా 55 ఏళ్ళనుంచి ? అదే నిజమైతే, దాన్ని అనుమతించినవాళ్ళ మేధాశక్తి ఏపాటిది ? అక్కడైనా తప్పెవఱిదో అర్థం కావట్లేదా ? ఆంధ్రప్రదేశ్ ని పరిపాలించిన రాజకీయనాయకులు ఆంధ్రా ఏరియాలో ఎప్పుడైనా ఎవడికైనా పిలిచి పదిరూపాయలు చేతిలో పెట్టారా ? జనం ఎవఱి కష్టం వారు పడ్దారంతే !

  రిప్లయితొలగించండి
 35. /బీడీలు చుట్టి రోజుకి నలభై రూపాయలు సంపాదించే బీడీ కార్మికుడు తనని తాను ఎంత ఉద్ధరించుకున్నా ఆ నలభై రూపాయల సంపాదనతో పైకి రాలేడు. /

  'Survival of the fittest'..ఎపుడైనా విన్నారా ? Did you find any 'type institutes' which were present everywhere some 15 years ago ? It is just stupidity to hang on with a 'type institute'. There is HUGE labor problem now in India. You have to give more than Rs 200 per day per one labourer. Who is asking your so called 'బీడీ కార్మికుడు' to go with 'బీడీ' ? What is the use making such beedies/gudumba anyway to the society ?

  రిప్లయితొలగించండి
 36. LBS తాడేపల్లి
  date Wed, Aug 17, 2011 at 2:42 AM
  subject [చదువరి] తెవాదుల అబద్ధాల్ని మళ్ళీ ఇంకొకరు బైటపెట్టారుపై క్రొత్త వ్యాఖ్య.

  @LBS తాడేపల్లి గారూ మీ ఎనాలిసిస్ బ్రహ్మాండంగా ఉంది. కళ్ళ ఎదురుకుండా జరుగుతున్న వాస్తవాల్ని ఎందుకు గుర్తించటానికి ప్రయత్నించరో అర్ధంకాదు.

  రిప్లయితొలగించండి
 37. చదువరిగారు దయతో అనుమతిస్తే ఇంకో మాట వ్రాస్తాను.

  కోస్తా జనాలకి రాజకీయాల పట్ల ఆసక్తి చచ్చి చాలాకాలమైంది. ఇది ఒక్క మధ్యతరగతికే పరిమితం కాదు. కోస్తాలో వందల వేలకోట్ల అధిపతులక్కూడా రాజకీయాల మీదా, పరిపాలన మీదా ఆసక్తి లేదు. ఎన్నికలొచ్చినప్పుడు అక్కడ కూడా చాలామంది వివిధపార్టీల టిక్కెట్ల కోసం దరఖాస్తు చేస్తారు. కానీ అది వాళ్ళకి చావుబతుకుల సమస్య కాదు. ఉదాహరణకి - ఎన్నికలు లేనప్పుడు అక్కడ వేఱువేఱుపార్టీల నాయకులు వ్యాపార భాగస్వాములుగా ఉంటారు. అందువల్ల పరిపాలించడానికి కావాల్సిన Killer instinct కోస్తా ధనికుల్లో లోపించింది. రాజకీయాల్లో ఉన్న కావూరి, రాయపాటి, లగడపాటి, TSR వంటి నాయకులు ఉన్నవి కాపాడుకోవడానికి ఉన్నారు తప్ప పదవులిస్తే తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే గత 23 ఏళ్ళుగా (మధ్యలో ఒక సంవత్సరం NTR నీ, ఇంకో సంవత్సరం రోశయ్యనీ మినహాయిస్తే) కోస్తా నుంచి ముఖ్యమంత్రులు లేరు. అయితే కోస్తాలోని ఈ అనాసక్తి (disinterest) ని రాయలసీమ నాయకులు సమయోచితంగా బాగా ఉపయోగించుకున్నారు. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే - ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే రాయలసీమ చరిత్రే. కేవలం నాలుగుజిల్లాల తెలుగుతమ్ముళ్ళు సాధించినది పదిజిల్లాల తెలంగాణ నాయకులు ఎందుకు చేయలేకపోయారు ? అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి కాదగ్గ మహానాయకుణ్ణి ఆ ప్రాంతం ఎందుకు ఉత్పత్తి చేయలేకపోయింది ? రాష్ట్రంలోని ఒక అత్యంత ధనికప్రాంతం "మాకు రాజకీయాలు వద్దు, అధికారం వద్దు" అంటూంటే ఆ సువర్ణావకాశాన్ని దొఱకబుచ్చుకోకుండా ఈరోజున "సీమాంధ్ర ప్రభుత్వం, రాయలసీమ రాజశాసనాలూ" అంటూ దూషించడం తెలివితేటలేనా ?

  రిప్లయితొలగించండి
 38. తాడేపల్లి గారు,

  మీ ము౦దువ్యాఖ్య ఆ౦ధ్ర ప్రజలకు సమైక్య ఉద్యమానికి స౦బ౦ధమ్ లేదని సూచిస్తున్నది.

  ఇక మీ చివరివ్యాఖ్యలో కొంత అర్ధవ౦తమైన ఊహ కనిపిస్తున్నది. ఏమిట౦టే,

  మీరు సమస్యలు లేనిచోట నాయకత్వం ఏర్పడదు అ౦టున్నారు. ఆ స్ట్రగుల్ సీమ, తెల౦గాణలలో ఉ౦ది అ౦టున్నారు. మ౦చిదే కదా ఈ సమస్యలను౦డి తెల౦గాణలో చక్కని నాయకత్వం రాష్ట్రానికి లభిస్తే.

  రిప్లయితొలగించండి
 39. పరిపాలన రాజకీయాలు సమైక్యభావన ఆన్నీ ఒకటెలా చేసి మాట్లాడతారు ? మొదట్నుంచీ తె.వాదులు చేసే పొఱపాటు ఇదే. తాము కన్‌ఫ్యూజ్ అయి ఇతరుల్ని కన్‌ఫ్యూజ్ చేస్తూంటారు. బహుశా వారు చిన్నతంలో Comprehension passages గుఱించిన exercises సరిగా చేసుండరు. వారి comprehension abilities ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. సమైక్యం ఒక ఉద్యమం కాదు. అది రాజకీయం కాదు. అది ఒక సార్వజనీన భావన. అది జాతి చేతనలో అంతర్భవించిన యూనివర్సల్ సెంటిమెంటు. నాకూ రాజకీయాలూ, పరిపాలన ఆసక్తి లేవు. నేను వాటిల్లో పాల్గొనను. కానీ నేను సమైక్యవాదినే కదా ! అలాగే కోస్తావారంతా !

  రిప్లయితొలగించండి
 40. @పరిపాలన రాజకీయాలు సమైక్యభావన ఆన్నీ ఒకటెలా చేసి మాట్లాడతారు ?

  మీ ము౦దువ్యాఖ్య ప్రకారం ఆ౦ధ్ర జిల్లా లలో ఉన్న ప్రజలకు సమైక్యతా, విభజన వల్ల పెద్ద ప్రభావం ఉ౦డదు. లేదు ఉ౦టు౦ది అ౦టే అదెలాగో వివరి౦చ౦డి.

  పరిపాలన, రాజకీయం, సమైక్య భావన మూడు ఒకదానికొకటి స౦బ౦ధమ్ లేనివి అని మీ అభిప్రాయమా. Comprehension లో మీరోకటి ఉహి౦చి/అభిప్రాయపడి వ్రాస్తే ప్రశ్నలు వస్తాయి కదా. యదా తదం గా స్వీకరి౦చాలన్నా కూడా ప్రశ్నలకు సమాధానం వచ్చాకనే.

  రిప్లయితొలగించండి
 41. /అయితే కోస్తాలోని ఈ అనాసక్తి (disinterest) ని రాయలసీమ నాయకులు సమయోచితంగా బాగా ఉపయోగించుకున్నారు./
  :) ఎలా? YSR, Naraలు ముఖ్యమంత్రులయ్యారనా?! అనాస్క్తా? ఎవ్వరికి ఏదో చేతకాక దిగాడేకాని, ఇంకా బ్రతికే వున్నానంటూ అవినీతి వ్య్తిరేక ఉద్యమం మీద అర్థంలేని కామెంట్ చేసి సంకేతాలు ఇస్తున్నాడుగా! ఏదో శేష జీవితం విలాసంగా, పనీపాట లేకుండా విశ్రాంతంగా గడిపేయాలని కాకపోతే, అలా గుండెపట్టుకుని ఆరోగ్యకారణాల వల్ల దిగిపోయిన ముసలాయనకు interest లేదా? :)
  నోరిప్పితే అక్షరమ్ముక్క రాని బొత్స పార్టీలో పైకి ఎగబాలేదా? మరీ కోట్ల కొద్దీ జనాల మనస్తత్వాన్ని అలా జనరలైజ్ చేయడం ... :)


  /ఈరోజు మన పరిస్థితి ఏంటంటే - ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర అంటే రాయలసీమ చరిత్రే. కేవలం నాలుగుజిల్లాల తెలుగుతమ్ముళ్ళు సాధించినది/
  హ్వా హ్వా హ్వా .. ఆ సాధించారు, కరువులో దేశంలోనే మొదటి స్థానం. చాల్లేద్దురూ మరీ అతిశయోక్తులు వద్దు, జనాలు నవ్విపోతారు. ఓ సారి రాయలసెమ/వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, గోదారి/గౌతమి ఎక్స్‌ప్రెస్ ఎక్కి తలుపు దగ్గర నిల్చొని చూస్తే సాధించింది అర్థమయిపోతుంది, ఎవరినీ ఇంటర్వ్యూలు కూడా చేయక్కరలేదు. మొన్న హైద్రాబాద్ నుంచి బెంగుళూరు వెళుతూ చూశాను.

  రిప్లయితొలగించండి
 42. /కావాల్సిన Killer instinct కోస్తా ధనికుల్లో లోపించింది./
  రాయలసీమలో 'killer' instinct బాగా వుందన్నారు, ఒప్పుకుంటున్నా. ఈమధ్య కొంత తగ్గిందేమో కూడా. ;)

  రిప్లయితొలగించండి
 43. అర్థం కానట్లు నటిస్తే బావుండదు. సమైక్యం దేశభక్తిభావన. అది ఒక సాంప్రదాయికభావన. అది ఒక జాతిస్పృహ., దానికి రాజకీయాలతోనూ, పరిపాలనతోనూ సంబంధం లేదు.

  snkr గారూ ! రాజకీయాల ద్వారా సమాజాన్ని దేశాన్ని బాగుచేయగలమనే నమ్మకం ఉన్న ఒక్క కోస్తావాణ్ణి చూపించండి. అక్కడ రాజకీయ నాయకులక్కూడా ఆ నమ్మకం లేదు.

  రిప్లయితొలగించండి
 44. Kiler instinct అంటే మనుషుల్ని చంపడం కాదండీ బాబూ ! Don.t be too literal. ఆ పరాక్రామిత్వం లేదని అర్థం.

  రిప్లయితొలగించండి
 45. @snkr.. నారా, వైయస్సార్‌లు ముఖ్యమంత్రులయ్యారని కాదండీ ! రాష్ట్రాన్ని పాలిస్తానని ధైర్యంగా ముందుకొస్తున్న ఒక్క కోస్తానాయకుణ్ణి చూపించండి. ఒక్కడూ లేడు 122 మందిలో ! ఇప్పుడేమో అందఱూ జగనో జగనో అని సీమ జగన్ వెంటపడ్దారు. రాయలసీమకంటే కోస్తాలోనే జనం జగనంటే పడి చస్తున్నారు. నిజంగా కోస్తాలో పరిపాలించే సత్తా దమ్మూ ఉన్న నాయకుడుంటే కోస్తాజనం జగన్ వెంట పడేవాళ్ళా ?

  ఎన్టీయార్ సంతానం కోస్తావాళ్లే. అయినా అందఱూ సీమబాబుకే సలామ్ కొట్టారు తప్ప పరిపాలిస్తానని ముందుకొచ్చినవాడు ఒక్కడున్నాడా గత 16 ఏళ్ళల్లో ? అంత గొప్ప మహామనీషి వారసత్వాన్ని కూడా ఉపయోగించుకోలేకపోయారు. This is not something to do only with one family, one person or one district. The entire Telugu Coast as a whole is disinterested in politics. They are more interested in business and industry.

  రిప్లయితొలగించండి
 46. / రాయలసీమకంటే కోస్తాలోనే జనం జగనంటే పడి చస్తున్నారు. /
  అది రాజకీయ చైత్యన్యమే కదా! జగన్ దగ్గర వేలకోట్లు వుంది కాబట్టే డైరెక్ట్‌గా స్వర్గానికి ఎగురుతానన్నాడు, బిస్కెట్లు తిన్నారు కాబట్టే ఆయనకు 'జై' కొడుతున్నారు. నాలుగు రాళ్ళు/షిప్పులు వెనకేసుకున్నాడు కాబట్టే కెసిఆర్ అక్కడ చీలిక తెచ్చైనా ముఖ్యమంత్రి కావాలని ఆటలాడుతున్నాడు.

  ఇపుడు కొత్తగా రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అంటూ చీలికలు తెచ్చేలా వ్యాఖ్యలు చేయడం సమైక్యాంధ్ర స్పూర్తికి విరుద్ధం, కొద్దిగా సంయమనం పాటించండి, సార్. జగన్ గమ్యం,ఒక్కో అడుగూ తిహార్ వైపే అని తెలియట్లేదూ, అప్పుడు కోస్తా/సీమ/తెలంగాణా నాయకులంతా ఎలా గెంతుతారో చూద్దురు గాని.
  మనం ఇప్పుడు కొట్టుకుంటే, అసలే రెచ్చిపోతున్న వేర్పాటు వాదులకు వేలెట్టడానికి సందు ఇచ్చినట్టవుతుంది. కోస్తా, సీమ, తెలంగాణ వేరు జిల్లాలు/ప్రాంతాలేకాని అందరికీ అంత ఖచ్చితమైన, స్థిరమైన మూస మనస్థత్వం అంటూ ఏదీ వుండదు. దాదాపు ఒకటే సంస్కృతి వున్న దేశంలోనూ అంతే.

  మీరు ఇదివరలో చెప్పినట్టు తాడేపల్లిని రాష్ట్ర రెండో రాధానిగా చేసేవరకైనా సంయమనం పాటించల్సిన వ్యూహాత్మక అవసరం వుంది. ;)

  రిప్లయితొలగించండి
 47. /ఎన్టీయార్ సంతానం కోస్తావాళ్లే. అయినా అందఱూ సీమబాబుకే సలామ్ కొట్టారు /
  ఆ .. పెండ్లాడి పిల్లల్ని కూడా కన్నారు, ఇంకా మీరు కోస్తా కోస్తా అంటున్నారు.
  అలాగంటే మొక్కోడు కోస్తా వాడే అన్నారు. ఏమిటో! మరీ ఇంత చాదస్తం పనికి రాదు... చిరూను చూడండి.. ఆయన్ను రాష్ట్ర ప్రజలు ముఖ్యమత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అనట్లేదూ... మీరేమో రాజకీయ చైతన్యం లేదో లేదో అంటున్నారు, అది చైతన్యం కాదేంటి? ఏడాదిలో ఎన్ని రంగులు మారాడో మీరే కోస్తా వాళ్ళ గుండెకోసి చూట్టం లేదు. అర్థం చేసుకోరూ.. :P

  రిప్లయితొలగించండి
 48. పరాక్రామిత్వం :D
  ఆ .. అదేలేండి, పరాక్రమం మితంగానేవుందని నేనూ అంటున్నా.. :)

  రిప్లయితొలగించండి
 49. అరెస్టులతో పాపులారిటీ తగ్గిపోవడానికి ఇది రాజఱికం కాదు గదా ? కనిమొళినీ, జగన్ నీ ఒకటి చేసి చూస్తే ఎలా ? పరిస్థితిని ఖచ్చితంగా అంచనా వేద్దాం. జగన్ మంచి పాపులారిటీ ఉన్న నాయకుడు. తతరాల/ తండ్రి వారసత్వం అండగా ఉంది, ఇందిరాగాంధీని జైల్లో పెట్టి జనతాప్రభుత్వం ఏం సాధించింది ? చివఱకు ఆ ఇందిరాగాంధీ చేతుల్లోనే ఓడిపోవాల్సి వచ్చింది. అదీగాక UPA లాంటి భ్రష్టుపట్టిన అవినీతిప్రభుత్వం తీసుకునే ఏ చర్యనీ జనం విశ్వసించరు. వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ వాళ్ళు ఎవఱిని పంది అంటారో వాళ్ళు నిజంగా నంది అనే భావిస్తారు. అందుచేత UPA ప్రభుత్వం యొక్క శత్రువులకీ, బాధితులకీ జనంలో మఱింత సానుభూతి పెఱుగుతుందని నా అంచనా. అన్నా హజారేని చూడట్లేదూ ?

  రిప్లయితొలగించండి
 50. తాడేపల్లి గారు

  @సమైక్యం దేశభక్తిభావన. అది ఒక సాంప్రదాయికభావన. అది ఒక జాతిస్పృహ., దానికి రాజకీయాలతోనూ, పరిపాలనతోనూ సంబంధం లేదు.

  స౦బ౦ధ౦ నా మాట లో ఎక్కడ కనిపి౦చినది చెబితే తప్ప మీ మాటను అర్ధం చేసికోవడ౦ కుదరదు. దేశభక్తి స౦ప్రదాయమ్ మనకి ఉ౦టే సరిపోతు౦దా కూడా సెలవియ్య౦డి.. దీనికి అర్ధం కానట్లు నటి౦చడ౦ అన్న పెద్దమాటలు వద్దు అ౦డి.

  రిప్లయితొలగించండి
 51. ఏ దిక్కుమాలిన న్యూస్ చానెల్లోనొ ఎదో ఆశించి చేసిన ఇంటర్వ్యూ కాదు. సూటిగా వాస్తవాలని నిజాయీతీగా, తెలంగాణా వస్తే ఏమి జరుగుతుందో మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పిన ఒక స్వాతంత్ర సమరయోధురాలి బంగారమంటి మాటలు-తూటాలు.దయచేసి విడియో పూర్తిగా చూడండి.

  http://youtu.be/V-iPAzDNB6s

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు