6, జనవరి 2011, గురువారం

శ్రీకృష్ణ కమిటీ నివేదికకు స్వాగతం!

శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలువడింది.  పెద్ద నివేదిక, దాంతోటి అనుబంధాన్నీ జాలంలో పెట్టారు.
నివేదిక: http://mha.nic.in/pdfs/CCSAP-REPORT-060111.pdf
అనుబంధం: http://mha.nic.in/pdfs/CCSAP-Appendix-060111.pdf

నేను చదివినంతలో గమనించినవివి:

ఒకటి: 'కమిటీ ఆరు పరిష్కార మార్గాలు చూపించి, ఎటూ తేల్చకుండా కొట్టుకు చావండని చెప్పింది' అనే విమర్శలో పసలేదు. చాలమంది రాజకీయ నాయకులు చేసారీ విమర్శ. ఆరు పరిష్కారాలను సూచించినా, ప్రతీ దాన్ని విపులంగా చర్చించారు. కొన్నిటిని కొట్టేసారు. అత్యుత్తమమేదో, రెండో ఉత్తమమైనదేదో కూడా చూపించారు. కమిటీ చెయ్యాల్సిన పని అదే, చేసిందీ అదే! అనేక వికల్పాలను చూపిస్తూ, ఎలిమినేషన్ ప్రాసెస్ ను అనుసరించి ఒక్కోదాన్నీ కోట్టేసి చివరిగా అత్యుత్తమ పరిష్కారాన్ని సూచించింది.
రెండోది: తెలంగాణ వెనకబాటుతనం అనేది నిజం కాదు, అని అంది. రాయలసీమ అత్యంత వెనకబడ్డ ప్రాంతం అని అంది. (నివేదిక పూర్తిగా చదివాక మరిన్ని వివరాలు తెలుస్తాయి.)
మరొకటి: ఈ నివేదికను తెవాదులు హర్షించరు. ప్రత్యేక తెలంగాణ తప్ప మరొక పరిష్కారాన్ని అంగీకరించం అనేవాళ్ళకు ఇది నచ్చదు.
ఇంకోటి: ఈ నివేదికపై ఆధారపడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఖచ్చితంగా రాష్ట్ర విభజన చెయ్యకూడదు. అప్పుడు తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఏం చేస్తారో చూడాలి. ప్రజలకు ఏం సమాధానం చెప్పుకోవాలో తెలీని గడ్డు పరిస్థితి వాళ్ళది. వారి హైకమాండే వాళ్ళను గట్టున పడెయ్యాలి.
చివరిది: ఈ నివేదికను తెలుగులో కూడా పెట్టాల్సింది. ఇంతమంది జనం ఇంత ఆసక్తిగా ఎదురు చూసిన నివేదిక, తెలుగులో ఉండకపోతే తెలుగువాడికి ఎలా తెలుస్తుంది?

ఇక కమిటీ సూచించిన పరిష్కారాల గురించి చూద్దాం:
నివేదిక చివర్న, ఆప్టిమల్ సొల్యూషన్స్/ఆప్షన్స్ అనే విభాగంలో కమిటీ వివిధ పరిష్కార వికల్పాలను చర్చించింది. ఒక్కో పరిష్కారాన్ని, దాని ప్రయోజనాలు, ఇబ్బందులనూ చర్చించింది. కమిటీ దృష్టిలో..
అన్నిటికంటే ఉత్తమ పరిష్కారం:  రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి, తెలంగాణ అభివృద్ధి కోసం రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చెయ్యడం.
రెండో ఉత్తమ పరిష్కారం: ఉద్యమకారులు కోరుకున్న విధంగా రాష్ట్రాన్ని విభజించడం.

కమిటీ సూచించిన పరిష్కారాలు, వాటిపై అది చూపించిన మంచిచెడులు:
పరిష్కారం 1: యథాతథ స్థితిని కొనసాగించడం
ఆర్థిక ప్రగతి విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్న వాదన పట్ల సాక్ష్యాలేమీ కమిటీకి కనబడలేదు. అయితే, విద్య, ఉద్యోగాలు, సాగునీరు పట్ల ప్రజల్లో భయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏ చర్యా తీసుకోకపోతే, తెలంగాణ ప్రజల్లో తీవ్రమైన ప్రతిస్పందన వస్తుంది. మావోయిస్టులు పుంజుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితులను దృష్ట్యా, యథాతథ స్థితిని కొనసాగించడానికి కమిటీ సుముఖంగా లేదు. ఈ పరిష్కారం చిట్టచివరి వికల్పమే!

పరిష్కారం 2: రాష్త్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విభజించడం; హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా, అనంతర కాలంలో రెండు రాష్ట్రాలు తమ తమ రాజధానులను ఏర్పాటు చేసుకోవడం
పరిశీలన: ఈ పరిష్కారాన్ని సీమ కోస్తా ప్రజలు అంగీకరించినా, తెలంగాణ ప్రజలు దీన్ని అసలే అంగీకరించరు. తీవ్రమైన ప్రతిచర్య వచ్చే అవకాశం ఉంది. హై. చుట్టూ తెలంగాణ కు చెందిన రెండు జిల్లాలు ఉండటం వలన హై. కు రావలసిన సరఫరాలను అడ్డుకునే అవకాశం ఉంది. అందుచేత ఇది అనుసరణీయం కాదు.

పరిష్కారం 3: రాష్ట్రాన్ని రాయల తెలంగాణ, కోస్తా ఆంధ్ర రాష్ట్రాలుగా విడగొట్టడం - హైదరాబాదు, రాయల తెలంగాణలో అంతర్భాగంగా ఉండేలా.
రాష్ట్రవిభజన చెయ్యాల్సిన పరిస్థితే ఏర్పడితే, పరిష్కారం ఇలా ఉండాలని కొందరు సీమ వాసులు కోరుకున్నారు. ముస్లిములు కూడా ఇదే వికల్పాన్ని కోరుకున్నారు - కొత్త రాష్ట్రంలో ముస్లిములు 12 శాతం దాకా ఉంటారు కాబట్టి వాళ్ళు మరింత బలమైన రాజకీయ శక్తిగా ఏర్పడతారు.  మరొకటి: ఆర్థిక విశ్లేషణలో తేలిందేమిటంటే.., మొత్తం మూడు ప్రాంతాల్లోకీ రాయలసీమ అత్యంత వెనకబడిన ప్రాంతం. నీళ్ళ కోసం ఆ ప్రాంతం తెలంగాణపై ఆధారపడింది. పైగా వాళ్ళకు తెలంగాణతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ కారణాల వల్ల సీమవాసులు రాయల తెలంగాణయే కోరుతారు. ఆర్థిక కారణాల రీత్యా ఇదే సరైన వికల్పం కూడా.

అయితే తెలంగాణ వాసులు, తమ వెనకబాటుతనానికి కారణం సీమనాయకులే ఒక ప్రధాన కారణమని నమ్ముతారు కాబట్టి వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. తెలంగాణ నాయకులతో మా చర్చల్లో కూడా ఇది వెల్లడైంది. పైగా మత ఛాందసవాదులు తలెత్తేందుకు ఇది అవకాశమీయవచ్చు. ఈ కారణాల వల్ల ఇది అనుసరణీయం కాదు.


పరిష్కారం 4: రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విడగొట్టడం, విశాల హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పరచడం. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి నల్గొండ జిల్లా ద్వారా కోస్తా ప్రాంతానికీ, మహబూబ్ నగర్ జిల్లా ద్వారా రాయలసీమకూ కనెక్షను ఉంటుంది.
ఈ ప్రతిపాదనను తెలంగాణలో గట్టిగా వ్యతిరేకిస్తారు. మిగతా ప్రాంతాల్లో కూడా అంగీకరించక పోవచ్చు. తెలంగాణలో మావోయిస్టులు పెచ్చుమీరే ప్రమాదం కూడా ఉంది.

పరిష్కారం 5: రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా ప్రస్తుత సరిహద్దుల వెంబడి విడగొట్టడం. హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా ఉంటుంది. సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పడుతుంది.
ఈ పరిష్కారంతో తెలంగాణ ఉద్యమకారుల కోరిక పూర్తిగా తీరినట్టౌతుంది. మా తెలంగాణ పర్యటనల్లో ప్రజలతో మాట్టాడినపుడు మేం గమనించిందిది: చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారు. గణనీయమైన సంఖ్యలో ప్రజలు తటస్థంగా ఉన్నారు. కొందరు ప్రత్యేకరాష్ట్రం పట్ల సుముఖంగా లేరు.
ఈ పరిష్కారపు పర్యవసానాలు ఎలా ఉండొచ్చంటే..
1. హైదరాబాదు, సాగునీటి సమస్య -వీటిపై కోస్తా సీమల్లో తీవ్రమైన ఉద్యమాలు తలెత్తవచ్చు.
2. ఆ ప్రాంతాల ప్రజలు తమ ప్రతినిధులపై వత్తిడి తెచ్చి, రాజీనామా చేయించి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించవచ్చు.
3. అనుకున్నదానికంటే ముందే ప్రత్యేక సీమ, ప్రత్యేక కోస్తా రాష్ట్రాల కోసం ఉద్యమాలు తలెత్తవచ్చు.
4. సాగునీటి పంపకం కోసం స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను ఏర్పాటు చేసినా, కోస్తా సీమల ప్రజల భయాలు తొలగకపోవచ్చు.
5. నక్సలిజం పెరిగిపోవడం, మత ఛాందసవాదం పెరిగి అంతర్గత భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు
6. ఇది దేశంలో ఇతర ప్రాంతాల్లోని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు ఊతమివ్వవచ్చు.
7. చిన్న రాష్ట్రాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటాయి. కోస్తా+సీమ రాష్ట్రం హై. అనే పెద్ద మార్కెట్టుకు దూరమౌతుందనే భయం అక్కడి ప్రజల్లో ఉంది. కోస్తా రాష్ట్రం ఆర్థికంగా దెబ్బ తింటుంది. తెలంగాణ + హైదరాబాదు రాష్ట్రం మాత్రం ఆర్థికంగా చాల బలమైన రాష్ట్రం అవుతుంది. చాలా ఇతర రాష్ట్రాల కంటే బలమైనదౌతుంది. 
8. ప్రస్తుతమున్న తీవ్ర ఉద్రిక్త వాతావరణంలో వాళ్ళ డిమాండును తీర్చని పక్షంలో రాబోవు పరిణామాలను (వాటిని సమర్ధంగా ఎదుర్కోలేని పక్షంలో )  దృష్టిలో పెట్టుకుంటే ఈ పరిష్కారం అనుసరణీయం. అన్ని అనుకూల ప్రతికూలాలను దృష్టిలో పెట్టుకుంటే ఇది అత్యుత్తమ పరిష్కారం కానప్పటికీ రెండో ఉత్తమ పరిష్కారమని భావిస్తున్నాం.

పరిష్కారం 6: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతూనే, తెలంగాణ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం, రాజకీయంగా బలోపేతం చెయ్యడం కోసం,   కొన్ని ఖచ్చితమైన రాజ్యాంగబద్ధ/చట్టబద్ధ చర్యలు చేపట్టడం - తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చెయ్యడం
ఇది అత్యుత్తమ పరిష్కారం ఐనప్పటికీ, తెలంగాణలోని కొన్ని వర్గాలు వ్యతిరేకించవచ్చు. రాజీనామాలు చెయ్యమని ప్రజాప్రతినిధులపై వత్తిడి రావచ్చు. ప్రభుత్వం వత్తిళ్ళు ఎదుర్కోవచ్చు. అయితే ఈ వర్గాలు ఈ పరిష్కారాన్ని పూర్తిగా అధ్యయనం చేసాక, వారు దీనిలోని మంచిని గుర్తించాక, వారి వ్యతిరేకత తేలిగ్గానే తొలగిపోతుంది. ఇటువంటి అభివృద్ధి మండలి మిగతా ప్రాంతాల వారూ అడగొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే అత్యుత్తమ పరిష్కారం.
=========================

అదీ సంగతి! నివేదికను ఇంకా పూర్తిగా చదవాల్సి ఉంది.

62 కామెంట్‌లు:

 1. తేలిపోయిన తెలంగాణ

  రిప్లయితొలగించండి
 2. ఆరవ సూచనే మంచిది. మూర్ఖపు వేర్పాటువాదులకు, తెలుగు జిన్నాకు జ్ఞానోదయమైతే బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 3. ఐదవ సూచనే మంచిది, జై తెలంగాణ, జై జై తెలంగాణ

  రిప్లయితొలగించండి
 4. జై తెలంగాణ, జై జై తెలంగాణ

  రిప్లయితొలగించండి
 5. seemandra vallu telangana lekunte bathakaleru. seemandhra vallu paranna jeevulu. anduke samaikya rashtram antunnaru. samaikyame valla ninandam aithe madras nunchi enduku vidipoyaro?
  seemandhra valladi murkhapu vadana.

  రిప్లయితొలగించండి
 6. తెలుగు వాళ్లు ఇప్పటికే మానసికంగా విడిపోయారు సార్ !! మీ రాతలలో కూడా అదే కనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 7. >>>>> ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే అత్యుత్తమ పరిష్కారం. <<<<
  >>>>> తెలంగాణ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం, రాజకీయంగా బలోపేతం చెయ్యడం కోసం, కొన్ని ఖచ్చితమైన రాజ్యాంగబద్ధ/చట్టబద్ధ చర్యలు చేపట్టడం - తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చెయ్యడం <<<<<
  ****
  యాభై నాలుగు సంవత్సరాల క్రిందట తెలంగాణాను లోబరచుకునేందుకు గుప్పించిన హామీలనే
  మళ్ళీ ప్రయోగించి మభ్యపెట్టాలని చూడటం అత్యుత్తమ పరిష్కారమా?
  ఎవడు నమ్ముతాడు వీటిని తెలంగాణలో?

  ఏమయ్యాయి పెద్దమనుషుల ఒప్పందాలు?
  ఏమయ్యాయి ముల్కీ నిబంధనలు? తెలంగాణా అభివృద్ది బోర్డు?
  ఏమయ్యింది గిర్గలాని కమిషన్ రిపోర్ట్ ?
  ఏమయింది ఆరు సూత్రాల ఎనిమిది సూత్రాల పధకాలు?
  ఏమయింది 610 జీవో ?

  వై ఎస్ ఆర్ ... కేబినేట్ మినిస్టర్ హోదాలో ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డిని
  అధ్యక్షుడిగా తెలంగాణా అభివ్రుదిమండలి ఏర్పాటు చేసి -
  నిధుల సంగతి, విధుల సంగతి, అధికారాల సంగతి దేవుడెరుగు
  సరైన ఆఫీసుకూడా ఏర్పాటు చేయని వైనం నిన్న మొన్నటి సంగతే కదా?

  అసలు 54 సంవత్సరాల సమైక్యత తర్వాత ...
  ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం
  చట్టబద్ధ చర్యలు చేపట్టడం -
  తెలంగాణ ప్రాంతీయ మండలిని ఏర్పాటు చెయ్యడం అంటేనే
  మన ఇన్నాళ్ళ సమైక్యతా ఎంత బూటకమో స్పష్టమవుతోంది కదా !

  కాబట్టి
  ఇంకా మోసం చేయాలని, వంచించాలని ఎత్తులు జిత్తులు వేయడం మానేయాలి.
  తెలంగాణా గతంలో లాగా మళ్ళీ మోసపోఎందుకు
  ఈ దొంగ మాటలు, నయవంచక హామీలు, ఆపద మొక్కులు నమ్మేందుకు సిద్ధంగా లేదు.

  2004 లొ కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో తెలంగాణా అంశం చేర్చినప్పుడు సీమాన్ధ్రులు అబ్యంతర పెట్టలేదు.
  2009 లో తెలుగు దేశం పార్టీ తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం ప్రకటించి మానిఫెస్టోలో పెట్టుకున్నప్పుడు ఏ సీమాన్ద్రుడూ వ్యతిరేకించలేదు.
  కేంద్రం గత డిసెంబర్ ౯ న తెలంగాణా ప్రకటన చేయగానే
  సీమాన్ధ్రులు, అక్కడి కాంగ్రెస్ తెలుగు దేశం నేతలు
  తమ మేక తోలు ను విసిరి పారేసి తోడేళ్ళ రూపాన్ని బయటపెట్టుకున్నారు.

  ఇంకా ఈ నయ వంచకులను తెలంగాణా నమ్ముతుందా చదువరీ
  ఈ దొంగ హామీల వలలో తెలంగాణా మళ్ళీ చిక్కుకున్తుందా చదువరీ ???!!!
  సమైక్యత అంటే ఒకరిని ఒకరు వంచిన్చుకుంటూ తిట్టుకుంటూ ఏమాత్రం పరస్పర నమ్మకం సుహృద్భావం లేకపోయినా
  బలవంతంగా పోలీసులు పహారా కింద కలిసున్డడమేనా చదువరీ !!!!

  రిప్లయితొలగించండి
 8. తెలంగాణా ఇస్తే మా కాంగ్రేస్ ఏం కా వాలి?

  తెలంగాణా లొనూ, రాయలసీమలోనూ భవిష్యత్‌లో మాకు భవిష్యత్ లేకుండా పోతుంటే?

  ఇక మిగిలిన ప్రాతంలోని పొలిటిషియన్లు మాతో ఫుట్బాల్ ఆడు కుంటారు....లాబీయింగ్‌లతో లాంగ్ గేమ్ ఆడుకుంటారు!!
  సంవత్సరం క్రితం చర్చలకి పిలిచాం ...ఓ కమిటీ వేసాం ..మల్లీ చర్చలకి రండి!...ఆపై చూద్దాం...

  మా తలమీదున్న స్కాంల భారాలకన్న ఎక్కువైనదా ఈ విషయం!!

  చేబితే వినరు అర్థం చేసుకోరు...ఒక్క్టటే గోల! జై తెలంగాణ!!

  http://neelahamsa.blogspot.com/2010/12/blog-post_19.html

  రిప్లయితొలగించండి
 9. Goutham Navayan:
  "యాభై నాలుగు సంవత్సరాల క్రిందట తెలంగాణాను లోబరచుకునేందుకు గుప్పించిన హామీలనే మళ్ళీ ప్రయోగించి మభ్యపెట్టాలని చూడటం అత్యుత్తమ పరిష్కారమా?" - తెలంగాణ మాత్రమే పరిష్కారం అని భావించేవారికి వేరే ఏవీ నచ్చవు మరి.

  "ఎవడు నమ్ముతాడు వీటిని తెలంగాణలో?" - ఉంటారు. ఉన్నారని కమిటీయే చెప్పింది. కానీ, నమ్మేవాళ్ళను నోరెత్తనీయరు కదా. కమిటీ నివేదికలో ఏం చెప్పిందో చూసారా.. "గణనీయమైన సంఖ్యలో ప్రజలు తటస్థంగా ఉన్నారు. కొందరు ప్రత్యేకరాష్ట్రం పట్ల సుముఖంగా లేరు." అని చెప్పింది. కానీ, గత ఏడాదిలో తెలంగాణ గడ్డమీద బహిరంగంగా చెప్పే ధైర్యం చేసిన తటస్థులు, విముఖులూ ఒక్కరైనా ఉన్నారా? అంతలా భయపెట్టారు వాళ్ళను.

  "2004 లొ కాంగ్రెస్ పార్టీ తన మానిఫెస్టోలో తెలంగాణా అంశం చేర్చినప్పుడు సీమాన్ధ్రులు అబ్యంతర పెట్టలేదు.
  2009 లో తెలుగు దేశం పార్టీ తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం ప్రకటించి మానిఫెస్టోలో పెట్టుకున్నప్పుడు ఏ సీమాన్ద్రుడూ వ్యతిరేకించలేదు." - దీనికి ఒకటి కాదు, మూడు కారణాలున్నై.
  ఒకటి.. 2009 డిసెంబరు 9 దాకా కోస్తా, సీమల్లో తెలంగాణ ఒక ఇస్యూయే కాదు. ఆనాటి ప్రకటన ఒక ఊహించని కుదుపు. నిజానికి తెలంగాణ ప్రజలక్కూడా అది ఊహించనిదే! ఆ తరవాతే ప్రజలా అంశాన్ని సీరియస్సుగా తీసుకుంది. అందుకే ఉద్యమం వచ్చింది.

  రెండు.. మేం వోటెయ్యాల్సిన ప్రతీవాడూ అదేమాట చెబుతూంటే, ఏం చెయ్యాలి? ఎవడో ఒకడికి వెయ్యాలి కదా! "2009 లో తెరాస గెలిచిన సీట్లెన్ని? తెలంగాణ సెంటిమెంటు ఇక లేనట్టేగదా?" అనే ప్రశ్న వేస్తే సమాధానమేమొచ్చిందో గుర్తుందా? ’అందరూ తెలంగాణ ఇస్తామని అంటూంటే ప్రజలు తమకు నచ్చినవాడికి వేసుకున్నారు, అందుకే తెరాస ఓడిందిగానీ తెలంగాణ సెంటిమెంటు లేకకాదు’ అని అనలేదూ?

  మూడు.. చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి, శాసనసభలోను పార్టీలోనూ తెలంగాణ అనే పేరునే ప్రస్తావించనిచ్చేవాడు కాదు అని తిడుతూంటారు కదా తెరాసీయులు.. మరి అలాంటివాడికి 1999 లో తెలంగాణలో వోట్లెందుకు వేసారు? అధికారానికి ఎందుకంపారు? 'ఐదు దశాబ్దాలుగా' రగులుతున్న తెలంగాణ ఉద్యమం అప్పుడు గుర్తుకు రాలేదా?

  తెలంగాణ ప్రజలను - అబద్ధాలు చెప్పీ చెప్పీ - వంచించింది ఎవరో అందరికీ తెలుసు. ఆ అబద్ధాలు ఏ రేంజిలో చెప్పారో శ్రీకృష్ణ కమిటీ బయటపెట్టింది, పటాపంచలు చేసింది. వాస్తవాలు కళ్ళముందు ఉండగా, ఇంకా ఎందుకు కోస్తా సీమల ప్రజలను తిడతారు?

  రిప్లయితొలగించండి
 10. శ్రీకృష్ణ కమిటీ అధికార గణాంకాలతోనే ప్రత్యేకవాదాన్ని తిప్పికొట్టింది.హేతుబధ్ధమైన చర్చకు తావిచ్చి ప్రజాస్వామ్యంలో ఒక సత్సంప్రదాయానికి తెర లేపింది.ద్వేషపూరిత ఆరోపణలకు,అపరిపక్వ వితండ వాదాలకు,అబధ్ధ ప్రచారాలకు ఇకనైనా భరతవాక్యం పలకాలని ఆశిద్దాం.గత ఉద్యమ చరిత్రలను తిరగేస్తే కనిపించే నగ్నసత్యం ఒక్కటే,అన్నివిధాలా నష్టపోయేది యువత మరియు విద్యార్ధులే,లభ్దిపొందేది రాజకీయనాయకులే.

  రిప్లయితొలగించండి
 11. committee opinion on much discussed implementation of 610 G.O

  ""As stated earlier, the Committee took note of the progress made during the last four years and the earnest steps taken to implement the recommendations of the One Man Commission. The Government, after identifying 18,856 employees for repatriation, has already repatriated 14,784 employees. Not only is this good performance but also, all efforts appear to have been made to implement the Presidential Order.""

  రిప్లయితొలగించండి
 12. నారా, వైఎస్, కోట్ల, నెదురుమల్లి ఇంతమంది ముఖ్యమంత్రులొచ్చినా రాయలసీమ ఎందుకు అత్యంత వెనకబడ్డ ప్రాంతంగా వుండిపోయింది? ముఖ్యమంత్రులు మనోళ్ళైతే ఎక్కువ దోపిడీకి గురవుతారనే కదా?

  రిప్లయితొలగించండి
 13. కమిటీ చెప్పినవన్నీ చదివి, 6నుంచి 3సూచనలకు కుదించడానికి పజిల్ అలీ కమిటీ వేసి, దాని మీద క్రిష్టఫర్ కమిటీ వేసి రిటైర్డ్ జడ్జిలకు ఉపాధి చూపాలి.

  రిప్లయితొలగించండి
 14. ""Overall, in spite of 50 plus years of policy protected planning and execution, one finds regional variations in the economic development of AP. The rate of growth in the development parameters summed up below is found to be robust both in Telangana (even after excluding Hyderabad) and coastal Andhra. Disturbing, however, are the growing levels of inequity within Telangana and Rayalaseema, and within the deprived population groups. Contrastingly, the evidence suggests that the inequity in income has, in fact, declined in coastal Andhra. It is essential, therefore, to take a note of inequity differentials between the haves and have-nots in Telangana, especially amongst the SCs, STs and minorities. Such deepening inequity in Telangana can not only sustain the separatist agitation but it can also carry it further and increase its intensity. The masses, therefore, can be easily used as tools of agitation by motivated groups and even political parties.""

  రిప్లయితొలగించండి
 15. Please read section 2.15 of CCSAP report. Some exerpts.

  ""Further, is important to take a medium to long-term perspective so far as the future development of the state or its constituencies is concerned. An understanding of the perspective of the Telangana issue within a poverty, deprivation and empowerment framework does not compulsorily support partitioning of the state. It is a fact that most of the economic and developmental parameters show that Telangana (excluding Hyderabad) is either on par with or a shade lower than coastal andhra; but once Hyderabad is included, the situation in Telangana is far better. Additionally, the rate of growth of most of the parameters of development has shown robust growth in Telangana. Coastal Andhra has natural advantages and a long history of development in agriculture, but it is the Telangana region which has shown commendable growth in agriculture during the past three-four decades. Thus, on the whole, it would appear that the deprived region is Rayalaseema not Telangana.""

  రిప్లయితొలగించండి
 16. One good news.

  Meanwhile, the Andhra Pradesh government, which was represented in the meeting by chief minister N Kiran Kumar Reddy, will translate the entire report of the Srikrishna committee and upload in the state government website for the convenience of the people of the state.

  http://timesofindia.indiatimes.com/india/Srikrishna-report-Centre-may-take-call-on-only-two-options/articleshow/7230766.cms#ixzz1AGoRkvGb

  రిప్లయితొలగించండి
 17. గత ఎన్నికల్లో ఓ పెద్దాయన మేము తెలంగాణాకి అనుకూలమని, తెలంగాణా తెస్తామని, ఎన్నిక ప్రచారం చేసుకొని, తెంగాణాలో elections ఐపోయాక,....

  రెండవ విడత ప్రచారంలో భాగంగా సీమలో, తెలంగాణాకి వెల్లాల్సి వస్తే విస్సా తీసుకోవాల్సి వస్తుందని, విరుద్దంగా ప్రచారం చేసుకోని, రెండునాల్కలతో ,దొంగ దెబ్బతో సి.ఎమ్ అయ్యాడు....ఉసురు తగిలింది...ఉసూరు మన్నాడు...

  దశాబ్ధాలు గా జరుగుతున్నదిదే!... దొంగ దెబ్బలూ!...దోపిడీలు!!

  రిప్లయితొలగించండి
 18. mee samaikyavaadulu skc report lo akkado para, ikkado para meeku anukoolamayinavi erukoni santoshapadavalasinde!
  modati option - status quo is not possible antene adi telangana prajala vijayam.
  2va option - innaallu seemandhra vaallu vinipinchina vaadana - hyd 'ut' cheyadam.
  3va option - innaallu raayalaseema vaallu adigindi - 'rayala telangana'.
  4va option - innaallu seemandhra pettubadidarulu korindi - hyd nu marinta dochukodaaniki peddadi chesi common capital cheyadam. ivanni seemandhrulanu santoshapettadaaniki options ga ichchaare tappa, ee modati 4 options not practicable ani committee ye cheppindi. 5va option telanganaku anukoolam.6va option maatrame samaikyavadulaku konta uratanichchedi.adi kooda 'with constitutional protection to telangana'. ante telanganaku 54 yelluga unconstitutional ga droham jarigindani oppukonnattega! lekapote committe members ni pichchi kukka karichinda? - malli constitutional protection ichche condition to samaikya raashtram konasaginchalani cheppadaaniki? report ni detailed ga chadavandi. telangana yeye rangallo dopidiki, vishwasa ghatukaniki bali ayindo chala paragraphs unnaayi. ayinaa meeru vaatini choodanattu natistaarulendi.
  ika theerpu samaikyavaadulaku anukoolamgaa ekkada vachchindo mee pichchollake teliyaali.

  రిప్లయితొలగించండి
 19. @ చదువరి
  >>> తెలంగాణ మాత్రమే పరిష్కారం అని భావించేవారికి వేరే ఏవీ నచ్చవు మరి. <<<
  నిజమే. కానీ అలా భావించే పరిస్థితి ఎందుకొచ్చిందో కూడా ఆలోచించండి.
  తెలంగాణాకు ఇచ్చిన హామీలను, ఒప్పందాలను, రక్షణలను వేటినీ సరిగా అమలు పరచక పోవడం వల్లనే కదా.
  ఇప్పుడు మళ్ళీ అవే హామీల తో తెలంగాణా ప్రజలను ఎలా నమ్మించ గలరు?
  ఏమైనా అర్ధం ఉందా ?

  ఉద్యమం మెజారిటీ ప్రజల ఆకాంక్ష బలపడుతున్నా కొద్ది ఎక్కడైనా ఇదే పరిస్థితి ఏర్పడుతుంది.
  భారత దేశానికి స్వాతంత్రం కంటే బ్రిటీష్ పాలనే మంచిదని భావించిన వాళ్ళు ఆనాడు కూడా వున్నారు.
  వాళ్ళ గొంతు నొక్కివేయబదింగి.

  >>>> 2009 డిసెంబరు 9 దాకా కోస్తా, సీమల్లో తెలంగాణ ఒక ఇస్యూయే కాదు.
  అవును. అమలు పరచని ఎన్ని హామీలిచ్చినా మీకు పర్వాలేదు. అది మీకు ఇష్యూ ఏ కాదు.

  >>> చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకి ...మరి అలాంటివాడికి 1999 లో తెలంగాణలో వోట్లెందుకు వేసారు? అధికారానికి ఎందుకంపారు?
  అలాంటి తెలంగాణా వ్యతిరేకి మరి 2009 లో తెలంగాణా కు ఎదుకు జై కొట్టాడు. ఎందుకు టీ ఆర్ ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు.
  ఇదే కదా మీ ఆంద్ర నేతల దొంగ నీతి. లత్తకోరు నిజాయితీ.

  >>>> తెలంగాణ ప్రజలను - అబద్ధాలు చెప్పీ చెప్పీ - వంచించింది ఎవరో అందరికీ తెలుసు
  వః ఎం వాదన. ఒప్పందాలు హామీలు తుంగలో తొక్కడం, చంద్రబాబు, కాంగ్రెస్ నేతల దొంగ హామీలు ఇవేవీ మీ కంటికి కనిపించవు.
  ఏది ఏమైనా తెలంగాణా ప్రజలు శాస్వితంగా ఆంద్ర రాజకీయ నేతల దాష్టీకం, దాస్యం కింద ఉండడమే కదా మీకు కావలసింది.
  ఇప్పుడు తెలంగాణా ప్రజలు విద్యవంతులయ్యారు. చైతన్య వంతులయ్యారు
  ఇంకా మీ ఆటలు, దోపిడీ దొంగ మాటలు సాగవు గాక సాగవు.

  రిప్లయితొలగించండి
 20. >>>>తెలంగాణాకు ఇచ్చిన హామీలను, ఒప్పందాలను, రక్షణలను వేటినీ సరిగా అమలు పరచక పోవడం వల్లనే కదా.

  ఈ విషయం తెలియటానికి మీకు 50 ఏళ్ళు పట్టిందన్నమాట. అవున్లే హైదరాబాద్ బాగా డెవలప్ అవ్వాలంటే ఈమాత్రం వైట్ చేయాలి. అవునూ, హామీలు అమలుపరచకుంటే తెలంగాణా MLA,MP,Ministers ఇన్నాల్లూ ఏం చేస్తున్నట్లో..? ఐనా ఉపముఖ్యమంత్రి పదవిని పక్కన పెట్టడం మొదలైంది, తెలంగాణా వ్యక్తి CMగా ఉన్నప్పటినుంచే ననే విషయం మీకు తెలీదా..?

  >>>>ఇప్పుడు తెలంగాణా ప్రజలు విద్యవంతులయ్యారు. చైతన్య వంతులయ్యారు
  తెలుస్తుందిలే...

  రిప్లయితొలగించండి
 21. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో తెలంగాణ వెనకబాటుదనం గూర్చిన వాదనంతా డొల్ల అని లెక్కలతో సహా తేల్చిపారేశాక కూడా దోపిడీ, దొంగతనం అంటూ అవే పాటలా!

  తెలంగాణ వెనకబడిలేదని, మిగతా ప్రాంతాలకంటే అంతో ఇంతో ముందే ఉందనీ తేలిపోయాక ఇంకా అవేవో హామీలనీ ఇంకోటనీ వాదులాటెందుకు?

  రిప్లయితొలగించండి
 22. @అబ్రకదబ్ర:
  మేము వెనుకబడలేదని ఎవరెన్ని విధాలుగా చెప్పినా, మేం నమ్మం. మేము పూర్తిగా వెనుకబడినోల్లమనీ, సీమాంధ్రా వాల్లు(ఇప్పుడు శ్రీక్రిష్ణ కమిటీ వాల్లు కూడా) మమ్మల్ని దోచేసుకున్నారనీ మా కేసీఆర్ అన్నప్పుడల్లా మాకు ఎంతో హాయిగా,సమ్మగా ఉంటుంది. అసలు తెలంగాణా ఏర్పడి, మా కేసీఆర్ CMగా, మా కేటీఆర్ ఆర్థిక మంత్రిగా, మా కవిత స్త్రీ,యువజన మంత్రిగా అవ్వాలీ , అప్పుడు చూడండి మా వెనుకబాటుతనం ఎలా పారిపోతుందో. అప్పుడు మా తెలంగాణాలో ప్రతి పల్లె, ఒక్కో NewYork సిటీలా ఐపోతుంది. అది చూడలేక మీ సీమాంధ్రా వాల్లందరూ కుల్లి, కుల్లి ఏడ్వాలి. జై తెలంగాణా.

  రిప్లయితొలగించండి
 23. @ అజ్ఞాత, 7 జనవరి 2011 4:27:00 ఉ GMT+05:30

  మస్తుగ షెప్పినావ్ కొడుకో కొమ్మన్న
  జర పైలం కొడుకో.. టిరడీ.. టిరడీ.. టిరడీ టా..

  రిప్లయితొలగించండి
 24. >>ప్రయోగించి మభ్యపెట్టాలని చూడటం అత్యుత్తమ పరిష్కారమా?
  ఎవడు నమ్ముతాడు వీటిని తెలంగాణలో?>>

  అట్లడుగు, ఏదో గింత ఇదిలిస్తారు, తిని తొంగో. మళ్ళీ ఎలక్షన్లప్పటికి లెయ్. మళ్ళీ లొల్లి చేసి ఏదో ఇంత ఎంగిలి మెతుకులు తెలంగాణా పేరు చెప్పి అడుక్కో. 5ఒఏళ్ళు కాదు, 500 ఏళ్ళైనా మీ ముష్టి బ్రతుకులింతే. ఇంకోడి మీద పడి ఏడవటం, అడుక్కోవడం. థూ... నీ బ్రతుకు ..

  రిప్లయితొలగించండి
 25. ఆ పైనానయన అజ్ఞాత నిజమే జెప్పిండు...
  అడవుల కడవులే మింగుద మనుకున్నడు...ఆయన్ని గా అడివే మింగేసింది...చేసిన పాపం ఊకెపోతదా!

  రిప్లయితొలగించండి
 26. ఈ అంధ్ర వాసానా ఏప్పుదు వదులుతుందొ ఏమొ

  రిప్లయితొలగించండి
 27. **ఈ అంధ్ర వాసానా ఏప్పుదు వదులుతుందొ ఏమొ**
  1) పినాయిల్తో నోరు, ఒళ్ళు రోజుకు రెండు సార్లు కడుక్కో లేదా
  2) కిరసనాయిలేసుకుని తెలంగాణ అమరజీవి వైపో
  3) దేశం వదలి దుబాయ్ షేకుల పాచిపని చేయనీకి కెసిఆర్, యాష్కీ ఇప్పించే దొంగ పాస్పోర్ట్తో ఎల్లిపో

  రిప్లయితొలగించండి
 28. తెలంగాణా ఒక చారిత్రక సత్యం
  ఇంకొక్క ఆమరణ దీక్ష దూరం

  రిప్లయితొలగించండి
 29. దూరమెందుకు? ఫ్లూయిడ్స్ వున్నాయిగా, కానీయ్.

  రిప్లయితొలగించండి
 30. మన పొట్టి చీ రాములు గారు ఫ్లూయిడ్స్ మీద చేసారా ?

  రిప్లయితొలగించండి
 31. ఇది చూడండి, పొట్టి శ్ర్రీరాములు గురించి ...

  గాంధీ గారు ... I know he is a solid worker, though a little eccentric".

  మీ శాంతియుత ఉద్యమం గురించి
  On the 15th he died. The next day all hell broke loose. Government offices were attacked, and trains stopped and defaced. The damage to state property ran into crores of rupees. Several protesters were killed in police firings. On the 16th, Nehru made a statement saying a state of Andhra would come into being, but its boundaries would be decided by an independent Commission.

  లింక్ : http://www.hinduonnet.com/thehindu/mag/2003/03/30/stories/2003033000040300.htm

  రిప్లయితొలగించండి
 32. మీ సమైక్యవాదులు skc రిపొర్ట్ లో అక్కదో పారా, ఇక్కదో పారా మీకు అనుకూలమయినవి ఏరుకొని సంతోషపదవలసిందే!

  మొదటి ఆప్షన్ - statu quo is not possible అంటేనే అది తెలంగాణా ప్రజల విజయం.
  2వ ఆప్షన్ - ఇన్నాల్లు సీమంధ్ర వాళ్ళు వినిపించిన వాదన - hyd 'ut' చేయడం.
  3వ ఆప్షన్ - ఇన్నాల్లు రాయలసీమ వాల్లు అడిగింది - 'రాయల తెలంగాణా'.
  4వ ఆప్షన్ - ఇన్నాల్లు సీమంధ్ర పెత్తుబదిదరులు కొరింది - హ్య్ద్ ను మరింత దొచుకోడానికి పెద్దది చేసి కామన్ క్యాపిటల్ చేయడం. ఇవన్ని సీమాంధ్రులను సంతోషపెట్టదానికి ఆప్షన్స్ గా ఇచ్చారే తప్ప, ఈ మొదతి 4 options not practicable అని కమిటీ యే చెప్పింది.

  5వ ఆప్షన్ తెలంగాణాకు అనుకూలం.

  6వ ఆప్షన్ మాత్రమే సమైక్యవాదులకు కొంత ఊరటనిచ్చేది. అది కూడా 'with constitutional protection to telangana'. అంతె తెలంగణాకు 54 యేల్లుగా unconstitutional గా ద్రోహం జరిగిందని ఒప్పుకొన్నత్తేగా! లేకపోతే కమిటీ మెంబర్స్‌ని పిచ్చి కుక్క కరిచిందా? - మళ్ళీ constitutional protection ఇచ్చే కండిషన్ తో సమైక్య రాష్ట్రం కొనసాగించాలని చెప్పడానికి?

  report ని detailed గఆ చదవండి. తెలంగాణా యేయే రంగాల్లో దోపిడీకి, విశ్వాస ఘాతుకానికి బలి అయ్యిందో చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అయినా మీరు వాటిని చూదనత్తు నటిస్తారులెండి.

  ఇక తీర్పు సమైక్యవాదులకు అనుకూలంగా ఎక్కద వచ్చిందో మీ పిచ్చోల్లకే తెలియాలి.

  రిప్లయితొలగించండి
 33. తెరాస వాళ్ళు గుడంబా మీద చేస్తారు

  రిప్లయితొలగించండి
 34. status quo is not possible అంటేనే అది తెలంగాణా ప్రజల విజయం.
  -------
  బాగా ఏరిండావే. ఇంగా మంచిగ కెలుకు, దొరక్తాయి. తెలగానోళ్ళ విజయం అంటున్నవ్, పార్టీ కబ్ దేరా? సంబురాలు చెయ్, గుడంబా తాపించు, గద్దరోణ్ణి తోల్కరా కంబడి కప్పుకుని మస్తు నాచ్ తాడు.

  రిప్లయితొలగించండి
 35. @ అజ్ఞాత, 7 జనవరి 2011 2:06:00 సా GMT+05:30

  హీ హీ హీ... వస్తానంటే చెప్పు నీకు మీ లంగడపాటి కి కుడా అరేంజ్ చేస్తాం....

  రిప్లయితొలగించండి
 36. 50ఏళ్ళుగా వెనక బడినోళ్ళు, మనోబావాలు చితికినోళ్ళు ఇచ్చే పార్టీలకు మా లంగడ రాడు. జగన్ ని తోలుకొస్తా, మీ బుగ్గల్ పిసికి ఓదార్చి లచ్చ ఇస్తాడు, గేమంటవ్? :-)

  రిప్లయితొలగించండి
 37. ఉత్త బుగ్గలు మాత్రమే అంటే సరే.. వేరేవి అంటే మేము ఒప్పుకోం...:P

  రిప్లయితొలగించండి
 38. పోరాడితే పోయేదేమీ లేదు, ఈ ఇడ్లీ సాంబార్ ల చట్టబద్దమైన అణచివేత తప్ప...

  రిప్లయితొలగించండి
 39. "చట్టబద్దమైన అణచివేత "....?

  In that case , you should try to get the amendaments to that 'chattam' . This can be done in the parliament, by ur telangaana MPs. they have to just explain how that 'chattam' is not good and they have to convience the mejority MPs from all over India(no need to bother, evenif seemandhra MPs oppose).
  Otherwise,Even if TG is formed , that 'chattam' will be same even there too.. then how will it benifit and I doubt , the so called 'educated people' have any clarity on what they are fighting for..?(I'm sure KCR and his goons have that clarity i.e., they can get political mailage). But my pity is on U people..

  రిప్లయితొలగించండి
 40. "But my pity is on U people "

  You have no right to show pity on us. Go n show your pity on your north andhra , palanadu and rayala seema people.

  రిప్లయితొలగించండి
 41. "by ur telangaana MPs"

  If you are fighting for united andhra pradesh, how on earth you call "ur telangana MPs".

  మీ సమైక్య వాదులంతా కుహనాలు.

  even చదువరి గారికి కూడా తె. వాదుల తప్పులే కనిపిస్తాయి కాని, మనమంతా సమైక్యంగా ఉందాం అని ఒక్క పోస్ట్ అయినా రాసారా?

  రిప్లయితొలగించండి
 42. @above అజ్ఞాత:
  కోర్ట్ లో సొంత అమ్మ,నాన్నలను చంపిన నేరానికి ముద్దాయికి జడ్జ్ గారు శిక్ష విధించారంట. అప్పుడు ఆ ముద్దాయి వెక్కి,వెక్కి ఏడుస్తుంటే, ఎందుకు ఏడుస్తున్నావని జడ్జ్ గారు అడిగారంట. దానికి ఆ ముద్దాయి- 'అసలే అమ్మ,నాన్న లేనోన్ని, నా మీద జాలి చూపించండి సార్ 'అని అడిగాడంట. అలా ఉంది మీ వాదన/రోదన.

  రిప్లయితొలగించండి
 43. @above అజ్ఞాత:


  yedava laajikku lu aapi vishayam meeda maaTlaaDu..

  రిప్లయితొలగించండి
 44. @above అజ్ఞాత:

  యెదవల కి అర్థమవ్వాలంటే యెదవ లాజిక్కులే చెప్పాలి మరి.

  సమైక్యంగా ఉండటమే అందరికీ మేలని తటస్థ,నిష్పాక్షిక,నిజాయితీ కలిగిన సభ్యుల కమిటీ చెప్పిన తర్వాత కూడా యదవలాజిక్కులు లాగే వాల్లని ఏమంటారో మీరే నిర్ణయించుకోండి.

  రిప్లయితొలగించండి
 45. మా కేసీఆర్ CMగా, మా కేటీఆర్ ఆర్థిక మంత్రిగా, మా కవిత స్త్రీ,యువజన మంత్రిగా అవ్వాలీ , అప్పుడు చూడండి మా వెనుకబాటుతనం ఎలా పారిపోతుందో. అప్పుడు మా తెలంగాణాలో ప్రతి పల్లె, ఒక్కో NewYork సిటీలా ఐపోతుంది. అది చూడలేక మీ సీమాంధ్రా వాల్లందరూ కుల్లి, కుల్లి ఏడ్వాలి. జై తెలంగాణా.

  nannu nammuko unnadi ammuko... the best Govt. Slogan of TRS

  రిప్లయితొలగించండి
 46. "చట్టబద్దమైన అణచివేత "....?

  కాదా మరి.. గుండెల మీద చెయ్యేసుకోని చెప్పండి.
  BSF కి హైద్రా లో పనేంటి?
  media పై ఆంక్షలెందుకు ?
  ఈ కమిటీ పదకొండవదట !!!
  రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చెయ్యడం ?

  రిప్లయితొలగించండి
 47. "సమైక్యంగా ఉండటమే అందరికీ మేలని తటస్థ,నిష్పాక్షిక,నిజాయితీ కలిగిన సభ్యుల కమిటీ చెప్పిన తర్వాత కూడా యదవలాజిక్కులు లాగే వాల్లని ఏమంటారో మీరే నిర్ణయించుకోండి."

  5 లో e చూడండి ... తటస్థ,నిష్పాక్షిక,నిజాయితీ కలిగిన సభ్యుల కమిటీ గురించి తెలుస్తుంది.

  రిప్లయితొలగించండి
 48. ఇలా ఆ పేజ్ లో మాకు అనుకూలంగా రాశారు, ఆ సెక్షన్లో మాకు అనుకూలంగా రాశారు అని వ్యర్థప్రేలాపనలతో లాభం లేదు.

  వివిధ వార్తా కధనాలను బట్టి( తెలుగు మరియు ఇంగ్లీషు),అన్ని ప్రాంతాల ప్రజల ప్రయోజనాల దృష్ట్యా, సమైక్యంగా ఉండటమే బెస్ట్ సొల్యూషన్ అనీ, విడిపోవడం సెకండ్ బెస్ట్ సొల్యూషన్ అనీ కమిటీ తేల్చినట్లుగా ఎవరికైనా అర్థమవుతుంది.

  బుర్ర వున్నోడు ఎవరైనా బెస్ట్ సొల్యూషన్ కావాలంటాడు.

  రిప్లయితొలగించండి
 49. "బుర్ర వున్నోడు ఎవరైనా బెస్ట్ సొల్యూషన్ కావాలంటాడు."

  అది బెస్ట్ సొల్యూషన్ with కోట్స్. రాజ్యాంగ ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక అభివృద్ధి మండలిని ఏర్పాటు చెయ్యమన్నారు కదా? అది బెస్ట్ సొల్యూషన్ ఐతే కోట్స్ ఎందుకు సార్?

  రిప్లయితొలగించండి
 50. "బుర్ర వున్నోడు ఎవరైనా బెస్ట్ సొల్యూషన్ కావాలంటాడు."
  ఇంకా కొంచెం ఎక్కువ బుర్ర ఉంటే అది ఒక కమిటీ అని కమిషన్ కాదు అని ఎవరికైనా అర్థమవుతుంది.
  చట్టబద్దత ఉన్న మొదటి SRC తెలంగాణా విడిగా ఉండాలనే చెప్పింది సార్.

  రిప్లయితొలగించండి
 51. >>>ఇంకా కొంచెం ఎక్కువ బుర్ర ఉంటే

  మా కంత 'దేడ్ దిమాఖ్' లేదులే. మీరు కానీయండి...Enjoy!!!

  రిప్లయితొలగించండి
 52. ఆవన్న.. 'దేడ్ దిమాఖ్' గాల్లతోని 50 యేండ్ల సంది కలిశున్నోల్లను ఏమంటరే ... "అడే దిమాఖ్" అనా??

  రిప్లయితొలగించండి
 53. పిచ్చాసుపత్రి లో పిచ్చొళ్ళుంటారు, డాక్టర్లూ ఉంటారు. గట్లనే దేడ్ దిమాఖ్ గాళ్ళని సీదా చెయ్యనీకి మంచోళ్ళు గూడ గావల్నె

  రిప్లయితొలగించండి
 54. మీరు వొఠ్ఠి మంచోళ్ళు గాదు సార్. మమ్మల్ని జన్మజన్మల పాపం నుంచి ఉద్దరించటానికి వచ్చిన 'మంచావతారాలు'.

  రిప్లయితొలగించండి
 55. BSF కి హైద్రా లో పనేంటి? - మావోగాళ్ళకి వూస్ మేనియాలో పనేంటి?
  media పై ఆంక్షలెందుకు ? - మీడియాలో బూతులు, పుకార్లు, రెచ్చగొట్టు కథనాలు ఎందుకు?

  g లో వేలెట్టుకుని చెప్పు.

  రిప్లయితొలగించండి
 56. ఆర్యా ! చట్టబద్ధత గల మొదటి ఎస్సార్సీ కూడా "ప్రత్యేక తెలంగాణ, అనేక ఎంపికల్లో ఒకటి" గానే చెప్పింది, అచ్చం శ్రీకృష్ణ కమిటీ మాదిరే ! సందేహమైతే ఆ ఎస్సార్సీ నివేదికని దుమ్ముదులిపి మళ్లీ ఒకసారి చదువుకోండి.

  రిప్లయితొలగించండి
 57. Hi friends,

  ippatiki manam kallu teravatam ledu. ee situation ki kaaranam Congress.plz hate congress.
  state lo regional party power lo unte ne Development ki scope untundi.ade TDP

  Jai NTR Jai TDP

  రిప్లయితొలగించండి
 58. ఆర్యా!
  జెంటిల్మెన్ అగ్రీమెంట్ ప్రకారం జంటిల్మెన్లకు మాత్రమే వుద్యోగాలిస్తారు, మరి తెలంగాణా వాళ్ళ మాటేమి?

  రిప్లయితొలగించండి
 59. కేంద్రం తెలంగాణా లో హైదరాబాద్ తప్ప 9 జిల్లాలు వెనక పడ్డవి అని చెప్పిన విష్యం మీ ఆంధ్ర కళ్ళకి కనబడటం లేదా ? బారత ప్రభుత్యం చెప్పిన విష్యం కన్నా మీకు శ్రీకృష్ణ చెప్పిన విష్యం ఎక్కువగా కనిపిస్తుంది .

  రిప్లయితొలగించండి
 60. HI MY DEAR FRINDS. THIS IS VERY BAD NEWS BECAUSE OUR MOTHER TELUGU THALLI IS CRYING NOW EVERY A.P. PERSON HAS OUR A.P.FAMYLY MEMBER. YOU THINK WHO CREATING THIS PROBLEM. YOU SERCH THE SOLUTION.NOT FOR THE VILENCE. YOU THINK MY DEAR STUDENTS ,PUBLIC EMPLOYS,CITIZENS,PEOPLES,DONT GO TO EMOTIONS.THINK SLOWLY.THE DURTY POLITISIANS ARE PLAYING OUR LIFE. THINK THIS POINT.YOUR LIFE ,FUTURE,FAMYLY,PROOPERTY,DREAMS,VISON,GOALS,FRIENDS.ARE VERY VALUBLE IN LIFE IS MORE IMPORTANT.
  (ADJUSTMENT IS ALWAYS BETTER THEN ARGUMENT) SO THINK ALWAYS POSITIVE.

  I WILL VOTE FOR .6TH

  YOUR'S
  *ESHWAR*

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు