11, జనవరి 2010, సోమవారం

తెలంగాణ వాదుల మరో పచ్చి అబద్ధం

అభివృద్ధిలో వెనకబడి పోయామని, మాకు అన్యాయం జరిగిందనీ, జరుగుతోందనీ చెబుతూ ప్రత్యేక రాష్ట్రం ఉంటే తప్ప లాభంలేదని తె.వాదులు డిమాండు చేస్తూ వచ్చారు. తరవాత్తరవాత వీళ్ళ గొంతు కాస్త మారి, 'ఆంద్రోళ్ళు' మమ్మల్ని అణగదొక్కారంటూ రాష్ట్ర విభజన భజన చేసేవారు. ఇప్పుడవన్నీ పక్కకు నెట్టి ఆత్మగౌరవం కోసం తెలంగాణ, స్వపరిపాలన కోసం తెలంగాణ అంటూ కొత్త కారణాలు చెబుతున్నారు. ఈ కారణాల్లో న్యాయం ఉందా లేదా చెప్పండి అంటూ తెలివితక్కువ వాదనలు చేస్తున్నారు. అభివృద్ధి లేదన్న మాట మాత్రం ఇప్పుడు వీళ్ళ నాలుకల మీద కనబడదు.
ఆ వాదనలో పసలేదని తేలిపోయింది. తె.వాదులు చెప్పే అభివృద్ధిలో-మేం-వెనకబడ్డాం-ఆంద్రోళ్ళు-ముందుబడ్డారు అనే వాదన శుద్ధ తప్పని తేలిపోయింది కాబట్టి, వాళ్ళు చెప్పే లెక్కలన్నీ కాకిలెక్కలని తేలిపోయింది కాబట్టి వాళ్ళకు వాదన మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది. అంచేత మార్చారు. అయితే ఈ అబద్ధాలను ఇంకా చెప్పుకుంటూ తిరుగుతున్న తె.వాదులు కొందరు అక్కడక్కడ లేకపోలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్న మరో పాత అబద్ధం గురించి మాట్టాడుకుందాం.

1956 లో హైదరాబాదు రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రాలను కలిపెయ్యక ముందు హై. రాష్ట్రం బడ్జెట్టు మిగుల్లో ఉండేది. ఆ డబ్బుల్ని కొట్టేద్దామని దురుద్దేశంతో, ఆంద్రోళ్ళు కుట్ర చేసి, రెండు రాష్ట్రాలనూ కలిపేసారు. ఆ మీదట మా ప్రాంతపు మిగులునంతా ఆంధ్ర ప్రాంతానికి వాడేసారు అంటూ తె.వాదులు ఆరోపణలు చేస్తూంటారు. కోస్తా సీమల జనం మాత్రం దానికి ఎక్కడా సమాధానం చెప్పలేదు. పాపం, మరి కుట్రలు చెయ్యడం తప్పే గదా అని నోరు మూసుకుని ఉంటారు. నేనైతే అందుకే నోరు మూసుకుని ఉన్నాను. అయితే సత్యం కుంభకోణంలో లాగా తె.వాదుల అబద్ధాలు ఒకటొక్కటే బయటకు రావడం మొదలయ్యాక, ప్రచారంలో ఉన్నవాటిలో ఇంకా ఎన్నెన్ని అబద్ధాలున్నాయో తెలుసుకుందామని వెతికితే, ఓ నాల్రోల కిందట కొత్త సంగతి బైటపడింది. నాకిది కొత్తదేగానీ మీలో కొందరికి తెలిసే ఉండొచ్చు. ఆ నిజమిది..

1956 నాటికి హైదరాబాదు రాష్ట్రం లోటు బడ్జెట్టులో ఉంది. ఆ ఏడాదే కాదు, 1952-53 నుండి ఆ రాష్ట్రం లోటు బడ్జెట్టులోనే ఉంది. 1951-52 లో 92 లక్షల మిగులులో ఉన్న బడ్జెట్టు, 1955-56 నాటికి 5 కోట్ల 32 లక్షల లోటు చూపించింది.


1955-56 లో ఆ రాష్ట్ర నికరాదాయం ఎంత ఉందో చూసారా? 21 కోట్ల 62 లక్షలు. ఖర్చు 26 కోట్ల 94 లక్షలు. తె.వాదులూ ఏమిటి దీనర్థం? రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగేనాటికి హై. రాష్ట్రాన్ని పతనం బాటలో నడిపిస్తోంది అప్పటి ప్రభుత్వం. మరొక్క గమనిక.. ఈ నిర్వాకం ప్రజా ప్రభుత్వం హయాంలో జరిగింది. సైనిక పాలనలోనో, అధికారి పాలనలోనో కాదు.

సరే, ఇప్పుడిక ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటో చూద్దాం..1955-56 నాటికి ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కూడా గొప్పగా ఏమీ లేదు. 10 కోట్ల 73 లక్షల లోటు బడ్జెట్టుతో ఉంది. ఇక్కడో సంగతి.. ఆంధ్ర రాష్ట్రం అప్పుడప్పుడే కొత్తగా ఏర్పడింది. మౌలిక వసతుల కోసమే ఎంతో ఖర్చు పెట్టాల్సిన సమయం. పైగా, సరిగ్గా అదే సమయంలో (1952లో) విజయవాడ దగ్గర కృష్ణానదిమీద బ్యారేజీ కొట్టుకుపోయింది. కొత్త బ్యారేజీని (ఇప్పటి ప్రకాశం బ్యారేజీ) కట్టాల్సొచ్చింది. అది 1954 లో మొదలై, 1957లో పూర్తయింది. ఆకాలంలో జరిగిన పంట నష్టం, కొత్త బ్యారేజీ కట్టడానికి జరిగిన ఖర్చు - ఇదంతా కొత్త రాష్ట్రం బడ్జెట్టు తూకాన్ని కొంతవరకైనా దెబ్బతీసి ఉంటుంది. బడ్జెట్టును పరిశీలించేటపుడు మనం వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.

ఈ లెక్కలను బట్టి చూస్తే తెలుస్తోందేంటయ్యా అంటే రెండు రాష్ట్రాలు కూడా ఆర్థిక పరంగా ఒకే రకంగా ఉన్నాయి. మేం అద్భుతంగా ఉన్నాం అంటూ తె.వాదులు చెప్పుకునే గొప్పతనాలేవీ ఈ లెక్కల్లో కనబడవు. అప్పటి ఆంధ్ర రాష్ట్ర విపత్కర పరిస్థితిని లెక్కలోకి తీసుకుంటే, హైదరాబాదు రాష్ట్రంలో ఇప్పటి తెలంగాణతో పాటు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రల్లో భాగమైపోయిన భూభాగం కూడా కలిసి ఉండేదన్న సంగతిని గమనంలో ఉంచుకుని చూస్తే బహుశా తెలంగాణ కంటే ఆంధ్రే మెరుగ్గా ఉండి ఉండొచ్చు కూడా.

సరే, ఈ లెక్కలను ఒకసారి పోల్చి చూద్దాం..
1955-56 నాటికి హై. రాష్ట్రం ఆదాయం: 21 కోట్లు. ఆంధ్ర రాష్ట్రం ఆదాయం: 17 కోట్లు
మొత్తం ఆదాయంలో హై. వాటా: 55% (హైదరాబాదు రాష్ట్రమంటే, తెలంగాణతో పాటు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రల్లో భాగమైపోయిన భూభాగం కూడా. ఆ ప్రాంతం నుండి వచ్చినఆదాయం కూడా ఇందులో కలిసుందని మనం గుర్తుంచుకోవాలి.)
ఆంధ్ర వాటా: 45%
ప్రస్తుతం ఈ వాటాల అంతరం ఇంకా పెరిగి ఉంటుంది.

మా మిగులును వాడేసుకున్నారు బాబో యంటూ అబద్ధాలు చెప్పెయ్యడమే కాదు, తమ అబద్ధాలను నిజమని మనల్ని నమ్మించడానికి 'హైదరాబాదు ఆదాయాన్ని మీ అభివ్రుద్ధికి ఉపయోగించడంతో పాటు హైదరాబాదును రాజధాని అవసరాలకు వాడుకున్నందుకు కూడా పరిహారం ఇవ్వాలి.' అని అడుగుతున్నారు.

తె.వాదులూ.. కోస్తా సీమలు వాడేసుకోడానికి, ఆనాటి హై. రాష్ట్రబడ్జెట్టులో పెద్ద బొక్క తప్ప, ఇక్కడేమీ లేదు. వాళ్ళంటూ ఏదన్నా వాడుకుని ఉంటే అది మీ బడ్జెట్టు లోటునే అయ్యుండాలి. వాళ్లకున్న బడ్జెట్టు లోటు చాలదన్నట్టు మీ లోటును కూడా, కుట్ర చేసి మరీ, ఎత్తుకుపోయారంటారా? ఇహనాపండి మీ అసంబద్ధ, అబద్ధ వాదనలు.

23 కామెంట్‌లు:

 1. meeru smakya vaado..pratyeka andhraa vado.teleedu..okavela..samaikya vaade ayite..telangaanaa vaadulaki naccha cheppi oppinche gurutara baadhyata..meeru moyaalsi untundi..anduku ento sahanam..audaaryam..peddarikam avasaram..udyama karulla..meeroo vadinchite..prayojanam shoonyam..
  telangaanaa..udyama geetaalakai..plz visit www.raki9-4u.blogspot.com

  రిప్లయితొలగించండి
 2. దేశంలో రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన విభజింప బడ్డాయి. అభివౄద్ధి ప్రాతిపదికన కాదు.

  అలా అభివౄద్ధి ప్రాతిపదికన రాష్ట్రాల్ని విభజించితే, దేశంలో రాష్ట్రాలు వేలల్లో వుంటాయి.

  ఎందుకంటే, దేశంలోని ఏ రాష్ట్రం లోనూ, అన్ని ప్రాంతాల్లో అభివౄద్ధి సమానంగా వుండదు.

  తెలంగానా ప్రాంతాన్ని అభివౄద్ధి చేద్దాం అనాలి గాని, ప్రత్యేక రాష్ట్రం వల్ల మనకు ఏం ప్రయోజనం?

  తెలంగానాలో ఎక్కువమంది తెలుగు కాకుండా వేరే భాష మాట్లడినప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోరవచ్చు.

  రాజకీయ నాయకుల స్వార్థానికి చదువురాని అమాయకులే కాదు, కొంత మంది చదువుకున్న వివేకం కలిగినవారూ బలి అవుతున్నారు.

  - కుమార్, వరంగల్.

  రిప్లయితొలగించండి
 3. నిన్న ఎవరైనా హెచ్ యెం టివి లో వచ్చిన దశ-దిశ చూసివుంటే ..అందులో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి ప్రసగంచూస్తే చాలా విషయాలు తెలుస్తాయి...
  1)ఆయన ప్రధానంగా ఒక విషయం చెప్పారు..అభివ్రుధ్ధి ఎవరికి ఎంత జరిగిందో తెలుసుకొవాలంటే ..సరైన ప్రాతిప్రదిక..
  1956 ముందు హైదరాబదు రాజధానిగా వున్న తెలంగాణా లో 2009 తెలంగాణాలో
  1956 ముందు అంధ్రరాష్త్రంలో ఇప్పుడు కోస్తా,రాయలసీమ జిల్లాల్లో ..ఇలా కంపేర్ చెయ్యలి..
  ఉదాహరణకి :
  1956 తెలంగాణా తలసరి ఆదాయం 5 కోట్లు అయితే 2009 100 కోట్లు అనుకోండి .... అభివ్రుధ్ధి % ?
  1956 ఆంధ్ర రాష్ట్రం తలసరి 100 కోట్లు ఉంటే 2009 500 కోట్లు అయితే ...అభివ్రుధ్ధి % ఎంత?

  (పైలెక్కలు ఉదాహరణకి మాత్రమే)

  రిప్లయితొలగించండి
 4. అయ్యా చదువరి గారు,

  ఎక్కడివో మూడు snaps తీసుకు వచ్చి వ్యాసం బాగానే రాసారు కానీ, పాత విషయాలు పక్కన పెడితే recent గా మన గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేసిన university లకు ఇచ్చిన ఫండ్స్ విషయంలో మనం ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలను compare చేసుకుందాము. అక్కడ మీకు తెలంగాణా లో హైదరాబాద్ తప్ప మిగిలిన ప్రాంతాలు ఎందుకు వెనకబడ్డాయో మీకు తెలుస్తుంది, ప్రస్తుత ప్రభుత్వం, గతంలో పాలించిన ప్రభుత్వాలే గనక సరిగా ఉండి, మా ప్రాంతాలకు అన్యాయం చేయకున్నట్లయితే ఇప్పుడు ఈ గొడవ వచ్చేది కాదు. సమైఖ్యాంధ్ర అంటూ గొంతు చించుకుంటున్న నాయకులను నేను అడిగే ప్రశ్న ఒక్కటే, suppose మేము హైదరాబాద్ వోడులుకుని తెలంగాణా కావాలంటే కూడా మీరు ఇలాగే సమైఖ్యాంధ్ర కోసం ఉద్యమిస్తారా? ఇది మీరు మీ మనస్సాక్షి ని అడగాల్సిన ప్రశ్న. ఇప్పటికి కూడా నిధుల కేటాయింపులో మాకు న్యాయమయిన వాటా ఇస్తామని కానీ , తెలంగాణా వెనుకబడిన ప్రాంతాలని అభివృద్ధి చేస్తామని కానీ ఒక్క మాటయినా ప్రభుత్వం చెప్పిందా? ఇంతకుముందులా తెలంగాణా ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి, ఉప ముఖ్యమంత్రి పదవి ఇష్తారట!

  నేనూ తెలంగాణా లో పుట్టిన సమైఖ్యవాది నే, నేను కోరుకునేది అందరం కలిసున్దామనే కానీ, దాని కోసం నా ప్రాంత ప్రజల అభివృద్దిని , వారి ఆశలను తాకట్టు పెట్టి కలిసున్దాలనుకోవడం లేదు. ఇప్పటికయినా సమైఖ్యవాదులు ఒక విషయం గుర్తిస్తే చాలా బాగుంటుంది, తెలంగాణా ఉద్యమం అనేది, రాజకీయనాయకుల లబ్ది కోసమో లేక ఒక వర్గ ప్రజల కోసమో జరిగేది, అలాగని ఇక్కడి ప్రజలు అడిగేది జరిగిపోయిన చరిత్ర ను ఆధారం చేసుకుని కూడా కాదు, ప్రస్తుత పరిస్థితుల ఒక సారి గమనించండి, తెలంగాణా అంటే హైదరాబాద్ ఒకటే కాదు అని గుర్తించండి. ఆ పైన నిర్ణయించండి, న్యాయం ఎవరి వైపు ఉందొ...

  రిప్లయితొలగించండి
 5. నేను అడిగే ప్రశ్న ఒక్కటే, suppose మేము హైదరాబాద్ వోడులుకుని తెలంగాణా కావాలంటే కూడా మీరు ఇలాగే సమైఖ్యాంధ్ర కోసం ఉద్యమిస్తారా? ఇది మీరు మీ మనస్సాక్షి ని అడగాల్సిన ప్రశ్న.

  great question my dairy ji.

  రిప్లయితొలగించండి
 6. మీరు చెప్పినట్లు మొదట అభివృద్ధి లో వెనకబడింది అని అబద్ధపు సాక్షాలు చూపించి అమాయకులను నమ్మించి ఇప్పుడేమో సమైక్య వాదులు 50 యేళ్లలో అభివృద్ధి గురించి శ్వేత పత్రం విడుదల చేయమంటూంటే, తెలంగాణా నాయకులు మాట మార్చి ఆత్మగౌరవం పల్లవి ఎత్తుకుంటున్నారు.

  రిప్లయితొలగించండి
 7. ఓరెమూనా: ఈ గణాంకాలను భారత ప్రభుత్వం వారి ప్రణాళికా సంఘం వెబ్‌సైటు నుండి సంగ్రహించానండి.
  రాఖీ: నేను తిరిగి కుందేటి కొమ్మునైనా సాధించగలనండి. తె.వాదులను ఒప్పించలేను. అంత పెద్దరికం నాకు లేదు.

  రఘు: "రాజకీయ నాయకుల స్వార్థానికి చదువురాని అమాయకులే కాదు, కొంత మంది చదువుకున్న వివేకం కలిగినవారూ బలి అవుతున్నారు." - మొన్నటిదాకా అసలు వాళ్ళేనండి బలవుతున్నది. ఇప్పటి ఉద్యమంలో భావోద్వేగాలను బాగా రెచ్చగొట్టి, అన్ని వర్గాలకూ విస్తరింపజేసారు.

  రేస్: నేను నిన్నటి కార్యక్రమం చూళ్ళేకపోయానండి. ఉండవల్లి ప్రసంగం ముగించేటపుడు ఒక రెణ్ణిముషాలు మాత్రం చూసాను. 1972 ఉద్యమంలో తనపై కేసు పెట్టినపుడు ఎన్ని తిప్పలు పడ్డాడో చెబుతూంటే చూసాను.

  పుల్లాయన: ఔనండి.

  రిప్లయితొలగించండి
 8. MY DIARY, ASHOK: ఎక్కడివో మూడు స్నాపులు కాదండి.. భారత ప్రభుత్వం వారు చెప్పిన అంకెలవి. :)

  పాత సంగతులు పక్కన పెడదామంటున్నారు.. సరే అలాగే చేద్దాం. అలాగే పాత సంగతుల పేరిట అబద్ధాలు చెప్పొద్దని తె.వాదులకూ సలహాలివ్వండి. తెలంగాణకు జరిగిన అన్యాయం అంటూ ఈ అంకెలనే మార్చేసి జనాల్లోకి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ రాస్తున్నాను తప్ప, మరో ఉద్దేశం లేదు. మరే ఉద్దేశమూ లేదు. నాది కేవలం ప్రతిస్పందన, అంతే!

  "సమైఖ్యాంధ్ర అంటూ గొంతు చించుకుంటున్న నాయకులను నేను అడిగే ప్రశ్న ఒక్కటే.." - నేను చెబుతూ ఉన్న, చెప్పే సమాధానం ఒకటుంది.. విడిపోడం సమైక్యవాదికి ఇష్టం లేదు. కాదూ కూడదంటావా.. నువ్వు విడిపో, నన్ను పొమ్మనకు.

  "నేను కోరుకునేది అందరం కలిసున్దామనే కానీ, దాని కోసం నా ప్రాంత ప్రజల అభివృద్దిని , వారి ఆశలను తాకట్టు పెట్టి కలిసున్దాలనుకోవడం లేదు.." - 'అభివృద్ధి జరగడం లేదు' అనేది అబద్ధపు ప్రచారం అని చెబుతూన్నానండి. ఈ అబద్ధాల గురించి మరింత తెలుసుకునేందుకు, బ్లాగుల్లో వస్తున్న టపాలను చదవండి. నా బ్లాగులో కూడా పాత టపాలను చూడండి.

  రిప్లయితొలగించండి
 9. చదువరి గారూ, మీరు ఎన్ని గణాంకాలు చెప్పినా - తా పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అనే వారిని మనం సమాధానం చెప్పలేమండీ.

  పుల్లాయన గారూ మీరన్న మాట అక్షరాలా నిజం.

  కానీ మనం తెలుగు వాడి ఆత్మగౌరవం అని నినదిస్తూ ఉంటే - వారు తెలంగాణా వారి ఆత్మ గౌరవం అంటున్నారు. వారినందరినీ ఒకే ప్రశ్న అడగాలనిపిస్తూ ఉంది. "తెలంగాణా వారు తెలుగు వారు కారాండీ?"

  రిప్లయితొలగించండి
 10. @all: If possible, read this book

  Development of Andhra Pradesh: 1956-2001
  A study of regional disparities. edited by Y. V. Krishna Rao and S. Subramanyam.

  You will find many interesting statistics. My "feeling" after reading this book is,

  If a scientific, objective analysis is done, telangana udyamam will not have any ground (except 610 GO, gentleman's agreement etc...)

  Interestingly, they have divided the state into five regions for the study.

  North-T, South-T, North-Kosta, South Kosta and Seema. There is lot of disparity between N-T and S-T.

  In terms of backwardness, S-T competes with Seema (which have lowest rainfall) and N-K. While N-T competes with S-K in terms of growth.

  The gap between T and rest of AP was much larger in 1956 (T is way backward then) and this is getting narrowed. What this means is, T is progressing at a higher rate than the rest.

  In fact, N-K is at disadvantage due to AP formation.

  T-separation is an exploitation of the T-people for political mileage. Backwardness can be overcome. But "discrimination" has no cure. It has something to do with the attitude and outlook. And it is also easy to instigate people based on "regional disparities" but reasoning "samaikyata" requires education on the readers part.

  Btw, if you notice, Bihar is reporting growth (while Jharkhand is limping).

  What is even more remarkable is, Saurastra, which does not have (water) resources on par with the rest of the Gujarat, has outperformed in terms of agri-growth.

  What these two examples tell us, is development has nothing to do with "separation".

  Need of the hour is "able" leadership.

  రిప్లయితొలగించండి
 11. మై డైరీ గారూ, అశోక్ గారూ,
  మీకు ఓ కౌంటర్ ప్రశ్న. హైదరాబాదు ని వదులుకోవాల్సి వస్తుందని నిశ్చయం గా తెలిస్తే మీరూ మీ నాయకులూ ఇలాగే తెలంగాణా కోసం ఉద్యమిస్తారా? ఇది మీరు మీ మనస్సాక్షి ని అడగాల్సిన ప్రశ్న.

  రిప్లయితొలగించండి
 12. నాకు తెలిసినంతవరకూ హైదరాబాదు రాష్ట్రం బడ్జెట్ లొ కొంత లోటు ఉన్నప్పటికీ, నిజాం నుంచి సంక్రమించిన వంద కోట్లకు పైగా రిజర్వులు ఉండేవి. దీన్ని తెలంగాణా ప్రాంతంలో ఖర్చు పెట్టకుండా ఆంధ్రా నాయకులు మాయం చేసారని ఆరోపణ.

  రిప్లయితొలగించండి
 13. I do not know whether this makes a difference. Part of the revenue base in Hyderabad State at that time was due to tax on alcoholic beverages which were not prohibited. Wikipedia seems to say that it made a difference:
  http://en.wikipedia.org/wiki/Telangana

  రిప్లయితొలగించండి
 14. ప్రజలకి ఏ రంగంలోను ఏమీ చెయ్యకుండా ఒక రాజఱిక ప్రభుత్వం వాళ్ళ ముక్కుపిండి పన్నులు మాత్రం వసూలు చేసి బొక్కసం నింపుకుంటే దాన్ని "మిగులు" అని వర్ణించడం వేర్పాటువాదులు మాత్రమే దిగజాఱగల నైతిక పాతాళం. ఆ మిగులు అసలు ఉంటే గింటే అది కేవలం తెలంగాణకే చెందినదా ? లేక మిహతా ఏడు కన్నడ, మరాఠీ జిల్లాలక్కూడా చెందినదా ? అని ప్రశ్నించుకోవాల్సి ఉంది.

  --తాడేపల్లి

  రిప్లయితొలగించండి
 15. Educate yourself

  http://www.ziddu.com/download/8166624/Andhra_Valasa_Palanalo_Telangana.rar.html

  రిప్లయితొలగించండి
 16. MY DIARY: ఈ బాపతు జిడ్డోడే లింకులు చాలానే చూసాన్లెండి. అంతర్జాలమంతా ఇలాంటి సమాచారంతోటే నిండిపోయింది. రెండేళ్ళ కిందట scribd.com లో ఈ పుస్తకం మీదే ఒక వ్యాఖ్య కూడా రాసాను. లింకు కావాలా?

  మీరు పై వ్యాఖ్యలో ఇచ్చిన ఈ జిడ్డు లింకులను పట్టుకుని వేళ్ళాట్టం గాదు, భారత ప్రభుత్వం ఏం చెబుతోందో చూడండి. విషయాలు తెలుస్తాయి. అసలింతకీ నేను ఈ టపాలో రాసిన దానిపై మీ అభిప్రాయం ఇంతవరకూ చెప్పలేదు. ప్రణాళికాసంఘం వారి సైటును చూసారా లేదా? మీకు ఆ సమాచారం దొరికిందా లేదా? దొరికితే దాన్నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మీరు గతంలో చెప్పిన అబద్ధాలపై మీ సమాధానం ఏంటి? ఈసారి వచ్చేటపుడు పై ప్రశ్నలకు సమాధానంతో రండి.

  రిప్లయితొలగించండి
 17. పై వ్యాఖ్యలో ప్రణాళికా సంఘం అని పొరపాటుగా రాసాను.. అది ఆర్థిక సంఘం!

  రిప్లయితొలగించండి
 18. చదువరి గారు.

  నేను గతంలో చెప్పిన అబద్దం ఏంటో ఒక సారి, నే రాసిన వ్యాఖ్య చూసి చెప్పండి. అందులో నేనేక్కడయిన గతంలో తెలంగాణ పరిస్థితి గురించి కానీ, అప్పుడేదో మా తాతలు నేతులు తాగారు, మీరు మా మూతులు వాసన చూడండి అని చెప్పలేదు. ఒక సారి నా పాత వ్యాఖ్యను గమనిస్తే బాగుంటుంది.

  ఇక జిడ్డు లింక్ గురించి అంటారా, బ్లాగరులు దానిని చదివి విశ్లేషించి నిజానిజాలు చెప్తారని.

  రిప్లయితొలగించండి
 19. నాకు scribd.com లో మీరు రాసిన వ్యాఖ్య కు లింక్ కావాలి.

  రిప్లయితొలగించండి
 20. శ్వేతపత్రం శ్వేతపత్రం అంటారు అదేమిటో కొద్దిగా చెప్పండి నాకు. వందనములు.

  రిప్లయితొలగించండి
 21. MY DIARY: ఆ జిడ్డు పుస్తకపు scribd లింకు ఇది: http://www.scribd.com/doc/982957/Andhra-Valasa-Palanalo-Telangana

  'మీరు చెప్పిన అబద్ధాల్లో' 'మీరు' అంటే నా ఉద్దేశం తె.వాదులని, వ్యక్తిగతంగా మీరు కాదు. నేను సమైక్యవాదినని మీరు చెప్పొచ్చు.. కానీ మీమాటల్లో ఎక్కడా సమైక్యవాదం ధ్వనించకపోగా, తెలంగాణవాదం స్పష్టంగా వినిపించింది -మీ మొదటి వ్యాఖ్యలోని మొదటి వాక్యం చూడండి.

  పోతే, ఎడ్యుకేట్ యువర్‌సెల్ఫ్ అని మీరు నన్ను నేర్చుకొమ్మన్నారు. నెనరులు, తప్పకుండా నేర్చుకుంటాను. మీరు నేర్చుకోవాల్సిందీ ఉందని గుర్తు చేసానంతే.

  Rao S Lakkaraju: శ్వేతపత్రం అంటే మీకు తెలియక అడిగారని అనుకోవడం లేదు. నాకు తెలిసిందైతే ఇది: వాస్తవాలు వెల్లడి చేసే ప్రభుత్వ ప్రభుత్వ పత్రం!

  రిప్లయితొలగించండి
 22. థాంక్స్. నాకు నిజం గా తెలియదు. వైట్ పేపర్ పబ్లిష్ చెయ్యాలంటారు. అదిగూడ తెలియదు. రెండు ఒకటే అనుకుంటాను. పోలిటిక్స్ లో నా పరిజ్ఞానం 'ఈనాడు' తెలుగు పేపరు..
  రామకృష్ణారావు

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు