26, ఏప్రిల్ 2008, శనివారం

రికార్డు డ్యాన్సులు, క్రికెట్టు కాంట్రాక్టర్లు

అదసలు క్రికెట్టేనా అని!!
- అదే అయితే ఈ ఛీర్‌లీడర్లెందుకు?
- సరే.. ఉండాలీ అంటే, ఆడాళ్ళే ఎందుకు?
- సరే.. వాళ్ళే కావాలీ అంటే, ఆ కురచగుడ్డలెందుకు?

అన్నీ ఒకందుకే..
డబ్బుల కోసం! వందల కోట్లు పెట్టి ఆటలాడిస్తున్నది డబ్బుల కోసం. జనాలు రావాలి, టీవీల్లో చూడాలి - లేకపోతే డబ్బులెక్కడి నుంచొస్తాయ్? జనాలూ, తద్వారా డబ్బులూ ఇబ్బడిముబ్బడిగా రావాలంటే ఇలాంటి రికార్డింగు డ్యాన్సుల్లాంటివి పెట్టాలి. ఇలాంటి వేషాలేస్తే ఎక్కడైనా జనం పోగవుతారు. అలా పోగౌతారనేగా.. వీటిని పెడుతున్నది! పోగైనప్పుడు మనిషి లోని అసలు మనిషి బయటికి వస్తాడు. మంద మనస్తత్వం (మాస్ మెంటాలిటీ) గురించి తెలియనిదేముంది!

బజాట్టో బట్టలిప్పుకుని తిరుగుతూ "నన్నట్టాగన్నాడు", "మీదచెయ్యేసాడు" అంటూ ఏడవటంలో అర్థం లేదు. ఏఁ.., ఆట చూట్టానికి వచ్చిన వందలాది మంది స్త్రీల తోటి అలా అసహ్యకరంగా ఎందుకు ప్రవర్తించడం లేదు, వాళ్ళు? స్త్రీని గౌరవించటానికీ, ఈరకం జనాలతో వ్యవహరించడానికీ సంబంధముందని నేననుకోను.

కొత్త సంవత్సరం రోజున ముంబైలో గత రెండేళ్ళు జరిగినది విన్నాం కదా.. అర్ధరాత్రి, చిత్తుగా తాగి, రోడ్లమీద చిందులేస్తూ తిరిగే మూకల మధ్యకి (వందలాది మంది; పైగా ఆ సమయానికి వాళ్ళు పశుప్రాయులు) తామూ పోతే, తప్పు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ తాగుబోతులూరుకుంటారా? బట్టలు లాగెయ్యడాన్ని నేను సమర్ధించడం లేదు.. పిచ్చి కోతితో కలిసి కల్లు తాగి, ఆనక అది మీద పడి రక్కిందని ఏడవగూడదు అని చెబుతున్నాను. ఎవరి హద్దుల్లో వాళ్ళుండాలి. స్త్రీ పట్ల భారతీయులకున్న గౌరవానికీ దీనికీ సంబంధం ఉందని నేననుకోను!

హై.లో బీచి వాలీబాలు చూసేందుకు జనం ఎగబడ్డారట. ఎల్బీ స్టేడియమ్ లో జరిగే మామూలు వాలీబాలు చూసేందుకు ఎగబడతారా? ఆట కోసమనేనా ఆ తహతహ? ఆ రకంగానైతే జనం బాగా వస్తారనేగదా, డబ్బులు బాగా వస్తాయనే కదా.. ఇసకపోసి మరీ హై.లో ఆ ఆటాడించింది!

కోరికలుండటం సహజం. హద్దుల్లో ఉంచుకోలేకపోవడం, ఉత్సుకత చూపించడం సహజమైన బలహీనత. ప్రజల్లోని ఈ బలహీనతను సొమ్ము చేసుకుందామనే.. వాళ్ళీపని చేస్తున్నారు. ఇంకా ఈ దొంగ ఏడుపులెందుకు? ఈ వ్యాఖ్యానించే బలహీనత ఆ కొందరిదే కాదు.., చాలామందిది, మెజారిటీది. అవకాశం దొరక్క కొందరు, గుర్తుపడతారేమో, దొరికిపోతానేమో లాంటి భయాలతో మరి కొందరు,.. ఇలా రకరకాలు.

మనమిక్కడ అనాల్సింది అలా అసభ్యంగా వ్యాఖ్యలు చేసేవాళ్లని కాదు.. ఆ డ్యాన్సర్లనీ, ఆ వేషాలేయించే వ్యాపారస్తులనీ! స్త్రీని గౌరవించంది వాళ్ళు - ఆ స్త్రీలు, ఆ వ్యాపారస్తులే! డబ్బుల కోసం నైతికంగా దిగజారిపోయింది వాళ్ళే! మహారాష్ట్ర, బెంగాలు మంత్రులు చేస్తున్నది రైటే! ఆ గంతులు మన సభ్యతకు, మర్యాదకు భంగకరం. పబ్లిక్ న్యూసెన్స్!

13 కామెంట్‌లు:

 1. బాగా వ్రాశారు, అక్కడ క్రికెట్ తప్ప మిగిలినవన్నీ ఉన్నాయి :-)

  నమస్కారలతో,
  సూర్యుడు :-)

  రిప్లయితొలగించండి
 2. బాగా చెప్పారు. ఇక్కడ అమెరికాలో సంస్కృతిని యధాతధంగా కాపీ కొడుతున్నారు. ఇంక స్టేడియములలోకి మందుని అనుమతించటమే తరువాయి.

  రిప్లయితొలగించండి
 3. భారతంలో కూడా రాను రాను మగాళ్ళకు జీవితాన్ని కష్టతరం చేస్తున్నారన్నమాట! గాలిలో విపరీతమైన సెక్సు గుప్పించిన ఆధునిక వాతావరణంలో శీలాన్ని కాపాడుకోవటం ఎంత కష్టమో మగజాతికే ఎరుక

  రిప్లయితొలగించండి
 4. ఇవ్వాళ భారత ఉపఖండంలో క్రికెట్ వేల కోట్లరూపాయల వ్యాపారం.ఏ రంగంలోనైనా మన దేశం వెనుకబడిందేమో గానీ,మనకు ప్రధాని కాబోయి,అవలేకపొయిన మరాఠా యోధుడు శ్రీమాన్ శరద్ పవార్ నేతృత్వంలో విజయవంతంగా పురోగమిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది.

  క్రీడాస్ఫూర్తిని,వ్యాపార,వాణిజ్యవిలువలు అణగదొక్కి లాభాపేక్షకు పెద్దపీటవేయటం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది.కారు టైర్ల నుండి బ్యాంకుల వరకూ,రియల్ ఎస్టేట్ సంస్థనుంచి కార్పోరేట్ ఆసుపత్రులవరకూ ఈరోజు మహిళామోడళ్ళు లేకుండా ప్రకటనలు ఉండటం లేదు.

  వందలకోట్లు తగలేసి వేలంలో ఆటగాళ్ళను పాడుకున్న వర్తకులు తమ సరుకు అమ్ముడుపోయేందుకు ఎలాంటి అడ్డమైన గడ్డి కరిచినా నిస్సిగ్గుగా సమర్ధించే సంప్రదాయం కూడా ఒకటేడిసింది దేశంలో,నిరసన గళాలను నిర్లక్ష్యం చేస్తూ.

  గుంపుగా ఉన్నప్పుడు తప్ప మగతనం గుర్తు రాని బాపతు ఎప్పుడూ ఉంటుంది,సినిమాతెరపై జ్యోతిలక్ష్మి వచ్చినప్పుడు ఈలలు వేసినా,విమానాశ్రయాల్లోనో,షాపింగు కాంప్లెక్సుల ప్రారంభోత్సవాల్లోనో ఏ జ్యోతికో,నమితో ఇంకొకరో ఈ మానసిక దౌర్బల్యపీడితుల పాలిట పడుతుంటారు.

  చాలా కాలంక్రితం ఒక ప్రముఖ కళాశాల వార్షికొత్సవానికి ఒక సినిమా నటిని పిలిచారు.పేరెందుకు కానీ,ఆమె బాపు సినిమాతో అందరికీ తెలిసిన,సంసారపక్షం గా ఉండే నటి.ఆడిటోరియం మధ్యలోనుంచి వస్తున్న ఆమె మీద పడ్డ గుంపు ఒకటైతే,ఆవిడ తల్లిమీద చేతులేసిన మంద మరొకటి.విధ్యార్ధులను వారిస్తున్నట్లు నటిస్తూ,కొందరు అధ్యాపకులూ యధాశక్తి తమ పశుపవృత్తిని చాటుకున్నారు.

  బహిరంగ పీపింగ్ టాములు అసంఖ్యాకంగా ఉండి,అవకాశం రాకున్నా సృష్టించుకుంటూ ఉండే శృంగారవైపరీత్య మనస్కులైన మన ప్రజానీకానికి ఈ చీరు లీడర్ల పేరుతో వచ్చిన వనితలు చిర్రెక్కిస్తున్నారు ,వారి యజమానులకు సొమ్ము చేసి పెడుతున్నారు.

  అది బీచి వాలీ బాల్ కావచ్చు,క్రికెట్ కావచ్చు,స్త్ర్రీ శరీరం లాభాలనార్జిస్తుంది అని నిరూపిస్తున్న ఈ పెద్దలను వ్యభిచార గృహనిర్వాహకులతో పోల్చటం చాలా తక్కువ,తప్పు కూడా.

  పెంపకం లొ లోపమా?లేక మనకున్న ప్రాధమిక విలువలలోని డొల్లతనమా ఇలాంటి విపరీత పోకడలకు మూలం అని విజ్ఞులు ఆలోచించాల్సిన సమయం ఎపుడో వచ్చింది,కానీ నిద్ర నటిస్తూ కాలహరణం చేస్తున్న వారికి ఎలా చెప్పగలం?


  స్త్రీలను సమర్ధిస్తూ మాట్లాడేందుకూ,మగాళ్ళం మనుషుల్లా ఉందాం అని చెప్పటానికి కమ్యూనిష్టో,ఫెమినిస్టో మరొకటో కానవసరం లేదు.మానవత్వం ఉంటే చాలు.

  రిప్లయితొలగించండి
 5. రాజేంద్ర గారు, చాలా చాలా పెద్ద మాటలు అనేసారు ....

  1. పెంపకం లొ లోపమా?

  2. స్త్రీలను సమర్ధిస్తూ మాట్లాడేందుకూ,మగాళ్ళం మనుషుల్లా ఉందాం అని చెప్పటానికి కమ్యూనిష్టో,ఫెమినిస్టో మరొకటో కానవసరం లేదు.మానవత్వం ఉంటే చాలు.  రాజేంద్ర గారు, చాలా చాలా పెద్ద మాటలు అనేసారు ....

  1.
  మరి ఈ ష్త్రీ లు ఛిర్ డీలర్స్ ని ఎంతవరకు సమర్ధిస్తున్నారో తెలియదు..
  ప్రతి సమయానికి సంధర్భానికి, సంగతికి, ఓ వస్థ్రధారణ ఉంటుండి, కోట్లు ఖర్చు పెట్టి సినేమా ఆడదేమో అని మూందే ఆడియో ఫంక్షన్లు చేస్తున్నారు, అక్కడ అర్ధనగ్న ప్రదర్శ్నలు ఉంటాయి తెలుసు .. దూరం గా ఉంటాను.. పబ్బులు .. ఇత్యాదుల పేరిటా అర్ధనగ్న నృత్యాలు దూరం గా ఉంటాను, ఆ మధ్యా వైజాగు మహానగరం బర్త్ డే పార్టీ పేరిటా బోంబాయ్ భామల తో ఎళా ఆదించవచ్చో చూపించారు - బర్త్ డే పార్టీలకి దూరం గ్ ఉంటాను .. కాని ఇది క్రికెట్టే .. ఇక్కాడికి ఆట ను చూడాడాటానికి వాచానే - ఇక్కడ నాకు అశ్లీలాన్ని ఎందుకు అమ్ముతున్నారు?

  2. మీరు పెద్దలు, సమాజాన్ని సమూలంగా చూసిన వారు, భారత దేశం లో నిరక్ష్యరాశ్యత ఎంతొ మీకు తెలుసు .. ఎంత మంది బాల కార్మికులున్నారో మికు తెలుసు .. పొద్దునంట కశ్టపడి పని చేసి - వచ్చిన డబ్బులతో అభిమాన నాతి చినిమా కెళ్ళావాడికి .. ఒక సారి ఆ నాటి కనిపిస్తే ఎంఔతుంది .. ఇలా ఈనాడు లో అనుకుంటాను ఓ మహా నటి, నెను కురచ దుస్తులే వేసుకుంటాను, వెనకాలా సెక్యూరితి గార్డ్ నె పెట్టుకుంటాను అని చెప్పింది. భారత దేశాం లో పిల్లాని పెంచలేని వారు ( కేవలం ఆర్ధికం గా) వాల్లు పని చేసి తీసుకొచ్చిన డబ్బులతో తినే వాల్లూ చాల వున్నారు - వారికి మంచి చెడ్డా తెలుసుకొనే లోపే కొన్ని చెడ్డాలు అనుభవించి ఉంటారు..
  [డీల్లీ ఆగ్రా లలో పర్యాతాకుల మీద అత్యాచారాలు చేశే వాళ్లు ఈ కోవలోకి వస్తారేమో]

  తప్పు మగ వాళ్లదే అంటే .. నాకు కాస్థ ఆచ్ర్యం గా ఉంది..
  పైగా గౌరవ ప్రదంగా కనిపించే వారిని, ప్రవర్తించే వారిని వీళ్లు ఇబ్బంది పెట్టటం లేదు కదా ...

  రిప్లయితొలగించండి
 6. ఈ విషయంలో నా ఆలోచనలు కొంత తికమక...

  ఎందుకంటే ఒక పక్కన చూస్తే ఆర్గనైజర్లను తప్పు పడదామంటే వాళ్ళు పెట్టిన డబ్బులకి ఏ విధంగా రాబడి సంపాందించుకోవాలో వారు దానికోసం ఏమయినా చేస్తారు.
  కాబట్టి సరయిన రూల్స్ పెట్టని బీసీసీఐ ని అనాలి ఏమన్నా అంటే.

  ఇక అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించడానికి మొత్తం మగవాళ్ళని నిందించలేము. ఒక సాంపిలుని బట్టి మొత్తం మగవారిని ఎలా నిర్ణయించేస్తారు ?

  అలాగని ఇది తప్పకుండా తప్పే. తప్పు చేస్తూ దొరికిన వాళ్ళని దొరికినట్టు లోపలేసి కుమ్మేస్తేనే బుద్ది వచ్చేది.సరయిన శిక్షలు అమలయ్యేలా చూడాలి.

  రిప్లయితొలగించండి
 7. నిజాయితీ ప్రతి విషయంలోనూ లోపిస్తోంది.క్యాపిటలిజం నగ్న ప్రదర్శన ఇది.డబ్బు,పరపతి కోసం సినిమా నటులు క్రికెట్టంటూ డాన్సులు చేస్తారు, క్రికెటర్లు వేలం పాటలో శీలం కోల్పోతారు.అసలు ఆటకే ద్రోహం చేస్తున్నారు.

  రిప్లయితొలగించండి
 8. 'కేవలం ' డబ్బు కోసం ఎంత కురచ దుస్తులనైనా వేసుకుని చేతుల్లో అవేవో వింజామరలు పట్టుకుని తైతక్కలాడటం అమెరికన్ ఫుట్ బాల్ మొదలుకొని విదేశాల్లో ఉన్న సంస్క్రుతి. ఇక్కడ ఈ దేశంలో ఆటగాళ్ళనే వేలంలో కొనుక్కున్న నిర్వాహకులు ఖర్చులు రాబట్టుకోవడానికి ఏమైనా చేస్తారు. వాటిని అనుమతించడం మనవాళ్ళు చేసిన మొదటి తప్పు. పైగా ఆటగాళ్ళు కూడా చీర్ లీడర్స్ ని చూసి ఉత్తేజం పొంది బాగా ఆడుతున్నారని నిస్సిగ్గుగా చెపుతున్నారు.

  పైగా ఇంట్లో కూచుని కూడా వీళ్ళని తప్పించుకోలేకపోతున్నాం. ఎవడు ఫోరు కొట్టినా, ఎవడి వికెట్ పడినా కెమెరా ముందు వీళ్ళ గంతుల్ని ఫోకస్ చేస్తోంది.

  వీళ్ల వల్ల వెధవ న్యూసెన్స్ తప్ప ఏమీ లేదు.పబ్లిగ్గా అంగ ప్రదర్శనకు సిద్ధ పడ్డ వాళ్ళకి, వాళ్ళు చీర్ లీడర్లైనా సరే, సినిమా నటీమణులైనా సరే, ఇంకెవరైనా సరే, పురుషుల మీద కంప్లైంట్ చేసే హక్కు లేదు. నీ మీద నీకు లేనిగౌరవం ఎవడో ఎందుకిస్తాడు? ఎందుకివ్వాలి?
  బెంగాల్, మహారాష్ట్ర మంత్రుల అభ్యంతరాలు కరెక్టే!

  రిప్లయితొలగించండి
 9. చీర్ లీడర్స్ అమెరికాలో సర్వ సాధారాణం, ఇక్కడి సంస్కృతిలో భాగం. డబ్బుకోసం కాదు, స్కూల్స్ మధ్య జరిగే ఆటల్లోనూ ఉంటారు. చీర్ లీడర్ గా ఎన్నిక కావడం వాళ్ళ తల్లిదండ్రులకీ గర్వ కారణం. ఎందుకో నాకు తెలియదు.

  ఇండియాకి క్రికెట్, పబ్ సంస్కృతీ చేరినట్టే మిగతావీ వస్తాయి. కొన్నాళ్ళకి అలవాటూ అవుతాయి. ఆవేశపడవలసిందేమీ లేదు.

  ఈ మార్పుల్ని జీర్ణించుకునే క్రమంలో కొంత అల్లకల్లోలం తప్పదు. అప్పుడే మన బుద్ధినీ, తర్కాన్నీ గతి తప్పకుండా చూసుకోవలసింది.

  తోటి మనిషికి గౌరవం ఇవ్వడం మన వ్యక్తిత్వంలో భాగం. అది వాళ్ళు వేసుకోని, లేదా వేసుకున్న బట్టల బట్టి మారడం అందులోని లోపం. ఆ గ్రహింపు కలిగినదాకా మన వెకిలితనానికి కారణం అవతలివారేనని నమ్ముతాం, (ఒకప్పుడు తొలిగిన పైటా, ఇప్పుడు పొట్టి లాగూ.. తేడా ఏముంది?) మనం చేసే దాడికి గురైనవారిదే అసలు తప్పని అందరికీ అరిచి మరీ చెపుతాం.

  రిప్లయితొలగించండి
 10. కడుపునింపుకోటానికి కోటప్పకొండ తిరునాళ్లలోనో మరోచోటో రహస్యంగా రికార్డింగ్ డ్యాన్సుల పేరిట గంతులేసేవాళ్లనీ, వేయించేవాళ్లనీ అశ్లీల నృత్యాలపేరుతో అరెస్టుచేయటం; బడా వ్యాపారవేత్తల అండతో ఛీర్ లీడింగ్ పేరుతో బహిరంగంగా జరిగే ఈ తంతు మాత్రం వినోదం పేరుతో ప్రోత్సహించటం! అసలు, షాహిద్ ఆఫ్రిది అన్నట్లు, జనాలకు క్రికెట్ కన్నా ఎక్కువ వినోదం ఛీర్ లీడర్స్ ఏమివ్వగలరు? రెండు మూడేళ్ల పాటు విదేశీ భామలను అద్దెకు తెచ్చి ఇలా ఆడిస్తారు; ఆ తర్వాత మెల్లిగా మన అమ్మాయిలనే ఇందులోకి దించుతారు. పదేళ్లు గడిచేలోగా ఛీర్ లీడింగ్ పేరుతో బట్టలిప్పి గంతులేయటాన్ని ఓ అద్భుతమయిన ఉపాధి అవకాశంగా భారతీయ టీనేజర్ల మనసుల్లో నాటుతారు. ఎవరాపగలరు దీన్ని?

  ఇకపోతే, ఛీర్ లీడర్స్ బాధల గురించిన వ్యాసాలు, వాళ్ల మీద సానుభూతి మాటలు హాస్యాస్పదం. రెచ్చగొట్టేలా అర్ధనగ్న నాట్యాలు చేస్తే ఎంతటి ప్రవరాఖ్యుడైనా పిచ్చి వేషాలే వేస్తాడు. జనాల బలహీతలను సొమ్ము చేసుకునే వృత్తిలో ఉండి అదో గౌరవప్రదమయిన ఉద్యోగమని చెప్పుకోవటం సిగ్గుచేటు. వంటినిండా బట్టలతో నాట్యం చేసే కళాకారిణులను ఎవడూ ఏడిపించటంలేదే? (అలాంటోళ్లు అసలు ఉండరని కాదు) ఇల్లు బార్లా తెరిచిపెట్టి ఊరెళ్లొచ్చి, ఆనక దొంగలు పడి మొత్తం ఊడ్చుకుపోయారని ఏడిస్తే ఉపయోగమేంటి?

  రిప్లయితొలగించండి
 11. Hi mee blog ni andhrajothi book lo choosi open chesa chala bagundi.memu meelanti Bloggers ki free ga websites create chesi isthunnamu.meeru kooda mee blog ni .com ga marchuko vacchu.poorti vivaralaku maa wesite choodandi
  http://www.hyperwebenable.com/

  రిప్లయితొలగించండి
 12. Just saw your blog from www.mobchannel.com. Its a good agregator, you can find blogs of all indian languages including telegu and with a lot of good features. Please visit www.mobchannel.com.

  రిప్లయితొలగించండి
 13. Bread and circuses will keep the general population conveniently diverted and make things easy for the rukers to manage things in the way they want.Cheap rice and the like on the ration cards is BREAD.And cinemas,cricket,and cheerleaders are the CIRCUSES.This is how the Romans ruled before Christ.And this is how we are being ruled now .

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు