స్పీకరు గారింకో మాటన్నారట.. ఆంధ్రజ్యోతిలో రాసారు..
అటు న్యాయ వ్యవస్థ, ఇటు పాలనావ్యవస్థ - రెండూ సరిసమానమైనవేనట,తప్పులున్నాయేమోనని వెతకబోతే గౌరవానికి భంగమెలా అవుతుంది? చట్టం తనపని తాను చేసుకుపోనివ్వటమే గదా వీళ్ళు చేస్తోంది! కాబట్టి ఈ సందేహాలను పక్కనబెట్టి, శాసనసభ తీర్మానం చేసి, కోర్టుకు ఉత్తరం రాయాలి.
అందువల్ల ఒకరిని ఒకరు గౌరవించుకోవాలట,
ఇప్పుడు ప్రజా ప్రతినిధుల ఆస్తిపాస్తుల గురించి విచారణ జరపవలసిందిగా తీర్మానం చేసి కోర్టును ఆశ్రయించడం అంత ఉచితం కాదట
చూద్దాం.., ఇవ్వాళైనా ఆ తీర్మానం సంగతి తేలుస్తారేమో!
2004 బదులు 1978 నుంచి విచారణ అనేసరికి తెదేపా నాయకుల గుండెలు గుభేల్లనుంటాయి. ఇంకెక్కడ నోరు పెగులుతుంది?
రిప్లయితొలగించండి- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)
స్పీకరా మజాకానా?
రిప్లయితొలగించండిఇంతవరకూ మనకా విషయమే తట్టలేదుసుమండీ. అన్నన్నా జడ్జీ ల చేత విచారణ జరిపిస్తే అది ప్రభుత్వం చేతగానితనంగా జమకట్టెయ్యరూ... అందుచేత ఇందుమూలంగా యావన్మందికీ తెలియజేయునదేమనగా త్వరలోనే ప్రభుత్వమే సీనియర్ కార్యకర్త చేత (వీళ్ళయితే పనీపాట లేకుండా తిరుగుతున్నారు కాబట్టి problem వుండదు. పైగా పదవులకోసం యెదురు చూస్తుంటారు కాబట్టి పుణ్యమూ, పురుషార్ధమూనూ) వీలయినంత త్వరలో విచారణ జరిపిస్తారహొ......
స్పీకరు గారి మాటలు నిజమే కాబోలు, అంత కష్టపడి, న్యాయ వ్యవస్థ అని పనులు అపి వాళ్ళ డబ్బులు లెక్కకట్టితే. చివరికి ఆడబ్బులు నావి కావు నా భార్యవి, నాకు ఉన్నది 2 ఎకరాలై అంటే! కధ కంచికి మనం ఇంటికి, న్యాయ వ్యవస్థకి డబ్బు, సమయం దండుగా కదా! లేదా ఇది ప్రతి/పాలక పక్షం కుట్ర అని వాళ్ళ బార్యలకి పదవులు ఇచ్చి అత్తగారి ఇంటికి వెళ్లి వచ్చి తరువాత మరల మొదలు కదా! అయినా ముఖ్యమంత్రి అయితే బాగా డబ్బులు వస్తాయి అని నా చిన్నతనం నుండి విని...విని ఉన్నాను, ఇప్పుడు వచ్చి ఈ ముఖ్యమంత్రి కి ఇడుపాయ లేదు, అ మాజీ ముఖ్యమంత్రి కి మలేషియాలో హోటల్స్ లేవు అని న్యాయ వ్యవస్థ బల్ల గుద్ది చెప్పిన నేను అయితే నమ్మను, మీరు అంతే అనుకుంటా!... మరి దానికి ఇంత పని చేయాలా... ఈ విషయం ఓటు వేసే సమయంలో ఓటర్లు ఆలోచించాలి, 2/20 ఏకరాల ఓనరు 200../2000.. ఎలా వచ్చాయి అనీ? Sorry for my mistakes.
రిప్లయితొలగించండి-మరమరాలు