10, జనవరి 2008, గురువారం

రెండో ఎస్సార్సీ - ఎప్పుడో చెయ్యిచ్చిన కాంగ్రెసు, తెరాస!

తెలంగాణ ప్రస్థానంలో మరో మలుపు కాబోయే ఎస్సార్సీ ఏర్పాటు దాదాపు ఖాయమైనట్టే! ఎస్సార్సీ వద్దని దాదాపుగా అన్ని పార్టీలూ గోల చేస్తున్నాయి. కాంగ్రెసు మాత్రం అదే మా విధానమని అంటోంది.

ఇక ప్రజలకు చేస్తున్న మోసం విషయం .. నిజమే మోసం జరుగుతోంది.. అయితే ఆ మోసం ఇప్పుడు కాదు.., కాంగ్రెసు, తెరాస - రెండు పార్టీలూ కలిసి 2004 ఎన్నికలప్పుడే చేసాయి. ఒప్పందాన్ని స్పష్టంగా రాసుకోకుండా తమకిష్టమైన రీతిలో దాన్ని మలచుకునేలా రాసుకుని మనల్ని మభ్యపెట్టారు.

"మొదటి ఎస్సార్సీకి కట్టుబడి ఉంటూనే రెండో ఎస్సార్సీ వేస్తామ"ని ఆ ఒప్పందంలో ఉంది. రెండో ఎస్సార్సీ వేస్తామని చెబుతున్నపుడు మొదటిదాని ప్రస్తావన ఎందుకసలు? ఒప్పందంలో రెండో ఎస్సార్సీ వేస్తామనే ప్రస్తావన అంత స్పష్టంగా ఉంటే.., తెరాస ఆనాడా ఒప్పందాన్ని ఎందుకు ఒప్పుకున్నట్టు? ఇవ్వాళెందుకు గోల చేస్తున్నట్టు?

కాంగ్రెసు, తెరాస చేసుకున్న ఒప్పందం ఏమిటన్నా గానీండి.. ఆనాటి తమ ఎన్నికలప్రయోజనాల కనుకూలంగా వాళ్ళు దాన్ని ఆపాదించుకున్నారు. ఒప్పందంలో రెండో ఎస్సార్సీ ప్రసక్తి స్పష్టంగా ఉన్నపుడు తెరాస అసలా ఒప్పందాన్ని ఎందుకు కుదుర్చుకుంది? రెండో ఎస్సార్సీ వెయ్యడమే కాంగ్రెసు విధానమైతే.. ఇన్నాళ్ళూ ఎందుకు వెయ్యలేదు? ప్రభుత్వం నుండి తెరాస బయటకు పోయేదాకా ఆ ముక్క ఎందుకు చెప్పలేదు?

'మొదటి ఎస్సార్సీ ఉంది కదా.. మళ్ళీ ఇదెందుకు, మొదటి దాని సూచనల ప్రకారమే తెలంగాణ ఇచ్చెయ్యాలి' అని అనడం అసంబద్ధం. ఆ వాదనకు అర్థం లేదు. మొదటి దిచ్చిన సూచనల్లో అమలు చేసిన వాటిని చేసారు.. లేనివాటిని చెయ్యలేదు. అది చేసిన సూచనలను ఇప్పుడు, యాభై ఏళ్ళ తరవాత, అమలు చెయ్యాలనడం సమర్ధనీయం కాదు!

అసలు ఎస్సార్సీ గిస్సార్సీ అనేది లేకుండా రాష్ట్రం ఏర్పాటు చేస్తారా.. అది వేరే విషయం!

6 కామెంట్‌లు:

 1. విడిపోయి బావుకునేది ఏముంది. తెలుగు వారి అదృష్టం కొద్ది ఏర్పడిన స్వర్ణాంధ్ర ప్రదేశ్ ను ముక్కలు చేస్తారంటే బాధగాఉంది. దానిబదులు విడగొట్టకుండా మొత్తం రాష్ట్రాన్ని ’తెలంగాణా’ గా మార్చినా తప్పులేదు. ’తెలంగాణా’ను వేరుచేయండి. మిగతా ఆంధ్ర ఎన్ని ముక్కలైతే నాకేంటి ’ అని కేసీ ఆర్ అన్నాడు. సాటి తెలుగువారిమీద ఇసుమంతైనా ప్రేమలేని పాషాణ హృదయుడు. ఎందుకయ్యా తెలుగు వారిని వేరుచేస్తావు? చివరికి మావోయిస్టుల ముస్లిం తీవ్రవాదుల , నిజాం పాలన వచ్చినప్పుడు వగచినా ప్రయోజనం లేదు. చదువరన్నా. ఏవిటీ తెలుగువారికి పట్టిన దౌర్భాగ్యం. అందరు ఎందుకిలా మౌనంగా ఈ వేర్పాటువాదులను భరిస్తున్నారు?

  రిప్లయితొలగించండి
 2. ఈ ప్రాంతాలున్నాయనే విషయం తెలంగాణాకు వచ్చాకే నాకు తెలిసింది. అంతకుముందు తెలియదు. కోస్తా రాయలసీమల్లో కోసినా ప్రాంతీయతత్వం లేదు. కనుక విడిపోయినా వాళ్ళు బాగానే ఉంటారు. కాని తెలంగాణాకే ముప్పు ఉంటుంది. ప్రత్యేక తెలంగాణా కోసం ఇక్కడి తెలుగువాళ్ళ కంటే ఆత్రంగా ఎదురుచూస్తున్నవాళ్ళు ఉర్దూ వాళ్ళు. ముందు ఇది కానిచ్చాక వాళ్ళు ప్రత్యేక హైదరాబాదు రాష్ట్రం కోసం గొంతెత్తడానికి ప్రణాళికలు వేసుకుంటున్నారు. తెలుగు-ఉర్దూ జనం మధ్య ఎంచుకోవాల్సి వస్తే కేంద్రప్రభుత్వం ఎవరిని ఎంచుకుంటుంది ? ఎవరి మాట వింటుంది ? ఆలోచించండి. అలా జరిగితే తెలంగాణావాళ్ళని నిర్దాక్షిణ్యంగా వరంగల్‌కి తఱిమేస్తారు. కేసీయార్ ఏమీ చెయ్యజాలడు.

  కాని అలా ఏమీ జరగదులెండి. ఎస్సార్సీ అర్ధాంతరంగానే మరణించే అవకాశం ఉంది.

  రిప్లయితొలగించండి
 3. కాస్త కోపంగా అయినా నా మాట నేను చెప్పాలనుకుంటున్నాను.
  నేను పుట్టింది పెరిగింది నెల్లూరు లో, కానీ మా నాయన నాయన (repetition లేదు, అది నిజం), పుట్టింది పెరిగింది తెలంగాణాలో. ఉద్యోగ రీత్యా కోస్తాలో స్థిరపడ్డారు. ఆ తర్వాతా నేను పై చదువుల నిమిత్తం హైదరాబాదు (అంటే తెలంగాణా) చేరుకున్నాను. ఇక్కడే ఏడేళ్ళు చదివాను, మూడేళ్ళు ఉద్యోగం చేసాను. ఆ తర్వాత పదేళ్ళు ఇతర దేశాల్లో గడిపాను. అంటే నా జీవితంలో 1/3 of the life కోస్తా, 1/3 తెలంగాణా, మిగిలిన 1/3 ఇతర దేశంలోనూ గడపాను. ఇంతకీ నేను ఈ దేశానికి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడిని? నేను తెలంగాణా వాదానికి support చెయ్యాలా? లేకా సమైక్య ఆంధ్రకా?
  ఒక వేళ, for suppose, ఆంధ్ర లో తెలివి మిరిన నేత ఎవరైనా (KCR కంటే ముందే) మాకు స్వంత రాష్ట్రం కావాలని పోరు చేసుంటే అప్పుడూ తెలంగాణా వాదులు ఇలాగె స్పందించేవారా?

  రోజు రోజుకు, కులంపేరుతో, మతం పేరుతో, జిల్లా పేరుతో, రాష్ట్రం పేరుతో, దక్షిణ, ఉత్తరం పేరుతో, ఇండీయా పాకిస్తాన్ పేరుతో, ఆసియా, అమెరికా పేర్లతో, మున్ముందు భూమి, ఇతర గ్రహాల పేరుతో కొత్త కొత్త వివాదాలు, కొత్త కొత్త సంఘర్షణలు.

  మనిషిగా పుట్టిన వాడు ఇందులో ఏది నిజమైన సంఘర్షణ, ఏది సృష్టించబడిందో తెలుసుకోగలడు అనుకుంటున్నాను.

  తెలుసుకుని ప్రవర్తించండి.

  రిప్లయితొలగించండి
 4. నాకీ తెలంగాణా topic వచ్చినప్పుడల్లా ఒక శ్రీశ్రీ కవిత గుర్తొస్తుంది.
  ఏ దేశ చరిత్ర చూసినా ఎమున్నది గర్వ కారణం
  నర జాతి చరిత్ర సమస్తం పర పీడన పరాయణత్వం .....
  ఒక సమస్య పరిష్కారం అయితే ఇంకోటి వస్తుంది. దీనికి అంతం అనేది ఉండదు.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు