28, ఆగస్టు 2007, మంగళవారం

ఉగ్రవాదము, మతమూ

హైదరాబాదులో బాంబు పేలుళ్ళు జరగ్గానే "అన్ని మతాల వాళ్ళూ చనిపోయారు ఒక మతంపై ప్రత్యేకించి చేసిన దాడి కాదు" అని వ్యాఖ్యానాలు వచ్చాయి. సహజంగానే ప్రజలు కూడా ఈ పేలుళ్ళను అలా భావించలేదు. మత పరమైన పర్యవసానాలేమీ లేకుండానే ప్రశాంతంగా గడిచిపోయింది. అయితే బాధితుల్లో అన్ని మతాల వారూ ఉన్నారు. కానీ ఈ ఉగ్రవాదులెవరు? ఈ సంఘటనకు కారకులు ఎవరో ఇంకా తెలీక పోయినా, గత అనుభవాలను బట్టి ఇస్లామిక ఉగ్రవాదులని అనుమానాలు పోతాయి, సహజంగా. కానీ ఉగ్రవాదులకీ మతానికీ ముడిపెట్టకూడదని ఓ... తెగ చెప్పేస్తున్నారు, కొందరు. కానీ అలా కుదురుతుందా?


అసలు ఉగ్రవాద చర్యలను మతంతో ముడి పెట్టకుండా ఎలా చూడాలో తెలీడం లేదు. ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న ఉగ్రవాద చర్యల్లో దాదాపుగా అన్నీ మత ప్రేరితమే - మతాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం కావచ్చు, మత బోధలకు తప్పుడు భాష్యాలు చెప్పడం కావచ్చు, మరోటి కావచ్చు. మన దేశంలో జరుగుతున్న ఉగ్రవాద హింస నుండి మతాన్ని విడదీసి చూడగలమా? ఈ రెంటికీ సంబంధం లేకపోతే మరి ఈ హింసలకు కారణమేంటి? మూలమేంటి? ఈ పనులు చేసేవాళ్ళు తమ ప్రాణాలకు తెగించి మరీ ఎందుకీ పనులు చేస్తున్నారు? హై. పోలీసు కమిషనరేటు మీద దాడి చేసిన మానవబాంబు ఏమాశించి ఆ పని చేసినట్టు?

మన దేశాన్ని కల్లోలపరచాలనే ఉద్దేశమే దీనికి కారణమంటున్నారు. ఎందుకు కల్లోల పరచడం? ఉగ్రవాదులకు మనదేశమ్మీద ఎందుకంత ద్వేషం? మనం అభివృద్ధి పథంలో ఉన్నామని అంట! మన అభివృద్ధి చూసి కన్నుకుట్టి ఇక్కడి కొచ్చి బాంబులేస్తున్నారట. నవ్వొస్తది నాకా మాట వింటే. మరి మనకంటే డబ్బున్న కొన్ని గల్ఫు దేశాల్లో లేవే ఈ దాడులు? చైనాలో లేవేఁ? జపానులో లేవేఁ? దక్షిణ కొరియాలోను, సింగపూరులో ను జరగవేఁ? బ్రెజిల్లో లేదే మతవాద తీవ్రవాదం? ఎందుకంటే..

ఉగ్రవాదులకు స్థానికంగా అక్కడ సాయం దొరకదు. ఇక్కడ అది ఇబ్బడి ముబ్బడిగా దొరుకుద్ది. ఒకవేళ సాయం చేసేవాడెవడన్నా ఉన్నా, ఆయా దేశాల్లో అయితే తోలు దీస్తారు. మరి మన దగ్గర.. మత నాయకులు, రాజకీయనాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. అందరూ అడ్డం పడి పోతారు పోలీసులకు. ఎందుకూ? పోలీసులు ముస్లిములను పట్టుకోవాల్సే వస్తే, పట్టుకుంటే, అది రాజకీయంగా తెలివైన పని కాదు కాబట్టి. రాజకీయంగా తెలివైన పని కాదు కాబట్టే తస్లీమాపై దాడి చేసినవారిని లోపలెయ్యలేదు, వారు బయట తిరుగుతూనే ఉన్నారు. రాజకీయంగా తెలివైన పనులే చేస్తారు కాబట్టే మసీదులో బాంబుల తరువాత అరెస్టులేమీ జరగలేదు. సాక్షాత్తూ పోలీసు కమిషనరేటు మీద కొందరు స్త్రీలు గుంపుగా దాడి చేస్తే పోలీసులు ఏమీ చెయ్యలేక పోవడానికి కారణమూ ఇదే. మనకిక్కడ ప్రజల ప్రాణాల కంటే రాజకీయాలు, ఓట్లే ముఖ్యం. స్లీపరు సెల్సనీ మరోటనీ వేరు పురుగుల్లా దేశాన్ని నలుచుకు తింటున్నా వీళ్ళకేం పర్లేదు, ఓట్లు క్షేమంగా ఉంటే చాలు. వీళ్ళకు ఓట్లు వస్తాయంటే శిక్ష పడ్డ తీవ్రవాదులను కూడా వదిలిపెడతారు.. ఆ తరవాత వాడు మళ్ళీ గన్నుచ్చుకు మనమీదకే వస్తాడు కూడా. మనకు ఓట్లు పోతాయనుకుంటే ఖరారైన ఉరిని కూడా పక్కన పెడతారు.

అనుమానితుల్ని అరెస్టు చేస్తే మన రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక మంత్రి స్వయంగా విడిపించిన సందర్భాలున్నాయట. ఆయన స్వయంగా ఓ నిందితుడి ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చాడట. ఇలాంటి రకాలు యథేచ్ఛగా సమాజంలో తిరుగుతూ ఉంటాయి, మనల్నేలుతూ ఉంటాయి. వాళ్ళు కేవలం మత ప్రాతిపదికపైనే ఈ పనులు చెయ్యొచ్చు. మనం మాత్రం మతం గురించి మాట్టాడకూడదు. వేలాదిమంది విదేశీయులు సరైన వీసా కాగితాల్లేకుండా మన ఊళ్ళో ఉన్నారట, నల్గొండలోనూ ఉన్నారట. స్వయానా ఒక ముస్లిము సంస్థే చెబుతోందీ మాటను. ఎలా ఉండగలుగుతున్నారు వాళ్ళు? ఎవరు వారికి ఆశ్రయమిచ్చింది? పోలీసులు సరైన చర్యలు తీసుకుంటే అలా ఆశ్రయమిచ్చిన వాళ్ళు పరదేశీ దొంగల్తో సహా పట్టుబడరూ? అలా చేసి ఉంటే మొన్నటి పేలుళ్ళు జరిగేవి కావేమో!!

మొన్న జరిగిన సంఘటనలో ముస్లిము తీవ్రవాదుల హస్తం ఉందనే అనుమానాల పట్ల కూడా కొందరు అభ్యంతరం చెబుతున్నారు. ముస్లిము తీవ్రవాదులే కారణమని తేల్చెయ్యడం లేదు కదా. కే్వలం అనుమానిస్తేనే తప్పా? అనుమానం కూడా ఊరికినే అలా గాల్లోంచి వచ్చిందేమీ కాదు... గత అనుభవాలను బట్టే కదా అనుమానించేది?
----------------------


ఆపేముందు ఓ చిన్నమాట..: పొలిటికల్లీ కరెక్టు స్టేటుమెంట్లివ్వడం ఈ మధ్య మనబోటి సామాన్య జనానికీ అలవాటైపోయింది. ముస్లిముల పేరెత్తితే అదేదో తప్పైనట్టు మాట్టాడుతున్నారు.

22 కామెంట్‌లు:

  1. వున్న విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టి చెప్పారు.
    ఈ ముసుగులో గుద్దులాట ఇక ఎన్నో రోజులు సాగదు. మతం పేరు ఎత్తకుండా మాట్లాడటం, సహనం వహించడం రోజురోజుకీ తగ్గుతుంది. పైకి అలా మాట్లాడ్డానికి ఏదో గొంతుకు పడ్డవాళ్ళు కూడా లోపల్లోపల మతాన్ని నిందిస్తున్నారు.
    మీ ఆక్రోశం అర్థం చేసుకోదగ్గదే అయితే మనం ఒక్క విశయాన్ని గుర్తుకు పెట్టుకోవాలి. ఆ మతస్తుల్లో అధిక సంఖ్యాకులు (ఇతర దేశాల్లో ఏమో గానీ మన దేశంలో) శాంతినే కాంక్షిస్తున్నారు.

    అయితే ఈ క్రింది విశయాలు మాత్రం ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా సత్యం.
    ఈ అర్థం లేని ఉగ్రవాదానికి మూల పదార్థం మతం.
    ఆత్మార్పణ అయినా చేయగల మత్తుమందు ఈ మతం.
    దేశం కంటే దేశభక్తి కంటే ఈ మతమే గొప్పదనేది ఈ మతం మత్తు.
    వుగ్రవాదులకు ఆసరా దొరుకుతోంది ఈ మతం అనే కామన్ డినామనేటర్ మీదే.
    అన్య మతస్తులకంటే నా మతం గొప్పదనే అపోహ సృష్టించడమూ ఈ మతం మీదే.
    ఇంత జరుగుతున్నప్పుడు ఈ మతనాయకులు దాన్ని సవరించడానికి బదులు అగ్నికి ఆజ్యం పోస్తున్నారు.

    అయితే కత్తిని పండు కోయడానికీ, గొంతు కోయడానికీ కుడా వుపయోగించినట్లే ఇప్పుడు మతాన్ని గొంతులు కోయడానికి వుపయోగిస్తున్నారు. అధిక సంఖ్యాకుల శాంతికాముకత్వం ఈ అల్పసంఖ్యాకుల వుగ్రవాదం వెనకాల నక్కుతోంది. ఈ అధిక సంఖ్యాకులు నోరు విప్పకపోతే ... పర్యవసానాలు తీవ్రంగా వుంటాయి. ఇది చిలికి చిలికి గాలి వానై మరో పెద్ద ప్రపంచ యుద్దంగా బయట పడినా ఆశ్చర్యం లేదు.

    మనం మేలుకోవాల్సిన సమయం ఆసన్నమయింది.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    రిప్లయితొలగించండి
  2. నా నోటిమాట మీరు రాశేశారు. ముస్లింలను ఓటుబ్యాంకుగా చూస్తున్నంతసేపు మనకు (ముస్లింలతో సహా) ఇక్కట్లు తప్పవు. ప్రపంచవ్యాప్తముగా శాంతియుత ముస్లింలను అల్లా కాపాడుగాక !!

    రిప్లయితొలగించండి
  3. మీరు మాత్రమే రాయగలిగిన వ్యాసం.

    నిజాన్ని నిర్భయంగా రాసారు. అందుకోండి వందనాలు.

    భద్రతా వ్యవహారాల నిపుణుడైని బి రామన్ రాసిన ఈ వ్యాసం చదవండి. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తుంది.

    http://www.rediff.com/news/2007/aug/26raman.htm

    ప్రసాద్ గారు చెప్పినట్టు అధిక సంఖ్యాకులు శాంతి కాముకులని కూడా నాకు నమ్మకం లేదు. అదే నిజమయితే మజ్లిస్ వాళ్ళు ఇన్నేళ్ళుగా అక్కడ నెగ్గేవారే కాదు.

    ఉగ్రవాదం సంగతి దేవుడెరుగు, పాతబస్తీలో ప్రతీ ఇంట్లోనూ కరెంటు బిల్లు కూడా వసూలు చెయ్యలేరు మన వాళ్ళు.

    రిప్లయితొలగించండి
  4. నిజాన్ని నిర్భయంగా, చాలా బాగా రాసారు.

    ' రాబర్ట్ స్పెన్సర్ ' రాసిన ' పొలిటికల్లీ ఇన్ కరెక్ట్ గైడ్ ' ఈ మూల కారణాల్ని కుండ బద్దలు కొట్టినట్లు చెబుతుంది.


    http://books.google.com/books?id=_7RD2jwMU2wC&dq=&pg=PP1&ots=Q18g_tzaSU&sig=SH7ESXfZSlnXTAOxWatAhVa1x1w&prev=http://www.google.com/search%3Fhl%3Den%26q%3DPOLITICALLY%2BINCORRECT%2BGUIDE%2BTO%2BISLAAM&sa=X&oi=print&ct=title#PPP1,M1

    రిప్లయితొలగించండి
  5. చదువరి గారూ...

    తీవ్రవాదులు అనే వారుంటారు కానీ...ముస్లిము తీవ్రవాదులు, క్రిస్టియను తీవ్రవాదులు, యూదు తీవ్రవాదులు, హిందూ తీవ్రవాదులు ఉండరండీ...బుష్ మహాశయుడు ప్రవచించినట్లు ఇస్లామో-ఫాసిష్టులు అన్న విధంగా ఉంది...తీవ్రవాదాన్ని నిరంకుశంగా అణచివేయాలి అది ఏ రూపంలో ఉన్నా...వేలెత్తి ఒక్క మతాన్ని ఎత్తి చూపడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. జరిగిన దానికి కారణం కేవలం మత విద్వేషం అని మీరు భావిస్తున్నారా? ఇతర దేశాల కుట్రలు, విదేశాల్లో మన అభివృద్ది చూసి ఓర్వలేనితనమూ, ఇతరత్రా కారణాలు ఉండొచ్చు! కానీ ఏదన్నదీ ఋజువుకాకనే మీరిలా అనడమూ...శ్రీరాం గారు అధిక శాతం మంది శాంతికాముకులు కారు అనడానికి ఋజువు ఏమిటి? ఇలా వారిని 'పరాయీకరణ' చేస్తున్నందుకే వారు ఆ మజ్లిస్ ఇతరత్రా కోరల్లో చిక్కుకొని వారి జీవితాలను నాశనం చేసుకొంటున్నారు...మరి హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందితే పాతనగరం ఎక్కడి వేసిన గొంగడి చందాన అక్కడే ఎందుకుంటోంది? మీ నుంచి ఈ టపా ఈ సమయంలో ఇలా ఆశించలేదు.

    రిప్లయితొలగించండి
  6. ఉగ్రవాదులకు స్థానికంగా అక్కడ సాయం దొరకదు. ఇక్కడ అది ఇబ్బడి ముబ్బడిగా దొరుకుద్ది....http://eenadu.net/story.asp?qry1=11&reccount=28!

    రిప్లయితొలగించండి
  7. ఎందుకుండరూ, హిందూ తీవ్రవాదులు, క్రైస్తవ తీవ్రవాదులు, యూదు తీవ్రవాదులు అందరూ ఉంటారు..
    కాకపోతే ముస్లిం తీవ్రవాదులు ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యారు.
    ఫిలిప్పీన్స్, బాలి(ఇండోనేషియా), మలేషియా, స్పెయిన్, ఇంగ్లాండ్, అమెరికా, సుడాన్, నైజీరియా..ఇంకా మరెన్నో.. అన్ని చోట్లా తీవ్రవాదులు ఇస్లాం కోసమే దాడులు చేస్తున్నామని చెప్పుకున్నప్పుడు వాళ్ళను ఇస్లాం తీవ్రవాదులు అని చెప్పుకోవడంలో తప్పులేదేమో!!

    ఎల్.టి.టి.ఈ ని తమిళ తీవ్రవాదులంటారు అంతమాత్రాన మిగిలిన తమిళులందరూ వీళ్ళని తమిళ తీవ్రవాదులని ఎందుకంటున్నారని ఉడుక్కోలేదే..

    మైనారిటీ సంఖ్యలో ఉండదు.. నిజంగా ఎలా ఫీలవుతున్నారన్నదాన్ని బట్టి ఉంటుంది. పరాయికరణ ఒక విషవలయం. రాజకీయ శక్తుల విభజించు..పాలించు పధకంలో మంచి ఎత్తు..దాన్నుంచి బయటపడటానికి ముస్లింలకు ఎవరూ సహాయపడలేరు..ముస్లింలు తప్ప (పైన శ్రీరాం అభిప్రాయంతోనూ, రాబర్ట్ స్పెన్సర్ అభిప్రాయంతోనూ నేను ఏకీభవించలేను)

    రిప్లయితొలగించండి
  8. ఒక ఆంగ్లవ్యాసంలో చదివిన ఈ వాక్యం ప్రస్తుతం దాదాపుగా నిజం ’ All Muslims may not be terrorists but all terrorists are muslims'

    రిప్లయితొలగించండి
  9. ఇస్మాయిల్ గారూ, నేను పరాయీకరణ దృష్టితో మాట్లాడలేదు. అది కూడా యే ఒక్క మతం ప్రజలగురించో కాదు. ప్రస్తుత దేశముఖ చిత్రం చూస్తే నాకు కలిగిన భావన అది. ఎందుకూ పనికి రాని సంకుచిత భావాలకి లొంగిపోయి ప్రకోపించే ప్రజలు నిజమైన సమస్యల గురించి పట్టించుకోరు. నేను ఈమధ్యనే రాసింది ఇక్కడ చూడండి.

    బహుశః నేను అన్నదేమిటో మీకు అర్ధంకావచ్చు.

    రిప్లయితొలగించండి
  10. చాలా స్పష్టంగా రాశారు - This is one of your best.
    ఐతే మనం కొన్ని చారిత్రక సత్యాలని గుర్తుంచుకోవాలి అని నా ఉద్దేశం.
    1) ఉగ్రవాదులు ఫలానా జాతి/మత/వర్గానికి చెందిన వారు అని పదే పదే బాకా ఊదితే ఆ వర్గానికి చెందిన సామాన్య ప్రజలు అన్యాయమైన వివక్షతకి దుర్మార్గానికి గురౌతారు. అది సమాజం నించి ఆ వర్గాన్ని ఇంకా దూరం చేస్తుంది.

    2) ఉగ్రవాదులని వేటాడాలి, నిజమే కానీ పౌరహక్కుల్ని బలి చేసి కాదు. దేశంలో జరుగుతున్న ఇన్ని అన్యాయాలు, కబ్జాలు హత్యల మధ్యన మన దేశం అరవై యేళ్ళుగా ప్రజాస్వామ్యంగా నిలిచి ఉందంటేనూ, ఈ అరవై యేళ్ళ ప్రపంచ చరిత్రతో పోలుచ్కున్నప్పుడు కొంతైనా శాంతిగా ఉందంటేనూ - మనకి పౌరహక్కుల మీద ఉన్న నమ్మకము గౌరవమే కారణమని నేననుకుంటున్నాను.

    3) నిజమే, ఇటువంటి ఉగ్రవాదుల్ని చైనా లాంటీ దేశాల్లోనే కాదు, జోర్డన్, ఈజిప్టు లాంటీ ఇస్లామిక్ దేశాల్లోనే క్షమించరు. మనమూ క్షమించకూడదు. ఇవాళ ముస్లిము మైనారిటీ ముసుగులో ఇటువంటి విద్రోహులు తలదాచుకుని వృద్ధిచెందటానికి అనువైన అవకాశం మనదేశంలో పాతుకుని ఉంది. ఇది పోవాలి. ప్రజల్ని చైతన్యవంతుల్ని చెయ్యటమే అందుకు సరైన మార్గం. రాజకీయులు ఆపని చెయ్యరు, ఎందుకంటే ప్రజలు చైతన్య వంతులైతే వాళ్ళ పప్పులుడకవు.

    రిప్లయితొలగించండి
  11. దాదాపు ఇదే విషయం మీద మరో వ్యాసం:
    http://www.greatandhra.com/telugu/sangathulu/27-08-2007/thee_29.php

    రిప్లయితొలగించండి
  12. చదువరి గారూ,

    చక్కని విశ్లేషణ. నా చిన్నప్పటి కథ ఒకటి గుర్తుకొస్తోంది. ఒకానొక అడవిలో గొడ్డలి తో చెట్లు నరుకుతుంటే ఆ అడవిలో ఉన్న మిగిలిన చెట్లు ఆ గొడ్డలి నుండి ఎలా తమని తాము కాపాడుకోవాలో అని అలోచించటం కోసం ఒకచోట సమావేశం అయ్యాయంట. అందులో ఒక ముసలి చెట్టు లేసి ఆ గొడ్డలి మన మీద పడి మనని నరుకుతూంది అంటే అందులో మనవాడు ఎవడో ఉండి వుంటాడు అందంట.(గొడ్డలి కి కర్ర లేకుండా ఏమీ పని చెయ్యలేము కదా....) అలాగే మీరు చెప్పినట్లు స్థానికంగా సహాయం లేనిదే ఏ ఉగ్రవాద దాడి కూడా సఫలం కాదు.

    ప్రసాద్ గారూ,

    మన దేశం లోనే కాదు ఏ దేశం లో అయినా అత్యధికులు శాంతికాముకులే, కానీ ఈ అధిక సంఖ్యాకులకి సరి అయిన నాయకుడు ఏడి? స్వామి వివేకానంద 10 మంది యువకులతో దేశాన్ని మార్చగలనన్నారు. ఇప్పుడు ఆయన కోరిన యువకులు వున్నారు కాని, వారిని నడిపించే నాయకుడు లేడు. ఇదీ మన దౌర్భాగ్యం.

    డాక్టరు గారూ,

    హైదరాబాద్ అభివృద్ధి చెందుతూంటే పాత బస్తి ఎందుకు అభివృద్ధికి దూరంగా ఉంది అని అడగటంలో మీ ఉద్దేశం అర్ధం కాలేదు. కర్ణుడి చావుకి కారణాలు ఎన్నో అన్నట్లు పాత బస్తి పరిస్థితి కి కూడా ఎన్నో కారణాలు. మతానికి, పాత బస్తి అభివృద్ది కి ఏమి సంబంధం లేదు. అది రాజకీయ "చెద"రంగంలో ఒక భాగమే.

    కొత్తపాళీ గారూ,

    "పౌరహక్కులని బలిచేసి కాదు" అన్న పదం ఏ ఉద్దేశం లో ఉపయోగించారో నాకు అర్ధం కాలేదు. ఉగ్రవాదుల్ని, సంఘ విద్రోహులని మట్టుపెట్టం పౌరహక్కులని బలిపెట్టటం ఎంత మాత్రం కాదు. ఒక్కడు చస్తే వంద మంది బ్రతుకుతారంటే ఆ ఒక్కడిని చంపటం న్యాయమే.

    రిప్లయితొలగించండి
  13. చక్కటి ఉద్దేశ్యమే, అయితే కొన్ని విషయాలను మనం గుర్తు చేసుకోవాలి.

    * టెర్రరిస్టులు అన్ని మతాల్లో, దేశాల్లో ఉన్నారు - ఒక్కొక్కరిదీ ఒక్కొక్క టైపు - అంతే తేడా!
    * ముస్లిం దేశాల్లో, సౌదీ అరేబియాలో కూడా బాంబుదాడులు జరిగాయి! అన్ని మతాల కన్నా ముస్లింలే అత్యధికంగా మరణిస్తున్నారు!!
    * మజ్లిస్ ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం పంచుకుంటూ ఉన్న విషయాన్ని గట్టిగా మనం గట్టిగా హర్షించాలి. వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి - మనం అవునన్నా కాదన్నా.
    * పొలిటికల్లీ-కరెక్టు స్టేటుమెంట్లని వ్యతిరేకించడం నాణేనికి ఒకవైపు. పొట్ట గడవడానికి నానా తిప్పలు పడుతూ - సైకిల్ రిపేర్లు, ఆటోలు నడపడం, రిక్షా తొక్కుతూ రెక్కాడితే కానీ డొక్కాడని సాటి ముస్లిం సోదరులే అత్యధిక మెజారిటీ అన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. వీళ్ళను ఉద్దేశించి మాట్లాడటం నాణేనికి రెండవ వైపు.
    * "మాకు అన్యాయం జరుగుతుంది" అనే భావనల నుండి బయటపడని ఏ మత, సమాజమూ బాగుపడదన్నది చరిత్ర చెబుతుంది.

    చివరగా... మన తోటి పౌరులను ముస్లింలు, హిందువులుగా కాక, అందరినీ మిత్రులుగా చూసే రోజు కోసం నేను కలగంటున్నాను. అప్పుడు తీవ్రవాదం గురించి ఆలోచించనవసరం లేదు.

    రిప్లయితొలగించండి
  14. పౌరహక్కులంటే గుర్తొచ్చింది. క్రితంసారి ప్రార్ధనా స్థలంలో బాంబు పేలినప్పుడు పౌర హక్కుల సంఘం వాళ్ళు కొంతమంది నిజ నిర్ధారణ కమిటీయో, మేధావుల కమిటీయో అని అక్కడకి వెళ్ళి ఈ పని చేసింది హిందూ తీవ్రవాదులే అయ్యుండచ్చు అని చాలా హడావిడి చేసారు. ఈసారి అలాంటివేమీ జరుగుతున్నట్టు లేదు.

    రిప్లయితొలగించండి
  15. రవి గారూ...

    నా ఉద్దేశ్యం తీవ్రవాదానికి జాతి,మతం,కులం ఉండవనీ! నేను తమిళ తీవ్రవాదం అనే పదాన్నీ ఘర్హిస్తాను!ఏ లక్ష్యం కోసమైనా అమాయకుల ప్రాణాలు తీసే ఏ చర్య అయినా తీవ్రవాదమే...అది ఓ దేశం చేసినా,వ్యక్తులు చేసినా దాన్ని తీవ్రవాదమనే అంటారు!కానీ కమ్యూనిస్టు తీవ్రవాదం, తమిళ తీవ్రవాదం, ముస్లిం తీవ్రవాదం ఇలా పేర్లు పెట్టినప్పుడే ఇబ్బంది వస్తుంది...మన సందేశం "తీవ్రవాదం అణచివేయండి!" ఇలా ఉండాలని నా భావం.

    శ్రీరాం గారూ...
    పరాయీకరణ అని నేను అన్నది మీ వ్యాఖ్యని ఉద్దేశించి కాదు.కానీ నా చిన్నప్పటి సంగతి ఒకటి చెప్పాలనిపిస్తోంది,అప్పటికే సర్వమత ప్రార్థనలు చేస్తున్న నన్ను (నా పేరు దృష్ట్యా కావచ్చు)సాటి సహాధ్యాయిలు, ఏ విషయంలోనైనా నెగ్గకపోతే చివరి అస్త్రంగా "పాకిస్థాన్ నీ జుట్టు పీకిస్తాన్!" అని ఎత్తిపొడిచేవారు. నాకు ఈ పాకిస్థాన్కు నాకు గల సంబంధం ఏమిటో అసలు అర్థమయ్యేది కాదు.(ఇదంతా రామజన్మభూమి-బాబ్రీమసీదుకు చాలా ముందు)నేను ఉక్రోషంతో ఉడికిపోవడం తప్ప ఏం చేయలేకపోయేవాన్ని! ఇది చిన్నపిల్లల విషయంగా మీకనిపించవచ్చు...కానీ ఆ పసివయస్సులోనే వారి మనస్సుల్లో ఈ విషాన్ని కొంచెం కొంచెం ఎక్కిస్తున్నాం.మరి బోలెడు మతకలహాలు జరిగాక పరిస్థితి ఎలా ఉందో మీకు చెప్పక్కర్లేదు!తీవ్రవాదాన్ని నిరశించండి...వారిని పట్టి ఉరి తీయండి...కానీ దాన్ని పాటించని, అదంటే పడని అమాయకులందరినీ ఒకే గాట కట్టకండి!(ఇదంతా ఆ 'పరాయీకరణ' అన్న మాట వెనకాల ఉన్న భావం...అంతే)

    నేను సైతం గారూ...
    మీరన్నది అక్షరాల నిజం! ఆ సవాలక్ష కారణాల్లో ఒక్కటినైనా ప్రభుత్వాలు తీర్చాలనే నా మనవి కూడా.అందులో మొదటిది 'అక్షరాస్యత-చదువు' ఇది ఉంటే అన్నీ అవంతట అవే సర్దుకుంటాయి!ఇక రా'కీయుల గురించి మనమెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది!

    రిప్లయితొలగించండి
  16. వాకపల్లి టు లుంబిని
    Aug 29th, 2007 by ఎన్.వేణుగోపాల్
    http://kadalitaraga.wordpress.com/2007/08/29/vakapalli_to_lumbini/
    మరో మంచి వ్యాసం...

    రిప్లయితొలగించండి
  17. వ్యాఖ్యలు రాసినవారందరికీ కృతజ్ఞతలు. ఇస్మాయిల్ గారూ! మీ విమర్శకు తగు సమయంలో సమాధానమిస్తాను.

    రిప్లయితొలగించండి
  18. @ నేనుసైతం - ఒకడు చస్తే వందమంది బతుకుతారు కరక్టే. కానీ ఆ ఒక్కణ్ణి పట్టుకునే వేటలో వందమంది అమాయకులు బలౌతారు పోలీసు రాజ్యంలో పౌరహక్కులు అణగదొక్క బడినప్పుడు. 9/11 తరవాత అమెరికాలో జరిగింది - ఆ కాష్టం ఇంకా రగుల్తూనే ఉంది.

    రిప్లయితొలగించండి
  19. చదువరి గారూ...వ్యాసం బాగుంది.

    ' ఇస్లాం ఒక మతం ' అనుకోవడంతోనే మొదలవుతుంది సమస్య.

    మతం ముసుగులో వున్న ఓ భయంకరమైన ' కల్ట్ ' అనే నిజం ప్రజలందరకూ తెలియనంతవరకూ...

    అసలు మహమ్మద్ ఎవరు?...ఎన్ని దోపిడీలు చేసాడు? ఎందరిని స్వయంగా చంపాడు? ఎందరు స్త్రీలను బానిసలుగా చేసుకొన్నాడు? లాంటివి తెలియనంతవరకూ.... ప్రపంచమంతా ముస్లిములు చేసే మారణ కాండ సాగుతూనే వుంటుంది.

    ఇస్మాయిల్ గారూ,
    మీరు చేస్తోన్న సర్వ మత ప్రార్ధనలు అనే భావన ఉన్నతమే కానీ, ఇస్లాం మాత్రం దాన్ని అస్సలు సహించదు... - సల్మాన్ ఖాన్ ఫత్వా విషయం తెలుసుగా?

    ఇస్లాం అసలు రంగు బయటపడడానికి ...గూగుల్ లో ఇలా చిన్నగా వెదికినా చాలు...' islam religion or cult? ' లేదా ' islamic terrorism '...

    -శేఖర్

    రిప్లయితొలగించండి
  20. శేఖర్ గారూ,
    ప్రతీ చోటా ఇదే లంకెనా? నేను ఈ విషయంపై సమగ్రంగా ఓ టపా రాయాల్సిందే!

    రిప్లయితొలగించండి
  21. పసి మనస్సులో విషబీజాలు...
    The Making of a Muslim Terrorist...
    http://www.youtube.com/watch?v=j_Bkqwzl_Ygw

    రిప్లయితొలగించండి
  22. సరైన లంకె
    http://www.youtube.com/watch?v=j_Bkqwzl_Yg

    రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు