24, జులై 2007, మంగళవారం

ధృతరాష్ట్రుడూ ఆయన సంతతీ!

జూలై 23 న శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడినది చూసినవారు ఛి, చ్ఛీ అని అనుకోక మానరు. ముఖ్యమంత్రి అలా మాట్లాడేంటబ్బా అని విస్తుబోయేది కొంతమందైతే, స్పీకరుకు నోరు పడిపోయిందా ఏంటి అని ఈసడించుకునే వారు మరికొందరు.

మర్యాదస్తులు బయట కూడా అలా మాట్లాడుకునేందుకు వెనకాడుతారు; పోట్లాడుకునే సందర్భంలో కూడా!

అంత దారుణంగా మాట్లాడాక మళ్ళీ మామూలుగా ఉండగలరా? అసలిహ మొహం మొహం చూసుకోగలరా? కలిసికట్టుగా పనిచెయ్యలేని ఈ అధికార, ప్రతిపక్షాలు మనకెంతమాత్రం పనికొస్తాయి?

మనం వీళ్ళకి ఓట్లేసి సభకు పంపింది కలిసి పనిచెయ్యమని, కాట్లాడుకొమ్మని కాదు. ఇలా అసభ్యంగా మాట్లాడి - దూషించి- ముఖ్యమంత్రి తన విధిని మరిచాడు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన స్పీకరు - అసలు ప్రతి'పక్షపాతి'గా ఉండాలట - ముఖ్యమంత్రి అడుగులకు మడుగులొత్తుతూ తానా పదవికి పనికిరానని నిరూపించుకున్నాడు.
----
ముఖ్యమంత్రికి కోపం రావడానికి బోలెడు కారణాలున్నాయి..

 • ఉక్కు కర్మాగారం - తప్పుబట్టిన ప్రతిపక్షం
 • చుట్టాల గనులు - తప్పంటున్న ఘనులు
 • తోడల్లుడి పవరు ప్లాంటు - ఆపేయించిన ప్రతిపక్షాలు
 • ప్రాజెక్టుల్లో ప్రవహిస్తున్న అవినీతి - దానికి ఆనకట్ట కట్టబోయే పత్రికలు, ప్రతిపక్షాలు
 • హైదరాబాదు బ్రదర్స్ - కారు చిచ్చులు, వీధి పోరాటాలు
 • పోతిరెడ్డిపాడు - అద్భుత ప్రగతిని ఓర్వలేని ప్రతిపక్షాలు
 • అంతులేని భూయాగాలు - అయినా తీరని కోరికలు
 • ఆ రెండు పత్రికలు - కొరకరాని కొయ్యలు
 • కమ్యూనిస్టుల భూయజ్ఞం - అవి చాలవన్నట్టు నిరాహార దీక్షలు
 • ...
 • ...
 • పై తలనెప్పులకు తోడు శాసనసభ సమావేశాలు పెట్టక తప్పని పరిస్థితి. తప్పించుకుందామంటే లేదాయె!
ఇన్ని సమస్యలతో ముఖ్యమంత్రికి చావొచ్చి పడడంతో నిరంతర చిరుదరహాస పూరితమైన శివదేవుని ముఖబింబం చిన్నబోవడాన్ని మనమర్థం చేసుకోవచ్చు. పైగా ఆయన సొయానా దేవుడు గూడాను. దేవుడికి కోపమొస్తే మసే గదా!!
---

కానీ స్పీకరు.. కళ్ళుండీ కబోది అయ్యాడు. ముఖ్యమంత్రి అంతలేసి మాటలంటున్నా, విననట్టే ఉండిపోయాడు. వారించేందుకు నోరు పెగల్లేదు. రికార్డుల్లోంచి తీసేసేందుకు చేతులు రాలేదు, చేత కాలేదు. క్షమాపణ చెప్పించేందుకు చేవ లేదు.

మొత్తమ్మీద సభను కురుసభను తలపింప జేసారు. ముఖ్యమంత్రి దుర్యోధనుడుగా పరవాలేదు. స్పీకరు మాత్రం ధృతరాష్ట్రుడి పాత్రలో జీవించాడు. స్పీకరు ఎలా ఉండకూడదో ఒక ఉదాహరణగా నిలుస్తాడు!!

14 కామెంట్‌లు:

 1. బాగా చెప్పారు.. దృతరాష్ట్రుడు అండ్ కో అరాచకాలు మితిమీరిపోయాయి.. స్పీకరు ఇక్కడ పూర్తి నిస్సహాయుడు.. దుష్ట చతుష్టయం స్పీకరుని ఆడిస్తోంది కదా.. చదువుకున్న యువత రాజకీయాలలోకి రావలసిని సమయమిది .. లేకపోతే రాష్ట్రం మరింత భష్టు పట్టిపోతుంది..

  రిప్లయితొలగించండి
 2. బీహారు మార్కు నమూనా తయారు చేస్తున్నారు. ఇది కేవలం ప్రోటోటైపు మాత్రమే. ముందుంది ఈ వీరాగ్రేసరుల ప్రతాపం. వీళ్ళకు ఓట్లేసిన వాళ్ళని అనాలి. వీళ్ళను అని ఏమి ప్రయోజనం.

  అయినా అంత కష్టపడి పాదయాత్ర చేసినోళ్ళు కాస్త అంటే భరించే త్యాగం చెయ్యలేరా?

  రిప్లయితొలగించండి
 3. ముందు ఒటెసె జానాలకు బుద్ది జ్ఞనం లెదు, అయినా వీల్లు ఎందుకు బయపడతారు, వాల్లు డబ్బులిచ్హి, మందుపొసి కస్టపడి కొన్నారు కదా, అలాగె పదవులు కుడాను. ఇంకా సిగ్గు ఎగ్గు ఎందుకు, ఆ పని చెసినవాడు ఇంక ఈపని చెయడనికి ఎందుకు బయపడతాడు (అదె అక్రమ అస్తులు కుడబెట్టడం) మరి చెపాలా వీల్లు వీది కిరాయి గుండాలని ముందు ఈ అర్హతా చూసెకదా టికెట్ ఇచ్హెది.

  దిలిప్.

  రిప్లయితొలగించండి
 4. మీరు బాగా ఛెప్పారు. కానీ ఒక్క విషయం మర్చి పొయినట్లున్నారు. ఎంత ముఖ్యమంత్రి అయినా ఆయన కూడా మనిషే కదా. నా ఉద్దెశ్యం మీరు అస్సెంబ్లి సమావేశాలను చూసింట్లు లేరు. అసలు విషయాన్ని మరుగు పర్చడానికి బాబు ఎంత తపన పడ్డారొ. తన హయాం లొనె ఆ గనులు లీస్ కి ఇచ్చిన విషయం బయటకు రాకుండా తన M L A లని ఉసిగొల్పి శాశన సభా కర్యక్రమాలకి ఎంత గా అంతరాయం కల్గించాడొ, ఎన్ని గంటల ఫ్రజాధనాన్ని సభలొ వ్యర్ధం చేస్తున్నాడొ మీరు గమనించినట్లు లేరు.

  మరి ఇంత తతంగం చేస్తూ ఉంటే ఎంత ముఖ్యమంత్రి అయినా సహనం కొల్పొ కుండా ఎలా ఉండగలరొ నాకు అర్ధం కావటం లేదు. అనుకొని వరం లా ముఖ్యమంత్రి మాటలు బాబు కి దొరికాయ్ ప్రజలలొ సింపతి కొట్టేయడానికి అంతే.

  రిప్లయితొలగించండి
 5. మీరు చెప్పింది నిజమే అయినా, ఆ మాటలు బాబును కీంచ పరిచేవే గానీ తల్లిని కించపరిచేవిగా నాకు అనిపించటం లేదు. ఎవరైనా తల్లికే పుడతారు. "తల్లికి ఎందుకు పుట్టానా" అనుకోవలిసిన పరిస్థితి రావడం "ఎందుకు పుట్టానా" అన్న పరిస్థితి రావడం రెండూ ఒకటే. అక్కడ "తల్లి" పదాన్ని వుంచినా తీసేసినా అర్థంలో తేడా వుండదు. అయితే ఈనాడు (మామూలుగా నేను ఈనాడు ప్రేమికుడిని) తదితర పత్రికల్లో "తల్లిని దూషించడం" అని వాడటం, తప్పుడు సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయడమే. మీరన్నట్లు విపరీతమైన విసుగులో రెడ్డిగారు నోరు జారారు. అది బాబుకు వరమయ్యింది.
  ఏదేమయినా ఇక్కడ అనడం అనిపించుకోవడం కంటే నిస్సహాయంగా నిలబడ్డ స్పీకర్ పాత్ర గర్హించదగ్గది.

  --ప్రసాద్
  http://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 6. రెడ్డీ గారి మాటలని పత్రికలో చదివితే అంతగా బాధ అనిపించలేదు గానీ ఇప్పుడే గూగుల్ వీడియో చూశాను. ఎటేళ్తున్నారో మన రాజకీయనాయకులు.. ఛ ఛ.. రెడ్డీ మొహం చూస్తుంటే ఆయన ఏదో ఆవేశంలో అన్నట్లు గాకా ఒక పరుషమైన మాటను అవతలి వ్యక్తిని నొప్పించడానికే అన్నట్లు స్పష్టంగా వుంది. నాయకుడూ, ప్రతిపక్ష నాయకుడి మద్య ఇంతగా వ్యక్తిగత ద్వేషం నిండిపోతే ఇక మనం బాగుపడ్డట్లే! ఏక వచన సంభోధాలు.. కడిగెయ్యటాలు.. ఛ..దరిద్రం. ముందు ముందు ఇంకా దరిద్రమయిపోతామో!

  --ప్రసాద్
  http://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 7. అసలు విషయం అంటూ ఉంటే ఇప్పటికైనా బయటపెట్టవఛు గా.....కడిగేస్తా కడిగేస్తా అని గొంతు చించుకొనేకంటే ఆ కడిగేదేదో కడిగివుంటే బావుండేది......అధికారానికి వచ్చిన గత 3 ఏళ్ళ లో 25 పైగా విచారణా కమిషన్ళు వేసారు.......ఎవరిని మభ్యపెట్టటానికి. ఇంత వరకూ ఒక్కటీ సభకు సమర్పించలేకపోయారే.అది మీ అసమర్దత అనుకోవాలా.....లేక కడగటానికి ఏమీ దొరకలేదనుకోవాలా...అదీ గాక ఆ కడిగే క్రమంలో మిమ్మలని మీరే కడుక్కోవలసి వస్తుందనా...

  రిప్లయితొలగించండి
 8. ధ్రుతరాష్ట్రుడి( సురెష్ రెడ్డి) కొలువులో రా "రాజ" ప్రవర్తన మరి. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు, ఎవరైనా వస్తే రానిస్తావా అని ప్రశ్నిస్తున్నాడు ఈ శేఖర్ దాదా. ఈ గనులు ఎమైనా నీ అబ్బ సొమ్ము అనుకున్నవా లేక నీ డమ్మి ఎం.డి గాడి అబ్బ సొమ్మా? రాష్ట్రాన్ని, రాష్ట సంపదను నీ కొడుకుకి, నీ వెనుక వున్న చెంచాలకు, గూండాలకు రాసి ఇవ్వటానికి ఇదేమి నీ బాబు ఆక్రమించుకున్న ఈడుపులపాయి అసైన్డు భూములు కాదు.
  -నేనుసైతం

  రిప్లయితొలగించండి
 9. చంద్రబాబును కాకపోతే వైయ్యెస్సారు ఇంకెవరినంటారు? వాళ్లమధ్యగల సాన్నిహిత్యం, చనువు అలాంటివి. ఆయనేదో అన్నాడని ఈయన వాపోవడం, దాన్ని పత్రికలు ఇంతింతలు చేసి రాయడం ఇదంతా స్టంటు. "కడిగేస్తానిన్ను" అన్నాడేగానీ, కడిగే మానవుడు శుభ్రంగా ఉండాలికదా ముందు. కడిగేవారు, కడిగించుకునేవారు ఇద్దరూ ఒకే బరదలో ఉన్నారు. అసెంబ్లీలో జరిగింది కేవలం తమాషా అంతే. స్పీకరు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి అందరూ బొమ్మలే. పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట ...

  రిప్లయితొలగించండి
 10. ee pacha papers .. ee pacha brothers.. ee anti ysr propaganda vunnantha varaku.. prathidi tappugane anipistayi. ysr noru jaarina maata vaastavame. rayalaseema yaasa lo aa maatalu chaala common. prathi paksham matuku siggu vadilini assembly samayam lone media lo gurthimpu koraku sabha maryadalani vadili chesina godava gurinchi matladakunda.. dorlina tappu ni pattukoni … raastraniki tsunmani vachinantha hadavidi chesayi.. papers… web lo konni forums.. kondaraithe raastram lo edo munigipoyindi ani gonthu chinchukontunnaru…

  ee ganulu.. lease lu.. nijam ga rastram aadayam kolpotunte.. chattaparam ga prathi paksham opika pattakunda chillara MLA gaallani voori meedaku vadilinappudu neethi emayyindi. chivaraku talli ni kuda addu pettukoni publicity pondaali ani.. pacha patrikalu aina eenadu.. Andhra jyothy.. cbn.. pade pade rabhasa cheyadam.. chinna vishayaanni peddadi cheyyadam ga kanapada leda?


  kaneesam ee blogs lo aina e sodhi raamayanam tapputundi ante ikkada kuda modalu pettaru vishelshanalu. ilanti vaatiki idlebrain.. bt.. inka chaala vunnayi. kshamincandi mee blog. mee istam.

  రిప్లయితొలగించండి
 11. "తల్లికి ఎందుకు పుట్టానా" అనుకోవలిసిన పరిస్థితి రావడం "ఎందుకు పుట్టానా" అన్న పరిస్థితి రావడం రెండూ ఒకటే.

  పై అభిప్రాయంతో నేనేకీభవించను. "మీ అమ్మను పిలువు", "నియ్యమ్మను పిలువు" - ఈ రెంటిలో ఉన్నంత తేడా ఉందని నేననుకుంటున్నాను.

  రాష్ట్రపతి కావచ్చేమో గానీ, స్పీకరు బొమ్మెలా అవుతాడో నాకర్థం కాలేదు. స్పీకరు సమ్మతి లేకుండా సభలో ఎవరూ మాట్లాడలేరు. స్పీకరే నిమిత్తమాత్రుడైతే రాజశేఖరరెడ్డి ప్రతిభాభారతినీ, చంద్రబాబు సురేశ్ రెడ్డినీ విమర్శించేవారే కాదు.

  అన్నట్టు ప్రసాదు గారూ ఈ సందర్భంలో ఓ సంగతి గుర్తొస్తోంది.. ప్రతిభాభారతి స్పీకరుగా ఉండగా రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు. ఆమెను ఎప్పుడూ "అమ్మా" అనే సంబోధించేవాడు. ఓ సందర్భంలో అమ్మా అని అన్నందుకు ఆమె మనస్తాపం చెందింది. ఆ అందర్భంలో ఆయన అన్నది అమ్మా అని కాదు, "వమ్మా" అని గుర్తు (ఖచ్చితంగా ఆమాటేంటో గుర్తు లేదు గానీ.. "నేను చెప్పేది వినవమ్మా" లాంటి మాటేదో అన్నాడు) ఒకేమాటను వంకరగాను, మామూలుగాను పలకడంలోని తేడా మీకు తెలియంది కాదు.

  ఈ సభ సీనులో మొదటి దోషి స్పీకరేనని నా ఉద్దేశ్యం!

  రిప్లయితొలగించండి
 12. చదువరి గారు,
  మీ టపాలు చదివాను. బావున్నయి. ముఖ్యం గా మసీదులో బాంబు పేలుళ్ళ నేపధ్యంలో వచ్చిన కవితలూ బవున్నయి. orkut లో జానీ గారు రాసిన ఈ కవిత కూడా బాగుంది.

  అస్తవ్యస్తమై, రక్తసిక్తమైన ప్రంపచాన్ని వెలివేస్తూ,
  కాసేపు ప్రశాంతంగా నీ ధ్యానంలొ గడపాలని వచ్చాను.
  అభద్రతభావం అంతటా విస్తరిస్తుంటే,
  కాసేపు నీ ఒడిలొ భద్రంగా ఉండాలని వచ్చాను.
  కానీ,
  నువ్వు కుడా శాంతి కపొతాలను నేల రాల్చుతు,
  మానవ ఆశ్రు, రక్తాభిషేకాలతో స్వాగతిస్తవనుకోలేదు.

  సర్వరక్షకుడా, సర్వేశ్వరుడా,
  నాకు, నా ఇంటికి భద్రత లేదని తెలుసు...
  ఇపుడు, నీ ఇంటికి కూడా భద్రతలేదన్నదే బాదిస్తుంది.
  కళ్ళు మూసుకొని నిన్ను ప్రార్ఠిస్తున్న ప్రతిసారి
  చెవుల్లొ బాంబుల మోతే ప్రతిద్వనిస్తుంది.


  కొల్లూరి సోమ శంకర్
  www.kollurisomasankar.wordpress.com

  రిప్లయితొలగించండి
 13. చదువరి గారూ,
  స్పీకర్ పాత్ర చాలా అనుచితంగా వుందని నేనూ అంగీకరిస్తాను. నిజమే మాట అదే అయినా అందులోని వ్యంగం చదివితే అర్థం కాదు. కొన్ని సార్లు విన్నా అర్థం కాదు.
  ఏదేమయినా వైయస్సార్ మాట చాలా దురుసుగానూ, పరుషంగానూ వీధి రౌడీని గుర్తుకు తెచ్చేలా వుంది. "కడిగేస్తానివ్వాళ నిన్ను" అనడం కుడా చాలా అభ్యంతరకరంగా వుంది.
  రానూ రానూ మన అసెంబ్లీ/పార్లమెంటు దిగజారిపోతున్నాయి. వీటి అంతిమ గమ్యం ఎటో తెలియట్లేదు.

  --ప్రసాద్
  http://blog.charasala.com

  రిప్లయితొలగించండి
 14. హాహా నేను సెలవుమీద వెళ్ళొచ్చేసరికి బాగా ఆంధ్ర రాజకీయ రంగంపై బాగా జోకులుపేలాయన్నమాట..అదే చూస్తున్న మన బుడబుక్కలోల్లు ఈ మధ్య ఆటకట్టలేదేంటబ్బా అని..రాజశేఖరా! కడగటానికి, ఉతకటానికి, ఆరెయ్యటానికి అసెంబ్లీ సాకిరేవు కాదు నాయనా.

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు