24, జూన్ 2007, ఆదివారం

కౌన్సెలింగు చేసేందుకు వీళ్ళెవరు?

తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు గాను కోస్తా, రాయలసీమ ఉద్యోగులకు తెరాస వాళ్ళు కౌన్సెలింగు (సలహా ఇవ్వడం, నచ్చజెప్పడం) చేస్తారట. సలహాలు అడిగితేనే ఇవ్వాలి. ఈ ఉచిత సలహాలేంటి? ఎవరడిగారు? ఎవరిక్కావాలివి? వాళ్ళను స్వస్థలాలకు పంపడం ప్రభుత్వం పని. ప్రభుత్వం ఆ పని చెయ్యడం లేదని ఎవరికైనా అనిపిస్తే, పోయి ప్రభుత్వంతో మొరపెట్టుకోవాలి. ఉద్యోగులను వత్తిడి చెయ్యడమేంటి మధ్యలో? ప్రభుత్వం ఫలానా సుబ్బారావును హై. నుండి గుంటూరో, శ్రీకాకుళమో, చిత్తూరో బదిలీ చేస్తే వెళ్ళి తీరాలి. వెళ్ళకపోతే ఆ ఫలానాపై ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. బాబూ వెళ్ళండి ప్లీజ్స్ అంటూ బతిమిలాడతారో, కర్రుచ్చుకుని గెంటుతారో అది ప్రభుత్వం ఇష్టం. ఈ తెరాస వాళ్ళెవరు కౌన్సెలింగు చెయ్యడానికి?


అధికారంలో ఉండి హంగూ ఆర్భాటాల్తో తిరిగే రోజుల్లో వీళ్ళంతా ఏం చేసినట్టు? తెలంగాణ రాష్ట్రం ఇమ్మని అడుక్కునే రోజుల్లో, కాంగ్రెసు దేవత కటాక్షం కోసం దేబిరించే రోజుల్లో ఈ జీవోలు గుర్తుకు రాలేదా? అప్పుడేం చేసారో ఈ కౌన్సెలింగు నేతలు? తెలంగాణాకు అనుకూలంగా అమ్మగారి చేత ఏదో ఒక ప్రకటన చేయించమని దిగ్విజయ్ సింగును ముష్టెత్తుకునే రోజుల్లో ఈ జీవోలను ఏ పరుపుల కింద దాచారు? ఇవ్వాళ మాత్రం ఈ సలహా దళాన్నొకదాన్ని ఏర్పాటు చేసుకుని ఆఫీసులకెళ్ళి తైతక్కలాడుతున్నారు. జీవోను అమలు చెయ్యకపోతే ప్రభుత్వం మెడలు వంచి చేయించుకోవాలి లేదా చేతులు ముడుచుక్కూచ్చోవాలి . అంతేకానీ, ఉద్యోగులనిలా హింసించడమేమిటి?

4 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. ఏంచెయ్యాలో తెలియక చెయ్యి దురదెక్కి ఇలా చేస్తుంటారు --మాటలబాబు

  రిప్లయితొలగించండి
 3. అదేంటండి ఇంత మంచి అవకాశం ఇస్తున్న తరువాత మెచ్చుకోవాల్సింది పోయి తిడుతున్నారు :))) తెరాస వాళ్ళ కౌన్సిలింగు తీసుకున్న తరువాత ఉద్యోగస్తులందరికీ భలే పారా హుషార్ గా ఉంటుంది. ఇప్పుడంటే ఏదో మొద్దుల్లా తమ పని ఏదో తాము చేసుంకుంటూపోతున్నారు పిచ్చివాళ్ళమల్లే.

  రిప్లయితొలగించండి
 4. 610 జీవోని సమగ్రంగా వివరించే టపా ఎక్కడన్నా వుందా?

  రిప్లయితొలగించండి

సంబంధిత టపాలు