6, జూన్ 2006, మంగళవారం

వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదని తెలిసింది

వర్డ్‌ప్రెస్‌లో ఓ విశేషముంది. ఇతర బ్లాగుల్లోంచి దాన్లోకి బ్లాగులను దిగుమతి చేసుకోవచ్చు. సరే అక్కడ ఓ బ్లాగు తయారుచేసి బ్లాగ్‌స్పాటులోని నా బ్లాగుల్ని దిగుమతి చెయ్యబోయాను. ఒకే ఒక్క జాబు దిగుమతి అయింది, మిగతావి కాలేదు, ఎంచేతో! సరే వచ్చింది చాల్లే అనుకున్నా. తరువాత, ఇక్కడికి వచ్చి చూద్దునుగదా.. బ్లాగు ఆకారమంతా (ఫార్మాటింగు) చెడిపోయింది. బొద్దక్షరాలూ, ఇటాలిక్సూ, లైను బ్రేకులూ ఏమీ లేవు. సరిచెయ్యబోతే ఒప్పుకోవడంలేదీ బ్లాగరు! సెట్టింగుల్లోకి వెళ్ళి లైను బ్రేకులను తిరగదోడాను, దాంతో ఓ రూపుకొచ్చింది.


వర్డ్‌ప్రెస్సుకీ బ్లాగ్‌స్పాటుకీ పడదు గామోసు! వర్డ్‌ప్రెస్సు వాడొచ్చి బ్లాగ్‌స్పాటులో బ్లాగుల్ని లాక్కోబోతే వీడూరుకుంటాడా మరి! తన బంగారు పుట్టలో వేలెడితే చీమే ఊరుకోదు!! కాబట్టి, మీరూ ఈ దిగుమతి వ్యవహారం చెయ్యదలిస్తే.. జాగ్రత్త సుమా!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సంబంధిత టపాలు